loading

Category: Uncategorized

  • Home
  • Category: Uncategorized

9 రోజులు-9 హోమములు

9 రోజులు-9 హోమములు

కేరళలోని పాలక్కాడ్ జిల్లా, ఆలత్తూర్ మండలం, వావిల్యాపురంలోని వేదనారాయణ అధర్వణ తంత్ర పీఠము నందు జాతకులకు పరోక్షముగా మరియు సామూహికంగా శాంతి హోమములు జరిపించబడును.

21–01–2024 నుండి 29-01–2024 వరకు 9 రోజుల పాటు జాతకులకు జరుగున్న ప్రతికూల గ్రహ మహా అంతర్దశలకు శాంతి హోమములు జరిపించబడును. ఇందు నిమిత్తము ఋత్విక్ సంభావన 1,116/- ఆయుః క్షీణ గ్రహ దశలు జరుగుతున్న వారికి, గండాంతర గ్రహ దశలు జరుగుతున్న వారికి మరియు కాలసర్ప దోష నివారణకు, సంపూర్ణ ఆయుర్దాయము పొందుటకు ఆయుషు కారక ప్రతికూల గ్రహ దోష నివారణకు, వైవాహిక దోష నివారణకు, కార్యసిద్ధికి, సంతాన ప్రాప్తికి, బాలారిష్ట గ్రహ దోష నివారణకు, పితృ దోష నివారణకు ఈ శాంతి హోమములు జరిపించబడును. జాతకులు తమ యొక్క జన్మకుండలిని పరిశీలించుకొని, మీకు జరుగుతున్న గ్రహదశలను, దోషములను మాకు తెలియపరచిన యెడల, ఈ శాంతి హోమములను సామూహికముగా మరియు పరోక్షముగా జరిపించబడును. హోమాదులు సంపూర్ణముగా జరిపించిన తరువాత, యజ్ఞ ప్రసాదములు మీకు కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపబడును.

గమనిక: 12 సంవత్సరములలోపు చిరంజీవులకు ఏర్పడినటువంటి బాలారిష్ట గ్రహ దోష నివృత్తి హోమములు, శాంతి హోమములు వంటి పరిహారాదుల కొరకు రావి ఆకు పై సంతానము యొక్క నామ ధ్యేయము, జన్మ నక్షత్రము, జన్మ లగ్నము వంటి వివరములు వారి తల్లిదండ్రులు స్వయంగా వ్రాసి పంపవలెను. అలాగే కాగితము పై కూడా వ్రాసి, ఆ రెండింటిని జత చేసి పంపవలెను. శిశువులు మరియు చిన్న పిల్లలు (12 ఏళ్ల లోపు) యొక్క ఫోటోలను పంపరాదు. 

జనవరి 20వ తారీఖు లోపు జాతకులు తమ యొక్క గోత్ర నామములు, జన్మ నక్షత్రములు,జన్మ లగ్నము, జన్మ రాశి, జరుగుతున్న గ్రహదశ యొక్క వివరములను మాకు 9951779444 నెంబరు Whatsapp నెంబరుపై పంపగలరు. అత్యంత శాస్త్రోక్త యుక్తంగా ఈ హోమ పూజాదులు నిర్వహించబడతాయి. 9 రోజుల పాటు జరిగే హోమాదుల వివరములు:

  1. కాలసర్ప దోష నివారణా శాంతి హోమం & రవిగ్రహ శాంతి హోమం (రేవంత బలి) (21-01-2024)
  2. ఆయుష్ హోమం & చంద్ర గ్రహ శాంతి హోమం (22-01-2024)
  3. నవగ్రహ శాంతి హోమం & అంగారక గ్రహ దోష నివారణ శాంతి హోమం (23-01-2024)
  4. ఆయుః కారక గ్రహ ప్రతికూల దోష నివారణ హోమం & బుధ గ్రహ శాంతి హోమం (24-01-2024)
  5. వైవాహిక దోష నివారణ హోమం & గురు గ్రహ దోష నివారణ శాంతి హోమం (ఇంద్రాదిత్య హోమం) (25-01-2024)
  6. కార్యసిద్ధి హోమం & శుక్ర గ్రహ శాంతి హోమం (సర్పంతుల్లాల్) (26-01-2024)
  7. సంతాన ప్రాప్తి హోమం & శని దోష నివృత్తి హోమం (తిలకాష్ట బలి) (27-01-2024)
  8. బాలారిష్ట శాంతి హోమం & కేతు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (28-01-2024)
  9. పితృదోష పరిహార హోమం & రాహు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (29-01-2024)

ఈ 9 రోజుల శాంతి హోమములకు నమోదు చేసుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ను నింపవలెను. 

[bitform id=’4′]

 

 

 

Related Articles: 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

అంగారక యోగం

అంగారక యోగం

జన్మకుండలిలో రాహువు, కుజుడు కలసి ఒకే భావంలో ఉండినట్లైతే అంగారక దోషం ఏర్పడుతుంది. ఈ కుజ రాహువు కలసి సంగమించిన స్థానం పాప లేదా శత్రు స్థానం అయితే, ఈ దోషం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జాతకులు ఎంతో ఆవేశం, కోపం కలిగి ఉంటారు. కుజుడు నిప్పు, రాహువు తైలం. ఈ ఇద్దరు కలసి ఒకే భావంలో సంగమిస్తే నిప్పుకి ఆఝ్యం పోసినట్టే అవుతుంది. కుజుడు జాతకునికి అధిక ఆవేశాన్ని ఇస్తే, కుజుడు ఇచ్చే లక్షణాన్ని రాహువు మరింత ఉధృతం చేసి, జాతకుడిని క్రూరుడిగా మారుస్తాడు.  కుజుడు జాతకునికి దేనినైనా సాధించే గుణాన్ని ఇస్తాడు, రాహువు జాతకునికి ఊహల్లో బ్రతికేలా చేస్తాడు. దీని వల్ల జాతకుడు నిర్ణయాలను తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.

angaraka yogam

మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి.

  1. ఈ దోషం ఏర్పడిన స్త్రీ జాతకులు చాలా నిజాయితీగా ఉంటారు, కానీ వారికి ఉన్న ముక్కుసూటితనం వల్ల అందరికీ కఠినాత్ములుగా అనిపిస్తారు. అదే, ఈ దోషం పురుష జాతకులకు ఏర్పడితే, వారు చాలా ఆవేశపరులుగా, అన్నింటా అనుమానాలు కలిగి ఉంటారు, వీరి భార్యని కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా ఉండటానికే ఇష్టపడతారు. వీరి ప్రవర్తన అహంకారం, ప్రమాదకరంగా ఉంటుంది.
  2. ఈ అంగారక యోగం ఉన్న జాతకులకంటే చిన్నవారైన సోదరసోదరీమనులు, స్నేహితులతో వీరికి బంధం ఆగమ్యగోచరంగా ఉంటుంది. అయితే జాతకుల పట్ల పూర్తి అసూయతో అయినా ఉంటారు లేదంటే జాతకులను అసలు లెక్క చేయకుండా అయినా ఉంటారు.
  3. ఈ దోషం ఉన్న జాతకులకు మగవారితోనే స్నేహబంధాలు ఎక్కువగా ఉంటాయి.
  4. ఈ యోగ జాతకులకు ధైర్యం, దూకుడు అధికంగా ఉంటుంది. ఈ కారణంగా జాతకులకు వయస్సు పెరిగే కొద్ది రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి.
  5. ఈ దోషం జాతకులకు వివాహం తరువాత, తమ జీవిత భాగస్వామి యొక్క వృత్తి/వ్యాపార జీవనం అయోమయంలో పడుతుంది.
  6. ఈ దోష జాతకులు తమ అత్తామామలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి నానాపాట్లు పడాల్సి ఉంటుంది.
  7. అంగారక యోగ జాతకులు జన్మించిన తరువాత తమ తల్లి యొక్క ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
  8. మేనత్తలతో, పొరుగు వారితో, తోటి ఉద్యోగులతో ఈ జాతకులకు సత్సంబంధాలు ఉండవు.
  9. ఈ అంగారక దోషం ఉన్న జాతకులు ఏదైనా సంస్థ మీద గాని, స్థలం మీద గాని ఇష్టం పెంచుకుంటే, దానిని వీరు ఎంతో సులువుగా అదుపులోకి తెచ్చుకోగలుగుతారు.
  10. ఈ దోషం ఉన్న జాతకులకు గొప్ప ప్రణాలికలు వేసే సామర్థ్యం బాగుంటుంది. కానీ వీరికి ముక్కుసూటితనం, ఆవేశం లాంటి లక్షణాలు ఉండటం వల్ల వీరు వేసిన ప్రణాళిక ఎంత గొప్పది అయినప్పటికి, వాటి ప్రకారం పనులు పూర్తిచేయాలంటే ఈ జాతకులకు దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.
  11. ఈ అంగారక యోగం అనుకూల రాశిలో ఏర్పడినట్లైతే, అలాంటి జాతకులు పోలీసు శాఖ, మిలిటరీ శాఖలో వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అంగారక దోషం ఉన్న వారికి ఉండే సహజ లక్షణాలను ఇక్కడ మీకు తెలియజేశాను. ఈ అంగారక దోషం ఏ భావంలో ఏర్పడితే ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది మీకు క్షుణ్ణంగా ఇక్కడ వివరించబోతున్నాను.

లగ్నభావంలో అంగారక యోగం:

అంగారక యోగం మొదటి భావంలో ఏర్పడితే, ఆ జాతకులకు ముక్కు మీద కోపం, ఎవ్వరి మాట లెక్కచేయని జగమొండి లాంటి లక్షణాలు ఉంటాయి. పరిస్తితి ఏమిటి అన్న ఆలోచన, వివేకం లేకుండా, అర్థం చేసుకోకుండా, ఆవేశంగా ముందుకు దూకే స్వభావం ఉంటుంది. అవతలి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, తగాదాలు పెట్టుకుంటారు. కొన్ని సార్లు తమ వివేకం ఏ మాత్రం పనిచేయక, కేవలం ఆవేశంతో పనులు చేసి, చాలా ఇబ్బందుల పాలవుతారు.

ద్వితీయ భావంలో అంగారక యోగం:

జన్మకుండలిలో ద్వితీయ భావంలో అంగారక యోగం ఏర్పడిన జాతకులు చాలా దురుసుగా మాట్లాడే గుణాన్ని, కపటమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఏది మాట్లాడినా చాలా బిగ్గరగా మాట్లాడటం, అబద్ధాలు ఎక్కువగా చెప్పడం చేస్తారు. తమ చుట్టూ ఉన్నవారితో, తమ కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే పోట్లాడుతూ ఉంటారు. ఈ జాతకులకు డబ్బు సంపాదించాలి అనే ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది, దాని కోసం చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు.

తృతీయ భావంలో అంగారక యోగం:

అంగారక యోగం తృతీయ భావంలో ఏర్పడటం కాస్త అనుకూలం అనే చేపచ్చు. ఈ గ్రహస్తితి ఉన్న జాతకులు సర్జన్ గా గాని, వక్తగా, ఇతరులను తీవ్ర ప్రభావితం చేసే రచయితగా గాని అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాతకుల మాటలో ముక్కుసూటితనం, మోసం ఉంటుంది. ఈ సంగమం శుభ, మిత్ర రాశిలో జరిగితే జాతకుల యొక్క ప్రతిభకు ప్రశంసలు, సన్మానాలు, రివార్డులు లభిస్తాయి. ఈ సంగమం తృతీయంలో శతృరాశిలో జరిగితే, జాతకులకు ప్రతికూల విషయాల మీద ఇష్టం పెరుగుతుంది.

చతుర్థ భావంలో అంగారక యోగం:

మాతృ స్థానం అయిన చతుర్థ భావంలో అంగారక యోగం ఏర్పడితే, జాతకులకు తమ తల్లితో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడి ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడతాయి. ఈ సంగమం చతుర్థ భావంలో జరిగిన జాతకులకు తమ తల్లితోనే కాకుండా,  తమ కుటుంబ సభ్యులతో, తమ బంధువులతో ఉన్న భాంధవ్యం కూడా చెరిగిపోతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో జాతకులు తీవ్రంగా వాదిస్తూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతతని నెలకొల్పాలని ఈ జాతకులు తీవ్రంగా శ్రమిస్తారు. సంతానం వల్ల కూడా ఈ జాతకులకు తీవ్ర సమస్యలు వస్తాయి. నిర్మాణ రంగంలో లేదా రియల్ ఎస్టేట్ వంటి వృతి వ్యాపారాల మీద మక్కువ చూపిస్తారు.

పంచమ భావంలో అంగారక యోగం:

అంగారక యోగం పంచమ భావంలో ఏర్పడటం వల్ల జాతకులు కళల్లో, క్రీడల్లో, సాహసాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. వీటి వల్ల జాతకుల్లో తెలియని శక్తి ఏర్పడుతుంది. బెట్టింగులు, షేర్ మార్కెట్లు వంటి వాటిని తీరిక వేళల్లో చేస్తూ ఉంటారు. పేరు, ప్రతిష్ట, హోదా కోసం ఈ జాతకులు ప్రాకులాడుతూ ఉంటారు. ప్రేమ విషయాల్లో చాలా సార్లు భేధాలు రావచ్చు.

మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి. 

షష్ట్య భావంలో అంగారక యోగం:

షష్ట్య భావంలో అంగారక యోగం జరగడం వల్ల జాతకులకు వ్యాధులు, వృత్తి/ఉద్యోగం చేసే చోట విభేధాలు తలెత్తడం, పై అధికారులతో గొడవలు రావడం జరుగుతుంది. ప్రయాణం అనేది వీరు చేసే వృత్తిలో భాగం కావచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా ఈ జాతకులు గొడవలు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. కోర్టు కేసుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ భావంలో ఈ సంగమం జరగడం వలన జాతకునికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. పోటీల్లో విజయం సాధిస్తాడు. ఎలాంటి శతృవులనైనా ఓడించే సామర్థ్యం వీరికి ఉంటుంది.

సప్తమ భావంలో అంగారక యోగం:

వైవాహిక స్థానమైన సప్తమ స్థానంలో అంగారక యోగం ఏర్పడటం వలన భార్యా భర్తలు విడిపోవడం గాని, లేదంటే విడాకులు అవ్వడం గాని జరుగుతుంది. భూమి వంటి స్థిరాస్తుల నుండి ఈ జాతకులు లాభాలు ఘడిస్తారు. వివాహేతర సంబంధాలు ఉంటాయి.

అష్టమ భావంలో అంగారక యోగం:

ఈ అంగారక యోగం అష్టమ భావంలో ఏర్పడితే, జాతకులకు తమ అత్తామామలతో తీవ్రమైన గొడవలు జరుగుతాయి. దీని వల్ల మానసికమైన వ్యధ అనుభవించాల్సి ఉంటుంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు జరుగుతాయి. కొంతకాలానికి ఈ జాతకులకు ఆధ్యాత్మిక ధోరణి ఏర్పడుతుంది.

నవమ భావంలో అంగారక యోగం:

నవమ భావంలో అంగారక యోగం ఏర్పడినపుడు జాతకులు తమ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కల్పిస్తుంది. ఈ నవమ భావంలో ఈ సంగమం జరగడం వల్ల గురువులతో, మేధావులతో, ఉపాధ్యాయులతో వీరికి వాగ్వాదాలు తలపడచ్చు. నవమ భావంలో జరిగిన ఈ సంగమం శుభ రాశి అయితే, జాతకుడిని భక్తి పారవశ్యంలో మునిగేలా చేస్తుంది, అదే చెడు రాశిలో జరిగితే ఈ సంగమం జాతకుడిని పూర్తి నాస్తికుడిగా మారుస్తుంది.

దశమ భావంలో అంగారక యోగం:

దశమ భావంలో అంగారక యోగం ఏర్పడితే, ఆ జాతకులకు తమ పై అధికారులతో, తమ కన్నా వయస్సులో పెద్దవారితో భేదాభిప్రాయాలు ఏర్పడి గొడవలు జరుగుతాయి. చేసే వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పనిచేసే చోట చాలా ఇబ్బంది వాతావరణం ఉంటుంది. మెడిసిన్, ఫార్మసీ, నిర్మాణ రంగ వ్యాపారం వంటివి వీరికి అబ్బుతాయి. చమురు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ ఏజెన్సీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. జాతకులకు దూకుడు లక్షణం ఉన్న కారణంగా, వీరి పై అధికారులతో వీరి బంధం ప్రశ్నంతకంగా మారుతుంది.

ఏకాదశ భావంలో అంగారక యోగం:

ఏకాదశ భావంలో అంగారక యోగం ఏర్పడితే, అలాంటి జాతకులు తమ స్నేహితులతో, తమకన్నా పెద్దవారైన తోబుట్టువులతో గొడవలు వస్తాయి. ఈ జాతకులు అందరిలో సులభంగా కలసిపోగలరు. కానీ వీరికి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కకపోతే డీలా పడిపోతారు. వడ్డీ వ్యాపారం, మీడియా, సినిమా రంగం, షేర్ మార్కెట్లు వీరికి వృత్తిగా అబ్బుతాయి.

ద్వాదశ భావంలో అంగారక యోగం:

అంగారక యోగం ద్వాదశ భావంలో ఏర్పడిన జాతకులకు విదేశీయానం కలుగుతుంది. విలాసవంతమైన వస్తువుల మీద అధిక ఖర్చు చేస్తారు. అనుకోని విధంగా అధిక నష్టాలు వస్తాయి. ఈ జాతకులకు ఎవరి మీద అయినా పీకల లోతు కోపం ఉంటే, వారి మీద ఒక్కసారిగా విరుచుకుపడతారు. ఈ జాతకులకు కోపావేశాలు వస్తే మాత్రం, ఎలాంటి పనులకు తలపడతారో ఊహించడం కష్టం. గతంలో జరిగిన విషయాలను మనసులో ఉంచుకొని అవతలి వారితో గొడవ పడతారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారాలు, పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లాంటి వృత్తి, వ్యాపారాలు అబ్బుతాయి. 

మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Articles:

  1. వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు
  2. పూర్వ జన్మ కర్మ ఫలితాలు-వాటి అవయోగాల ఫలితాలు
  3.  కళత్ర దోషం అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
  4. NAGASHAKTHI Telugu Book
  5. జాతక పరిశీలన- Horoscope Reading
  6. ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
  7. విడాకులు-జ్యోతిష్య కారణాలు
  8. సర్పశాపం
  9. కాలసర్పయోగ నివృత్తి హోమం

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు తెలుసుకొనుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

ద్వికళత్ర యోగం/పునర్వివాహం

                               ద్వికళత్ర యోగం/పునర్వివాహం

మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు అయిపోతుంది. అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది. ఇంకొందరికి విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం జరిగి కోర్టు కేసులు, కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతుంటారు. ఇది వారి వారి జన్మకుండలిలోని కొన్ని గ్రహ స్థితుల వలన కలుగుతుంది. ఇంకొందరు వివాహము అయినప్పటికి, ద్వితీయ వివాహం జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకుంటారు.   ఇది ఇప్పటి కాలములో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఇది అందరి దంపతులకు జరుగదు. కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రమే జరుగుతాయి. అయితే ఈ వివాహేతర సంబంధములు గూర్చి తరువాత వివరిస్తాను. ఇప్పుడు ద్వితీయ వివాహముకు ఎలాంటి గ్రహ సన్నివేశములు ఉంటాయో మీకు తెలుపుతాను.

        జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి, ద్వితీయ వివాహానికి, విడాకులకు ముఖ్యంగా సప్తమ భావం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్న భావము-ఇది మన వ్యక్తిత్వము తెలియజేస్తుంది; ద్వితీయభావము మరియు ద్వితీయాధిపతి- ఇది మన కుటుంబ జీవనము, భార్య/భర్త ఆయుర్దాయము, ద్వితీయ వివాహ సందర్భములు ఏ విధంగా ఉన్నాయో సూచిస్తుంది; సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి- వివాహము, భర్త, భార్య గురించి తెలియజేస్తుంది; నవమ భావము మరియు నవమ భావాధిపతి- ద్వితీయ వివాహ సందర్భం గూర్చి తెలియజేస్తుంది; ఏకాదశ భావం మరియు ఏకాదశాధిపతి- అనుకున్న కోరికలు నెరవేరు సూచనల గూర్చి తెలియజేస్తుంది; గురువు- స్త్రీ జన్మకుండలిలో భర్త గురించి తెలియజేసే గ్రహం; శుక్రుడు- పురుష జన్మకుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం.

ఈ భావములు, గ్రహ స్థానములు,రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భము ఉందా లేదా అన్న విషయము గ్రహించవచ్చు.

ద్వికళత్ర యోగం/ పునర్వివాహం

  • స్త్రీ జన్మకుండలిలో 6వ స్థానములో శని, చంద్రులు కలసి ఉన్నట్లైతే ఆ జాతకులకు రెండు వివాహములు జరుగుతాయి. ఇదే గ్రహస్థితి పురుషుడికి ఉన్నట్లైతే భార్య మరణించును లేదా భార్య వీరిని వదిలి వెళ్లిపోవును.
  • 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండిన యెడల 2 వివాహములు జరుగును. కుజుడు 4,7,8,12 స్థానముల యందు ఉన్నట్లైతే జాతకునికి 2 వివాహములు జరుగును.
  • శని 2వ భావములో గాని, 7వ భావములో గాని రాహువుతో కలసి ఉండినా ద్వికళత్ర యోగం సంభవిస్తుంది.
  • శుక్రుడు పాపగ్రహములతో కలసి, 7వ స్థానాధిపతి నీచ పొందినా, 7వ స్థానమున పాపులు ఉన్ననూ పునర్వివాహ అవకాశములు ఉంటాయి.
  • పురుషునికి 7వ స్థానములో రవి, రాహువులు ఉన్నా, పరస్త్రీ సంగమం వల్ల తీవ్ర ధన నష్టం జరుగుతుంది.
  • శుక్ర, చంద్రులకు 7వ స్థానములో శని కుజులు ఉండినా భార్య పరాయి వ్యక్తితో వెళ్లిపోవును. సంతానాన్ని పొందలేరు.
  • శని, చంద్రుడు కలసి ఏడవ భావంలో ఉండినా ఆ స్త్రీకి రెండు వివాహములు జరుగును.
  • 2,7,6 స్థానాధిపతులు; 3,6,8,12 స్థానములందు ఉన్నా పునర్వివాహ సూచనలు వస్తాయి.
  • జన్మకుండలిలో సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి (బుధుడు, గురువు) ఉన్న రాశి ఈ రెండు ద్విస్వభావ రాశులు (కన్యారాశి, మిధునరాశి, ధను రాశి,మీనరాశి) అయితే, ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగే అవకాశము ఉంటుంది.
  • సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి, నవాంస చక్రములో మరియు భావచక్రములో సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే జాతకునికి రెండు వివాహములు జరుగు సూచనలు వస్తాయి.
  • వైవాహిక స్థానం అయిన 7వ స్థానముపై గాని లేదా సప్తమాధిపతి పై గాని 2 లేక 3 పాప గ్రహముల (శని, రవి, కుజ,రాహు, కేతు) దృష్టి ఉండినట్లైతే జాతకునికి ద్వితీయ వివాహం జరుగవచ్చు.
  • సప్తమాధిపతి మరియు లజ్ఞాధిపతి ఇద్దరు కలసి 11వ భావములో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహ అవకాశములు ఉంటాయి.
  • సప్తమములో 2 గాని లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు గాని శుక్రునితో కలసి 7వ భావములో ఉంటూ, ఆ సప్తమ భావముపై పాప గ్రహముల యొక్క దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు.
  • అష్టమాధిపతి లగ్నములో గాని లేదా సప్తమ భావములో గాని మరియు సప్తమధిపతి ద్విస్వభావ రాశిలో గాని లేదా శని,కుజ,రాహు,కేతు యొక్క పాప గ్రహముల దృష్టి సప్తమాధిపతి పై ఉన్నా జాతకునికి రెండవ వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి.
  • వైవాహిక స్థానాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావములో గాని, అష్టమ భావములో గాని లేదా 12వ భావములో గాని ఉండి మరియు కుజ, రాహు, కేతు, శని లాంటి పాప గ్రహములో సప్తమములో ఉండి, శుక్రుడు బలాహీనంగా నీచ లేదా శత్రు స్థానములో ఉన్నట్లైతే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది.

కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక, విడిపోవడం గాని, ద్వితీయ వివాహము జరగడం గాని జరుగుతుంది. అయితే జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయము స్పష్టము చేయకూడదు.

Related Articles:

సర్ప నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

అన్య స్త్రీ/పురుష సంబంధ అవయోగాలు

                            

        అన్య స్త్రీ/పురుష సంబంధ అవయోగాలు

సాధరణంగా వివాహం తరువాత పురుషుడు అన్యస్త్రీ సంబంధాలను కలిగి ఉండటం వల్ల ఆ పురుషుడిని నిందించడం జరుగుతుంది. మగ బుద్ధి పాడు బుద్ధి అంటూ దూషిస్తారు. ఇవే సంఘటనలు స్త్రీల విషయంలో జరిగితే స్త్రీ బుద్ధి ప్రళయాంతకః అని నిందిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడానూ వారివారి గత జన్మ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికే జన్మిస్తారు. వారి ప్రారబ్ధ కర్మను అనుభవించి జీవితంలో ఎన్నో పరాభవాలు, అవమానాలు, చట్ట సంబంధమైన ప్రతికూల సంఘటనలను ఎదుర్కొంటారు. ఒకరికొకరు దూషించుకోవడం పరిపాటి.  ఏది ఏమైనప్పటికి ఈ అవయోగాలు కలిగినపుడు వాటికి పరిష్కారం తప్పక చేసుకోవాలి. మనిషి తన కర్మను నియంత్రించడం సాధ్యం కాని విషయం. తాను ఎదుర్కొంటున్న చెడుకర్మను నిర్మూలించుకోవడానికి ఆ చెడు కర్మ ఏర్పడటానికి గల గ్రహస్థితులు జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి! కర్మను నియంత్రించలేము, కాని ఏర్పడిన చెడు స్థితిని నివారించవచ్చా?

                ఎవరు చేసేది వాళ్ళకి ధర్మం, ఈ విషయంలో మంచి చెడులను నిర్దేశించగల శక్తి, నియంత్రించగల శక్తి మానవమాత్రులకు సాధ్యం కాదు. వ్యక్తులకు ప్రాప్తించే రోగాలు, వ్యాధులను రాకుండా నివారించలేము. సోకిన రోగాన్ని నివారణ చేయటానికి ప్రయత్నించగలము. ఇందులో సూక్ష్మం మీకు అర్థమయ్యే ఉంటుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోగల శక్తి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. కానీ ప్రపంచానికి జరగబోయే వినాశనాన్ని లెక్కించగల, గ్రహించగల శక్తి అతీంద్రియ జ్ఞానం ఉన్నవారికే సాధ్యపడుతుంది. జ్యోతిష్యశాస్త్రం తెలిసిన ప్రతీవారికి ఇది సాధ్యం కాదు. వారి వారి పరిజ్ఞానం, పరిమితంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రపంచానికి జరగబోయే అంశాల కన్నా ముందు మనం ఎదుర్కొంటూ అవయోగాలను పరిష్కరించుకుందాం! చక్కటి పధార్థాలు, అనుభవం, శక్తి ఉన్నవారు చేసే వంట చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా శాస్త్రంపై నమ్మకం, అంకిత భావం, సంపూర్ణ శాస్త్ర జ్ఞానం ఉన్నవారు ఆచరించే పూజాది/ హోమ క్రతువులు శీఘ్రంగా సత్ఫలితాలను ఇస్తాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతిక్రియకు గ్రహాలే కారణ భూతమవుతాయి. వితండవాదాలకు నాస్తికులకు, ఆజ్ఞనులకు ఇది మెట్ట వేదాంతంగా ఉంటుంది. ఒక సైంటిస్టుకు ఉన్న పరిజ్ఞానం, శాస్త్ర జ్ఞానం అందరికీ ఉండదు. సైన్సు చాలా గొప్పది. అంతా సైన్సే! దేవుడు లేడు అంతా త్రాష్ అని చెప్పుకుంటూ, కొంతమందికి వారి చివరి దశలో ఈ సృష్టిని నడిపించేది ఏదో శక్తి అని చెప్పడం జరిగింది.

అన్య స్త్రీ/పురుష సాంగత్యాలకు జ్యోతిష పరిభాషలలో వ్యభిచార యోగమని పిలుస్తారు. జన్మకుండలిలో 7వ స్థానంలో శుక్రుడు ఉన్న ఆ స్థానం, మకర, కుంభములైతే శని, లేదా కుజుని చేత చూడబడితే ఆ పురుషుడు వ్యభిచారి అవుతాడు. శని, కుజులు చంద్రునితో గూడి ఒకే రాశిలో ఉండినా/ మకర, కుంభ, మేష, వృశ్చిక రాశులు 7వ స్థానములో ఆ రాశులలో ఉన్న శుక్రుడిని, శని, కుజులు చూస్తున్నప్పుడు, భార్యతో సహా అనగా భార్యా భర్తలిరువురూ ఎవరి ఇష్టానుసారంగా వారు అన్న సంపర్కములు సాగిస్తారు. పురుషుని జన్మకుండలిలో చంద్రుడు, మేష, వృశ్చిక, మకర, కుంభ రాశులలో ఉండి, అది 7వ రాశియై ఉండి, శని, లేదా కుజునితో వీక్షింపబడుతున్న ఆ పురుషునికి యొక్క అన్య పురుష సంపర్కములు కలిగి ఉంటుంది. ఇలాంటి గ్రహస్థితులు గల వ్యక్తులు ఈ అవయోగాలు ఎదురువ్వక ముందే పరిహారములు జరిపించువుకోవడం మంచిది. వీరికి ఈ దోషం నివారణ అయిన తరువాత వివాహం చేసుకోవడం మేలు.

 

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

నవనాగమండలం-ఆశ్లేష బలి||Navanagamandalam-Ashlesha Bali

ఆశ్లేష బలి, నవనాగమండలం, సర్పబలి

కాలసర్ప దోషం-? కాలసర్పంలో ‘కాల’ అంటే కాలము అని, ‘సర్పం’ అంటే పాము అని అర్థం. కాలసర్పము అనగా కాలము సర్పముగా మారి మానవుడిని అనేక రకముల కష్టాలపాలు చేయటాన్నే కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం అని అంటారు. జన్మకుండలిలో (జాతకచక్రంలో) రాహువు మరియు కేతువు వీటి వలన కాలసర్పదోషం ఏర్పడుతుందని వరాహమిహరుడు, పరాశర మహర్షి తెలియపరచారు. కాలసర్పయోగం ఉన్నవారు తమతమ వృత్తులలో పైకి రావడానికి ఎంతో అధికమైన శ్రమపడాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు ఎంతటి అధికమైన శ్రమ అనుభవించినా, ఆ శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

ఈ కాలసర్పయోగం ఉన్న జాతకుల యొక్క వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని, దోషాలను చూపిస్తారు. కాలసర్పయోగం ఉన్న వారు, వారి వారి వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా అంచలంచాలుగా పెరిగి అంతకన్నా హఠాత్తుగా పతనం అవుతారు. కాలసర్పయోగం తీవ్రంగా ఉన్నప్పుడు జాతకుడు కొన్నిసార్లు మరణ గండాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబానికి దూరం కావడం పెద్దమొత్తంలో ఆస్తిని కోల్పోవడం, నిష్కారణంగా అపకీర్తిని పొందడం, ఊహించని విధంగా ప్రమాదలకు గురి కావడం చట్టవిరుద్ధమైన మరియు అవినీతి కార్యాలకు పాల్పడి శిక్షలకు గురి కావడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.

Ashlesha Bali

Related Articles:

             ఈ కాలసర్పయోగం వల్ల మనిషి తాను చేసే కార్యాలకు ఫలితం పొందలేకపోవడం, కొందరికి వివాహం కాకపోవడం, సంతానం కలుగక పోవడం తరచూ తగాదాలలో, కోర్టు కేసులలో ఇరుక్కుపోవడం, శత్రువుల పీడ అధికంగా ఉండటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. మనిషికి రావాల్సిన శుభాన్ని అదృష్టాన్ని అడ్డగించడంలో కాలసర్పదోషం పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. ఈ కాలసర్పదోషానికి మనిషి యొక్క మంచి, చెడులతో సంబంధం లేదా పేద, ధనిక అన్న భేదం కూడా లేదు. కాలసర్పదోషం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యోగ ప్రభావానికి గురి కావాల్సిందే. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములతో ఉత్కంఠను, ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కోరకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయసు వరకు ప్రభావం ఉంటుంది, కొన్ని కాలసర్పదోషాలు మాత్రం మనిషి జీవితంలో ఏదో ఒక దశలో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయి. భారతదేశంలో సర్పదోష నిర్మూలనకు చాలా విధాలుగా పరిహారాములు జరిపిస్తున్నారు. వీటిలో కొన్ని మాత్రమే సఫలీకృతం అవుతున్నాయి. మరికొంత మంది చేసుకున్న కాలసర్పదోష పరిహారాలు బూడిదలో పోసిన పన్నీరే. కారణం ఏమిటంటే, కాలసర్పదోష పరిహారాదులకు జరిపించవలసిన వాటిలో ప్రధానమైనది ఆశ్లేష బలి, నవనాగమండలం . ఈ రెండూ కూడాను చాలా శక్తివంతమైన కాలసర్పదోష పరిహారములు. ఈ రెండూ సర్పతాంత్రిక పీఠాలలో, సర్ప దేవతల క్షేత్రములో, నదీ మరియు సాగర తీరములందు మాత్రమే జరిపించాలి. అలా కాకుండా సామూహికంగాను, గృహాలలోనూ, మరే ఇతర ప్రదేశాలలో ఈ కార్యములు నిర్వహించకూడదని శాస్త్ర నియమం. సర్పతాంత్రికులు, సర్ప పీఠాలలో చేసే నవనాగమండలం, ఆశ్లేష బలి పూజాది కార్యములకు మాత్రమే సత్ఫలితాలు పొందడం జరుగుతుంది.తీవ్రమైన కాలసర్పదోషం, నాగ శాపం, నాగ దోషం, రాహు గ్రహ నాగదోషం, కేతు గ్రస్త సర్పదోషం సంపూర్ణంగా తొలగిపోవాలంటే ఆశ్లేష బలి, నవనాగమండలం పూజను తప్పనిసరిగా జరిపించుకోవాలి. జాతకులు ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని మరియు వ్యక్తిగతంగా గాని ఈ పూజను నిర్వహించుకోవడం మంచిది. సామూహికంగా జరిగే పూజలో ఒకరి దోషాలు మరొకరికి బట్వాడా కాబడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా దోషం నిర్మూలన కాకపోగా ఇతరుల దోషాలు సంక్రమించే అవకాశం. వారు ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను కూడా పంచుకునే భాగాస్వాములు జరిగే అవకాశాలు మెండు. అందుకరణం చేత సర్పదోష పరిహారాలు వ్యక్తిగతంగా చేయించుకోవడం ఉత్తమం.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

Ph: 9846466430

Email:

 chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

ఆగస్టు 15,2020 ఉచిత ధన్వంతరీ హోమ కార్యక్రమము

 

బ్రహ్మతంత్ర వేద నారాయణ తంత్ర పీఠం

ఉచిత ధన్వంతరీ మహా యజ్ఞ కార్యక్రమం

జన్మకుండలి(జాతకము)లో 6వ స్థానం జాతకులకు కలిగే వ్యాధులను సూచిస్తుంది. 6వ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల కలిగే వ్యాధులు, అనారోగ్యాలు మరియు శత్రువుల వల్ల తంత్ర ప్రయోగాలకు గురికావడం, ఋణాలు అధికంగా చేసి తీర్చలేకపోవడం ఈ మూడు అంశాలు 6వ స్థానం బలాన్ని బట్టి నిర్ణయించబడతాయి. జన్మకుండలిని పరిశీలించి కొన్ని జాతకములను మీకు చూపిస్తున్నాను. ఈ జాతకములలో ఉన్న విధంగా గ్రహస్థితులు వాటి వలన కలిగే యోగాలు అవయోగాలు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. పరిశీలించండి. ఈ లింకు ద్వారా జాతక విశ్లేషణను పరిశీలించగలరు. https://brahmatantra.com/sample-horoscope-reading/

 

ధన్వంతరీ హోమ విశేషాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు. https://brahmatantra.com/dhanvantari-homam/

 

 

భౌగోళిక పరిస్థితులు- జ్యోతిష్య శాస్త్ర హెచ్చరికలు, సూచనలు

6వ స్థానం బలహీనమయ్యి, ఆ స్థానాధిపతులు జాతకులపై దుష్పరిణామాలను చూపించినపుడు కలిగే చెడు ఫలితాలు కలిగే వ్యాధులలో కరోనా వ్యాధి ఒకటి. సమస్త మానవాళి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని తలంచి 6వ స్థానంలో గ్రహాలు జాతకులను కరోనా వ్యాధికి గురి కాకుండా ధన్వంతరీ మహా యజ్ఞమును నిర్వహించబోతున్నాము. ఆగస్టు-15, 2020 రోజు నుండి ఆగస్టు-17,2020 రోజు వరకు మూడు రోజుల పాటు మీ పేరిట, మీకు షష్ట్యమాధిపతి వలన కలిగే చెడు ఫలితాలను నిరోధించుటకు ధన్వంతరీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నాము. జాతకుని గోత్రం, నామ నక్షత్రములను మాకు కేవలం మెయిల్ మరియు Whatsapp ద్వారా ఆగస్టు 14వ తేదీలోపు వివరాలు తెలిపిన వారికి మాత్రమే పంపిన యెడల కేరళ తంత్ర విధానములో ధన్వంతరీ మహా యజ్ఞాన్ని జరిపించి వ్యాధి నిరోధక భస్మాన్ని, రక్షలను మీకు పంపగలము.

ముఖ్య సూచన:

మీ యొక్క జాతకములో 6వ స్థానాన్ని పరిశీలించుకొని చెడు గ్రహస్థితులు ఉన్నవారు తప్పక ఈ మహాయజ్ఞ ప్రసాదములను పొందగలరు.

 

E-mail: chakrapani.vishnumaya@gmail.com

Whatsapp number: 9951779444

ముఖ్య గమనిక: ఈ ధన్వంతరీ హోమమును మాకు వివరాలు అందజేసిన వారందరి పేరిట జరుపబడును. కాకపోతే ప్రసాదములు మాత్రం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నవారికి మాత్రమే ఉచితంగా పంపబడుతుంది. ఇతర రాష్ట్రాల వారికి ప్రసాదములు అందజేయాలంటే మాకు 9951779444 నెంబరుకు phonepe/gpay/paytm ద్వారా 100/- జమ చేసి మాకు వారి వివరాలను, చిరునామాను తెలియజేయాలి. అందరూ గమనించాలని ప్రార్థన.

Related articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

 

వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు

వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సప్తమ స్థానాన్ని వైవాహిక స్థానంగా చెబుతారు. కాని వైవాహిక జీవితంలో మాత్రమే కాకుండా ప్రేమలో గాని స్నేహంలో గాని, వ్యాపార భాగస్వామ్యంలో గాని మనకు ఏర్పడే బంధాలు కూడా ఈ సప్తమ స్థానం తెలియజేస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందా? బహుకళత్ర యోగాలు ఏమైనా ఉన్నాయా? జీవిత భాగస్వామితో మానసిక, శారీరక సంబంధం ఏ విధంగా ఉంటుంది? వివాహం తరువాత వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? వివాహం ఆలస్యం ఎందుకు అవుతోంది? అన్న విషయాలు అన్నీ కూడా ఈ సప్తమస్థానంతో ముడిపడి ఉంటాయి.

సప్తమ స్థానం ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది?

          మానవుడి జీవితంలో యవ్వన దశ ప్రారంభం కాగానే వారి జీవితంలో శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభం అవుతుంది. స్త్రీ, పురుష సంబంధ, మానసిక, శారీరక సంబంధాలు ఏర్పడటం ప్రారంభం అవుతాయి. ఈ దశ నుండి వారి జీవితంలో అత్యంత కీలకమైన మార్పులు సంభవిస్తాయి. స్త్రీ పురుషుల మధ్య పరస్పర మానసిక శారీరక ఆప్యాయతలు, వాంచలు పొందాలని కోరుకోవటం మరియు పొందడం జరుగుతుంది. ఈ సంఘటనల వల్ల కొన్ని సంధర్భాలలో స్త్రీ పురుషులు మానసిక భావోద్వేగాలకు గురి కావడం, ప్రేమానురాగలను పొందడం, శృంగార వాంచలు తీర్చుకోవడం సర్వ సాధరణంగా జరుగుతుంది. అయితే ఈ సంఘటనలు అందరి జీవితంలో ఒకే విధంగా జరగవు. వారి కర్మ జాతకంలో సప్తమ స్థానంలో ఉన్న గ్రహాయోగాలు, అవయోగాలు వారి యొక్క మానసిక, శారీరక గుణాల పైనా, ప్రవర్తన పైనా ప్రభావితం చేస్తాయి. అంటే, సప్తమ స్థానం స్త్రీ పురుషులపై వారి జీవితంలో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల స్థితి గతులను బట్టి, వారి శృంగార జీవితం, వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుంది. స్త్రీ పురుషుల యొక్క సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి, వారి వివాహ విషయాలు, శృంగార సాంగత్యాలు, పునర్వివాహాలు, వైవాహిక జీవితంలో ఆనందం వంటి విషయాలు ఖచ్చితంగా నిర్ణయింపబడతాయి. మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ అంశాలను సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు నిర్దేశిస్తాయి. అందువల్ల జన్మకుండలిలోని సప్తమస్థానంలోని గ్రహస్థితులను, యోగాలను, అవయోగాలను తెలుసుకొని పరిశీలించుకొని ముందు అడుగు వేయటం మంచిదని మహర్షులు తెలియజేశారు.

            జ్యోతిష్య శాస్త్రములో సప్తపది అనే ఒక భాగంలో సప్తమ స్థానాలపై గ్రహాల ప్రభావం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో వివరంగా ఇవ్వటం జరిగింది. ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను, విశ్వాసాన్ని ఇవ్వకపోవడం వల్ల జాతకులు కళత్ర స్థాన విషయాలను తెలియజేసే సప్తపదిని ప్రస్తుత కాలంలో వాడకపోవడం జరుగుతుంది. అందుకారణంగా దోష పూరితంగా ఉన్న సప్తమస్థాన అవయోగ ప్రతికూల ఫలితాలను, దుష్పరిణామాలను వైవాహిక, శృంగార జీవితంలో ఎదురవుతున్నప్పుడు గ్రహ దోష నిర్ధారణ మరియు తెలుసుకోకపోవటం వల్ల గులాబీ ముళ్ళ పాన్పులో శయనించినట్టుగా జీవితం గడచిపోతుంది. వివేకవంతులు అయిన వ్యక్తులు ఈ విషయాన్ని గమనించి సప్తపది అంశాన్ని ఉపయోగించి గ్రహదోషాలను తెలుసుకొని వాటికి పరిహారాలను ఆచరించి ప్రేమ, శృంగార, వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు.

సప్తమ స్థానానికి సంబంధించిన కొన్ని గ్రహస్థితులు, వాటి ఫలితాలను గూర్చి ఇక్కడ మీకు వివరిస్తున్నాను.

  • సప్తమ స్థానంలో బుధుడు+గురువు కలసి ఉన్నట్లైతే దంపతులు తాత్కాలిక వియోగాన్ని అనుభవిస్తారు. భర్త దూరదేశాల్లో ఉండటం జరుగుతుంది. దంపతులు విడిపోరు కానీ, ఒకరికొకరు దూరమయ్యి ఎడబాటును భరిస్తారు. దీనినే సుదీర్ఘ వియోగ యోగం అంటారు.
  • చంద్రుడు, శుక్రుడు, రవి కలసి 7వ స్థానంలో ఉంటే, దాంపత్యం విచ్ఛిన్నమవ్వడం, భర్తకి లేదా భార్యకి మరొకరితో సాంగత్యం ఏర్పడటం జరుగుతుంది.
  • సప్తమ స్థానంలో కుజుడు+ శని+ రాహువు ఉన్నా కూడా ఇదే పరిస్తితి ఎదురవుతుంది.
  • స్త్రీ పురుషుల జాతకములలో జన్మ లగ్నం నుండి 7వ భావములో కుజుడు+శుక్రుడు కలసి ఉండినా, కుజుని దృష్టి శుక్రునిపై పడినా, శుక్రుని దృష్టి కుజుని పై పడినా, నిశ్చయమైన తరువాత జరగాల్సిన వివాహాలు కూడా ఆకస్మికంగా ఆగిపోవడం జరుగుతుంది. ఈ గ్రహ స్థితులు ఉన్న జాతకులకు, పెద్దలను ఎదురించి వివాహాలు చేసుకోవడం ఆ తరువాత దాంపత్య విరోధములు ఏర్పడటం, ఒకరికొకరు దూరమయ్యి ఎడబాటుకు గురికావడం, విడాకులు, ప్రణయ హత్యలు, వ్యభిచారములు, దాని వల్ల వచ్చే వ్యాధులను అనుభవించడం జరుగుతుంది. 
  • జాతకములో కుజ శుక్రుల బలం లేకుంటే త్వరగా వివాహాలు జరుగవు. వివాహ విఘ్నములు వస్తాయి. కుజ దృష్టి శుక్రునిపై కలిగి ఉన్న జాతకులు తీవ్ర కామ స్వభావం కలిగి ఉండటం వల్ల, వివాహానికి పూర్వమే సంభోగ సుఖాన్ని అనుభవించే అవకాశములు ఉంటాయి. వీరిలో కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. ఈ దోష పరిహారం కాకుండా జాతకులు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ వివాహం జరిగినా వీరి వైవాహిక జీవితం పరస్త్రీ, పర పురుష సాంగత్యాలతో నడుస్తుంది.
Marriage life astrology
వైవాహిక జీవితం-సప్తమ స్థానం
  • పంచమ స్థానంలో కుజ శుక్ర సంయోగం వల్ల పుట్టిన సంతానం మరణిస్తారు. వృషభ తులారాశుల వారికి ఈ దుస్సంఘటనలు జరుగవు. పురుషునికి పంచమ స్థానంలో శుభ గ్రహాలు ఉండాలి. గ్రహాలు ఏమి లేకపోయినను దోషం ఉండదు. దంపతుల సప్తమ స్థానంలో అనగా 7వ స్థానంలో కుజ శుక్రులు ఉన్నట్లైతే, వివాహం జరిగిన 7 రోజులు లేదా 7 వారాలకు లేదా 7 నెలలకు దంపతులు విడిపోవడం, ఒకరికి ఒకరు దూరంగా ఉండటం, విడాకులు అవ్వడం, నూటికి నూరు శాతం జరుగుతుంది.
  • యువతీ యువకుల తలిదండ్రులు ఈ గ్రహస్థితులను బాగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉన్నాయో లేదో చూడకుండా వివాహాలు జరిపిస్తే మీ కుమార్తె గోడకు కొట్టిన బంతిలాగా వెంటనే తిరిగి పుట్టింట్లో పడే అవకాశం ఉంటుంది. ఆ తరువాత విడాకుల ప్రయత్నాలు, పోలీసు కేసులు, చట్టపరమైన వివాదాలు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు, ఇవే జరిగేవి. అందువల్ల తస్మాత్ జాగ్రత్త.
  • స్త్రీ జాతకంలో సప్తమ స్థానంలో శని ఉంటే ఆ జాతకురాలికి వివాహం జరిగిన వెంటనే విడాకులు లేదా భర్త మరణించడం జరుగుతుంది. గర్భసంచి లోపాలు తలెత్తుతాయి.

Related Articles:

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

ధన్వంతరీ హోమం

ధన్వంతరి హోమం

ధన్వంతరీ హోమనికి ధన్వంతరి భగవానుడు అధిపతిగా ఉంటాడు. పాల సముద్రమును చిలికేటపుడు ధన్వంతరీ భగవానుడు ఉద్భవించాడు. ఈ ధన్వంతరీ హోమము వల్ల మంచి ఆరోగ్యం, ధీర్ఘయువు జాతకులు పొందుతారు.

ఈ ధన్వంతరీ హోమం వల్ల అనుకూల ప్రకంపనలు ఉత్పన్నమయ్యి, జాతకుల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ మహాశక్తివంతమైన ధన్వంతరీ హోమం, అన్నీ రకాల అనారోగ్యాలకు చక్కటి పరిహారం. ఈ ధన్వంతరీ హోమం ఆచరించడం వల్ల, ధన్వంతరీ భగవానుడి అనుగ్రహం లభించి, అన్నీ రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈ ధన్వంతరీ హోమం జరిపించే సమయంలో 108 ఔషధ మూలికలను హోమాగ్నికి ఆర్పిస్తారు. ఆ హోమాగ్ని నుండి ఔషధ గుణములు వాయువు ద్వారా వ్యాపించడం వల్ల, శారీరక అనారోగ్యాలు నశించిపోతాయి.

         ఈ శక్తివంతమైన హోమం ఆచరించేందుకు ఏకాదశి తిథి ఎంతో మంచిది. గురు హోర, బుధ హోరలు  కూడా ఈ హోమం జరిపించేందుకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ ధన్వంతరీ హోమం, అన్ని రకాల వ్యాధులకు సరైన పరిహారం. ఈ హోమమును సంవత్సరానికి ఒకసారి జరిపిస్తే, అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.

Related Articles:

సంపూర్ణ జాతక పరిశీలన

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. 

జాతక పరిశీలన- Horoscope Reading

  Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?

డిసెంబర్ 26,2019 నాడు షష్ట గ్రహ కూటమిలో సంభవించిన సూర్య గ్రహణం జరిగిన తరుణంలో మానవాళికి జరుగబోవు దుష్పరిణామాలు శ్రీ C.V.S.చక్రపాణి గారు ముందుగానే వివరించడం జరిగింది.  వారి వద్ద ఉన్న ప్రాచీన కేరళ తాళపత్రముల నుండి సేకరించిన విషయంలో అతి భయంకరమైన వ్యాధులు మానవాళిని నాశనం చేయబోతోందని మరియు తీవ్రమైన భూకంపాలు, జల ప్రళయాలు సంభవించబోతున్నాయని ముందుగానే తెలియజేయటం జరిగింది. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం అనగా 1959లో వికారి నామ సంవత్సరంలో ‘హంటా వైరస్’ అనే సూక్ష్మ క్రిమి మానవులకు సోకింది. ఈ వైరస్ కారణంగా ఎంత మంది మరణించారో లెక్కపెట్టలేకపోయారు. అప్పటివరకూ ‘హింది-చిన్ని భాయ్ భాయ్’ అని నినాదంతో మెలిగిన చైనీయులు, భవిష్యత్తులో భారతదేశంతో ఎలాంటి యుద్ధాలు ఉండవని ప్రకటించిన చైనీయులు, 1959 వికారి నామ సంవత్సరములో భారతదేశానికి మరియు చైనా దేశానికి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఆ తరువాత 1962 సంవత్సరంలో అష్టగ్రహ కూటమిలో జరిగిన సూర్య గ్రహణం తరువాత భారత దేశానికి మరియు చైనా దేశానికి మధ్య జరిగిన యుద్ధంలో భారత దేశం పరాజయం పాలైంది. ఆ తరువాత సరిగ్గా 2019లో జరిగిన షష్ట గ్రహ కూటమిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవించింది. ఈ గ్రహణం సంభవించిన తరువాత నాలుగు రోజులకి కరోనా వైరస్ అనే మహమ్మారి మొదట చైనా దేశంలో సంభవించింది. ఎందుకనగా సూర్య గ్రహణం ధనూరాశిలో ఏర్పడింది. ధనూరాశి తూర్పు దిక్కును సూచిస్తుంది. అందుకే తూర్పు దేశం అయిన చైనాలో ఈ తెలియని వైరస్ తయారయ్యింది. మార్చి నెల 21 వరకు కుజుడు ధనూరాశిలోనే ఉన్నాడు. అందుకే ధనూరాశిలో సూర్య గ్రహణం జరిగిన తరువాత కుజుడు ఫిబ్రవరి నెలలో ధనూరాశిలోకి ప్రవేశించాడు. ఆ సమయం నుండి ఈ కరోనా అను అంటువ్యాధి ప్రపంచమంతా నెమ్మదిగా పాకటం మొదలయ్యింది. అయితే ఔషధ కారక గ్రహం మరియు భూమిని పరిపాలించే రవి ఏప్రిల్ 14,2020 ఉచ్చస్థానమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయం నుండి భూమి పై ఉన్న ప్రజలకు రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఈ వ్యాధి పూర్తిగా అంతరించిపోవడానికి జూన్ నెలలో వచ్చే సూర్య గ్రహణం పూర్తి కావాలి. మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం వ్యాధులు ప్రబలడానికి కారణాలు ఏమనగా గ్రహ కూటములు, గ్రహణాలు, వ్యాధుల వల్ల ఎలాంటి గ్రహ జాతకులు మృత్యువు పాలవుతున్నారు, ఎవరిది సాధారణ మరణం, ఎవరిది బలవన్మరణం, అసాధారణ మరణం ప్రాప్తిస్తుందో తెలిపేదే మెడికల్ ఆస్ట్రాలజి.

Solar Eclipse-2019                             

ఈ మెడికల్ ఆస్ట్రాలజి ద్వారా వ్యక్తుల జీవితంలో ఎదుర్కొనే దీర్ఘకాలిక వ్యాధులు తెలుసుకొని, ధన్వంతరీ శాస్త్రం ద్వారా పరిష్కారములు, నివారణలు, నిర్మూలనలు జరపవచ్చు.

  • 2020 మార్చి, మే, జూన్, సెప్టెంబర్ నెలలో అతి తీవ్రమైన భూకంపాలు సంభవించును.
  • ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో తీవ్రమైన పెను తుఫాను సంభవించును.

ఈ శార్వరి నామ సంవత్సరంలో జగన్మాత ప్రాతినిద్యం వహిస్తుంది. అందువల్ల ఆ జగన్మాతను కింది మంత్రముతో జపించడం వల్ల నవనాయకులు అనగా నవగ్రహాలు కొంత అనుకూలంగా ఉండటం జరుగుతుంది. కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల వ్యక్తులు దారుణమైన మానసిక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ కలి ప్రభావాన్ని మానవులు తట్టుకోలేక సతమతమవుతారు. కలి ప్రభావాన్ని తగ్గించి కలిపురుషుని దృష్టిని మరల్చగల శక్తి, కాలాన్ని సైతం తన ఆధీనంలో ఉంచుకోగలిగిన శక్తి కాలభైరవునికి ఉంది. కలియుగంలో కలిపురుషుడు కలిగించే చెడు సంఘటనలను మానవులు ఎదుర్కొనే శక్తిని అష్ట భైరవులు ప్రసాదిస్తారు. సాత్విక పూజలు ఫలించే తరుణం ఇది కాదు. వామాచార విధానంలో ప్రతీ వ్యక్తి అష్ట భైరవ పూజలు జరుపుకొని శీఘ్రంగా ఇష్టకార్యసిద్ధి, గ్రహదోష దృష్టి, అవయోగాలు పరిష్కారమవుతాయి. ఈ తాంత్రిక పద్ధతులు శ్రీ C.V.S.చక్రపాణి గారి వేద నారాయణ అధర్వణ పీఠము నందు (పాలక్కాడ్-కేరళ, పాలమంగళం-ఆంధ్ర ప్రదేశ్) వారి తంత్ర పీఠము నందు గ్రహదోష పరిహారములు జరుగును. ఈ పీఠము నందు అత్యంత నిష్టగా, శ్రద్ధగా, శాస్త్రోక్తంగా, వామాచార విధానంలో నాగ దోష పరిహారములు జన్మకుండలిలో ఉన్న గ్రహదోషాల వల్ల వ్యక్తులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు ఈ తంత్ర పీఠములో పరిహారములు ఖచ్చితముగా జరుగును.

ఖచ్చితమైన మరియు సంపూర్ణమైన జ్యోతిష్య పరిశీలన పరిజ్ఞానం ఉన్నప్పుడే కదా దానికి పరిహారం చెప్పగలిగేది.

దైవజ్ఞ శ్రీ C.V.S.చక్రపాణి గారి పరిపూర్ణమైన జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానంతో, సంపూర్ణమైన విశ్వాసంతో జన్మకుండలి పరిశీలన చేసి మీకు గల యోగాలు, అవయోగాలు, పరిష్కారములు తెలిపి, పరిహారములు వీరి తంత్ర పీఠం నందు జరిపించి మాకు సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రాప్తింపజేయుటకు సంకల్పించారు.

ఈ శార్వరి నామ సంవత్సరంలో నాగ యక్షిణి అమ్మవారు సంవత్సరానికి సంవత్సర ఫలదాయకులకు ప్రాతినిద్యం వహించి ఉంటారు.

ఈ శార్వరి నామ సంవత్సరంలోనైనా సరే అందరూ గ్రహ దోషములు నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నాను. హైందవ ప్రజలందరూ శ్రీ శార్వరి అమ్మవారి అనుగ్రహం కటాక్షం పొందాలని సుఖసంతోషాలతో తలతూగాలని కోరుకుంటున్నాను.

     ఇట్లు

     వేద నారాయణ అధర్వణ తంత్ర పీఠం

     పాలమంగళం (ఆంధ్రప్రదేశ్)

     పాలక్కాడ్ (కేరళ)    

Email: chakrapani.vishnumaya@gmail.com                       Ph: 9846466430

Related Articles:

నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope

నష్టజాతక ప్రశ్నముThe Lost Horoscope

నష్టజాతక ప్రశ్న అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం తెలియని వారికి, వారి యొక్క జన్మించిన తేదీ, సమయం లగ్నం తెలుసుకుని జాతకచక్రమును రూపొందించే జ్యోతిష్య శాస్త్ర విధానం. ప్రజలకు తాము జన్మించిన సమయం, పుట్టిన తేదీ వివరాలు గుర్తుంచుకోకపోవడం వల్ల తరువాతి కాలంలో ఆ వ్యక్తి గ్రహదోషాల రీత్యా అవయోగాలు సమస్యలు ఎదురయినపుడు గ్రహదోషాలకు పరిహారములు ఏమిటో ఏ గ్రహదోషాలు ఉన్నయో తెలియక తికమక పడతారు. పుట్టిన పేరును బట్టి, మొదటి అక్షరాన్ని బట్టి, రాశిని నిర్ణయించుకొని మనకు మన రాశి తెలిసింది అని సంతృప్తి పడదామని ప్రయత్నిస్తారు. కాని అది సరైన విధానం కాదు. ఎందుకంటే మీ పేరును, మీరు జన్మించిన నక్షత్రానికి సంబంధించి పెట్టి ఉండకపోవచ్చు. అప్పుడు మీకు మీ రాశి ఖచ్చితంగా తెలియకపోవచ్చు. రాశి మాత్రమే తెలుసుకోవడం వల్ల జాతకచక్రం రూపొందించలేము. రాశి వల్ల ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ప్రశ్న, గుణగణాలు తెలుసుకోవడం కాదు గదా. జన్మకుండలిలో గ్రహాల దోషాల అవయోగాల వల్ల జాతకులు ఎదుర్కొంటున్న దుష్పరిణామాలు సమస్యలకు గ్రహదోష పరిహారాలు తెలియాలి.

Nashta Jathaka Prashna

నష్ట జాతక ప్రశ్నము అనే జ్యోతిష్య విధానం ద్వారా మీ చేత ప్రశ్న వేయించి, మీ యొక్క పుట్టినతేది, పుట్టిన సమయం, లగ్నం తెలుసుకొని మీ జాతకచక్రమును రూపొందించటం జరుగుతుంది.

మన పూర్వీకులైన మహర్షులు ఎంతో తపశ్శక్తితో దైవానుగ్రహం పొంది, ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని సిద్ధి పొంది జ్యోతిష్య శాస్త్రంలో నష్టజాతకాధ్యాయమును తాళపత్రముల ద్వారా మనకు అందజేయటం జరిగింది. ఈ తాళపత్రములలో  నష్టజాతకధ్యాయమును నేను గ్రహించడం జరిగింది C.V.S.చక్రపాణి గారి ద్వారా మీ జాతక చక్రమును రూపొందించుకోవచ్చు. మీలో ఎవరికైనా జన్మతేదీ, సమయం తెలియని వారు జాతకచక్రమును పొందదలచిన వారు, తంత్ర గురువు కేరళ వావిల్యాపుర వాస్తవ్యులు తంత్ర పీఠాధిపతులు అయిన C.V.S.చక్రపాణి గారిని సంప్రదించి గలరని అందరూ దైవనుగ్రహం, గురుదేవుల అనుగ్రహం పొందాలని సదా కోరుకుంటున్నాము.

మీ యొక్క జాతకచక్రమును పొందగోరు వారు గురూజిని ప్రశ్న అడగాలి.

ప్రశ్న- గురూజీ! మా పుట్టిన తేదీ వివరాలు మాకు తెలియవు. నా యొక్క జాతకచక్రమును తెలియజేయండి అని అడగాలి.

ప్రశ్న అడిగే ముందు తలస్నానం ఆచరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించి, సంపూర్ణ విశ్వాసంతో అడగాలి.

మీ జాతకచక్రమును నిర్మించి మీకు కలిగే యోగాలు, అవయోగాలు వాటికి గ్రహదోష పరిహారాలతో సహా గురూజీ మీకు తెలియజేయడం వ్రాసి పంపడం జరుగుతుంది. తద్వారా మీ పూర్వజన్మ విశేషాలను కూడా తెలుసుకోవచ్చు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి అభిచార కర్మలకు, శత్రువుల చెడు ప్రయోగాల నిర్మూలనకు తాంత్రిక హోమములు కేరళలోని మా బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకోవచ్చు.

వివరాలకు సంప్రదించండి. Ph 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Related Articles:

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X