Mathibhramana Yogam

మతిభ్రమణ యోగం

Mathibhramana Yogam జ్యోతిష్య శాస్త్రం మనకు తెలియజేసే అవయోగాలలో ఈ మతి భ్రమణ యోగం కూడా ఒకటి. ఈ మతిభ్రమ యోగం అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పవచ్చు. ఈ యోగం ఉన్నవారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ మతిభ్రమణ యోగం ఉన్న జాతకులు వెర్రిగా, పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే క్రింద చెప్పబోయే గ్రహస్థితులలో 6వ గ్రహస్థితి ఉన్న జాతకులకు ఈ మతిభ్రమణ యోగ ప్రభావం ఒక మోస్తరుగా ఉంటుంది. మన ప్రవర్తనకు, పనితీరుకు అన్నిటికి మెదడు కారణభూతం అవుతుంది. ఆ మెదడు సరిగ్గా పనిచేయనపుడు, మనిషి యొక్క కార్యక్రమాలలో తీవ్ర పొరపాట్లు జరగడం, వాటి వల్ల కలిగే ఇబ్బందులు ఎన్నో వస్తాయి. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటంటే, ఇక్కడ వివరిస్తున్న గ్రహస్థితులు ఉన్నవారు పుట్టుకతోనే మతిభ్రమణం చెందుతారు అని చెప్పడం లేదు. మనకు జరిగే కొన్ని సంఘటనలకు ఒక్కోసారి తీవ్ర దిగ్భ్రాంతి చెందాల్సి ఉంటుంది. ఒక్కోసారి శరీరంలో ఉన్న హార్మోన్లు వాటి పరిమితి కోల్పోవడం జరుగుతుంది. కొందరికి ఇంటా, బయటా తట్టుకునే స్థాయికి మించి ఇబ్బందులు, బాధలు ఎదుర్కొంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ముందుగా మన మెదడు తీవ్ర ప్రభావానికి గురి అవుతుంది. ఆ సమయంలో మెదడుకు వచ్చే మార్పులు, మన ఆధీనంలో ఉండక పిచ్చిగా, వెర్రిగా ప్రవర్తిస్తాయి. అందుకే “ఆవేశంలో ఏ పని తలపెట్టకూడదు, ఏ నిర్ణయం తీసుకోకూడదు” అని చెబుతూ ఉంటారు.

ఈ మతిభ్రమణ యోగం జన్మకుండలిలో ఉన్నదో లేదో తెలుసుకునేందుకు ముందుగా మీ జన్మకుండలిని ఎదురుగా ఉంచుకొని, క్రింద ఇవ్వబడిన గ్రహస్థితులు జన్మకుండలిలో ఉన్నాయో లేదో పరిశీలించుకోగలరు.

  1. లగ్నం నుండి అష్టమ భావంలోగాని లేదా లగ్నంలో గాని చంద్ర- రాహువులు కలసి ఉన్న వారికి “మతిభ్రమణ యోగం” ఉన్నట్టు గుర్తించాలి.
  2. లగ్నములో శని, కుజుడు కలసి ఉన్నప్పుడు, ఆ జాతకులకు మతిభ్రమణ యోగం ఉన్నట్టు తెలుసుకోవాలి.
  3. జన్మకుండలిలో లగ్నంలో శని మరియు సప్తమ స్థానంలో గాని, పంచమ స్థానంలో గాని, నవమ భావంలో గాని కుజ్దు ఉండినట్లైతే, ఆ జాతకులకు మతిభ్రమణ యోగం ఉన్నట్టు గుర్తించాలి.
  4. లగ్నం నుండి అష్టమంలో కేతువు ఉండినట్లైతే జాతకులకు మతిభ్రమణ యోగం ఉన్నట్టే అని తెలుసుకోవాలి.
  5. లగ్నం నుండి ద్వాదశ స్థానంలో శని, క్షీణ చంద్రునితో (కృష్ణ పక్ష చంద్రుడు) కలసి ఉన్నట్లైతే వారికి మతిభ్రమణ యోగం ఉన్నట్టు గుర్తించాలి.
  6. జన్మకుండలిలో లగ్నంలో గురువు మరియు సప్తమ స్థానంలో కుజుడు ఉన్నట్లైతే, ఆ జాతకులకు మతిభ్రమణ యోగం ఉన్నట్టు గుర్తించాలి.

ఇక్కడ వివరించిన గ్రహస్థితులు ఉన్నవారికి, మానసిక లోపాలు ఉన్నవారికి తంత్ర శాస్త్రంలో వివరించబడ్డ పరిహార మార్గాలలో ముఖమైనది “వామతంత్ర దశమహావిద్య తాంత్రిక చిన్నమస్తా దేవి హోమము”. ఈ హోమము వావిళ్యాపురంలోని (పాలక్కాడ్, కేరళ) తంత్ర పీఠం నందు ఈ భైరవి హోమాది పూజలు జరుగును.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: