loading

Month: June 2023

చట్ట సంబంధ వివాదాలు-కోర్టుకేసులు-జన్మకుండలి

కోర్టు కేసులు-జన్మకుండలి

ప్రస్తుత కాలంలో జాతకులు ఎదుర్కొంటున్న సమస్యలలో అతి ముఖ్యమైనది, తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసేవి చట్టపరమైన సమస్యలు. ఈ సమస్యలు దీర్ఘకాలం పాటు సాగుతూ ఉంటాయి. ఈ పరిస్థితులలో జాతకులు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా తీవ్రమైన మనోవేదనను భరిస్తారు. అంతేకాకుండా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ దైవమైనా కరుణిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకాలం గడచినా కోర్టు వ్యవహారాలు, వాటి అనుకూలమైన తీర్పుల కోసం న్యాయవాదుల చుట్టూ, కోర్టు భవనాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహితులు అయితే గనుక అటు తమ సంతానానికి దూరమయ్యి, శ్రీకృష్ణుడిని దూరం చేసుకున్న వసుదేవుడి వలె కడుపుకోతను అనుభవించడం జరుగుతుంది. వారు పడే బాధ వర్ణనాతీతం. మనుషులను తీవ్రంగా ఇబ్బంది పెట్టి కలవరపెట్టె సమస్యలలో దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఎవరినైతే నీవు పూర్వజన్మలో పీడించి ఉంటావో, ఆ పాప కర్మ ఫలమే ఈ జన్మలో నీవు అనుభవించడానికి జాతకచక్రంలో అవయోగాల రూపంలో ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఈ అవయోగాలను, గ్రహదోషాలను పరిశీలించి దానికి ప్రాయశ్చిత్తములు జరిపిస్తే, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నిర్మూలించబడతాయి. ప్రస్తుత కాలంలో పరిపూర్ణ జ్యోతిష్య పరిజ్ఞానం గల జ్యోతిష్యులు దొరకాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. హస్తవాసి గల డాక్టర్లు, ధనాపేక్షలేని దైవజ్ఞులు ఈ కాలంలో ఎదురయ్యారంటే అది మన సుకృతం అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎం‌బి‌బి‌ఎస్ చదివిన వారందరికి రోగాన్ని నయం చేసే హస్త వాసి ఉండదు. అదే విధంగా జ్యోతిష్యం తెలిసిన ప్రతివారు దానిలో నిష్ణాతులు అయి ఉండరు. వాక్ శుద్ధి, చిత్త శుద్ధి లేనివారి జ్యోతిష్య ఫలితములు ఫలించవు. జాతకుడు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధమైన గ్రహస్థితులు కారణమవుతున్నాయో, ఆ చెడు గ్రహ స్థితుల వల్ల ఏర్పడే అవయోగాలు ఏమిటో, ఆ అవయోగాలకు పరిహార ప్రాయశ్చిత్తములు క్షుణ్ణంగా తెలిసుకున్న తరువాత జాతకుడు ఎదుర్కొంటున్న సమస్యకు దారి కనబడుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, గ్రహాల వల్ల ఏర్పడే అవయోగాలకు ప్రాయశ్చిత్తములు తంత్ర విధానంలో మాత్రమే ఉంటాయి. ఆ తంత్ర విధానాన్ని అనుసరించిన వారికి మాత్రమే, ఆ అవయోగాలు నిర్మూలించబడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు దొరుకుతుంది.

court cases telugu astrology

ఈ అవయోగాలు పూర్వజన్మలోని పాపకర్మలను అనుసరించి జాతకులకు అనుభవంలోకి వస్తాయి. ఇవి అందరికి ఒకే విధంగా ఉండవు. ఈ అవయోగం ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు మీ జాతక చక్రమును మీ ముందు ఉంచుకొని, కోర్టు కేసులు, శిక్షలకు దారి తీసే గ్రహస్థితులు ఏమిటో తెలుసుకుందాం. నేను చెప్పబోయే గ్రహస్థితులు మీ జాతకంలో ఉన్నాయో లేదో పరిశీలించుకోండి.

  • జన్మ లగ్నం నుండి 2వ స్థానం పై పాప గ్రహాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
  • జన్మకుండలిలో గ్రహణ యోగం ఏర్పడినపుడు, అనగా చంద్ర+రాహు లేదా చంద్ర+కేతు లేదా రవి+రాహు లేదా రవి+కేతు కలసి ఉన్నప్పుడు ఈ విధంగా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • కుజుడు+కేతు,కుజుడు+రాహు, రవి+రాహు ఈ విధమైనటువంటి గ్రహాల కలయిక వల్ల జీవితంలో తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతాయి.
  • అష్టమ స్థానంలో శని ఉన్నట్లైతే, ఆ స్థానం శని చెడు స్థానాలలో ఉన్నట్లైతే చట్టపరమైన వ్యతిరేక తీర్పును పొందవలసి వస్తుంది. మకరలగ్నం వారికి సింహరాశి అష్టమ స్థానం అవడం వల్ల, ఇది శనికి శత్రు స్థానం కావడం వల్ల, ఈ మకర లగ్నం వారికి సింహరాశిలో శని ఉండినట్లైతే కోర్టు తీర్పుల విషయంలో ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యాలగ్నం వారికి శని మేషరాశిలో గనుక ఉన్నట్లైతే కోర్టు వ్యవహారములందు ప్రతికూలతను ఇవ్వడం జరుగుతుంది. ఏ లగ్నం వారికైనా గాని లగ్నం నుండి శని 8వ స్థానంలో ఉండినట్లైతే, వారు జీవితంలో దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవటం, చట్టపరమైన చిక్కుల్లో పడటం, జరిమానాలు చెల్లించడం జరుగుతుంది. దినదినగండం నూరేళ్ళు ఆయుషు లాగా ఉంటుంది.
  •  అదే శని అష్టమ స్థానంలో మిత్ర క్షేత్రంలో ఉంటూ, ఎలాంటి పాప గ్రహ కలియిక లేకుండా ఉన్నట్లైతే, జాతకుడు కోర్టు కేసులు ఎదుర్కొన్నప్పటికి, చాలా కాలం పాటు కోర్టు కేసులు జరుగుతున్నప్పటికి, చివరగా తీర్పు మాత్రం జాతకుడికి అనుకూలంగా వస్తుంది.
  • అష్టమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కోర్టు సంబంధ వ్యవహారాల విషయంలో భరణం రూపంలో గాని, జరిమానాల రూపంలో గాని తీవ్రంగా ధన నష్టం వాటిల్లుతుంది. ఈ అష్టమ కేతువు వల్ల కోర్టు వ్యవహారాలు 99% వ్యతిరేక తీర్పులను పొందటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వాహన ప్రమాదాలు జరిగి అంగ వైకల్యాన్ని పొందటం జరుగుతుంది. ఈ అష్టమ కేతువు వల్ల సాధరణంగా విడాకుల కేసులు అయ్యి ఉంటాయి. విడాకుల కోసం కోర్టు చుట్టూ పడిగాపులు గాయటం జరుగుతుంది. ఈ అష్టమ కేతువు ఉన్నవారికి కోర్టు సంబంధ విషయంలో క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి వస్తే ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
  • అష్టమ స్థానంలో రాహువు ఉన్నట్లైతే వ్యాపార నిమిత్తం గాని, భార్యా భర్తల విషయంలో గాని, చెక్ బౌన్స్ కేసులలో గాని తొందరగా చట్ట పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ అష్టమ రాహువు వల్ల కోర్టు కేసు యొక్క తీర్పు శీఘ్రంగా వస్తుంది. ఆ తీర్పు జాతకుడికి అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అనేది జాతకుడి పూర్వజన్మ స్థానాన్ని మరియు రాహు ఉన్న రాశిని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అష్టమ రాహువు శీఘ్రంగా చట్ట సంబంధమైన సమస్యలలోకి తీసుకురావడం జరుగును.
  • అష్టమ స్థానంలో కుజుడు ఉన్నట్లైతే, ఇది ఎంతమాత్రం సరైనది కాదు అని చెప్పవచ్చు. ఈ అష్టమ కుజుడు వల్ల కోర్టు కేసుల విషయాలలో జాతకుడు అమాయకుడు అయినా కూడా, జాతకునికి 100% న్యాయం జరుగకపోవచ్చు. జరిమానాల రూపంలో ధన నష్టం జరుగుతుంది.
  • అష్టమ స్థానంలో రవి ఉన్నట్లైతే, జాతకుడికి రవి ఎలాంటి కోర్టు కేసులు ఉందనీయడు. ఒకవేళ ఇతర గ్రహ ప్రభావం వల్ల కోర్టు కేసులు ఉన్నా అవి తీరిపోయేలా చేస్తాడు. ఒకవేళ, ఈ అష్టమ రవితో కలసి ఉంటే మాత్రం ఈ కోర్టు కేసుల వల్ల పూర్వార్జితం, పూర్వీకుల నుండి పొందిన ఆస్తులను నష్టపోవడం జరుగుతుంది.
  • చట్టపరమైన సమస్యలకు కారణమైన పైశాచిక గ్రహాలకు తంత్ర విధానములోనే జాతకులు పరిహార ప్రాయశ్చిత్త హోమాదులు చేయించుకోవాలని ఇంతకు ముందు మీకు తెలియజేశాను. ఈ తాంత్రిక విధానంలో జాతకులు ఎదుర్కొంటున్న గ్రహ దోషాలు సంపూర్ణంగా నిర్మూలించబడతాయి.ముందుగా జాతకులు ఏ గ్రహం వల్ల చెడు ఫలితాలు ఎదుర్కొంటున్నారో, మీ జన్మకుండలిలో ఆ చెడు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మీరు ఇంతకు ముందు తెలుసుకున్నారు.చట్టపరమైన వివాదాలకు, కోర్టు వ్యవహారాలకు కారణమయ్యే ఆ గ్రహదోషాలకు పరిహారములు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.రవి గ్రహ దోషముకు: మండకాళి హోమముకేతు గ్రహ దోషముకు: పలాస పుష్ప సహిత కేతు గ్రస్త శ్రీ చిన్నమస్తా దేవి హోమం, శ్రీ తారా దేవి హోమంకుజగ్రహ దోషముకు: దండాయుధపాణి హోమం, వేల్ మురుగన్ బలి, మంగళన్ ప్రీతి బలి, నవనాగమండలంరాహు గ్రహం వల్ల ఏర్పడిన దోషముకు:తాంత్రిక రాహు ప్రీతి బలి, సింహికా ప్రీతి బలి

    ఒక్కొగ్రహానికి ఒక్కో విధంగా వామాచార విధానంలో గ్రహ ప్రీతి, పూజలు నిర్వహించాలి. సామూహికంగా తాంత్రిక దేవతా పూజలు, గ్రహ దోష పూజలు చేయరాదు. అందుచేత రాహు కేతు, శుక్ర, కుజ, శని గ్రహాల దోషాలకు పరిహారములు నిర్వహించే యాజ్ఞీకులు ఆ దోషం గల వ్యక్తులు తప్ప మరొకరు ఉండకుండా చూసుకోవడం మంచిది.

    తాంత్రిక పీఠాలలో జరిగే పైశాచిక గ్రహదోష నిర్మూలనకు హాజరు కావడం మంచిది. స్వయంగా హాజరు కాలేని వారు, వారి యొక్క ఫోటోను, జాతక చక్రమును, తాము విడిచిన వస్త్రమును పీఠములోని తంత్ర గురువులకు అందజేసి పూజాది హోమములు జరిపించుకోవచ్చు. ఈ తాంత్రిక పూజలు 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. కేవలం మీ పేరిట మాత్రమే గ్రహ దోష పరిహారములు నిర్వహించాలి. జాతకుని జన్మ లగ్నం నుండి 12 వ లగ్నం సమయంలో, జన్మ నక్షత్రం నుండి 4,6 నక్షత్రములలో ఈ పూజలు చేసుకోవడం వల్ల గ్రహ దోష నిర్మూలన, కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాలు, ఇష్ట కార్య సిద్ధి శీఘ్రంగా జరుగుతాయి. మీ పేరిట జరిగే పూజాకాలంలో జాతకులు పాటించవలసిన నియమాలు తప్పక పాటించాలి.

    ఈ గ్రహదోష పరిహారములు జరిగే తాంత్రిక పీఠాలు.

    కొట్టాయం – తంత్ర భగవతి పీఠం

    ఇడుక్కి     – చక్రపాణి తంత్ర పీఠం

    హరిపాద్  – మన్నారుశాల

    మంగళూరు – కాల భైరవన్ తాంత్రిక పీఠం

    ఎర్ణాకులం  – పరశురామన్ తాంత్రిక పీఠం

    త్రిశూర్     – కుట్టిచేతన్ తంత్ర విద్యా అభ్యాస పీఠం

     

    జాతకులు ఎదుర్కొంటున్న గ్రహదోషాల నిర్మూలనకు పైన వివరించిన తాంత్రిక పీఠములందు పూజలు జరిపించుకొదలచిన వారు శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించగలరు.

    జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

     

    Ph: 9846466430

    Whatsapp: wa.me/919846466430

    సర్వేజనా సుఖినోభవంతు

    ఓం శాంతి శాంతి శాంతిః

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

Related Articles:

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X