loading

వివాహ పొంతన

  • Home
  • వివాహ పొంతన

వివాహ పొంతన (Vivaha Pontana Telugu Astrology) – గుణమేళనం, జాతక పరిశీలన మరియు వైవాహిక అనుకూలత

 

         పెళ్ళి అనేది ఇద్దరి జీవితాలనే కాదు, రెండు కుటుంబాలను కలిపే శుభకార్యం. కాబట్టి కేవలం గుణాలెన్ని వచ్చాయో చెప్పి వదిలేయకుండా సంతానం, వైవాహిక జీవితం, మాంగల్య బలం వంటి ఇంకా ఎన్నో అంశాలు దృష్టిలో ఉంచుకొని వివాహ పొంతన పరిశీలించాలి. సాధరణంగా, వధూవరులకు గుణమేళన చక్రం ద్వారా ఫలితాలు నిర్ణయిస్తారు. ఈ ఒక్క గుణమేళన చక్రం ఆధారంగా ఫలితాలు సంపూర్ణంగా నిర్ణయించడం, నిర్ణయం చేయడం సరైన పద్ధతి కాదు. ఈ గుణమేళన చక్రంలో కనీసం 18 పాయింట్లు వస్తే పర్వాలేదు , ఆ పైన 36 పాయింట్ల వరకు ఎంతైనా వస్తే అన్నీ రకాలుగా యోగదాయకమని భావిస్తారు. ఈ విధంగా గుణమేళన చక్రంలో 26, 36 పాయింట్లు వచ్చాయని, చాలా విశేషమని భావించి చేసిన వివాహాలలో నూటికి 10 శాతం కూడా సఫలీకృతం కాలేదు. వివాహ సమయంలో వధూవరుల వ్యక్తిగత కర్మఫల యోగాలతో పాటు వివాహ లగ్నం, గుణమేళనం మరియు గ్రహస్థితులను కూడా తప్పక పరిశీలించాలి. వధువుకు లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ భావాధిపతులు, వారి యొక్క స్థితిగతులు, సంతానం, గుణములు, కళత్ర దోషం, మాంగల్య బలం వంటి అంశాలను పరిశీలించడంతో పాటు, మాంగల్య దోషం ఉందా లేదా అనేది కూడా జాతక స్థితులను బట్టి పరిశీలించాలి. వరునికి లగ్న, సప్తమ, అష్టమ, దశమ, ఏకాదశ స్థానములు, అనగా తనుభావము (ఆరోగ్యము, మనస్సు), భార్య స్థానాధిపతి, ఆయుః స్థానాధిపతి, ఉద్యోగ, ఆదాయాధిపతి, పూర్వజన్మ కర్మ స్థానాధిపతి, వీరిని పరిగణలోకి తీసుకొని, ఆ గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించి నిర్ణయించవలెను. పురుషునికి వీర్యకారకత్వ గ్రహము యొక్క ప్రభావము ఏ విధముగా చూపించునో పరిశీలించాలి. ఈ విధమైనటువంటి దోషాలను సంపూర్ణంగా పరిశీలించాలి. అలా కాకుండా వివాహాలు జరిపిస్తే, వివాహానంతరం స్త్రీ పురుషులలో ఎవరో ఒకరు పర సాంగత్యాలకు దారి తీయును.

 

ప్రస్తుతం చాలా మంది vivaha pontana telugu, తెలుగు వివాహ పొంతన online, telugu gunamelanam వంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కేవలం గుణాలు కలిశాయా లేదా అనే అంశం మాత్రమే కాకుండా, వధూవరుల జాతకాలు, సంతాన యోగాలు, మాంగల్య బలం మరియు వైవాహిక స్థిరత్వాన్ని కూడా పరిశీలించడం అత్యంత అవసరం. 

 

          ప్రస్తుత కాలంలో అంతటి సూక్ష్మ పరిశీలన ఏ జ్యోతిష్యులు చూడటం లేదు. పంచాంగంలో గుణమేళన చక్రం చూసి ఫలితాలు చెబుతున్నారు. ఇది ఎంత వరకు సరైన పద్ధతి? వధూ వరుల తల్లిదండ్రులు కూడా వరునికి మంచి సంపాదన, ఆస్తి ఉంటే చాలని భావించి, తమ బిడ్డ గొప్ప స్థితిపరులైన కుటుంబానికి యజమాని అవుతుందని భావించి కక్కుర్తి పడే సంధార్భాలు నా అనుభవంలో ఎన్నో చూశాను. వివాహానంతరం గొప్ప స్థితి గతులు రాకపోగా, దుర్భరమైన జీవితాన్ని వారు అనుభవించాల్సి ఉంటుంది. వధువు లేదా వరుడు దంపతులలో ఒకరు ఆత్మహత్యలు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, నిరంతరం గొడవలు, అశాంతి, చివరకు విడాకులు లేదా ద్వితీయ వివాహం, ఇవియే జరిగుతున్నాయి. 

 

            జాతకములో దోషములు, గ్రహాల అవయోగములు, ఉన్నట్లైతే వాటికి, వివాహానికి ముందుగానే పరిహారాలు జరిపించిన వారి దుష్ట ప్రభావాలు నిర్మూలించబడతాయి. వివాహం చేయడం, చేతులు దులుపుకోవడం అని భావిస్తే, తరువాతి కాలంలో ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. తమ సంతానానికి గ్రహ దోషాదుల నుండి, వాటి దుష్ప్రభావాల నుండి ముక్తి కలిగించడం గృహ యజమాని ధర్మం. వివాహం అనే అంశం జీవితంలో అత్యంత ప్రధానమైన అంశం. దాని మీద అన్నీ అంశాలు ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరాదు. కొన్ని కుటుంబాలలో వివాహనంతరం మెట్టినింటి వారికి అత్త మామలకో లేదా మరదులకు, భర్తకో అనారోగ్యం, ఆర్థిక నష్టం, కలిగిందంటే, దానికి కారణం తమ కోడలు వారి ఇంత అడుగు పెట్టిన నుండి ఇలా జరుగుతోంది అని భావిస్తారు. కొన్ని కుటుంబాలలో వారిని చులకనగా లేదా కర్కశంగా ప్రవర్తిస్తారు. ఒక విషయం ఇక్కడ మనం గ్రహించాలి. వారికి కలిగిన రోగాలకో లేదా ఆర్థిక నష్టాలకు ఆ ఇంటి కోడలు, ఆమె జాతక పరిస్థితులు ఎందుకు దోహదపడతాయో కొంచెం వివేకంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏ ఆడపిల్ల అయినా మన కూతురు వలెనే కదా! మెట్టినింటి వారు వారి కుటుంబీకుల వ్యక్తిగత గ్రహాలు, యోగాలను బట్టి వారికి మరుదులు లేదా అత్తమామలకు, భర్తకి కూడా, అవయోగాలు కలుగడం సహజం. వారి యొక్క వ్యక్తిగత జన్మకుండలిలోని లాభాధిపతి, ఆయుః స్థానాధిపతి, వ్యాధి స్థానాధిపతులు వారికి వ్యక్తిగతంగా ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది గాని తమ ఇంటికి ప్రవేశించిన కోడలి వలన కాదని గ్రహించాలి. ఒక వివాహ విషయమే కాకుండా జన్మకుండలిలో ఉన్న అవయోగాలకు మొదట్లో పరిహరాదులు, ప్రాయశ్చిత్తములు జరిపిస్తే సరిపోతుంది గదా. విజ్ఞులు గ్రహించాలి.

 

తెలుగు వివాహ పొంతన అంటే ఏమిటి?

తెలుగు వివాహ పొంతన అనేది వధూవరుల జాతకాలను పరిశీలించి వారి వైవాహిక జీవితం ఎంత వరకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే జ్యోతిష్య విధానం. ఈ ప్రక్రియలో గుణమేళనం, గ్రహస్థితులు, దశలు, సంతాన యోగాలు మరియు మాంగల్య బలం వంటి అంశాలను పరిశీలిస్తారు. అందువల్ల free తెలుగు వివాహ పొంతన ఫలితాల కంటే సంపూర్ణ జాతక విశ్లేషణ మరింత ముఖ్యమైనది.

 

గుణమేళనం (Gunamelanam) యొక్క ప్రాముఖ్యత

gunamelanam telugu విధానంలో సాధారణంగా అష్టకూట గుణమేళన చక్రం ఆధారంగా వధూవరుల అనుకూలతను అంచనా వేస్తారు. అయితే gunamelanam horoscope in telugu ప్రకారం కేవలం గుణాల సంఖ్య మాత్రమే నిర్ణయాత్మక అంశం కాదు. జాతకంలోని ఇతర గ్రహ యోగాలు మరియు దోషాలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. వివాహ పొంతనలో కుజ దోషం వంటి దోషాలను కూడా జాతక స్థితులను బట్టి పరిశీలించడం ముఖ్యమైన అంశంగా భావిస్తారు.

 

వధూవరుల జాతకం ఎందుకు పరిశీలించాలి?

vadhu varula jathakam in telugu విశ్లేషణలో వధువు మరియు వరుని వ్యక్తిగత కర్మ ఫలితాలు, ఆరోగ్యం, సంతాన యోగం, ఆర్థిక స్థితి మరియు దాంపత్య స్థిరత్వం వంటి అంశాలు పరిశీలించబడతాయి. ఈ కారణంగానే అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు కేవలం గుణమేళనంపై ఆధారపడకుండా పూర్తి జాతక పరిశీలన చేస్తారు.

 

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

 

వివాహ పొంతన అంటే ఏమిటి?

వివాహానికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి వారి అనుకూలతను తెలుసుకునే ప్రక్రియను వివాహ పొంతన అంటారు.

 

Telugu Gunamelanam అంటే ఏమిటి?

Telugu gunamelanam అనేది వధూవరుల జాతకాల మధ్య గుణాలను పోల్చి వివాహ అనుకూలతను అంచనా వేసే విధానం.

 

Gunamelanam Chart in Telugu ఎలా ఉపయోగపడుతుంది?

Gunamelanam chart in telugu ద్వారా వధూవరుల మధ్య గుణాల అనుకూలతను ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. అయితే పూర్తి జాతక విశ్లేషణ కూడా అవసరం.

 

What is Pradhanam in Telugu Marriage?

What is pradhanam in telugu marriage అంటే నిశ్చితార్థ కార్యక్రమం లేదా పెళ్లికి ముందు జరిగే అధికారిక వివాహ ఒప్పంద వేడుక అని అర్థం.

 

Free Telugu Vivaha Pontana ఫలితాలు నమ్మవచ్చా?

Free తెలుగు వివాహ పొంతన సేవలు ప్రాథమిక సమాచారం మాత్రమే అందిస్తాయి. ఖచ్చితమైన ఫలితాల కోసం పూర్తి జాతక పరిశీలన అవసరం.

 

డౌన్‌లోడ్ చేసుకునే వనరులు

త్వరలో తెలుగు వివాహ పొంతన pdf మరియు వధూవర గుణమేళనం pdf నమూనాలను అందుబాటులో ఉంచబడతాయి.

 

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబరు: 9846466430

chakrapani.vishnumaya@gmail.com