కావడి ప్రశ్న – కేరళ ప్రశ్న జ్యోతిష్య విధానం
కావడి ప్రశ్న – కేరళ ప్రశ్న జ్యోతిష్య విధానం ద్వారా మీ సందేహాలకు సమాధానాలు
కేరళ కావడి ప్రశ్న (Kavadi Prashna) అనేది ప్రాచీన ప్రశ్న జ్యోతిష్య శాస్త్రంలోని ఒక ప్రత్యేకమైన విధానం. కేరళలో ఈ విధానాన్ని అనాదిగా ఆచరిస్తున్నారు. సాధారణ జాతక పరిశీలనకు భిన్నంగా, ఇందులో వ్యక్తి జన్మ తేదీ, పుట్టిన సమయం, జన్మస్థలం తెలియకపోయినా, వ్యక్తి యొక్క మనసులో ఉన్న ఒక నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చును.
కావడి ప్రశ్న అంటే ఏమిటి? ఏ సంధర్భాలలో ఈ కావడి ప్రశ్న మార్గదర్శకంగా మారుతుంది?
కావడి అంటే గవ్వలు. సముద్రం నుండి లభించే ప్రత్యేకమైన గవ్వలను ఉపయోగించి ప్రశ్న శాస్త్రంలో ఆరూఢాన్ని నిర్ణయించి, ప్రశ్నకు సంబంధించిన ఫలితాలను పరిశీలిస్తారు.
ప్రశ్న అడిగే వ్యక్తి మనసులో ఉన్న సందేహాన్ని ఆధారంగా చేసుకుని, కావడి ప్రశ్న విధానంలో సంబంధిత సూచనలు మరియు గ్రహ ప్రభావాలను పరిశీలించి ఫలితాలను వివరించడం జరుగుతుంది.ఈ విధానం ముఖ్యంగా కేరళ ప్రశ్న జ్యోతిష్య సంప్రదాయంతో ముడిపడి ఉంటుంది.
జీవితంలో కొన్ని సంధర్భాలలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనే సంధిగ్ధములో పడతాము. మరికొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం సరైనదా, కాదా అనే సంకోచంలో పడతాము. మరి కొన్నిసార్లు రెండు దారులు ఉన్నపుడు, ఏ దారి ఎంచుకుంటే మన భవిష్యత్తు మెరుగు అవుతుంది అనే గందరగోళము కూడా ఏర్పడుతుంది. ఈ విధమైన సంధర్భాలలో భగవంతుని పై భక్తి, విశ్వాసం ఉంచి, ఈ కావడి ప్రశ్న ద్వారా ప్రశ్నను వేసినపుడు, సాక్షాత్తు ఆ భగవంతుడే నంబూద్రీల ద్వారా మీకు సరైన సందేశం ఇచ్చి, మార్గదర్శిగా ఉంటారు.
జన్మ వివరాలు లేకపోయినా కావడి ప్రశ్న అడగవచ్చా?
అవును. కావడి ప్రశ్న యొక్క ప్రత్యేకతల్లో ఇది ఒకటి. పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం తెలియకపోయినా,వ్యక్తి యొక్క మనసులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నను అడిగి ప్రశ్న జ్యోతిష్య విధానంలో సమాధానం తెలుసుకోవచ్చు. అయితే ప్రశ్న స్పష్టంగా మరియు నిజమైన ఆసక్తితో, నమ్మకంతో అడగడం చాలా ముఖ్యం.

కేరళ కావడిప్రశ్నలో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు?
మీ జీవితంలో ప్రస్తుతం ఎదురవుతున్న అనేక ముఖ్యమైన విషయాల గురించి కావడి ప్రశ్న ద్వారా లో అడిగిన ప్రశ్నలకు నూటికి నూరు శాతం ఖచ్చితమైన సమాధానాలు లభిస్తాయని నా అనుభవంలో ఋజువైంది.
వివాహానికి సంబంధించిన ప్రశ్నలు
- వివాహం ఎప్పుడు జరుగుతుంది?
- వివాహంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది?
- వివాహ జీవితం ఎలా ఉంటుంది?
- దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలకు కారణం ఏమిటి?
సంతానానికి సంబంధించిన ప్రశ్నలు
- సంతాన యోగం ఉందా?
- మాకు సంతానానికి ఆటంకాలు ఎందుకు కలుగుతున్నాయి?
- సంతాన విషయంలో మాకు ఎందుకు సమస్యలు కలుగుతున్నాయి?
ఆరోగ్యం మరియు అనారోగ్య ప్రశ్నలు
- ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రశ్నలు అడుగవచ్చు.
- దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యల గురించి అడుగవచ్చు.
- అనారోగ్యానికి సంబంధించిన జ్యోతిష్య సూచనలు కోరవచ్చు.
ఉద్యోగం మరియు వృత్తి ప్రశ్నలు
- ఉద్యోగం లభిస్తుందా?
- ఉద్యోగ మార్పు అనుకూలమా?
- వృత్తిలో ఎదురవుతున్న ఆటంకాలు ఎందుకు జరుగుతున్నాయి?
- వ్యాపారం లేదా వృత్తి అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు అడుగవచ్చు.
ఋణం మరియు ఆర్థిక ప్రశ్నలు
- అప్పుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి?
- ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి?
- ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనబడతాయా?
విదేశీ ప్రయాణం
- విదేశాలకు వెళ్లే అవకాశం ఉందా?
- విదేశంలో ఉద్యోగం చేస్తూ, స్థిరపడగలమా?
- విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలు అడుగవచ్చు.
కుటుంబం మరియు దాంపత్య సంబంధిత ప్రశ్నలు
భార్య, భర్త, కుటుంబ సభ్యులు లేదా బాగా కావల్సిన వారి యొక్క ముఖ్యమైన విషయాల గురించి ప్రశ్నలు వేయవచ్చు.
కేరళ కావడి ప్రశ్న ఎలా జరుగుతుంది?
కావడి ప్రశ్నలో ముందుగా ప్రశ్న అడిగే వ్యక్తి తనకు తెలుసుకోవాలనుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఆ ప్రశ్నను ఆధారంగా చేసుకుని సంప్రదాయ ప్రశ్న జ్యోతిష్య విధానంలో కావడి ప్రశ్నమును ఉపయోగించి ఆరూఢాన్ని నిర్ణయించి, సంబంధిత ఫలితాలను పరిశీలిస్తారు.
అనుభవం కలిగిన ప్రశ్న జ్యోతిష్య నిపుణులు అయిన కేరళ నంబూద్రీలు ప్రశ్నకు సంప్రదాయ విధానాలను అనుసరించి ప్రశ్నకు సంబంధించిన విషయాలను వివరిస్తారు.
కావడి ప్రశ్న అడిగే ముందు పాటించాల్సిన నియమాలు ఏమిటి?
సంప్రదాయ పద్ధతిని అనుసరించేవారు ప్రశ్న అడగడానికి ముందు తలస్నానం చేసి, శుచిగా ఉండటం మంచిదిగా భావిస్తారు. ప్రశ్నను భక్తి మరియు ఏకాగ్రతతో అడగడం కూడా ఈ సంప్రదాయంలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
జాతకులు నేరుగా హాజరు కాలేకపోయినా, ఫోన్ ద్వారా కూడా కావడి ప్రశ్న సేవను పొందే అవకాశం ఉంది.
కావడి ప్రశ్నను ఎందుకు ఎంచుకోవాలి?
మీ జన్మ తేదీ, సమయం వివరాలు తెలియకపోయినా ప్రశ్న అడగగలగడం కేరళ కావడి ప్రశ్న యొక్క ముఖ్యమైన ప్రత్యేకత.
ప్రస్తుతం మీ జీవితంలో ఎదురవుతున్న ఒక నిర్దిష్ట సమస్య లేదా సందేహంపై దృష్టి పెట్టి ప్రశ్న అడగవచ్చు. వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం, ఋణం, విదేశీ ప్రయాణం వంటి అనేక అంశాలపై ప్రశ్నను వేయవచ్చు.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Ph: 9846466430
