ఎంత కష్టపడినా జీవితంలో విజయం ఎందుకు రావడం లేదు? మీ జాతకంలో ఈ గ్రహస్థితులు ఉన్నాయా?
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. మంచి ఉద్యోగం సంపాదించాలి, వ్యాపారంలో అభివృద్ధి సాధించాలి, ఆర్థికంగా స్థిరపడాలి, సమాజంలో గౌరవం పొందాలి అని ఎన్నో కలలు కంటుంటారు. వాటిని నిజం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతుంటారు. అయితే, కొంతమందికి మాత్రం, ఎంత ప్రయత్నించినా అనుకున్న ఫలితం దక్కదు. వారి కష్టానికి తగ్గ గుర్తింపు కూడా దక్కదు. కావాలనుకున్న అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. ఉద్యోగంలో ఎదుగుదల వస్తుందనుకొని ఎంతో ఆశగా ఉన్నప్పటికి, అర్హత ఉన్నప్పటికి ఉన్నతస్థాయికి చేరుకోలేరు. లాభాలను ఆశించి, ఎన్నో ప్రణాళికలు వేసి, ఎంతో తెలివిగా వ్యాపారం మొదలు పెడితే, అందులో లాభాల కంటే ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. ఎంత కష్టపడినా నాకు విజయం ఎందుకు రావడం లేదు? నా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, వృత్తి, ఆర్థిక స్థితి, అదృష్టం వంటి అంశాలను పరిశీలించడానికి జన్మకుండలిలోని కొన్ని ముఖ్యమైన భావాలను, వాటి అధిపతులను, గ్రహస్థితులను పరిశీలించాలి. ముఖ్యంగా లగ్నం, షష్ఠ భావం, భాగ్యస్థానం, కర్మస్థానం, లాభస్థానాలు, శని, రాహు, కేతు గ్రహాలు, వాటి గ్రహ దశలు, అంతర్దశలు అన్నీ కూడా కీలకపాత్రను పోషిస్తాయి. అలా అని, కేవలం ఒక్క గ్రహం లేదా ఒక్క గ్రహస్థితి మాత్రమే ఒక వ్యక్తి విజయాన్ని నిర్ణయించదు. మొత్తం జాతకాన్ని పరిశీలించినప్పుడే సంపూర్ణ కారణం, ఫలితం తెలుస్తుంది. అందువలన వీటి గురించి ఇక్కడ మీకు క్లుప్తంగా వివరిస్తాను.

లగ్నభావం బలహీనంగా ఉంటే జాతకుని యొక్క విజయానికి ఆటంకాలు కలుగుతాయా?
జన్మకుండలిలో లగ్నం అనగా తనుభావం ఆని కూడా అంటారు. అనగా జాతకుని యొక్క శారీరక స్థితి, ఆత్మ విశ్వాసం, జీవితాన్ని ఎదుర్కొనే విధానం, వ్యక్తిత్వం అన్నీ కూడా ఈ లగ్నభావం నిర్ణయిస్తుంది. మనం మన రోజు వారి జీవితంలో, ఎంతో ప్రతిభ ఉన్న వారిని చూస్తూనే ఉంటాము. అందులో కొందరు అంచలంచెలు ఎదుగుతారు. కానీ మరికొందరు మాత్రం, ప్రతిభ ఉన్నప్పటికి, వారికి గుర్తింపు ఉండదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికి, ధైర్యం, ఆత్మ విశ్వాసం కూడా ముఖ్యమైన కారణాలు. లగ్నభావం బలహీనంగా ఉన్నవారికి, ధైర్యం తక్కువగా ఉండటం, ఆత్మ విశ్వాసం లోపించడం వలన, వారిలో ఉన్న ప్రతిభకు కూడా గుర్తింపు లోపిస్తుంది. దీని వలన జాతకుడు తనలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వంద రకాలుగా ఆలోచించి గందరగోళంలో పడతారు. వీరికి ప్రతిభ ఉన్నా కూడా, ప్రయత్నంలో లోపం ఉంటుంది. ఇది జాతకుని యొక్క విజయానికి ఆటంకం కలుగజేస్తుంది. కానీ కేవలం లగ్న భావం మాత్రమే జాతకుని అపజయానికి కారణం కాదు. మిగిలిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలించాలి.
షష్ఠ భావం బలహీనంగా ఉంటే పోటీ జీవితంలో ఇబ్బందులు వస్తాయా?
జన్మకుండలిలో ఆరవ భావమును శతృ, రోగ, ఋణ స్థానముగా చెప్పబడుతుంది. కానీ పోటీ రంగంలో ఉన్న వారి విజయం పరిశీలనకు షష్ట్య భావమును పరిశీలించాలి. శతృవులు, అప్పులు, రోగాలు, పోటీ రంగాలు, సేవలు ఈ అంశాలు అన్నీ కూడా జన్మకుండలిలోని ఆరవ భావం తెలియజేస్తుంది.
కొందరు పోటీ పరీక్షలు వ్రాసి, అందులో విజయం సాధించి, దాని ద్వారా ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటారు. కానీ అందరికీ ఇది సాధ్యం కూడా కాదు. ఈ అంశాన్ని వ్యక్తిగత జన్మకుండలిలో ఆరవ భావం ద్వారా తెలుస్తుంది. ఆరవ భావం లేదా ఆ స్థానాధిపతి అనుకూలంగా లేకపోతే, ఆ జాతకులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, వ్రాసే పోటీ పరీక్షలు అన్నిటిలో కూడా ఆటంకాలు, అపజయాలు ఎదురవుతాయి. కానీ కేవలం ఈ ఆరవ భావం వల్ల మాత్రమే సంపూర్ణంగా అపజయమే కలుగుతుంది అని కూడా నిర్ధారించలేము. కొన్ని సార్లు ఆలస్యం అయినా కూడా విజయం సాధించవచ్చు. అది కేవలం జాతక పరిశీలన ద్వారా మాత్రమే జ్యోతిష్యులు చెప్పగలరు.
భాగ్యస్థానం బలహీనంగా ఉంటే అదృష్టం ఆలస్యంగా కలుగుతుందా?
జన్మకుండలిలో తొమ్మిదవ భావాన్ని భాగ్యస్థానంగా పిలుస్తారు. ఈ భావం జాతకుడి యొక్క అదృష్టం, ధర్మం, గురువులు, పెద్దల ఆశీస్సులు, ఉన్నత విద్య, పుణ్యఫలాలు వంటి విషయాలను తెలియజేస్తుంది. ఇతను చాలా అదృష్టవంతుడు అనే మాటను మనం వింటూనే ఉంటాము. ఈ అదృష్టం అనే మాటను మన జన్మకుండలిలో ఎంతవరకు ఉంది అనేది ఈ నవమ భావం మనకు తెలియజేస్తుంది.
కొంతమంది ఎంత కష్టపడినా చివరి సమయంలో అవకాశాలు చేజారిపోతుంటాయి. మరికొందరికి ఇతరుల సహకారం లేదా సరైన మార్గదర్శకత్వం లభించక అవకాశాలు చేజారుతూ ఉంటాయి. ఇలాంటి అంశాలను పరిశీలించేటప్పుడు భాగ్యస్థానం, భాగ్యాధిపతి, గురుగ్రహ స్థితి, వాటిపై ఇతర గ్రహాల ప్రభావాలను జ్యోతిష్యులు పరిశీలించి ఫలితాన్ని చెబుతారు. ఈ నవమ స్థానాధిపతి బలహీనంగా ఉన్నా లేదా ప్రతికూల గ్రహాలతో సంగమించినా, జాతకుడికి అదృష్టం వరించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే భాగ్యస్థానం ఒక్కటే అదృష్టాన్ని నిర్ణయించదు. లగ్నం, కర్మస్థానం, లాభస్థానములను కూడా కలిపి చూడాలి.
ముఖ్య గమనిక: జన్మకుండలిలోని 1,6,9,10,11 స్థానాలను, శని, రాహు కేతు గ్రహ స్థితి, సంగమములను పరిశీలించిన తరువాతే జాతకుడికి విజయం ప్రాప్తిస్తుందా లేదా అన్న విషయం తెలుస్తుంది. విజయం వరించే అవకాశం ఉన్నప్పటికి, కొన్ని గ్రహాల వలన కలిగే ఆటంకములను ముందే తెలుసుకొని, ఆ గ్రహానికి తగిన పరిహారాలు చేసుకున్న యెడల ఆటంకములు తగ్గి, విజయం త్వరగా చేరువవుతుంది. ఇది కేవలం వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే చెప్పగలము.
దశమ భావం లేదా కర్మస్థానం బలహీనంగా ఉంటే వృత్తిలో ఎదుగుదల ఆలస్యమవుతుందా?
జ్యోతిష్య శాస్త్రంలో పదవ భావాన్ని దశమ స్థానం లేదా కర్మస్థానం అంటారు. ఈ భావం జాతకుడి యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, సామాజిక గౌరవం, బాధ్యతలు, అధికార స్థానం వంటి అంశాలను తెలియజేస్తుంది.
జాతకుడు వృత్తిపరంగా ఎంతవరకు ఎదగగలడు? చేసే ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుందా? వ్యాపారంలో లాభాలు గడిస్తాడా? తన ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందా? అనే అంశాలను ఈ దశమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. దశమాధిపతి బలహీనంగా ఉన్నా, అష్టమ లేదా ద్వాదశ స్థానాల్లో ఉన్నా, ప్రతికూల గ్రహాలతో సంగమించినా వృత్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చును.
లాభస్థానం బలహీనంగా ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుందా?
జన్మకుండలిలో పదకొండవ భావాన్ని లాభస్థానంగా చెబుతారు. జాతకుడి యొక్క ఆదాయం, లాభాలు, కోరికల నెరవేర్పు, గొప్ప పరిచయాలు, ఆశించిన ఫలితాలు వంటి అంశాలను అన్నీ ఈ భావం తెలియజేస్తుంది.
కొంతమంది జాతకులకు మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ, ఎంతకాలం అయినా సరే ఉద్యోగం ప్రమోషన్ రాకపోవడం, ఆదాయం పెరగకపోవడం జరుగుతూ ఉంటుంది. మరికొందరు వ్యాపారంలో ఎంతో శ్రమించినా, ఎంతటి ప్రణాళికలు వేసినా సరే, ఆశించిన లాభాలను పొందలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో లాభస్థానం, లాభాధిపతి, రెండవ భావం, దశమ భావం మధ్య ఉన్న సంబంధాలను పరిశీలించి జ్యోతిష్యులు ఫలితాలను నిర్ణయిస్తారు.
లాభాధిపతి బలహీనంగా ఉన్నా లేదా ప్రతికూల గ్రహాలతో సంగమించినా, జాతకులకు తమ ఆదాయం, లాభాల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.
శని గ్రహం వల్ల విజయం ఆలస్యమవుతుందా?
జ్యోతిష్య శాస్త్రములో శని గ్రహాన్ని కర్మ కారకుడిగా, క్రమశిక్షణకు, శ్రమకు, బాధ్యతలకు, సహనానికి కారకుడిగా సూచిస్తారు. శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఏ పనిలోనైనా సరే ఫలితాలు ఆలస్యంగా లభించడం, చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేయాల్సి రావడం జరుగుతాయి. ముఖ్యంగా జాతకుడికి శని దశ, అంతర్దశలు జరిగే సమయాల్లో లేదా 2, 9, 10, 11 స్థానాధిపతుల అంతర్దశలలో ఈ ఆలస్యం జరుగుతుంది.
శని కేవలం అశుభ ఫలితాలనే ఇస్తాడని అనుకోకూడదు. కర్మకారకుడైన శని వలన కలిగే ఆలస్యం ఏదైనా సరే, అది జాతకునికి చివరకి శుభంగానే ముగుస్తుంది. శని బలంగా, అనుకూలంగా ఉన్న జాతకులకు క్రమశిక్షణతో కూడిన కృషి, స్థిరమైన ఎదుగుదల, బాధ్యతాయుతమైన పదవి లేదా ఉద్యోగం జాతకునికి ప్రసాదిస్తాడు.
కొంతమంది జాతకులు తమ చిన్న వయస్సులో ఎన్ని కష్టాలు ఎదురైనా, తరువాతి కాలంలో ఉన్నత స్థాయి, మంచి ఆర్థిక అభివృద్ధి సాధించే అవకాశాలను శని సంబంధిత దశలు, యోగాల ద్వారా జాతకుడు పొందుతాడు.
రాహు, కేతువుల ప్రభావం వల్ల జీవితంలో స్థిరత్వం లేదా విజయం లోపిస్తుందా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా చెప్పబడతారు. రాహు కేతు గ్రహాలు తమకు తాముగా ఏ ఫలితాలను ఇవ్వలేవు. వాటితో సంగమించిన గ్రహాల ద్వారా గాని లేదా ఆ స్థానాధిపతుల ద్వారా గాని ఫలితాలను జాతకుడికి ఇస్తాయి. అందుకని జన్మకుండలిలో ఏ భావంలో రాహు-కేతువులు ఉన్నారు? ఏ గ్రహాలతో సంగమించి ఉన్నారు? ఏ గ్రహాల దృష్టిని పొందుతున్నాయి? అనే అంశాలు, వాటి ఫలితాలను జ్యోతిష్యులు పరిశీలిస్తారు.
రాహువు జాతకుడిలో ఆశయాన్ని, ఆకాంక్షలను, అసాధారణ మార్గాలను, ఆకస్మిక మార్పులను సూచిస్తాడు. కేతువు జాతకుడిలో వైరాగ్యం, విరక్తి, అంతర్ముఖత, ఆధ్యాత్మికత వంటి అంశాలను సూచిస్తాడు.
జన్మకుండలిలో 1, 9, 11 స్థానాధిపతులతో, రాహు కేతువులకు ఏ విధమైన దృష్టి లేదా సంబంధం ఉంది అనే పరిశీలనలో జాతకుని యొక్క వృత్తి, ఆశయాలు, నిర్ణయాలు, జీవిత దిశపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుస్తుంది.
జాతకుని జీవితంలో ఆలస్యంగా అయినా సరే, విజయం అందించే రాజయోగాలు గురించి పార్ట్-2లో తెలుసుకుందాము
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి.
