loading

శాప యోగం అంటే ఏమిటి? శని రాహు సంగమం వల్ల కలిగే ఫలితాలు

  • Home
  • Blog
  • శాప యోగం అంటే ఏమిటి? శని రాహు సంగమం వల్ల కలిగే ఫలితాలు

శాప యోగం అంటే ఏమిటి? శని రాహు సంగమం వల్ల కలిగే ఫలితాలు

శాపయోగం అంటే ఏమిటి? శని రాహు సంగమం వలన కలిగే ఫలితాలు ఏమిటి?

జన్మకుండలిలో శని, రాహు కలసి ఒకే రాశిలో సంగమిస్తే, ఆ జాతకులకు శాప యోగం ఉన్నట్టు గుర్తించాలి. జన్మకుండలిలో మిగిలిన గ్రహాల వలన ఎంతటి మంచి యోగాలు ఉన్నప్పటికి, శాప యోగం ఉంటే మాత్రం, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎందుకనగా గత జన్మ పాప కర్మల వలన ఈ శాప యోగం ఏర్పడుతుంది.

               శని, రాహు సంగమం వలన కలిగే శాప యోగం కారణంగా, జాతకుడు మానసిక స్థిమితం కోల్పోతాడు. కొంతమంది ఇంట్లో నుండి పారిపోవడం లేదా కారణం తెలియకుండా ఆత్మహత్య ధోరణి ఏర్పడి ఆతమహుతి చేసుకోవడం వంటి ఉపద్రవాలకు ఈ సంగమం కారణం అయ్యి ఉండవచ్చు. శనికి స్వస్థానాలైన మకర, కుంభ రాశులలో ఈ శని, రాహు సంగమం జరిగితే, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గత జన్మలో చేసుకున్న పాప కర్మల వల్ల మాత్రమే ఈ శాప యోగం జాతకులకు ప్రాప్తిస్తుంది. శని రాహు గ్రహాలు సంగమించిన జాతకులకు తమ వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో, ఒత్తిడి, టెన్షన్లు, ఆందోళనలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యల ప్రభావం అనేది జన్మకుండలిలో ఉన్న శని, రాహువుల బలాలను బట్టి ఆధారపడి ఉంటుంది.  

            గత జన్మలో స్త్రీలను మానభంగం చేసిన వారికి, కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టు విడగొట్టిన వారికి, అధికారం లేదా ఆస్తి కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను హతమార్చినవారికి, ఇతరులను వివాహం చేసుకునేందుకు జీవిత భాగస్వామిని హతమార్చిన వారికి, బలవంతంగా గర్భవిచ్ఛితులు జరిపించినవారికి, కడుపుతో ఉన్న స్త్రీని మానభంగం చేయడం లేదా హతమార్చడం చేసినవారికి, చంటి పిల్లలను హింసించినవారికి, పిల్లలను అపహరించి, హతమార్చినవారికి, తల్లిదండ్రులను హతమార్చి పిల్లలను అనాధాలుగా మార్చిన వారికి, ఈ జన్మలో జన్మకుండలిలో శాప యోగముతో జన్మిస్తారు.

శాప యోగం అనేది వంశ పారపర్యంగా వస్తుందా?

ఏ దుష్కృతానికైనా అయినా, ఏ శాపానికి అయినా ప్రాయశ్చిత్తం తప్పనిసరి. జన్మకుండలిలో శని రాహువులు సంగమించి శాప యోగం ప్రాప్తించిన జాతకులు ప్రాయశ్చిత్తములు చేసుకోకపోతే, వీరు గతించి మళ్ళీ వీరి వంశములో ఉన్న వారికే జన్మించి, ఈ శాపము యొక్క ఫలితములను అనుభవించడం కొనసాగిస్తారు. అదే కర్మ యోగం.

శాప యోగం వలన ఏర్పడే ప్రభావములు ఏమిటి?

జన్మకుండలిలో శాప యోగం ఉన్న జాతకులకు సంతాన విషయంలో, సంతానంతో ఉన్న సంబంధాల విషయంలో, సంతానం యొక్క వివాహం విషయంలో ఎన్నో అడ్డంకులు, సమస్యలు ఏర్పడతాయి. ఈ శాప యోగం వలన కొందరు తమ వృద్ధాప్య సమయంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. వీటి ప్రభావములలో కొన్నిటిని ఇక్కడ వివరిస్తాను.

  • శాప యోగం వలన వివాహం యోగం లేకపోవడం గాని లేదంటే ఇష్టం లేని ఆలస్య వివాహం జరగడం గాని జరుగుతుంది.
  • చిన్న వయస్సులోనే ఏమి తెలియక ప్రేమ వివాహం చేసుకొని ఇబ్బందుల పాలవ్వడం.
  • డబ్బు లేదా శృంగారం కోసం భర్త/భార్య చేతిలో మోసపోయి, విడాకులకు దారి తీయడం.
  • అతి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడం లేదా తల్లిదండ్రులు విడిపోవడం.
  • జీవితంలో చాలా కాలం భర్తను లేదా భార్యను కోల్పోయి బ్రతకడం.
  • ఒంటరి జీవితాన్ని భరించలేక తరచూ ఆవేదనకు లోనయ్యి, ఆత్మాహుతి ధోరణి ఏర్పడుతుంది. కానీ చనిపోయెందుకు ధైర్యం ఉండదు.
  • ఎవరో వీరితో మాట్లాడుతున్నట్టు భ్రమించడం, ఎవరో వీరిని చంపేస్తారు అని భయపడటం లాంటి భ్రమలు కలుగుతాయి.

శని రాహు సంగమం ఏ భావంలో కలిగితే ఏ విధమైన ఫలితాన్ని జాతకుడు ఎదుర్కొంటాడు?

  • లగ్నంలో శాప యోగం: జన్మకుండలిలో లగ్నంలో శని రాహు సంగమం జరిగితే, ఆ జాతకునికి ఎల్లప్పుడూ ప్రతికూల ఆలోచనలు కలుగుతూ, నిరంతరం ఆవేదనకు గురి అవుతూ ఉంటాడు. దీని వలన ఆరోగ్యం పై ప్రభావం పడి, రోగనిరోధక శక్తి లోపిస్తుంది. వైద్య సహాయం కావాల్సి వస్తుంది/
  • ద్వితీయంలో శాప యోగం: జన్మకుండలిలో 2వ భావంలో శని రాహు సంగమం జరిగితే, అది జాతకుని యొక్క మాట తీరు పై, కుటుంబ గొడవల పై, డబ్బు రాబడి పై, తోటి ఉద్యోగులతో ఉన్న సంబంధాల పై ప్రభావం పడుతుంది.
  • తృతీయంలో శాప యోగం: జన్మకుండలిలో 3వ భావంలో శని రాహు సంగమం జరిగితే, ఆ జాతకునికి జీవితంలో అభివృద్ధి తగ్గుతుంది. తోబుట్టువులతో ఆనందం ఉండదు.
  • చతుర్థంలో శాప యోగం: జన్మకుండలిలో 4వ భావంలో శని రాహు సంగమం జరిగితే, ఈ జాతకుడు ఏ ఇంట్లో ఉన్నా కూడా సంతోషం, స్థిరత్వం అనేది ఉండదు. దీని వలన స్థిరాస్తులు, వ్యక్తిగత అనుబంధాలు, వ్యక్తిగత సంపద మీద తీవ్ర ప్రభావం పడుతుంది. శని రాహువులు ఈ విషయాలలో జాతకునికి గందరగోళాన్ని సృష్టిస్తారు.
  • పంచమంలో శాప యోగం: జన్మకుండలిలో 5వ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకుడు తన విద్యను పూర్తి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి కన్నా వయస్సులో పెద్దవరైనా అన్నలు లేదా అక్కలతో విపరీతమైన గొడవలు జరుగుతాయి. సంతానం కలుగకపోవచ్చు లేదా కలిగిన సంతానానికి అనారోగ్యం కలుగవచ్చు.
  • షష్ట్య భావంలో శాప యోగం: జన్మకుండలిలో 6వ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకులు గుండె పోటు, రక్త సంబంధిత సమస్యలు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, విపరీత అప్పులు చేయడం, జూదం ఆడటం వంటి తీవ్ర అలవాట్లు ఏర్పడటం జరుగుతుంది.
  • సప్తమ భావంలో శాప యోగం: జన్మకుండలిలో 7వ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, ఆ జాతకులకు వృత్తిపరమైన భాగస్వాములతో, తోటి ఉద్యోగులతో శతృత్వాలు, విబేధాలు ఏర్పడతాయి. ఈ సంగమం వలన ఇంట్లో తమ జీవిత భాస్వామితో ఉన్న సంబంధం ఎలా ఉంటుంది అంటే, తాను నివశిస్తున్న ఇల్లే ఒక యుద్ధ రంగంలా తోస్తుంది. జీవిత భాగస్వామి యాక్సిడెంట్లో చనిపోవడం లేదా తనతో విడిపోయి వేరే వివాహం చేసుకోవడం జరుగుతుంది.
  • అష్టమంలో శాప యోగం: జన్మకుండలిలో అష్టమ స్థానంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకునికి తీవ్ర అనారోగ్యము, ఆత్మీయులతో విడిపోవడం, రహస్య సంబంధాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది.
  • నవమంలో శాప యోగం: జన్మకుండలిలో నవమ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకునికి అదృష్ట యోగం అనేది చాలా తక్కువే అని చెప్పాలి. తండ్రితో విబేధాలు రావడం లేదా తండ్రిని చిన్నతనంలోనే కోల్పోవడం జరుగుతుంది. కానీ తీవ్రమైన కష్టం చేసిన తరువాత వృత్తి పరంగా విజయం లభిస్తుంది.
  • దశమంలో శాప యోగం: జన్మకుండలిలో దశమ భావంలో శని రాహు సంగమం ఏర్పడటం వలన వృత్తి పరంగా, వ్యక్తిగత పరంగా చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ప్రభుత్వ పరమైన శిక్షలు, జరిమానాలు కలిగే అవకాశం ఉన్నది.
  • ఏకాదశ భావంలో శాప యోగం: జన్మకుండలిలో ఏకాదశ భావంలో శని రాహు సంగమం ఏర్పడటం వలన జూదం లేదా బెట్టింగుల ద్వారా లాభాలు గడిస్తారు. కానీ సంతానము మరియు అక్కా లేదా అన్నల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుంది.
  • ద్వాదశ భావంలో శాప యోగం: జన్మకుండలిలో ద్వాదశ భావంలో శని రాహు సంగమం ఏర్పడటం వలన అనైతిక లేదా వావి వరుసలు లేని సంబంధాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో చాలా సమస్యలు వస్తాయి. వ్యక్తిగత సంబంధాలలో ఆనందం అనేది లభించదు.

గమనిక: శని రాహు గ్రహాలు జన్మకుండలిలో వారు ఉన్న స్థానాలు అనుసరించి, శుభాశుభా ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అందువలన వ్యక్తిగత జనంకుండలి పరిశీలన ద్వారా మాత్రమే ఎవరికి ఏ విధమైన ఫలితములు వస్తాయి అనేది కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలన చేసి చెప్పగలరు.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి. 

Related Articles: 

Leave a Reply