జ్యోతిష్య శాస్త్ర రీత్యా దంపతులు విడిపోవడం లేదా విడాకులు తీసుకోవడం :

వైవాహిక దంపతుల మధ్య విడిపోవడం లేదా విడాకులు అను సంధర్భాలు రావడం ఇప్పటి కాలములో చాలా సహజంగా మారిపోయింది. వివాహం చేసుకోడానికి పట్టే సమయం విడాకులు తీసుకోవడానికి పట్టడం లేదు. సామాజిక పరంగా విడాకులకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ కేవలం జ్యోతిష్య శాస్త్ర రీత్యా మాత్రమే చర్చించాలి. జ్యోతిష్యునిగా నాకు ఉన్న అనుభవములో వివాహం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఆలస్య వివాహం చేసుకొని కనీసం ఒక సంవత్సరం నిండక ముందే దంపతులు ఇద్దరు విడిపోవడం గాని లేదా విడాకుల నిర్ణయానికి గాని వస్తున్నారు.   

జాతకరీత్యా దంపతులు విడిపోవుటకు లేదా విడాకులు తీసుకునేందుకు గల కారణాలు ఏవి?

విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్న దంపతులకు సహజ కారణములు కొన్ని నా అనుభవములో తెలిసినవి మీకు వివరిస్తున్నాను.

 • దంపతుల మధ్య శృంగార బంధం సరిగా సాగకపోవడం లేదా దంపతులలో ఒకరికి శృంగార సామర్థ్యం లేకపోవటం.
 • జాతకములో ద్వికళత్రయోగం (రెండు వివాహములు) ఉండటం.
 • పెళ్ళికిముందు వేరొకరితో ఉన్న ప్రేమ వ్యవహారమును ఇంకొకరితో పెళ్లి అయిన తరువాత కూడా కొనసాగించడం.
 • వివాహం అయ్యి చాలా కాలం అయినా పిల్లలు లేకపోవటం.
 • కొత్త బంధం ఏర్పడిన తరువాత, మొదటి బంధమును నిర్లక్ష్యము చేయటం.
 • వివాహము అయిన తరువాత చాలా కాలం పాటు అనారోగ్యంగా ఉండటం.
 • వివాహం తరువాత పేదరికం ఎదురవటం.
 • వివాహేతర సంబంధములు ఏర్పడటం

విడాకులు-జ్యోతిష్య కారణాలు

ఇక జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉన్న కారణాలు తెలుసుకుందాం:

జ్యోతిష్య శాస్త్రములో నాకున్న 20 సంవత్సరాల అనుభవములో విడాకులకు లేదా దంపతులు విడిపోవుటకు గల కారణమైన ముఖ్య గ్రహములు “రవి,కుజుడు,రాహువు,శని,కేతువు” ఇక భావాల విషయానికి వస్తే అష్టమ భావం,అధిపతి మరియు ద్వాదశ భావం, అధిపతి.

దంపతులు విడిపోవటానికి ‘రవి’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

రవికి సహజంగా వేడి తత్వము ఉంటుంది. జాతకములో ఏ విధంగా అయినా రవి సప్తమ భావముకు సంబంధం ఏర్పడినా వైవాహిక జీవితములో చాలా సమస్యలు వస్తాయి. రవి నీచపడినా లేదా శత్రుస్థానములో ఉన్నా మరియు సప్తమ భావానికి సంబంధం ఉంటే జాతకులకు వైవాహిక జీవితములో సమస్యలు ఏర్పడతాయి. ఆధిపత్యం చూపించటానికి, అధికారం చెలాయించటానికి రవి కారకుడు అవుతాడు. కావున ఈ దంపతుల మధ్య సమస్య ముందు అహముతో మొదలవుతుంది. రవి లగ్నములో గాని సప్తమములోగానీ ఉంటే జాతకునికి విడాకులకు దారి తీస్తుంది.

         రవి ఒకవేళ నీచ, శత్రు స్థానములలో లేకుండా కేవలం లగ్న లేదా సప్తమ భావములో ఉంటే దంపతులు  ఇద్దరు ఒకరికొకరు దూషించుకుంటూ, చెడు మాటలతో తిట్టుకోవడం, పోట్లాడుకోవటం లాంటివి జరుగుతాయి కానీ విడాకులు తీసుకోరు.  అదే ఒకవేళ రవి శుక్రుడితో కలసి 2వ భావములో గాని లేదా 4వ భావములో గాని లేదా సప్తమ భావములో గాని లేదా నవమ భావములో గాని ఉన్నట్లైతే విడాకులు కచ్చితంగా జాతకుని జీవితములో జరుగుతుంది.

దంపతులు విడిపోవటానికి ’కుజుడు’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు 2వ భావములో, 4వ భావములో, 7వ భావములో, 8వ భావములో, 12వ భావములో ఉంటే “కుజదోషము”  అని చెబుతారు. కుజుడు తీవ్రమైన గొడవలకు, వివాదాలకు, శారీరక  హింసకు కారకుడు అవుతాడు. కాబట్టి కుజుడు వైవాహిక సంబంధిత భావాలలో అంటే ముఖ్యంగా లగ్నలో లేదా 7వ భావములో కుజుడు ఉంటే , జాతకుడి కుటుంబములో తీవ్రమైన గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు అధికంగా ఉంటాయి.

         ఒకవేళ కుజుడు 7వ భావముకు మాత్రమే సంబంధము ఉంటే అప్పుడు గొడవలు, కొట్లాటలు కుటుంబము మొత్తములో కాకుండా కేవలం భార్య, భర్తల మధ్య మాత్రమే ఉంటాయి.

         స్త్రీ జన్మకుండలిలో పైన వివరించిన భావాలతో పాటుగా 3వ భావం మరియు 11వ భావం లేదా ఆయా అధిపతులు నీచపడితే “ఆ స్త్రీకి అత్తామామల నుండి శారీరక మరియు మానసిక హింస, ఒత్తిడి” ఏర్పడతాయి.

        విడాకులు కలుగడానికి ముఖ్య కారకుడు కుజుడు , అంతేకాకుండా జీవితములో సగ భాగం కోర్టు కేసులకే అంకితం అయిపోతుంది.

         జాతకుడికి కుజుడు వలన రాజయోగము కలిగి, ఎలాంటి పాప గ్రహ దృష్టి లేనపుడు జాతకుడి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడచిపోతుంది.

దంపతులు విడిపోవటానికి ‘శని’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

దంపతులకు విడాకులు కలుగుటకు ఈ శని గ్రహం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శని వైవాహిక స్థానాలకు ముఖ్యమైన లగ్నం లేదా సప్తమ భావాలలో ఉండినట్లైతే జాతకుడు ఎంతో గోప్యమైన లక్షణమును కలిగి ఉంటాడు. అంతేకాకుండా భాగస్వామిని నిత్యం అనుమానిస్తూ ఉంటాడు.

         ఒక వ్యక్తి యొక్క వైవాహిక స్థానానికి మరియు శనికి సంబంధము ఉంటే, ఆ వ్యక్తికి వైవాహిక జీవితములో ఎప్పటికీ సంతృప్తి కలుగదు. శని మందగమనుడు. కాబట్టి శని కలిగించే ప్రభావాలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి జాతకులు విషయాలను ఎంతోకాలం పాటు గోప్యంగా తమలో తాము ఉంచుకుంటారు. ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినపుడు అకస్మాత్తుగా ఆ విషయములు బయట పెడతారు. కారణంగా జీవితములో కోలుకోలేని దెబ్బతింటారు.  ఒక్కోసారి శని దంపతులను శాశ్వతంగా దూరము చేస్తాడు. చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా ,విడిగా ఉంటారు. దంపతుల మధ్య అపర్థాలు చెలరేగటం, గొడవలు కలగటం, వివాదాలు, చివరగా విడాకులు వీటన్నిటికి శని కారకుడు అవుతాడు. నపుంసకత్వానికి, పుత్రుడు కలుగకపోవడానికి శని కూడా కారకుడు అవుతాడు. ఒక్కోసారి ఈ లక్షణాలు కూడా విడాకులకు దారి తీస్తాయి.

దంపతులు విడిపోవటానికి ‘రాహువు’ ఏ విధంగా కారకుడు అవుతాడు ?

వైవాహిక స్థానాలకు, రాహువుకు సంబంధము ఉంటే విడాకులు కలుగుతాయి. విడదీయటములో రాహువు ముఖ్య కారకుడు అవుతాడు. ముఖ్యంగా 7వ భావ రాహువు వలన జాతకుడు లేదా జాతకురాలు  ఒకే స్త్రీ లేదా పురుషునితో శారీరక ఆనందము లభించక, ఇతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రకమైన జాతకులు ఎంతో కాలం ఒకరితోనే జీవించరు. వీరికి  జీవిత భాగస్వాములు మారుతూనే ఉండాలి. రాహువు జాతకుడిని ఇతరులను గేలి చేసే స్వభామును కలుగచేస్తాడు.

         నా అనుభవములో విడాకులు కలిగిన వారిలో జతకములో రాహువు వలన విడాకులు కలిగినవారిలో ముఖ్య కారణం శారీరక సమస్యగా తెలిసింది. ఇంకొన్నిటిలో వివాహేతర సంబంధాల వలన కూడా విడాకులు జరిగాయి.

దంపతులు విడిపోవటానికి ‘కేతువు’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

కేతువు దేనినైనా సరే బూడిదగా మార్చే స్వభావము గలవాడు. ఐహిక సంబంధాలకు మనలను దూరం చేసేందుకు కేతువు తోడ్పడతాడు. కేతువు 7వ భావములో ఉంటే జాతకుడికి వైవాహిక జీవితము పై ఆసక్తి చూపించకుండా ఈ కేతువు చేస్తాడు. కుటుంబ జీవితం అంటే జాతకుడికి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ వివాహేతర సంబంధములు గాని లేదా వివాహానికి ముందే ఉన్న ప్రేమ వ్యవహారమును కొనసాగించడం గాని చేస్తూ ఉంటారు.

అదే ఒకవేళ కేతువు శుక్రుడితో కలసి వైవాహిక స్థానములో ఉంటే దగ్గరి బంధువులతోగాని లేదా స్నేహితులతో గాని రహస్యమైన ప్రేమ వ్యవహారములు నడుపుతారు.

         ఏది ఏమైనా సరే కేతువు వైవాహిక స్థానానికి సంబంధం ఉంటే, జాతకుడు తన భార్య/భర్త నుండి పూర్తిగా విడిగా ఉంటారు. కేవలం భవిష్యత్తు తరము కోసం గాని లేదా వంశానికి వారసుల కోసం గాని వివాహానికి అనుమతిస్తారు. ఈ లాంటి జాతకులు తమకు బిడ్డ పుట్టే సమయానికి తన భార్య/భర్తతో విడిపోయి ఉంటారు. 

కేతువు వలన జాతకులు విడిపోయే సందర్భాలు ఉన్నాయి గాని, విడాకులు తీసుకునే సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు.

 • రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములు శత్రు స్థనాలలో గాని లేదా నీచ స్థానాలలో గాని ఉండినట్లైతే , దంపతులు విడిపోవడం జరుగుతుంది.
 • రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములు మరియు వాటి స్థానాలు చెడు దృష్టికి గురి అయి ఉంటే దంపతులకు విడాకులు కచ్చితంగా కలుగుతాయి.
 • ఒకవేళ రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములలో మంచి శుభగ్రహ దృష్టి పడితే  దంపతులకు విడాకులు కలిగిన తరువాత మళ్ళీ కలసి జీవిస్తారు.
 • సప్తమాధిపతి 6వ భావములో ఎలాంటి శుభ గ్రహ దృష్టి లేకుండా ఉంటే  జాతకులకు విడాకులు కలుగుతాయి.
 • శని,రాహువులు కలసి లేదా ఏదో ఒక్క గ్రహం అయినా లగ్నములో ఉంటూ, తీవ్రమైన చెడు గ్రహ దృష్టి పడితే దంపతులు విడిపోవడం జరుగుతుడి. అయితే ఈ గ్రహస్తితి ఉన్నవారికి మళ్ళీ తన జీవిత భాగస్వామితో కలవడం అనేది జరుగదు. కొన్నిసార్లు విడాకుల కొరకు చట్టపరమైన హింసాలను భరించాల్సి ఉంటుంది.
 • సప్తమాధిపతి వక్ర స్థితిలో ఉన్నా లేదా అస్తంగత్వం చెందినా (రవితో కలసినా) లేదా నీచపడినా దంపతులు విడిపోవాల్సి ఉంటుంది.

ఈ విధంగా ఎన్నో గ్రహములు, వాటి స్థానములు, వాటి అధిపతుల స్థానములు ఎన్నో దంపతుల మధ్య విబేధాలకు, విడకులకు, విడిపోవడానికి కారణభూతం అవుతున్నాయి. అయితే జన్మకుండలి పూతి విశ్లేషణ చేయనిదే ఎలాంటి నిర్ణయం చేయకూడదు.

ఇక పరిష్కారం విషయానికి వస్తే జన్మకుండలిలో ఏ గ్రహము వలన జాతకుడు పీడింపబడుతున్నాడో , ఆ గ్రహముకు సంబంధించిన తాంత్రిక హోమములే సరైన పరిష్కారములు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

వివరాలకు సంప్రదించండి. Ph: 9846466430

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430