రాహువుతో ఏ గ్రహం కలిసినా అశుభమేనా? రాహు గ్రహ సంయోగాల వల్ల కలిగే ఫలితాలు ఇవే!
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. అయినప్పటికి, గత జన్మ కర్మ ఫలితాలను అనుభవింపజేయుటకు సహకరించే ముఖ్యమైన గ్రహం రాహువు. రాహువు జాతకుని యొక్క ఆశలు, అత్యాశలు, భ్రమలు, ఆకాంక్షలు, ఆకస్మిక మార్పులు, విదేశీ సంబంధాలు, భౌతిక సుఖాలు, అసాధారణ ఆలోచనలు, రహస్య విషయాలు, మాఫియా, అక్రమ రవాణాలు, అక్రమ మైనింగులు, జైల్లు, ఆసుపత్రులు, మార్చురీలు, మానసిక ఆసుపత్రులు, చేతబడులు, అభిచార కర్మలు, బాంబ్ దాడులు, జీవితంలో జరిగే ఊహించని సంఘటనలు, వీటన్నిటికి రాహువును కారకుడిగా చెప్పబడతాడు.
రాహువు తలచుకుంటే రాత్రికి రాత్రే జీవితాన్ని తలక్రిందులు చేయగలడు. అదే విధంగా, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కూడా చేయగలడు. జన్మకుండలిలో రాహువు అనుకూలంగా ఉన్నట్లైతే, జాతకులను ఓవర్ నైట్ స్టార్లుగా మార్చగలడు. జన్మకుండలిలో రాహువు ప్రతికూలంగా ఉంటే, అలాంటి వారు జైళ్ళలో, మార్చురీలలో, శ్మశానలలో, పిచ్చి ఆసుప్తృలలో పని చేస్తారు.
రాహువు ఏ గ్రహంతో అయితే ఒకే రాశిలో సంగమిస్తాడో, ఆ గ్రహానికి సంబంధించిన స్వభావం, కారకత్వాలు మరియు ఫలితాలపై తనదైన ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ గ్రహ సంగమం శుభస్థానాల్లో జరిగితే, శుభగ్రహాల దృష్టితో ఉన్నప్పుడు, అనూహ్యమైన అభివృద్ధిని కలిగించవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు గందరగోళం, అతిగా ఆశించడం, మానసిక సంఘర్షణలు మరియు అనుకోని పరిణామాలకు కూడా దారితీయవచ్చు. రాహువు, శని రెండు గ్రహాలు ఒకే విధమైన ఫలితములను అందిస్తారు.రాహువు ఇతర గ్రహాలతో సంగమించినపుడు జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రవి-రాహువు సంగమం:
జన్మకుండలిలో రవి, రాహువులు కలసి ఒకే రాశిలో సంగమించడం వలన, జాతకుడికి రవి అందించే శారీరక శక్తిని మొత్తం రాహువు పీల్చేస్తాడు. కానీ ఈ సంగమం మేష, సింహా, వృశ్చిక రాశులలో జరిగితే, రవి యొక్క సానుకూల శక్తిని జాతకుడు అనుభవించగలడు. ఈ రవి-రాహు సంగమం అనేది తులారాశిలో ఏర్పడినట్లైతే, జాతకులకు రవి ఇచ్చు శక్తిని మొత్తం రాహువు లాగేసుకుంటాడు. దీని వలన జాతకుడు నిరాశపరునిగా మిగిలిపోతాడు. మిగిలిన ఏ రాశులలో ఈ సంగమ జరిగినా, ఆ జాతకునికి అహంకారం అధికంగా ఉండేలా రాహువు సహకరిస్తాడు. ఈ సంగమం వలన జాతకుడు శారీరకంగా బలంగా ఉంటారు. శక్తివంతమైన, ఉన్నత స్థాయి వారితో ఉంటూ, అహంకారం పెంచుకుంటారు. వీరి అహంకారం వలన ఇతరులపై జాలి కూడా కలుగదు. దీనినే రవి రాహు గ్రహణ యోగముగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
చంద్ర-రాహు సంగమం:
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మరియు రాహువు కలసి ఒకేరాశిలో ఉంటే, దానిని గ్రహణ యోగంగా చెప్పబడింది. ఈ సంగమం వలన జాతకుడు ఊహాలోకంలో జీవిస్తాడు. పగటి కళలు కంటూ ఉంటారు. వీరి పై చేతబడులు సులభంగా జరుగుతాయి. కలలో దెయ్యాలు, ఆత్మలు కనిపించడం జరుగుతుంది. బంధువులలో ఆడవారితో వీరికి విబేధాలు ఏర్పడతాయి. ఈ సంగమం వలన జాతకునికి ప్రేమ వ్యవహారాలలో చాలా సార్లు విఫలం అవుతారు. మనశ్శాంతి వీరికి దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. నిద్రపోయినపుడు వచ్చే పీడకలలు వీరిని చాలా ఇబ్బంది పెట్టడం వలన, వీరికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. వీరికన్నా వయస్సులో పెద్దవారితో సత్సంబంధాలు ఏర్పరచుకోలేరు. జన్మకుండలిలో బుధుడు బలంగా ఉంటే, సృజనాత్మకత, మంచి వాగ్ధాటి వీరికి కలిగి ఉంటాయి.
కుజుడు-రాహువు సంగమం:
జన్మకుండలిలో కుజుడు, రాహువు కలసి ఉండినట్లైతే దానిని అంగారక దోషముగా చెప్పబడింది. ఈ అంగారక దోషము గురించి సంపూర్ణంగా తెలుసుకొనుటకు ఈ లింకుని క్లిక్ చేయండి. ఈ కుజ రాహు కలయిక అనేది ఒక అగ్ని పర్వతంగా చెప్పవచ్చు. జాతకునికి ఈ కలయిక వలన తీవ్రమైన కోపం, మితిమీరిన అహంకారం, క్రూరమైన ఆలోచనలు వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. జన్మకుండలిలో ఈ యోగం ఉన్న జాతకులు తమ ఆలోచనల మీద, మాట్లాడే మారాల మీద, చేసే పనుల మీద తీవ్రమైన నియంత్రణను అలవాటు చేసుకోవాలి. ఈ యోగం ఉన్న జాతకుల కారణంగానే మతపరమైన యుద్ధాలు, జాతిపరమైన యుద్ధాలు జరుగుతాయి. తీవ్రవాదులు, సమాజానికి ముప్పు తెచ్చే వారు, విప్లవ నాయకులు చాలా వరకు ఈ యోగంతో పుట్టిన వారై ఉంటారు. ఒకవేళ జన్మకుండలిలో కుజుడు నీచ స్థానంలో ఉంటే మాత్రమే, ఈ లక్షణాలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి.
బుధుడు-రాహు సంగమం:
జన్మకుండలిలో బుధుడు మరియు రాహువు కలసి ఒకేరాశిలో సంగమించినపుడు జాతకులకు బుధ చండాల యోగం ఏర్పడును. ఈ సంగమం వలన జాతకులకు ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఏ విధమైన ప్రయోగాలకు అయినా సరే వీరు అంగీకరిస్తారు. విప్లవపూరిత ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి బుద్ధి, జ్ఞానం ఉన్నప్పటికి, వాటిని జాతకుడికి ఉపయోయగపడకుండా రాహువు అడ్డుకుంటాడు. బుధుడు అనుకూల స్థానంలో ఉంటే ఈ ఫలితాలను జాతకుడు ఎదుర్కొంటాడు. ఒకవేళ బుధుడు నీచస్థానంలో ఉంటూ రాహువుతో కలసి ఉంటే, అనవసరమైన మాటలు మాట్లాడటం, కోపంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పడం, అవతలి వారికి వీరి మాటలు నచ్చకపోవడం, సోదిలా అనిపించడం జరుగుతుంది.
గురువు-రాహువు సంగమం:
జన్మకుండలిలో గురువు మరియు రాహువు కలసి ఒకేరాశిలో ఉంటే జాతకులకు గురు చండాల యోగం ఏర్పడుతుంది. దీనిని అశుభ కలయికగా చెప్పవచ్చు. ఏ భావంలో గురు చందాల యోగం ఏర్పడితే ఏ విధమైన ఫలితములను జాతకుడు అనుభవిస్తాడో ఈ లింక్ ద్వారా క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
గురు, రాహువులు కలసి గురువు యొక్క స్వస్థానాలైన ధనస్సు రాశి మరియు మీన రాశిలో ఏర్పడితే, వారికి ఈ దోషం యొక్క ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. గురువు జాతకునికి ఇచ్చే మేధస్సు, జ్ఞానం అంతటినీ కూడా రాహువు యొక్క క్రూర బుద్ధి జాతకుడిని పక్కదోవ పట్టేలా చేస్తాడు. దేవుడిని అడ్డం పెట్టుకొని భక్తులను మోసం చేసే దొంగ బాబాలు, ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక రచయితలు అందరూ ఈ యోగం కలిగినవారే ఉంటారు. ఒకవేళ జన్మకుండలిలో గురువు నీచ స్థానంలో ఉన్నట్లైతే, దీని వలన జాతకులు సమాజంలో అవమానాలు పొందడం, నిందలు పడటం జరుగుతుంది.
శుక్రుడు-రాహువు సంగమం:
జన్మకుండలిలో శుక్రుడు మరియు రాహువు కలసి ఒకే రాశిలో సంగమం జరగడం కేవలం నటీనటులకు, రచయితలకు, గాయకులకు, డ్యాన్సర్లకు మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది. కానీ చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో వీరు విఫలం అవుతారు. వీరి జీవితంలోకి సరైన వారు వచ్చినప్పటికి, వారిని పక్కకు తోసిపెట్టి, చివరకు చెడ్డ వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. శుక్రుడు శృంగార పరమైన ఆలోచనలను, శరీరంలో ఉత్పత్తి అయ్యే అండములను, వీర్యమును నియంత్రిస్తాడు. ఈ సంగమం ఉన్న చాలా మంది జాతకులకు అధిక శృంగార వాంఛలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఇవి అదుపుచేసుకోలేనిగా మారి, సమస్యలకు దారి తీస్తాయి.
శని మరియు రాహువు సంగమం:
జన్మకుండలిలో శని మరియు రాహువు కలసి ఒకే రాశిలో సంగమించినపుడు, ఆ జాతకులకు పిశాచ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్న జాతకులకు తమ జీవితం అంతా కూడా కష్టాలు, ఒడిదుడుకులు, నిరాశలు, బాధలతో నిండి ఉంటుంది. గత జన్మ పాప కర్మలు, గత జన్మ పుణ్య కర్మలు, ఈ రెండిటి యొక్క కర్మ ఫలితాలను జాతకుడు బలవంతంగా అనుభవించేలా ఈ యోగం సహకరిస్తుంది. జన్మకుండలిలో ఈ సంగమం ఏ భావంలో ఉంటే, ఆ భావం ఇచ్చే శుభ ఫలితాలు అన్నీ కూడా నాశనమవుతాయి. ఒకవేళ ఆ భావాధిపతి శుభ స్థానంలో ఉంటే, ఈ ఫలితాలు యొక్క తీవ్రత తగ్గును.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి.
Related Articles:
- శని చూపించు విషతుల్య యోగం యొక్క ప్రభావములు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
