అరిష్ట పిశాచగ్రస్త యోగం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఒక వ్యక్తి యొక్క మనస్సు, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక తత్త్వం వంటి లక్షణాలు అన్నీ కూడా జాతకుని యొక్క లగ్నం, చంద్రుని స్థానం, రాహువు యొక్క స్థానం, శని యొక్క స్థానం, పంచమ మరియు నవమ భావాలు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. అరిష్ట పిశాచ గ్రస్త యోగము జాతకంలో ఏర్పడటం వలన జాతకుడు మానసికంగా ఎ విధమైన కష్టాలను ఎదుర్కొంటాడో, ఆత్మలు లేదా అతీంద్రియ, అవాంచనీయ శక్తుల బారీన ఏ విధంగా పడతాడో ఇక్కడ వివరించబోతున్నాము.
- జన్మకుండలిలోని లగ్నం జాతకుని యొక్క శరీరమును, మనస్సును, ఆలోచనలను సూచిస్తుంది.
- జన్మకుండలిలోని చంద్రుని స్థానం జాతకుని యొక్క మానసిక స్థిరత్వమును, భావోద్వేగములను, వాస్తవికతను జాతకుడు అర్థం చేసుకునే విధానమును సూచిస్తాడు.
- జన్మకుండలిలోని రాహువు భ్రమలను, మోసములను, ప్రతికూల శక్తులను, మానవాతీత శక్తుల గందరగోలములను సూచిస్తాడు.
- జన్మకుండలిలోని శని జతకునిలో ఉన్న భయమును, వైరాగ్యమును, కర్మ బంధములను సూచిస్తాడు.
- లగ్న, పంచమ, నవమ భావములు అయిన త్రికోణ స్థానాలు, జాతకునిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, మేధస్సు, గత జన్మ కర్మలను తెలియజేస్తాయి.
జన్మకుండలిలో లగ్న, పంచమ, నవమ భావములలో పాప గ్రహముల దృష్టి లేదా స్థితి ఉన్నా, శని, రాహు, చంద్ర గ్రహములకు పాప స్థాన ప్రభావములు లేదా పాప గ్రహ సంగమములు జరిగినపుడు జాతకుడు మానసికంగా గందరగోళములు ఎదుర్కోవడం, అభిచార కర్మలకు, చేతబడులకు గురి కావడం, దుష్ట శక్తుల బారీన పడటం లాంటి సంఘటనలు జరుగును.

అరిష్ట పిశాచ గ్రస్త యోగం ఏ విధంగా ఏర్పడుతుంది?
- లగ్నంలో అనగా తనుభావంలో చంద్ర రాహువులు కలసి ఉండటం వలన గ్రహణ యోగం మరియు అరిష్ట పిశాచ గ్రస్త యోగం ఏర్పడుతుంది. దీని వలన ఈ మానసిక స్పష్టతలో గందరగోళం ఏర్పడుతుంది. అందుకారణంగా భ్రమలు, భ్రాంతులు, భయాలు ఏర్పడతాయి.
- చంద్రుడు మనః కారకుడు. అనగా మనస్సు, భావోద్వేగాలు, మానసిక స్థిరత్వం అన్నిటిని కూడా చంద్రుడు పాలిస్తాడు.
- రాహువు వాస్తవికతను మర్చిపోయేలా చేసి, భ్రమలను కలిగింపజేస్తాడు. దీని వలన మానసిక అస్తిరత్వం, భయం, భ్రమలు కలుగుతాయి.
- జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదా నీచ స్థానంలో ఉన్నా, ఈ యోగం యొక్క ఫలితాలు తీవ్రంగా ఉంటాయి.
- కుజ, శని, కేతు గ్రహాలు లగ్న, పంచమ నవమ భావంలో స్థితి చెందడం వలన ప్రతికూల శక్తులు, ప్రతికూల కర్మ ప్రభావాలు వీరి పై అధికంగా ఉంటాయి.
- జన్మకుండలిలోని లగ్నం అనగా, జాతకుని యొక్క వ్యక్తిత్వాన్ని, జాతకుని యొక్క చైతన్యాన్ని సూచిస్తుంది. లగ్నములో పాప గ్రహములు చోటు చేసుకుంటే, జాతకునికి మానసిక గందరగోళం, సంధిగ్ధం, దుష్టశక్తుల వలన కలిగే ఇబ్బందులు ఏర్పడతాయి.
- జన్మకుండలిలోని పంచమ భావం గత జన్మ కర్మలను, మేధస్సును సూచిస్తుంది. పంచమ భావంలో పాప గ్రహములు చోటు చేసుకుంటే, ఆ జాతకునికి గత జన్మ ఋణములు అధికంగా ఉంటాయి. ఈ పాప గ్రహముల వలన దుష్ట శక్తుల చేత పీడింపబడే అనుభవాలు ఎదురవుతాయి.
- జన్మకుండలిలోని నవమ భావం ఆధ్యాత్మిక రక్షణ, దైవానుగ్రహమును సూచిస్తుంది. నవమభావము బలహీనముగా ఉన్నా, పాప గ్రహములు ఉండినా, ప్రతికూల శక్తులను ఎదుర్కొనే, ప్రతికూల శక్తుల నుండి కాపాడే కవచం బలహీనపడుతుంది.
- లగ్నంలో శని ఉండినా లేదా లగ్నము పై శని దృష్టి పడినా, ఈ అరిష్ట పిశాచ గ్రస్త యోగము మరింత బలంగా మారుతుంది. దీని వలన దీర్ఘకాలిక ఒత్తిడి, భయం, బాధలు కలుగుతాయి.
- జన్మకుండలిలో శని జాతకుని యొక్క గత జన్మ కర్మను, జాతకునిలో ఉన్న భయాలను, జాతకుడు ఎదుర్కొనే బాధలు అన్నిటిని సూచిస్తాడు.
- జన్మకుండలిలో శని లగ్నములో ఉన్నా లేదా లగ్నము పై శని యొక్క దృష్టి ఉండినా,అరిష్ట పిశాచ గ్రస్త యోగము బలంగా మారుతుంది. దీని వలన జాతకునిలో భయాలు, కుంగుబాటు, తీవ్రమైన మనోవేదన, నిరాశ, దుష్ట శక్తుల వలన కలిగే ఇబ్బందులు పెరుగుతాయి.
అరిష్ట పిశాచ గ్రస్త యోగము యొక్క ప్రభావము తీవ్రతకు కారణమయ్యే గ్రహస్థితులు ఏమిటి?
- జన్మకుండలిలో కేతువు 8 లేదా 12వ స్థానములో ఉన్నట్లయితే, జాతకునికి అంతుపట్టని దుష్టశక్తుల అనుభవాలు చోటు చేసుకుంటాయి. దైవానుగ్రహము పొందుటకు తీవ్రమైన ఆటంకములు కలుగుతాయి.
- జన్మకుండలిలో కుజుడు పంచమ భావంలో ఉండినట్లైతే, జాతకుడు తీవ్ర కోపంగా, హింసాత్మకంగా మారతాడు. తనకు తాను హాని చేసుకునే లక్షణాలు ఏర్పడతాయి.
- జన్మకుండలిలో బుధుడు నీచాపడినా, శత్రు గ్రహ సంగమంతో కూడి ఉన్నా, జాతకునికి వాస్తవానికి మరియు భ్రమకు మధ్య ఉన్న తేడాను కనిపెట్టేందుకు కష్టతరం అవుతుంది. సరైన మార్గంలో ఆలోచించడం కూడా వీరికి కష్టంగా మారుతుంది.
అరిష్ట పిశాచ గ్రస్త యోగము యొక్క ప్రభావము తీవ్రతను తగ్గించే గ్రహస్థితులు ఏమిటి?
- జన్మకుండలిలో గురు గ్రహం బలంగా ఉంటే, ఈ అరిష్ట పిశాచ గ్రస్త యోగం యొక్క ప్రతికూల ప్రభావాలను గురు గ్రహము జాతకునికి రక్షణ కల్పిస్తుంది.
- శుక్రుడు మరియు బుధ గ్రహములు జన్మకుండలిలో శుభ స్థానాలలో ఉన్నట్లయితే, ఈ యోగం యొక్క ప్రభావం తగ్గుతుంది.
అరిష్ట పిశాచ గ్రస్త యోగము వలన జాతకుడు ఎదుర్కునే ప్రభావాలు, వాటి ఫలితాలు ఏమిటి?
- అరిష్ట పిశాచ గ్రస్త యోగము ఉన్న జాతకుడు భయటకు చెప్పలేని, అర్థం గాని భయము, ఆందోళన, ఆలోచనలు వారి మనస్సులో వెంటాడుతూ ఉంటుంది.
- నిద్రపోవు సమయంలో తరచూ ఆటంకములు రావడం, పీడకలలు వచ్చి మనస్సును ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.
- పాడుబడ్డ భవనాలు, ఆధ్యాత్మిక శక్తులు, దుష్ట శక్తుల పై నమ్మకాల యొక్క ప్రభావం వీరి పై అధికంగా ఉంటాయి.
- అనుకోనుండా జాతకుని యొక్క మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి. మనోవేదన, భయాలు, వైద్య విద్యకు అంతుపట్టని మానసిక దౌర్బల్యాలు కలుగుతాయి.
- జాతకునికి అరిష్ట పిశాచ గ్రస్త యోగం వలన కలిగే విచిత్రమైన వైఖరి, భయంతో కూడిన స్పందన వంటి చేష్టలతో తమ ప్రియతమలకు, తమ జీవిత భాగస్వాములకు దూరం అవుతారు.
- జన్మకుండలిలో ఈ యోగం ఉన్న జాతకులు దైవానుగ్రహము దక్కకపోతే, తీవ్రమైన దుష్ట శక్తుల ప్రభావాలకు లోనవుతారు.
- ఈ యోగం ఉన్న జాతకులకు ఉన్న ప్రవర్తన కారణంగా సమాజానికి, వాస్తవానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు.
- ఈ యోగం ఉన్న జాతకులు ఏ కారణం లేకుండా కలిగే భయం, ఆందోళన వలన, వీరికి ఏదో అయ్యింది అని, ప్రతికూల శక్తులు వీరిని అదుపు చేస్తున్నాయని భయపడతారు.
అరిష్ట పిశాచ గ్రస్త యోగం యొక్క ప్రభావములు తగ్గించుకునేందుకు చేసుకోదలచిన పరిహారాలు:
- మానసిక స్థిరత్వం కొరకు చంద్ర బలం పెంచుకోవాలి. జ్యోతిష్యుని సలహాతో ముత్యం ధరించాలి. ఓం చంద్రాయా నమః అన్న మంత్రమును ప్రతీ రోజు జపించాలి.
- దుష్ట శక్తుల నుండి రక్షణ కొరకు ప్రతీ రోజు హనుమాన్ చాలీసా మరియు మహా మృత్యుంజయ మంత్రమును జపించాలి.
- జన్మకుండలిలో ఏ గ్రహముల వలన అరిష్ట పిశాచ గ్రస్త యోగము ఏర్పదినదో, నిష్ణాతులైన జ్యోతిష్యుల ద్వారా జన్మకుండలి పరిశీలన చేయించుకొని, ఆ గ్రహముల ప్రీతి కొరకు పరిహారములు చేయించుకోవాలి.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 1500/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.
Related Articles:
