మనలో ఎంతోమంది మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆ భగవంతుడు మన భవిష్యత్తుని ఏ విధంగా నిర్ణయించాడు, మన భవిష్యత్తుకి ఏఏ గ్రహాలు మనకు ఆటంకం కలిగిస్తున్నాయి అని తెలుసుకోవడానికి జ్యోతిష్య పండితుని వద్దకు వెళతారు. మీ పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలు జ్యోతిష్యునికి ఇచ్చిన తరువాత, ఆయన మీ జన్మకుండలిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రహాల స్థానాలు, బలాలు, గుణాలను బట్టి మీకున్న ప్రతికూల యోగాలను (దోషాలు), అనుకూల శుభ యోగాలను తెలియజేస్తారు. మనిషి పుట్టినపుడు గ్రహాల యొక్క లక్షణాలు, బలాలను బట్టి అతని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి పుట్టిన సమయంలో అతని జన్మకుండలిలో శని, గురు గ్రహాలు ప్రతికూలంగా ఉంటే, ఆ శని,గురు గ్రహాల యొక్క ప్రతికూల శక్తి వల్ల జాతకునికి చెడు యోగాలు సంభవిస్తాయి. అదే విధంగా, జన్మకుండలిలో గురువు, శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే, జాతకునికి ఆ గ్రహాల యొక్క అనుకూల శక్తుల వల్ల అనుకూల శుభ యోగాలు సంభవిస్తాయి. కాని అసలు సందేహం ఇక్కడే వస్తుంది. ఒక్కో వ్యక్తికి గ్రహస్థితులు ఒక్కో విధంగా ఉంటాయి. ఫలానా వ్యక్తికి ఆ గ్రహ స్థితులే ఎందుకు ఏర్పడ్డాయి? అంటే ఇప్పుడు మనకు లభించిన జన్మకి, గత జన్మలకి ఏమైనా సంబంధం ఉందా? అని ఇలా సందేహాలు వస్తాయి.

ఇప్పుడు మనకు భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మకి, మన గత జన్మలకి సంబంధం ఉంది. గత జన్మలో మనం చేసిన పుణ్యాలు, పాపాలు అన్నీ కూడా మన ఆత్మ ఒక పెన్ డ్రైవ్ లాగా స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాలి. ఆ పాప, పుణ్యాల ఫలితాలను, పాపాలకు ప్రతికూల యోగాలుగా, పుణ్యాలకు అనుకూల యోగాలుగా ఫలితాన్ని మనం ఈ జన్మలో అందుకుంటాము. ఫలానా సమయంలో పుట్టినందుకు మనకు ఈ గ్రహ స్థితులు ఏర్పడ్డాయని, అందుకే ఈ దోషాలు వచ్చాయని మనం అనుకుంటాము. కాని, మన గత జన్మ పాప, పుణ్య కర్మలకు అనుగుణంగా మనం అనుభవించాల్సిన చెడు, మంచి యోగాలు సంభవించే గ్రహస్థితులు ఏర్పడిన సమయంలోనే మనం జన్మిస్తాము. అంటే మనం మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ పుట్టాలి అనేది, గత జన్మలో మనం చనిపోయేటపుడే నిర్ణయించబడి ఉంటుంది. ఇక గత జన్మ మరణం తరువాత, అతని గత మంచి కర్మలకు వరాలను అందుకునే విధంగా, గత జన్మలో అతను చేసిన పాపాలకు శిక్ష అనుభవించే విధంగా ఉన్న గ్రహస్థితుల సమయంలో మళ్ళీ భూమి మీదకు వస్తాడు అన్నమాట. ప్రత్యేకంగా అదే గ్రహం ఎందుకని జాతకునికి ప్రతికూలంగా ఉంది, కొన్ని గ్రహాలు ఎందుకు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము.

రవి: తండ్రి, ప్రభుత్వం, దేశ అధిపతులు, రాష్ట్ర అధిపతులు, పరిపాలకులు, నిర్వాహకులు వీరు అందరిని కూడా రవి గ్రహం సూచిస్తుంది. మగ బిడ్డ జననానికి కూడా రవి దోహదపడతాడు. రవికి సంబంధించిన వారికి గత జన్మలో చెడు కర్మలు చేసి ఉన్నట్లయితే, ఈ జన్మలో జాతకునికి రవి ప్రతికూలంగా ఉంటాడు. ఈ రవి యొక్క ప్రతికూల శక్తి ఎంత ఉంటుంది అనేది, జన్మకుండలిలో రవి యొక్క బలాన్ని బట్టి తెలుస్తుంది. గతంలో జాతకుడు ప్రత్యేకంగా ఎవరికి అయితే అన్యాయం లేదా కీడు చేసి ఉంటాడో, వారే ఈ జన్మలో ప్రతికూలంగా ఉంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే, ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావడం లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరమవ్వడం లేదంటే గతంలో తన తండ్రితో జాతకుడు ఏ విధంగా నడుచుకున్నాడో, అదే విధంగా ఈ జన్మలో జాతకుని కొడుకు జాతకునితో అలానే ప్రవర్తిస్తాడు.

                              ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాము.  రవి గ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవడం లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావడం లాంటివి అన్నీ కూడా జరుగుతాయి. గత జన్మలో జాతకుడు ఏ బీజం అయితే వేశాడో, వాటి ఫలాలే ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అదే విధంగా, గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో, మరే ఇతర విధాలుగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే, ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షని అనుభవిస్తారు. ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవి గ్రహ వ్యతిరేకత వలన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.

చంద్రుడు: చంద్రుడు తల్లిని, మనస్సుని, భావోద్వేగాలను సూచిస్తాడు. నదులు, సముద్రాలు, మానసిక నిపుణులు, మానసిక వైద్యులను చంద్రుడు సూచిస్తాడు. గత జన్మలో తల్లికి గాని లేదా తల్లి లాంటి ఆడవారికి చేసిన మంచి లేదా చెడు కర్మల ఆధారంగా ఈ జన్మలో చంద్రుని బలం అనేది నిర్ణయించబడుతుంది. అలాగే నదులు, సముద్రాలు వంటి పెద్ద వనరులకు చేసిన కర్మల ఆధారంగా కూడా జన్మకుండలిలో చంద్రుడు యొక్క బలం నిరూపణ అవుతుంది.

గురువు:  సాధువులు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, గురువులు, ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు ఇలా గురు స్థానంలో ఉన్న అందరిని, అన్నిటిని గురు గ్రహం సూచిస్తాడు. గురు గ్రహం ఆధిపత్యం వహించే వ్యక్తులకు, వస్తువులకు లేదా ప్రదేశాలకు గత జన్మలో మనం చేసిన మంచి లేదా చెడు కర్మల యొక్క ఆధారంగానే ప్రస్తుత జన్మలో గురు గ్రహానికి సంబంధించిన రంగాలలో మంచి లేదా చెడు ఫలితం అనేది ఉంటుంది. గత జన్మలో జాతకుడు గురు గ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే, ఈ జన్మలో గురు గ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది. లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే.

శుక్రుడు: శుక్రుడు సూచించేవి ఎన్నో ఉన్నాయి. కాని జాతకుడు ముఖ్యంగా తన గత జన్మలో తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల గాని, భార్య లేదా భర్త పట్ల గాని, మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకొని ఉంటాడో, దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్ర బలం నిర్ణయించబడుతుంది. ఎవరైతే తన గత జన్మలో తమ భాగస్వాములను మోసం చేశారో, స్త్రీల పట్ల అగౌరవంగా ఉన్నారో, వారికి ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు, బాధలు జాతకునికి కలిగేలా చూస్తాడు. శుక్రుడు ప్రతికూలంగా ఉండటం వల్ల, ప్రేమించిన వారి చేతిలో మోసపోవడం, పెళ్లి చేసుకున్న వారి చేతిలో మోసపోవడం, అసలు నిజమైన, స్వచ్చమైన ప్రేమ అనేదే దక్కకపోవడం లాంటివి జరుగుతాయి. అదే విధంగా గత జన్మలో ఎవరైతే ఆడవారి పట్ల, తాము ప్రేమించిన వారి పట్ల, పెళ్ళి చేసుకున్న వారి పట్ల పూర్తి గౌరవంగా చూస్తూ, వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించిన వారికి, ఈ జన్మలో వారికి మంచి మనస్సుతో, తమని ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి లభిస్తారు. స్త్రీల నుండి గౌరవం లభిస్తుంది.

జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కుజుడు: సోదరులు, స్నేహితులు, ఆయుధాలు, బలగం ఇవన్నీ కుజుడు సూచిస్తాడు. గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని, బలగాన్ని ఉపయోగించుకొని ఇతరులను అణగదొక్కి ఉంటారో, వారి బలాన్ని, బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో, తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో, తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను, స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో, వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ, అవే బాధలు, ఇబ్బందులు జాతకుడు పడేలా చేస్తాడు. అలాగే, కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద గాని, ఆయా రంగాలలో గాని సక్రమంగా నడుచుకొని ఉంటే, ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ, జాతకునికి మంచి స్నేహితులను, సోదరులను అందించి, కుజుడు ఆధిపత్యం వహించే రంగాలలో విజయాన్ని ప్రసాదిస్తాడు.  ఉదాహరణకు, గత జన్మలో ఒక వ్యక్తి తమ స్నేహితులతో మంచిగా నడుచుకొని, వారికి కావలసిన సమయాల్లో సహాయాన్ని అందించి ఉంటే, ఈ జన్మలో వారికి ఉన్న స్నేహితులు తమ కోసం ప్రాణాలు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేలా ఉంటారు.

బుధుడు: కూతురు, సోదరీమణులు, కడుపులో బిడ్డ, 12 ఏళ్ల కంటే చిన్న వయసు పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు, ట్రేడింగ్, వ్యాపారం, వాక్కు, జ్ఞానం, జ్ఞాపకశక్తి, ఇవన్నీ కూడా బుధుడు సూచిస్తాడు. గత జన్మలో కూతురు, అక్కా, చెల్లి పట్ల చెడు కర్మలు చేయడం, వ్యాపారంలో మోసం చేయడం, మాటలతో అమాయకపు జనాలను మోసం చేయడం, వంటి వాటి వల్లే ఈ జన్మలో జన్మకుండలిలో బుధుడు చెడు స్థానంలో ఉంటాడు. బుధుడు సూచించే స్థలాలను, వ్యక్తులను, రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాలలో విజయాలను ప్రసాదిస్తాడు.

శని: తక్కువ స్థాయిలో ఉండేవారు, తక్కువ కులం వారు, లేబర్ పనులు చేసేవారు, పనిమనుషులు, రోజువారి పనులు చేసే కూలీలు, గుడ్డివారు, భిక్షగాళ్ళు, పాములు, మద్యం వీటన్నిటిని శని సూచిస్తాడు. ఇక్కడ చెప్పిన వ్యక్తులకు ఎవరికైనా గాని గత జన్మలో ద్రోహం లేదా చెడు కర్మలు తలపెట్టి ఉంటే, ఈ జన్మలో శని ప్రతికూల స్థానంలో ఉంటూ తన ప్రతికూల శక్తిని జాతకుని మీద ప్రదర్శిస్తాడు. అదే ఒకవేళ, ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో శని వారికి అనుకూల శక్తిని ప్రసాదించి, అన్నింటా విజయం కలిగేలా చేస్తాడు.

రాహువు: మామ, బావ మరిది, పక్షులు అందులోనూ ముఖ్యంగా కాకులు, చెత్తను సేకరించేవారు, ప్లంబర్లు, బాత్రూములను శుభ్రం చేసేవారు, రోడ్లు ఊడ్చేవారు,మానసిక రుగ్మతలు ఉన్నవారు వీరిని రాహువు సూచిస్తాడు. డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు, లాటరీలు, స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు, గుర్రపు పందెం లాంటి వాటి మీద బెట్టింగులు ఇవన్నిటిని కూడా రాహువు సూచిస్తాడు. రాహువు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో, వారికి ఈ జన్మలో రాహువు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తాడు. గత జన్మలో రాహువు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తామామలు దొరకడం, హటాత్తుగా లాటరీలు ద్వారా గాని లేదంటే స్టాక్ మార్కెట్ స్పెక్యూలేషన్ల ద్వారా గాని పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది.  

కేతువు పుత్రులను, శిష్యులను, అనాధలను, కుక్కలను  ఈ కేతువు సూచిస్తాడు. మర్మ శాస్త్రాన్ని, క్షుద్ర విద్యలను కూడా కేతువు సూచిస్తాడు. కేతువు ఆధిపత్యం వహించే రంగాలలో లేదంటే వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ, తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తారు. జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులకు మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు. అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి అయితే, ఈ జన్మలో తీవ్ర అపజయాలు, పేరు ప్రతిష్టల భంగం, కోర్టు కేసుల సమస్యలు, వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. కేతు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళనలు, మానసిక రుగ్మతలు, నిర్ణయాలు తీసుకోవడంలో లోపం, కనిపెట్టలేని వ్యాధులు లాంటివి వస్తాయి.

 

               ఇలా ఇక్కడ చెప్పబడిన విధంగా, మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతకచక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు (మంచివైనా లేదా చెడు అయినా) మన మీద ఏ సమయంలో పడతాయి అనేది కూడా  జాతకచక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఏవేవి అని కనుక్కున్న తరువాత, వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తీవ్రత తగ్గుతుంది. ఉదాహరణకు, ఒకరికి జాతకములో శని తీవ్ర ప్రతికూలంగా ఉన్నారు అనుకుందాం. అందుకు ఆ వ్యక్తి శనీశ్వరునికి సంబంధించిన ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవాలి. అలాగే, తన వద్ద పనిచేసే పనివారి పట్ల, లేబర్ పట్ల మంచిగా నడుచుకోవాలి. ఇతరులకు సమస్యగా మారే మద్యాన్ని సేవించడం మానేయాలి. ఈ పనులన్నీ కూడా ఈ జాతకుడు తన పూర్వ జన్మలోనే చేసి ఉండాల్సిన పనులు. కాని చేయలేదు. అందుకనే వాటి ప్రభావం శని వ్యతిరేక స్థాన రూపంలో అనుభవిస్తున్నాడు. ఈ పరిహారాలు అన్నీ కూడా చక్కగా పాటించిన తరువాతే శని ఋణం తీరినట్టు అవుతుంది. గత జన్మలో చేసిన పాప భారాన్ని ఈ జన్మ వరకు మనిషి మోసుకొని వస్తాడు. వాటిని కనిపెట్టి, ప్రతికూల గ్రహాల ప్రభావాలను తగ్గించే పరిహారాలను తెలియజేసి జాతకుడిని సరైన మార్గంలో నడిచేలా చేయడమే జ్యోతిష్యుని ధర్మం. రోగికి వ్యాధి నివారణ కావాలంటే నిష్ణాతుడైన వైద్యుడు అవసరం ఉంటుంది. అదే విధంగా పూర్వజన్మ కర్మ ఫలితాలను మరియు గ్రహాల అవయోగాలను, యోగాలను తెలుసుకోవాలంటే పరిపూర్ణమైన జ్యోతిష్య పరిజ్ఞానం కలిగిన జ్యోతిష్యుడు అవసరం. గ్రహదోషాలను తొలగించుకోవాలని కోరుకున్న వారికి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలన్నా కూడా వారికి నుదుటన రాసి పెట్టి ఉండాలి. ప్రాప్తం అనుభోజ్యం అన్నమాటకి ఇదే ఉదాహరణ. పూర్వ జన్మల కర్మ ఫలాలు వ్యక్తులకు, వారికి మేలు జరిగే ప్రాయశ్చిత్తములను తెలియనీయవు. అదే పూర్వజన్మల గ్రహమాయ.

జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

Related Articles:

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు తెలుసుకొనుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com