loading

Grahan Yoga గ్రహణ యోగం

  • Home
  • Blog
  • Grahan Yoga గ్రహణ యోగం

Grahan Yoga గ్రహణ యోగం

Grahan Yoga గ్రహణ యోగం

మన జీవితంలో అత్యంత సమస్యలు సృష్టించే అతి ముఖ్యమైన అవయోగాలలో ఒకటి ‘గ్రహణ యోగం.’  ఈ గ్రహణ యోగం రెండు రకాలు ఉంటాయి. 1. చంద్ర గ్రహణ యోగం, 2. సూర్య గ్రహణ యోగం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రవి లేదా చంద్రుడు, రాహువు లేదా కేతువుతో కలసి ఒకే రాశిలో సంగమించినపుడు, ఆ సమయంలో జన్మించిన వారికి గ్రహణ యోగం ఉంటుంది అని చెప్పబడింది. ఈ గ్రహణ యోగం వలన తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. దారిద్ర్యం, అంతు పట్టని మానసిక మరియు శారీరక వ్యాధులు, పరువు నష్టం, ప్రాణాపాయ సంఘటనలు జరగడం ఇలా ఎన్నో విధాలుగా జాతకులను ఈ గ్రహణ యోగం ఇబ్బంది పెడుతుంది.

               జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్రులను ఎంతో ముఖ్యమైన గ్రహాలుగా పరిగణించడం జరిగింది. మనం కూడా సూర్యా చంద్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి పూజిస్తాము. అంతటి రవి, చంద్రులకు సైతం, తీవ్ర పాప దృష్టి లేదా పాప గ్రహాలతో సంగమం జరిగినపుడు, ఆ ప్రభావం జాతకుని యొక్క మొత్తం జీవితం పై పడుతుంది. ఇంకా ముఖ్యంగా, సూర్య, చంద్రుల మహాదశ, అంతర్దశలు జరుగుతున్నపుడు ఈ గ్రహణ యోగా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. రవి లేదా చంద్రుడు, రాహు లేదా కేతువుతో కలసి సంగమిస్తే గ్రహణ యోగం ఏర్పడుతుంది అని ఇప్పటి వరకు తెలుసుకున్నాము. కానీ, రవి-రాహు, రవి-కేతు, చంద్ర-రాహు, చంద్ర-కేతు సంగమం అనేది ప్రతీ ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది. అందుకని, ఈ గ్రహణ యోగం ఉన్న ప్రతీ ఒక్కరూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని కాదు. ఇందులో మర్మం ఏమిటంటే, రవి చంద్రులు రాహు కేతువులతో కలసి సంగమించడం ఒకటే కాకుండా, వారు ఏ రాశిలో సంగమించారు, ఏ భావంలో సంగమించారు, ఆ గ్రహాల పై ఉన్న శుభ, పాప దృష్టులు కూడా దృష్టిలో ఉంచుకొని పరిగణించిన తరువాతే ఆ జాతకులకు గ్రహణ యోగ దుష్ప్రభావాలు ఉంటాయని నిర్ధారించాలి.

               అలా కాకుండా, కొందరు జ్యోతిష్యులు, తమకున్న మిడిమిడి జ్ఞానంతో రవి, చంద్ర- రాహు, కేతు సంగమం జాతకంలో కనిపించగానే వారికి గ్రహణ యోగం ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. ఇది సరైన పరిశీలన కాదు అని గ్రహించాలి.

               గ్రహణ యోగం అనేది మన పై ఎంతో ప్రభావాన్ని చూపించే యోగంగా చెప్పబడుతుంది. వీటిని మొత్తం 16 రకాలుగా విభజించి, యోగ ప్రభావాన్ని వివరించడం జరుగుతుంది. అయితే, ఈ విషయం గురించి చెప్పుకుంటూ పోతే, చాలా పేజీలు వస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఉదాహరణగా ఒక 4 రకాలను వివరిస్తున్నాను.

సంపూర్ణ జాతక పరిశీలన, యోగాలు, అవయోగాలు కొరకు నమోదు చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 

 

  1. అనుకూల రవి ప్రతికూల రాహువు:

జన్మకుండలిలో రవి అనుకూలంగా ఉంటూ, రాహువు ప్రతికూలంగా ఉంటూ సంగమించినపుడు, గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ విధమైన గ్రహణ యోగం ఏర్పడ్డ రాశిని ఆధారంగా, జాతకుడు తన జీవితంలో ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటాడు.

ఉదాహరణగా, కన్యారాశిలో లగ్నంలో (తను భావంలో) రవి-రాహు సంగమ జరిగింది అనుకుందాం. దీనిని గ్రహణ యోగంగా పరిగణించాలి. ఈ సంగమం జాతకునికి ప్రతికూలం అని చెప్పాలి. జన్మకుండలిలో మిగిలిన గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉంటే, జాతకుడు తీవ్ర దారిద్రాన్ని, అపజయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా, రవి అనుకూలంగా ఉంటూ, కేతువు ప్రతికూలంగా ఉంటూ, వీరి సంగమం మొదటి భావంలో ఏర్పడితే, జన్మకుండలిలో మిగిలిన గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకునికి ప్రాణాపాయ వ్యాధులు సంభవించే అవకాశాలు ఉంటాయి. మిగిలిన గ్రహాల ప్రాబల్యం ప్రతికూలంగా ఉంటే, జాతకునికి చిన్నతనంలోనే మారకం కూడా సంభవించవచ్చు.

  1. ప్రతికూల రవి-ప్రతికూల రాహు:

జన్మకుండలిలో రవి, రాహు ఒకే భావంలో సంగమించి, వారిరువురు కూడా ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకులకు ఈ గ్రహణ యోగం మరింత తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ గ్రహణ యోగం ఉన్న జాతకులకు ఎన్నో తీవ్రమైన సమస్యలు వస్తాయి.

ఉదాహరణకు: జన్మకుండలిలో రవి, రాహు ప్రతికూలంగా ఉంటూ, దశమ భావంలో సంభావిస్తే,  ఆ జాతకులు నీతిమాలిన పనులు చేయడం లేదా క్రూరమైన నేరాలకు పూనుకుంటాడు. ఫలితంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకవేళ జన్మకుండలిలో ఈ గ్రహణ యోగం బలంగా ఉంటూ, ఇతర గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకుడు కరుడు గట్టిన నేరస్తుడిగా తయారయ్యి, ప్రభుత్వం ద్వారా తీవ్రమైన దండనలకు గురి అవుతాడు.

Grahana yoga effects

  1. ప్రతికూల రవి- అనుకూల రాహు:

జాతకంలో రవి ప్రతికూలంగా ఉంటూ, రాహువు అనుకూలంగా ఉంటూ, ఇద్దరూ కలసి ఒకే భావంలో సంగమించినపుడు కేవలం కొన్ని రాశులలో ఏర్పడ్డపుడు మాత్రమే దీనిని గ్రహణ యోగంగా పరిగణించాలి. ఈ విధమైన సంగమం కేవలం కొన్ని రాశులలో ఏర్పడ్డప్పుడు మాత్రమే జాతకుని పై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి.

               ఈ సంగమం కొన్ని ప్రత్యేక భావాలలో జరిగినపుడు, జాతకులు ఎన్నో విధాలైన మానసిక రుగ్మతలను అనుభవించాల్సి ఉంటుంది. ఇతర ప్రతికూల గ్రహాల ప్రాబల్యం ఉంటే, జాతకులు పూర్తిగా పిచ్చివారిగా కూడా మారతారు. ఎన్నో ఏళ్ళు పాటు మానసిక ఆసుపత్రులలో ఉండాల్సి వస్తుంది లేదా ఆత్మాహుతి ప్రయత్నాలకు కూడా ఈ సంగమం తోడ్పడుతుంది.

  1. అనుకూల రవి-అనుకూల రాహు:

జన్మకుండలిలో రవి, రాహు గ్రహాలు ఇద్దరూ అనుకూలంగా ఉంటే, దీనిని ఏ విధంగా కూడా గ్రహణ యోగంగా పరిగణించకూడదు. వాస్తవానికి, ఈ విధమైన సంగమం జరిగిన జాతకులు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉదాహరణకు, ఈ సంగమం దశమ భావంలో ఏర్పడితే, జాతకులు తమ వృత్తిపరంగా గొప్ప విజయాన్ని సాధిస్తారు. జాతకంలో ఇతర గ్రహాలు కూడా బలంగా, అనుకూలంగా ఉన్నట్లైతే, ఆ జాతకులు గొప్ప స్థాయి అధికారాన్ని పొందుతారు. సృజనాత్మక రంగంలో ఉన్నత స్థాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మహోన్నత లాభాలు గడిస్తాయి.

               ఈ విధంగానే రవి-కేతు, చంద్ర-రాహు, చంద్ర-కేతువుల సంగమం కూడా వారు సంగమించిన రాశులు, భావాలు, దృష్టులు ద్వారా పరిశీలన చేసిన తరువాతే గ్రహణ యోగ ప్రభావాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది.

గ్రహణ యోగం వలన ఏర్పడే ఫలితాలు:

రవి: తండ్రిని, నాయకత్వాన్ని, అధికారాన్ని, ఉన్నత పదవిని, పేరు ప్రతిష్టలను సూచిస్తాడు.

చంద్రుడు: తల్లిని, మానసిక భావోద్వేగాలను, ప్రయాణాలను, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని సూచిస్తాడు.

రాహువు: కుతంత్ర ప్రయోగాలను, సహోసోపేతమైన కార్యాలను సూచిస్తాడు.

కేతువు: మోక్షాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, పరిశోధనను, గోప్యతను సూచిస్తాడు.

కావున ఈ గ్రహాల ద్వారా ఏర్పడిన ఈ అవయోగం వలన క్రింద ఇవ్వబడిన ఫలితాలను జాతకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  1. గ్రహణ యోగం ఉన్న జాతకులు చేతబడి లాంటి ప్రయోగాలకు సులభంగా గురి కావడం జరుగుతుంది.
  2. ఏ కార్యం ప్రారంభించాలని తలచినా అందులో జాప్యం రావడం, తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది.
  3. జీవితం అయోమయంగా మారి, మానసిక సమస్యలు, ఒత్తిళ్ళకు గురి కావడం.
  4. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక జీవితంలో విప్పలేని చిక్కుముడులు ఏర్పడతాయి.
  5. ఈ యోగం వలన జాతకులకు విపరీతమైన కోపం, దురుసు స్వభావం ఏర్పడి, తద్వారా సంఘంలో పేరు, ప్రతిష్టలు నష్టపోవడం జరుగుతుంది.
  6. ఈ గ్రహణ యోగం వలన గర్భం దాల్చేందుకు తీవ్ర కష్టంగా, తరచూ అబార్షన్లు కావడం జరుగుతాయి.
  7. ఈ గ్రహణ యోగం ఉన్నవారికి తండ్రితో, తల్లితో సత్సంబంధాలు లేకపోవడం జరుగుతుంది.
  8. సంఘంలో పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లడం జరుగుతుంది.
  9. కొన్ని ఆకస్మిక సంఘటనల వలన ఒక్కసారిగా జీవితం తిరగబడిపోవడం.
  10. ధన నష్టం, వ్యాపార నష్టం కలుగుతాయి.

కావున గ్రహణ యోగ నిర్ధారణను క్షుణ్ణంగా పరిశీలించాలి. వీటి ఫలితాలు కూడా ఆ యోగ ప్రభావాన్ని బట్టి, వాటి తీవ్రత ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి ఉంచుకొని, వాటికి తగిన పరిహారాలు చేయించుకున్న యెడల, గ్రహణ యోగ ప్రభావం యొక్క తీవ్రత తగ్గి, తమ వ్యాకతీగత, వృత్తిపరమైన జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి.

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

 

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.