12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Dosha

మానవ జీవితములపై ప్రభావాన్ని చూపించే ప్రధాన గ్రహాలైన రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ , శని అను ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు మరియు కేతువు మధ్య చిక్కుకొని ఉన్నవారికి ఆ పరిస్థితిని కాలసర్పదోషం అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మకుండలిలోని ఆరు స్థానాలలో ఏ గ్రహాలచేత ఆక్రమించబడకుండా ఉంటాయో అట్టి స్థితిని సంపూర్ణ కాలసర్ప యోగం అంటారు. కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం మానవుల జీవితాలలో ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి. మనిషి తాను చేసే కార్యాలకు తగిన ఫలితాన్ని పొందలేదు. కొందరికి కాలసర్పదోషం ఉన్న స్త్రీ, పురుషులకు వివాహం కాకపోవటం, సంతానం కలుగకపోవటం, వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవటం, తరచూ కోర్టు కేసులలో లేదా తగాదలలో ఇరుక్కోవటం తరచుగా బంధువులతో శతృత్వాన్ని పొందటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటం జరుగుతుంది. మనిషికి కావలసిన అదృష్టాన్ని అడ్డగించటములో కాలసర్పదోషం పోషించే పాత్ర ఎంతో ఉంటుంది. కాలసర్పదోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడులతో సంబంధం లేదు. ధనిక, పేద తేడా లేకుండా ఈ కాలసర్పదోష ప్రభావానికి గురి కావలసి ఉంటుంది. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములో ఉత్కంఠను , ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. హైందవ జ్యోతిష్యశాస్త్రములో ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ అతి తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కో రకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయస్సు వరకు ప్రభావం ఉంటుంది. కొన్ని కాలసర్పదోషములు మాత్రం మనిషి మరణించేంత వరకు దాని ప్రభావం చూపుతుంది. కలసర్పదోషాలు 12 రకములు. అవి ఏమిటో తెలుసుకుందాము.

 

 1. అనంత కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు లగ్నములో మరియు కేతువు సప్తమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి “అనంత కాలసర్ప దోషం” ఉన్నట్టు గుర్తించాలి. ఈ అనంత కాలసర్ప దోషం వలన బాధపడేవారు తరచుగా అవమానములు ఎదుర్కోవటం , ఆందోళనలకు గురి కావటం జరుగుతుంది. వీరిలో న్యూనత భావం ఎక్కువగా ఉంటుంది. ఇక కోర్టు సంబంధిత విషయాలకు వస్తే వీరు విసుగు కల్పించే , ఎంతో కాలముగా పూర్తి కానీ కేసులు ఉంటాయి. వీరి ఆరోగ్యము కూడా తరచూ బాధకరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఈ అనంతకాలసర్ప దోషం ఉన్నవారు మానసికంగా మరియు శరీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 2. కులికా కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు ద్వీతీయ భావములో మరియు కేతువు అష్టమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి కులికా కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ రకమైన కాలసర్పదోషం ఉన్నవారు ధనాన్ని నష్టపోవటం , ప్రమాదాల వలన నష్టపోవటం జరుగుతుంది. వీరి కుటుంబములో తగాదాలు, నరాల బలహీనత, మూర్చలు లాంటి సమస్యలు వస్తాయి. కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు.ఈ కాలసర్పదోషం అనుభవిస్తున్న వారు వారి మాటలను ఎంతో అదుపులో ఉంచుకోవాలి. వీరి మాటలు ఇతరులను సులభంగా బాధిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. కుటుంబ సభ్యులలో మరియు సమాజములో వీరికి ఉన్న గౌరవము పోయే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఆర్థిక పరిస్తితి నిలదోక్కుకోవటం కోసం ఎంతో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఈ కాలసర్పదోషం ఉన్నవారు సహజంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొంతుకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చు.
  కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు
 3. వాసుకి కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే మూడవ స్థానములో రాహువు మరియు తొమ్మిదవ స్థానములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నట్లైతే వారికి వాసుకి కాలసర్పదోషం ఉందని గుర్తించాలి. ఈ కాలసర్పదోషంతో భాడపడేవారు సోదరుల కారణంగా లేదా అక్కాచెల్లెళ్ల కారణంగా నష్టపోవటం జరుగుతుంది. వీరు బంధువుల వలన కలిగే చిక్కులవలన గాని, రక్త సంబంధమైన సమస్యల వలన గాని, ఆకస్మిక మృతి పొందే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ జీవితములో సమస్యలు ఎదుర్కొంటారు. వీరి అదృష్టము ఎక్కువగా ఉండదు. స్నేహితుల వలన లేదా బంధువుల వలన మోసపోతారు. వ్యాపారములో, వ్యాపార భాగస్వాములతో నష్టాలు ఎదురయ్యి సమస్యలు ఎదుర్కొంటారు.  ఈ దోషం ఉన్న వారు సమస్యల వలన సతమతం అయ్యి ఆ ఆందోళనలో వీరు చేసే పనుల వలన ఇంకా సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరులు వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందరూ వీరిని మోసగించాలనే చూస్తారు. రాహు లేదా కేతు మహా దశలో వీరు దూర ప్రయాణములు చేయుట మంచిది కాదు.
 4. శంఖపాల కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు నాలుగవ భావములో మరియు కేతువు దశమ భావములో ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి శంఖపాల కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. ఈ దోషం ఉన్న వారికి వారి తండ్రి నుండి ప్రేమ లభించదు. వీరు అతి శ్రమలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. తరచుగా వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.  వీరి జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో హీనమైన పరిస్థితులలో మరణించటం జరుగుతుంది. వీరికి దేనిమీద సరైన ధ్యాస (Concentration)  ఉండదనే చెప్పాలి. ఉదాహరణకి తదేక ధ్యాస పెట్టె డ్రైవింగ్ లాంటి వాటిపై వీరికి పట్టు ఉండదు కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. ముఖ్యంగా వీరి తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ సరైన బాంధవ్యము ఉండదు. కొందరికి వీరు నివశిస్తున్న ఇంటిలో వాస్తు దోషములు కూడా ఏర్పడవచ్చు. హుద్రోగములు, ఛాతీ, ఊపిరితిత్తులకు వ్యాధులు రావచ్చు. పై అధికారులతో పేచీలు ఉంటాయి. ప్రోమోషన్లు రాక ఇబ్బందుల పాలవుతారు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.
 5. పద్మ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే పంచమ భావములో రాహువు మరియు ఏకాదశ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు పద్మ కాలసర్ప దోషము నుండి బాధపడుతున్నట్టు గుర్తించాలి. ఇలాంటి జాతకులు చదువులో వెనుకబడటం జరుగుతుంది.జీవిత భాగస్వామికి తరచూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సంతాన భాగ్యమును పోందలేకపోవటం , స్నేహితుల వలన వంచింపబడటం జరుగుతుంది. చదువు పరంగా వెనుకబడి ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో, వ్యాపారాలలో, మార్కెట్ పరంగా వీటన్నింటిలో వీరికి అదృష్టము ఉండదు. కొందరికి సంతాన పరంగా ఆలస్యము ఉంటుంది. ప్రేమ వ్యవహారములో మరియు వైవాహిక జీవితములో సమస్యలు ఉంటాయి.  కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండదు.
 6. మహా పద్మ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే 6వ స్థానములో రాహువు మరియు 12వ స్థానములో కేతువు ఉంది మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి మహాపద్మ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ కాలసర్పదోషం ఉన్నవారికి వెన్నుముక ప్రారంభములో నెప్పులను, తలనొప్పులను, చర్మ వ్యాధులను కలిగి ఉంటారు. అంతేకాకుండా తరచుగా ఆస్తుల నష్టం జరుగుతుంది. వీరిపై తంత్ర ప్రయోగములు సులభముగా జరగగలవు. మామూలుగా ఇలాంటి జాతకులు విదేశాలలో ఉంటూ కుటుంబములో ఆశాంతి కలిగి ఉంటుంది. స్వయంకృత అపరాధల వలన వీరు మోసపోతారు. మానసిక రుగ్మత (డిప్రెషన్) , ఇతరుల పట్ల ద్వేషము, చేసే వృత్తి నుండి తేసివేయుట జరుగవచ్చు. కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు
 7. తక్షక కాలసర్పయోగం : ఎవరి జన్మకుండలిలో అయితే సప్తమ భావములో రాహువు మరియు లగ్నములో కేతువు ఉన్నట్లైతే వారికి తక్షక కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు నీచంగా ప్రవర్తించే వారిచేత అనేక రకాల బాధలు పొందవలసి ఉంటుంది. వీరు వ్యాపారములో నష్టపోవటం, అసంతృప్తితో బాధపడటం, వైవాహిక సుఖమును పోందలేకపోవటం జరుగుతాయి. ప్రమాదములు జరుగుతాయి. ఈ దోషము ఉన్నవారు ముఖ్యంగా శారీరక లక్షణములు వ్యతిరేకంగా ఉంటాయి. సహజ పొడుగు, బరువు కాకుండా వ్యతిరేకంగా ఉంటారు. శారీరక లక్షనాలే కాకుండా మానసిక లక్షణాలు కూడా వీరికి సరిగా ఉండవు. ఇతరులతో పోలిస్తే ఈ దోషం ఉన్న వారికి బుద్ధి కుశలత ఉండకపోవడం గమించవలసిన విషయం. నరముల బలహీనత కలుగుతుంది. సమస్యలను తట్టుకోలేక ఈ దోషము ఉన్నవారిలో కొందరు ఉన్మాది స్వభావము వారి వలె ప్రవర్తిస్తారు. వివాహేతర సంబంధములు చిక్కులు కలుగచేస్తాయి.
 8. కర్కోటక కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే అష్టమ భావములో రాహువు మరియు ద్వీతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు పూర్వీకుల ఆస్తులు అన్నీ కోల్పోతారు. శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు. విషపూరితమైన సర్పాల వలన గాని లేదా కీటకలా వలన గాని ప్రమాదములు పొందవచ్చు. కుటుంబములో అనేక సమస్యలు కలుగవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక నష్టము జరుగుతుంది. ఎటువంటి సహాయము పొందలేని వారు అవుతారు. యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు దురయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషన్ పరంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోగలరు.
 9. శంఖచూడ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే నవమ భావములో రాహువు మరియు తృతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శంఖ చూడ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. మతానికి వ్యతిరేకమైన కార్యకలాపములు జరుపుటకు సిద్ధపడతారు. హై బి.పి. , నిరంతర ఆలోచనలు ఉంటాయి. ఈ దోషం ఉన్న వారికి జీవితములో పైకి ఎదగడం ఎంత సులభమో , క్రిందకి జారిపోవటం కూడా అంతే సులభం. జీవితములో వీరికి ఏది సులభంగా దొరకదు. చేసే ప్రొఫెషన్ లో స్థిరత్వం కోల్పోతారు. ఈ దోషం ఉన్నవారికి, వీరి తండ్రికి భేదాభిప్రాయములు వస్తాయి. వీరికి పితృశాపము కూడా ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషంతో ఉన్నవారికి ఎవరిని నమ్మాలో తెలియక అన్నీ చోటల ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లవచ్చు. లీగల్ విషయాలలో ఎన్నో ఇబ్బందులు కలుగవచ్చు.
 10. పాతక కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే దశమ భావములో రాహువ్ మరియు చతుర్థ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి పాతక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు కుటిల స్వభావము కలిగి ఇతరులకు ద్రోహము చేయుటకు పాల్పడతారు. ఈ దోషం ఉన్నవారి ఇళ్ళల్లో దొంగతనాలు జరుగుతాయి. పైశాచిక పీడ ఎక్కువగా ఉంటుంది. లో బి.పి సమస్య ఉంటుంది. ఈ దోషం ఉన్న వ్యాపారస్తులు ఒకే వ్యాపారం చేయటం వలన ఎక్కువ నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా అనిపించడం లాంటి మానసిక ఆందోళనలు కలిగి ఉంటారు.
 11. విషధార్ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే ఏకాదశ భావములో రాహువు మరియు 5వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నత్లితే వారికి విషధార్ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. సోదరులతో విబేధాలు కలుగవచ్చు. చపల మనస్తత్వం కలిగి ఉంటారు. సంతాన పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కారాగార శిక్ష అనుభవించే సూచనలు రావచ్చు. నిద్రలేమి, కంటి సమస్యలు, హృదయ సమస్యలు రావచ్చు. పై చదువులు చదువుకోవాలంటే చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. సంతానము ఆలస్యముగా కలుగవచ్చు. కొంత డబ్బు కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేయవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది.
 12. శేషనాగ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే ద్వాదశ భావములో రాహువు మరియు 6వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శేషనాగ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. తరచూ ఓటమికి గురి అవుతూ ఉంటారు. దురదృష్టం వీరిని వెంటాడుతూ ఉంటుంది. రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు. నేత్ర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు

ఈ విధంగా మానవ జీవితాలను అల్లకల్లోలం చేసే ఈ కాలసర్ప దోషాలను తగిన జ్యోతిష్య సంబంధమైన పరిహారాలతో నివారణ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే జాతకులు తమ జీవితములో వెలుగును చూడగలరు. అద్భుతమైన మహత్యాలను ప్రదర్శిస్తున్న కేరళ రాష్ట్రములోని సర్ప క్షేత్రములలో సర్ప పరిహారములు జరిపించుకున్న యెడల కాలసర్పశాంతి జరిగి ఈ కాలసర్ప దోషం వలన కలిగే బాధల నుండి విముక్తి పొందవచ్చు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన కొరకు ఈ లింకును క్లిక్ చేయగలరు. 

ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు పోస్టల్ మరియు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com 

                              ఓం నమో నాగరాజాయ నమః

Related Articles: