loading

Month: May 2020

వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు

వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సప్తమ స్థానాన్ని వైవాహిక స్థానంగా చెబుతారు. కాని వైవాహిక జీవితంలో మాత్రమే కాకుండా ప్రేమలో గాని స్నేహంలో గాని, వ్యాపార భాగస్వామ్యంలో గాని మనకు ఏర్పడే బంధాలు కూడా ఈ సప్తమ స్థానం తెలియజేస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందా? బహుకళత్ర యోగాలు ఏమైనా ఉన్నాయా? జీవిత భాగస్వామితో మానసిక, శారీరక సంబంధం ఏ విధంగా ఉంటుంది? వివాహం తరువాత వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? వివాహం ఆలస్యం ఎందుకు అవుతోంది? అన్న విషయాలు అన్నీ కూడా ఈ సప్తమస్థానంతో ముడిపడి ఉంటాయి.

సప్తమ స్థానం ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది?

          మానవుడి జీవితంలో యవ్వన దశ ప్రారంభం కాగానే వారి జీవితంలో శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభం అవుతుంది. స్త్రీ, పురుష సంబంధ, మానసిక, శారీరక సంబంధాలు ఏర్పడటం ప్రారంభం అవుతాయి. ఈ దశ నుండి వారి జీవితంలో అత్యంత కీలకమైన మార్పులు సంభవిస్తాయి. స్త్రీ పురుషుల మధ్య పరస్పర మానసిక శారీరక ఆప్యాయతలు, వాంచలు పొందాలని కోరుకోవటం మరియు పొందడం జరుగుతుంది. ఈ సంఘటనల వల్ల కొన్ని సంధర్భాలలో స్త్రీ పురుషులు మానసిక భావోద్వేగాలకు గురి కావడం, ప్రేమానురాగలను పొందడం, శృంగార వాంచలు తీర్చుకోవడం సర్వ సాధరణంగా జరుగుతుంది. అయితే ఈ సంఘటనలు అందరి జీవితంలో ఒకే విధంగా జరగవు. వారి కర్మ జాతకంలో సప్తమ స్థానంలో ఉన్న గ్రహాయోగాలు, అవయోగాలు వారి యొక్క మానసిక, శారీరక గుణాల పైనా, ప్రవర్తన పైనా ప్రభావితం చేస్తాయి. అంటే, సప్తమ స్థానం స్త్రీ పురుషులపై వారి జీవితంలో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల స్థితి గతులను బట్టి, వారి శృంగార జీవితం, వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుంది. స్త్రీ పురుషుల యొక్క సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి, వారి వివాహ విషయాలు, శృంగార సాంగత్యాలు, పునర్వివాహాలు, వైవాహిక జీవితంలో ఆనందం వంటి విషయాలు ఖచ్చితంగా నిర్ణయింపబడతాయి. మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ అంశాలను సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు నిర్దేశిస్తాయి. అందువల్ల జన్మకుండలిలోని సప్తమస్థానంలోని గ్రహస్థితులను, యోగాలను, అవయోగాలను తెలుసుకొని పరిశీలించుకొని ముందు అడుగు వేయటం మంచిదని మహర్షులు తెలియజేశారు.

            జ్యోతిష్య శాస్త్రములో సప్తపది అనే ఒక భాగంలో సప్తమ స్థానాలపై గ్రహాల ప్రభావం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో వివరంగా ఇవ్వటం జరిగింది. ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను, విశ్వాసాన్ని ఇవ్వకపోవడం వల్ల జాతకులు కళత్ర స్థాన విషయాలను తెలియజేసే సప్తపదిని ప్రస్తుత కాలంలో వాడకపోవడం జరుగుతుంది. అందుకారణంగా దోష పూరితంగా ఉన్న సప్తమస్థాన అవయోగ ప్రతికూల ఫలితాలను, దుష్పరిణామాలను వైవాహిక, శృంగార జీవితంలో ఎదురవుతున్నప్పుడు గ్రహ దోష నిర్ధారణ మరియు తెలుసుకోకపోవటం వల్ల గులాబీ ముళ్ళ పాన్పులో శయనించినట్టుగా జీవితం గడచిపోతుంది. వివేకవంతులు అయిన వ్యక్తులు ఈ విషయాన్ని గమనించి సప్తపది అంశాన్ని ఉపయోగించి గ్రహదోషాలను తెలుసుకొని వాటికి పరిహారాలను ఆచరించి ప్రేమ, శృంగార, వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు.

సప్తమ స్థానానికి సంబంధించిన కొన్ని గ్రహస్థితులు, వాటి ఫలితాలను గూర్చి ఇక్కడ మీకు వివరిస్తున్నాను.

  • సప్తమ స్థానంలో బుధుడు+గురువు కలసి ఉన్నట్లైతే దంపతులు తాత్కాలిక వియోగాన్ని అనుభవిస్తారు. భర్త దూరదేశాల్లో ఉండటం జరుగుతుంది. దంపతులు విడిపోరు కానీ, ఒకరికొకరు దూరమయ్యి ఎడబాటును భరిస్తారు. దీనినే సుదీర్ఘ వియోగ యోగం అంటారు.
  • చంద్రుడు, శుక్రుడు, రవి కలసి 7వ స్థానంలో ఉంటే, దాంపత్యం విచ్ఛిన్నమవ్వడం, భర్తకి లేదా భార్యకి మరొకరితో సాంగత్యం ఏర్పడటం జరుగుతుంది.
  • సప్తమ స్థానంలో కుజుడు+ శని+ రాహువు ఉన్నా కూడా ఇదే పరిస్తితి ఎదురవుతుంది.
  • స్త్రీ పురుషుల జాతకములలో జన్మ లగ్నం నుండి 7వ భావములో కుజుడు+శుక్రుడు కలసి ఉండినా, కుజుని దృష్టి శుక్రునిపై పడినా, శుక్రుని దృష్టి కుజుని పై పడినా, నిశ్చయమైన తరువాత జరగాల్సిన వివాహాలు కూడా ఆకస్మికంగా ఆగిపోవడం జరుగుతుంది. ఈ గ్రహ స్థితులు ఉన్న జాతకులకు, పెద్దలను ఎదురించి వివాహాలు చేసుకోవడం ఆ తరువాత దాంపత్య విరోధములు ఏర్పడటం, ఒకరికొకరు దూరమయ్యి ఎడబాటుకు గురికావడం, విడాకులు, ప్రణయ హత్యలు, వ్యభిచారములు, దాని వల్ల వచ్చే వ్యాధులను అనుభవించడం జరుగుతుంది. 
  • జాతకములో కుజ శుక్రుల బలం లేకుంటే త్వరగా వివాహాలు జరుగవు. వివాహ విఘ్నములు వస్తాయి. కుజ దృష్టి శుక్రునిపై కలిగి ఉన్న జాతకులు తీవ్ర కామ స్వభావం కలిగి ఉండటం వల్ల, వివాహానికి పూర్వమే సంభోగ సుఖాన్ని అనుభవించే అవకాశములు ఉంటాయి. వీరిలో కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. ఈ దోష పరిహారం కాకుండా జాతకులు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ వివాహం జరిగినా వీరి వైవాహిక జీవితం పరస్త్రీ, పర పురుష సాంగత్యాలతో నడుస్తుంది.
Marriage life astrology
వైవాహిక జీవితం-సప్తమ స్థానం
  • పంచమ స్థానంలో కుజ శుక్ర సంయోగం వల్ల పుట్టిన సంతానం మరణిస్తారు. వృషభ తులారాశుల వారికి ఈ దుస్సంఘటనలు జరుగవు. పురుషునికి పంచమ స్థానంలో శుభ గ్రహాలు ఉండాలి. గ్రహాలు ఏమి లేకపోయినను దోషం ఉండదు. దంపతుల సప్తమ స్థానంలో అనగా 7వ స్థానంలో కుజ శుక్రులు ఉన్నట్లైతే, వివాహం జరిగిన 7 రోజులు లేదా 7 వారాలకు లేదా 7 నెలలకు దంపతులు విడిపోవడం, ఒకరికి ఒకరు దూరంగా ఉండటం, విడాకులు అవ్వడం, నూటికి నూరు శాతం జరుగుతుంది.
  • యువతీ యువకుల తలిదండ్రులు ఈ గ్రహస్థితులను బాగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉన్నాయో లేదో చూడకుండా వివాహాలు జరిపిస్తే మీ కుమార్తె గోడకు కొట్టిన బంతిలాగా వెంటనే తిరిగి పుట్టింట్లో పడే అవకాశం ఉంటుంది. ఆ తరువాత విడాకుల ప్రయత్నాలు, పోలీసు కేసులు, చట్టపరమైన వివాదాలు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు, ఇవే జరిగేవి. అందువల్ల తస్మాత్ జాగ్రత్త.
  • స్త్రీ జాతకంలో సప్తమ స్థానంలో శని ఉంటే ఆ జాతకురాలికి వివాహం జరిగిన వెంటనే విడాకులు లేదా భర్త మరణించడం జరుగుతుంది. గర్భసంచి లోపాలు తలెత్తుతాయి.

Related Articles:

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.