తక్షక కాలసర్ప దోషం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో ఏడవది అయిన తక్షక కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.
- దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ
జన్మకుండలిలో సప్తమ భావములో (వైవాక స్థానం, వ్యాపార స్థానం) రాహువు మరియు లగ్నములో (తనుభావము, లక్షణాలు, వైఖరి) కేతువు ఉన్నట్లైతే వారికి తక్షక కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. తక్షక కాలసర్పదోషం వలన జాతకుల యొక్క వ్యక్తిత్వం పై, లక్షణాల పై, వైఖరి పై, వైవాహిక జీవితం పై, వ్యాపార భగస్వామ్యం పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ తక్షక కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.
తక్షక కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:
- ఈ దోషం గల జాతకులు తాము ఉండాల్సిన శారీరక బరువు కంటే ఎక్కువగా గాని, తక్కువగా గాని ఉందురు. శారీరక లక్షణములు వ్యతిరేకంగా ఉంటాయి. సహజ పొడుగు, బరువు కాకుండా వ్యతిరేకంగా ఉంటారు. శారీరక లక్షణాలే కాకుండా మానసిక లక్షణాలు కూడా వీరికి సరిగా ఉండవు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.
- వైవాహిక జీవితంలో అసంతృప్తి, ఆటంకాలు ఉంటాయి.
- జీవిత భాగస్వామితో వైరములు ఏర్పడును.
- జాతకుల యొక్క వైఖరి కారణంగా వృత్తి పరమైన విజయం వీరికి కష్టతరం అవుతుంది.
- నరాలకు సంబంధించిన అనారోగ్యములు ఎదుర్కొంటారు.
- షేర్లు, లాటరీ, జూదం, బెట్టింగులు వంటి స్పెక్యులేషన్లకు బానిసలు అవుతారు.
- వివాహేతర సంబంధాలకు అధిక అవకాశాలు ఉంటాయి, చిక్కులు కలుగచేస్తాయి.ప్రేమ వ్యవహారాలు వీరికి సమస్యలు తెచ్చి పెట్టును.
- ఈ జాతకులు మాట్లాడే ప్రతీ మాటకు రెండు అర్థాలు ఉంటాయి. వీరి మాట తీరు చాలా దురుసుగా ఉంటుంది మరియు రహస్య ప్రవర్తన కలిగి ఉంటారు. దీని వలన తోబుట్టువులతో, స్నేహితులతో సమస్యలు వచ్చును.
- ఈ జాతకులకు ఆత్మ విశ్వాసం, ధైర్యం లోపించును.
- జీవిత భాగస్వామితో గాని లేదా వ్యాపార భాగస్వామితో గాని ఈ జాతకులకు అదృష్టం వరించదు.
- మొదటి వివాహంలో ఈ జాతకులు తమ జీవిత భాగస్వామి పై నిర్లక్ష్యం చూపడం వలన కొన్ని రాశుల వారికి విడాకులు కూడా జరుగును (కొన్ని గ్రహస్థితులకు మాత్రమే).
- కొందరికి వివాహం ఆలస్యం అగును. భార్య తరపున బంధువులు వలన గాని లేదా భార్య యొక్క ప్రవర్తన వలన గాని దంపతులు విడిపోయే అవకాశాలు మెండు.
- వివాహం తరువాత వీరి జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- ఈ దోషం ఉన్నవారు నీచంగా ప్రవర్తించే వారిచేత అనేక రకాల బాధలు పొందవలసి ఉంటుంది.
- వీరు వ్యాపారములో నష్టపోవటం, అసంతృప్తితో బాధపడటం, వైవాహిక సుఖమును పోందలేకపోవటం జరుగుతాయి. ప్రమాదములు జరుగుతాయి.
- ఇతరులతో పోలిస్తే ఈ దోషం ఉన్న వారికి బుద్ధి కుశలత ఉండకపోవడం గమించవలసిన విషయం.
- సమస్యలను తట్టుకోలేక ఈ దోషము ఉన్నవారిలో కొందరు ఉన్మాది స్వభావము వారి వలె ప్రవర్తిస్తారు.
ముఖ్య గమనిక:
తక్షక కాలసర్ప దోషం వలన వైవాహిక జీవితం పరంగా, వ్యాపారం పరంగా, వ్యక్తిగత తీరు పరంగా, వ్యక్తిగత లక్షణాల వలన కలిగే సమస్యల పరంగా ఎన్నో సమస్యలు కలుగుతాయి. అయినప్పటికి, కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయని జాతకులు గమనించాలి. ఈ జాతకులు తమ వ్యాపారాన్ని భాగస్వామ్యంగా కాకుండా సొంతంగా పెట్టుకోవడం వలన రాణిస్తారు. విదేశీ లాభాలు కనబరుస్తాయి. పై అధికారుల నుండి మంచి కాంట్రాక్టులు పొందడం లాంటి లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 50 సంవత్సరాల తరువాత శుభ ఫలితాలు కనబరుస్తాయి. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.
తక్షక కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఈ దోషం గల జాతకులు తమకు కొన్ని సంధర్భాలలో ఎంత కోపం వస్తున్నప్పటికి, తమ మాటలను మరియు చేష్టలు అదుపులో పెట్టుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని మర్యాదపూర్వకంగా మాట్లాడినా యెడల ఈ దోష జాతకులకు కలిగే సమస్యలలో దాదాపు అన్నీ సమస్యలు కూడా సాఫీగా తీరిపోతాయి.
- ఈ దోష జాతకులు తమ ఆత్మీయులతో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. ఈ జాతకులు నిజాయితీ ప్రదర్శించిన యెడల వీరికి దైవానుగ్రహం కూడా కలుగుతుంది.
- జీవిత భాగస్వామితో ఈ జాతకులకు సమస్యలు ఏర్పడతాయి. కావున దంపతులకు గొడవలు జరిగే సమయంలో కాకుండా, ప్రశాంతంగా ఉన్నపుడు తమ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.
- ఈ దోష జాతకులు పొరపాటున కూడా భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. ఈ జాతకుల యొక్క వ్యాపార భాగస్వామి చేతిలో తీవ్రంగా మోసపోతారు.
- ఈ జాతకులు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వీరి భావోద్వేగాల ప్రదర్శన వలన వీరి చుట్టూ ఉన్న ప్రజల యొక్క మనసు గాయపడే అవకాశం ఉన్నది.
పరిహారాలు:
- 40 రోజుల పాటు హనుమాన చాలీసా పఠనం ఎన్నో ఇబ్బందులను దూరం చేస్తుంది.
- 7 లేదా 16 బుధవారాల పాటు గణపతికి ఉండ్రాళ్ళ నివేదన చేయాలి.
- తక్షక కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకుఇక్కడ క్లిక్చేయండి.
- నిష్ణాతులైన జ్యోతిష్యులను సంప్రదించి జాతకంలో ఇంకేవైనా దోషములు, అవయోగములు ఉన్నాయేమో పరిశీలించుకొని, వ్యక్తిగత పరిహారాలు జరిపించుకోవాలి.
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- గ్రహణ యోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి? ఎలా గుర్తించాలి?
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.