ఆంగ్ల సంవత్సరాధి సూర్యుని ఆధారముగా నిర్దేశించడం జరుగును. చాంద్రమానం ఎంత ప్రసస్తమో అదే రీతిగా సౌరమానము కూడా మిక్కిలి ప్రశస్థము. గ్రహాగతుల స్థితులను తెలుసుకోవడానికి సంఖ్యా శాస్త్రము మాత్రమే అవశ్యకతను కలిగి ఉంది.  అందుచేత సౌరమానముచే రూపొందించబడిన క్యాలెండర్లు, చాంద్రమాన, సౌరమాన మిశ్రితము. హైందవేతరులు ఆంగ్ల సంవత్సరాదిని ప్రామాణికముగా తీసుకుంటారు. ఇది వేరొక పద్ధతి. మానవులందరూ చంద్రబలం కలిగిన తిథులను తెలుసుకోవడం సాధ్యం కాదు.

కనుక క్యాలెండర్లను అనుసరించడం ఉత్తమమే. ఈ ఆంగ్ల సంవత్సరం 2022 జనవరి 1 నుండి ప్రారంభమయ్యింది. ప్రతీ 15 రోజులు ద్వాదశ రాశుల గ్రహ గోచార ఫలితాలు గ్రహస్థితి గతులను ఎంతగానో అన్వేషించి, విశ్లేషణ చేసి, పరిశీలించి ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది. అయితే చాలా మందికి సందేహము కలుగవచ్చు. ఏమనంటే, 12 రాశుల వారికి తెలిపిన గ్రహ గోచార ఫలితాలు, ఆవశ్యకత లేని వారు ఎలా పొందగలరు అని. ఉదాహరణకు:- పంచాంగములో మేషరాశి వారికి మార్చి నెలలో పదవీయోగం లేదా రాజకీయయోగమో కలుగునని ప్రచురిస్తారు. మేషరాశిని కలిగిన చిన్న వయసు వారు, అనగా శిశువుకు రాజకీయయోగములు ఏ విధంగా ప్రాప్తిస్తుంది అని భావిస్తారు. వృషభరాశి వారికి ఏప్రిల్ నెలలో సంతాన ప్రాప్తి కలుగునని చదివి, చిన్నపిల్లలకు లేదా వృద్ధాప్య స్త్రీలకు (వృషభ రాశి వారికి) సంతానము ఎలా కలుగుతుందని భావిస్తారు, శంకిస్తారు. ఈ విషయం అర్థం గాక ఆగమ్య గోచరంలో పడతారు. ఇందులో గూఢార్థం ఏమిటంటే, జాతకులకు వారి వ్యక్తిగత గ్రహ యోగాలు, అవయోగాలు, వారి పూర్వ జన్మ ఫలమును అనుసరించి వారికి ఆ యోగములు, అవయోగములు గోచారములో ప్రాప్తింపజేస్తాయి. ఉదాహరణకు:- జన్మించిన శిశువు ఏ వయస్సులో పొందాల్సిన ఎలాంటి యోగాలు, అవయోగాలు ఉంటాయో  ఆ వయస్సులో ఆ కాలంలో, ఆ గ్రహదశా కాలంలో పొందుటకు వారి బుద్ధి ఆలోచనలు అదే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. దీనినే బుద్ధి కర్మణ్యేవసారేనా అని ప్రస్తావిస్తారు. 12 రాశులలో ఏడు గ్రహాలు వాటి ఫలితాలు ఒకే విధంగా అనుకూలంగా ఒకే సంధర్భములో ఇవ్వడం అసంభవం. అందుచేత సప్తగ్రహాలు ఒక నిర్ణీత కాలంలో ఫలితాలు యోగాలు, అవయోగాలు ఒకదాని తరువాత ఒకటి ఇవ్వడం జరుగును. ఈ మర్మాన్ని వివేకులు గ్రహిస్తారని నా సంకల్పం. ఈ గ్రహ స్థితులు ద్వాదశ రాశుల వారికి తెలుపడం వల్ల, ఈ కాలంలో ఆ రాశి వారికి ఏ విధమైనటువంటి యోగాలు ఇస్తాయో, ప్రతికూల అవయోగములు కలిగజేస్తాయో తెలుసుకుంటే వ్యతిరేక ఫలితాలను ఇచ్చే గ్రహాలను తెలుసుకోవడం వల్ల ఆ కాలంలో ఆ గ్రహాలకు శాంతి జరిపించి ఆ కాలంలో ఆ గ్రహాల అవయోగాల నుండి చాలా మేరకు తప్పించుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం మహా సముద్రం వంటిది. దీనిలో పరిపూర్ణ నిష్ణాతులు ఎవరూ ఉండకపోవచ్చు. మనం గ్రహించినంత మేరకు వాటి ద్వారా సమాజముకు, వ్యక్తులకు మేలు జరగాలని నా ఆశ. దైవ సమ్మతమైన యధార్థం ఏమిటంటే ఏ పూజలైన, హోమమైనా, జపం అయినా చిత్త శుద్ధితో చేయాలి. అప్పుడే భగవదానుగ్రహం కలుగుతుంది. కార్యాన్ని గురితో చేయాలి గాని గుడ్డిగా కాదు.

మేషరాశి గోచార ఫలితాలు

వృషభరాశి గోచార ఫలితాలు

మిధునరాశి గోచార ఫలితాలు

కర్కాటకరాశి గోచార ఫలితాలు

సింహరాశి గోచార ఫలితాలు

కన్యారాశి గోచార ఫలితాలు

తులారాశి గోచార ఫలితాలు

వృశ్చిక రాశి గోచార ఫలితాలు

ధనస్సు రాశి గోచార ఫలితాలు

మకరరాశి గోచార ఫలితాలు

కుంభరాశి గోచార ఫలితాలు

మీనరాశి గోచార ఫలితాలు

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com