వైవాహిక జీవితం-జ్యోతిష్య కారణాలు Married life-Astrological Reasons

వివాహం అనేది పరిమితి రోజుల వరకు ఉండే కాంట్రాక్టు కాదు, అలాగే శారీరక సుఖం కోసం ఉపయోగించే సాధనం కాదు. వివాహం అనేది భార్యా భర్తల మధ్య శారీరకంగా, మానసికంగా, అధ్యాత్మికంగా అన్ని విధాలా, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ, అనురాగం కలిగి ఉండాలని, నిండు నూరేళ్ళు కలసి ఉండాలని అగ్ని సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చేసే ఒక ప్రమాణం. వ్యక్తుల జన్మకుండలిలో వైవాహిక జీవితానికి సంబంధించిన గ్రహాలు చెడు, నీచ స్థానాలలో ఉన్నప్పుడు వైవాహిక జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. కొందరికి వైధవ్యం ప్రాప్తించి, కొందరికి విడాకులు జరిగి, కొందరికి పునర్వివాహము జరిగి వైవాహిక జీవితంలో అల్లకల్లోలం ఏర్పడుతుంది.

 

స్త్రీ, పురుష జాతకాలలో ద్వితీయ వివాహం ఉంది అంటే, మొదటి వివాహం విఫలం యైనట్టే. మొదటి వివాహంలో విడాకులు జరగడం లేదా జీవితభాగస్వామి గతించడం లేదా పర స్త్రీ/పురుష శృంగార సాంగత్యాలు కలగడం వల్ల ద్వితీయ వివాహ సూచనలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా జాతకంలో వైవాహిక దోషం, మాంగల్య దోషం ఉన్నవారికి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ దోషాలు వారి జన్మకుండలి(జాతకం)లో కనిపిస్తాయి. పునర్వివాహాలు, వైధవ్యాలు, విడాకులు, సంతాన దోషాలు, వంధ్యత్వమ్, నపుంసకత్వం, ఈ లక్షణాలను జన్మకుండలి ద్వారా పరిశీలించి ఆ దోషాలు ఉన్న జాతకులను వివాహం ఆడకపోవటం వివేకవంతుల లక్షణం. వధూవరుల జన్మకుండలిలో ఈ దోషాలు ఉన్నట్లైతే ఆ వ్యక్తులను వివాహమాడకపోవడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే దురదృష్టకరమైన, బాధాకరమైన సంఘటనలను నివారించడం సాధ్యం అవుతుంది. వధూవరుల వివాహం నిమిత్తం జాతకచక్రాలు అందులోని దోషములు, సంపూర్ణంగా పరిశీలించకుండా కేవలం వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, పై మెరుగులు మాత్రమే చూసి వివాహం జరిపించడం వల్ల వారిలోని దోషాల వల్ల భవిష్యత్తులో వారికి ఎదురయ్యే గ్రహదోషాల అవయోగాలు, అవయోగాల వల్ల వారి వైవాహిక జీవితం ఛిద్రం అవ్వడం, సంతాన భాగ్యాన్ని పొందలేకపోవడం, పర స్త్రీ/పురుష వశీకరణలకు గురి అవడం, ఆయుర్భావం సరిగ్గా ఉందా లేదా అని చూడకుండా వివాహం జరిపించడం వల్ల, వివాహం జరిగిన కొద్ది కాలానికే వధువు లేదా వరుడు అపమృత్యుదోషానికి గురి కావడం, వైధవ్యానికి గురి కావడం జరుగుతుంది. జన్మకుండలిలో అన్యోన్యతను కలుగజేసే గ్రహమైత్రిని తప్పక పరిశీలించాలి. అదే విధంగా వధువు జాతక చక్రములో అష్టమ స్థానం, సప్తమ స్థానం; వరుడి జాతకంలో సప్తమ స్థానం, పంచమ స్థానం, అష్టమ స్థానాలు తప్పక పరిశీలించాలి. నిశ్చితర్థానికి ముందే వధూవరులకు ద్వితీయ వివాహ దోషములు ఉన్నవో లేదో తప్పక పరిశీలించుకోవడం బాధ్యత గల తల్లిదండ్రుల లక్షణం. డబ్బులు కోసం గడ్డి తినే మ్యారేజ్ బ్రోకర్లు, మిడిమిడి జ్ఞానం గల జ్యోతిష్యుల అతి తెలివితేటలతో జాతకచక్రాలు తారుమారు చేస్తారు. అందువల్ల వధూవరులకు వారికి నిజంగా దోషాలు ఉన్నా, అవి తెలియకుండా పోతాయి. ఈ నూతనంగా కల్పించిన జాతకచక్రాల వల్ల ఈ దోషాలు అవగతము కావు. గొడ్డు వచ్చి చేనులో పడ్డట్టుగా వెంటవెంటనే గుణమేళన చక్రాలు, రాశి కూటాలు పరిశీలించుకొని తప్పటడుగులు వేసి వివాహానికి సిద్ధమవుతారు. కల్పిత జాతకచక్రాలను ఎవరినా తయారు చేయవచ్చు, కాని ఆ దోషాలు ఉన్నవారు, వారికి ఎదురయ్యే అవయోగాల నుండి తప్పించుకోవడం సాధ్యపడదు. అందుచేత ఒక వరుడు, ఒక వధువు వారి యొక్క రూపురేఖలకు, వారి జన్మకుండలికి ఖచ్చితంగా జతకూడిందో లేదో, వారు చెప్పిన జన్మకుండలి పుట్టిన తేదీ వివరాలు ఖచ్చితమైనవో కావో, సంపూర్ణ జ్యోతిష్య పరిజ్ఞానం గలవారికి మాత్రమే తెలుస్తుంది. మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశాలలో ప్రప్రధమైన అంశం “వివాహ ఘట్టం”. అందుచేత వివేకవంతులు అయిన వారు ఆ వివాహం చేసుకోబోయే వధూవరులు సంపూర్ణంగా, వారి జన్మకుండలిని పరిశీలించుకొని, యోగలను అవయోగాలను తెలుసుకొని అడుగు ముందు వేయటం మంచిది. ఈ గ్రహ అవయోగాల వల్ల భర్త/భార్య పరులకు వశం కావడం, వశీకరణకు గురి కావడం సంభవిస్తుంది. మొహిని వశబంధనకు గురి కావడం, కామమొహిని వశతంత్రముకు గురి కావడం జరుగుతుంది.

          వ్యక్తులకు ద్వితీయ, తృతీయ వివాహాలు జరుగుటకు కారణమయ్యే గ్రహస్థితులు

ఒక వ్యక్తి యొక్క జన్మకుండలిలో చంద్ర గ్రహ స్థితి, శుక్ర గ్రహ స్థితి, సప్తమ భావం, ద్వితీయ భావం, ద్వాదశ భావం, వాటి భావాధిపతులు, ఆ భావంలో స్థితి చెందిన గ్రహాలు, ఏడవ నవాంశలో చంద్ర స్థితి, శుక్ర స్థితి, ఏడవ భావాధిపతి ఏడవ నవాంశలో స్థితి చెందిన గ్రహం, కళత్ర భావం పై ఉన్న చెడు దృష్టి, ఈ భావాలు భార్య యొక్క గుణగణాలు, లక్షణాలు అన్నిటిని తెలియజేస్తాయి. అంతేకాకుండా జాతకుడితో వారి యొక్క భార్య ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, అతనికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో, ఎంతవరకు నమ్మకంగా ఉంటుందో తెలియజేస్తుంది.

ద్వితీయ వివాహానికి సంబంధించిన మరి కొన్ని గ్రహస్థితులు, విశేషాల కొరకు ఈ లింకును క్లిక్ చేసి చదవగలరు. 

  1.           రెండవ భావాధిపతి మరియు ఆరవ భావాధిపతి నీచ స్థానంలో ఉండి, ఆ భావాధిపతులు శని లేదా మాంది గ్రహంతో కలసి ఒకే భావంలో ఉండినా లేదా వారి దృష్టి ఆ భావాధిపతులపై పడిన, ఆ జాతకుడు తన జీవితభాగస్వామి యొక్క అతి దారుణమైన, అతి క్రూరమైన దుశ్చర్యలను, చేష్టలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడటం బలవన్మరణం చెందడం జరుగుతుంది.  
  2.           శుక్రుడు మరియు చంద్రుడు కలసి 7వ భావంలో గాని, 2వ భావంలో గాని, 12వ భావంలో గాని సంగమించినా లేదా 2,7,12 భావలలో ఒకరినొకరు వీక్షించుకున్నా, ఆ జాతకుని యొక్క జీవితభాగస్వామి అక్రమ సంబంధాలను నడుపుతారు. అందువల్ల ఆ వ్యక్తి మానసికంగా, సామాజికంగా తీవ్రంగా ఇబ్బందుల పాలవుతారు. ఒకవేళ చంద్రుడు 7లో గాని, 12లో గాని, చంద్రుడు క్రూర నవాంశ మరియు డ్రెక్కానంలో స్థితి చెంది మరియు శుక్రుడిపై శని లేదా రాహు వీక్షణ ఉండటం లేదా వారితో కలసి శుక్రుడు 8వ భావంలో ఉండినట్లైతే, ఆ జాతకులు ఒకరి చేతిలో ఒకరు వధింపబడతారు.
  3.           7వ భావాధిపతి 12లో ఉండి, లగ్నాధిపతి మరియు చంద్ర రాశ్యాధిపతి కలసి నీచ గ్రహాలతో కలసి 7వ భావంలో ఉండిన, ఆ వ్యక్తి యొక్క భార్య మరియు పిల్లలు అపమృత్యుపాలయ్యి, అతని వంశం అంతం అవుతుంది.
  4.           కన్యాలగ్నం వారికి మీనంలో బుధుడు, మేషంలో శుక్రుడు లేదా మకర లగ్నం వారికి 7లో బుధుడు, 8లో శుక్రుడు ఈ రెండు గ్రహస్థితులలో ఏదో ఒకటి ఉన్న వారికి, జాతకునికి, తన భార్యకి గర్భాదనం జరుగక ముందే విడిపోయి, వేరొకరిని ద్వితీయ వివాహం చేసుకోవడం జరుగుతుంది.  

ద్వితీయ వివాహానికి సంబంధించిన మరి కొన్ని గ్రహస్థితులు, విశేషాల కొరకు ఈ లింకును క్లిక్ చేసి చదవగలరు. 

Related articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com