loading

జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

  • Home
  • Blog
  • జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

జాతకులు తాము ఎదుర్కొంటున్న నివృత్తి కానీ సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానము, వాటికి పరిష్కార పరిహార మార్గాలు తెలుసుకునే విధానం.

జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ కర్మలు; స్వగృహ యోగం; సుఖవాహన యోగం; సంతాన యోగం; విద్యా యోగం; వివాహ యోగం; విదేశీయన విద్యా యోగం; విదేశీ ఉద్యోగ యోగం; విదేశీ నివాస యోగం; ప్రణయ సఫలీకృత యోగం (ప్రేమ వ్యవహారములు) ; శృంగార యోగం; పదవీ యోగం; వ్యాపార యోగం; వైవాహిక ఆనంద యోగం; దుర్మరణ అవయోగం; బలవన్మరణ అవయోగం; స్త్రీ మూలక విచార అవయోగం; స్త్రీ మూలక ధన ప్రాప్తి యోగం; నష్టద్రవ్య ప్రాప్తి యోగం; అదృష్ట యోగం; ఆయుః క్షీణ యోగం; పూర్ణాయుర్దాయ యోగం; దైవకృప సిద్ధి యోగం; దైవశాపం; స్త్రీ శాపం; మాతృ శాపం; పితృ శాపం; గురు శాపం; నాగ శాపం; పక్షి శాపం; బ్రాహ్మణ శాపం; మాతృ శాప అరిష్ట యోగములు, భూ, చరాస్తి యోగం; అనుకూల దాంపత్య యోగం; వాహన ప్రయాణ క్షేమ యోగం; వాహన దుర్ఘటన అవయోగం ఇలా మొదలైన యోగముల , అవయోగముల వలన జాతకులు పొందే ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందాలు పొందుటకు ఉపయోగించే గ్రహాల స్థితుల లక్షణములను ఆ యోగాలను పొందుటకు అడ్డుపడే గ్రహాల చెడు లక్షణాల స్థితిగతులను జన్మకుండలి జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చును. ఇందులో ప్రతి సమస్యకు పరిష్కారం పరిహారము ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించాలి.  

ఈ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, సమయము, స్థలము ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేయుటకు 2 రోజుల నుండి 7 రోజుల లోపు కొరియర్ ద్వారా పంపుతారు. సంభావన 1500/-  వివరాల కొరకు 9846466430 కాల్ చేసి కనుక్కోవచ్చు.

జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో ఒకటి లేదా ఎక్కువ గ్రహములు నీచపడటం లేదా అస్తంగత్వం చెందటం (లేదా) రాహు, కేతువులతో కలవటం (లేదా) పీడింపబడటం (లేదా) 6,8,12 వ భావములను ఆక్రమించటం జరిగినపుడు, ఆ జాతకుడు వ్యతిరేక ఫలితములను ఎదుర్కొంటాడు. ఈ వ్యతిరేక ప్రభావం తగ్గాలంటే, కొన్ని పరిహారాలు పాటించాలి.

  1. రవి : జన్మకుండలిలో రవి పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి నోటిలో ఎక్కువగా చొంగ కారుతూ ఉంటుంది. తరచుగా శరీర భాగములు తిమ్మిరి పట్టడం లేదా కొంత శారీరక దుర్బలం కావటం జరుగుతుంది. జాతకుడు తాను ఎల్లపుడూ తన స్థాయి గురించి భయపడుతూ ఉంటాడు. ఆ కారణంగా ఇతరుల వద్ద తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు. కొందరికి Color Blindness  వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి కంటి చూపు తగ్గుతుంది. ఆత్మాన్యూన్యత భావం వలన సమాజములో ఎక్కువగా కలవలేరు.
  2. చంద్రుడు:  జన్మకుండలిలో చంద్రుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి మానసిక వ్యాధులు కలుగుతాయి. ఏ పని చేయుటకు ఆసక్తి కలుగకపోవటం, నిరాశావాదం, అపనమ్మకం, పెంపుడు జంతువులు అకస్మాత్తుగా మరణించటం (చంద్రుడు అతి నీచ స్తితిలో ఉంటే) , భార్య లేదా ప్రేమికురాలిపై అనుమానాలు రావటం, తల్లితో విబేధాలు రావటం, ప్రేమికుల మధ్య తరచూ గొడవలు రావటం, క్రుంగిపోయిన ప్రతీసారి మద్యం సేవించడం లాంటివి జరుగుతాయి. కొందరు ఎడారి ప్రాంతములలో లేదా కరువు కాటకాలు వెలసిన ప్రాంతాలలో నివసిస్తారు. చంద్రుడు పాపగ్రహములతో కలిస్తే అధిక శృంగార వాంఛలు కలిగి హస్తప్రయోగం చేసుకోవటం, మనస్సుపై ఆధీనం లేకపోవటం, అశ్లీల చిత్రాలను చూడటం ఇలా మొదలైన అలవాట్లకు లోనవుతారు. ఈ గ్రహ స్థితి ఉన్నవారు నిజ జీవితములో కంటే, ఊహల్లోనే ఎక్కువగా జీవిస్తారు. దీని కారణంగా మంచి మంచి అవకాశాలను చేతులారా పోగొట్టుకుంటారు.
  3. కుజుడు :  జన్మకుండలిలో కుజుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. రక్త హీనత (anemia) , కళ్ల కింద గుంటలు పడటం, కాంతి చూపు లోపించడం, తలనెప్పులు రావటం జరుగుతాయి. పునరోత్పత్తి శక్తి లేక సంతానం ఆలస్యం అవడం జరుగుతుంది. స్త్రీ జాతకులకు ఋతుక్రమం సరిగా జరగకపోవటం, తరచూ గర్భవిచ్ఛితిలు (Abortions) జరగటం లాంటివి కలుగుతాయి. అప్పులు చేసి ఎంతో కాలం వరకు తిరిగి చెల్లించలేకపోవటం. రహస్యంగా జీవించటం. ధనం ఇతరులకు ఇస్తే అది తిరిగి రాకపోవటం. పోలీసుల నుండి భయం ఏర్పడటం. కలలో వచ్చే సంఘటనలు నిజ జీవితములో జరిగి ఆందోళనలకు గురి కావటం జరుగుతుంది.
  4. బుధుడు:  జన్మకుండలిలో బుధుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి వాసన పసిగట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. తరచూ దంత సంబంధిత సమస్యలు వస్తాయి. నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. చర్మ వ్యాధులు తలెత్తుతాయి. శృంగారం విషయములో కొందరికి లింగమార్పిడి లాంటి విచిత్ర ఆలోచనలు కలుగుతాయి. కొందరు తమ పేరును రహస్యంగా ఉంచుకొని వేరే పేరుతో అశ్లీల కథలను వ్రాస్తూ ఉంటారు.          
  5. గురువు:  జన్మకుండలిలో గురువు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి గురువు బలహీనంగా ఉండటం వలన విద్యలో ఆటంకములు కలుగుతాయి. బంగారము, ధనము నష్టపోతారు. చౌక నగలు వేసుకోవలసి వస్తుంది. చేయని తప్పుకు నిందలు మోయవలసి వస్తుంది. తలపై ఉన్న వెంట్రుకలు తరచూ రాలుతూ ఉంటాయి. వివాహం ఆల్స్యమ్ అవుతుంది (లేదా) వివాహం జరిగి సంవత్సరములు గడచినా సంతానం కలుగకపోవటం జరుగుతుంది. కొందరికి షుగరు వ్యాధి, స్థూలకాయం కూడా వస్తుంది.
  6. శుక్రుడు:  జన్మకుండలిలో శుక్రుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి బొటన వేలు బలహీనంగా ఉంటుంది లేదా బొటన వేలికి దెబ్బలు తగలటం జరుగుతూ ఉంటుంది. చర్మవ్యాధులు వస్తాయి. మగవారికి శుక్రకణముల సంఖ్య తగ్గిపోతుంది. ఆడవారిలో పునరోత్పత్తి తగ్గిపోతుంది. ప్రేమ వ్యవహారములు విఫలం అవుతాయి. స్త్రీ సంతానముతో విబేధాలు వస్తాయి. బలం, శక్తి రాను రాను తగ్గిపోతుంది. పగలుపూత అధిక నిద్ర కలుగుతుంది. కొందరికి షుగరు వ్యాధి వస్తుంది.
  7. శని:  జన్మకుండలిలో శని పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి   అగ్నిప్రమాదములు   జరగటం లేదా Short Circuit కలుగటం లాంటివి జరుగుతాయి. పాలవ్యాపారం చేసేవారికి పశువులు మరణిస్తాయి. కనురెప్పలు నుండి తరచూ వెంట్రుకలు రాలతాయి. నివసించే ఇల్లు ఎంతో పురాతనమైనదిగా కనబడుతుంది. చెదలు, పురుగులు, చీమలు, సాలీడు ఇవన్నీ ఎక్కువగా ఉంటూ, ఇంటిని నాశనం చేస్తూ ఉంటాయి. తలపై వెంట్రుకలు త్వరగా రాలిపోతాయి. అకస్మాత్తుగా అనారోగ్యం మరియు బరువు తగ్గడం జరుగుతుంది. బలం తగ్గిపోత్న్దీ. అపనమ్మకం ఎక్కువగా ఉంటుంది.
  8. రాహువు:  జన్మకుండలిలో రాహువు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి  ఉన్న పెంపుడు జంతువులు తొందరగా మరణిస్తాయి. చేతి గోళ్ళు బలహీనంగా ఉంటాయి. సహోద్యోగులతో, ఇంటి ప్రక్కన వారితో, ప్రేమికులతో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి కోల్పోతారు. నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది. విష సర్పాల భయం ఏర్పడుతుంది. కలలో కూడా ఈ సర్పాలు కనిపించే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో విఫలం అవుతారు. ప్రేమ లేని జీవితం జాతకులను మద్యం వైపు తీసుకెళ్తుంది లేదా ఉద్యోగం వదిలేసేలా చేస్తుంది.
  9. కేతువు:  జన్మకుండలిలో కేతువు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి తన సంతానం సమస్యలు తెచ్చిపెడతారు. కాలికి ఉన్న గోళ్ళు విరిగిపోతాయి లేదా బలహీనంగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో infection, మూత్ర సంబంధిత వ్యాధులు వస్తాయి. దైవానుగ్రహం సులభంగా లభించదు.

జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

 గమనిక:

ప్రముఖ కేరళ సర్పశాస్త్ర, జలార్గళశాస్త్ర, జ్యోతిష శాస్త్ర,వాస్తు శాస్త్ర పండితులు C.V.S.చక్రపాణి గారు మీరు ఎదుర్కొంటున్న వివిధ రకముల సమస్యలకు పరిహారాలు తెలిపి జరిపిస్తారు.

అనేక రకాల యంత్ర మరియు తంత్ర సాధనాలు చేసుకోవాలి అనుకునేవారు యంత్ర సంబంధిత బీజమంత్రములు పొందడానికి శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.

మీరు ఎదుర్కొంటున్న గ్రహదోషములకు, సర్పదోషములకు, పైశాచిక గ్రహ పీడలకు, క్షుద్రప్రయోగముల వలన కలిగే సమస్యలకు తగిన  పరిహారముల కొరకు శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.

శ్రీ C.V.S.చక్రపాణి గారు సర్పశాస్త్రములో అనువనువు తెలిసినవారు, నిత్యనుష్టాన పరులు. సుదర్శన హోమము, గణపతి హోమము, పుత్రకామేష్టి యాగం, నవగ్రహ హోమము, మహామృత్యుంజయ హోమము,లక్ష్మి కుబేర హోమము, స్వర్ణాకర్షణ బహిరవ హోమం, నాగభైరవ హోమం, ఆశ్లేషబలి,నారాయణ నాగబలి, మహా సర్పబలి, నవనాగమండలం, ప్రత్యాంగిర శ్రీ చక్రేశ్వరి హోమం, సుబ్రహ్మణ్య వింశతి హోమం, గరుడ హోమం, గండభేరుండ జ్వాలా నృసింహ హోమం, శూలిని హోమం, వారాహి హోమం, కనకవటి హోమం, గంధర్వ రాజా హోమం, 21 రకముల యక్షి హోమములు కేరళ తాంత్రిక విధానములో జరిపిస్తారు. సంప్రదించవలసిన  నెంబర్లు 9846466430

Email : chakrapani.vishnumaya@gmail.com

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

 

 

2 thoughts on “జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

  1. Namasthi guruvu garu na friend ki evaro chethabadi chesaru ekada chupinchina thagatledhu elaga Ina mire thagela cheyandi guruvu garu please guruvu garu

  2. Na Peru shirisha.chethabadi ki guri Ina athani Peru anajaneyulu

    December 29, 2019 at 8:02 am

    Namasthi guruvu garu ma friend ki evaro chethabadi chesaru ekada chupinchina thagatledhu elaga Ina mire thagela cheyandi guruvu garu please

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.