loading

Category: Astrology

  • Home
  • Category: Astrology

మాటతీరుపై బుధుడు యొక్క ప్రభావం

మాటతీరుపై బుధుడు యొక్క ప్రభావం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధుడు జాతకుల యొక్క భావ వ్యక్తీకరణ పై, మాటల పై ప్రభావం చూపుతాడు. పంచభూతాలలో ఒకటైన అగ్ని తత్వంతో మాటలను పోలుస్తారు. మాటల వలన బంధాలను కలుపవచ్చు. అవే మాటలతో బంధాలను విడదీయవచ్చు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ, వారిలో ఉన్న  జీవశక్తిని తగ్గించుకుంటారు.

              పూర్వం మహర్షులు, ఋషులు అందరూ కూడా నిరంతరం ధ్యానంలో ఉంటూ, తమ మాటలను నియంత్రణలో ఉంచుకుని, నిశ్శబ్దంగా ఉండేవారు. చాలా తక్కువగా మాట్లాడేవారు. అందువలన మహర్షులు, ఋషులు ఏది మాట్లాడినా, వారి నోటితో ఏది అన్నా కూడా ఇట్టే జరిగిపోయేది.

              జన్మకుండలిలో బుధుడికి  బలం లేకపోయినా, పాప లేదా శత్రు గ్రహాలతో సంగమించినా, ఆ జాతకులకు ఆలోచనా శక్తి తగ్గుతుంది. విశ్లేషించే సామర్థ్యం మందగిస్తుంది. హాస్య చతురత ఉండదు. స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం తగ్గుతుంది.

              జన్మకుండలిలో బుధుడు బలంగా ఉంటే, ఆ జాతకులు ఇతరుల యొక్క మనస్తత్వాన్ని సులభంగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అన్ని స్థాయిల్లో ఉన్న వారితో సులభంగా మాట్లాడగలుగుతారు. రచనలు, కవిత్వాలు వ్రాయగలరు. లెక్కలను వేగంగా చేయగలరు. అకౌంటింగ్, గణితం వంటి విషయాలలో నైపుణ్యం కలిగి ఉంటారు.

 జన్మకుండలిలో బుధుని యొక్క స్థానాన్ని బట్టి జాతకుల మాట తీరు పై పడే ప్రభావాలు:

  • బుధుడు మీనరాశిలో నీచపడతాడు. మీనరాశిలో బుధుడు జాతకులు, తాము మాట్లాడే మాటలు ఇతరులకు స్వార్థపూరితంగా కనిపిస్తాయి. తమలో ఉన్న తక్కువ స్థాయి ఆలోచనలను సైతం వ్యక్తపరుస్తారు. దీని వలన సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు.
  • జన్మకుండలిలో బుధుడు వక్రంగా ఉన్నట్లైతే, ఆ జాతకులు కొన్ని సంధర్భాలలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. మరికొన్ని సంధర్భాలలో అవివేకంగా, తెలివి తక్కువగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు అర్థంలేని విషయాలను ఎక్కువగా మాట్లాడటం వలన, సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. (జన్మకుండలిలో బుధుడు వక్రంలో ఉంటే, జాతకులకు కలిగే ప్రభావం ఏమిటి? పూర్వ జన్మ సంబంధం ఏమిటి?)
  • జన్మకుండలిలో బుధుడు స్తబ్ధతగా గాని లేదా సంధి జరిగేటపుడు అనగా (28 – ౩౦) డిగ్రీల లోపు ఉంటే, జాతకులకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచన లేకుండా మాట్లాడి, తర్వాత బాధపడతారు. పరీక్ష వ్రాసేటపుడు ప్రశ్నలకు సమాధానం గుర్తుకు రాకుండా, పరీక్ష అయిపోయాక ప్రశ్నలకు సమాధానం గుర్తుకు రావడం జరుగుతుంది. ఏదైనా వాదన జరుగుతున్నపుడు,వాదించడం సాధ్యం కానపుడు, గట్టిగా అరవడం చేస్తారు.కొంతమందికి మెదడులో రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది.
  • అష్టక వర్గ కుండలిలో బుధుడు స్థితి పొందిన రాశిలో 2 లేదా అంతకన్నా తక్కువ డిగ్రీలలో ఉన్నట్లయితే, అటువంటి జాతకులు గట్టిగా మాట్లాడేందుకు జంకుతారు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. వారిలో వారు గోనుక్కోవడం లేదా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. ఈ స్థితి ఉన్న కొందరు జాతకులకు పుట్టుకతోనే స్వరపేటికలో లోపాలతో జన్మిస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు కుజునితో సంగమించిన జాతకులు, తాము ఎంతో పొగరుతో మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. తమ మాటలతో ఇతరులను రెచ్చగొట్టు స్వభావం కలిగి ఉంటారు. మాటలతో హింసించే లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మాట్లాడే మాటల వలన గొడవలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ జాతకులు ఏదైనా వాదనలో పాల్గొంటే, అవతలి వారి వ్యక్తిగత విషయాలను వెలికితీయడం లేదా రెచ్చ గొట్టడం లాంటివి చేస్తూ విషయాన్ని ప్రక్కదోవ పట్టిస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు రాహువుతో సంగమిస్తే, ఆ జాతకులు ఇతరులతో వాదించే సమయంలో, అవతలి వారి గతాన్ని తవ్వి, నెగ్గే ప్రయత్నం చేస్తారు. వీరు చెప్పే మాటలను నెగ్గించుకోవడం కొరకు గట్టిగా అరుస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు శనితో సంగమించిన జాతకులు, తాము మాట్లాడేందుకు ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. ఈ జాతకులు కాసేపు మాట్లాడినా సరే,సులభంగా అలసిపోతారు.
  • జన్మకుండలిలో బుధుడు కేతువుతో సంగమించినట్లయితే, ఆ జాతకులు నిశ్శబ్దంగా ఉంటారు. వీరు చాలా తక్కువగా మాట్లాడతారు. కాని వీరు నోరు తెరిచారంటే మాత్రం, అవతలి వారు నోరెత్తకుండా మాట్లాడతారు. ఒకే ఒక్క మాటతో వాదనను ముగించేస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు రవితో సంగమించినపుడు, ఆ జాతకులకు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అయితే, బుధుడు వక్రగాతిలో ఉన్నా లేదా రాహు కేతువుతో సంగమించి ఉన్నా, రవి కంటే 14 ఎక్కువ దూరంగా ఉన్నా, అలాంటి జాతకులకు బుధాదిత్య యోగం వర్తించదు.రవి బుధ సంగమం జరిగిన జాతకులు మంచి వక్త కాలేరు. కాని వీరికి ఉన్న జ్ఞానంతో, ప్రసంగాలతో, కవిత్వాలతో ఇతరుల చేత మెప్పు పొందగలరు. గణిత శాస్త్రం, అకౌంటింగ్, తర్క శాస్త్రంలో నైపుణ్యం కలిగి ఉంటారు.
  • జన్మకుండలిలో బుధ, గురు సంగమం కలిగిన జాతకులు ఉన్నత జ్ఞానాన్ని కలిగి ఉంటారు. బహు భాషలను నేర్చుకొని అనర్గళంగా మాట్లాడగలరు. గొప్ప మేధస్సుని కలిగి ఉంటారు. గొప్ప ఉపన్యాసుకులులాగా లేదా గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు చంద్రునితో సంగమించిన జాతకులకు తమ మనస్సు బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. వీరి జాతకంలో బుధుడు బలంగా ఉంటే వీరి బుద్ధి గెలుస్తుంది. అదే వీరి జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే, వీరి మనస్సు గెలుస్తుంది.
  • జన్మకుండలిలో బుధుడు శుక్రునితో కలసి ఉన్న జాతకులు గ్లామర్ రంగంలో ఎక్కువగా ఉంటారు. బ్యూటిషియన్లు, చర్మ వ్యాధి నిపుణులు, వెడ్డింగ్ ప్లానర్లు, ఫ్యాషన్ డిజైనర్లు వీరిలో చాలా మందికి ఈ సంగమం కలిగి ఉంటుంది. బుధ, శుక్ర సంగమంలో ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటారో, అలాంటి వారు సెలూన్లు, బ్యూటి పార్లర్లలో పని చేస్తూ, తమ నైపుణ్యం అంతా ఒకరి క్రింద పని చేసి వృధా అయిపోతోంది అన్న నిరాశలో బ్రతుకుతారు.

మన చర్మాన్ని, శరీరంలోని నరములను కూడా బుధుడు నియంత్రిస్తాడు. బుధుడు నీచంలో ఉన్నా లేదా పాపత్వం పొంది ఉన్నా జాతకులు ఆత్మాహుతి ఆలోచనలు చేస్తారు. స్నేహితులను, బంధువులను ముఖ్యంగా అమ్మ తరపు బంధువులను బుధుడు నియంత్రిస్తాడు. మాటలకు, వాగ్ధాటికి సంబంధించిన సమస్యలను తొలగించుకొనుటకు క్రింది మంత్రమును 1108 సార్లు జపించాలి:-

“అశేష వాగ్జాడ్య మలాపహరిణి నవం నవం స్పష్ట సువక్ ప్రదాయినీ|

మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్న వదనేచమే శ్రీ||”

 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Related Articles: 

జాతకంలో వక్రగతి బుధ గ్రహ ప్రభావం- పూర్వ జన్మ సంబంధం

                                                          జాతకంలో వక్రగతి బుధ గ్రహ ప్రభావం- పూర్వ జన్మ సంబంధం

               జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సంవత్సరానికి దాదాపు 3 సార్లు వక్రగతిలో సంచరిస్తాడు. బుధుడు వక్రగతిలో సంచారం 24 రోజుల పాటు సాగుతుంది.

               జన్మకుండలిలో బుధుడు వక్రగతిలో ఉన్నట్లైతే, ఆ జాతకులకు ఏదైనా సమస్యను విశ్లేషించుటలో, ఆలోచనా విధానంలో గాని నెమ్మదిగా, జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. ఇతరులతో మాట్లాడు విషయాలలో అతి జాగ్రత్తతో వ్యవహరిస్తారు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే, ఆ సంధర్భాలలో వీరు చాలా వెనుకబడి ఉంటారు. నిర్ణయం తీసుకున్న తరువాత, ఆ నిర్ణయం సరైనదా కాదా, దీని వలన ఇంకెవరికైనా ఇబ్బందులు కలుగుతాయా అని పదేపదే వారిలో వారే సతమతమవుతారు.

               జన్మకుండలిలో బుధుడు వక్రగతిలో ఉన్న జాతకులకు, తమ ఆలోచన ప్రక్రియా విధానం మొత్తం కూడా లోలోపలే జరుగుతుంది. ఈ జాతకులలో కొందరు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. వీరికి ఇతరులతో సంభాషించడంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. వక్రగతి బుధ ప్రభావం వీరి మాటలపై తీవ్రంగా ఉంటుంది. ఈ జాతకుల యొక్క ఆలోచన విధానాలలో, అలాగే వారి భావాలను బయటకి వ్యక్తపరచడంలో అంతర్ముఖ స్వభావాన్ని (Introvert) కలిగి ఉంటారు. నలుగురిలో మాట్లాడటానికి, వ్యక్తిగత విషయాలను వ్యక్తపరచడానికి చాలా కష్టపడతారు. ఏదైనా విషయంలో బలమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ఇబ్బందులు పడతారు.

               జన్మకుండలిలో బుధుడు వక్రగతిలో ఉన్న జాతకులు, తమ రోజు వారి పనులను కొన్ని వందల సార్లు చేసిన పని అయినా సరే, ఆ పనిని ఇతరుల ముందు చేయాలంటే తీవ్రంగా భయపడతారు. వక్రగతి బుధుడు వలన జాతకులకు మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తారు. మానసికంగా వీరిపైన ప్రభావం ఏవైనా సంధర్భాలు ఎదురైనపుడు, దాని నుండి బయట పడటానికి ఇతరులకంటే  వీరికి కాస్త సమయం ఎక్కువగానే పడుతుంది. ఈ విధమైన పరిస్థితులు ఎదురైనపుడు జన్మకుండలిలో బుధుడు వక్రగతిలో ఉన్న జాతకులు, ఆ సంధర్భాన్ని అర్థం చేసుకునేందుకు గతంలో జరిగినవి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను కూడా మళ్ళీ గుర్తు చేసుకొని, వాటిని తిరిగి పరిశీలన చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. దీని కారణంగా ఈ జాతకులు ప్రతిస్పందించడానికి, గాని, సమాధానం ఇవ్వడానికి గాని ఆలస్యం అవుతుంది. అయితే, కొంత సమయం తీసుకొని అయినా సరే, సంధర్భానికి తగ్గట్టు సరైన సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. వీరు స్పందించేందుకు తీసుకునే ఈ ఆలస్యం వల్ల కొన్నిసార్లు ఇతరుల నుండి విమర్శలు పొందాల్సి వస్తుంది. ఈ జాతకులకు ఉన్న మంచి లక్షణం ఏమిటంటే, ఈ జాతకులు ఆవేశంతో గాని, ఆలోచించకుండా గాని, తొందరాది గాని స్పందించరు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయానికి వచ్చిన తరువాతే వీరు స్పందిస్తారు. కానీ, ఈ లక్షణం కూడా బుధుడు వక్రించిన రాశి మీద కూడా ఆధారపడి ఉంటుంది.

               జన్మకుండలిలో బుధుడు వక్రగతిలో ఉన్న జాతకులకు మానసికంగా ఉన్న గందరగోళాన్ని మరియు మానసిక సంఘర్షణలను నియంత్రించుకోగలిగితేనే, జాతకులు ఎంతో మేధావులుగా మెరుగులు దిద్దుకోగలరు. ఈ జాతకులకు ఇతరులతో సంభాషించడం అనేది ఒక క్లిష్టతరమైన పనిగా భావిస్తారు.  వీరి ఆలోచనలు స్పష్టంగా బయట పెట్టలేకపోవడం, వీరి భావాలను వ్యక్తపరచడం కష్టమవడం, ఈ లక్షణాల వలన జాతకుల యొక్క ఉద్దేశాలను ఇతరులు అపార్థం చేసుకుంటారు. దీని వలన వీరి పై వీరికి ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. కానీ ఈ జాతకులకు అంతర్గతంగా జ్ఞానం విపరీతంగా ఉంటుంది. ఎంతోమంది గొప్ప గొప్ప పరిశోధకులకు, రచయితలకు, జ్యోతిష్యులకు, ఆధ్యాత్మిక గురువులకు సైతం బుధుడు వక్రగతిలో ఉన్నవారు ఉన్నారు.

               జాతకంలో బుధుడు వక్రగతిలో ఉన్నవారికి సంభాషణల్లో సమస్యలు రావడం, వారి ఫోన్లకు తరచూ రిపేర్లు రావడం, ప్రయాణాలలో అడ్డంకులు ఎదుర్కోవడం వంటివి కలుగుతాయి. ట్రాఫిక్ వల్ల గాని, అందాల్సిన సరుకులు సరైన సమయానికి అందకపోవడం వంటి చిన్న కారణాల వలన వీరి వ్యాపారాలు మందగొడిగా నడుస్తాయి. కొరియర్ సర్వీసులు చేసేవారు, జ్యోతిష్యులు, విద్యా రంగంలో పని చేసేవారు, లాయర్లు, స్టాక్ బ్రోకర్లు, మీడియాలో పనిచేసేవారు, వైద్య రంగంలో పనిచేసేవారు, ట్రావెల్స్ రంగంలో ఉండేవారు, జాతకంలో వక్ర బుధుడు ఉంటే, వీరందరి పై ప్రభావం ఎక్కువగా పడుతుంది.

               జన్మకుండలిలో బుధుడు వక్రగతిలో ఉన్నవారు జ్యోతిష్యులు అయితే, వారు జాతకాలను అద్భుతంగా విశ్లేషిస్తారు గాని సరైన అంచనాలను వివరించలేరు.

               గోచారంలో బుధుడు స్తబ్ధతగా ఉన్న కాలంలో జాతకులకు తమ మనస్సులో కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు చిగురిస్తాయి. కానీ ఆ ఆలోచనలు, ఆవిష్కరణలు అన్నీ కూడా, గోచారంలో బుధుడు మళ్ళీ సవ్య దిశలో సంచరించేటపుడు మాత్రమే ఆచరణలోకి వస్తాయి. గోచారంలో బుధుడు స్తబ్ధతగా ఉన్నకాలం మరియు వక్రగతిలో ఉన్న కాలం, ఈ జాతకులకు ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే పూర్హిగాని పనులు, మొండిగా సాగుతున్న వ్యాపార వ్యవహారాలు అన్నిటిలో లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అని విశ్లేషించుకునే అవకాశం కలుగుతుంది, బుధుడు మళ్ళీ సవ్య దిశలో సంచరించగానే, ఎంతో కాలం పాటు స్తబ్ధతగా ఉన్న పనులు, వ్యవహారాలు అన్నీ కూడా ఊపు అందుకుంటాయి. దీని వలన ఈ జాతకులకు ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.

               జాతకంలో బుధుడు వక్రగతిలో ఉన్న జాతకులు తమ భావాలను వ్యక్తపరచడానికి చాలా భయపడతారు. నలుగురిలో మాట్లాడటానికి తీవ్రంగా జంకుతారు. ఏదైనా తప్పుగా మాట్లాడతానేమో అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. ఆ భయం వలన చెప్పాలసిన ముఖ్యమైన విషయాలు కూడా చెప్పకుండా నిశ్శబ్ధంగా ఉండిపోతారు. తమని ఎవరూ అర్థం చేసుకోరు అన్న భావన గత జన్మ నుండి తీవ్రంగా పాతుకుపోవడం వలన కూడా చాలా విషయాలు తమలోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు.

               గత జన్మలో ఈ జాతకులకు ఉన్న మంచి వాగ్ధాటిని దుర్వినియోగం చేసుకొని ఉంటారు. గత జన్మలో ఈ జాతకులు తమ మాటలతో ఎక్కువ మంది ప్రజల మధ్య అల్లర్లు, పోట్లాటలు జరిగేందుకు కారణం అయ్యి ఉంటారు. దీని వలన, ఈ పూర్వ జన్మ కర్మ ప్రభావం వలన, వీరి మేధస్సు పై వీరికి విశ్వాసం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా, వీరికి ఇతరులతో సంభాషించేందుకు సరైన నైపుణ్యం లేదు అన్న భావనతోనే ఉంటారు.

               గత జన్మలో ఈ జాతకులు మనస్సు విప్పి మాట్లాడినందుకు, లేదా ధైర్యంగా మాట్లాడినందుకు గాని అవమానాలు, అపార్థాలు, ఎదురు దెబ్బలు తగిలాయి. దీని ఫలితంగా, ఈ జాతకులా యొక్క ఆత్మ, ఈ అవమానాలను, అపార్థాలను గుర్తుంచుకొని, ఈ జన్మలో కూడా ఆ భయాన్ని వ్యక్తపరుస్తుంది. అందువలన ఈ జన్మలో ఈ జాతకులు, తమ మేధస్సు పై కలిగి ఉండాలి. నిజానికి వీరి మనస్సులో ఏ విధమైన సంకోచం, భయం లేకుండా మాట్లాడితే, వీరికి తిరిగి సమాధానం కూడా ఇవ్వలేరు, కావున ఈ జాతకులు తమ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.         

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Related Articles: 

జాతకంలో వక్రగతి కుజ ప్రభావం- పూర్వ జన్మ సంబంధం

                                                        జాతకంలో వక్రగతి కుజ ప్రభావం- పూర్వ జన్మ సంబంధం

కుజుడు ప్రతీ 26 నెలలకు ఒకసారి వక్రగతిలో సంచరిస్తాడు. దాదాపు 8 నెలల పాటు కుజుడు వక్రగతిలో సంచరిస్తాడు. జన్మకుండలిలో కుజుడు వక్రగతిలో ఉన్న జాతకులకు తమ యొక్క కోరికలు, లక్ష్యాలు అనీ కూడా తమకు ఉన్న అనిశ్చిత పరిస్థితుల వలన, అవకాశాల కొరత వలన లేదా అనుకూల పరిస్థితులు లేకపోవడం వలన ఆలస్యం అవుతాయి. ఈ జాతకులలో శారీరక శక్తి, జీవశక్తి సాధారణంగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

               కుజుడు వక్రంలో ఉన్న జాతకులు ఏ విధమైన సవాళ్ళు అయినా సరే, వాటిని ఎదుర్కొనేందుకు ముందుకు రాలేరు. ఏ పని చేయాలన్న చాలా అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందుకారణంగా వీరిని మొండివారిగా కూడా పరిగణిస్తారు. ఏ పనికైనా లేదా ఇచ్చే మాటకైనా కట్టుబడేముందు, జాతకులు తాము ఏమి చేస్తున్నారో, దాని గురించి ప్రతీ చిన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ విధమైన అతి జాగ్రత్త తీసుకోవడం వలన, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వలన కలిగే నష్టాల నుండి చాలా వరకు తప్పించుకోగలుగుతారు.

               జాతకంలో కుజుడు వక్రంలో ఉన్న పురుషులలో కొందరికి నపుంసకత్వం, స్త్రీ జాతకులలో కొందరికి లైంగిక ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది.  అతిగా ఉపవాసాలు చేయడం, మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అధికంగా పాల్గొనడం వంటి కారణంగా కూడా జాతకుల్లో ఈ సమస్యలు కలుగవచ్చు.

               జాతకంలో కుజుడు వక్రగతిలో ఉన్న జాతకులు, తాము చేపట్టిన పనిలో ఆశించిన ఫలితం వస్తుందన్న నమ్మకం లేకపోతే, ఒప్పుకున్న ఆ పనిని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేస్తారు.

               ఈ జాతకులు ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచించి మళ్ళీ మళ్ళీ విశ్లేషించే స్వభావం ఉన్నవారు అయినందున, వీరు ప్రణాళికలు రూపొందిచుటలో, పనులను క్రమబద్ధంగా నిర్వహించుటలో మంచి నైపుణ్యం చూపుతారు. సైన్సు, పరిశోధనా రంగం, వైద్య రంగాల్లో ఈ జాతకులు మంచి ప్రతిభను కనబరచగలరు. మనుషులకు కలిగే సహజమైన భావోద్వేగాలను, ఉదాహరణకు, వీరికి వచ్చే కోపాన్ని బయటకి వ్యక్తపరాచకుండా లోలోపలే అణచుకునే స్వభావం ఉంటుంది. దీని వలన జాతకులకు మానసిక సంఘర్షణలు అధికమవుతాయి. ఎక్కువకాలం పాటు జాతకులు తమ భావోద్వేగాలను అణచివేసుకోవడం వలన మానసికంగా ప్రతికూలతలు ఏర్పడి, దాని వలన జీవితం పై తమకు నిరాశావాద ధృక్పథం పెరిగే అవకాశం ఉంటుంది. కోపాన్ని అణచివేయటం వలన జాతకులకు కడుపులో సమస్యలు రావడం, అసిడిటీ, ఇతర జీర్ణకోశ సంబంధిత సమస్యలు కలుగు అవకాశం ఉన్నది.

               జన్మకుండలిలో కుజుడు వక్రగతిలో ఉన్నాడంటే, ఆ జాతకులకు కుజ గ్రహానికి సంబంధించిన బాధకారమైన అనుభవాలు గత జన్మలో ఉన్నట్టు గుర్తించాలి. ఆ అనుభవాలు అన్నీ జాతకుల యొక్క సూక్ష్మ శరీరంలో ముద్రలుగా నిలిచిపోయి ఉంటాయి. ఆ బాధకారమైన అనుభవాల యొక్క ప్రభావాన్ని ఈ జన్మలో బాధని, భారాలను పూర్తిగా తొలగించుకునేలా జాతకులకు సంఘటనలు ఎదురవుతాయి.

               కుజుడు వక్రగతిలో ఉన్న జాతకులకు గత జన్మలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా తీసుకుంటే, జాతకులు ఒక సైనికుడిగానో, ఒకరి కింద పనిచేసే బానిసగానో లేదా ఉన్నతాధికారి కింద పని చేసే వ్యక్తి అయినా అయ్యి ఉండచ్చు. ఈ జాతకులు తమ బాస్ లేదా తమ పై అధికారి ఆదేశం ప్రకారం, తమ మనస్సుకు ఇష్టం లేకపోయినా సరే, చాలా మంది పట్ల క్రూరంగా ప్రవర్తించి ఉంటారు.

               లేదా, ఒక క్షుద్ర విద్యను ఆచరించే వ్యక్తి వీరిని నియంత్రించిన కారణంగా, వీరి ఇష్టానికి వ్యతిరేకంగా ఇతరులకు హాని కలిగించడం, నేరాలకు పాల్పడటం వంటివి చేయాల్సి వచ్చి ఉండవచ్చు.

               ఈ విధంగా ఏ సంధర్భమైనా సరే, వీరి మనస్సుకు ఆ నేరం చేయుటకు ఇష్టం లేకపోయినప్పటికి, వీరి చేత బలవంతంగా ఆ నేరాలు చేయించినప్పటికి, వీరికి గత జన్మలోనే తీవ్రమైన అపరాధ భావనా మిగిలిపోయి ఉంటుంది. వీరు పాటించినది వీరి యజమాని యొక్క ఆదేశాలు అయినప్పటికి, వీరి అంతరాత్మ మాత్రం వీరిని నిందిస్తూనే ఉంటుంది.

               జన్మకుండలిలో కుజుడు వక్రగతిలో ఉన్నట్లైతే, గత జన్మలో జరిగిన ఈ విధమైన సంఘటనలకు సంబంధించిన భావోద్వేగాలు, అపరాధ భావన, మానసిక సంఘర్షణ అన్నీ కూడా ఈ జన్మలో జాతకులకు అంతర్గతంగా విలీనం అయ్యి ఉంటాయి. వీటి వలన జాతకులకు క్లిష్టమైన వ్యక్తిత్వ లక్షణాలు ఈ జన్మలో ఏర్పడతాయి. కొన్ని సమయాల్లో, ఏమి జరగకుండానే, ఏ కారణం లేకుండానే అపరాధ భావన కలిగి ముభావంగా ఉంటారు. తమకు అన్నీ విషయాలలో సామర్థ్యం తక్కువగా ఉందన్న భావనలో గడుపుతూ, నిరాశ నిస్పృహలలో ఉంటారు. నలుగురి మధ్య మెలగడానికి గాని, మాట్లాడటానికి గాని వీరికి మానసికంగా శీఘ్రంగా అలసట వస్తుంది.

               జన్మకుండలిలో కుజుడు వక్రగతిలో ఉన్న జాతకులు ఏ పని చేయాలన్నా, లేదంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఒకటికి పదిసార్లు ఆలోచించి అతి జాగ్రత్త పడతారు. అయితే, ఈ లక్షణం పరిశోధకులకు గాని, ప్రాజెక్టులను క్రమబద్ధంగా నిర్వహించేవారికి గాని ఉంటే, ఇది ఎంతగానో ఉపయోగపడే లక్షణంగా కూడా చెప్పవచ్చు. కాని, అదే ఈ జాతకులు ఏదైనా నిర్ణయాన్ని ఏమి ఆలోచించకుండా, తొందరపాటుతో తీసుకుంటే, దాని వలన వీరికి నష్టాలు కలుగుతాయి.

               కుజుడు వక్రగతిలో ఉన్న జాతకులు తమ జీవిత భాగస్వామితో కూడా సౌకర్యంగా ఉండలేరు. తమ జీవిత భాగస్వామి పై తమకున్న భావాలను వ్యక్తపరచడం కూడా వీరికి కష్టంగా ఉంటుంది. పునరుత్పత్తి వ్యవస్థలో కూడా వీరికి కొన్నిసార్లు సమస్యలు తలెత్తు అవకాశం ఉంటుంది. దీని వలన దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతుంది. జీర్ణకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, పునరోత్పత్తి వ్యవస్థల పై కూడా వక్రగతిలో ఉన్న కుజుడు ప్రభావం జాతకులపై ఉంటుంది. కాబట్టి, వీటికి సంబంధించిన వ్యాధి లక్షణాలు కనబడినపుడు జాతకులు జాగ్రత్తపడి, వైద్యులను తప్పక సంప్రదించాలి.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Related Articles: 

 

జాతకంలో శుక్రగ్రహ వక్రగతి – పూర్వ జన్మ ప్రభావాలు

జాతకంలో శుక్రగ్రహ వక్రగతి – పూర్వ జన్మ ప్రభావాలు

Retrograde venus in birth chart and its past life connection

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ప్రతీ 18 నెలలకు ఒకసారి శుక్రుడు వక్ర గమనంలో సంచరిస్తాడు. వక్రగతిలో సంచరించే సమయంలో శుక్రుడు రవికి అతి దగ్గరగా సంచరించడం వలన, శుక్రుడు తన బలాన్ని కోల్పోతాడు.

               శుక్రుడిని కళత్ర కారుడిగా జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. అదేవిధంగా, శుక్రుడు జాతకుని యొక్క వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండేందుకు, జాతకుడు తన జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు, అలాగే లక్ష్మి దేవి అనుగ్రహించే ప్రేమ, సంపాదన, సౌభాగ్యం, సంతోషం, సంతృప్తి, ఐహిక సుఖాలు అన్నిటికి కూడా శుక్రుడే కారణం అవుతాడు.

               ఒక వ్యక్తి యొక్క సుఖ భోగాలకు కారకుడు అయిన శుక్రుడు జన్మకుండలిలో వక్రగతిలో ఉన్నట్లైతే, దాని అర్థం జాతకునికి గత జన్మ కర్మ శేషం ఉన్నదని అర్థం. శుక్రుడు జాతకంలో వక్రగతిలో ఉన్నాడు అంటే, జాతకునికి ప్రేమ, వివాహం, సుఖం, ధనం, ఐహిక సంబంధాలు, అన్య స్త్రీ/పురుష సంబంధాలు, శృంగారం, రుచికరమైన ఆహారం, వంటి విషయాలలో గత జన్మ కర్మ శేషాలు ఉన్నాయాని అర్థం. ఈ వక్ర గతి శుక్రుడు వలన, జాతకులకు కలిగే ఆనందం, సంతోషం దేనిలోనూ సంతృప్తి కలుగడం లేదన్న భ్రమలో నిత్యం బ్రతుకుతూ ఉంటారు. ఈ జాతకులకు శృంగార విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉంటారు. వీరితో వీరి జీవిత భాగస్వామి శృంగారపరంగా ఎంత సహకరించినప్పటికి, వీరికి ఉన్న అసంతృప్తి కారణంగా, అన్య స్త్రీ/ పురుష సంబంధాలను గత జన్మలో లాగానే ఈ జన్మలో కూడా కొనసాగిస్తారు. దీని వలన దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. శుక్రుడు వక్రగతిలో సంచరించే సమయంలో పుట్టిన జాతకులు, గత జన్మలో జాతకులు చేసిన పొరపాటును ఈ జన్మలో చేయకుండా సరిదిద్దుకొని, తగిన పాఠం నేర్చుకోవాలి. కానీ, ఈ విషయం అర్థం చేసుకోలేని జాతకులు, మళ్ళీ గతజన్మలో లాగానే యథావిధిగా , జీవిత భాగస్వామి నెరవేర్చాల్సిన భాద్యతలో ఎటువంటి పొరపాటు లేకపోయినప్పటికి, కేవలం వీరికి కలిగే అసంతృప్తి కారణంగా వివాహేతర సంబంధాలను ఏర్పరచుకుంటారు. గత జన్మలో ఏ మోసం చేయడం వలన, ఈ జన్మలో శుక్రుడు తమ జాతకంలో వక్ర గతిలో ఉన్నాడో, జాతకుడు దాని అంతరార్థం అర్థం చేసుకోకుండా, మళ్ళీ అదే పొరపాటు చేసేందుకు ఈ జన్మలో యత్నిస్తాడు.

               శుక్రుడు వక్రగతిలో ఉన్నపుడు కుజుడులా ప్రవర్తిస్తాడు అని కూడా జ్యోతిష్య శాస్త్రం చెప్పబడింది. వక్రగతి శుక్రుడు ఉన్న  జాతకులను కోపిష్టిగా కూడా పరిగణిస్తారు. వీరికి ఆత్మవిశ్వాస లోపం ఉండటం వలన, ఆ నిరాశని, కోపాన్ని తమ ప్రియుల పై లేదా జీవిత భాగస్వామి పై చూపిస్తారు. జన్మకుండలిలో శుక్రుడు వక్రగతిలో ఉన్నట్లైతే, ఆ జాతకులకు అధికమైన భావోద్వేగాలు, ప్రేమలో విఫలం అవ్వడం, తీవ్రమైన కోపం, అర్థంగాని ఒంటరితనం వీరిని వేధిస్తాయి. వీరి పై చూపించాల్సిన ప్రేమ వీరికి దక్కడం లేదని తీవ్రమైన అసహనం కనబరుస్తారు. మనలో చాలా మంది, మనస్సు బాగోలేదన్నపుడు, ఇష్టమైన సంగీతం గాని, ప్రకృతిని గాని ఆశ్వాదించడం, మనస్సుకు నచ్చిన ఆత్మీయులతో మాట్లాడటం వంటివి చేసి, మనస్సుని తేలికపరచుకుంటాము. కానీ శుక్రుడు వక్రగతిలో ఉన్న జాతకులు ఈ విధమైన చిన్నపాటి వ్యవహారాలను కూడా ఆశ్వాదించలేరు, ఆనందించలేరు.  అనగా, చిన్నపాటి ఆనందాలను ఆశ్వాదించేందుకు కూడా వీరి మనస్సు సహకరించదు.ఈ జాతకులు ముక్కుసూటిగా మాట్లాడటం వలన, వీరిని కోపిష్టిగా, కఠినాత్ములుగా ముద్ర వేస్తారు. వీరికి ఉన్న మానసిక సంఘర్షణల గురించి ఎవరికి వ్యక్తపరచలేకపోతారు.

               గోచారంలో శుక్రుడు వక్రగతిలో సంచరించు కాలంలో, జన్మకుండలిలో శుక్రుడు వక్రంలో ఉన్న జాతకుల పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్థికపరంగా అన్నీ వైపులా చిక్కుకుపోతారు. ప్రేమ వ్యవహారాలలో దెబ్బ తింటారు. ఇతర ఐహిక సుఖాలు, వ్యవహారాలు అన్నీ కూడా ఇబ్బందికరంగా మారతాయి.

               జన్మకుండలిలో శుక్రుడు వక్రగతిలో ఉన్న జాతకులలో కొందరు అంతులేని ప్రేమని కూడా కురిపిస్తారు. ఎంతగా ప్రేమిస్తారో, అంతే సులభంగా వదిలేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. ప్రేమ, శృంగారం, సంతానం, కుటుంబం, సంపాదన, డబ్బు ఇలా అన్నీ విషయాలలో వీరికంటూ ప్రత్యేకమైన ఆదర్శాలు, ఊహా భావాలు ఉంటాయి. ఈ జాతకులలో చాలా మంది అసలు ఎవరూ పట్టించుకోని ఆచారాలను, కట్టుబాట్లను కూడా పాటిస్తారు.

               ప్రేమ విఫలం అవ్వాలి అంటే, దాని కారణం జన్మకుండలిలో ఏ గ్రహం అయినా కారణం కావచ్చు. కానీ, జన్మకుండలిలో శుక్రుడు వక్రగతిలో ఉన్న జాతకులకు ప్రేమ విఫలం అయితే, దాని నుండి బయట పడేందుకు ఈ జాతకులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. కానీ, ఎట్టకేలకు బయటపడి, మళ్ళీ కొత్త ప్రేమను కూడా అంతే తొందరగా వెతుక్కుంటారు. ప్రేమ పై వీరికంటూ ప్రత్యేక అభిప్రాయాలు ఉంటాయి. వాటిని బయటకు వ్యక్తపరిస్తేనే, అవతలి వారు కూడా దానికి తగ్గట్టు వీరిని ప్రేమిస్తారు. ఈ జాతకులు ఆ విధంగా చేయకుండా, సమాజం అంతా భ్రష్టుపట్టుకు పోయింది అని సమాజం పై నిందలు వేస్తారు.

               జన్మకుండలిలో శుక్రుడు వక్రగతిలో ఉన్నవారికి, తమ జీవిత భాగస్వామితో మానసికంగా ఏకమవ్వడానికి, సంతోషంగా జీవించడానికి చాలా కష్టపడతారు. జీవిత భాగస్వామితో ఉన్న బంధుత్వాన్ని వీరి చేతులారా వీరే చెడగొట్టుకుంటారు. మళ్ళీ, ఆ బంధుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అంతే తిప్పలు కూడా పడతారు. జీవిత భాగస్వామి నుండి ఎంతో ప్రేమని వీరు ఆశిస్తారు. కానీ వీరికి ప్రేమను వ్యక్తపరచడం రాకపోవడం వలన, జీవిత భాగస్వామి నుండి కూడా వీరు ప్రేమని స్వీకరించలేకపోతారు.

               గత జన్మలో జాతకులు తమ జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో వ్యవహారాలు పెట్టుకోవడం వలన గాని లేదా జాతకులను మరియు జాతకుల యొక్క జీవిత భాగస్వామిని మధ్య ఉన్న దాంపత్య బంధాన్ని దూరం చేసేందుకు, ఇతరులు లేదా ఇతర శక్తులు తీవ్రమైన కృషి చేయడం వల్ల గాని ఈ జన్మలో శుక్రుడు వక్రగతిలో ఉన్నాడు. అందువలన వైవాహిక జీవితాన్ని లేదా ప్రేమానుబంధాన్ని ఎంత పరిపక్వతతో, ఎంత సహకారంతో, ఏ విధమైనటువంటి ప్రేమతో మెరుగుపరచుకోవాలో వీరికి తెలియదు. అందువలన ఈ జాతకులు ఈ జన్మలో తమ దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటే సంతృప్తికరంగా ఉంటుందో అన్న అంశం పై శ్రద్ధ వహించాలి. శుక్రుడు వక్రగతిలో ఉన్న జాతకులు తమ జీవిత భాగస్వామిని ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. అలాగే, జాతకులు ముందుగా తమ గురించి తాము లోతుగా ఆలోచించి, విశ్లేషించి, తమకు ఏమి కావాలి, తమ జీవిత భాగస్వామిని ఏ విధంగా ఆనందపరచాలి అన్న అంశాలపై దృష్టి పెట్టాలి.

               వక్రగతిలో ఉన్న శుక్రుడు యొక్క ప్రభావం తగ్గించుకోవాలంటే, ముందుగా జాతకులు తమ జీవితంలో జరిగే చిన్న పాటి సంధర్భాలను కూడా ఆనందించడం నేర్చుకోవాలి. చిన్న పాటి వినోద కార్యక్రమాలకు జాతకులు సంతోశపడేలా తమ మనస్సును మలచుకోవాలి. శృంగార విషయాలలో జాతకుడు అసంతృప్తి అనే భ్రమను తోలంగించుకొని, తమ ప్రేమను జీవిత భాగస్వామి పై వ్యక్తపరచి, సంతృప్తి చెందడం మనసుకు అర్థం అయ్యేలా చెప్పుకోవాలి. జీవిత భాగస్వామికి చిన్నపాటి బహుమానాలను ఇవ్వడం, తమలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడం, మనస్ఫూర్తిగా మాట్లాడటం వంటివి మనసుకు అలవాటు చేసుకోవాలి. తద్వారా వక్రగతిలో ఉన్న శుక్రుడు యొక్క ప్రభావం జాతకుని పై తగ్గుతుంది.

               శుక్రుని యొక్క వక్రగతి స్థితి ఇచ్చే ప్రతికూల సంఘటనలను నివారించడానికి శుక్రగ్రహ వక్ర స్థితి గోచారంలో జరుగుతున్న కాలంలో లేదా శుక్ర మహాదశ, అంతర్దశలలో శుక్రగ్రహ ప్రీతికి గంధర్వ యక్షి లేదా అనురాగ యక్షి తంత్ర పూజా విధానాలను ఆచరించాలి.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Related Articles: 

ఆశ్లేష బలి కార్యక్రమం

మన జీవితంలో కొన్నిసార్లు నిరంతరంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటం, కారణం లేకుండా దంపతుల మధ్య విభేధాలు ఏర్పడి ఇంట్లో మనఃశాంతి లోపించడం, దక్కాల్సిన ప్రమోషన్లు చేతిదాకా వచ్చి ఊహించని కారణం చేత దక్కకపోవడం, లాభాలు వస్తాయని తలచిన వ్యాపారంలో నష్టాలు చూస్తుండటం, ఈ విధంగా అనుకోని సంఘటనలు మనము చూస్తూనే ఉంటాము. అయితే ఇలా ఎందుకు హరుగుతున్నాయి, వీటికి గల కారణం ఏమిటి అనేది, జ్యోతిష్య పరిశీలన ద్వారా, వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా, ఏ గ్రహ స్థితుల వలన, ఏ దోషాల వలన ఈ విధమైన సంఘ్తనాలు ఎదుర్కొంటున్నారో అవగతం అవుతుంది. ఈ విధమైన దుష్ఫలితాలను కలుజేసే దోషాలలో నాగ దోషం, సర్ప శాపం, కాలసర్ప దోషం కూడా ఉన్నాయి.

               వేద జ్యోతిష్య శాస్త్రంలో పరిహార భాగంలో, నాగ దోషం, సర్ప శాపం, కాలసర్ప దోషం వంటి దోషాల యొక్క నిర్మూలనకు, నివారణ కొరకు, ఆశ్లేష బలి ప్రక్రియ జరిపించిన దోష నివారణ జరుగుతుందని తెలియజేయడం జరిగింది.

               ఆశ్లేష బలి అనగా, జన్మకుండలిలో సర్ప శాపం, నాగ దోషం, కాలసర్ప దోషములను కలిగించే సర్ప గ్రహములను, సర్ప దేవతలను సంతృప్తి పరచి, వారి అనుగ్రహం పొంది, జీవితంలో ఎదురయ్యే ఎన్నో దుర్ఘటనల నుండి ఉపశమనం పొందేలా చేసే ఒక శక్తివంతమైన పూజా కార్యక్రమం.

జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు ఉన్నప్పుడూ జాతకులకు సర్ప శాపం, నాగ దోషం, కాలసర్ప దోషం ఉన్నట్టు గుర్తించాలో ఇక్కడ లింకులను క్లిక్ చేసి సంపూర్ణంగా తెలుసుకోగలరు.  

ఈ దోషాల వలన ఆరోగ్య పరంగా, వివాహం పరంగా, వైవాహిక జీవితం పరంగా, సంతానం పరంగా నిరంతర సమస్యలు తలెత్తుతాయి. నిష్ణాతులు అయిన జ్యోతిష్య పండితుల చేత జాతక పరిశీలన చేయించుకొని, వ్యక్తిగత జాతకంలో సర్ప శాపం, నాగ దోషం, కాలసర్ప దోషం వంటి దోషములు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఈ దోషములు వ్యక్తిగత జాతకంలో ఉన్నట్లైతే, ఆ జ్యోతిష్య పండితుని సలహా మేరకు “ఆశ్లేష బలి” పూజా కార్యక్రమమును జరిపించుకోవాలి.

ఈ ఆశ్లేషబలి పూజా కార్యక్రమంలో జాతకుడు నాగ దేవతల యొక్క అనుగ్రహమును, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహమును పొందేలా కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలు నిర్వహిస్తారు. 84 నాగ దేవతలకు పిండ ప్రధానమును, తర్పణమును ఆచరిస్తారు. ఈ ఆశ్లేషబలి పూజా ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూరు జిల్లాలోని అరణ్యమలై నందు మలాయల భగవతి శ్రీ నాగరాజ నాగాయక్షి పీఠము నందు కేరళ నంబూద్రీలు, నాగ వంశీకుల ఆధ్వర్యంలో శక్తివంతంగా, దిగ్విజయంగా జరిపించడం జరుగుతోంది. ఈ వీడీయో వీక్షించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.

Related Articles:

 

 

పిశాచ గ్రస్త యోగం-పరిహారం

జన్మకుండలిలో పైశాచిక గ్రహాలు జాతకులకు ప్రాప్తింపజేసే అవయోగాలనే పిశాచగ్రస్త యోగం అని పిలుస్తారు. కొన్ని గ్రహాలు రాశి చక్రంలో వేధకు గురి అయినట్లైతే, ఆ గ్రహాలు బంధనమునకు గురి అయ్యి పిశాచ గ్రస్త యోగమును కలిగించును. కొన్ని సంధర్భాలలో అసూయపరులు, ఈర్ష్యా ద్వేషములు గల వ్యక్తులు ఎదుటివారికి అనారోగ్యమును, ప్రాణ గండములను కలిగించడానికి అభిచార క్రియలను ఆచరిస్తారు. ఈ రకమైనటువంటి విద్వేషపరులు, శతృవులు చేసేటువంటి చేతబడులకు అమాయకులైన వ్యక్తులు బలికావడం జరుగుతుంది. తంత్ర ప్రయోగాలకు గురి కాబడినటువంటి వారికి ఎన్నో రకాలైన అనారోగ్య, మానసిక సమస్యలు తీవ్రస్థాయిలో వేదిస్తాయి. కొన్ని సంధర్భాలలో వారు క్షీణించిపోవడం మరణానికి చేరువకావడం జరుగుతుంది. ఎంతో నైపుణ్యం గల వైద్యులకు సైతం వీరి అనారోగ్యమునకు, రోగమునకు కారణములు తెలియనేరవు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినప్పటికీ, వారికి ఉన్న అనారోగ్యము, సమస్య ఏమిటనేది అవగతము కాదు. శరీరంలో ఏదో తెలియని తీవ్రమైన బాధ వారిని శుష్కింపజేస్తుంది. ఈ విధమైనటువంటి సమస్యలు, బాధల యొక్క నివారణకు మలయాళ తంత్ర శాస్త్రంలో వలియ గురూతీ పూజా బలి అనే విధానాన్ని ఆచరిస్తారు. కేరళ నంబూద్రీలు మాత్రమే వలియ గురూతి పూజ ద్వారా శత్రువులు ప్రయోగించబడ్డ దుష్కర్మలకు నాంది వాక్యాన్ని పెట్టవచ్చు. కేరళలో మాత్రమే నిర్వహించగల వలియ గురూతి పూజ, ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరణ్యమలైలో వెలసిన శ్రీ నాగరాజా, నాగాయక్షి తంత్ర పీఠమునందు శ్రీ C.V.S. చక్రపాణి గారు, జయంతన్ పిళ్ళై గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. క్షుద్ర ప్రయోగాలకు గురి అయిన వారిని ఈ పీఠము నందు జరిగే వలియ గురూతి పూజలో ఉంచిన వారికి సంపూర్ణమైన స్వస్థత చేకూరుతుంది.

               మార్చి నెల 9,10,11 వ తేదీలలో మలయాళ భగవతి పీఠము నందు నిర్వహించబడుతున్న వలియ గురూతి, కుబేర బలి, భాగ్య సూక్త హవనం, ఐశ్వర్య సూక్త హవనం, ఆశ్లేష బలి, ప్రత్యంగిర, భగలాముఖి, తిలా హోమములు మున్నగు అత్యంత శక్తివంతమైన వాటిలో పాల్గొనుటకు ముందుగా మీ పేరు గోత్ర నామములు రిజిస్టర్ చేసుకోగలరు.

జాతకులు తమ యొక్క జన్మకుండలిలోని గ్రహ దోషాలను పరిశీలించుకొని, వాటికి కావల్సిన పరిహారాదులు, జప, హోమాదులు జరిపించుకోగలరు. జన్మకుండలిని పరిశీలించి మీకు చేయవలసిన పరిహారములు తెలుపబడును.

తంత్ర ప్రయోగ నిర్మూలనకు వలియ గురుతి పూజ మరియు కాలసర్ప దోష, సర్ప శాప నివారణకు, నాగరాజ స్వామి విగ్రహ ప్రతిష్ట కొరకు 30,000/-

సర్పబలి , నవనాగమండలం, సర్పం తుల్లాల్

ప్రత్యాంగిర హోమం

సుదర్శన హోమం

భగలాముఖి

భాగ్య సూక్త హోమం, కుబేర బలి

విదేశాలలో నివసిస్తూ విద్యా, ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఇంద్రాదిత్య హోమములు కేరళ తాంత్రిక విధానములో జరిపించబడును. తద్వారా శాస్త్ర, ఉద్యోగ ప్రాప్తి కలుగును.

గమనిక:

ఈ పూజ హోమాది కార్యక్రమాలలో పాల్గొనదలచినవారు 9846466430 నెంబరుకు సంప్రదించి గోత్ర నామములను నమోదు చేసుకోగలరు. మార్చి 9,10,11 తేదీలలో జరుగు ఈ కార్యక్రమములకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ మార్చి 7. మరిన్ని వివరాలకు 9846466430 నెంబరుకు సంప్రదించగలరు.

Related Articles: 

 

వరుణ గ్రహం – ప్రాణాపాయ పరిస్థితులు

ప్రాణాపాయములు కలిగించే వరుణ గ్రహ స్థితి ఫలితములు:

జ్యోతిష్య శాస్త్రం అంతయూ కూడా నవగ్రహముల మీద ఆధారపడి ఫలితములు ఇవ్వడం జరుగుతుంది. ఈ నవగ్రహాల ఆధారంగా ప్రపంచ, రాజకీయ, ఆర్థిక, ధర్మాధర్మ విచక్షణ, ప్రకృతి భీభత్సములు ఎప్పుడు జరుగునో తెలుసుకోవడం అనాది నుండి జరుగుతుంది. వ్యక్తులపై దుష్ప్రభావాలను, మారకమును ఇచ్చుటలో యమగ్రహం, ఇంద్ర గ్రహం, వరుణ గ్రహం నూరు శాతం ప్రతిఫలింపజేస్తాయి. విదేశీయానం, విదేశీ జీవనం, విదేశాలలో ప్రయాణాదులలో మరణం, అపహరణకు గురి కావడం, శిక్షలకు గురి కావడం, విదేశాలలో బానిస జీవనం వంటి అంశాలు యమ, వరుణ, ఇంద్ర గ్రహాలు ప్రాప్తింపజేస్తాయి. రాజ యోగాలను ప్రసాదింపజేసే శని, గురు, శుక్ర, కుజ గ్రహాలు వాటి బాధ్యతలను వరుణ, ఇంద్ర, యమ గ్రహాలకు అప్పగించడం జరుగుతుంది. ఈ గ్రహాలు మానవులకు దుష్పరిణామాలు కలిగించే స్థితిని గ్రహ వెధా దోషాలు అని పిలుస్తారు. యమ, వరుణ, ఇంద్ర గ్రహాలు దుష్పరిణామాలను కలిగించే గ్రహ స్థితులు తెలుసుకోండి.

జన్మలగ్నమందు అనగా వ్యక్తుల జన్మకుండలిలో జన్మలగ్నములో వరుణుడు ఉండినట్లైతే, కరెంటు షాకు వల్ల, బాంబు పేలుళ్ళ వల్ల, పిడుగుపాటు వలన ఆ వ్యక్తులకు ప్రాణ గండములు గడుచుట జరుగును.

  • 6వ స్థానములో వరుణుడు ఉండినట్లైతే కరెంటు షాకుకు గురి కావడం, అగ్నిప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. ఈ గ్రహ స్థితి ఉన్న జాతకుల యొక్క భార్య లేదా భర్త ఆత్మ హత్యకు పాల్పడటం, హత్యకు గురి కాబడటం జరుగుతుంది. వ్యాపార భాగస్వాముల వలన వీరికి మరణ గండములు సంభవించును. సామాజిక, సాంకేతిక మాధ్యమాల్లో ఈ విషయాలను ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. క్యాన్సర్, కుష్టు వ్యాధులు సంభవించు అవకాశములు ఉండును.
  • జన్మ లగ్నము నుండి 7వ స్థానములో వరుణ గ్రహం ఉన్నట్లైతే, వివాహం జరిగిన కొద్ది కాలానికే జీవిత భాగస్వామికి ప్రాణ గండములు సంభవించే అవకాశములు వచ్చును. వరుణ గ్రహముతో పాటు యమ గ్రహము కూడా కలసి ఉన్నట్లైతే, ఒకరినొకరు లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు పాశవికంగా హత్యకు గురి కావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ విధమైన సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాము. ఈ విధమైన ప్రాణాపాయ గండాలు, దుష్పరిణామాల నుండి తప్పించుకోవడానికి అధర్వణ తంత్రంలో కొన్ని పరిహారాదులు, హోమాలు జరిపించిన రక్షింపబడతారు.
  • జన్మలగ్నము నుండి 5వ స్థానంలో వరుణుడు ఉన్నట్లైతే సంతానము కలుగడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ జన్మకుండలిలో సంతాన కారక గ్రహం బలంగా ఉన్నట్లైతే, సంతానము కలిగి, ఆ సంతానము అంగవైకల్యముతో పుట్టడం జరుగుతుంది. సంతానానికి మాటలు రాకపోవడం, గుండెలో రంధ్రములు ఏర్పడటం, మూర్చలు, అంగవైకల్యం, మతిస్థిమితం లేకపోవడం, నపుంసకత్వం ప్రాప్తించడం, మానసిక దౌర్బల్యం, ఉన్మాదం కలిగి ఉండటం, భార్యకు గర్భస్రావాలు జరగడం లాంటివి జరుగుతాయి. పంచమ స్థానంలో వరుణుడి స్థితి వలన సంతానముకు జలగండము కలుగడం జరుగుతుంది. నది మీద ప్రయాణింస్తుండగా లేదా నీటిలో మునిగి చనిపోవడం మనం చాలా సార్లు గమనించే ఉంటాము.

 

విదేశీయాన జీవనం, విదేశాలలో బలవన్మరణం పొందడం, అపహరణకు గురి కావడం, వీటికి గల గ్రహ స్థితులు:

  • జన్మకుండలిలో 9వ స్థానంలో వరుణ గ్రహ స్థితి మరియు శని, కుజ గ్రహముల పాపదృష్టి ఉన్నట్లైతే, ఈ విధమైనటువంటి గ్రహస్థితులు కలిగి ఉన్న వ్యక్తులు విద్య నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో విదేశాలకు పోయి, అచ్చట దుర్మరణం పాలగును లేదా వారు తీరి తమ స్వదేశానికి తిరిగి రాకపోవడమో జరుగుతుంది. ఇలాంటి గ్రహస్థితులు కలిగి ఉన్న వ్యక్తులకు ఇవి తప్పక ప్రాప్తిస్తాయి. ముందుగా గ్రహించి శాంతి పరిహారాదులు జరిపించిన ఎడల మేలు జరుగును. పూర్ణాయుర్దాయమును పొందగలుగుతారు.
  • వరుణుడు 4,6,8,9,11,12 స్థానాలలో చెడు చేయును. ఒకవేళ 12వ స్థానములో వరుణుడు స్థితి చెంది ఉన్నట్లైతే, ఇతర పాప గ్రహాల దృష్టి కూడా చేరినట్లైతే, కారాగార ప్రాప్తి, జైలులో మగ్గిపోవడం జరుగును.

గమనిక: ఈ ఫలితములు ఆ స్థానం యొక్క రాశిని బట్టి మారును. కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించి వీటి ఫలితాలను జాతకులకు వివరించగలరు.

 

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses

ఆశ్లేష బలి

🕉️ ఆశ్లేష బలి పూజ విధానం, ప్రయోజనాలు (Ashlesha Bali Pooja) 🕉️

 

📍 శ్రీ మలయాళ భగవతి నాగరాజ స్వామి నాగయక్షి పీఠం, అరణ్యమలై, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

📅 జూలై 26, 2025

వివరాలు:

    • పూజా తేదీ: జూలై 26, 2025
    • నమోదు చేసుకునే అవకాశం: కేవలం 21 మందికి మాత్రమే
    • ఋత్విక్ సంభావన: ₹25,000/-
    • దీక్ష వస్త్రాలు, పూజా సామగ్రి  ఏర్పాట్లు అన్నీ కూడా పీఠం తరుపున జాతకులకు అందుతాయి.
    • మీరు పూజ రోజున మాత్రమే హాజరు కావాలి.

ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నాగదోష నివారణతో శుభఫలితాలు పొందగలుగుతారు.

📞 పూర్తి వివరాల కోసం సంప్రదించండి:  98464 66430

 

ఆశ్లేష బలి పూజ (Ashlesha Bali Pooja in Telugu) అనేది నాగదోషం, సర్పదోషం, కాలసర్ప యోగం వంటి సమస్యల నివారణకు కేరళ తాంత్రిక సంప్రదాయంలో నిర్వహించే విశిష్టమైన పరిహార పూజ. చాలామంది భక్తులు ashlesha bali pooja benefits in telugu గురించి తెలుసుకొని ఈ పూజను నిర్వహించుకుంటారు. ఈ పూజ యొక్క పూర్తి ఆశ్లేష బలి పూజ విధానం మరియు ప్రయోజనాలను క్రింద వివరించాము.

 

నాగ దోషం, సర్ప దోషం, కాల సర్ప యోగం వంటి దోషాలను నివారించేందుకు ఆశ్లేష బలి హోమ కార్యక్రమమే అత్యంత శక్తివంతమైన పరిష్కార మార్గం. నాగరాజ స్వామి, నాగయక్షి దేవి అనుగ్రహంతో, మా పీఠంలో కేరళ తాంత్రిక విధానంలో ఆశ్లేష బలి పవిత్ర హోమాది పూజా కార్యక్రమమును నిర్వహించబోతున్నాము. ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నాగదోష నివారణతో శుభఫలితాలు పొందగలుగుతారు. సర్ప పీఠాలలో చేసే నవనాగమండలం, ఆశ్లేష బలి పూజాది కార్యములకు మాత్రమే సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. తీవ్రమైన కాలసర్పదోషం, నాగ శాపం, నాగ దోషం, రాహు గ్రహ నాగదోషం, కేతు గ్రస్త సర్పదోషం సంపూర్ణంగా తొలగిపోవాలంటే ఆశ్లేష బలి, నవనాగమండలం పూజను తప్పనిసరిగా జరిపించుకోవాలి. జాతకులు ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని మరియు వ్యక్తిగతంగా గాని ఈ పూజను నిర్వహించుకోవడం మంచిది.

 

ఆశ్లేష బలి పూజ విధానం (Ashlesha Bali Pooja Vidhanam)

చాలామంది భక్తులు ఆశ్లేష బలి పూజ విధానం PDF లేదా పూర్తి పూజా క్రమం కోసం వెతుకుతుంటారు. ఆశ్లేష బలి పూజలో సంకల్పం, కలశ స్థాపన, నాగదేవత ఆవాహన, ఆశ్లేష బలి జపం, హోమం, పూర్ణాహుతి మరియు ఆశీర్వచనం వంటి ప్రధాన కార్యక్రమాలు ఉంటాయి. కేరళ తాంత్రిక సంప్రదాయం ప్రకారం ఈ పూజ నిర్వహించబడుతుంది.

 

ఈ హోమమును ఎవరు జరిపించుకోవాలి?

వ్యక్తిగత జన్మకుండలిలో నాగ శాపం, సర్ప శాపం, కాలసర్పయోగం, రాహు గ్రస్త నాగ దోషం, కేతు గ్రస్త సర్ప దోషం ఉన్నవారు మరియు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఈ ఆశ్లేష బలి హోమాది పూజా కార్యక్రమమును జరిపించుకోవాలి.

 

Ashlesha Bali Pooja Benefits in Telugu (ఆశ్లేష బలి పూజ ప్రయోజనాలు)

ఆశ్లేష బలి పరిహారమును జరిపించుకోవడం వలన జన్మకుండలిలో రాహు కేతువుల వలన కలిగే నాగ దోషాలు, నాగ శాపాలు, నాగ శాపం, సర్ప దోషం, కాలసర్ప దోషం వంటి దోషములు నివారించబడతాయి.ఈ దోషముల వలన కలిగే అనారోగ్య సమస్యలు, రాహు, కేతు గ్రహముల దోషముల వలన కలిగే అడ్డంకులు, ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. సంతానం ఆలస్యమైన వారికి ఈ పరిహారము జరిపించుకున్న తరువాత సంతాన భాగ్యం దక్కుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు నివారించబడతాయి. ఈ దోషాల వలన ఎదుర్కొనే చట్ట సంబంధమైన, భూ సంబంధమైన సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. నాగదోషం, సర్పదోషం, కాలసర్పయోగం వంటి సమస్యలకు కేరళ తాంత్రిక సంప్రదాయంలో అనుసరించే తాంత్రిక పరిహారాలు కూడా జాతక పరిస్థితులను బట్టి సూచించబడతాయి.

 

Ashlesha Bali Pooja Benefits in Telugu: ఆశ్లేష బలి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించుకోవడం వలన నాగదోషం, సర్పశాపం, రాహు-కేతు సంబంధిత దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. వివాహ ఆలస్యం, సంతాన సమస్యలు, ఉద్యోగ అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

 

ఆశ్లేష బలి హోమము నమోదు చేసుకొనుటకు చివరి తేదీ ఏమిటి?

ఈ హోమ కార్యక్రమములో పాల్గొనగోరువారు 9846466430 నెంబరుకు కాల్ చేసి జూలై 20వ తారీఖు లోపు నమోదు చేసుకోగలరు.

 

ఈ హోమము జరిపించుకోవడానికి ఏ విధంగా నమోదు చేసుకోవాలి?

శ్రీ మలయాళ భగవతి శ్రీ నాగరాజ స్వామి నాగయక్షి పీఠము, అరణ్యమలై సర్ప పీఠములో ఆశ్లేష బలి కార్యక్రమము శ్రావణ మాసము జులై 26వ తారీఖున జరిపిచుకునేందుకు జాతకులు 9846466430 నెంబరుకు కాల్ చేసి తమ గోత్ర నామములు నమోదు చేసుకోగలరు. ఆశ్లేష బలి హోమ కార్యక్రమునకు కావల్సిన పూజా సామగ్రి, పుష్పములు, ఫలములు, నైవేద్యము, జాతకులు ధరించవలసిన దీక్ష వస్త్రములు, యాజ్ఞీకులకు చేయవలసిన వస్త్ర దనములు, తాంబూలము అన్నీ కూడా పీఠము వారే అందజేస్తారు. 

 

ఆశ్లేషబలి పూజ కార్యక్రమం:

    1. సంకల్పం
    2. వినాయక పూజ
    3. ఆశ్లేషబలి కలశ స్థాపన
    4. ఆశ్లేష మండల ఆర్పణ
    5. ఆశ్లేష బలి జపము
    6. ఆశ్లేష బలి హోమం
    7. పూర్ణాహుతి
    8. ప్రసాద వితరణ
    9. వేద ఆశీర్వచనము

    —దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ 

 

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

 

ఆశ్లేష బలి పూజ అంటే ఏమిటి?

ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన నాగదోష నివారణ పూజను ఆశ్లేష బలి పూజ అని పిలుస్తారు.

 

ఆశ్లేష బలి పూజ విధానం PDF లభిస్తుందా? 

పూజా విధానం వివరాలను పీఠం ద్వారా లేదా సంబంధిత గురువుల ద్వారా పొందవచ్చు.

 

Ashlesha Bali Pooja Benefits in Telugu ఏమిటి? 

నాగదోష నివారణ, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, రాహు కేతు దోషాల శాంతి వంటి ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

 

ఆశ్లేష బలి పూజ ఎవరు చేయించుకోవాలి?

నాగదోషం, సర్పశాపం, కాలసర్ప యోగం ఉన్నవారు మరియు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినవారు చేయించుకోవచ్చు.

 

నాగదోషం, సర్పశాపం, కాలసర్ప యోగం వంటి సమస్యల నివారణ కోసం నిర్వహించే Ashlesha Bali Pooja in Telugu గురించి పూర్తి వివరాలను ఈ పేజీలో అందించాము. ఆశ్లేష బలి పూజ విధానం, పూజా క్రమం మరియు ashlesha bali pooja benefits in telugu గురించి తెలుసుకొని శాస్త్రోక్తంగా ఈ పూజను నిర్వహించుకోవచ్చు.

 

Related Articles

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses

 

కాలసర్పశాంతి

                                                            కాలసర్పశాంతి

వ్యక్తుల జీవితంలో  ప్రమాదాలను కలిగించే యముడు, వరుణుడు, రాహువు, కుజుడు గ్రహాలు జన్మకుండలిలో ప్రతికూలంగా ఉన్నట్లైతే కొన్ని గ్రహ మహాదశలలో వాహన దుర్ఘటనలు, పిడుగుపాటు ప్రమాదాలు, జలగండాలు, ధీర్ఘ కాలిక రోగాలు ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. తంత్రశాస్త్రంలో ఒక భాగమైన యమవిధిబలి, వారుణాస్త్ర హవనం అనేటువంటి తంత్ర పరిహారాదులు అవయోగాలను, దోషాలను నిర్మూలిస్తాయి. మానవులకు ప్రమాదాలు, మృత్యు గండములు, వాహన దుర్ఘటనలు ఏ సమయంలో సంభవిస్తాయో అందరికీ తెలియదు. అందువలన ఈ కుజ, రాహు, యమ, వరుణ గ్రహాల వల్ల సంభవించే దుష్ఫలితాలకు ముందుగానే కొన్ని తంత్ర పరిహారాదులు ఆచరించడం వలన జరగబోవు ఉపద్రవాల బారీ నుండి తప్పించుకోవడం సాధ్యమవుతుంది. క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలకు తంత్ర విద్యల ద్వారా నివారణ చర్యలు చేయవచ్చును. పైన పేర్కొన్న సమస్యలే కాకుండా, చర్మ సంబంధిత రోగాలు, రాహు కుజ పీడా దోషాలను నివారించడానికి నవనాగమండలం, మండకాళి హవనం, శేషనాగ తంత్ర పరిహారాల ద్వారా దోష నివారణ జరిపించవచ్చును. ఈ పరిహారాదులు జూలై 12,13,14 తేదీలలో ఆంధ్ర రాష్ట్రంలోని నారాయణవనం మండలంలోని శ్రీ మలయాళ భగవతి శ్రీ నాగరాజస్వామి నాగాయక్షి పీఠం, అరణ్యమలై నందు జరుగును.

కాలసర్ప దోషాలను సమూలంగా నిర్మూలన చేయగల శక్తి తంత్ర శాస్త్రంలో ఆశ్లేష బలి అనే సర్ప సంస్కార శ్రాద్ద బలి విధానానికి మాత్రమే ఉంది. వ్యక్తులకు జన్మతః ప్రాప్తించిన కాలసర్పదోషాలకు నివారణగా ఆశ్లేషబలి నిర్వహించడం జరుగుతుంది.

               నాగదోషం, సర్పశాపం వంటి దోషాలకు నివారణ ఆశ్లేష బలి పూజ మాత్రమే. సాధరణంగా కాలసర్పదోష శాంతి పూజ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల వారు నిర్వహించడం, ఆచరించడం అనాదిగా జరుగుతూ వస్తుంది. అయితే, ఈ ప్రక్రియ మంత్ర క్రియా విధానం కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ ప్రక్రియను ఎప్పుడు చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలు సర్ప తంత్రంలో వివరణాత్మకంగా చెప్పబడ్డది.

ఆ నియమాలు ఏవనగా:

  1. కాలసర్పదోషం ఉన్నవారికి మాత్రమే కాలసర్పబలి, కాలసర్పశాంతి, ఆశ్లేషబలిని జరిపించాలి.
  2. జన్మకుండలిలో కాలసర్పయోగాన్ని కలుగజేసి ఆ దోషం ద్వారా నవగ్రహాలలో కొన్ని గ్రహాలు వ్యక్తులకు అవయోగాలను కలుగజేస్తాయి. ఈ అవయోగాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఆ గ్రహాల ద్వారా దుష్ఫలితాలను కనబరచడం జరుగుతుంది. కాలసర్పయోగాలకు కారణభూతమైన గ్రహాలకు వివిధ రకాలైన పరిహారాలు సర్పతంత్రంలో ప్రస్తుతించబడ్డాయి. కాలసర్పదోషాలను పరిశీలించి వారికి ఏ విధమైనటువంటి మంత్ర తంత్ర విధానాలను వినియోగించాలో ఋత్వికులకు తప్పక తెలిసి ఉండాలి. ఆశ్లేషబలిలో ఎన్నో రకాల మంత్ర తంత్ర విధి విధానాలు ఉన్నాయి. దోషానికి తగినట్టుగా పరిహార క్రియలు, మంత్ర వినియోగము ఉన్నాయి. అనుష్టాన ఆవాహ ముద్రలు, క్రియా విధానాలు శాస్త్రానుసారంగా ఆచరించాలి. సర్పశాంతి పరిహార క్రియలో కర్తలు, ఋత్వికులు సర్పముద్రలతో మాత్రమే ఆవాహన చేయాలి. ఋత్విక్కులు తాము సర్పముద్రలను ఆచరిస్తూ కర్తల చేత కూడా ఆ ముద్రలు చేసేలా తెలియజెప్పాలి.
  3. సర్పక్షేత్రములలో సర్పసంబంధిత అనుష్టాన ఆలయంలో గాని, నదీ పరీవాహక ప్రాంతాలలో గాని మాత్రమే ఈ పరిహారములు జరిపించాలి.
  4. సర్పశాంతిని జరిపించే ఋత్వికులు మడిని ఆచరిస్తూ, మంత్ర విధానాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. జ్యోతిష్య శాస్త్రంలో గల 36 రకాల కాలసర్పదోషాలను తెలుసుకొని వాటికి తగినటువంటి తంత్ర క్రియ విధానాలను మాత్రమే ఆచరించాలి. జాతకులకు కలిగినటువంటి కాలసర్పదోష అవయోగాలకు మాత్రమే ఋత్విక్కులు మంత్ర తంత్ర క్రియా విధానాలు పాటించాలి. ఈ క్రియా విధానంలో శ్రద్ద అత్యంత అవసరము. కర్తలు, ఋత్వికులు సంకల్పమును అధికంగా కలిగి ఉండాలి.
  5. సర్ప నక్షత్రాలలో మాత్రమే ఈ కాలసర్పశాంతిని నిర్వహించాలి. కాలసర్పశాంతిని చేయకోరదలచిన వారు వారి జన్మ నక్షత్రమునకు, జన్మ లగ్నమునకు షష్ట్య, నవమ స్థాన శుద్ధి తప్పక చూడవలెను.
  6. సర్ప విసర్జిత కుబుసమును సర్ప ప్రేత శాంతి కొరకు ఖచ్చితంగా వినియోగించవలెను.
  7. శ్రీ నాగరాజస్వామి మరియు నాగాయక్షి దేవతా మూలమంత్ర జపమును కర్తలు తప్పక జపించవలెను. కాలసర్పశాంతి క్రియ పూర్తి అయిన తరువాత శ్రీ నాగరాజస్వామి, నాగయక్షి కొయ్య లేదా లోహ విగ్రహమును ప్రసాద రూపములో స్వీకరించి, గృహమునకు తీసుకొనిపోయి వారి పూజా మందిరములో ప్రతిష్టించవలెను. కర్తలు ఈ కార్యక్రమం పరిహార క్రియలో సాంప్రదాయ శ్వేతవర్ణ దీక్షా వస్త్రములు తప్పక ధరించవలెను మరియు వస్త్ర యజ్ఞోపవీతమును ధరించవలెను. సర్పశాంతి పరిహార క్రియలో ప్రధానంగా నాలుగు రకాల యజ్ఞగుండములను ఉపయోగించవలెను. క్షేత్రపాలక ఆవాహన అనుమతిని పొందవలెను. ప్రాయశ్చిత్త జపమును చేసుకోవలెను.

శ్రీ నాగరాజస్వామి, నాగయక్షి క్షేత్రములో ఈ పరిహారములు జూలై 12, 13, 14 తారీఖుల్లో నిర్వహించ-బడుతున్నాయి. సర్ప ప్రత్యధిదేవతలు క్షేత్ర పాలకులుగా ఉండిన ఈ క్షేత్రంలో నాగరాజస్వామి, నాగయక్షి అమ్మవారు అధిష్టానమై ఉన్నారు. ఈ ప్రాంగణంలోగల పీఠంలో నాగరాజస్వామి అనుగ్రహము, శరణు పొందదలచి ఇచ్చట పరిహరాదుల క్రియలు నిర్వహించుచున్నారు. జూలై 12, 13, 14-2025 ఈ మూడు రోజులు కాలసర్పశాంతి పరిహారాది క్రియలు మలయాళ సర్ప తాంత్రిక విధానంలో నిర్వహించబడును. ఈ కాలసర్పశాంతి పరిహారాదులు జరిపించుకొదలచిన వారు చెల్లించవలసిన ఋత్విక్ సంభావన-25,000/-.

ashlesha bali

వ్యాపారాదులు నిర్వహిస్తూ నష్టములను ఎదుర్కొంటున్న వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు జన్మకుండలిలో వైవాహిక పీడా దోషము కలిగి ఉన్నవారు, సంతాన ప్రాప్తి పొందగోరువారు, ఉద్యోగ, పదవీ ప్రాప్తిని పొందగోరువారు, అందులో విశేషాభివృద్ధిని పొందగోరువారు, వివాహ ప్రాప్తి పొందగోరువారు, గ్రహమహాదశ పీడా దోషములకు పరిహారములు చేయించుకొదలచినవారు, భూ, గృహ చట్ట సంబంధిత వివాదాలలో పరిష్కారము కొరకు వేచి ఉన్నవారు, అనుకూల కార్యసిద్ధిని పొందగోరువారు జూలై 12,13,14 తేదీలలో పరిహారాదులు మా పీఠమునందు జరిపించుకోగలరు.

గమనిక: జూలై 12, 13, 14 వ తేదీలలో పరిహారాలు జరిపించుకోవాలి అనుకున్న వారు మరిన్ని వివరాలకు, తమ పేర్లను నమోదు చేసుకొనుటకు 9846466430 నెంబరుని సంప్రదించగలరు. 

మరిన్ని వివరాలకు 9846466430 నెంబరును సంప్రదించగలరు. 

శేషనాగ కాలసర్ప దోషం

శేషనాగ కాలసర్ప దోషం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ,  ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే  జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో పన్నెండవది మరియు చివరది అయిన శేషనాగ కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్పదోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.

  • దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ

                జన్మకుండలిలో పన్నెండవ భావంలో (వ్యయ, విదేశీయానం, ఆధ్యాత్మిక భావం) రాహువు మరియు ఆరవ భావంలో (శతృ, వ్యాధి, ఋణ స్థానం) కేతువు ఉండి, ఈ రెండు గ్రహాల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నట్లైతే, వారికి మహాపద్మ కాలసర్ప దోషం ఉన్నట్టు గుర్తించాలి. మహాపద్మ కాలసర్పదోషం వలన జాతకుల యొక్క శత్రువర్గం, ఆరోగ్యం, రుణములు, వ్యయములు, విదేశీయాన ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ శేషనాగ కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.

శేషనాగ కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:

  • ఈ దోషం గల జాతకులు తరచూ ఓటమికి గురి అవుతూ ఉంటారు. దురదృష్టం వీరిని వెంటాడుతూ ఉంటుంది. రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు.
  • నేత్ర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  • శారీరక మరియు మానసిక అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • శతృభయం అధికంగా ఉంటుంది. గుప్త శతృవులు వీరి పై నిఘా పెట్టి ఉంటారు. వీరి పై నిరంతర కుట్రలు జరుగుతాయి.
  • వీరి నిర్ణయాలు, మనస్తత్వం అస్థిరంగా ఉంటుంది. మానసిక దుర్బలం ఉంటుంది.
  • ఈ దోషం గల జాతకులకు సాధరణంగా వివాహం ఆలస్యంగా జరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు కలుగుతాయి.
  • రాహువు వలన ఈ జాతకులకు పిస్టుల, పైల్స్ వంటి సమస్యలు ఎదురగును. తరచూ దెబ్బలు తగలడం, ప్రమాదాలు
  • అధిక ఖర్చులు ఉంటాయి, కొన్ని ఖర్చులు అనుకోకుండా, కొన్ని తప్పని ఖర్చులు ఏర్పడతాయి.
  • ఆత్మ నియంత్రణ లోపించడం వలన పరువు నష్టం జరుగును. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సమస్యలు తలెత్తును.
  • చేసే ఉద్యోగం తరచూ మారవలసి వచ్చును.
  • స్థిరాస్థి విషయాలలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. భూ వివాదాలు ఎదురవుతాయి.
  • సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
  • ఈ దోషం కారణంగా వైవాహిక జీవితం గందరగోళంగా ఉంటుంది. ఈ దోషంతో పాటుగా వ్యక్తిగత జన్మకుండలిలో వివాహ కారక గ్రహం కూడా దోష పూరితంగా ఉన్నట్లైతే, వివాహం జరిగిన తరువాత గాని జాతకుడు నేరపూరిత చర్యలలో పాల్గొని ప్రభుత్వ శిక్షలకు గురి అవడం, మత్తు పధార్థాలకు అలవాటు పడటం, వివాహేతర సంబంధాలు ఏర్పడటం, ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరుగుతూ ఉండటం లాంటివి జరుగును.
  • ఈ దోషం గల జాతకులకు అప్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఆ అప్పులను తిరిగి చెల్లించేందుకు చాలా కష్టపడవలసి వస్తుంది.

ముఖ్య గమనిక:

శేషనాగ కాలసర్పదోషం వలన జాతకులకు తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికి, ఈ దోషం వలన కలిగే కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయి. ఈ జాతకులు సమాజంలో తమకంటూ పేరుని సంపాదించుకుంటారు. విదేశీ ప్రయాణాల వలన లాభాలు, విజయాలు సంభవిస్తాయి. వీరికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికి వీరి ఖర్చుల్లో చాలా వరకు మంచి పనులకొరకే అయ్యి ఉంటుంది. వీరు గమనించినట్లైతే, వీరిలో సృజనాత్మకత దాగి ఉంటుంది.  వ్యక్తిగత జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 52 సంవత్సరాల తరువాత శుభ ఫలితాలు కనబరుస్తాయి. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.

 

శేషనాగ కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఈ దోషం గల జాతకులు తమ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రతిరోజూ ఆరోగ్యవంతమైన సమతుల్యమైన ఆహారం, వ్యాయామం, ప్రాణాయామం తప్పక పాటించాలి.
  • స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. ఆస్తి లావాదేవీల విషయాలలో ఇతరుల చేతిలో ఈ జాతకులు మోసపోయే అవకాశం ఉంది. కావున లావాదేవీలు జరిగే సమయంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి.
  • ఈ దోషం వలన జాతకులకు శతృభయం ఎక్కువగా ఉంటుంది. వీరి శత్రువులు వీరు ఊహించని సంధర్భాల్లో వీరిపై పన్నగాలు చేస్తారు. కావున ఈ జాతకులు తమ శతృవుల చర్యల పట్ల ఎంతో జాగ్రత్త వహించి నడచుకోవాలి.

పరిహారాలు:

  • శేషనాగ కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
  • మహామృంత్యుంజయ మంత్రాన్ని జపించాలి.
  • మహాశివునికి రుద్రాభిషేకం చేయించాలి.

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses