స్వర్ణాకర్షణ భైరవ హోమం

భైరవుని శాంత స్వరూప అవతారమే స్వర్ణాకర్షణ భైరవుడు. కల్పవృక్షం కింద, కమల సింహాసనం పై కూర్చుని, వజ్ర కిరీటం ధరించి,ఒక చేతిలోని బంగారు కుండలో అమృతాన్ని, మరొక చేతిలో దుష్ట నిర్మూలనకు సూచికగా త్రిశూలం, ఎడమ వైపు భైరవి సమేతంగా స్వర్ణాకర్షణ భైరవ రూపం ఉంటుంది. సౌకర్యవంతమైన జీవితం కొరకు, ఐహిక సుఖాల కొరకు, సమస్త సమృద్ధి కొరకు, సంపన్నులుగా మారేందుకు స్వర్ణాకర్షణ భైరవుని పూజించాలి, హోమాన్ని ఆచరించాలి. స్వర్ణాకర్షణ భైరవుని ధనాకర్షణ భైరవ అని కూడా పిలుస్తారు. అభయవరదునిగా ఉన్న ఆయన రూపం సంరక్షకుడిగా సూచిస్తుంది. చేతిలో ఉన్న బంగారు అమృత భాండం కోరిన కోరికలు అన్నీ ఈ భైరవుడు నెరవేరుస్తాడని సూచిస్తుంది. కుబేరునికి అత్యంత ముఖ్యమైన నిధులైన పద్మ నిధి మరియు శంఖ నిధులకు ప్రతీకగా స్వర్ణాకర్షణ భైరవునికి ఒక చేతిలో పద్మము, మరొక చేతిలో శంఖము ఉంటుంది. రుద్రయామల తంత్రములో వివరించిన విధంగా, ఒకసారి కొన్ని వందల ఏళ్ళ పాటు దేవతలకు మరియు రాక్షసులకు యుద్ధం జరుగగా, కుబేరుడి వద్ద ఉన్న ఖజనా మొత్తం అయిపోయింది. లక్ష్మిదేవికి సైతం దారిద్ర్యం సంభవించింది. అందుకు కంగారు పడ్డ దేవతలు అందరూ కలసి తమ సంపదను తిరిగి ఏ విధంగా సాధించుకోవాలని మహాశివుని వద్దకు వెళ్ళి ప్రార్థించగా, బదరీనాథ్ క్షేత్రంలో ఉన్న స్వర్ణాకర్షణ భైరవుని ప్రార్థించమని సలహా ఇచ్చాడు. తపస్సు గావించిన తరువాత, స్వర్ణాకర్షణ భైరవుడు ప్రత్యక్షమయ్యి, తన నాలుగు చేతులతో బంగారు కాసులను కురిపించగా, దేవతలు అందరూ మళ్ళీ సంపన్నులుగా మారారు.

స్వర్ణాకర్షణ భైరవ హోమమును ఏ మాసములో అయినా సరే వచ్చే కృష్ణ పక్ష అష్టమి నాడు జరిపించిన యెడల వారు సంపన్నులు అవుతారని ఆదిత్య పురాణంలో చెప్పబడింది. సంపదకు, బంగారానికి అధిపతి అయిన స్వర్ణాకర్షణ భైరవ హోమం ఆచరించిన జాతకులు, సంపద, శ్రేయస్సు, సౌకర్యాలు, విజయం సొంతమవుతాయి. మహాశివుడు భోలాశంకరుడు, అదే విధంగా స్వర్ణాకర్షణ భైరవుడు కూడా సులభంగా ప్రసన్నుడు అవుతాడు. స్వర్ణాకర్షణ భైరవుని అనుగ్రహం లభించిన వారికి సిద్ధి లభించి, ఇతరులను నియంత్రించే అద్భుతమైన శక్తులను ప్రసాదిస్తాడు.

స్వర్ణాకర్షణ భైరవ హోమం వలన కలిగే ప్రయోజనాలు:

స్వర్ణాకర్షణ భైరవ హోమమును జరిపించుకున్న భక్తులు సంపన్నులు కావడానికి అడ్డుగా ఉన్న ప్రమాదలను, దుష్ట శక్తులను తొలగించి, సకల శుభాలను స్వర్ణాకర్షణ భైరవుడు అనుగ్రహించి మానసిక శాంతిని, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. తన భక్తులకు ప్రాపంచిక సుఖాలను, బంగారము, ధనమును, సకల సౌభాగ్యములను ప్రసాదిస్తాడు.  ఈ హోమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి మనో ధైర్యం పెరిగి, ఉద్యోగ నిమిత్తం ఉన్న సకల దోషాలు నివృత్తి అవుతాయి. ఉద్యోగం కొరకు ప్రాకులాడేవారికి ఈ స్వర్ణాకర్షణ భైరవ హోమం ఒక వరం లాంటిది. ఈ హోమాన్ని ఆచరించడం వలన గొప్ప గొప్ప అవకాశాలు తలుపు తడతాయి. ముఖ్యంగా వ్యాపారస్థులకు తమ వ్యాపారంలో అభివృద్ధి, లాభాలు మెండుగా కలిగి, కొత్త వ్యాపార ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకోగల స్థితి ఏర్పడుతుంది. కృష్ణ పక్ష అష్టమి నాడు ఈ హోమాన్ని ఆచరించడం వలన జీవితంలో ఎన్నో అనుకూల సంఘటనలు, శుభాలు చేకూరుతాయి.

స్వర్ణాకర్షణ హోమము వలన కలుగు ఉపయోగములు:

  • గ్రహ దోషాలు తొలగిపోయి, శ్రేయస్సు లభిస్తుంది.
  • తీసుకున్న అప్పులను త్వరగా తిరిగి చెల్లించగలుగుతారు.
  • ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, జీవితం మెరుగుపడుతుంది.
  • స్వర్ణకర్షణ భైరవుడు ఆవాహన చేసి హోమం జరిపించిన యెడల అభివృద్ధి, లాభాలు సొంతమవుతాయి.
  • కోరుకున్న రంగములో పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
  • సకల దోష నివారణ, సకల సౌభాగ్య ప్రాప్తిగా ఈ హోమాన్ని భావించవచ్చు.
  • చేసే వృత్తి లేదా వ్యాపారంలో విజయం చేకూరుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు ఎదురయ్యి సంపన్నులుగా మారేందుకు అవకాశాలు మెండు.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Email: chakrapani.vishnumaya@gmail.com