Bhairavi homam

                                                                          భైరవి హోమం

దశమహావిద్యలలో 6వ మహావిద్యే ఈ భైరవి మాత. ఈ భైరవినే త్రిపుర భైరవి, బాల భైరవి, కాల భైరవి అని కూడా పిలుస్తారు. నీతి, నిజాయితీ, జ్ఞానం, వరాలను ప్రసాదించే దేవత. ఈ భైరవి మాతను శుభంకరి అని కూడా పిలుస్తారు. భైరవ సమేత భైరవి మాత ప్రపంచంలో జరిగే సృష్టికి, ప్రపంచ వినాశనానికి కారణ భూతురాలు అవుతుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా భైరవి మాత అదుపు ఆజ్ఞలలో ఉంటుంది. ఈ త్రిపుర భైరవి తాంత్రిక సాధన చేసిన వారు ఐహిక కోరికలను అదుపులో ఉంచుకునేందుకు, సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు భైరవి  మాత అనుగ్రహిస్తుంది.

తంత్రశాస్త్రంలో భైరవి మాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శీఘ్ర ఫలితాల కోసం, సంతానం కోసం, బాధల నుండి విముక్తి పొందటం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం దశమహావిద్యలలో ఒకరైన భైరవి మాత సాధన సాధకులు చేస్తారు. ఈ భైరవి మాత యొక్క తంత్ర సాధన వల్ల, హోమం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, దీర్ఘాయువు లాంటి ఇంకా ఎన్నో వరాలను ఆ భైరవి మాత మనకు అనుగ్రహిస్తుంది. సాధకుడు ఈ తంత్ర సాధన ద్వారా సిద్ధి పొందిన వెంటనే షీఘ్రంగా ఫలితాలు కనబడతాయి. భైరవి సాధనను నియమానుసారంగా, క్రమబద్ధంగా చేసిన సాధకుడికి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. దీనివల్ల ఆ సాధకునిలో ఆధ్యాత్మికత పెరగటమే కాకుండా మానవాతీత దుష్టశక్తులను, ప్రయోగాలను ఎదిరించే కిటుకులు, శక్తి సాధకుడు పొందుతాడు. అంతేకాకుండా భైరవి సాధన చేసిన సాధకుడికి అందరిని ఆకర్షిస్తూ  మాట్లాడే శక్తి, వాక్చాతుర్యం కలుగుతాయి.

త్రిపుర భైరవి మహాయంత్రమును ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజించిన వారికి కూడా తన మాటలతో ఇతరులను ఒప్పించే శక్తి గల మాటతీరును, తనని తాను వ్యక్తపరచుకునే గుణాన్ని, మానసిక ఆనందమును ఆ భైరవి మాత కలుగజేస్తూ భక్తులను ఎల్లపుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ త్రిపుర భైరవి మహా యంత్రం వల్ల అన్నీ రకముల దుష్ట శక్తులు, భయాలు, అవాంఛిత సంఘటనలు, నరాల బలహీనత, దుష్ట ప్రేతముల యొక్క బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఎందుకనగా ఈ భయాలు, ఆందోళనలు, దిగుళ్లు, ప్రమాదాలు, వివాదాలు లాంటి సంఘటనలు అన్నీ కూడ త్రిపుర భైరవి మాత ఆధీనంలో ఉంటాయి. కావున తన భక్తులకు వీటి నుండి విముక్తిని కలుగజేస్తుంది. త్రిపుర భైరవిని ఏ విధంగా ఆరాధించాలో పురాణాలలో చెప్పబడింది. ఐహిక సుఖాలను జయించేందుకు, అన్ని విధాల అభివృద్ధికి తన భక్తులను అనుగ్రహిస్తుంది.

తంత్ర గురువు ఆధ్వర్యంలో మాత్రమే భైరవి మాత సాధన చేయాలి. మంత్ర పఠనం, యంత్ర పూజ, నైవేద్యం, హోమం మొదలైన క్రియల ద్వారా భైరవి మాత సంతుష్టరాలు అవుతుంది. ఆ తరువాత సాధకుని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రమాదాలను ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొనే శక్తితో పాటు, సాధకునికి మానవాతీత శక్తులను కూడా ఆ తల్లి ప్రసాదిస్తుంది. భయాలు, ఆందోళనలు, దిగుళ్లు, ప్రమాదాలు, అపకీర్తి, దుష్ట శక్తులు, సంశయాలు, ప్రేతాత్మలు, అకాల మరణాలు లాంటి వాటి నుండి భైరవి మాత సాధకుడిని రక్షిస్తుంది.

జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసినట్లైతే జన్మకుండలిలోని లగ్నానికి భైరవి ఆధిపత్యం వహిస్తుంది. శరీరాన్ని, మనస్సును, అంతరాత్మను, లగ్న సంబంధిత అనగా తనూభావ సంబంధిత అంశాలను శుద్ధి చేసి, నిరంతరం కాపాడుతూ ఉంటుంది. ఎవరికైతే తమ జన్మకుండలిలో లగ్నదోషం ఉన్నదో, ఆ జాతకులు భైరవి మాత తంత్ర పూజను ఆచరించాలి. లజ్ఞాధిపతి గాని, లగ్నములో ఉన్న గ్రహాలు యొక్క మహర్దశ, అంతర్దశల సమయాల్లో లేదా లగ్నంపై గాని, లగ్నంలో ఉన్న గ్రహంపై గాని పాప గ్రహాల దృష్టి ఉన్నప్పుడు, ఆ జాతకులు వామతంత్ర దశమహావిద్య తాంత్రిక భైరవి పూజను ఆచరించాలి. దీని వల్ల జన్మకుండలిలో ఉన్న లగ్న దోషం తొలగిపోతుంది.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com