ఆయుష్ హోమం

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో ఉన్న చెడు గ్రహ స్థానాల వల్ల కలిగే మానసిక, శారీరక అనారోగ్యాలను పారద్రోలడానికి, అకాలమృత్యు భయాన్ని తొలగించడానికి హైందవ సంస్కృతి, ఆచారం, వేదాలను అనుసరించి ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆయుష్ హోమం వల్ల ఆయుః దేవత సంతుష్టులై ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన దీర్ఘాయుషును ప్రసాదిస్తారు. మనకు ఆయుషును ప్రసాదించే దేవతే ఆయుః దేవత.

వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు అయిన భోధ్యాన మహర్షి రచించిన భోధ్యాన సూత్రాలలో ఈ ఆయుష్ హోమం యొక్క విశిష్టతను వివరించారు. జీవితం ఆనందంగా. ఆరోగ్యంగా, ధీర్ఘకాలం పాటు జీవించాలంటే ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహించాలి.

హైందవ పురాణాల్లో తెలియజేయబడ్డ ఏడుగురు చిరంజీవులు అయిన పరశురాముడు, హనుమంతుడు, అశ్వద్ధామ, బలి చక్రవర్తి, విభీషణుడు, కృపాచార్యులు- వీరందరిని ఈ ఆయుష్ హోమములో ఆవహింప చేసి వారి దీవెనలు, అనుగ్రహం జాతకులపై ప్రసరింప జేయటం జరుగుతుంది.

ఆయుష్ హోమం

పూర్వం వేద మహర్షులు పూర్ణాయుర్దాయం వల్ల కలిగే ప్రాముఖ్యతను ఎరిగిన వారు కాబట్టి, ఈ ఆయుష్ హోమాన్ని ఆచరించి, ఆయుష్ దేవతను సంతుష్టపరచి తమ జీవితకాలాన్ని పెంచుకునేవారు. దీనివల్ల ప్రపంచ శ్రేయస్సు కొరకు నెరవేర్చాల్సిన బాధ్యతలను పూర్తిచేసేవారు. ఈ ఆయుష్ హోమాన్ని సంవత్సరమునకు ఒకసారి జరిపించిన యెడల శుభం చేకూరును.

జన్మనక్షత్రం ప్రకారం వచ్చే తమ పిల్లల మొదటి పుట్టినరోజు నాడు ఈ ఆయుష్ హోమాన్ని జరిపిస్తే, పూర్వజన్మ కర్మ భారం తొలగిపోయి, ఇహ జన్మలో  ఆ భారం లేకుండా జీవితాన్ని అనుభవించగలడు. తన జీవితాన్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం పాటు జీవించగలరు. ఆ తరువాత 4,8, 17, 26, 35, 44, 53, 62, 71, 80 ఏటా ఈ ఆయుష్ హోమం ఆచరించడం వల్ల, ఈ హోమ ప్రభావం ఆరోగ్యంపై, మనస్సుపై అధికంగా పడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మానసిక లోపాలు ఈ హోమ ప్రభావం వల్ల తగ్గుముఖం పడతాయి. మానసికంగా లోపాలు, రుగ్మతలు కలిగిన వారికి ఈ హోమమ వల్ల తమ శరీరంలో ఉన్న చక్రాలను ఉత్తేజపరచి, మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. అనారోగ్యంతో బాధపడే చిన్నారులను ఆరోగ్యవంతంగా మార్చడానికి ఈ ఆయుష్ హోమం భగవంతుడు మనకు ప్రసాదించిన వరం. ఈ మధ్య కాలంలో జరిగే ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఆత్మాహుతి ధోరణి వల్ల, వాహన ప్రమాదాల వల్ల, ఇంకా ఎన్నో విధాలుగా అకాలమరణం పొందుతున్నారు. ఈ అసహజ, అకాల మరణాలకు వారి జన్మకుండలిలో ఉండే గ్రహస్థితులు కారణం అవుతాయి. అలాంటి దుర్భర సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ ఆయుష్ హోమం ద్వారా భగవంతుడిని ప్రార్థించాలి.

గమనిక: ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కాకుండా జన్మ నక్షత్రం నాడు ఈ ఆయుష్ హోమాన్ని జరిపించాలి.

జన్మకుండలిలో ఆయుః కారక గ్రహాలు చెడు స్థానాలలో ఉన్నట్లైతే ఆయుష్ హోమం జరిపించడం చాలా మంచిది. అష్టమంలో అనగా జన్మకుండలిలో లగ్నం నుండి 8వ స్థానంలో కుజుడు, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు వీరిలో ఏ ఒక్క గ్రహమైన ఉన్నట్లైతే ఆ జాతకునికి అపమృత్యుదోషం ఉన్నట్లే. ఇలాంటి గ్రహస్థితులు ఉన్నవారు ఆయుష్ హోమాన్ని జరిపించుకోవాలి.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: