యుగములు మారిపోతున్నాయి. కలియుగములో ధర్మము నశించి పోతుంది. ప్రపంచము మొత్తము అధర్మము, మోసము, కుతంత్రము వ్యాప్తి చెందే కొద్దీ ప్రజలలో రాను రాను తేజస్సు, ఆయుర్దాయము, వీర్యములు, ఆరోగ్యములు అన్నీ కూడా క్షీణిస్తున్నాయి. సరైన జ్ఞానము లేక మనము అందరమూ ఐహిక సుఖలకు ప్రాకులాడుతున్నాము. అర్థ, కామ కోరికలపై ఆసక్తి పెరిగిపోతుంది. సులభముగా జరిగిపోయే తంత్ర విధానాల కోసం ప్రజలు ప్రాకులాడుతున్నారు. తంత్రముకు యంత్రము, మంత్రము కూడా కలిస్తేనే విజయవంతం అవుతుంది.
తంత్రము , తాంత్రికము ఈ పదముకు అర్థము ఏదో చెడు చేయటం అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతమాత్రం నిజము కాదు. తాంత్రిక వాదము అనగానే ఇది ఏదో చెడు పని అంటూ ఉంటారు. ఎవరికైనా చెడు చేయుటకు చేసే తంత్రమును ‘కుతంత్రము’ అంటారు. భగవంతుడు మనకు అనీ ఇస్తాడు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మన మనస్సు, బుద్ధి,జ్ఞానమును బట్టి ఉంటుంది. ఉదాహరణకి కత్తిని తీసుకుందాము. కత్తిని ఒకరు వంటింటిలో ఉపయోగిస్తారు, ఇంకొకరు మనిషి ప్రాణాలను తీయుటకు ఉపయోగిస్తారు. దీనిని ఎలా ఉపయోగిస్తున్నాము అనేది మన అంతరాత్మకు వదిలేయాలి. అదే విధంగా తంత్ర వాదము కూడా మంచికి ఉపయోగిస్తే యోగము, చెడుకు ఉపయోగిస్తే కుతంత్రము.
మానవ భౌతిక దేహము పంచభూతమయం. మానవులకు సంబంధించిన శాంతి, పుష్టి, తుష్టి, అర్థము, కామము, వశ్యము, మోహము, ఆకర్షణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన,మారణ, కోపము, హింస, ప్రేమ, వాత్సల్యము, దుఃఖము, పరితాపము, భయము, నిద్ర, రోగము, ఆరోగ్యము, మనస్సు, వాంఛ, కోరిక, ఉన్మాదము, వినోదము, ప్రతిభ, జయము, అపజయము ఇలా మానవ సంబంధమైన ఏవైనా కూడా తాంత్రికము చేయగలదు.
తంత్రము అనగా సైన్స్ అని కూడా చెప్పవచ్చు. ఈ తాంత్రికములో ఆరు విధాలు అయిన ‘షట్కర్మలు’ ఎంతో ప్రాధాన్యమైనవి. అవి ఏమిటంటే 1. శాంతి తంత్రము 2. వశ్యము (లేదా) వశీకరణము తంత్రము 3. స్తంభన తంత్ర 4. ఉచ్చాటన తంత్ర 5. మారణ తంత్ర 6. విద్వేషణ తంత్ర. ఇందులో మోహన తంత్రము మరియు ఆకర్షణ తంత్రము ఈ రెండూ కూడా వశీకరణ తంత్రములోని భాగములు. ఈ తాంత్రిక విధానములు ఆచరించటానికి ఆ మంత్రములకు సిద్ధి పొంది ఉండాలి. ఆ తంత్ర విధానములో వాడే వస్తువులు అన్నీకూడా సేకరించుకోవాలి. ఈ తంత్ర విధానములు పాటించే వారు తంత్ర శాస్త్రాలలో ఎంతో అనుభవం గడించి ఉండాలి.
ప్రస్తుత కాలములో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలు పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్రం అనరు. “కుతంత్రం” అంటారు. ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలను, వస్తువులను, ఉపయోగించి చేసే కార్యక్రమమే “తంత్రము”. తంత్రం అనేది ఒకశక్తి గల మంత్రముతో గూడిన సాధనం లాంటిది. ఆ సాధనమును శత్రు సంహారనకి ఉపయోగించవచ్చు. చెడు సంకల్పముతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు. కత్తితో ఫలములను, దర్బలను కోయవచ్చు, జీవహింస చేయవచ్చు. అది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి నిర్దేశించబడుతుంది. మంచికి చేస్తే మంచి ఫలితమును, చెడుకు చేస్తే చెడు ఫలితమును పొందటం జరుగుతుంది. భారతములో శకుని తంత్రమును ఉపయోగించి తన ఇష్టకార్య సిద్ధి జరపుకోవటానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు. అందుకారణంగా అది చెడు అవటం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది కానీ కౌరవులు పాచికల రూపములో ప్రేతత్మలను ఉపయోగించి ఈ చెడు బుద్ధితో చేసిన పాప తాంత్రిక కర్మ వలన చివరకు సర్వ నాశనం అయిపోయారు. చేసే సంకల్పమును బట్టి ఈ తంత్ర విద్యల ద్వారా ఫలితం పొందటం జరుగుతుంది. ఆ శ్రీ కృష్ణుడు తాను సృష్టించిన మంచికి , ధర్మానికి చెడు ఎదురవుతున్న సంధర్భములో ఆ చెడును నిర్మూలించగల శక్తి ఆ పరమాత్మకి ఉన్నప్పటికి, తంత్ర విద్యల ద్వారా మానవ రూపములో ఉన్న పాండవుల ద్వారా ప్రయోగింపజేసి నిర్మూలించాడు. ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలనా మార్గాలను తంత్ర విద్యల రూపములో ఆ శ్రీమహా విష్ణువే వరంగా ప్రసాదించాడు. మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే/చేయించే అభిచార కర్మలను, మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించాడు. ఎంతో శక్తివంతులు మరియు శూరులు, ధీరులు, ధర్మ పరాయణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది.
చరిత్ర లోకి వెళితే అను ఆయుధాలు తంత్ర విద్యలే కదా? మహాభారతములో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైయన నాగాస్త్రం,దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు.ఆగ్నేయాస్త్రం, కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది, పాశుపతాస్త్రం ఇది మహా శివుడికి సంబంధించినది. వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవునికి సంబంధించినది. వారుణాస్త్రం ఇది వరుణ దేవుడికి సంబంధించినది. ఇలా ఎన్నెన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదములోని భాగాలే. అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలే. రాక్షస పీడను, శత్రు పీడను, నిర్మూలించడం కోసం రూపొందించబడినవే ద్వాపర యుగములో ,త్రేతా యుగములో కూడా రాక్షస పీడను నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు. ఇందులో మర్మం ఏమంటే పైశాచికతను నిర్మూలించడమే. కొంచెం శ్రద్ధగా గమనిస్తే ఇందులోని మర్మం మీకు అర్ధమౌతుంది.రాముడు చేసింది లోక కళ్యాణర్థం. రావణుడు చేసింది స్వధర్మం కోసం. స్వధర్మం అనగా పాప కర్మ అనుభవించడం.ఉదాహరణకు మీరు ఒక వస్త్ర దుకాణం నడుపుతున్నారు ,మీ వ్యాపారం బాగా సాగాలి అని మీరు కోరుకుంటారు. మీ వ్యాపార పరంగా బాగా ధనార్జన చేయాలి ఆశిస్తారు. ఈ సంధర్భములో మీ వ్యాపార పోటీదారులు శత్రువులుగా మారి మీపై, మీ కుటుంబముపై, మీ వ్యాపారములపై కుతంత్రములు జరిపించి మీ సర్వ వినాశనానికి పూనుకుంటారు . అందుకోసం ఎన్నో మీ శత్రువులు ఎన్నో ఘాతుకాలకు పాల్పడతారు. ఆ స్వార్థపూరితమైన, పాప గ్రస్తమైన ఆలోచనలతో మిమ్ములను దెబ్బతీయుట కోసం, మీ పై కుతంత్రములు ప్రయోగించి నాశనం చేయుట కోసం కుతంత్ర విద్యలు చేసేవారిని సంప్రదించడం జరుగుతుంది. వారి ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి బాగుండాలని ఇతరుల వ్యాపారాలు సన్నగిల్లలని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో ఘాతుకాలకు పాల్పడుతూ ఉంటారు.ఈ సంధర్భములో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరికైతే పైశాచిక గ్రహ పీడ ఉంటుందో, వారు తప్పనిసరిగా ఈ కుతంత్ర విద్యల వలన ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది జాతకములోని అవయోగాలకు మూలం. ఎవరికైతే జాతకములో అవయోగాలు ఉంటాయో, వారు ఈ కుతంత్ర విద్యలకు గురి కావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది కూడా పూర్వజన్మ పాప కర్మ ఫలమే. ఆ పాపమును ప్రక్షాళన చేయడానికి విరుగుడుగా తాంత్రిక పరిహారములను చేసుకోక తప్పదు. మరి అలాంటి సందర్భాలలో తంత్ర విద్యలను ఉపయోగించి ఆ పైశాచిక ప్రభావాన్ని నిర్మూలించక తప్పదు. ఎదుటివారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు, శాపాలు అధికంగా ఉంటేనే అవి వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే చేసే ప్రతి క్రియ కూడా కర్మ ఫలమే. అది మంచి గాని,చెడు గాని. పైశాచిక గ్రహాల చెడు ప్రభావము నిర్మూలించడానికి మాత్రమే తంత్ర విద్యలు ఉపయోగపడతాయి.
మన నుదిటి వ్రాత ఆ బ్రహ్మ ఆజ్ఞనుసారంగా జరుగుతుంది. మనిషి ఎదుర్కొంటున్న బాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా మనకు ప్రసాదించాడు. ఇందులో ఆంతర్యం ఏమిటంటే, వర్షం వచ్చినపుడు గొడుగును ఉపయోగించడం వలన ఆ వర్షం నుండి తడవకుండా ఉండగలుగుతాము. వర్షం పడటం బ్రహ్మ మనపై చూపించే నుదిటి వ్రాత . మండుటెండ కాచినపుడు పాదరక్షలు ధరించడం ఆ వేడి తాపము నుండి కాళ్ళు కాలకుండా రక్షించుకోవటం. వేడి తాపం అనేది సూర్య గ్రహ రూపములో బ్రహ్మ మనపై చూపించే నుదుటి వ్రాత. వర్షం నుండి , సూర్య తాపము నుండి కాపాడే గొడుగు, పాదరక్షలు గ్రహ దోష నివారణా మార్గాలు లాంటివి. విధిని తప్పించుకోవటం కష్టం కానీ తామస, రజో లక్షణాలు కలిగిన శత్రు పీడ నివారణా, అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు. ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంతవరకు ధర్మాచారణ లోక కళ్యాణర్థం ఉపయోగించవలెను. అలా కాకుండా కామ క్రోధ మధ మత్సర్యాలతో, అసూయతో, ఈర్ష్యా ద్వేషాలతో ఇతరులపై ధనం కోసం, కామం కోసం, అధికారం కోసం ఉపయోగిస్తే అప్పటికప్పుడు కౌరవులు పొందినట్టుగా తాత్కాలిక సౌఖ్యమును, కార్యసిద్ధిని పొంది చివరకు మనో భ్రాంతికి గురి అయ్యి మరణించడం జరుగుతుంది. అందువలన శక్తివంతమైన తాంత్రిక విద్యలను అభ్యసించడం వలన మనుషులు తాము ఎదుర్కొంటున్న శత్రువులు చేసే అభిచార కర్మలను నిర్మూలించుకోగలరు. నష్ట స్త్రీ అనుబంధ ప్రాప్తి, నష్ట స్త్రీ సాంగత్య ప్రాప్తి, నష్ట ద్రవ్య ప్రాప్తి కార్యసిద్ధిని పొందగలరు. ఈ తాంత్రిక విద్యలను ఉపయోగించే విధానాలను, మంత్రాలను నాకు లభించిన ప్రాచీన తాళపత్రముల ద్వారా అందజేస్తాను. వీటిని అభ్యసించి మీ సమస్యలకి మీరే పరిష్కార మార్గములను చేసుకోవచ్చని ఆశిస్తున్నాను. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయిలో ఉన్నవ్యక్తికి ఆ స్థాయిలో శత్రుపీడ ఉంటుంది. అందరికీ ఆర్థిక వెసులుబాటు ఉండదు. మీ యొక్క శత్రు సంహారం చేయగలిగే తంత్ర వేత్తలను ధనరూపములో తృప్తిపరచే ఆర్థిక శక్తి ఉండదు కనుక మీ యొక్క సంకల్పమే మీ ఆయుధం. ఈ తంత్ర మార్గాలను ఆర్థిక బలము, అంగ బలం లేనివారు కూడా అభ్యసించి ఉపయోగించి మేలును పొందగలరు.
జీవుడు తాను పుట్టిన దగ్గర్నుండి మరణించే వరకు తన యొక్క పూర్వజన్మ లోని చేసుకున్న పాపపుణ్యాల కర్మఫలాన్ని అనుభవించడానికి విధి రూపములో ఎన్నో ఎన్నెన్నో అనుభంధాలను, ఆనందాలను, ఐశ్వర్యాలను, ప్రేమానుబంధాలను, భాద్యతలను, సుఖాలను అనుభవించడం జరుగుతుంది. పూర్వజన్మలో ఎవరితోనైతే శత్రుత్వము కలిగి ఉంటారో, ఈ జన్మలో వారికి బాంధవ్యాల రూపములో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. పూర్వజన్మలో తాము ఎదుర్కొన్న అనారోగ్య, ఆర్థిక,సామాజిక, కుటుంబ, బంధుత్వాల ఋణ శేషం ఇహ జన్మలో మానవుడు అనుభవిస్తున్నాడు. ఆ పూర్వజన్మ తాలూకు ఋణశేషం, శత్రు శేషం, ఆయుర్భావ శేషం, ఇహ జన్మలో గ్రహాల ద్వారా యోగా, అవయోగాల ద్వారా వాటిని అనుభవించి కర్మఫలాన్ని సంపూర్ణం చేయటం జరుగుతుంది. ఇది శాస్త్ర సమ్మతం. అయితే ఈ జన్మలో ఎదుర్కొంటున్న, ఎదుర్కొబోయే సమస్యలు, దోషాలు వేద జ్యోతిష్య శాస్త్రము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. కర్మఫలాన్ని అనుభవించడానికి మనం పుట్టినపుడు ఈ కర్మఫలములో ఉండే అతి భయంకరమైన మానసిక, శారీరక క్షోభకు గురి చేసే విధి వ్రాతను తప్పించుకోవటం ఎంతవరకు సాధ్యం? అని ప్రతి ఒక్కరకి సందేహం కలుగక మానదు. విధి అనేది తప్పక అనుభవించాల్సిందని దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పురాణాల ప్రకారంగా చూసినట్లైతే గంధర్వులు, యక్షులు, శాపాలకు గురి కావడం జరిగింది. శాపాలకు గురి కావడం అనేది విధి. శాపాలకు విమోచన, విరుగుడు చేసుకోవడం అనేది ఆత్మ సంకల్ప విధి. పూర్వజన్మ కర్మఫలం శరీర రూపములో ఆత్మ అనుభవించడం జరుగుతుంది. శరీరము రూపములో ఉన్న ఆత్మ పాపపుణ్యాలను అనుభవించడం వలన స్థూలశరీరమునకు మాత్రమే ఆ నొప్పి, ఆనందం తెలుస్తాయి. అంతేగానీ శాశ్వతమైన ఆత్మకు కాదు. ఆత్మ అనేది శరీరములో ఉండే సూక్ష్మ రూపములో ఉండే ఆలోచనల రూపం. కర్మ ఫలం వలన గాని, మానసిక దౌర్బల్యం వలన గాని, సమస్యలను ఎదుర్కొంటున్న శరీరమునకు ఉపశమనం ఇచ్చే మార్గాలే అంతరాత్మ ద్వారా మనకు భగవంతుడు తెలియజేస్తాడు. ఆ భగవంతుడు ఇచ్చిన తాంత్రిక మార్గములే ఈ తంత్ర విద్యలు. కర్మఫలాన్ని అనుభవించడానికి మనపై భగవంతుడు ఏర్పరిచిన ఈ మాయా బంధాల సమస్యలను ఎదుర్కోవటానికి ఆ పరమాత్మే మార్గాలను చూపించాడు. మానవ రూపములో ఉన్న పాండవులను, వారి కర్మ ఫలమును అనుభవించేట్టుగా చేస్తూ మరొకపక్క అతి ఘోర కృత్యాలకు పాల్పడే వారి నుండి బయట పడేందుకు శత్రు నాశనం చేసేందుకు శ్రీ కృష్ణ పరమాత్మ సైతం తంత్ర విద్యాలలోని శస్త్ర. అస్త్రములను ఆ మానవ రూపములో ఉన్న పాండవుల చేతనే ప్రయోగింపజేసి శత్రు సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించాడు. మహాభారతములో శత్రువులను సంహరించడం కోసం శ్రీ కృష్ణుడు అర్జునుని చేత ప్రయోగింపబడ్డ శస్త్ర అస్త్రాలు తంత్రములే కదా!!! గ్రహాల రూపములో, గ్రహాల ద్వారా ప్రయోగింపబడ్డ అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం, దీనినే వశీకరణాస్త్రం అంటారు. ఈ వశీకరణ అస్త్రం శుక్రుడు, రాహు గ్రహముల సహాయముతో ప్రయోగిస్తారు. గ్రహముల ద్వారా మంత్రములను ప్రయోగించేవాటిని ఆస్త్రాలు అంటారు. తంత్రవిద్యలను అభ్యసించి ఉపయోగించి ప్రయోగించడాన్ని తంత్రం అంటారు.
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?
- నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope
- ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- జాతక పరిశీలన- Horoscope Reading
- ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?
- బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు Bagalamukhi Yantra sadhana
- Problems with boss, higher officials-Astrology reasons ఉద్యోగంలో పై అధికారులతో ఏర్పడే సమస్యలకు గల జ్యోతిష్య కారణాలు
Ramveera
June 27, 2021 at 8:35 am
వామాచార తాంత్రిక పద్ధతిలో, సర్వ జన వశీకరణ , శత్రువు వాక్ ,క్రియ, దృష్టి స్తంభన విధానము కొరకు వివరణ ఇవ్వగలరు.