“బంధన యోగము” అంటే ఏమిటి? (Imprisonment or Arrest or Jail)

బంధన యోగము, జైలుకి వెళ్ళటం లేదా చెరసాలలో బంధించటం ఇలాంటి సంఘటనలు జరుగుటకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా చూసినట్లైతే జన్మకుండలిలో రాహువు చెడు స్థానములో ఉన్నప్పుడు జాతకునికి జైలుకి లేదా చెరసాలకు వెళ్ళే సూచనలు ఎదురవుతాయి. కుజుడు పోలీసులను మరియు చట్టము కొరకు పని చేసే ఉద్యోగులను ఆధిపత్యం వహిస్తాడు. రాహువు జైళ్లను, పోలీసు రక్షణ స్థలములను, పాతోలజి ల్యాబులను మొదలైన వాటిని రాహువు ఆధిపత్యం వహిస్తాడు. జన్మకుండలిలో లగ్న అధిపతి మరియు 6వ భావాధిపతి కలసి కేంద్ర స్థానములో (1,4,7,10 స్థానాలు) లేదా త్రికోణములో (1,5,9 వ స్థానాలు) శని మరియు రాహు లేదా కేతువు కలసి ఉంటే “బంధన యోగము” ఉన్నట్టు గుర్తించాలి.

         లగ్నము నుండి కాకుండా అదే చంద్రుడు ఉన్న రాశి నుండి జాతకునికి పైన చెప్పిన విధంగా గ్రహ స్థానములు ఏర్పడితే అప్పుడు ఆ జాతకుడు మానసికంగా బంధీకానాలో ఉంటాడు. ఇలాంటి జాతకులు తమకు తాము ఒంటరిగా చేసుకుని సమాజముకు తెలియకుండా , నాలుగు గోడల మధ్య ఉండిపోతారు.

ఇలాంటి వారిలో కొంతమంది మానసికంగా అనారోగ్యము వచ్చి, ఈ ప్రపంచము నుండి వెలివేయబడతారు. ఇదే సంఘటనను సన్యాసులకు, గురువులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వీరు ఐహిక ప్రపంచము నుండి విడుదల అయ్యి ఆధ్యాత్మిక చింతనను ఏకాంతవాసము చేసి అనుభవిస్తారు.

అంతేకాకుండా జన్మకుండలిలో లగ్నము నుండి 6వ స్థానములో, 8వ స్థానములో, 12వ స్థానములో నీచ గ్రహములు ఉన్నట్లైతే ఆ జాతకులు జైలుకు తరలించబడతారు.

6వ స్థానము ముఖ్యముగా కోర్టు వలన ఏర్పడు చిక్కులు, జాతకునికి వచ్చే వ్యాధులు, రోగములు తెలియచేస్తుంది. 8వ స్థానము గండములు, అపాయముల గురించి చెబుతుంది. 12వ స్థానము జాతకుడు చెరసాలలో బంధీగా ఉంటారా లేదా అన్న విషయము తెలియజేస్తుంది.

శని, రాహువు, కేతువు, కుజుడు ఈ నాలుగు గ్రహములు బంధన యోగము ఏర్పడుటకు  కారణం అయ్యే గ్రహములు. ఏ ఇతర గ్రహము అయినా ఈ నాలుగు గ్రహములతో కలసి 2,5,6,8,9,12 భావములలో ఉంటే బంధన యోగము ఏర్పడి, ఆ గ్రహముల లక్షణముల ప్రకారము సంఘటనలు ఎదురవుతాయి. ఈ నాలుగు నీచ గ్రహముల (శని, కుజ, రాహు, కేతు) వలన నాలుగు రకముల బంధన యోగములు ఉంటాయి.

నాలుగు రకముల బంధన యోగములు :

అరి బంధన యోగము : ఈ అరి బంధన యోగము శని గ్రహము వలన కలుగుతుంది. అంతేకాకుండా జాతకులు పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలితములు అనుభవించాల్సి ఉంటుంది. దీనినే ప్రారబ్ధ కర్మ అని అంటారు. ప్రారబ్ద కర్మను అనుభవించడానికి తోడ్పడే గ్రహము శని గ్రహము. గత జన్మలో శాప పూరితం అయినప్పుడు, ఇహ జన్మలో తీవ్రమైన బాధలు, కష్టములు, క్రుంగిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా శత్రువుల చేతిలో అపజయము పాలవటం, అంతేకాకుండా ఏదైనా వ్యాధి రీత్యా లేదా శారీరక దెబ్బలు గాని తగిలి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అరి బంధన యోగము అనేది జాతకులు ఏ తప్పు చేయకపోయినా, వారు చేసే చెడు స్నేహము వలన జైలుకు వెళతారు. డృగ్ మాఫియా, దొంగతనములు, స్నేహితులతో కలసి  శృంగారంలో పాల్గొనటం, లాంటి పనులు చేసి , పట్టుబడి జైలుకి వెళతారు.

విర్ బంధన యోగము : ఈ విరి బంధన యోగము కుజ గ్రహము వలన కలుగుతుంది. ఫలితంగా యుద్ధములలో, గొడవలలో పోరాడటం, శత్రువుల వలలో పడటం లాంటివి జరుగుతాయి. ఈ విరి బంధన యోగముకు చెందిన వారు అంతర్యుద్ధములలో, వీధి గొడవలలో, ఉగ్రవాద చర్యలలో ,తీవ్రవాద చర్యలలో, పోలీసులపై గుంపు గుంపుగా గొడవలలో పాల్గొని, అరెస్టు అయ్యి, జైలుకి తరలించడం జరుగుతుంది.

హత్య చేయటం, మానభంగము చేయటము, ఋణములు, పన్నులు కట్టక పోవటం, సైబర్ క్రైమ్ , రియల్ ఎస్టేట్ మోసములు, వ్యాపారమును అడ్డం పెట్టుకొని మోసములు చేయటం ఈ నేరములు అన్నీ కూడా కుజ గ్రహము వలన చేస్తారు. ఈ విరి బంధన యోగము ఉన్న జాతకులు చట్టమునకు విరుద్ధముగా ఎంతో ధైర్యముగా పనులు చేస్తారు కానీ చివరకు పట్టు బడతారు. జైలు జీవితం అనుభవిస్తారు.

నాగ బంధన యోగము :    ఈ నాగ బంధన యోగము రాహువు వలన ఏర్పడుతుంది. ఈ నాగ బంధన యోగము ఉన్న వారు ఇతరులకు ప్రజల మధ్య అపరాధములు చేయటం, మత పరమైన వైరములు, జాతి ద్వేష వైరములు, మాఫియా, డ్రగ్స్, బాంబులు వేయటం, అక్రమ గనుల తవ్వకం, ఖాతాలలో లేకుండా మోసము చేసి అధిక మొత్తము డబ్బు సంపాదించడం ఇలాంటి చర్యలకు పాల్పడతారు. మామూలుగా ఈ నాగ బంధన యోగము ఉన్నవారు మొదట ఎంతో పేదరికమైన జీవితము గడిపి , ఆ తరువాత చట్టమును వ్యతిరేకిస్తూ ఎంతో పెద్ద స్థాయికి ఎదుగుతారు. కాకపోతే ఈ నాగ బంధన యోగము ఉన్నవారు జైలుకి వెళతారు లేదా ఎవరికి తెలియకుండా జీవితం మొత్తం అజ్ఞాతవాసము చేస్తూ అలానే మరణిస్తారు.

దీనికి సరైన ఉదాహరణ “దావూద్ ఇబ్రాహీం”. ఇతను తన జీవితములో సామాజిక జీవితం ఎన్నడూ అనుభవించలేదు. అతని జీవితం అంతా కూడా అజ్ఞాతవాసమే.

పూర్వజన్మలో ఇతరులపై చేతబడి, క్షుద్ర ప్రయోగము చేసిన వారు, ఇహ జన్మలో నాగ బంధన యోగముతో జన్మిస్తారు. గత జన్మలోని ఈ జాతకులు చేసిన ప్రయోగము , ఇహ జన్మలో వీరికే బెడిసి కొడుతుంది. 

అహి బంధన యోగము: ఈ అహి బంధన యోగము కేతువు వలన ఏర్పడుతుంది. ఈ అహి బంధన యోగము ఉన్న జాతకులు ఊహించని విధముగా, కొత్త కొత్త విధానాలలో నేరములు చేస్తారు. స్వయంకృత అపరాధలకు వీరు నేరస్తులుగా మిగిలిపోతారు. కేతువుకు తల ఉండదు. అంటే ఈ అహి బంధన యోగము ఉన్నవారు బుర్రలేని పనులు అన్నీ చేసి చివరగా పట్టుబడతారు. కారణములు పిచ్చిగా ఉన్నప్పటికి, వీరు చేసే నేరములు మాత్రం క్రూరముగా ఉంటాయి.

ఈ విధంగా బంధన యోగము వలన ప్రారబ్ధ కరమల వలన వివిధ రకములుగా నేరములు చేసి జైలుకు వెళ్ళి శిక్షలు అనుభవిస్తారు. వీటికి పరిహారములు ఎన్నో విధములు ఉంటాయి. అవి తమ జన్మకుండలి ఆధారంగా తెలియజేయాలి. కావున ఇక్కడ పరిహారములు ఇవ్వటము లేదు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

Related Articles: