మహా గణపతి హోమం

మహాశివుడు మరియు పార్వతీ దేవిలకు జన్మించిన వాడే వినాయకుడు. ప్రథమ గణాలకు అధిపతి అయినందున గణపతి అని, సర్వ విఘ్నాలను తొలగించే వాడు గనుక విఘ్నేశ్వరుడు అని ఎన్నో నామాలు ఉన్నాయి. అనుకున్న పనులలో జాప్యం కలుగుతున్నా, విఘ్నాలు ఎదురైనా, పనులలో విజయం సాధ్యమవ్వాలన్నా ప్రథమ పూజను అందుకునే మహా గణపతి హోమాన్ని ఆచరించాలి.

               కొత్తగా ప్రారంభించే పనులలో ఏ విధమైన విఘ్నాలు కలుగకుండా, విజయం చేకూరాలంటే మహా గణపతి హోమం ఆచరించి పనులను ప్రారంభించాలి. వేరే ఏ దైవాల హోమాలను నిర్వహించాలన్నా ముందుగా ప్రథమ పూజలు అందుకునే మహా గణపతి హోమాన్ని ఆచరిస్తారు. ఏడేళ్ళ పాటు సాగే కేతు మహా దశలో గాని లేదా కేతు అంతర్దశలో గాని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారు, కేతు మహా దశ యొక్క ప్రతికూల ప్రభావాలను తొలగించుకొనుటకు మహా గణపతి హోమమును ఆచరించాలి.

               మనం చేసే పనులలో వైఫల్యం కలుగుటకు, విఘ్నాలు రావడానికి మన కర్మానుసారంగా జరుగుతాయి. మన ప్రస్తుత జన్మ లేదా పూర్వ జన్మ తాలూకు కర్మ ఫలితాలే వీటికి మూల కారణం అయ్యి ఉండచ్చు. కర్మ బంధాల నుండి, పూర్వ జన్మ కర్మ చెడు ఫలితాల నుండి కాపాడే గణపతిని పూజించడం వలన జీవితంలో జరిగే ప్రతికూల సంఘటనలు తొలగిపోతాయి. విద్యార్థులు తమ విద్యలో ఉత్తీర్ణత సాధించుటకు, జ్ఞానాన్ని పొందుటకు మహా గణపతి హోమాన్ని ఆచరించడం వలన సిద్ధి (కార్య సిద్ధి) మరియు బుద్ధి (జ్ఞానం మరియు వివేకం) లభిస్తుంది. రైతులు సైతం తాము పంటలు ప్రారంభించే ముందు మహా గణపతి హోమం ఆచరించి ప్రారంభించడం వలన పంట మంచిగా రావడమే గాక, ఊహించని ప్రకృతి వైపరీత్యాల నుండి ముప్పు కూడా తొలగిపోతుంది.

మానవ శరీరంలో 7 చక్రాలలో మొదటిది మరియు మిగిలిన 6 చక్రాలకు మూలమైన మూలాధార చక్రంలో గణపతి నివసిస్తాడు అని యోగా శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన మహా గణపతి హోమాన్ని ఆచరించడం వలన ఆధ్యాత్మిక మరియు భౌతిక అభివృద్ధికి పునాదిలా ఉపయోగపడుతుంది.

               మహా గణపతి హోమాన్ని ప్రతీ సంవత్సరం ఆచరించడం వలన ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయి. మన జీవితం ఆనందం మరియు విజయంతో నిండిపోవాలంటే, వివాహ సంధర్భాలలో, గృహ ప్రవేశ సంధర్భాలలో, పుట్టిన రోజు నాడు కూడా ఈ మహా గణపతి హోమాన్ని ఆచరిస్తే అంతా శుభం జరుగుతుంది.

               సూర్యోదయానికి ముందే మహా గణపతి హోమమును ఆచరించడం ఉత్తమం. సంధర్భాన్ని బట్టి ఈ హోమాన్ని ఏ సమయంలోనైనా కూడా జరిపించుకోవచ్చు. గణేశునికి అత్యంత ప్రీతికరమైన రోజైన సంకట హర చతుర్థి నాడు మహా గణపతి హోమమును జరిపించుకోవడం వలన అత్యంత అమోఘమైన ఫలితాలను అందుకోగలరు. అందువలన, మీరు చేపట్టే కార్యములు ఏవైనా సరే, మీ కెరీర్ గాని, వ్యాపారంలో గాని, వ్యవసాయంలో గాని, విద్యలో గాని, కుటుంబంలో గాని లేదా వ్యక్తిగత జీవితంలో గాని ఏ విధమైన విఘ్నాలు రాకుండా విజయం చేకూరాలంటే మహా గణపతి హోమమును జరిపించుకోవాలి.

జాతక పరిశీలన

  • జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.Ph: 9846466430Whatsapp: wa.me/919846466430

 

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious