కులాంతర వివాహాలు, ప్రేమ వ్యవహారాలలో గ్రహస్థితులు- గ్రహాల ప్రభావం(పార్టు -1)

               వివాహం చేసుకునే వ్యక్తులు వారి యొక్క మనస్సు, ఆత్మలు తప్పక కలిసి తీరాలని జ్యోతిష్య శాస్త్రం స్పష్టం చేసింది. స్త్రీ పురుషులు తమ శరీర ధర్మాన్ని నిర్వర్తించడం (శారీరక సుఖములు) కోసం, తమ వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం వివాహం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. వివాహాన్ని తలపెట్టే సంధర్భాలలో తల్లిదండ్రులు (పెద్దలు) వధూవరుల జన్మకుండలిలో కుజుడు, గురు, కేతు, శుక్ర, రాహువుల యొక్క స్థితులను క్షుణ్ణంగా పరిశీలింపజేసుకుని వివాహం జరిపించాలి. అలా కాకుండా గుణమేళన చక్రాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వివాహం జరిపిస్తే వారి వైవాహిక, శృంగార జీవితాలు భగ్నం కావడం ఖాయం. వివాహ లగ్నం ఎంత గొప్పది అయినా సరే, ఆ వివాహానికి ఆటంకాలు మాత్రమే రావు. వివాహం దిగ్విజయంగా అట్టహాసంగా జరుగుతుంది. గర్భాదాన ముహూర్తం బలంగా ఉంటే గర్భాదనం జరుగుతుంది. అంత మాత్రాన వారి వైవాహిక జీవితం వైఫల్యం కాకుండా మాత్రం ఉండదు. దానికి కారణము ఏమంటే, వివాహ లగ్నం వలన వివాహం జరుగుతుంది. కాని వధూవరుల జాతకాలలో గురు, శుక్ర, కుజ, రాహు, కేతువుల గ్రహ దృష్టులు, వారి యొక్క యోగ అవయోగాలను సంపూర్ణంగా, క్షుణ్ణంగా పరిశీలించలేకపోవడమే. జరిగిన కొన్ని దశాబ్ధాల నుండి ఎన్నెన్నో వివాహాలు జరిగాయి. వివాహం జరిగిన కొంత కాలానికే ఆ దంపతులు విడిపోవడం జరిగింది. వారి జీవితంలో ఎన్నెన్నో దుష్పరిణామాలు సంభవించాయి. వారి జీవితంలో వివాహానంతరం అనేక రకాలైన పర స్త్రీ/ పురుష సాంగత్యాలు సంభవించడం ఎంతో మందికి తెలుసు. మరి వివాహ లగ్నానికి అంత బలమే ఉంటే, వారి వైవాహిక జీవితాలు సంపూర్ణంగా సఫలమవ్వాలి. మరి అలా కావడం లేదే!! హైందవులైతే ముహూర్త బలాలు, శాస్త్రాలు పాటిస్తారు (అసంపూర్ణంగా). హైందవేతరులు ఈ శాస్త్రాలని, ముహూర్తాలని పాటించరు కదా, మరి వారికి ఈ ఫలితాలు వర్తింపవా అనే సందేహము కలుగకమానదు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి శాస్త్ర ప్రమాణాలు తప్పనిసరి. హైందవేతరులు శాస్త్రాన్ని పాటించకుండా వివాహ జీవితాన్ని ప్రారంభించినప్పటికి వారి జీవితం బాగా ఉంటుందా అన్న యధార్థం కొంతవరకే సత్యం అయితే, వారు శాస్త్రాన్ని తెలుసుకోలేకో లేదా అనవసరమనో వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. దంపతుల జన్మకుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉంటే వారికి వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉంటుంది. లేకుంటే ఏ మతమైనా, ఏ కులమైనా ఒకటే. అయితే, హైందవులను నమ్మేవారు కనుక వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ధర్మ శాస్త్రాలు మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి. కనుక వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని యధావిధిగా ఆచరిస్తే జీవితం సార్థకమవుతుంది.

      

         మానవులు ఎంత కర్మబద్ధులు అయినప్పటికి, జరగబోవు ఉపద్రవాలని ముందుగా తెలుసుకొని శాస్త్రాన్ని ఆచరించడం వివేకవంతుల లక్షణం. జ్యోతిష్య శాస్త్రం వివాహాలకు కొన్ని జ్యోతిష్య పరమైన నియమాలను విధించింది. వధూవరుల మధ్య 10 రకాల పొందికలు ఉండాలని జ్యోతిష్యం ఈ క్రింది నియమాలను తెలియపరచింది.

  • రజ్జు (వైవాహిక జీవితం ఎంతకాలం కొనసాగుతుంది)
  • యోని (దంపతుల శృంగార జీవితాన్ని తెలియజేస్తుంది)
  • గణం (వారి యొక్క జాతిని)
  • దినం (జన్మ నక్షత్రం, ఆరోగ్యం, ఆయుర్దాయం)
  • స్త్రీ ధీర్ఘం (భార్య యొక్క ఆనందాన్ని, ఉల్లాసాన్ని)
  • మహేంద్రం (వారి యొక్క సంపదలు, సుగుణాలు)
  • రాశి (వారి యొక్క తేజస్సు)
  • ఇద్దరి రాశ్యాధిపతులు (వారి యొక్క శారీరక లక్షణాలు)
  • వశ్య (వారి యొక్క స్నేహపూర్వక బంధము)
  • వేధ (ఘర్షణ, ఒత్తిడి)

వివాహం చేసేటపుడు ఈ అంశాలే కాకుండా, నాడి, కుజ దోషం, కాలతీర దోషం, వీటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. వారి జన్మకుండలిలో గురు, శుక్ర, కుజ, రాహు, కేతువులను సంపూర్ణంగా పరిశీలింకాకుండా వివాహాలు జరిపిస్తే ఆ దంపతులకు తీవ్ర దుఃఖాన్ని, చెడుని కలిగిస్తాయి. కొంతమంది సిద్ధాంతులు, వధూవరులకు జాతకాలు కలవనపుడు వారి పేర్లు మార్చి, శుభలేఖలు అచ్చు వేయించి వారి నక్షత్రాలను మార్చేసాము అని భావిస్తారు. కృత్రిమంగా పేర్లు మార్చడం వలన, మార్చిన పేర్లు వలన వారికి వివాహ పొంతన కుదురుతుందేమో గాని, వారి నిజ జన్మ నక్షత్రాలు మారవన్న సంగతి వధూవరుల పెద్దలకు తెలీదేమో పాపం. శాస్త్రాన్ని ప్రామాణికంగా ఆచరించిన వధూవరులకు వారి జీవితంలో ఎన్నో దుష్ట పరిణామాలు కలుగుతాయి. ఈ పాపాన్ని వధూవరుల చేత ఆచరింప చేసిన వధూవరుల పెద్దలకు (తల్లిదండ్రులకు) మనస్తాపం, ధన వ్యయం, సంతాన చింత కలుగుతాయి. ఈ చిన్న తప్పిదం వల్ల దంపతులకు వివాహ జీవిత భంగం, విడాకులు, సంతానం కలుగకపోవడం సంభవిస్తాయి. కొన్ని సంధర్భాలలో ఆత్మహత్యలు, హత్యలు, అష్టదారిద్ర్యలు ప్రాప్తిస్తాయి. ఫలితంగా ఆ నక్షత్ర సంబంధ గ్రహాలు ఆ వధూవరులకు వివాహానంతరం తప్పక హాని చేస్తాయి. తైలం డబ్బా పైన నీరు అని రాసినంత మాత్రాన, అది మండకుండా పోదు. ఇది కూడా అంతే. జాతకాలు సరిగ్గా పరిశీలించకుండా ఇలాంటి తప్పిదాలు చేయడం వల్ల వధూవరులు శాపాలకు గురి కాక తప్పదు.

        ఇంద్రుడు, యముడు, వరుణుడు (యురేనస్, ప్లూటొ, నెప్ట్యూన్) గ్రహాలు కూడా మానవుల శృంగార జీవితాన్ని, అక్రమ శృంగార జీవితాల పై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రస్తుత కాలంలో యువతీ యువకులు కులాంతర ప్రేమ వివాహాలకు మొగ్గు చూపించడానికి కారణమయ్యే గ్రహస్థితులు వివరిస్తున్నాను. వాటిని నియంత్రించడానికి తంత్ర శాస్త్రంలో కొన్ని పరిహారాలను పొందుపరచడం జరిగింది. ఈ తంత్ర శాస్త్రాన్ని ఆచరించి ఈ కులాంతర వివాహాలను నియంత్రించవచ్చు. యుక్త వయస్సు వచ్చిన వారి జాతక చక్రములో ప్రతికూల గ్రహస్థితులు ఉండినట్లైతే, వాటిని తంత్ర శాస్త్రం ద్వారా ప్రారంభ దశలోనే తుంచి వేయడం మంచిది. అలా చేసినట్లైతే భవిష్యత్తులో యువతీ యవకులకు  మరియు వారి పెద్దలకు ఆనందం, శాంతి చేకూరుతాయి.

జన్మకుండలిలో చెడు గ్రహ స్థితులు:

స్త్రీ జాతకంలో సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి నీచస్థానంలో లేదా శతృస్థానంలో ఉన్నా, సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి శూద్రగ్రహంతో కలసిననూ, దైవగ్రహాలు అనగా గురువు, బుధుడు, నీచగ్రహాలతో అనగా శూద్ర వర్గ గ్రహాలతో అనగా రాహువు, కేతువు, శని, మాంది, గుళికలతో కలసి ఉన్ననూ, ఈ జాతక స్థితి గల వ్యక్తులకు వారి వారి దశాంతర్దశలలో జన్మించిన సమయాలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నవో, అలాంటి గ్రహస్థితులు గ్రహ దశలలో వచ్చినపుడు వ్యక్తులకు కులాంతర వివాహాలు జరుగును. ఏ ఏ గ్రహాలు సంగమించుట వలన కులాంతర ప్రేమ, శృంగార, వివాహ, గర్భాధారణ జరుగునో ఇక్కడ తెలియజేయుచున్నాను.

లగ్నం నుండి 7వ స్థానం, 8వ స్థానం, తత్ స్థానాధిపతులు అయిన శుక్రుడు, కుజుడు

సప్తమాధిపతి శుక్రుడు, అష్టమాధిపతి కుజుడు ఈ జన్మకుండలిలో కుజుడు శనితో కలసి ఉన్నాడు. కుజుడు కామకారక గ్రహం అయిన కారణం చేత కుజుడు, ఈ కుజుడు క్షత్రియ గ్రహము కావుట చేత, శూద్ర వర్గముకు చెందిన శనితో కలసి ఉండినందున ఈ జాతకురాలికి కులాంతర వివాహం జరుగును. గమనిక: కులాంతర, మతాంతర వివాహాలు అనాదికాలం నుండే జరిగినవని వివేకులు గ్రహించాలి. గత కాలంలో చాలా మంది ప్రముఖులు కులాంతర వివాహాలు చేసుకొని, అనతికాలంలోనే దివంగతులవడం కూడా వివేకులకు విదితమే. వారిలో రాజకీయ ప్రముఖులు, సినీరంగ ప్రముఖులు, విదేశాలలో నివశిస్తున్న మన హైందవులు, అష్టమాధిపతి కుజుడు, శనితో ఉండినందున, సప్తమాధిపతి శుక్రుడు స్వస్థానగతుడై రాహువుతో తామసగుణం కలిగిన శుక్రుడు, రాక్షస వర్గానికి మరియు శూద్ర వర్గానికి చెందినవాడు గనుక, రాహువుతో కూడి ఉన్నాడు గనుక ఇక్కడ ప్రేమ వివాహానికి మరియు గాంధర్వ వివాహానికి దారి తీయును. గాంధర్వ వివాహమును కలియుగంలో రిజిస్టర్ మ్యారేజి మరియు తల్లిదండ్రులు లేకుండా వివాహం జరుపుకోవడం. ఈ పరిశీలనా క్రమం విశ్లేషణ కొంచెం విసుగ్గా, అర్థం కానట్టుగా ఉండవచ్చు గాని ఈ విశ్లేషణను అర్థం చేసుకుని శాస్త్ర నియమాలను పాటించి గ్రహ దోష నిర్మూలన చేసుకున్న వారికి వైవాహిక జీవితంలో ప్రతికూల సంఘటనలు సమసిపోతాయి (జరగవు). కొన్ని ఉదాహరణలు మాత్రమే వివరించగలను. ఏమంటే జన్మకుండలిలో ఎన్నో రకాలైన గ్రహ సంగమములు ఉంటాయి. ఆ కలయికలు మొత్తం మీ ముందు ఉంచడం అవసరం ఉండదని నా అభిప్రాయం. జన్మకుండలి పరిశీలన చేసే సమయంలో ఈ విషయాదులు తారసపడును. అయితే మీ ముందు కొన్ని గ్రహ కలయికలను ఉంచుతాను. పరిశీలించండి. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన గ్రహ స్థితిగతులు ఉంటాయి. అందరికీ ఒకే విధమైన గ్రహస్థితులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఒకే సమయంలో జన్మించిన వారికి ఒకే విధమైనటువంటి గ్రహదశలు జరుగుతున్నప్పటికి, వారి పూర్వ జన్మ కర్మాచరణ ఫలితాల వల్ల ఈ కులాంతర మతాంతర వివాహాలు జరుగును. ఉదా: 1996వ సంవత్సరంలో ఒకే తేదీలో, ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు స్త్రీలను ఉదాహరణగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అసలు పేర్లను పొందుపరచకుండా, సీత మరియు పద్మలుగా ఇక్కడ సంభోదిస్తున్నాను. సీతకు 2016లో పెద్దల ప్రమేయం లేకుండా కులాంతర వివాహం జరిగింది. అదే 2016లో పద్మకు వివాహం అయితే జరగలేదు గాని, గర్భం దాల్చింది. అంటే, చెడు గ్రహ స్థితుల కారణంగా సీతకు కులాంతర వివాహము, పద్మకు కులాంతర వ్యక్తుల వలన గర్భం దాల్చడం జరిగింది. సంతాన కారక గ్రహం ఒకరికి అనుకూలంగా ఉంటే, వివాహ కారక గ్రహం మరొకరికి అనుకూలంగా ఉంది. సీతకు కులాంతర వివాహం వారి జీవితాన్ని ప్రతికూలంగా మార్చింది. పద్మకు కులాంతర వ్యక్తుల వలన గర్భం దాల్చి ప్రతికూల సంఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారి వారి ప్రారబ్ధ కర్మలు గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి, వారికి వివాహ యోగాలు, గర్భాధారణ యోగాలు సంభవిస్తాయి. ఇక్కడ యోగాలు అంటే అనుకూలంగా ఉండేవి అని మాత్రం కాదు. గత జన్మ కర్మ ఫలం ఈ జన్మలో అనుభవించే సంధర్భాన్ని, కాలాన్ని యోగం అంటారు.(ఇంకా ఉంది