పాపకర్మలు-అవయోగాలు(పార్ట్-1)
వ్యక్తుల జన్మకుండలిలో వారు చేయబోయే వృత్తులు, వ్యాపారాలు ఏ విధమైనటువంటి వృత్తులు చేస్తారో, వాటికి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అన్న విషయాలు తెలుస్తాయి. మనిషి వారి పూర్వజన్మ కర్మానుసారము లాభ నష్టాలను, శాపాలను, దృష్టిని కలుగజేసే విధంగా గ్రహాలు తమ కిరణాలను ప్రసరింపజేసి ప్రభావాలను చూపిస్తాయి. పూర్వజన్మలోని కర్మఫలాలను అనుసరించి ఇహ జన్మలో మనిషి ప్రవర్తన ధనార్జన నిర్ణయమవుతాయి. కొన్ని కొన్ని పూర్వజన్మ పాపకర్మలు ఈ జన్మలో మానవుడు అనుభవించి తన కర్మఫలాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి కొన్ని తప్పిదములు చేయడం జరుగుతుంది. వాటిలో కొన్ని మహాపాపములు ఇక్కడ వివరిస్తున్నాను. గోహత్య, పశుహత్య, శిశు హత్య, గర్భస్థ శిశుహత్య, సర్పవధ, పక్షి బంధనము, స్త్రీ హత్య, భూ కబ్జాలు, పిల్లలను అపహరించడం, వ్యసనాల ద్వారా ఇతరులను నాశనం చేయడం.
వ్యక్తులు పాపకృత్యాలు చేయడానికి, దాని ఫలితాలను అనుభవించడానికి అవినాభావ సంబంధం ఉంటుంది. వ్యక్తులు ఎంతటి ధర్మపరులు అయినప్పటికి అహింసావాదులు అయినప్పటికి వారి పూర్వ జన్మ కర్మఫలము వారిని ఈ విధంగా చేసే విధంగా గ్రహస్థితులు ప్రేరేపించి వాటి చెడు ప్రభావాలను చూపిస్తాయి. ఒక వ్యక్తి పూర్వజన్మలో ఒక వైద్యుడై ఉండి, గర్భవిచ్ఛిత్తికి కారకుడు అయినట్లైతే ఈ జన్మలో కూడా అదే విధంగా ప్రవర్తించి మరల గర్భస్రావాలకు గర్భవిచ్ఛిత్తిలకు కారకుడై, ఆ పాపపు కర్మల తాలూకు ఫలితాలను అనుభవిస్తూ, ఆ వైద్యుడి యొక్క సంతానము వలన ఆ వైద్యుడికి సంతాన చింత, సంతాన విచారం అనేక విధములుగా కలుగుతుంది. అదే విధంగా కొన్ని వృత్తులు అనగా మైనింగ్, భూ కబ్జాలు, వీటి వలన లాభాలు వచ్చే మాట నిజమే, కానీ ఆ కార్యముల వలన ఆ కార్యనిర్వహణలో జరిగే అపశృతులు, జీవహింస, జీవ వధ (సర్పవధ) వలన తీవ్రమైన శాపాలకు ఆ వధింపబడ్డ జీవాల ఆత్మఘోషకు గురి కావడం తద్వారా ఈ కార్యములు నిర్వహించి ధనార్జన గావించిన వ్యక్తుల జీవితాలలో వారి కుటుంబ వ్యక్తుల జీవితాలలో, వారి సంతాన విషయాలలో, వారి వైవాహిక, దాంపత్య, శ్రుంగార విషయాదులలో తీవ్రమైన సమస్యలు ప్రాప్తిస్తాయి. అనేక కారణముల చేత భూమిలో త్రవ్వకాలు జరిపించినపుడు అక్కడ కొన్ని సర్పాలు వధించబడతాయి. ఆ సర్పాల ఆత్మఘోశాలే సర్పదృష్టికి, నరదృష్టికి దారి తీయబడి అనారోగ్యములకు గురి కావడం, కొన్ని సంధర్భాలలో ఆ భూములు, దోష పూరితంగా మారి, అటు అమ్మడానికి కుదరక, ఆ భూమిని ఉపయోగించే పరిస్థితులు లేకపోవడం కారణంగా ఆదాయం లేక మొదట్లో వాటివలన ఆదాయం పొంది ఆ భూములలో తప్పిదములు జరిగిన కారణంగా ఆ సర్ప, పశు వధల కారణంగా దోషాలు ఏర్పడి పొందిన ఆదాయం అంతా హరించి, అప్పులపాలయ్యి, అనారోగ్య బాధలతో తీవ్రమైన మనోవేధనతో సతమతమవడం జరుగుతుంది. ఈ విషయాలు దాదాపు అందరికీ అనుభవమే కదా! నా అనుభవంలో ఈ విధమైనటువంటి శాపాలు, దోషాలు కలిగిన వ్యక్తుల జీవితాలను మీ ముందు ఉంచుతున్నాను.
ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ శాపములు, దోషాలు 7 తరాల పాటు వదలకుండా పీడిస్తాయి. దైవాపచార దోషాలు ఇందులో మొదటి స్థానాన్ని పొందుతుంది. పూర్వజన్మలో దైవాపచార దోషాలు అనగా దేవలయములో విగ్రహాలు ధ్వంసం చేయడం, దొంగలించడం, దేవాలయములను అపవిత్రం చేయడం, సద్బ్రాహ్మణులను బాధించడం, దేవాలయ నిర్వహణలో దొంగ లెక్కలు చూపించడం, అర్చకులను అవమానించడం, ధర్మసత్రాల మీద పడి వాటి ఆస్తులను, దోచుకోవడం వంటి దైవాపచార దోషాలు చేసిన వ్యక్తులు వారి గురించి యధార్థంగా జరిగిన సంఘటనలను మీకు వివరిస్తాను. వారికి కలిగిన శాపాలు, వాటి వలన కలిగిన దుష్ప్రభావాలు, వారి జన్మకుండలి గ్రహాల ప్రభావాలు మీకు సకేతుకంగా వివరిస్తాను.
నా అనుభవంలో నా జ్యోతిష్య పరిజ్ఞానంతో ఈ దోషాలు శాపాలు పరిశీలించి వివరిస్తాను.
సశేషం…. (To be continued…)
జాతక పరిశీలన
- జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.Ph: 9846466430
Whatsapp: wa.me/919846466430
- Related Articles:
- జాతకులను జైలుపాలు చేసి అగుచాట్లకు గురి చేసే బంధన యోగం
- కళత్ర దోషం అంటే ఏమిటి? వాటి ప్రభావాలు ఏమిటి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు ఏమిటి?
- గుండె జబ్బులకు గల జ్యోతిష్య కారణాలు
- జన్మకుండలి పరిశీలన
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
#past life
#past life astrology
#telugu past life astrology
#horoscope
#telugu astrology