loading

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

  • Home
  • Blog
  • జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

 

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

జన్మకుండలిలో శుక్రుడు వైవాహిక జీవితం, శృంగార జీవితం, జీవిత భాగస్వామితో ఉండే అనుబంధం, తమ సౌందర్యం, ప్రవర్తన, ఆడవారితో, కూతురితో, తల్లితో ఉన్న అనుబంధం, ఆహారపు అలవాట్లు, సుఖాలు, భోగాలు, జీవన శైలి, అందం, ఆకర్షణ మొదలైనవి అన్నిటిని శుక్ర గ్రహ స్థితి తెలియజేస్తుంది.

శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించుటకు దాదాపు ఒక నెల పడుతుంది. సంవత్సరానికి రెండు సార్లు శుక్రుడు వక్రగతిలో సంచరిస్తాడు. జన్మకుండలిలో శుక్రుడు వక్రగతిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో, పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఏమిటో ఈ లింకుని క్లిక్ చేసి తెలుసుకోగలరు.

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటి?

  • జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు సాధరణంగా సంపన్నులుగా ఉంటారు. సుఖవంతమైన, భోగవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. సినిమా యాక్టర్లు, కళాకారులు, మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్లు, తమ ప్రసంగాలతో లేదా తమ వ్రాతలతో సమాజాన్ని ప్రభావితం చేసే మేధావులు, విజయాన్ని వరించే రాజకీయనాయకులు అందరికీ శుక్రుడు అనుకూలంగా ఉంటాడు.
  • శుక్రుడు అనుకూలంగా ఉంటే, వారికి పదునైన మెదడు కలిగి ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ వేగంగా ఆలోచిస్తారు. సమయ స్పూర్తి, పరిపక్వత కలిగిన నిర్ణయాలు వీరికి ఎన్నో లాభాలను తెచ్చిపెడతాయి.
  • శుక్రుడు అనుకూలంగా ఉంటే జీవితంలో ఎంతో చిన్న స్థాయి నుండి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్నవారు, తమ హోదాని, తమ అభిరుచిని ఇతరులకు తెలియపరిచేందుకు ఎంతో ప్రాచీనమైన ఆభరణాల నుండి లేటెస్ట్ గా వచ్చే ఎలెక్ట్రానిక్స్ అన్నిటిని కూడా సేకరించే అలవాటు కలిగి ఉంటారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు పెళ్ళిళ్ళకు హాజరు కావడం, స్నేహితులు, బంధువులు పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పడం, ఏటా వచ్చే పండుగలు, వివాహ తేదీలు గుర్తు పెట్టుకోవడం వంటివి వీరికి ముఖ్యమైనవిగా అనిపించదు, గుర్తు కూడా పెట్టుకోరు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులను వీరి జీవిత భాగస్వామి గాని, పిల్లలు గాని అర్థం చేసుకోలేరు , అలా అని వీరిని కట్టుదిట్టం కూడా చేయలేరు. వీరికి ఎక్కువగా కొడుకులపై కంటే కూడా కూతుళ్ళ మీద ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు చేసే పనులు కూడా స్వార్థపూరితంగా తోస్తాయి. అదే విధంగా, కాలానికి తగ్గట్టు జీవించడం వీరు చాలా ఇష్టపడతారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులకు క్రమశిక్షణగా ఉండటం, సమయం వృధా చేయకుండా ప్రణాళికలు వేయడం అలవాటుగా మారుతుంది. ఇవే లక్షణాలను తమ తోటి ఉద్యోగుల నుండి, తమ కింద పనిచేసే వారి నుండి కూడా ఆశిస్తారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు కేవలం మాట, భరోసా అయితే ఇస్తారు గాని దానిని ఆచరణలోకి తీసుకురారు.
  • ఆర్థిక నేరాలు, వైట్ కాలర్ నేరాలు, అంతర్జాతీయ మాఫీయా, స్టాక్ ఎక్క్ష్చెంజు పెట్టుబడులు వంటివి ఎంతో సులభంగా వ్యవహరిస్తారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులలో కొందరు దొంగ బాబాలుగా, దొంగ గురువుగా చెలామణి అవుతారు. వారికి ఏ విధమైన ఆధ్యాత్మిక శక్తి లేనప్పటికి, వారి ప్రసంగాలతో లక్షల మందిని ఇట్టే ఆకట్టుకుంటారు. శుక్రుడు అనుకూలంగా ఉన్నవారు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటారు.
  • జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే, వారికి వివాహేతర సంబంధాలు కలుగుటకు చాలా అవకాశాలు ఉంటాయి. ఈ వ్యవహారాలలోకి వెళ్ళకుండా, మెళుకువతో ఉండినట్లైతే మాత్రం, వీరి జీవితంలో, వృత్తి లేదా వ్యాపారాలలో అపారమైన విజయాన్ని చేజిక్కించుకుంటారు. ఎంతోమందిని మనం చూసి ఉంటాము, గొప్ప గొప్ప మేధావులు, ఉన్నత వ్యక్తులు, సంపన్నులు అందరూ కూడా ఎంతో విజయాన్ని సాధించినప్పటికి, కేవలం ఒక అక్రమ సంబంధం కారణంగానే వారి జీవితం తలక్రిందులు అవుతుంది. ఛేదించిన విజయాలు అన్నీ గంగలో పోసినట్టు అవుతుంది.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న వారికి నైతిక విలువలు, నిజాయితీ తక్కువగా ఉంటుంది. అయినప్పటికి, సంధర్భం వచ్చినపుడు మాత్రం మహిళలకు సహాయం చేసేందుకు ముందు ఉంటారు.

జన్మకుండలిలో శుక్రుడు ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

  • జన్మకుండలిలో శుక్రుడు ప్రతికూలంగా ఉంటే, చిన్నతనంలో అనుభవించిన సుఖమైన, భోగవంతమైన జీవితం అంతా కూడా జాతకులకి ఒక వయస్సు రాగానే, తాతలు సంపాదించిన ఆస్థితో సహా మొత్తం కోల్పోతారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఏదైనా సృజనాత్మక రంగంలో గాని, క్రీడా రంగంలో గాని గొప్ప నైపుణ్యం ఉంటుంది. కానీ ఆ నైపుణ్యం వీరికి ఉపయోగపడదు.
  • వీరికి ఉన్న బద్ధకం, క్రమశిక్షణా లోపం, మత్తు పధార్థాలకు బానిసలవ్వడం వంటి లక్షణాల వలన జీవితంలో పైకి ఎదగలేరు.
  • వీరికి ఎంత అవసరమో, అంతకు మించి సంపాదించుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. అందువలన మధ్య వయస్సు వరకు లేదా వృద్ధాప్యం వరకు వీరికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంటారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ వీరు చేసే స్వకృత అపరాధాల వలన వీరికి తగిన గుర్తింపు లభించదు.
  • వీరికి ఉన్న నైపుణ్యాలను ఇతరులు ఉపయోగించుకొని, ఎన్నో లాభాలు దండుకుంటారు. ఉదాహరణకు, కొందరు రచయితలు రాసిన కథలు ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నా కూడా, వారి పేరు మాత్రం బయటకు రాదు.
  • వీరిలో కొందరు వీరికి ఉన్న నైపుణ్యాన్ని సమాజానికి విరుద్ధంగా వాడతారు. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేయడం, నకిలీ నోట్లు, నకిలీ బంగారం, నకిలీ రత్నాలు ఎవ్వరికీ దొరకాకుండా తయారుచేయడం వీరిలో కొందరికి ఉన్న ప్రత్యేకత.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న కొందరు జాతకులు అసభ్యకర మాటలు మాట్లాడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, సామాజిక గొడవల్లో ప్రతీదానిలో జోక్యం చేసుకొని దానికి పరిష్కారం కనుగొనే దైర్యం చేయకపోవడం, మందు, డ్రగ్స్ వంటి వాటికి బానిసలవడం వలన వీరు అవమానాలు ఎదుర్కొంటారు.
  • చేయాల్సిన పనిని తప్పించుకోవడానికి లేని పోనీ కారణాలు చెప్తారు. ఒకవేళ బలవంతం చేస్తే, ఇతరులను నిందించి అయినా సరే పనిని అయితే తప్పించుకుంటారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకుల యొక్క పిల్లలకు వీరికన్నా అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వీరి సహాయం లేకుండానే వీరి సంతానం ఉన్నత స్థాయికి వెళ్తారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు స్పెక్యులేషన్లు, జూదం వంటి వాటిలో డబ్బు పెట్టి నష్టపోతారు.

ముఖ్య గమనిక:

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, శుక్రుడు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) శుక్రుడు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.

జన్మకుండలిలో శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడా లేదా అనుకూలంగా ఉన్నాడా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి?

ఈ విషయాన్ని కేవలం జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించగలరు. ఈ ఫలితాలు అన్నీ అందరికీ వర్తించవు. జాతకుని యొక్క లగ్న భావమును, శుక్ర గ్రహ స్థితిని అనగా రాశిని, సంగమించిన గ్రహాలను ఆధారం చేసుకొని మాత్రమే ఫలితాలను నిర్ణయించాలి.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. https://brahmatantra.com/complete-horoscope-reading-telugu/

 

Related Articles: 

Leave a Reply