శని చంద్ర విష యోగం
శని చంద్ర విష యోగం అంటే ఏమిటి?
శని చంద్ర విష యోగమును పలు విధాలుగా జ్యోతిష్యులు వివరిస్తారు. దీనినే విష యోగముగా, చంద్ర శని విష యోగముగా చెప్పబడుతుంది. జన్మకుండలిలో శని మరియు చంద్రుడు కలసి ఒకే రాశిలో సంగమించినపుడు ఈ యోగము ఏర్పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రుడు మనస్సును, భావోద్వేగాలను, మానసిక ప్రశాంతతను, మానసిక ధైర్యాన్ని సూచిస్తాడు. శని భాద్యతలను, జాప్యాలను, ఇబ్బందులు, అనుభవాల ద్వారా నేర్పే గుణ పాఠాలను, ఆంక్షలను, క్రమ శిక్షణను సూచిస్తాడు. ఈ శని మరియు చంద్ర గ్రహాలు ఒకే రాశిలో సంగమించినపుడు, జాతకుడు ఆలోచించే విధానం, తన భావాలను వ్యక్తపరచే విధానము, అలాగే జీవితంలోని కొన్ని విషయాలను ఎదుర్కొనే విధానాలు ప్రభావితం అవుతాయి. ఎందుకనగా శని మరియు చంద్ర గ్రహాలు రెండు విభిన్నమైన స్వభావాలు గల గ్రహాలు. శని, చంద్రుడు, ఈ రెండు గ్రహాలకు పరస్పర విరుద్ధమైన లక్షణాలు కలిగి ఉన్న గ్రహాలుగా చెప్పవచ్చు.
సంస్కృతంలో విష అనగా విషం అని, యోగం అనగా గ్రహ స్థితి అని అర్థం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని సూచించే ఆంక్షలు, కఠినత్వం, ఇబ్బందులు వలన చంద్రుడు సూచించే మనస్సు, భావోద్వేగాల పై ప్రభావం చూపుతుంది. ఇక్కడ విష యోగం అనగా విరుద్ధమైన యోగంగా చెప్పబడుతుంది గాని దీని అర్థం నిజమైన విషం అని కాదు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఈ గ్రహస్థితి ఉన్న జాతకులకు తీవ్రమైన ఆందోళనలు, అసంతృప్తి, మనశ్శాంతిని కాపాడుకునేందుకు కష్టాలు, భావోద్వేగాల పై నియత్రణ తప్పిపోవడం వంటివి జాతకుడు ఎదుర్కొంటాడు. జన్మకుండలిలో ఇతర గ్రహాల అనుకూలతను బట్టి, ఈ యోగం ఉన్న జాతకులకు సహనం, పరిపక్వత, పట్టుదల, బాధ్యత కలిగి ఉంటారు.

ముఖ్య గమనిక:
జన్మకుండలిలో శని చంద్రులు సంగమించి విష యోగం ఏర్పడినంత మాత్రానా, ఆ జాతకుడు పూర్తిగా దురదృష్టవంతుడిగా భావించకూడదు. జన్మకుండలిలో ఇతర గ్రహ బలములను బట్టి, ఆ గ్రహముల మధ్య ఉన్న డిగ్రీల దూరమును బట్టి, ఇతర గ్రహముల దృష్టులను బట్టి, ఫలితములను నిష్ణాతుడైన జ్యోతిష్యులు పరిశీలించి, వాటి ఫలితాలను వివరిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని చంద్ర విష యోగము ఒక సవాలుగా ఎందుకు చెప్పబడింది?
ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనికి మరియు చంద్రుడికి పరస్పరంగా విరుద్ధమైన లక్షణాలు కలిగి ఉంటాయి. చంద్రుడు మనః కారకుడు. సంతోషం గాని, బాధ గాని, కుటుంబ సౌఖ్యం గాని, భావోద్వేగాలను గాని, మనశ్శాంతిని గాని ఈ చంద్రుడు కారణం అవుతున్నాడు. ఇక శని క్రమశిక్షణకు, ఆంక్షలకు, జాప్యములకు, బాధ్యతలకు, కష్టపడి పని చేసే తత్వముకు కారణం అవుతాడు. ఈ ఇద్దరు ఒకే రాశిలో సంగమించినపుడు, ఆ జాతకునికి ఒకవైపు తన మనసుకు నచ్చినట్టుగా ఉండాలని కోరిక ఉంటుంది, మరోవైపు భాద్యతలను నేరవేర్చాల్సిన పరిస్థితికి మధ్య ఒక విధమైన మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది.
మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను.
ఒక వ్యక్తి తన ఆర్థిక మరియు వృత్తిపరమైన స్థిరత్వము కొరకు తీవ్రంగా కష్టపడి సాధిస్తాడు అనుకుందాం. కానీ ఆ సాధించిన విజయలపై ఆ వ్యక్తికి మానసిక సంతృప్తి అనేది రాదు. మరొక వ్యక్తి తన కుటుంబం పట్ల భాద్యతను ఎంతో శ్రద్ధగా నిర్వహించినప్పటికి, తన మనసులో ఉన్న ప్రేమను గాని, వ్యక్తిగత భావాలను గాని సులభంగా బయటకి చెప్పుకోలేడు. ఈ గ్రహస్థితి వలన జాతకుని యొక్క ఇంటిలో లేదా వృత్తి లేదా ఆఫీసులో పదే పదే సమస్యలు రావడం, అసంతృప్తి ఏర్పడటం, పురోగతిలో జాప్యం రావడం, ఛేదించిన విజయం కంటే ఇంకా ఏదో ఉందన్న అసంతృప్తి భావన కలిగి ఉంటారు.
విష యోగం వలన కలిగే ప్రభావాలు ఏమిటి?
మానసిక మరియు భావోద్వేగాల పై విష యోగం యొక్క ప్రభావాలు
ఈ యోగం ఉన్న జాతకులకు సమస్యల మీద అవసరం కంటే మరీ లోతుగా ఆలోచించే గుణం కలిగి ఉంటారు. భాద్యతలు, భవిష్యత్తు, సమాజం గురించి అనవసరంగా కంగారు పడుతూ ఉంటారు. తమ భావోద్వేగాలను బయటకు చెప్పుకునేందుకు తీవ్రమైన కష్టంగా మారుతుంది. ఇతరులను నమ్మాలంటే చాలా సమయం తీసుకుంటారు. నలుగురి మధ్యలో ఉండటం కంటే కూడా ఒంటరిగా గడిపేందుకు, నిశ్శబ్ధమైన ప్రదేశాలలో గడపడం ఎంతగానో ఇష్టపడతారు. అనుభవం ద్వారా మాత్రమే ఈ జాతకులకు సహనం మరియు మానసిక పరిపక్వత అనేది ఏర్పడుతుంది. ఈ లక్షణాలు అన్నీ అందరిలో ఒకేలా కనిపించవు. ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఈ యోగం ప్రభావం చూపుతుంది.
బంధాల పై విష యోగం యొక్క ప్రభావాలు
ఈ విష యోగం ఉన్న జాతకులకు ఇతరులను నమ్మాలి అంటే ఎంతో సమయం తీఉస్కుంతారు. ఈ జాతకుల యొక్క మనస్సులో ఉన్న తీవ్రమైన అపనమ్మకం కారణంగా వీరి మనసులో ప్రేమను బయటకు వ్యక్తపరచలేరు. ఈ జాతకులు మాటలతో కంటే కూడా తమ చేతలతో, తమ భాద్యతలను నిర్వహించే విధానం ద్వారా ప్రేమను చూపిస్తారు. అయినప్పటికి, ఈ జాతకులు తమ భావాలను వ్యక్తపరచలేకపోవడం వలన తమ ప్రియతమలకు మరియు ఈ జాతకులకు మధ్య అపార్థాలు తలెత్తుతాయి. అంతమాత్రానా, ఈ విషయోగం ఉన్న జాతకులు అందరికీ ప్రేమానుబంధంలో సంతోషం అనేది ఉండదు అని కాదు అర్థం. జాతకులు తమ జీవిత భాగస్వామితో ఏర్పడే కలహాలకు, విరహ వెధనకు ఈ యోగం ఒక కారణం అయితే మాత్రం అవుతుంది. ఇది జన్మకుండలిలోని ఇతర గ్రహాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. నిష్ణాతుడైన జ్యోతిష్యుడు మాత్రమే ఈ విశ్లేషణ చేయగలరు.
తల్లితో ఉన్న బంధం పై విష యోగ ప్రభావం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు తల్లిని, కుటుంబాన్ని, భావోద్వేగాలను సూచిస్తాడు. అందువలన శని చంద్ర విష యోగం కారణంగా తల్లితో ఉన్న సత్సంబంధాల పై కూడా ప్రభావం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మరియు జన్మకుండలిలోని ఇతర గ్రహాల ప్రభావాల వలన జాతకునికి తల్లి పట్ల తీవ్రమైన బాధ్యతలు ఏర్పడతాయి. కుటుంబంలో ఈ జాతకులు తీవ్రమైన సహనాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అనుకోని కారణాల వలన తల్లితో మానసికంగా దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.
చంద్ర శని విష యోగం వలన వృత్తి పై ఏర్పడే ప్రభావాలు
క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చేసే తత్వం, దీర్ఘకాలిక బాధ్యతలు ఇవన్నీటికి శని కారణం అవుతాడు. శని చంద్రునితో సంగమించినపుడు, వృత్తిపరమైన జీవితం పై తీవ్రమైన ప్రభావాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో నెరవేరే లక్ష్యాల పై సహనం చూపించడం వీరికి ఇబ్బందిగా మారుతుంది. కష్టమైన భాద్యతలు అన్నీ కూడా ఈ జాతకులపై పడతాయి. ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. జన్మకుండలిలో దశమ స్థానం యొక్క బలం ఆధారంగా కూడా ఈ ఫలితాలు పెరుగవచ్చు లేదా తగ్గవచ్చు. అది వ్యక్తిగత జన్మకుండలి ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది.
నిద్ర మరియు మనశ్శాంతి పై చంద్ర శని విష యోగం యొక్క ప్రభావాలు
చంద్ర శని సంగమ ఉన్న జాతకులకు విశ్రాంతి తీసుకునే సమయం దొరికినా కూడా, విశ్రాంతి తీసుకునేందుకు వీరి మనస్సు సహకరించదు. అలసట, తీవ్రమైన ఆలోచన, విశ్రాంతి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. జాతకులు తమ పని మరియు బాధ్యతలు పూర్తి కాకుండా విశ్రాంతి తీసుకోవడం కష్టం అవుతుంది. మనసులో ఉన్న కంగారు, ఆందోళన కూడా దీనికి కారణం అవుతుంది.
ద్వాదశ భావాలలో శని చంద్ర విష యోగం ఏర్పడినపుడు కలిగే ప్రభావాలు ఏమిటి?
లగ్నంలో చంద్ర శని యోగం :
మనస్సును, శరీరమును సూచించే లగ్నములో విష యోగం ఏర్పడినపుడు, జాతకులకు తన జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తం మరియు నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడును. ఏ విషయంలోనైనా ఖచ్చితమిన నిర్ణయాలు తీసుకునేందుకు వీరిలో ఆత్మ విశ్వాసం లోపిస్తుంది.
ద్వితీయంలో చంద్ర శని విష యోగం:
జన్మకుండలిలో 2వ భావంలో విష యోగం ఏర్పడితే, ఆ జాతకులు తీవ్రమైన ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికాభివృద్ధి ఉండదు. అంతేకాకుండా, కుటుంబ సభ్యులతో విభేధాలు మరియు అపార్థాలు ఏర్పడతాయి. మత్తు పధార్థాలకు బానిసలు అవుతారు.
తృతీయ భావంలో చంద్ర శని విష యోగం:
జన్మకుండలిలో 3వ భావంలో శని చంద్ర సంగమం జరిగితే, ఆ జాతకులకు ధైర్యం తక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో గొడవలు, సమస్యలు ఏర్పడతాయి.
చతుర్థ భావంలో చంద్ర శని విష యోగం:
జన్మకుండలిలో 4వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, ఇంట్లో సుఖాలు, మనశ్శాంతి, సంతోషం కరువవుతాయి. తల్లితో అభిప్రాయ భేధాలు ఏర్పడతాయి.
పంచమ భావంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో 5వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, సంతానం, విద్యా, ప్రేమ వ్యవహారాల విషయంలో సమస్యలు ఏర్పడును.
షష్ట్య భావంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో 6వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, ఆ జాతకుడు తీర్చడం కష్టమయ్యే అప్పులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగానికి, వృత్తికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. గుప్త శత్రువుల వలన ఇబ్బందులకు గురి అవుతారు.
సప్తమ భావంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో 7వ భావంలో శని చంద్ర విష యోగం ఏర్పడినపుడు జాతకులకు వివాహం ఆలస్యం అవ్వవచ్చు. మంచి స్నేహితులు వీరికి దక్కడం కష్టం అవుతుంది. వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి వలన సమస్యలు, నష్టాలు ఏర్పడును.
అష్టమ భావంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో అష్టమ స్థానంలో విష యోగం ఏర్పడటం వలన తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. యాక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్లు వలన వీరి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.
నవమ భావంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో 9వ స్థానంలో విష యోగం ఏర్పడటం వలన జాతకుడు ఊహించినంత అదృష్టం వరించదు. దైవానుగ్రహం తక్కువగా ఉంటుంది.
దశమ భావంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో విష యోగం 10వ స్థానంలో ఏర్పడినపుడు, జాతకుడు తన వ్యాపారం, వృత్తి విషయంలో సమస్యలు ఏర్పడతాయి. జాతకుని యొక్క కష్టానికి, సామర్థ్యానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం పొందలేరు. తండ్రితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి.
ఏకాదశ స్థానంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో 11వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, జాతకుడు తన సీనియర్లు నుండి గాని, స్నేహితుల నుండి గాని, పెద్దల నుండి గాని సహాయ సహకారాలు అందుకోలేరు. కష్టానికి తగ్గ లాభాలు, సంపాదన వీరికి దక్కదు.
ద్వాదశ స్థానంలో శని చంద్ర విష యోగం:
జన్మకుండలిలో 12వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, జాతకుడు అనవసర ఖర్చులు, నష్టాలు, కోర్టు విబేధాలు ఎదుర్కొంటాడు. వివాహానికి సంబంధించిన అన్నీ విషయాలలో సమస్యలు ఎదుర్కొంటాడు.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును.
Related Articles:
