loading

జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

  • Home
  • Blog
  • జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జన్మకుండలిలోని బుధుడు జాతకుని యొక్క స్నేహితుల గురించి, మేనమామ గురించి, బంధువుల గురించి, వాక్చాతుర్యం గురించి, మాటల గురించి, నవ్వించే గుణమును గురించి, పొరుగువారి గురించి, వ్రాతపూర్వక నైపుణ్యం గురించి తెలియజేస్తాడు.

బుధుడు ఒకరాశి నుండి మరొక రాశికి సంచరించేందుకు 30 రోజుల సమయం పడుతుంది. జన్మకుండలిలో బుధుడు వక్రగతిలో ఉన్నట్లైతే, జాతకుడికి ఏ విధమైన ఫలితాలు ఎదురవుతాయి? పూర్వ జన్మ కర్మల సంబంధం ఏమిటి అన్న అంశమును ఈ లింకుని క్లిక్ చేసి తెలుసుకోగలరు. జన్మకుండలిలో ఉన్న బుధుడు ఆధారంగానే మాటలు ప్రభావితం అవుతాయి, ఈ బుధుడు కారణంగానే ఆత్మాహుతి ధోరణి ఏర్పడుతుంది. ఈ అంశములను ఈ లింకులను క్లిక్ చేసి తెలుసుకోగలరు.

జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉంటే జాతకుడికి ఏర్పడే ఫలితాలు:

  • జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉన్న జాతకులు, ఇతరుల ఆలోచనలను, నైపుణ్యాలను కాపీ కొట్టి, వాటికి తమదైన రంగులు అద్ది, తమ సొంత సృజనాత్మకతలాగా చూపించడంలో మంచి నేర్పరులుగా ఉంటారు. ఇతరుల ఆలోచనలను తమకు అనుకూలంగా మార్చుకుని, వాటినే తమ ప్రతిభగా చాటుకోవడంలో వీళ్లకు వీళ్లే సాటి అన్నట్టుగా ఉంటారు.
  • బుధుడు అనుకూలంగా ఉంటే, ఆ జాతకులకు గణిత శాస్త్రంలో మంచి పట్టు కలిగి ఉంటారు. జ్ఞాపకశక్తి మెండుగా ఉంటుంది. హాస్య భావం కలిగి ఉంటారు. మంచి ఆహారపు అభిరుచులు కూడా కలిగి ఉంటారు.
  • బుధుడు అనుకూలంగా ఉన్న జాతకులు తమ వైఖరితో సమస్యలు కలిగించి, వారికి ఉన్న మేధస్సుతోనే మధ్యవర్తిత్వంగా ప్రదర్శించి, ఆ సమస్యలని పరిష్కరించి దాని నుండి సొమ్ము చేసుకుంటారు.
  • మంచి బ్రాండు గల వస్తువులను సైతం నకిలీలు తయారుచేసి సొమ్ము చేసుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది.
  • బుధుడు అనుకూలంగా ఉండే కొంత మంది జాతకులు ప్రభుత్వ పథకాలను ఏ విధంగా వాడుకోవాలో ఎరిగిన వారు ఉంటారు. బ్యాంకులను ఎలా మోసం చేయాలి, తీసుకున్న అప్పులను చెల్లించకుండా ఏ విధంగా తప్పించుకోవాలి అన్న అంశములు వీరికి బాగా తడతాయి.
  • జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉన్నట్లైతే, ఏ వ్యాపారం లేదా స్టాక్స్ లో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి గొప్ప గొప్ప సలహాలు ఇవ్వగలరు.
  • బుధుడు అనుకూలంగా ఉన్న జాతకులు ఇతరుల పేరు మీదా కాంట్రాక్టుని సంపాదించి, ఆ కాంట్రాక్టు ద్వారా వచ్చే ప్రతీ రూపాయి కూడా వీరి ఆధీనంలో ఉండేలా చూసుకుంటారు.
  • బుధుడు అనుకూలంగా ఉన్న జాతకులు లాభదాయకమైన వ్యాపారములు అన్నీ కూడా తమ పేరు మీద ఉంచుకొని, రిస్క్ ఉన్న ప్రాజెక్టులు ఏవైనా ఉంటే, వాటిని తన భాగస్వామి పేరు మీద పెడతారు.
  • బుధుడు అనుకూలంగా ఉన్న జాతకులకు భయం ఎక్కువగా ఉంటుంది. విమర్శలను ఎదుర్కొనే ధైర్యం ఉండదు, ఎదురుగా నిలబడి గొడవ పడే సాహసం కూడా చేయరు. కానీ, తమకు నచ్చని వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తే మాత్రం, నేరుగా ఎదుర్కోకుండా చట్టపరమైన సమస్యల్లో ఇరికించి, ఇబ్బందులకు గురిచేయడానికి ప్రయత్నిస్తారు. ఎదుటివారిని ధైర్యంగా ఎదుర్కోలేక, చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడమే వీరి నైజం.
  • బుధుడు అనుకూలంగా ఉన్న కొంతమంది జాతకులకు అనుకోకుండా పూర్వీకుల ఆస్తులు కలసి వస్తాయి. ఇతర గ్రహాలు కూడా అనుకూలిస్తే తన భార్య/భర్త తరపున తల్లిదండ్రుల ఆస్తులు కూడా దక్కుతాయి.
  • బుధుడు అనుకూలంగా ఉన్నవారిలో కొందరు జాతకులు, ఎవరైనా బాగా ఆస్తి రాసిస్తామంటే చాలు, దత్తతకు వెళ్ళిపోయి, తమ ఇంటి పేరు కూడా మార్చుకోవడానికి కూడా సిద్ధమవుతారు.
  • మధ్య వయస్సుకు వచ్చేసరికి కొందరికి చర్మ సంబంధిత వ్యాధుల వలన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది.

జన్మకుండలిలో బుధుడు ప్రతికూలంగా ఉండే ఏర్పడే ఫలితాలు:

  • జన్మకుండలిలో బుధుడు ప్రతికూలంగా ఉన్నట్లైతే, వారి అన్నీ పనులకు కూడా ఇతరులపై ఆధారపడతారు. బయటకి ఎక్కడకి ఒంటరిగా వెళ్ళలేరు. వీరితో పాటు ఎవరో ఒకరు బయటకు రావాలని కోరుకుంటారు.
  • బుధుడు ప్రతికూలంగా ఉన్నవారిలో కొందరు, తమకు ఒక అంశం మీద ఏ మాత్రం జ్ఞానం లేకపోయినప్పటికి, ఆ అంశంలో వీరే ఆరితేరినట్టు ఇతరులకు గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తారు.
  • బుధుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు, మంచి నాణ్యమైన ఆహారం కంటే కూడా రోడ్డు పక్కన లేదా ఫాస్ట్ ఫుడ్లను ఎక్కువగా ఇష్టపడతారు.
  • వ్యక్తిగత శుభ్రత వీరిలో కొందరికి తక్కువగా ఉంటుంది.
  • వీరిలో కొందరు తమ పూర్వీకుల చరిత్ర గురించి గాని, వారికి ఉన్న దేశ భక్తి గురించి గాని, ఇంకేవైనా విషయాలు గాని, వినేవారికి విసుగు వచ్చేదాకా చెప్తూనే ఉంటారు.
  • వీరిలో కొందరు, తమ ఆఫీసులో పనులు జరగాలంటే అందరూ తమ మీదే ఆధారపడ్డట్టు బాగా హెచ్చులు చూపిస్తారు.
  • అనవసరమైన మెసేజులు అన్నిటిని ఇతరులకు చూపించేందుకు భద్రపరచుకుంటారు.
  • బుధుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు అబద్ధాలను సులభంగా చెప్పడం, కట్టు కథలు అల్లడం సులభంగా చేస్తారు.
  • ఏదైనా బాగా ఆచరణలో ఉన్న సామాజిక అభిప్రాయమును వ్యతిరేకించి, తమని తాము భిన్నంగా ఉన్నామని ఇతరులకు తెలియజేసుకునేందుకు ప్రయత్నిస్తారు.
  • బుధుడు వ్యతిరేకంగా ఉన్న జాతకులలో కొందరు, తమకు ఎంతో పెద్ద లక్ష్యాలు మనసులో పెట్టుకుంటారు, లక్షల గురించి మాట్లాడుకుంటారు. కానీ ఏ రోజుకి సరిపడా ఆ రోజుకి సంపాదించుకునే వారే ఎక్కువగా ఉంటారు.
  • బుధుడు వ్యతిరేకంగా ఉన్న జాతకులలో కొందరు, తమకు తెలిసిన ప్రతీ స్నేహితుడి నుండి సహాయం తీసుకుంటారు. కానీ తిరిగి వారికి సహాయం చేయాల్సి వచ్చినపుడు వెన్ను చూపుతారు.
  • వీరిలో చాలా మంది తమ సమస్యలను ఇతరులు విని, తమపై సానుభూతి చూపించాలని కోరుకుంటారు. కానీ ఇతరులు చెప్పే సమస్యలు వీరు చెవిన పెట్టుకోరు.

ముఖ్య గమనిక:

జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, బుధుడు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) బుధుడు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.

జన్మకుండలిలో బుధుడు ప్రతికూలంగా ఉన్నాడా లేదా అనుకూలంగా ఉన్నాడా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి?

ఈ విషయాన్ని కేవలం జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించగలరు. ఈ ఫలితాలు అన్నీ అందరికీ వర్తించవు. జాతకుని యొక్క లగ్న భావమును, బుధ గ్రహ స్థితిని అనగా రాశిని, సంగమించిన గ్రహాలను ఆధారం చేసుకొని మాత్రమే ఫలితాలను నిర్ణయించాలి.

 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. https://brahmatantra.com/complete-horoscope-reading-telugu/

 

Related Articles: 

Leave a Reply