loading

సోమవతి అమావాస్య ప్రత్యంగిరా హోమం 2026

  • Home
  • Blog
  • సోమవతి అమావాస్య ప్రత్యంగిరా హోమం 2026

సోమవతి అమావాస్య ప్రత్యంగిరా హోమం 2026

సోమవతి అమావాస్య ప్రత్యేకం: శ్రీ మహా ప్రత్యంగిరా దేవి హోమం – శతృబాధలు, నరదృష్టి, చేతబడి, గ్రహదోషాల నివారణకు విశేష ఆరాధన!

శ్రీ మాత్రే నమః | ఓం ప్రత్యంగిరాయై నమః

జీవితంలో కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు ముందుకు సాగకపోవడం, వ్యాపారంలో వరుస నష్టాలు, అనవసరమైన శతృత్వాలు, కోర్టు వివాదాలు, కుటుంబంలో అశాంతి, మానసిక భయాలు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొనే ఎవ్వరైనా సరే, దైవారాధన, మంత్రజపం, హోమాది క్రతువులను ఆశ్రయించడం ద్వారా మానసిక ధైర్యం, ఆధ్యాత్మిక బలం, దైవానుగ్రహం పొందవచ్చు.

అటువంటి విశేషమైన హోమములలో శాక్తేయ సాంప్రదాయంలో శ్రీ మహా ప్రత్యంగిరా దేవి హోమం ఒకటి.

ఈ పవిత్రమైన హోమాన్ని రాబోయే నవంబర్ 9, 2026 సోమవారం – సోమవతి అమావాస్య సందర్భంగా కేరళలోని పాలక్కాడ్ బ్రహ్మ తంత్ర పీఠంలో నిష్ణాతులైన కేరళ తాంత్రిక పండితుల పర్యవేక్షణలో నిర్వహించనున్నాము. ఈ హోమంలో మీ పేరు, గోత్రనామాలతో సంకల్పం చేయించుకుని అమ్మవారి విశేష అనుగ్రహాన్ని కోరుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నాము.

శ్రీ ప్రత్యంగిరా దేవి ఎవరు?

శ్రీ ప్రత్యంగిరా దేవి ఆదిపరాశక్తి యొక్క అత్యంత ఉగ్రశక్తి స్వరూపంగా ఆరాధించబడతారు. సింహముఖంతో దర్శనమిచ్చే అమ్మవారిని నరసింహికా స్వరూపిణిగా కూడా పూజిస్తారు. దుష్టశక్తులను అణచివేసే శక్తిగా, ధర్మాన్ని రక్షించే దేవతగా, శతృపీడలను తొలగించే దేవిగా భక్తులకు అభయాన్ని ప్రసాదించే అమ్మవారిగా ప్రత్యంగిరా దేవికి విశిష్ట స్థానం ఉంది. తాంత్రిక ఆరాధనా సంప్రదాయాల్లో ప్రత్యంగిరా దేవి ఉపాసనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శత్రుబాధలు, నరదృష్టి, చేతబడి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కోరుతూ భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు.

సోమవతి అమావాస్య రోజున ప్రత్యంగిరా హోమం ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు?

అమావాస్య తిథి ఆధ్యాత్మిక సాధనలు, పితృకార్యాలు, శత్రుపీడను నివారించు ప్రత్యేక దేవతారాధనలకు ప్రాధాన్యత కలిగిన రోజుగా పరిగణించబడుతుంది. అమావాస్య సోమవారం నాడు రావడాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజున శివారాధన, జపం, దానం, పితృకార్యాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన సందర్భంలో ప్రత్యంగిరా దేవిని ఆరాధిస్తూ నిర్వహించే మహా హోమం ద్వారా భక్తులు తమ కుటుంబానికి శతృవుల నుండి రక్షణ, శ్రేయస్సు, మనశ్శాంతి, కార్యసిద్ధి కలగాలని సంకల్పించుకోవచ్చు.

శ్రీ మహా ప్రత్యంగిరా దేవి హోమం ప్రత్యేకతలు

ఈ హోమం సాధారణ పూజా విధానానికి భిన్నంగా, కేరళ తాంత్రిక సంప్రదాయానికి అనుగుణంగా ప్రత్యేక పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఈ హోమములో ఎండు మిరపకాయలు, నల్ల మిరియాలు వంటి ప్రత్యేక హోమ ద్రవ్యాలను సమర్పించడం జరుగుతుంది. ప్రత్యంగిరా దేవి యొక్క మూలమంత్రమును 1008 జపాలు చేస్తారు. నవంబర్ 9వ తేదీన జరిగే ఈ హోమము నిష్ణాతులైన కేరళ తాంత్రిక పండితుల ద్వారా జరుగుతుంది.  అందువలన ఈ మహా ప్రత్యాంగిరా హోమములో భక్తులు తమ గోత్ర నామములు, కుటుంబ సభ్యుల పేర్లతో ప్రత్యేక సంకల్పం చేయడం జరుగుతుంది.  ఈ హోమంలో పాల్గొనే భక్తులు తమకు, తమ కుటుంబానికి శ్రీ మహా ప్రత్యాంగిరా దేవి యొక్క రక్షణ, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి కలగాలని సంకల్పించవచ్చు. ఏదైనా ప్రత్యేక సంకల్పం ఉన్నా కూడా తెలియజేయవచ్చును.

శ్రీ మహా ప్రత్యాంగిరా దేవి హోమములో ఎవరెవరు సంకల్పం చేసుకోవచ్చు?

  • శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు.
  • వ్యాపారంలో వరుస నష్టాలు, ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు.
  • కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలతో సతమతమవుతున్నవారు.
  • నరదృష్టి, చేతబడి వంటి ప్రతికూల ప్రభావాలపై ఆందోళన కలిగినవారు.
  • కుటుంబంలో తరచూ అశాంతి, కలహాలు ఎదుర్కొంటున్నవారు.
  • రాహు-కేతు, కాలసర్ప, శని సంబంధిత జ్యోతిష్య దోషాలకు పరిహార ఆరాధన కోరుకునేవారు.
  • దీర్ఘకాలిక భయాలు, మానసిక ఆందోళనల నుంచి ధైర్యం, ప్రశాంతత కోరుకునేవారు.
  • జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలగాలని కోరుకునేవారు.

ప్రసాద వివరాలు:

కేరళ రాష్ట్రంలోని, పాలక్కాడ్ పట్టణం, వావిల్యాపురం గ్రామమునందు గల బ్రహ్మ తంత్ర పీఠము నందు శ్రీ మహా ప్రత్యాంగిరా దేవి యొక్క విశేష పూజా హోమములు నిర్వహించిన తరువాత, ఈ హోమము కొరకు సంకల్పము చేసుకున్న వారి చిరునామాకి ప్రసాదం కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. హోమ కార్యక్రమములో ఉంచిన రక్షా నిమ్మకాయ, అమ్మవారి కుంకుమ, హోమ భస్మమును ప్రసాదముగా భక్తులకు పంపడం జరుగుతుంది.

హోమములో పాల్గొను విధానం:

క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ద్వారా మీ పేరు, గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు, సంకల్ప కోరిక, చిరునామా వివరాలను అందజేయాలి. ఆ తరువాత హోమ సంకల్పమునకు గానూ 1499/- సంభావన ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

    శ్రీ మహా ప్రత్యాంగిర హోమం- సంకల్ప నమోదు Registration








    దయచేసి హోమంలో పాల్గొనే మొత్తం వ్యక్తుల సంఖ్యను నమోదు చేయండి. కుటుంబ సభ్యులు 6 మందికి మాత్రమే

    Participant 1 – యజమాని వివరాలు



    Participant 2



    Participant 3



    Participant 4



    Participant 5



    Participant 6



    Participant 7



    Participant 8



    Participant 9



    Participant 10




    Related Articles: 

    Leave a Reply