కేతువు అనుకూలంగా ఉంటే జాతకుడికి ఇన్ని అద్భుత యోగాలను కలుగజేస్తాడా?
జన్మకుండలిలో కేతువు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువును మోక్ష కారకుడుగా చెప్పబడింది. కేతువు ఒక ఛాయా గ్రహము అయినప్పటికి, కేతువు జాతకుడి పై చూపించే ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటుంది అని చెప్పాలి. జాతకుడి యొక్క కర్మ భారమును, జాతకుడిలో ఉన్న ఆధ్యాత్మికతను, భక్తిని, వైరాగ్యమును, చావు వరకు వెళ్ళే అనుభవాలను వీటన్నిటికి కేతువు కారకుడు అవుతాడు. కేతువు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి ఒకటిన్నర సంవత్సరాల సమయం పడుతుంది. కేతువు ఎప్పుడూ వక్రగతిలోనే సంచరిస్తాడు. జాతకుడిలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానమును, మోక్షమును, వైరాగ్య లక్షణములను, అంతర్లీన జ్ఞానమును, పూర్వ జన్మ కర్మలను, ఏకాంత జీవితమును, జాతకుడిలో దాగి ఉన్న ప్రత్యేక నైపుణ్యములను, పరిశోధన జ్ఞానమును, జాతకుడి యొక్క వెన్నుముక, నాడీవ్యవస్థ, పొత్తికడుపు, పాదాలు, పీనియల్ గ్రంధి ఇవన్నీ కూడా కేతువు యొక్క ఆధీనంలో ఉంటాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటి?
- జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉంటే, ఆ జాతకులకు ఊహాశక్తి అధికంగా ఉంటుంది. ఎన్ని వ్యాపారాలలో అదృష్టం వరిస్తుంది. ఎటు నుండి అయినా సరే డబ్బు సంపాదించుకునే సత్తా వీరిలో ఉంటుంది.
- వీరి జీవనశైలి చాలా సరళంగా ఉంటుంది. ఎంతో జాలి గుణం కలిగి ఉంటారు. చరిత్రల మీద, వైజ్ఞానిక శాస్త్రాల మీద మంచి పట్టు సాధించగలరు.
- ఎటు వైపు నుండి ఏ విధమైన అవకాశం వచ్చినా సరే, అన్నిటిని సద్వినియోగం చేసుకునే జ్ఞానం వీరికి ఉంటుంది.
- కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు ఎంతో నిజాయితీగా ఉంటారు. అందరికీ ఒకే విధమైన న్యాయం అన్న సిద్ధాంతం వీరిది. కానీ వీరికి జరిగిన అన్యాయాన్ని మాత్రం పట్టించుకోరు.
- కేతువు అనుకూలంగా ఉన్న జాతకులకు సహాయం చేసే గుణం, సామర్థ్యం, సహనం ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటుంది.
- వీరి చుట్టూ ఎన్ని ఐహిక సుఖాలు ఉన్నప్పటికి, వీరి మనస్సులో ఉన్న ఆధ్యాతికత వలన ఎంతో సరళమైన జీవితాన్ని జీవిస్తారు.
- జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు మంచి రచయితలు కాగలరు. వీరి వ్రాతలతో ఎంతో మందిలో అధ్యాత్మికతను, మార్పులను తీసుకురాగలరు.
- వీరి యుక్త వయస్సులోనే మంత్ర సిద్ధి, యోగ సిద్ధి లభిస్తుంది. వీటిని కూడా ఈ జాతకులు ఇతరుల కొరకే ఉపయోగిస్తారు.
- కేతువు అనుకూలంగా ఉన్న జాతకులకు తమ ముఖంలో కళ ఉట్టిపడుతుంది. అందరినీ ఇట్టే ఆకృశించే శక్తి వీరికి ఉంటుంది.
- భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా చెప్పగలిగే సామర్థ్యం వీరిలో ఉంటుంది.
- కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు మంచి ఉపాధ్యాయులుగా, మంచి రచయితలుగా, నిష్ణాతులైన జ్యోతిష్యులుగా రాణిస్తారు.
- బ్లడ్ బ్యాంకులు, మ్యూజియంలు, పురావస్తుశాఖ కేంద్రాలు, అనాధ ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, యోగా కేంద్రాలు, దేవాలయాలు వంటివి కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు ఎంతో సులభంగా స్థాపించి, నిర్వహించగలరు.
- కేతువు అనుకూలంగా ఉన్న జాతకులకు కేతువే స్వయంగా జాతకులకు రాజా యోగమును కలుగజేస్తాడు.
- వీరికి స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. కానీ వారు మంచివారై ఉంటారు. ఈ జాతకులు జీవిత పరమార్థం కోసం ప్రాకులాడి, చివరకు మోక్షం కోసమే తపిస్తారు.
జన్మకుండలిలో కేతువు ప్రతికూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటి?
- జన్మకుండలిలో కేతువు ప్రతికూలంగా ఉంటే ఆ జాతకులు గంజాయి, ఇతర మత్తు పధార్థాలను అలవాటు చేసుకుంటారు.
- కేతువు ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకులు ఇతరుల గురించి భ్రమించడం, అపర్థాలు చేసుకోవడం, భయపడటం వంటి పనికిరాని వాటి మీదే వీరి జీవితంలో చాలా భాగం గడచిపోతుంది.
- వీరు ఎంతో నిజాయితీ పరులు అని తమకు తాము సొంత డబ్బాలు చెప్పుకుంటారు.
- కేతువు ప్రతికూలంగా ఉన్నప్పటికి ఈ జాతకులకు ఎన్నో అంశాల మీద జ్ఞానం ఉంటుంది. కానీ వీరిలో పాతుకుపోయిన అనుమానాలు, భయాలు, వీరిలో ఉన్న సామర్థ్యాన్ని తోక్కేస్తాయి. వీరికి ఉన్న సామర్థ్యాలను కేవలం ఉద్యోగం కొరకే ఉపయోగించుకుంటారు.
- కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులు చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కదు.
- కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం వస్తే, దానికి ఈ జాతకులు ఇంటికి దూరమని, ఖర్చులు ఎక్కువ అవుతాయని, తిండికి కష్టం అవుతుందని ఇలాంటి చిన్న కారణాలు చెప్పి మానుకుంటారు.
- వీరిలో వ్యక్తిగత శుభ్రత తక్కువగా ఉంటుంది. వీరు చెప్పేది నిజమే అయినా వీరి రూపం చూసి, ఎవరూ వీరి మాటను లెక్క చేయకుండా పోతారు.
- కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులలో కొందరు దొంగ బాబాలుగా మారతారు.
- కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ ఆలోచన విధానాన్ని తప్పు పడితే, ఎవరితోనైనా సరే గొడవలకు దిగుతారు.
- చనిపోయిన వారు వీరిని వెంటాడుతున్నారని, కొన్ని రోజుల పాటు ప్రేతాత్మ కథలను చెప్పుకుంటూ వస్తారు.
- కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులకు డబ్బు సంపాదించాలన్న కోరిక గాని, సామర్థ్యం గాని ఉండదు. అలా అని ఇతరులను మోసం కూడా చేయలేరు.
- జాతకంలో కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులను భరించడానికి వీరి జీవిత భాగస్వామికి, పిల్లలకు సహనం చాలా ఉండాలి.
ముఖ్య గమనిక:
జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, కేతువు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) కేతువు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి.
Related Articles:
- శని చూపించు విషతుల్య యోగం యొక్క ప్రభావములు
జన్మకుండలిలో గురువు అనుకూలంగా ఉంటే, ప్రతికూలంగా ఉంటే ఫలితాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
