loading

సర్పబలి -సర్పారాధన ప్రాముఖ్యత

  • Home
  • Blog
  • సర్పబలి -సర్పారాధన ప్రాముఖ్యత

సర్పబలి -సర్పారాధన ప్రాముఖ్యత

సర్పబలి

హైందవులకు పరమ పూజ్యము మరియు ప్రమాణీకము అయిన భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు సర్పముల గురించి చెప్పడం జరిగింది. భగవద్గీత దశమ అధ్యాయములోని 28వ శ్లోకంలో “సర్పాణాం ఆస్మి వాసుకిః” అని చెప్పడం జరిగింది. ఆ శ్లోక భాగానికి అర్థం ఏమిటంటే సర్పములలో వాసుకి అను సర్పము నా అవతారమే అని. అలాగే అదే అధ్యాయంలోని 29వ శ్లోకంలో “అనంతశ్చాస్మి నాగానాం” అని చెప్పడం జరిగింది. ఈ భాగానికి అర్థం ఏమిటంటే నాగజాతి వారిలో ఆదిశేషుడు (అనంతుడు) నేనే అని. సర్పములను సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపములుగా పూజించడం జరుగుతున్నది. దాదాపు ప్రపంచంలోనే అనేక దేశాలలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు సర్పాలను పూజిస్తున్నారు అన్న మాట యధార్థము. సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు, కుమార స్వామి, దంఢాయుధపాణి మరియు స్కంధుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో “సేనానినామహం స్కంధః” (దశమ అధ్యాయం 24వ శ్లోకం) అని చెప్పడం జరిగింది. అనగా సేనాధిపతులలో కుమార స్వామిని నేనే అనే అర్థం. ఆ విధంగా చూస్తే సుబ్రమణ్య స్వామి సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారమేనని భావించడం పొరపాటు ఎంతమాత్రము కాదు. కార్తికేయుడు సకల శుభలక్షణములను కలిగియున్న కలియుగ ప్రత్యక్ష దైవము అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బాల, వీర్య మరియు తేజమును కలిగియున్న పరబ్రహ్మము శ్రీ షణ్ముఖుడే అని హైందవ ఇతిహాసములు ఘోషిస్తున్నాయి. సర్పము, సుబ్రహ్మణ్య స్వరూపము అనే హైందవ విశ్వాసానికి అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తున్నాయి. 

మీ వ్యక్తిగత సంపూర్ణ జాతక పరిశీలన వివరాలను డాక్యుమెంట్ రూపంలో పొందుట కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ జన్మలో గాని, గత జన్మలో గాని నాగుపాముని చంపడం వల్ల కలిగే భయంకరమైన పాపాన్ని తొలగించుకోవడానికి ‘సర్పబలి’  లేదా ‘నారాయణనాగబలి’ అను తంత్ర విధానాలను ఆచరించాలి . గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితం ఈ జన్మలో సర్పగ్రహాల అన్నీ చెప్పబడే రాహు, కేతు, శుక్ర, శని కుజ గ్రహాలు కలుగజేసే విష యోగం, నాగ శాపం, చండాల యోగాల ద్వారా మానవుడు పీడింపబడతారు. వాటిని నిర్మూలించడం కోసం సర్పబలిని నిర్వహిస్తారు. నాగుపాముని తెలిసి గాని, తెలియక గాని చంపినపుడు నాగశాపం తగులుతుంది. అలా నాగశాపం తగిలినపుడు ఆ శాపం తగిలిన వారికి సంతాన భాగ్యం ఉండదు. ఇలాంటి నాగశాపం ఉన్న దంపతులు సంతానం కోసం వైద్యుల వద్దకు వెళితే ఆ దంపతులలో ఏ లోపం ఉండదని తెలుస్తుంది. అయినా సరే, వారికి సంతానం కలుగదు. అలాగే కొందరు దంపతులు సంతాన సంబంధమైన లోపాలు ఉన్నపుడు మంచి వైద్యుల వద్దకు వెళ్ళి మంచి మందుల్ని వాడుకున్న కారణంగా గర్భం వస్తుంది. ఆ గర్భిణీ స్త్రీకి మూడవ నెల వెళ్ళి నాలుగవ నెల వచ్చేసరికి గర్భస్రావం జరిగిపోతుంది. మందులు వాడి గర్భవతులైన ఎందరో స్త్రీలు నాగశాపం కారణంగా గర్భస్రావములు పొంది అటు అనారోగ్యాన్ని ఇటు తోటి ఆడవారి హేళనలను పొందుతున్నారు. 

 

ఇంకొంతమంది ధనికులైన వారు IVF విధానంలో గర్భవతులు అయినప్పటికి నెలలు నిండిన తరువాత వారి గర్భములతో లోపాలు ఉన్న శిశువులు ఉండటం జరుగుతుంది. ఫలితంగా ఆ బిడ్డలను వైద్యులే తొలగించుకోమని వైద్యులే సలహా ఇస్తారు లేదా అంగవైకల్యంతో పుట్టిన ఆ బిడ్డలు 30 రోజులులోపే చనిపోవడం జరుగుతుంది లేదా ఏదో ఒక అంగవైకల్యం ఉండటం జరుగుతుంది. కొంతమందికి మాటలు రాకపోవడం, కొంత మందికి గాయాలు, అగ్ని వల్ల, చెడు దృష్టి వల్ల అనారోగ్యం పాలవడం జరుగుతుంది. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పి ఈ రోజుల్లో ఏ లోపాలులేని స్త్రీలకు ఎందుకు సంతానం కలుగడం లేదా? ఐ‌వి‌ఎఫ్ విధానంలో జన్మిస్తున్న బిడ్డలలో ఎంత శాతం మంది పరిపూర్ణ ఆరోగ్యంతో పుడుతున్నారు. ఎంత శాతం ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణం దంపతులలో భార్యకు లేదా భర్తకు నాగశాపం లేదా కాలసర్ప దోషం ఉండుటమే అని ఎవరికి తెలుస్తుంది. 

 

జ్యోతిష్య శాస్త్రాన్ని అతిలోతుగా పరిశీలించిన నాకు, నాగశాపం వల్ల సంతానపరమైన సమస్యలు ఉద్భవిస్తాయని తెలుసుకున్నాను. అయితే ఈ నాగశాపాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఎంతో పరిశోధించగా చివరకి “సర్పబలి” అనే ప్రక్రియ చేయడం వల్ల కలసర్పదోషాలు, నాగశాపాలుతొలగి సంతానం కలుగుతుందని తెలుసుకున్నారు. వివాహం గాని వారికి కాలసర్పదోష, నాగదోష పరిహారాలను జరిపించడం ద్వారా శీఘ్ర కాలంలో వివాహం జరుగుతుంది. స్త్రీలకు బహిష్టు వచ్చే 8 రోజులు ముందు ఈ తంతు జరిపించుకోవాలి. కేరళలోని మా తాంత్రిక పీఠములందు సర్పబలి పరిహారక్రియను మేము గత 18 సంవత్సరాలు నుండి నిర్వహిస్తున్నాము. 

 

నాగదోష నివారణ

సర్పాన్ని వధించిన వారికి (పూర్వజన్మలోగాని, ఈ జన్మలో గాని) కలిగే అతి భయానకమైన పాపాన్ని సర్పశాపాన్ని మరియు కాలసర్పదోషాలను తొలగించే ఏకైక ప్రక్రియ సర్పబలి. ఈ నాగశాపం, కాలసర్పదోషం ఉన్నవారికి సంతానం కలుగకపోవడం, సంతానం ప్రక్కదోవలు పట్టడం, సంతాన్మ అకాలమృత్యువు పాలవడం, యుక్తవయస్సు వచ్చిన స్త్రీ పురుషులకు అందం, చదువు, ధనం అన్నీ ఉన్నా వివాహం కాకపోవడం, క్యాన్సర్, షుగర్ వ్యాధులకు గురికావడం, వైవాహిక జీవితం ఛిద్రం కావడం, చట్టసంబంధమైన వివాదాలకు, జరిమాణాలకు శిక్షలకు గురికావడం, మానసిక దిగ్భ్రాంతికి గురికావడం (Hallucination) జీవితంలో అభివృధ్హిని పొందలేకపోవడం, విషజ్వరాలకు గురి కావడం ఎవరికైనా ధనము ఇస్తే అది తిరిగి పొందలేకపోవడం జరుగుతుంది. ఈ సర్పదోశానికి పరిహారంగా ఆశ్లేష బలి, నవనాగమండలం, మహాసర్పబలి వంటి మహత్తర సర్పపూజాది హోమాలు జరిపించుకొని దోష నివారణను పొందాలని ఆశించేవారు ముందుగా ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు సర్పదోషం ఉండి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు శీఘ్ర వివాహం కోసం, సత్సాంతాన భాగ్యం కోసం, నష్టద్రవ్యప్రాప్తి (ఇచ్చిన ధనం తిరిగి పొందడానికి) కొరకు, ధీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలను, వ్యాధులను నిర్మూలించడానికి చట్ట సంబంధ వివాదాలా నుండి శీఘ్రంగా బయటపడటం కోసం, తంత్ర ప్రయోగాళా నుండి బయట పడటానికి ఇష్టదేవతా అనుగ్రహం పొందడం కోసం చేసే నాగబలి కార్యక్రమానికి జరిపించడానికి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు.

 

కాలసర్పయోగ నివృత్తి హోమం

కాలసర్పయోగం అంటే ఏమిటి?

జన్మకుండలిలో రాహువు మరియు కేతువు ఉన్న రాశుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహములు, అనగా రవి,చంద్ర, శని, కుజ, శుక్ర, బుధ, గురు గ్రహములు ఇమిడి ఉన్నట్లైతే ఈ కాలసర్ప యోగం ప్రాప్తిస్తుంది. ఎవరి జాతకంలో అయితే ఈ కాలసర్ప యోగం ఉంటుందో, ఆ జాతకులు తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు చూడాల్సి ఉంటుంది. తమ తమ రంగాలలో గొప్ప స్థాయికి చేరుకోడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులకు తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎంత కష్టపడినా సరే, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు.

కాలసర్పయోగం వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడతాయి?

కాలసర్పయోగం వల్ల ఎన్నో సమస్యలు, అనుకోని సంఘటనలు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలసర్పయోగం ఉన్న జాతకులకు ఆరోగ్య రీత్యా యోగ ప్రభావం పడుతుంది. శారీరకంగా వ్యాధుల బారీన పడి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. మనఃశాంతి లేకపోవడం, జ్ఞాపకశక్తి మరియు పట్టుదల లేకపోవడం, అనవసరమైన ఒత్తిళ్ళకు లోనవడం, భాద్యతారాహిత్యంగా వ్యవహరించడం, జ్ఞానం లోపించడం, వ్యక్తిత్వ లోపాలు ఉండటం, ఆలోచనాశక్తి తక్కువగా ఉండటం జరుగుతాయి. దీనివల్ల జాతకుడు మానసిక స్థిరత్వం ఉండదు. దీనివల్ల వ్యక్తిగతంగా వారి సన్నిహితులతో సరైన బంధం కొనసాగించక బాధలు పడతారు. ఈ కాలసర్పయోగం వల్ల నిరంతరంగా శారీరక అనారోగ్యాలు లేదా వ్యాధులు ఏర్పడటమే కాకుండా, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వటం జరుగుతుంది.

పన్నెండు రకాల కాలసర్పయోగాలు ఏమిటో, వాటి వల్ల జాతకులు ఎదుర్కొనే ఫలితాలు ఎలాంటివో ఈ లింకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

ఇక విద్యా, వృత్తి విషయాలకు వస్తే ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం, మంచి విద్యను నేర్చుకోలేకపోవటం, స్కూలుకు గాని, కాలేజీకి గాని, విశ్వవిద్యాలయానికి గాని ఒక కొత్త విద్య కొరకు చేరలేకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ కాలసర్పయోగం జాతకులకు పై చదువులు చదవాలన్న శ్రద్ధ లేకుండా ఉండటానికి కూడా ఈ యోగం కారణం అవుతుంది. చదువులో, చేసే వృత్తిలో నిరంతర విఫలం పొందడం కూడా ఈ కాలసర్పయోగం వల్ల జరుగుతుంది. ఈ యోగం ఉన్న జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఉద్యోగం కూడా నష్టపోయే అవకాశాలు రాక మానవు.

ఈ కాలసర్ప యోగం ఉన్న వారు ప్రేమ వ్యవహారాలలో విఫలం అవ్వటం, ప్రాణ స్నేహితుని చేతిలో గాని, భాగస్వామి చేతిలో గాని, భార్య/భర్త చేతిలో గాని మోసపోవటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో, ఆప్తులతో ఉన్న బంధం పై ఈ యోగ ప్రభావం పడుతుంది. వివాహం ఆలస్యంగా జరగడం, వైవాహిక జీవితం సాఫీగా ఉండకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం, వంధ్యత్వం (సంతాన లేమి), పదే పదే రక్తస్రావాలు జరగటం, పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, విడాకులు జరగడం లాంటి దుర్ఘటనలు ఈ కాలసర్ప యోగం వల్ల సంభవిస్తాయి.

ఈ కాలసర్ప యోగం వల్ల ఆర్థికపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, జాతకుడిని పేదవాడు అయ్యేలా చేసే తీవ్రమైన అధిక ఋణాలు, వ్యాపారంలో అడ్డంకులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులలో ఆటంకాలు వస్తాయి.

ఈ కాలసర్పయోగం వల్ల ప్రభావితులైన వారు, తమ జీవితంలో చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు ఆరోగ్య పరంగా, విద్య పరంగా, వృత్తి పరంగా, వివాహ పరంగా, అప్పుల ఆర్థికంగా, సామాజికంగా, రోజు వారి కార్యక్రమాల పరంగా, వారి లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి.

వామతంత్రం ప్రకారం, జన్మకుండలిలో కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ బాధల నుండి, సమస్యల నుండి విముక్తి పొందాలంటే, “కాలసర్పయోగా నివృత్తి హోమం” తప్పక జరిపించాలి.  ఈ పరిహారం జరిపించడం వల్ల జాతకులకు ఉన్న దురదృష్టం దూరమయ్యి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ హోమం జరిపించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల జాతకులకు శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ కాలసర్పయోగ నివృత్తి హోమం చేసుకోవడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది.వ్యాపారంలో నష్టాలు చూసే వారు, వృత్తిపరంగా అపజయం పాలయ్యే వారు, దుష్ట శక్తులు, దుష్టుల నుండి దూరం కావాలనుకునేవారు ఈ కాలసర్ప శాంతి హోమం ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది.

 

జాతక పరిశీలన: 

జన్మకుండలిని పరిశీలించి ఆరూఢ పథం ద్వారా మరియు కేరళ జ్యోతిష్య నిఘూడ విధానాలా ద్వారా జాతకులకు భూత, భవిష్యత్, వర్తమానములలో జరిగే సంఘటనలీ, కలిగే యోగాలు, అవయోగములు, వారి ప్రాప్తించెడి బంధములు, ఆస్తులు పొందుట, పితృదోషము, వైవాహిక దోషములు, వాటి వలన కలిగే దుష్పరిణామాలు, గురు చండాల యోగము పరిశీలన, వాటి వలన కలిగే ప్రతికూల సంఘటనలు, వాటికి నివారణా మార్గాలు, వైవాహిక దోషం కారణంగా కలిగే వైధవ్య దోషములు, ఆలస్య వివాహ దోషములు, వాటికి పరిహారములు,ఆదాయ క్షయం, ఉద్యోగ అస్థిరత, ఉద్యోగం పొందలేకపోవడం, ఉన్న ఉద్యోగంలో సమస్యలు ధీర్ఘ కాలిక రోగముల వలన కలిగే శరీర బాధలకు గ్రహ దోష పరిహరాదులు, కేరళ తాంత్రిక విధానంలో ప్రైహారాలు తెలిపి, వాటికి పరిహరాదులు జాతకులకు నిర్వహించుట జరుగును. పితృదోషం వలన కలిగే అపశ్రుతులు, స్థిరస్తులు, పిత్రార్జితము కోల్పోవుట, స్వగృహ ప్రాప్తి, వాహన గండములు, వాటికి నివారణా మార్గములు, విద్యా హీనత, పరిష్కారములు, ఈ విధంగా జాతకుని యొక్క జీవిత విశేషములు గ్రహ స్థితులు, వాటి ఫలితములు, మొత్తం అన్నియూ క్షుణ్ణంగా పరిశీలించి తెలుపబడుతుంది. వ్యక్తుల జాతకపరిశీలన ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారములు ఖచ్చితముగా తెలుపగలము.

Related Articles: 

ph: 9846466430

సంపూర్ణ జాతక పరిశీలన- Complete Personal Horoscope Reading

email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.