సూర్యగ్రహణ సమయములో మండకాళి మహా యంత్ర పూజ

సూర్యగ్రహణ సమయములో మండకాళి మహా యంత్ర పూజ:

చాలా మంది దృష్టిలో గ్రహణం అంటే ఒక అశుభ సమయముగా భావిస్తారు. కానీ తాంత్రికవాదులకు, యోగసాధకులకు మాత్రం ఈ గ్రహణ సమయం ఎంతో అనుగ్రహము పొందే సమయముగా భావిస్తారు. సూర్యగ్రహణము వచ్చే సమయములో మండకాళి యంత్ర సాధన చేసిన వారికి కోరిన కోరికలు ఇట్టే తీరిపోతాయి. రోగాలు, ఋణములు, కష్టాలు, మానసిక వ్యాధులు, శారీరక  వ్యాధులు, తీవ్రమైన సమస్యలు తొలగిపోవాలంటే సూర్యగ్రహణ సమయములో మండకాళి యంత్ర పూజను చేయవలసి ఉంటుంది. రాజకీయాలలో ఉన్నత స్థానము పొందాలి అనుకున్నవారు, జనాకర్షణ సాధించుకోవాలి అనుకునేవారు, ఈ మండకాళి యంత్ర పూజకు మించిన అద్భుతమైన మార్గము మరొకటి ఉండదు. 

మండకాళి యంత్ర పూజకు కావల్సిన పూజా సామగ్రి:

  1. మండకాళి మహా యంత్రము
  2. తులసి జపమాల
  3. మండఫలము

గ్రహణము రోజు తెల్లవారుఝామున నిద్రలేచి తలస్నానము చేసి పూజకు సిద్ధము కావాలి. సూర్యోదయ సమయములో ఒక ఇత్తడి కప్పులో కుంకుమ, నెయ్యి, బియ్యము కలిపిన అక్షింతలు తయారు చేసి ఉంచుకోవాలి. మండకాళి యంత్రముకు  ఎర్రటి దారము చుట్టి ఒక ప్లేటులో పసుపుపచ్చ గుడ్డ వేసి దానిమీద ఆ  యంత్రమును ఉంచాలి. ఆ తరువాత యంత్రముకు పూలు, దీపా, ధూప,నైవేద్యాలు సమర్పించాలి. ఆ తరువాత ప్లేటులో ఉంచిన యంత్రముకు కుడిప్రక్కగా ఒక రాగి కప్పులో బియ్యము పోసి అందులో మండఫలము ఉంచాలి. ఆ తరువాత కుంకుమ అక్షితలు చేతిలో తీసుకొని గోత్ర నామములతో సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత సూర్యగ్రహణం ప్రారంభం అయిన రెండు గంటలలోగా తులసి మాలతో “ఓం ఐం మండరాయ సర్వ కార్యం సాధయే ఐం నమః”  అను మంత్ర జపము 5 మాలల జపము చేయాలి.(ఒక మాల =108 సార్లు మంత్ర జపము) . ఈ మంత్రము సిద్ధి పొందాలంటే మామూలు సమయములో 2,00,000 సార్లు చేయాలి. అదే గ్రహణ సమయములో చేసే ఈ మంత్ర, యంత్ర పూజ వలన కేవలము 540 సార్లు జపిస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది. పూజా జరుగుతున్నంతసేపు దీపము, ధూపము వెలుగుతూ ఉండాలి. గ్రహణము రోజు ఈ యంత్ర సాధన పూర్తి అయిన తరువాత ఆ మరుసటి రోజు ఆ మండకాళి మహా యంత్రమును, ఆ పూజా సామగ్రిని అన్నిటిని ఒక పసుపు పచ్చ వస్త్రములో మూట కట్టి ఆ మూటను నదిలో గాని, చేరువ్లో గాని వదలివేయాలి.

గ్రహణ సమయములో చేసే ఈ సాధన ఎంతో అత్యున్నత ఫలితములు పొందవచ్చు. కాకపోతే పూర్తి ఏకాగ్రతతో , భక్తి, శ్రద్ధలతో, స్వచ్చమైన మనస్సుతో పూజ చేయాలి.

మండకాళి యంత్ర సాధన విధి, మండకాళి మహా యంత్రము, ప్రాణ ప్రతిష్ట విధి,తులసి జపమాల  ఇవన్నీ శ్రీ C.V.S.చక్రపాణి గారి వద్ద నుండి పొందుటకు క్రింద ఇవ్వబడిన నంబర్లకు సంప్రదించండి.    

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

Leave a Reply