“సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)” – పితృదోషము:

బ్రహ్మపురాణం ఆధారంగా భాద్రపద మాసములో వచ్చే కృష్ణ పక్షమున మహాలయ పక్షము ప్రారంభం అవుతుంది. ఈ మహాలయ పక్షము 15 రోజుల పాటు ఉంటుంది. పక్షము అంటే 15 రోజులు. మహాలయ పక్షములో వచ్చే అమావాస్యని అనగా భాద్రపద మాస అమావాస్యని మహాలయ అమావాస్య అని, సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు. సర్వపితృ అమావాస్య నాడు పితృ దోషము ఉన్నవారు తమ పితృదేవతలకు శార్థ కర్మలు మరియు నారాయణ నాగబలి కార్యక్రమం తప్పక ఆచరించాలి, జరిపించాలి. ఈ బ్రహ్మ పురాణం ప్రకారం ఈ మహాలయ పక్షము రోజులలో యమధర్మరాజు యమలోకములో ఉన్న ఆత్మలందరికి ఆహారం తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తాడట. కావున మరణించిన వారి పిల్లలు లేదా వారసులు ఈ మహాలయ పక్షములో తమ పితృదేవతలకు పిండ ప్రధానం తప్పకుండా చేయాలి. ఎవరైతే తమ పితృదేవతలకు పిండప్రధానం చేయకుండా ఉంటారో, వారి పితృదేవతలు ఆకలి తీరక, తమ పిల్లలు లేదా వారసులపై ఆగ్రహముతో పక్షము రోజుల తరువాత తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారు.  కారణంగా పితృ దోషం ఏర్పడి తరువాత వచ్చే తరముకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టిన వారు అవుతారు. దీనినే పితృదోషముగా చెబుతారు. ఎవరైతే తమ పితృదేవతలకు ప్రతి సంవత్సరం పిండ ప్రధానం శ్రద్దగా నిర్వహిస్తారో, వారి పితృదేవతలు ఆకలి తీర్చుకుని వారి వారసులను ఆశీర్వదించి, ఆనందంగా తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారు.

         ఈ భూమిపై మానవునికి మరణం రెండు విధాలుగా సంభవిస్తుంది. 1.సహజ మరణం;  2. ఆకస్మిక మరణం. భగవంతుడు నిర్ణయించిన ఆయుర్దాయం ప్రకారం మరణం సంభవిస్తే అది సహజ మరణం అవుతుంది. ఆకస్మిక మరణములు ముఖ్యంగా పితృదోషం వలన కూడా సంభవిస్తాయి. ఈ ఆకస్మిక మరణములకు ఉదాహరణగా రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, హర్షద్ మెహతా, సుబాష్ చంద్ర బోస్, ప్రిన్స్ డయానా వీరందరూ కూడా పితృదోషం బారీనా పడిన వారే అని గుర్తించాలి.

పితృదోషము కలుగుటకు మరొక కారణము:

పితృదేవతలకు శ్రద్ధగా పిండ ప్రధానం చేయకపోతే వారికి మరియు వారి తరువాత తరాల వారికి పితృదోషం సంభవిస్తుంది అని ఇంతవరకు మనము చర్చించుకున్నాము. పితృదోషం కలుగటానికి మరొక కారణం గురించి కూడా మీకు వివరిస్తాను.

         పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన నేరములు, సరిదిద్దలేని తప్పులు, ఇతరుల మరణానికి కారణం అవటం, ఇతరుల బాధలకు కారణం అవటం, …. ఇలాంటి కార్యాలకు కారకులు అయి ఉంటే మరణించిన తరువాత మోక్షము లభించక, తమ తరువాత తరం వారికి (కొడుకు, మనుమడు,….) కూడా పితృదోషము కలిగించిన వారవుతారు.

         పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన తప్పిదములు, ఇప్పుడు తమ వారసులు అనుభవించాల్సి ఉంటుంది. దీనినే పితృదోషం, పితృ ఋణం అంటారు. జన్మకుండలిలోని గ్రహ సన్నివేశాల ద్వారా కూడా పితృదోష నిర్ధారన చేసుకోవచ్చు. ఈ అంశము గురించి ఇంతకు ముందే మీకు అందించాను. ఆ గ్రహముల సన్నివేశములు ఏమిటో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

mahalaya amavasya,pitrudosham
మహాలయ అమావాస్య

పితృదోషానికి గల కారణములు:

 • తెలిసిగాని, తెలియక గాని పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన చెడు కర్మలు, తప్పిదములు.
 • ప్రస్తుతం వారసులు చేసే తప్పిదములకు తమ పితృదేవతల ఆత్మ ప్రశాంతంగా ఉండకపోవటం
 • పితృదేవతల కోరికలు నెరవేరకపోవటం
 • ఆయుధముల వలన లేదా యాక్సిడెంట్ల వలన ఆకస్మిక అసహజ మరణం పొందిన వారసులకు పితృదోషం కలుగుతుంది.
 • వారసులు తమ పితృదేవతలకు శ్రార్ధ కర్మలు ఆచరించకపోవటం.
 • కొందరికి పితృదోషము ఉన్నట్టుగా జన్మకుండలిలో కనిపించదు. ఆకస్మిక ప్రమాదాల వలన చనిపోయిన వారి తండ్రి తరపున 7 తరముల వరకు, తల్లి తరపున 4 తరముల వరకు ఈ పితృదోషం వెంటాడుతుంది.
 • జన్మకుండలిలో రాహు కేతువులు పాప దృష్టి పొంది ఉన్నా, పితృ స్థానం శత్రుస్థానం అయినా, పితృ దోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. హైందవ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు కేతువుల వలన కలిగే పితృశాపమునకు రాహు ఎత్తువ్లా శాంతి, ప్రీతి హోమముల ద్వారా కూడా పితృదోష నివారణ జరుగుతుంది అని చెప్పవచ్చు.
 • భారతీయ సంఖ్యాశాస్త్రములో కూడా ఈ పితృదోషమునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక కుటుంబము తరచూ ఊహించని సమస్యలు ఎదుర్కోవడం లేదా భార్యా భర్తలకు పిల్లలు కలుగకపోవటం లేదా ఒకవేళ కలిగినా ఆరోగ్యంగా ఉండటకపోవటం లేదా మానసిక, శారీరక లోపాలతో జన్మించటం ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవి కూడా “పితృదోషం” వలననే అని గుర్తించాలి. ఇక్కడ చెప్పిన సమస్యలకు సంతనదోషం, సర్పశాపం…… ఇలా ఎన్నో దోషాల వలన కూడా ఈ సమస్యలు వస్తాయి. కాకపోతే పితృదోషం ఉన్నపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పటం జరుగుతోంది. ఏ దోష కారణంగా ఈ సంఘ్తనాలు జరుగుతున్నాయి అనేది కేవలం వారి వారి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలనలో మాత్రమే నిర్దరాన జరుగుతుంది.

పితృదోషము వలన కలిగే సమస్యలు ఏమిటి?

 • పితృదోషము ఉన్నవారి ఇంటిలో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి.
 • పితృదోషముతో బాధపడేవారికి వివాహ విషయములో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా, సరైన వయస్సుకు వివాహం జరుగదు.
 • పితృదోషం నుండి బాధపడేవారు అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు తీర్చలేరు.
 • పితృదోషము ఉన్నవారి కుటుంబములో ఒకరికి తరచూ ఒక పాము కలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమునకు చెందిన పితృదేవతలలో ఒకరు కలలో కనబడి ఆహారం లేదా బట్టలు కొరకు అడుగుతూ ఉంటారు.

పితృదోషముతో బాధపడేవారికి క్రింద ఇస్తున్న సంఘటనలలో కనీసం 4 నుండి 5 వరకు వారి జీవితములో తరచూ జరుగుతూ ఉండాలి. గమనించండి :

 • పితృదోషం ఉన్న వారు నివసించే ఇంటిలో కొత్త గోడలు అయినప్పటికి తొందరగా చీలికలు పడతాయి.
 • తరచూ వారి ఇంటిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోతూ ఉంటాయి.
 • చేతిలో నుండి ఆహారము తరచూ నేల పాలు అవుతూ ఉంటుంది.
 • ఎన్ని సార్లు సరి చేయించినా గోడలలో నీరు లీక్ అవుతూ ఉంటుంది. చీలికలు ఉన్న గోడలలో చనిపోయిన వారి ఆత్మలు ఉంటాయని కూడా చెప్పబడింది.
 • ఇతిలో తరచూ నీటి సమస్య, నీటి పంపు , కుళాయిల సమస్యలు వస్తూ ఉంటాయి. Plumber వచ్చి ఎన్ని సార్లు సరి చేసినా ప్రయోజనం ఉండదు.
 • చీమల మందులు, దోమల మందులు ఎన్ని వాడుతున్నప్పటికి ఇంటిలో చీమలు, దోమలు, బొద్దింకలు, చెదలు బెదడు తగ్గదు.
 • పితృదోషము ఉన్నవారికి, వ్యాపారములు చేస్తూ ఉంటే వారు తీవ్రమైన అప్పులలో కూరుకుపోతారు. అగ్నికి మరియు దొంగతనాల బరీనా పడుతూ ఉంటారు లేదా వారి వ్యాపారములు అకస్మాత్తుగా మూతపడిపోతాయి.
 • పితృదోషం ఉన్నవారి ఇంటిలోని పిల్లలు పెద్దలకు మరియు కుటుంబ సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. పిల్లలు మానసిక లేదా శారీరక లోపముతో జన్మిస్తారు.

 పితృదోష నివారణకు చేయవలసిన పరిహారములు:

 • పితృదోషము నివారణకు సరైన పరిహారము “నారాయణ నాగబలి” ఈ కార్యక్రమముతో పాటుగా కొన్ని పరిహారములు కూడా పాటించాలి.
 • త్రిపిండి శార్థమును ఆచరించాలి.
 • పితృదేవతలు చనిపోయిన మాస తిథులలో లేదా మహాలయ పక్షములో పిండప్రధానము చేయాలి.
 • ప్రతి అమావాస్యకి బ్రహ్మనుడికి అన్నదానం లేదా స్వయంపాకం ఇవ్వాలి.
 • ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున పుణ్యక్షేత్రములలో లేదా దేవాలయముల వద్ద ఆహార పధార్థములను అక్కడ భిక్షాటన చేసే వారికి పంచి పెట్టాలి.
 • సంపాదించే సంపదలో 5 శాతం అనాధలకు, పేదలకు దానము చేయాలి. 

ఈ పరిహారములు అన్నీ కాకుండా ముఖ్యంగా ఆచరించవలసిన పరిహారం “నారాయణ నాగబలిచేయటం వలన పితృదోష నివారణ కలుగుతుంది. పితృదోష పరిణామాలు తగ్గుముఖము పడతాయి.

         మహాలయ పక్షములో  పితృదోషము ఉన్నవారు “నారాయణ నాగబలి” జరిపించి పితృలకు శార్థము నిర్వహించినట్లైతే పితృదోష నివారణ కలుగుతుంది.

         ఈ మహాలయ పక్షములో అంటే ఈ 15 రోజులలో పితృదేవతలు తమ పిల్లలు లేదా వారసుల ఇంటికి ఏదో ఒక రూపములో వస్తారు. కావున ఈ మహాలయ పక్షములో ఇంటికి వచ్చిన ఎవరిని, దేనిని (జంతువులు, పక్షులు) నిర్లక్ష్యము చేయకుండా అప్పటి మీ శక్తిని బట్టి ఆహారము అందజేయాలి. 

         కావున పితృదేవతల ఆత్మ శాంతి కొరకు, వారికి విముక్తి లేదా మోక్షము కలుగుటకు వారసులు శార్ధ కర్మలు శ్రద్ధగా ఆచరించాలి. పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య తిథులలో మరణించిన వారి వారసులు మహాలయ పక్షములో వచ్చే “సర్వపితృ అమావాస్య” నాడు నారాయణ నాగబలి జరిపించి శార్ధము నిర్వహిస్తే ఆత్మశాంతి కలుగుతుంది. ఈ “సర్వపితృ అమావాస్య” నాడు జరిపించే “నారాయణ నాగబలి”, “మోక్ష నారాయణ బలి” మరియు “శార్ధ కర్మలు” చనిపోయినవారికి అంటే పితృదేవతలకు ఆకలి తీరి, శాంతి చేకూరి, తమ వారసులకు దీవెనలు అందించి వారి లోకాలకు తిరిగి వెళ్లిపోతారు.  

 

గమనిక:

అనేకానేక కారణాల వల్ల హైందవులు మరణించిన తమ సంబంధీకులకు శ్రార్ధ కర్మలను నిర్వహించని వారికి, నిర్వహించడం కుదరని వారికి, గతంలో వారి ఆత్మకు తృప్తినిచ్చే చేసిన శ్రార్థ కర్మలో ఏమైనా అపచారాలు ఉన్నాయని శంకిస్తున్న వారికి మరల్ ఆ శ్రార్థ కర్మను నిర్వహించడానికి ఉపకరించే తిథే సర్వపితృ అమావాస్య. ఈ తిథినందు కూడా, గతించిన తమ యొక్క పూర్వీకుల, గోత్రీకుల, రక్త సంబంధీకులకు శ్రార్థ కర్మలను చేయడం కుదరని వారికి బ్రహ్మతంత్ర పీఠం ద్వారా మోక్ష నారాయణ బలి పరిహారమును రుత్విక్కులచే జరిపించబడును.

జన్మకుండలిలో పితృదోషం ఉన్నవారికి మోక్ష నారాయణ బలి జరిపించుట వల్ల పితృదోషములు సంపూర్ణముగా తొలగి, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగును.

ఈ మహాలయ పక్షాల్లో ప్రతి ఒక్కరూ జరిపించవలసిన మంత్రం

‘ఊర్ద్వలోక పితృదేవతాభ్యో నమః

 

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: