loading

Category: Astrology

  • Home
  • Category: Astrology

పితృ దోష నివృత్తి హోమం

పితృ దోష నివృత్తి హోమం

పూర్వీకులు చేసిన చెడు కర్మల ఫలితాలను వారి వారసులు ఈ పితృ దోషం రూపములో ఫలితములు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే మనం పూర్వ జన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు అనగా ఈ జన్మలో అనుభవిస్తాము అని అర్థం. పితృదోషం ఉన్న జాతకులు ఆ దోష ప్రభావాన్ని పూర్తిగా అనుభవించి గాని, మంచి కార్యాలను చేస్తూ, ప్రాయశ్చిత్త పరిహారాలు చేయడం వల్ల గాని పితృ దోషం నివృత్తి అవుతుంది. ఈ ఐహిక ప్రపంచంలో పూర్వీకుల నుండి వంశపార పర్యంగా వచ్చే ఆస్తి, అంతస్తులను వారి వారసులు ఎలా అయితే తీసుకుంటున్నారో, అదే విధంగా వారి పూర్వీకులు చేసిన కర్మల ఫలితాలను కూడా స్వీకరించాల్సి ఉంటుంది.

         పూర్వీకులు చేసిన పాపముల వల్ల పితృ దోషం ఏర్పడుతుంది. జాతకుని జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల అయితే పితృ దోషం ఏర్పడిందో, ఆ గ్రహానికి సంబంధించిన అధి దేవతను ప్రార్థించి వేడుకోవాలి. పూజాది హోమ కార్యక్రమములు జరిపించాలి. ఆ విధంగా జరుపకుండా నిర్లక్ష్యం చేసినట్లైతే,  ఈ పితృ దోషం జాతకుని తరువాత వచ్చే తరాల వారి జన్మకుండలిలో కూడా పితృ దోషం కనబడుతూ, ఆ పితృ దోషం యొక్క ప్రభావాన్ని ఎదుర్కొని బాధలు పడాల్సి ఉంటుంది.

pitru dosha nivrutthi homam

 

         జన్మకుండలిలో 9వ భావంలో పైశాచిక గ్రహాలు ఉన్నప్పుడు గాని లేదా నవమాధిపతి శత్రు, నీచ స్థానంలో లేదా వక్ర స్థితిలో ఉన్నప్పుడు గాని జాతకునికి పితృ దోషం ఉన్నట్టు నిర్ధారించాలి. రవి, చంద్ర, గురు, శని, రాహు, కేతు, బుధ గ్రహాలు ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు, ఆ గ్రహాల శత్రు గ్రహాలతో కలసి ఉన్నప్పుడు గాని, లేదా వక్ర స్థానంలో ఉన్నప్పుడు గాని పితృ దోషమును జన్మకుండలిలో జ్యోతిష్యులు గుర్తిస్తారు. పితృదోషమును ప్రేరేపించడానికి కొన్ని లగ్నాలకు రవి, కుజ, శని గ్రహాలు యోగ కారకులుగా వ్యవహరిస్తాయి. జన్మకుండలిలో పితృదోషం ఉన్నట్టు ఎప్పుడైతే గుర్తిస్తారో, వెంటనే వామతంత్ర ఆచారంలో పితృదోష నివారణా హోమమును జరిపించుకొని, దోష నివృత్తి చేసుకోవాలి.

పితృదోషం- వాటి ప్రభావముల గురించి పూర్తి వివరణ, ఎలాంటి గ్రహ స్థితిగతుల వల్ల పితృదోషం ఏర్పడుతుందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు. 

పితృ దోషం వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి?

పితృదోషం ఉన్న జాతకులకు శరీరకంగా, మానసికంగా అనుకోని చెడు ప్రభావాలు పడతాయి. శారీరకంగా వైకల్యం రావడం లేదా వ్యాధి బారీన పడటం లాంటివి జరుగుతాయి. ఏదైనా వ్యాధి పారంపర్యంగా తరువాతి తరం వారికి రావడం లాంటివి జరుగుతాయి. పితృదోషం ఉన్న జాతకుల కుటుంబములోని వ్యక్తులు పదే పదే చేతబడి ప్రయోగానికి గురి అవుతూ ఉంటారు. కారణంగా ఆరోగ్యం నశిస్తుంది.

పితృదోషం- వాటి ప్రభావముల గురించి పూర్తి వివరణ, ఎలాంటి గ్రహ స్థితిగతుల వల్ల పితృదోషం ఏర్పడుతుందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు. 

చదువు, వృత్తి, ఉద్యోగం పరంగా ఎదురయ్యే సమస్యలు:

పితృదోషం ఉన్న జాతకులు ఎలాంటి పరీక్షల్లో అయినా ఫెయిల్ అవటం, పై చదువుల కొరకు ఎలాంటి ప్రోత్సాహం జాతకులకు లభించకపోవడం, చదువు పరంగా, వృత్తి పరంగా నిత్యం అపజయం పాలవటం, ఉద్యోగం స్థిరంగా ఉండకపోవడం, ప్రమోషన్లకు తీవ్రమైన ఆటంకాలు రావడం లాంటివి జరుగుతాయి.

పితృదోషం వల్ల భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడం, వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితం సాఫీగా లేకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం వల్ల అసంతృప్తి కలగడం, సంతాన సాఫల్యత లేకపోవడం, పదే పదే గర్భస్రావాలు జరగడం, చిన్నతనంలోనే సంతానం మరణించడం, గోత్రం వంశం కొనసాగించేందుకు పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య ప్రేమానుబంధం లేకపోవటం, వివాహేతర సంబంధాలు ఏర్పడటం, విడాకులు జరగడం లాంటి తీవ్రమైన సమస్యలు పితృ దోషం ఉన్న జాతకులకు ఎదురవుతాయి.

ఆర్థిక పరమైన సమస్యలు: 

ఆర్థిక పరమైన అభివృద్ధి లోపించడమే కాక, ఆర్థిక స్థిరత్వం ఉండదు. తీవ్రమైన అప్పులు ఎదురవడం వల్ల పేదరికం అనుభవించాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయాలలో ఎన్నో సమస్యలు వస్తాయి. డబ్బు రూపంలో వచ్చే లాభాలను చేతి దాకా వచ్చినా చేజార్చుకుంటారు. 

ముఖ్య గమనిక: జన్మకుండలిలో ఏ గ్రహం వలన పితృదోషం ఏర్పడినదో తెలుసుకోవాలి. ఎందుకనగా ఏ గ్రహం వల్ల అయితే పితృదోషం ఏర్పడినదో ఆ గ్రహ దశ, అంతర్దశ, గోచార సమయమలో ఆ దోష ప్రభావం జాతకుల పై పడి, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

పితృదోషం- వాటి ప్రభావముల గురించి పూర్తి వివరణ, ఎలాంటి గ్రహ స్థితిగతుల వల్ల పితృదోషం ఏర్పడుతుందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు. 

పరిహారం: 

పితృదోషం వల్ల ఇక్కడ వివరించిన సమస్యలు ఎదుర్కొంటున్న జాతకులు వెంటనే వామతంత్ర ఆచారం ప్రకారం పితృదోష నివృత్తి హోమమును ఖచ్చితంగా జరిపించుకోవాలి. ఈ పితృదోష నివృత్తి హోమమును జరిపిస్తే పితృదేవతలు తమ వారసుల పై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు. పితృదేవతలు తమ వారసులు నిర్వహించుకునే పనులలో విజయం సాధించుకునేందుకు పరోక్షంగా సహాయపడి వారికి విజయం చేకూరేలా అనుగ్రహిస్తారు. తత్కారణంగా పనులకు ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి విజయం లభిస్తుంది. వామతంత్ర ఆచారం ప్రకారం చేసీ పితృదోష నివృత్తి హోమము ఎంతో శక్తివంతమైనది. ఈ హోమం ఆరోగ్యపరమైన తీవ్ర సమస్యలను సైతం పారద్రోలుతుంది. ధీర్ఘ వ్యాధులు నుండి ఉపశమనం పొందుతారు.వ్యాపారంలో లాభాలు అమితంగా రావాలన్నా పితృదోషం ఉన్న జాతకులు ఈ పితృదోష నివృత్తి హోమమును తప్పక జరిపించాలి.    

Related Articles:

సంపూర్ణ జాతక పరిశీలన

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. 

జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 98464666430

whatsappwa.me/919846466430

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

కాలసర్పయోగ నివృత్తి హోమం

                      కాలసర్పయోగ నివృత్తి హోమం

కాలసర్పయోగం అంటే ఏమిటి?

జన్మకుండలిలో రాహువు మరియు కేతువు ఉన్న రాశుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహములు, అనగా రవి,చంద్ర, శని, కుజ, శుక్ర, బుధ, గురు గ్రహములు ఇమిడి ఉన్నట్లైతే ఈ కాలసర్ప యోగం ప్రాప్తిస్తుంది. ఎవరి జాతకంలో అయితే ఈ కాలసర్ప యోగం ఉంటుందో, ఆ జాతకులు తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు చూడాల్సి ఉంటుంది. తమ తమ రంగాలలో గొప్ప స్థాయికి చేరుకోడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులకు తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎంత కష్టపడినా సరే, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు.

                 కాలసర్ప యోగం ఉన్న అందరికీ ఒకే రకమైన ప్రభావాలు కనబడవు. కొన్ని సార్లు జన్మకుండలిలోని బలమైన గ్రహాలు, స్థానాల వల్ల కూడా జాతకునికి కాలసర్పయోగ ప్రభావం అంత ఎక్కువగా కనిపించదు. కాబట్టి, అలాంటి జాతకులు కాలసర్పయోగం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికి ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని సలహా మేరకు ఆలస్యం చేయకుండా పరిహార కార్యక్రమాలు జరిపించుకోవాలి.

కాలసర్పయోగం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయా?

         కాలసర్పయోగం ఉన్న ఎంతో మంది జాతకులు ధనం, పేరు, ప్రతిష్ట, అధికారం లాంటివి ఏర్పడి ఎంతో పై స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ గొప్ప స్థాయికి చేరుకోవడానికి వారికి కూడా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడి ఉంటాయి. భగవత్ ధ్యానంతో, ఆత్మ స్థైర్యంతో కృషి చేస్తూ శిఖరాన్ని చేరుకోవాలి. అయితే కాలసర్పదోషానికి ప్రాయశ్చిత్త, పరిహారాలు జరిపించిన యెడల, వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుంది.

kalasarpa yogam

కాలసర్పయోగం వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడతాయి?

కాలసర్పయోగం వల్ల ఎన్నో సమస్యలు, అనుకోని సంఘటనలు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలసర్పయోగం ఉన్న జాతకులకు ఆరోగ్య రీత్యా యోగ ప్రభావం పడుతుంది. శారీరకంగా వ్యాధుల బారీన పడి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. మనఃశాంతి లేకపోవడం, జ్ఞాపకశక్తి మరియు పట్టుదల లేకపోవడం, అనవసరమైన ఒత్తిళ్ళకు లోనవడం, భాద్యతారాహిత్యంగా వ్యవహరించడం, జ్ఞానం లోపించడం, వ్యక్తిత్వ లోపాలు ఉండటం, ఆలోచనాశక్తి తక్కువగా ఉండటం జరుగుతాయి. దీనివల్ల జాతకుడు మానసిక స్థిరత్వం ఉండదు. దీనివల్ల వ్యక్తిగతంగా వారి సన్నిహితులతో సరైన బంధం కొనసాగించక బాధలు పడతారు. ఈ కాలసర్పయోగం వల్ల నిరంతరంగా శారీరక అనారోగ్యాలు లేదా వ్యాధులు ఏర్పడటమే కాకుండా, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వటం జరుగుతుంది.

పన్నెండు రకాల కాలసర్పయోగాలు ఏమిటో, వాటి వల్ల జాతకులు ఎదుర్కొనే ఫలితాలు ఎలాంటివో ఈ లింకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

ఇక విద్యా, వృత్తి విషయాలకు వస్తే ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం, మంచి విద్యను నేర్చుకోలేకపోవటం, స్కూలుకు గాని, కాలేజీకి గాని, విశ్వవిద్యాలయానికి గాని ఒక కొత్త విద్య కొరకు చేరలేకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ కాలసర్పయోగం జాతకులకు పై చదువులు చదవాలన్న శ్రద్ధ లేకుండా ఉండటానికి కూడా ఈ యోగం కారణం అవుతుంది. చదువులో, చేసే వృత్తిలో నిరంతర విఫలం పొందడం కూడా ఈ కాలసర్పయోగం వల్ల జరుగుతుంది. ఈ యోగం ఉన్న జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఉద్యోగం కూడా నష్టపోయే అవకాశాలు రాక మానవు.

ఈ కాలసర్ప యోగం ఉన్న వారు ప్రేమ వ్యవహారాలలో విఫలం అవ్వటం, ప్రాణ స్నేహితుని చేతిలో గాని, భాగస్వామి చేతిలో గాని, భార్య/భర్త చేతిలో గాని మోసపోవటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో, ఆప్తులతో ఉన్న బంధం పై ఈ యోగ ప్రభావం పడుతుంది. వివాహం ఆలస్యంగా జరగడం, వైవాహిక జీవితం సాఫీగా ఉండకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం, వంధ్యత్వం (సంతాన లేమి), పదే పదే రక్తస్రావాలు జరగటం, పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, విడాకులు జరగడం లాంటి దుర్ఘటనలు ఈ కాలసర్ప యోగం వల్ల సంభవిస్తాయి.

ఈ కాలసర్ప యోగం వల్ల ఆర్థికపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, జాతకుడిని పేదవాడు అయ్యేలా చేసే తీవ్రమైన అధిక ఋణాలు, వ్యాపారంలో అడ్డంకులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులలో ఆటంకాలు వస్తాయి.

ఈ కాలసర్పయోగం వల్ల ప్రభావితులైన వారు, తమ జీవితంలో చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు ఆరోగ్య పరంగా, విద్య పరంగా, వృత్తి పరంగా, వివాహ పరంగా, అప్పుల ఆర్థికంగా, సామాజికంగా, రోజు వారి కార్యక్రమాల పరంగా, వారి లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి.

వామతంత్రం ప్రకారం, జన్మకుండలిలో కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ బాధల నుండి, సమస్యల నుండి విముక్తి పొందాలంటే, “కాలసర్పయోగా నివృత్తి హోమం” తప్పక జరిపించాలి.  ఈ పరిహారం జరిపించడం వల్ల జాతకులకు ఉన్న దురదృష్టం దూరమయ్యి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ హోమం జరిపించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల జాతకులకు శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ కాలసర్పయోగ నివృత్తి హోమం చేసుకోవడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది.వ్యాపారంలో నష్టాలు చూసే వారు, వృత్తిపరంగా అపజయం పాలయ్యే వారు, దుష్ట శక్తులు, దుష్టుల నుండి దూరం కావాలనుకునేవారు ఈ కాలసర్ప శాంతి హోమం ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది.

పన్నెండు రకాల కాలసర్పయోగాలు ఏమిటో, వాటి వల్ల జాతకులు ఎదుర్కొనే ఫలితాలు ఎలాంటివో ఈ లింకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు పోస్టల్ మరియు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com 

                              ఓం నమో నాగరాజాయ నమః

Related articles:

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Yoga

12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Dosha

మానవ జీవితములపై ప్రభావాన్ని చూపించే ప్రధాన గ్రహాలైన రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ , శని అను ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు మరియు కేతువు మధ్య చిక్కుకొని ఉన్నవారికి ఆ పరిస్థితిని కాలసర్పదోషం అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మకుండలిలోని ఆరు స్థానాలలో ఏ గ్రహాలచేత ఆక్రమించబడకుండా ఉంటాయో అట్టి స్థితిని సంపూర్ణ కాలసర్ప యోగం అంటారు. కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం మానవుల జీవితాలలో ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి. మనిషి తాను చేసే కార్యాలకు తగిన ఫలితాన్ని పొందలేదు. కొందరికి కాలసర్పదోషం ఉన్న స్త్రీ, పురుషులకు వివాహం కాకపోవటం, సంతానం కలుగకపోవటం, వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవటం, తరచూ కోర్టు కేసులలో లేదా తగాదలలో ఇరుక్కోవటం తరచుగా బంధువులతో శతృత్వాన్ని పొందటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటం జరుగుతుంది. మనిషికి కావలసిన అదృష్టాన్ని అడ్డగించటములో కాలసర్పదోషం పోషించే పాత్ర ఎంతో ఉంటుంది. కాలసర్పదోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడులతో సంబంధం లేదు. ధనిక, పేద తేడా లేకుండా ఈ కాలసర్పదోష ప్రభావానికి గురి కావలసి ఉంటుంది. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములో ఉత్కంఠను , ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. హైందవ జ్యోతిష్యశాస్త్రములో ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ అతి తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కో రకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయస్సు వరకు ప్రభావం ఉంటుంది. కొన్ని కాలసర్పదోషములు మాత్రం మనిషి మరణించేంత వరకు దాని ప్రభావం చూపుతుంది. కలసర్పదోషాలు 12 రకములు. అవి ఏమిటో తెలుసుకుందాము.

kalasarpa dosham in telugu

 

  1. అనంత కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు లగ్నములో మరియు కేతువు సప్తమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి “అనంత కాలసర్ప దోషం” ఉన్నట్టు గుర్తించాలి. ఈ అనంత కాలసర్ప దోషం వలన బాధపడేవారు తరచుగా అవమానములు ఎదుర్కోవటం , ఆందోళనలకు గురి కావటం జరుగుతుంది. వీరిలో న్యూనత భావం ఎక్కువగా ఉంటుంది. ఇక కోర్టు సంబంధిత విషయాలకు వస్తే వీరు విసుగు కల్పించే , ఎంతో కాలముగా పూర్తి కానీ కేసులు ఉంటాయి. వీరి ఆరోగ్యము కూడా తరచూ బాధకరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఈ అనంతకాలసర్ప దోషం ఉన్నవారు మానసికంగా మరియు శరీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. (అనంత కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి). 
  2. కులికా కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు ద్వీతీయ భావములో మరియు కేతువు అష్టమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి కులికా కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ రకమైన కాలసర్పదోషం ఉన్నవారు ధనాన్ని నష్టపోవటం , ప్రమాదాల వలన నష్టపోవటం జరుగుతుంది. వీరి కుటుంబములో తగాదాలు, నరాల బలహీనత, మూర్చలు లాంటి సమస్యలు వస్తాయి. కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు.ఈ కాలసర్పదోషం అనుభవిస్తున్న వారు వారి మాటలను ఎంతో అదుపులో ఉంచుకోవాలి. వీరి మాటలు ఇతరులను సులభంగా బాధిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. కుటుంబ సభ్యులలో మరియు సమాజములో వీరికి ఉన్న గౌరవము పోయే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఆర్థిక పరిస్తితి నిలదోక్కుకోవటం కోసం ఎంతో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఈ కాలసర్పదోషం ఉన్నవారు సహజంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొంతుకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చు.(కులికా కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
    కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు
  3. వాసుకి కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే మూడవ స్థానములో రాహువు మరియు తొమ్మిదవ స్థానములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నట్లైతే వారికి వాసుకి కాలసర్పదోషం ఉందని గుర్తించాలి. ఈ కాలసర్పదోషంతో భాడపడేవారు సోదరుల కారణంగా లేదా అక్కాచెల్లెళ్ల కారణంగా నష్టపోవటం జరుగుతుంది. వీరు బంధువుల వలన కలిగే చిక్కులవలన గాని, రక్త సంబంధమైన సమస్యల వలన గాని, ఆకస్మిక మృతి పొందే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ జీవితములో సమస్యలు ఎదుర్కొంటారు. వీరి అదృష్టము ఎక్కువగా ఉండదు. స్నేహితుల వలన లేదా బంధువుల వలన మోసపోతారు. వ్యాపారములో, వ్యాపార భాగస్వాములతో నష్టాలు ఎదురయ్యి సమస్యలు ఎదుర్కొంటారు.  ఈ దోషం ఉన్న వారు సమస్యల వలన సతమతం అయ్యి ఆ ఆందోళనలో వీరు చేసే పనుల వలన ఇంకా సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరులు వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందరూ వీరిని మోసగించాలనే చూస్తారు. రాహు లేదా కేతు మహా దశలో వీరు దూర ప్రయాణములు చేయుట మంచిది కాదు.(వాసుకి కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  4. శంఖపాల కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు నాలుగవ భావములో మరియు కేతువు దశమ భావములో ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి శంఖపాల కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. ఈ దోషం ఉన్న వారికి వారి తండ్రి నుండి ప్రేమ లభించదు. వీరు అతి శ్రమలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. తరచుగా వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.  వీరి జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో హీనమైన పరిస్థితులలో మరణించటం జరుగుతుంది. వీరికి దేనిమీద సరైన ధ్యాస (Concentration)  ఉండదనే చెప్పాలి. ఉదాహరణకి తదేక ధ్యాస పెట్టె డ్రైవింగ్ లాంటి వాటిపై వీరికి పట్టు ఉండదు కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. ముఖ్యంగా వీరి తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ సరైన బాంధవ్యము ఉండదు. కొందరికి వీరు నివశిస్తున్న ఇంటిలో వాస్తు దోషములు కూడా ఏర్పడవచ్చు. హుద్రోగములు, ఛాతీ, ఊపిరితిత్తులకు వ్యాధులు రావచ్చు. పై అధికారులతో పేచీలు ఉంటాయి. ప్రోమోషన్లు రాక ఇబ్బందుల పాలవుతారు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి(శంఖపాల కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  5. పద్మ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే పంచమ భావములో రాహువు మరియు ఏకాదశ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు పద్మ కాలసర్ప దోషము నుండి బాధపడుతున్నట్టు గుర్తించాలి. ఇలాంటి జాతకులు చదువులో వెనుకబడటం జరుగుతుంది.జీవిత భాగస్వామికి తరచూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సంతాన భాగ్యమును పోందలేకపోవటం , స్నేహితుల వలన వంచింపబడటం జరుగుతుంది. చదువు పరంగా వెనుకబడి ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో, వ్యాపారాలలో, మార్కెట్ పరంగా వీటన్నింటిలో వీరికి అదృష్టము ఉండదు. కొందరికి సంతాన పరంగా ఆలస్యము ఉంటుంది. ప్రేమ వ్యవహారములో మరియు వైవాహిక జీవితములో సమస్యలు ఉంటాయి.  కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండదు.(పద్మ కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  6. మహా పద్మ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే 6వ స్థానములో రాహువు మరియు 12వ స్థానములో కేతువు ఉంది మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి మహాపద్మ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ కాలసర్పదోషం ఉన్నవారికి వెన్నుముక ప్రారంభములో నెప్పులను, తలనొప్పులను, చర్మ వ్యాధులను కలిగి ఉంటారు. అంతేకాకుండా తరచుగా ఆస్తుల నష్టం జరుగుతుంది. వీరిపై తంత్ర ప్రయోగములు సులభముగా జరగగలవు. మామూలుగా ఇలాంటి జాతకులు విదేశాలలో ఉంటూ కుటుంబములో ఆశాంతి కలిగి ఉంటుంది. స్వయంకృత అపరాధల వలన వీరు మోసపోతారు. మానసిక రుగ్మత (డిప్రెషన్) , ఇతరుల పట్ల ద్వేషము, చేసే వృత్తి నుండి తేసివేయుట జరుగవచ్చు.(మహాపద్మ కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి). కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు
  7. తక్షక కాలసర్పయోగం : ఎవరి జన్మకుండలిలో అయితే సప్తమ భావములో రాహువు మరియు లగ్నములో కేతువు ఉన్నట్లైతే వారికి తక్షక కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు నీచంగా ప్రవర్తించే వారిచేత అనేక రకాల బాధలు పొందవలసి ఉంటుంది. వీరు వ్యాపారములో నష్టపోవటం, అసంతృప్తితో బాధపడటం, వైవాహిక సుఖమును పోందలేకపోవటం జరుగుతాయి. ప్రమాదములు జరుగుతాయి. ఈ దోషము ఉన్నవారు ముఖ్యంగా శారీరక లక్షణములు వ్యతిరేకంగా ఉంటాయి. సహజ పొడుగు, బరువు కాకుండా వ్యతిరేకంగా ఉంటారు. శారీరక లక్షనాలే కాకుండా మానసిక లక్షణాలు కూడా వీరికి సరిగా ఉండవు. ఇతరులతో పోలిస్తే ఈ దోషం ఉన్న వారికి బుద్ధి కుశలత ఉండకపోవడం గమించవలసిన విషయం. నరముల బలహీనత కలుగుతుంది. సమస్యలను తట్టుకోలేక ఈ దోషము ఉన్నవారిలో కొందరు ఉన్మాది స్వభావము వారి వలె ప్రవర్తిస్తారు. వివాహేతర సంబంధములు చిక్కులు కలుగచేస్తాయి.(తక్షక కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  8. కర్కోటక కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే అష్టమ భావములో రాహువు మరియు ద్వీతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు పూర్వీకుల ఆస్తులు అన్నీ కోల్పోతారు. శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు. విషపూరితమైన సర్పాల వలన గాని లేదా కీటకలా వలన గాని ప్రమాదములు పొందవచ్చు. కుటుంబములో అనేక సమస్యలు కలుగవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక నష్టము జరుగుతుంది. ఎటువంటి సహాయము పొందలేని వారు అవుతారు. యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు దురయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషన్ పరంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోగలరు.(కర్కోటక కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  9. శంఖచూడ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే నవమ భావములో రాహువు మరియు తృతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శంఖ చూడ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. మతానికి వ్యతిరేకమైన కార్యకలాపములు జరుపుటకు సిద్ధపడతారు. హై బి.పి. , నిరంతర ఆలోచనలు ఉంటాయి. ఈ దోషం ఉన్న వారికి జీవితములో పైకి ఎదగడం ఎంత సులభమో , క్రిందకి జారిపోవటం కూడా అంతే సులభం. జీవితములో వీరికి ఏది సులభంగా దొరకదు. చేసే ప్రొఫెషన్ లో స్థిరత్వం కోల్పోతారు. ఈ దోషం ఉన్నవారికి, వీరి తండ్రికి భేదాభిప్రాయములు వస్తాయి. వీరికి పితృశాపము కూడా ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషంతో ఉన్నవారికి ఎవరిని నమ్మాలో తెలియక అన్నీ చోటల ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లవచ్చు. లీగల్ విషయాలలో ఎన్నో ఇబ్బందులు కలుగవచ్చు.(శంఖాచూడ కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  10. పాతక కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే దశమ భావములో రాహువ్ మరియు చతుర్థ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి పాతక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు కుటిల స్వభావము కలిగి ఇతరులకు ద్రోహము చేయుటకు పాల్పడతారు. ఈ దోషం ఉన్నవారి ఇళ్ళల్లో దొంగతనాలు జరుగుతాయి. పైశాచిక పీడ ఎక్కువగా ఉంటుంది. లో బి.పి సమస్య ఉంటుంది. ఈ దోషం ఉన్న వ్యాపారస్తులు ఒకే వ్యాపారం చేయటం వలన ఎక్కువ నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా అనిపించడం లాంటి మానసిక ఆందోళనలు కలిగి ఉంటారు.(పాతక కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  11. విషధార్ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే ఏకాదశ భావములో రాహువు మరియు 5వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నత్లితే వారికి విషధార్ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. సోదరులతో విబేధాలు కలుగవచ్చు. చపల మనస్తత్వం కలిగి ఉంటారు. సంతాన పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కారాగార శిక్ష అనుభవించే సూచనలు రావచ్చు. నిద్రలేమి, కంటి సమస్యలు, హృదయ సమస్యలు రావచ్చు. పై చదువులు చదువుకోవాలంటే చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. సంతానము ఆలస్యముగా కలుగవచ్చు. కొంత డబ్బు కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేయవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది.(విషధార కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).
  12. శేషనాగ కాలసర్పయోగం: ఎవరి జన్మకుండలిలో అయితే ద్వాదశ భావములో రాహువు మరియు 6వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శేషనాగ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. తరచూ ఓటమికి గురి అవుతూ ఉంటారు. దురదృష్టం వీరిని వెంటాడుతూ ఉంటుంది. రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు. నేత్ర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.(శేషనాగ కాలసర్ప దోషం గురించి సవివరంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి).

కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు

ఈ విధంగా మానవ జీవితాలను అల్లకల్లోలం చేసే ఈ కాలసర్ప దోషాలను తగిన జ్యోతిష్య సంబంధమైన పరిహారాలతో నివారణ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే జాతకులు తమ జీవితములో వెలుగును చూడగలరు. అద్భుతమైన మహత్యాలను ప్రదర్శిస్తున్న కేరళ రాష్ట్రములోని సర్ప క్షేత్రములలో సర్ప పరిహారములు జరిపించుకున్న యెడల కాలసర్పశాంతి జరిగి ఈ కాలసర్ప దోషం వలన కలిగే బాధల నుండి విముక్తి పొందవచ్చు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన కొరకు ఈ లింకును క్లిక్ చేయగలరు. 

ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు పోస్టల్ మరియు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com 

                              ఓం నమో నాగరాజాయ నమః

NAGASHAKTHI Telugu Book

Related Articles:

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

జాతక పరిశీలన- Horoscope Reading

జన్మకుండలి పరిశీలన

జన్మకుండలిలో అదృష్టాన్ని కలిగించే యోగాలు, దురదృష్టాన్ని కలిగించే అవయోగాలు, జాతకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానం,వాటికి పరిహార మరియు పరిష్కార మార్గాలు తెలుసుకునే విధానం. జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Horoscope reading in telugu

 

యోగాలు-అవయోగాలు:

జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ కర్మలు; స్వగృహ యోగం; సుఖ వాహన యోగం; సంతాన యోగం; విద్యా యోగం; వివాహ యోగం; విదేశీయాన యోగం; విదేశీ ఉద్యోగ యోగం; విదేశీ నివాస యోగం; ప్రణయ సఫలీకృత యోగం (ప్రేమ వ్యవహారాలు); శృంగార యోగం; పదవీ యోగం; వ్యాపార యోగం; వైవాహిక ఆనంద యోగం; దుర్మరణ అవయోగం; బలవన్మరణ అవయోగం; స్త్రీ మూలక విచార అవయోగం; స్త్రీ మూలక ధన ప్రాప్తి యోగం; నష్టద్రవ్య ప్రాప్తి యోగం; అదృష్ట యోగం; ఆయుః క్షీణ యోగం; పూర్ణాయుర్దాయ యోగం; దైవకృప సిద్ధి యోగం; దైవశాపం; స్త్రీ శాపం; మాతృ శాపం; పితృ శాపం; గురు శాపం; నాగ శాపం; పక్షి శాపం; బ్రాహ్మణ శాపం; మాతృ శాప అరిష్ట యోగములు; భూ చరాస్తి యోగం; అనుకూల దాంపత్య యోగం; వాహన ప్రయాణ క్షేమ యోగం; వాహన దుర్ఘటన యోగం; ఇలా మొదలైన యోగములు, అవయోగములు వలన జాతకులు పొందే ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందాలు పొందుటకు ఉపకరించే గ్రహాల గ్రహ స్థితులను, యోగాలను పొందుటకు అడ్డుపడే గ్రహాల చెడు లక్షణాల స్థితిగతులను జన్మకుండలి యొక్క పరిశీలన (జాతక పరిశీలన) ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో ప్రతి సమస్యకు పరిహారం ఉంటుంది. జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

ఈ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, పుట్టిన సమయం వివరాలు ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేసి సంపూర్ణ గ్రహదోషాలు, యోగాలు, అవయోగాలు, పరిహారాలతో సహా రాసి 7 రోజుల లోపు కొరియర్ ద్వారా పంపబడుతుంది. సంభావన 1500/-. వివరాల కొరకు 9846466430 నెంబరుకు కాల్ చేసి కనుక్కోవచ్చు.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

 

ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?

ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?

  1. పేరు ప్రతిష్టల కొరకు, సుఖ భోగాల కొరకు, సంపద భాగ్యము కొరకు, మోక్షము కొరకు “శ్రీ యంత్రమును” పూజించాలి.
  2. ధనము, ధాన్యము, కార్య సిద్ధి కలుగుట కొరకు, కార్యము నిర్విఘ్నముగా జరుగుట కొరకు “శ్రీ మహాలక్ష్మి యంత్రము” పూజించాలి.
  3. ధనవంతులు కావటానికి, సంపాదించిన ధనము నిలవడానికి “శ్రీ మహా కుబేర యంత్రము”ను పూజించాలి.
  4. వ్యాపారములో అభివృద్ధి కలుగుటకు, నెమ్మదిగా జరుగుతున్న వ్యాపారములు సాఫీగా సాగుట కొరకు “గణేశ లక్ష్మి మహా యంత్రము లేదా వ్యాపార వృద్ధి మహా యంత్రము”ను పూజించాలి.
  5. భక్తి మార్గమును మొదలు పెట్టేందుకు, మంచి భవిష్యత్తును ఇచ్చే పనులు నిర్వహించేటపుడు, ధన సమృద్ధి మరియు కార్య సిద్ధి జరుగుట కొరకు “గణేశ యంత్రము”ను పూజించాలి.
  6. ఆరోగ్యము మెరుగుపడేందుకు, అకాల మరణ గండములు తొలగించుకునేందుకు, వ్యాధి తీవ్రత తగ్గెందుకు “మహా మృత్యుంజయ యంత్రము”ను  పూజించాలి.
  7. yantras benefits telugu astrologyసూర్య దేవుని ప్రార్థించేందుకు, సూర్య దేవుని మహిమ మనపై కలిగేందుకు, మనలో తేజస్సు పెంపొందించుకునేందుకు, ప్రపంచమును సాధించేందుకు “సూర్య యంత్రము”ను పూజించాలి.
  8. తొమ్మిది గ్రహములను శాంతపరచుటకు, మనఃశాంతి, సుఖములు పొందుటకు నవగ్రహ మహా యంత్రమును పూజించాలి.
    ఏదైనా అభ్యాసము నేర్చుకొని పూర్తి చేసేందుకు, జ్ఞానము, వివేకము కలుగుటకు, దేవునిపై భక్తి శ్రద్ధలు చూపించుటకు “హనుమాన్ యంత్రము”ను పూజించాలి.
  9. బాధలు, కష్టాల నుండి విముక్తి పొంది శ్రీ దుర్గాదేవిని ధ్యానించుట కొరకు దుర్గా మహా యంత్రమును పూజించాలి.
    శత్రువులు నాశనము కావటానికి, కోర్టు కేసులలో విజయం పొందడానికి, క్రీడా పోటీలలో గెలవటం కొరకు “బగలాముఖి మహా యంత్రము”ను పూజించాలి.
  10. మహాశక్తి మరియు మహాకాళిని ధాన్యం చేసి కోరిన కోర్కెలు తీర్చే సాధన కొరకు “మహాకాళి మహా యంత్రము”ను పూజించాలి.
  11. అకాలమరణ గండముల నుండి తప్పించుకునేందుకు , శత్రు నాశనము కొరకు “బటుక భైరవ మహా యంత్రము”ను పూజించాలి.
  12. చెడు దృష్టి, ప్రేతాత్మల నుండి తప్పించుకొనుటకు, అన్నీ చోటల విజయము, అభివృద్ధి సాధించుట కొరకు “దుర్గా బిస మహా యంత్రము”ను పూజించాలి.
  13. చదువులలో, లలితకళలలో జ్ఞానము పొంది అభివృద్ధి గాంచుటకు, ఏదైనా అభ్యాసము పూర్తి చేసేందుకు “సరస్వతి మహా యంత్రము”ను  పూజించాలి.
  14. మన మనస్సును పవిత్రము చేసి పరిశుభ్రం చేసేందుకు, జీవితములో మంచి అభివృద్ధి సాధించేందుకు “సరస్వతి మహా యంత్రము”ను పూజించాలి.
  15. ఒక వ్యక్తిని మనము చెప్పిన మాట వినేలా, ఆ వ్యక్తిని పూర్తిగా మన ఆధీనములో ఉండేట్టుగా చేసేందుకు “వశీకరణ మహా యంత్రము”ను పూజించాలి.
  16. సంతానము లేని వారు సంతాన ప్రాప్తి పొందేందుకు “సంతాన గోపాల యంత్రము”ను పూజించాలి.
  17. శ్రీ మహా విష్ణువు యొక్క అనుగ్రహము పొందుటకు “మహాసుదర్శన యంత్రము”ను  పూజించాలి.
  18. శ్రీ రాముని పూజించేందుకు, కోరిన కోరికలు విజయవంతం కావటం కొరకు “శ్రీ రామ రక్షా మహా యంత్రము”ను పూజించాలి.
  19. నవగ్రహాల నుండి వచ్చే అశుభ ప్రభావాలు తొలగించుకునేందుకు, కాలసర్ప యోగ ప్రభావము తగ్గించుకునేందుకు “కాలసర్ప యంత్రము”ను పూజించాలి.
  20. ఇతరులు మనకు సులభముగా వశ్యము అయ్యే వ్యక్తిత్వము సాధించి అందరినీ తాను చెప్పినట్టు వినేలా చేసుకొనుటకు “శ్రీ భువనేశ్వరి యంత్రము”ను పూజించాలి.
  21. ఆధ్యాత్మిక చింతననను పెంపొందించుకోవడానికి మరియు అన్నింటా విజయము సాధించుట కొరకు “ధూమవతి యంత్రము”ను పూజించాలి.
  22. అధ్యాత్మికత్వములో మరియు ఆశయాలలో అభివృద్ధి కనుబడుట కోసం “కమలా దేవి మహా యంత్రము”ను పూజించాలి.
  23. వ్యాపారములో మరియు ఆరోగ్యములో అదృష్టము కలసి రావటానికి, కుజుని చెడు ఫలితాలు మనపై చూపించకుండా ఉండడానికి (జన్మకుండలిలో కుజుడు చెడు స్థానములో ఉన్నప్పుడు) “మంగళ యంత్రము”ను పూజించాలి.
  24. వాక్ శక్తి, అమోఘమైన శక్తులు పొందడానికి , కుటుంబ జీవితములో సంతోషము కలుగటానికి “మాతంగి యంత్రము”ను పూజించాలి.
  25. జన్మకుండలిలో రాహువు చెడు స్థానములో ఉండి , చెడు ఫలితాలను అందజేసినపుడు ఆ చెడు ఫలితాల ప్రభావం తగ్గించుకునేందుకు “రాహు గ్రహ మహా యంత్రము”ను పూజించాలి.
  26. రాజయోగమును పొందుటకు మరియు శని దేవుని నుండి చెడు ఫలిత ప్రభావమును తగ్గించుకునేందుకు “శని గ్రహ మహా యంత్రము”ను పూజించాలి.
  27. మరణ భయము తొలగిపోవడానికి, శ్మశాన అపాయములు తొలగిపోవడానికి, ప్రాణాంతకమైన వ్యాధుల నుండి తప్పించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి “శ్రీ శివ మహా యంత్రము”ను పూజించాలి.
  28. జీవితములో భాగ్యము పొందడానికి మరియు సంపాదించడానికి “తారా మహా యంత్రము”ను పూజించాలి.
  29. జన్మకుండలిలో ఉన్న బలహీనమైన గురువును బలోపేతము చేసి సంపద, అధికారము, ఆధిపత్యము, పుష్కలత సాధించడానికి “గురు గ్రహ మహా యంత్రము”ను పూజించాలి.
  30. జన్మకుండలిలో అశుభ స్థానములో ఉన్న శుక్రుని వ్యతిరేక ఫలితాల నుండి తప్పించుకొని గౌరవము పెంపొందించుకునేందుకు, భార్య లేదా భర్త నుండి ప్రేమ సాధించుకునేందుకు , మనఃశాంతి కొరకు “శుక్ర గ్రహ మహా యంత్రము”ను పూజించాలి.
  31. జన్మకుండలిలో కేతు గ్రహము అశుభ స్థానములో ఉంటూ ఆ ప్రభావములు తగ్గించుకునేందుకు మరియు అన్నింటా విజయము సాధించేందుకు “కేతుగ్రహ మహా యంత్రము”ను పూజించాలి.
  32. జన్మకుండలిలో చంద్రుడు వ్యతిరేక స్థానములో ఉన్నప్పుడూ ఆ చంద్రుని నుండి వచ్చే వ్యతిరేక ఫలితాలను అడ్డుకొని, గౌరవము స్నేహము సంపాదించుకుని, ప్రముఖుల పరిచయాలు పెంచుకుని, భార్య లేదా భర్తతో సుఖ సంసారము సాగించేందుకు “చంద్ర గ్రహ మహా యంత్రము”ను పూజించాలి.
  33. జన్మకుండలిలో అశుభ స్థానములో ఉన్న బుధుని అనుగ్రహము పొంది మంచి ఫలితాలను స్వీకరించేందుకు “బుధ గ్రహ మహా యంత్రము”ను పూజించాలి.
  34. కోరుకున్న కోరికలు నెరవేరుటకు, అదృష్టం వెనువెంటే ఉండేందుకు, మన మనస్సులో కూరుకుపోయిన ఆశలు తీరేందుకు “మనోకామ్న యంత్రము”ను పూజించాలి.
  35. గణేశ యంత్రము, మహాలక్ష్మి యంత్రము, సరస్వతి యంత్రము, దుర్గా బిస యంత్రము, శ్రీ యంత్రము, దుర్గా యంత్రము, మహామృత్యుంజయ యంత్రము, బటుక భైరవ మహా యంత్రము ఈ తొమ్మిది యంత్రములు కలగలిపిన అత్యంత శక్తివంతమైన “సర్వ సిద్ధి యంత్రము”
  36. వాహన ప్రమాదముల నుండి తప్పించుకొనుటకు “వాహన దుర్ఘటన నివారణ యంత్రము” పూజించాలి.
  37. ప్రాణాంతకమైన వ్యాధుల ప్రభావం పడకుండా ఉండేందుకు, అనారోగ్యము మన దరి చేరకుండా ఉండేందుకు “రోగ నివారణ మహా యంత్రము”ను పూజించాలి.
  38. మంచి జ్ఞానము, వివేకము,ప్రతిష్ట, మంచి సంతాన సమృద్ధి పెరుగుటకు “కామాక్షి మహా యంత్రము”ను పూజించాలి.
  39. ప్రేమ వ్యవహారములో విజయము సాధించడానికి మరియు ఆనందదాయకమైన వివాహం జరుగుటకు “కాత్యాయని మహా యంత్రము”ను పూజించాలి.
  40. శ్రీ మహా విష్ణువు మరియు శ్రీ మహా లక్ష్మి యొక్క అనుగ్రహము పొంది ఆనందము, అన్నింటా విజయము సాధించుటకు “శ్రీ లక్ష్మి నారాయణ మహా యంత్రము”ను పూజించాలి.
  41. దక్షిణ దిక్కు సింహద్వారము గల ఇంటికి, భవనముకు, వ్యాపార స్థలమునకు తీవ్రమైన నరదృష్టి కలుగుతుంది. దాని వలన అకారణ నష్టాలు, అకారణ అనారోగ్యములు, అకారణ గొడవలు లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇది నివారించుకోవడానికి “జల శల్య దక్షిణ దిక్ వాస్తు దోష నివారణా యంత్రము”ను పూజించాలి.
  42. గృహ దోషములు, నెగటివ్ ఎనర్జీలు, దిక్ దోషములు నివారణ కొరకు “వాస్తు యంత్రము”ను పూజించాలి.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

Related Articles:

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం

చిన్నమస్తికా హోమం

దశమహావిద్యలలో అయిదవ మహావిద్యే ఈ చిన్నమస్తికా మాత. తంత్ర దేవతలైన దశమహావిద్యలలో ఒకరైన చిన్నమస్తికా దేవిని చిన్నమస్తా, ప్రచండ చండికా అని కూడా పిలుస్తారు. తన శిరస్సును తానే ఖడ్గముతో ఖండించుకొని, ఒక చేతిలో తను ఖండించుకున్న శిరస్సును, మరొక చేతిలో ఖడ్గమును పట్టుకొని, ఖండించుకున్న మెడ నుండి వచ్చే రక్త ప్రవాహం డాకిని, వర్ణని అను పరచారకులు మరియు తన శిరస్సు కలసి ఆ రక్తమును తాగుతూ ఉన్నట్టు, రతిక్రీడలో పాల్గొన్న జంటపై ఈ చిన్నమస్తికా దేవి నిలబడినట్టు, ఒక విధంగా ప్రాణదాతగా, మరొక విధంగా ప్రాణ సంహారిణిగా చిన్నమస్తికా దేవి మనకు దర్శనమిస్తుంది.

తంత్ర శాస్త్రంలో తంత్ర దేవత అయిన ఈ చిన్నమస్తికా దేవికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దశమహావిద్యల తంత్ర సాధనలో శీఘ్ర ఫలితాలు రావడానికి, సంతానం కలగడానికి, బాధల నుండి విముక్తి కలిగేందుకు, ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవడానికి, ఈ చిన్నమస్తికా దేవి తంత్ర సాధన ఎంతో అమోఘమైనది. ఈ చిన్నమస్తికా దేవి తంత్ర సాధన వల్ల లెక్కలేనన్ని అద్భుతాలను, ఫలితాలను చూడవచ్చు. ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, దీర్ఘాయువును చిన్నమస్తికా దేవి తన సాధకుడికి ప్రసాదిస్తుంది.

 

చిన్నమస్తికా దేవి సాధన వల్ల కలిగే ప్రయోజనాలు:

తంత్ర గురువు ఆధ్వర్యంలో, నియమనిష్టలతో ఈ చిన్నమస్తికా దేవి సాధనను ఆచరించాలి. కేవలం తంత్ర సాధన ద్వారా మాత్రమే కాకుండా, చిన్నమస్తికా దేవి యంత్ర పూజ, హోమము, నైవేద్యాలతో కూడా ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు. చిన్నమస్తికాదేవిని సంతుష్టపరిస్తే తన భక్తుని కోరికలను ఎంతో శీఘ్రంగా నెరవేర్చడమే కాకుండా ఆ తల్లి యొక్క సిద్ధి పొందిన సాధకులకు మానవాతీత శక్తులను అనుగ్రహిస్తుంది. మరొక అద్భుతమైన అంశం ఏమిటంటే చిన్నమస్తికా సాధనలో సిద్ధి పొందిన సాధకుడు అష్ట సిద్ధులు పొందుతాడు. దీని వల్ల సాధకునిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. శారీరక శక్తి, మానవాతీత శక్తులు లభిస్తాయి. జ్ఞానం, విజయం, మానసిక సంతృప్తి, ఆరోగ్యం, సంపద అన్నీ కూడా ఈ చిన్నమస్తికా దేవి సాధకుడికి అనుగ్రహిస్తుంది.

చిన్నమస్తికా దేవి పూజ వల్ల సామాజిక, ఆర్థిక, శారీరక దారిద్ర్యము తొలగిపోతుంది,  కష్టాలు నుండి విముక్తి లభిస్తుంది, సంతాన లేమి తొలగిపోయి సంతానం ప్రాప్తిస్తుంది, రుణబాధలు తొలగిపోతాయి, పేదరికం నిర్మూలన జరుగుతుంది, మనోవికాసం, జ్ఞానం సంప్రాప్తిస్తాయి. అకాల మరణం నుండి సాధకుడు తప్పించుకుంటాడు. రాహువు యొక్క చెడు దృష్టిని తొలగిస్తుంది.

జ్యోతిష్య శాస్త్ర రీత్యా జన్మకుండలిలో రాహువు నీచ, శత్రు స్థానాలలో ఉండి దుష్పరిణామాలాను ఎదుర్కొంటున్న వ్యక్తులు, చిన్నమస్తా దేవి యంత్రమును పూజించి (21 రోజులు) చిన్నమస్తాదేవి తాంత్రిక హోమమును జరిపించుకోవడం వల్ల రాహుగ్రహ శాంతి కలిగి, రాహువు యొక్క చెడు దృష్టి జాతకునిపై తొలగి, రాహు అనుగ్రహమును పొందుతారు.

ఈ పూజను స్వయంగా చేసుకోలేని వారు శ్రీ C.V.S.చక్రపాణి గారు వావ్విల్యాపుర తంత్ర పీఠం నందు నిర్వహించే తాంత్రిక చిన్నమస్తికా దేవి హోమము నందు ప్రత్యక్షముగా గాని, పరోక్షంగా గాని పాల్గొనవచ్చు. రాహువు చెడు దృష్టి వల్ల జాతకులు నయవంచనకు గురి కావాల్సి వస్తుంది. అపహరణకు గురి కావలసి వస్తుంది. చట్ట సంబంధమైన వ్యవహారాలలో చిక్కుకొని బంధన యోగమును పొందాల్సి వస్తుంది. చేతబడులకు గురికావలసి వస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులకు మరియు తీవ్రమైన మనోవ్యధకు మానసిక ఒత్తిడికి గురి కావలసి వస్తుంది.

జన్మకుండలిలో రాహువు- వృశ్చికంలో లేదా మేషరాశి, కర్కాటకరాశి, సింహరాశి, కుంభరాశులలో ఉండినట్లైతే రాహువు దుష్పరిణామాలను కలుగజేస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ద్రవిడ తంత్ర శాస్త్రంలో రాహువు మేష, వృశ్చిక రాశులలో ఉండినట్లైతే సర్పశాపం లేదా నాగదోషం కలుగుతుందని క్షుణ్ణంగా వివరించబడింది. రాహువు యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ దుష్పరిణామాలను రాహువు చూపించగల శక్తి గలవాడు.

కావున, జాతకులు తమ జన్మకుండలిలో రాహువు చెడు స్థానాలలో ఉన్నప్పుడూ, రాహు మహాదశ- అంతర్దశ జరుగు సమయంలో, జన్మకుండలిలో మతిభ్రమణ యోగం ఉన్నప్పుడు ఈ “వామతంత్ర దశమహావిద్య తాంత్రిక చిన్నమస్తా దేవి హోమము“ను తప్పక జరిపించుకోవాలి. ఈ హోమమును జరిపించుకోవడం వల్ల రాహువు వల్ల కలిగే దుష్ట ప్రభావాలు అన్నీ కూడా దూరమవుతాయి.

 

చిన్నమస్తా దేవి మంత్రం:

“శ్రీం హ్రీం క్లీం ఐం వజ్రవైరోచనియే హుం హుం ఫట్ స్వాహా”

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

బగలాముఖి హోమం Bagalamukhi homam

Bagalamukhi homam

బగలాముఖి హోమం

మన శత్రువులు మనకు ఎలాంటి కీడు జరుపకుండా ఉండేందుకు, బగలముఖి దేవి యొక్క పూజ, హోమాదులు, యంత్ర మంత్ర, తంత్ర సాధనలు  మనకు ఒక ఆయుధంగా నిలుస్తాయి. చట్టపరమైన సమస్యల నుండి, ఆపదల నుండి, అసహజ మరణం నుండి బగలాముఖి తల్లి తన భక్తులను రక్షిస్తుంది. శత్రువుల పై విజయం సాధించడానికి, శత్రు సంహారణ జరగడానికి బగలాముఖి తల్లి మనకు ఆయుధంగా నిలుస్తుంది. శత్రువుల యొక్క చెడు సంకల్పాన్ని, మనకు కీడు కలిగించే పనుల గురించి మన శత్రువులకు కలిగే ఆలోచనలను, శత్రువుల మాటను బగలాముఖి దేవి నాశనం చేస్తుంది. బగలాముఖి దేవి యొక్క పూజ, యంత్రసాధన లేదా హోమం వల్ల మన శత్రువులకు మనపై కీడు జరిపించాలనే ఆలోచన తొలగిపోవటమే కాకుండా, స్నేహంగా మెలుగుతారు. చేతబడి, నరదృష్టి లాంటి క్షుద్ర శక్తుల నుండి బగలాముఖి కాపాడుతుంది.

Bagalamukhi homam telugu astrology

చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే వారు, శ్రీ బగలాముఖి దేవి యొక్క యంత్ర సాధన గాని, హోమమును గాని ఆచరించిన వారికి మంచి ఫలితం దక్కుతుంది.

శతృనాశనం కొరకు, జీవితంలో విజయం, సౌభాగ్యం సాధించడం కొరకు, చేతబడి ప్రభావాలను పారద్రోలడానికి ఈ హోమమును జరిపించిన యెడల సకల శుభాలు కలుగజేసేలా ఆ దేవి మనలను అనుగ్రహిస్తుంది.

చట్టపరమైన వివాదాల నుండి శీఘ్రంగా బయట పడాలని కోరుకునే వారు శ్రీ C.V.S.చక్రపాణి గారు కేరళ వావిళ్యాపురంలో గల వారి తంత్ర పీఠంనందు నిర్వహించే తాంత్రిక బగలాముఖి హోమాన్ని జరిపించవచ్చు. ఈ హోమంలో స్వయంగా పాల్గొనలేనివారు జాతకుని ఫోటోను, వారు విడిచిన వస్త్రాన్ని ఉంచి హోమాన్ని జరిపించుకోవచ్చు. వివాదాల నుండి విముక్తులు కాగలరు.

గమనిక: చట్టపరమైన వివాదాలు నుండి అతి శీఘ్రంగా విముక్తి పొందాలంటే శ్రీ తంత్ర బగలాముఖి హోమమును మించి శాస్త్రంలో మరొకటి లేదు.

బగలాముఖి యంత్ర సాధన- ఫలితముల గురించి తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 

 

Related Articles:

సంపూర్ణ జాతక పరిశీలన

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

ఆయుష్ హోమం-Ayush Homam

                                   ఆయుష్ హోమం 

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో ఉన్న చెడు గ్రహ స్థానాల వల్ల కలిగే మానసిక, శారీరక అనారోగ్యాలను పారద్రోలడానికి, అకాలమృత్యు భయాన్ని తొలగించడానికి హైందవ సంస్కృతి, ఆచారం, వేదాలను అనుసరించి ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆయుష్ హోమం వల్ల ఆయుః దేవత సంతుష్టులై ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన దీర్ఘాయుషును ప్రసాదిస్తారు. మనకు ఆయుషును ప్రసాదించే దేవతే ఆయుః దేవత.

వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు అయిన భోధ్యాన మహర్షి రచించిన భోధ్యాన సూత్రాలలో ఈ ఆయుష్ హోమం యొక్క విశిష్టతను వివరించారు. జీవితం ఆనందంగా. ఆరోగ్యంగా, ధీర్ఘకాలం పాటు జీవించాలంటే ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహించాలి.

హైందవ పురాణాల్లో తెలియజేయబడ్డ ఏడుగురు చిరంజీవులు అయిన పరశురాముడు, హనుమంతుడు, అశ్వద్ధామ, బలి చక్రవర్తి, విభీషణుడు, కృపాచార్యులు- వీరందరిని ఈ ఆయుష్ హోమములో ఆవహింప చేసి వారి దీవెనలు, అనుగ్రహం జాతకులపై ప్రసరింప జేయటం జరుగుతుంది.

ఆయుష్ హోమం

పూర్వం వేద మహర్షులు పూర్ణాయుర్దాయం వల్ల కలిగే ప్రాముఖ్యతను ఎరిగిన వారు కాబట్టి, ఈ ఆయుష్ హోమాన్ని ఆచరించి, ఆయుష్ దేవతను సంతుష్టపరచి తమ జీవితకాలాన్ని పెంచుకునేవారు. దీనివల్ల ప్రపంచ శ్రేయస్సు కొరకు నెరవేర్చాల్సిన బాధ్యతలను పూర్తిచేసేవారు. ఈ ఆయుష్ హోమాన్ని సంవత్సరమునకు ఒకసారి జరిపించిన యెడల శుభం చేకూరును.

జన్మనక్షత్రం ప్రకారం వచ్చే తమ పిల్లల మొదటి పుట్టినరోజు నాడు ఈ ఆయుష్ హోమాన్ని జరిపిస్తే, పూర్వజన్మ కర్మ భారం తొలగిపోయి, ఇహ జన్మలో  ఆ భారం లేకుండా జీవితాన్ని అనుభవించగలడు. తన జీవితాన్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం పాటు జీవించగలరు. ఆ తరువాత 4,8, 17, 26, 35, 44, 53, 62, 71, 80 ఏటా ఈ ఆయుష్ హోమం ఆచరించడం వల్ల, ఈ హోమ ప్రభావం ఆరోగ్యంపై, మనస్సుపై అధికంగా పడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మానసిక లోపాలు ఈ హోమ ప్రభావం వల్ల తగ్గుముఖం పడతాయి. మానసికంగా లోపాలు, రుగ్మతలు కలిగిన వారికి ఈ హోమమ వల్ల తమ శరీరంలో ఉన్న చక్రాలను ఉత్తేజపరచి, మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. అనారోగ్యంతో బాధపడే చిన్నారులను ఆరోగ్యవంతంగా మార్చడానికి ఈ ఆయుష్ హోమం భగవంతుడు మనకు ప్రసాదించిన వరం. ఈ మధ్య కాలంలో జరిగే ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఆత్మాహుతి ధోరణి వల్ల, వాహన ప్రమాదాల వల్ల, ఇంకా ఎన్నో విధాలుగా అకాలమరణం పొందుతున్నారు. ఈ అసహజ, అకాల మరణాలకు వారి జన్మకుండలిలో ఉండే గ్రహస్థితులు కారణం అవుతాయి. అలాంటి దుర్భర సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ ఆయుష్ హోమం ద్వారా భగవంతుడిని ప్రార్థించాలి.

గమనిక:ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కాకుండా జన్మ నక్షత్రం నాడు ఈ ఆయుష్ హోమాన్ని జరిపించాలి.

జన్మకుండలిలో ఆయుః కారక గ్రహాలు చెడు స్థానాలలో ఉన్నట్లైతే ఆయుష్ హోమం జరిపించడం చాలా మంచిది. అష్టమంలో అనగా జన్మకుండలిలో లగ్నం నుండి 8వ స్థానంలో కుజుడు, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు వీరిలో ఏ ఒక్క గ్రహమైన ఉన్నట్లైతే ఆ జాతకునికి అపమృత్యుదోషం ఉన్నట్లే. ఇలాంటి గ్రహస్థితులు ఉన్నవారు ఆయుష్ హోమాన్ని జరిపించుకోవాలి.

సంపూర్ణ జాతక పరిశీలన

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles

Astrology reasons for extra martial affair-వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు

Astrology reasons for extra martial affair

జన్మకుండలి  ద్వారా వివాహేతర సంబంధములు (అన్య స్త్రీ/ పురుష):

జ్యోతిష్య సలహాలు, పరిహారాల కొరకు నా వద్దకు వచ్చేవారిలో 60 శాతం కేవలం ఈ వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు కొరకు వచ్చినవారే. “గురువు గారు! నా జాతకములో వివాహేతర సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగిన వారు కూడా ఉన్నారు. అయితే మనకు ఈ జన్మలో కలిగే ప్రతి సంఘటన, మనకు కలిగే దురాలోచన, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన జన్మకుండలి లోని గ్రహస్థితుల వలనే జరుగుతాయి. పూర్వజన్మలో మనము ఏదైతే చేసి ఉంటామో, వాటి ఫలితాలు అది మంచి అయినా, చెడు అయినా భూమి పై ఉన్న ప్రతి జీవి అనుభవించాల్సిందే. అయితే ఇప్పుడు వివాహేతర సంబంధములు కలిగే గ్రహస్థితులు ఏమిటో తెలుసుకుందాము.

మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సందర్భం. ఎందుకంటే మన జీవితాంతం వరకు మనం ఎన్నుకునే జీవిత భాగస్వామితోనే గడపాల్సి ఉంటుంది. కష్టాలలో, సుఖాలలో ఇద్దరు సమానంగా పాలు పంచుకోవలసి ఉంటుంది. కానీ వారి అభిప్రాయాలకు తగ్గ జీవిత భాగస్వామి దొరకకపోతే వైవాహిక జీవితం సాఫీగా సాగదు. ప్రతి ఒక్కరికీ మనస్సును అర్థం చేసుకునే జీవితభాగస్వామి రావాలని కోరుకుంటారు. అది జరగని పక్షంలో కొందరు వేరే దారి చూసుకుంటారు. అది వివాహేతర సంబంధం అవుతుంది. హిందూ చట్ట ప్రకారంగా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒకసారి వివాహం జరిగిన తరువాత విడాకులు తీసుకోకుండా ఏర్పడే సంబంధాలను నేరము క్రింద పరిగణిస్తారు. మరి అయితే నేరం అని తెలిసినప్పటికి ఎందుకు ఈ వివాహేతర సంబంధములు ఏర్పడుతున్నాయి? ఈ మధ్య కాలములో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కూడా కొందరు రహస్యంగా ఈ సంబంధాలను కొనసాగిస్తారు. ఇంకొందరు సహజంగా జీవిస్తారు. అయితే ఈ వివాహేతర సంబంధముల వలన సామాజిక, కుటుంబీక సమస్యలు కలిగించే గ్రహస్థితులు ఏమిటి? కేవలం కుటుంబీక సమస్యలు కలిగించే గ్రహ స్థితి ఏమిటి? అన్న విషయము ఇప్పుడు మీకు తెలియజేస్తాను.

 

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివాహేతర సంబంధ సమస్యకు ముఖ్య కారణం కుజుడు గాని లేదా రాహువు గాని లేదా కేతువు గాని 4వ భావములో లేదా 6వ భావములో లేదా 12వ భావములో ఉన్నప్పుడూ ఈ వివాహేతర సంబంధములు కలుగుతాయి.

  • సప్తమ భావము నుండి 5వ భావముపై గాని (లేదా) పంచమ భావము నుండి సప్తమ భావముపై గాని పాప గ్రహముల దృష్టి పడినా; లేదా సప్తమ భావము నుండి 5వ భావములో గురు, శుక్ర గ్రహముల సంగమము జరిగినా జాతకుడు వివాహేతర సంబంధము యొక్క పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
  • సప్తమాధిపతి గాని లేదా ద్వితీయాధిపతి గాని శుక్ర దృష్టికి గురి అయినా లేదా శుక్రుడు ఈ స్థానాలలో ఉన్నా లేదా దశమాధిపతి సప్తమములో శుక్రునితో కలసి ఉన్నా జాతకుడు తీవ్ర కామ వాంఛ కారణంగా వివాహేతర సంబంధము ఏర్పరచుకొని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాడు.
  • సప్తమాధిపతి రాహువుతో గాని లేదా కేతువుతో గాని కలసి ఉంటీ ఆ జాతకులు వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. కానీ ఈ జాతకులు బాగా మోసపోయి వలలో పడిపోతారు. (Trap)
  • జన్మకుండలిలో మనః కారకుడు అయిన “చంద్రుడు”; ప్రేమకు కారణమైన “శుక్రుడు”; ధైర్య సాహసాలకు కారణమైన రాహువు, కుజుడు (చంద్ర,శుక్ర,కుజ,రాహు) ఈ నాలుగు గ్రహములు 3వ భావం, 5వ భావం, 7వ భావం,11వ భావం 12వ భావములకు మరియు వాటి అధిపతులకు సంబంధం ఏర్పడితే జాతకుడి జీవితభాగస్వామి (భార్య/భర్త) జాతకులను మోసం చేస్తారు. అంతేకాకుండా వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటారు.
  • జన్మకుండలిలో సప్తమ భావము బలహీనముగా ఉన్న లేదా సప్తమాధిపతి నీచ స్థానములో ఉంటూ మరియు 11వ భావములో గురువు లేదా శుక్రుడు ఉండినట్లైతే, జాతకుని జీవితభాగస్వామికి వివాహేతర సంబంధం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు.
  • జన్మకుండలిలో నీచ స్థాన క్షీణ చంద్రుడు మరియు రవి కలసి 4వ భావములో ఉంటే జాతకుడికి రహస్యములు ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. అంతే కాకుండా జాతకుడు వయసులో వీరి కంటే పెద్దవారితో గాని లేదా ముసలివారితో గాని అక్రమ సంబంధము ఏర్పరచుకుంటారు.
  • శుక్రుడు ప్రేమ మరియు శ్రుంగరానికి కారకుడు అవుతాడు. ఈ శుక్రుడు రాహువుతో గాని లేదా కుజునితో గాని కలసి ఒకేరాశిలో ఉంటే జాతకుడికి కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఐతే ఈ శుక్ర రాహు లేదా శుక్ర కుజులు కలసి వృశ్చికరాశి, మేషరాశి, తులారాశి, మిధునరాశిలో గాని ఉన్నట్లైతే జాతకునికి వివాహేతర సంబంధములు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి.
  • చంద్రుడు మరియు బుధుడు కలసి మిధునరాశిలో ఉంటూ, ఆ మిధునరాశిపై శని దృష్టి పడితే జాతకుడు వివాహేతర సంబంధం ఏర్పడి, సమస్యలు ఎదుర్కొంటాడు.

(గ్రహ స్థితులు ఇంకా ఉన్నాయి. తరువాతి రోజులలో క్లుప్త వివరణ ఇస్తాను)

ఈ విధంగా కొన్ని విధముల గ్రహ స్థితుల వలన కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా గాని లేదా అనుకోకుండా గాని ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని గ్రహ స్థితుల వలన జాతకులు మోసపోయి, వివాహేతర సంబంధం ఏర్పరచుకొని విచిత్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. సహజంగా వారి బుద్ధి అలాంటిది కాకపోయినా,ఆ సమయములో గ్రహ ప్రభావము  వలన వారి మనస్సు వారి ఆధీనములో లేకుండా చేస్తాయి. ఈ వివాహేతర సంబంధములు ఎన్నో అగుచ్చాట్లు తెచ్చిపెడతాయి.

 

అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి ? అన్న విషయానికి వస్తే, వ్యక్తిగత జన్మకుండలి పరిశీలించి ఏ గ్రహము వలన జాతకుడికి ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయో, ఆ గ్రహమునకు సంబంధించిన పరిహారములు జరిపిస్తే సమస్యకు పరిష్కారం అవుతుంది.

మరి పరిహారాలు జరిపిస్తే సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయా ? అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనము పూర్వజన్మలో చేసిన పాపములకు,పుణ్యములకు కర్మఫలం, కర్మ భారం అనుభవిస్తున్నాము. ఈ జన్మలో మనకు ఏమి జరగాలి అన్నది బ్రహ్మదేవుడు మన నుదిటి వ్రాతను వ్రాసిపెట్టాడు. బ్రహ్మ దేవుడు వ్రాసిన నుదిటి వ్రాతను తిరిగి రాయగలిగే శక్తి ఎవరికి సాధ్యం కాదు. అయితే దోషములు ఉన్నవాటికి పరిహారములు జరిపించుకుంటే “పాము కాటువేయాల్సిన చోట, చీమ కాటు వేస్తుంది” అన్నట్టుగా పెను తుఫాను రావాల్సిన చోట, చినుకులు పడతాయి అన్నమాట.

ఉదాహరణకి మనకు ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళతాము. Operation చేయాలి అని వైద్యుడు చెబుతాడు. ఆపరేషన్ వలన కలిగే నొప్పిని భరించి, మందులు వాడితే జబ్బు నయం అవుతుంది. ఆపరేషన్ కొరకు భయపడి వెనుకడుగు వేస్తే మున్ముందు ఆ జబ్బు కలిగించే నొప్పిని నరకయాతనతో అనుభవించాల్సి ఉంటుంది. ధైర్యము చేసి ముందుకు వెళితే  కేవలం ఆపరేషన్ వలన కలిగే నొప్పి మాత్రమే భరించాల్సి ఉంటుంది. తరువాత ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకవచ్చు.

ఇదే విధంగా మన జాతకములో ఉన్న దోషములకు పరిహారములు చేసుకుంటే సంపూర్ణంగా సమస్యలు పోవు. ఆ పెద్ద సమస్యలు దైవనుగ్రహం వలన చిన్న సమస్యగా మారతాయి. అర్థం చేసుకుంటారని మనవి.

||సర్వేజనా సుఖినోభవంతు||

ఇవి కూడా చదవండి:

  1. గురు చండాల యోగం ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను జాతకుడు ఎదుర్కొంటాడు?
  2. కాలసర్ప దోషం ఉన్నవారు నివృత్తి హోమం ఎలా జరిపించుకోవాలి?
  3. దుష్ట శక్తుల నుండి కాపాడుకునేందుకు, శత్రు నాశనం జరిగేందుకు జాతకుడిని అనుగ్రహించే ప్రత్యాంగిరా హోమం యొక్క వివరాలు. 
  4. జాతకంలో దోషాల వలన దంపతుల మధ్య విభేధాలు కలిగి విడాకుల వరకు తీసుకెల్లే గ్రహస్థితులు ఏవి?
  5. దంపతులలో ఒకరు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులకు జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు కారణం అవుతాయి?
  6. బంధన యోగం అంటే ఏమిటి? నాగ బంధన యోగం అంటే ఏమిటి?
  7. సర్పశాపం
  8. మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు
  9. విడాకులు-జ్యోతిష్య కారణాలు

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు

Astrology reasons for second marriage

మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు అయిపోతుంది. అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది. ఇంకొందరికి విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం జరిగి కోర్టు కేసులు, కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతుంటారు. ఇది వారి వారి జన్మకుండలిలోని కొన్ని గ్రహ స్థితుల వలన కలుగుతుంది. ఇంకొందరు వివాహము అయినప్పటికి, ద్వితీయ వివాహం జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకుంటారు.   ఇది ఇప్పటి కాలములో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఇది అందరి దంపతులకు జరుగదు. కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రమే జరుగుతాయి. అయితే ఈ వివాహేతర సంబంధములు గూర్చి తరువాత వివరిస్తాను. ఇప్పుడు ద్వితీయ వివాహముకు ఎలాంటి గ్రహ సన్నివేశములు ఉంటాయో మీకు తెలుపుతాను.

         జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి, ద్వితీయ వివాహానికి, విడాకులకు ముఖ్యంగా సప్తమ భావం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్న భావము-ఇది మన వ్యక్తిత్వము తెలియజేస్తుంది; ద్వితీయభావము మరియు ద్వితీయాధిపతి- ఇది మన కుటుంబ జీవనము, భార్య/భర్త ఆయుర్దాయము, ద్వితీయ వివాహ సందర్భములు ఏ విధంగా ఉన్నాయో సూచిస్తుంది; సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి- వివాహము, భర్త, భార్య గురించి తెలియజేస్తుంది; నవమ భావము మరియు నవమ భావాధిపతి- ద్వితీయ వివాహ సందర్భం గూర్చి తెలియజేస్తుంది; ఏకాదశ భావం మరియు ఏకాదశాధిపతి- అనుకున్న కోరికలు నెరవేరు సూచనల గూర్చి తెలియజేస్తుంది; గురువు- స్త్రీ జన్మకుండలిలో భర్త గురించి తెలియజేసే గ్రహం; శుక్రుడు- పురుష జన్మకుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం.

ఈ భావములు, గ్రహ స్థానములు,రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భము ఉందా లేదా అన్న విషయము గ్రహించవచ్చు.

  • జన్మకుండలిలో సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి (బుధుడు, గురువు) ఉన్న రాశి ఈ రెండు ద్విస్వభావ రాశులు (కన్యారాశి, మిధునరాశి, ధను రాశి,మీనరాశి) అయితే , ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగే అవకాశము ఉంటుంది.
  • సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి, నవాంస చక్రములో మరియు భావచక్రములో  సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే జాతకునికి రెండు వివాహములు జరుగు సూచనలు వస్తాయి.
  • వైవాహిక స్థానం అయిన 7వ స్థానముపై గాని లేదా సప్తమాధిపతి పై గాని 2 లేక 3 పాప గ్రహముల (శని, రవి, కుజ,రాహు, కేతు) దృష్టి ఉండినట్లైతే జాతకునికి ద్వితీయ వివాహం జరుగవచ్చు.
  • సప్తమాధిపతి మరియు లజ్ఞాధిపతి ఇద్దరు కలసి 11వ భావములో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహ అవకాశములు ఉంటాయి.
  • సప్తమములో 2 గాని లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు గాని శుక్రునితో కలసి 7వ భావములో ఉంటూ, ఆ సప్తమ భావముపై పాప గ్రహముల యొక్క దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు.
  • అష్టమాధిపతి లగ్నములో గాని లేదా సప్తమ భావములో గాని మరియు సప్తమధిపతి ద్విస్వభావ రాశిలో గాని లేదా శని,కుజ,రాహు,కేతు యొక్క పాప గ్రహముల దృష్టి సప్తమాధిపతి పై ఉన్నా జాతకునికి రెండవ వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి.
  • వైవాహిక స్థానాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావములో గాని, అష్టమ భావములో గాని లేదా 12వ భావములో గాని ఉండి మరియు కుజ, రాహు, కేతు, శని లాంటి పాప గ్రహములో సప్తమములో ఉండి, శుక్రుడు బల్హీనంగా నీచ లేదా శత్రు స్థానములో ఉన్నట్లైతే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది.

కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక, విడిపోవడం గాని, ద్వితీయ వివాహము జరగడం గాని జరుగుతుంది. అయితే జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయము స్పష్టము చేయకూడదు.

 

సంపూర్ణ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, పుట్టిన సమయం వివరాలు ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేసి సంపూర్ణ గ్రహదోషాలు, యోగాలు, అవయోగాలు, పరుహారాలతో సహా రాసి 7 రోజుల లోపు మీకు పంపబడుతుంది. వివరాల కొరకు 9846466430 నెంబరును సంప్రదించండి. ఆన్లైన్ ద్వారా మీ జన్మకుండలి పరిశీలనను బుక్ చేసుకోవడానికి ఈ లింకును క్లిక్ చేయండి.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com                               

ఓం నమో నాగరాజాయ నమః