శంఖపాల కాలసర్ప దోషం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో నాలుగవది అయిన శంఖపాల కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.
–దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ
జన్మకుండలిలో రాహువు నాలుగవ భావములో (మాతృ, గృహ, విద్యా, వాహన, కుటుంబ, ఆస్తి, మేనమామ, ఋణ స్థానం) మరియు కేతువు దశమ భావములో (ఉద్యోగం, పదవీ స్థానం) ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి శంఖపాల కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. దీనినే శంఖచూడ కాలసర్ప దోషం అని కూడా అంటారు. శంఖపాల కాలసర్పదోషం విద్యా, మాతృ, వాహన, కుటుంబం, మేనమామ, రుణములు, ఉన్నత పదవీ, ఉద్యోగం విషయాలలో జాతకుల పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ శంఖపాల కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430
శంఖపాల కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:
- వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తి రీత్యా అడ్డంకులు ఎదుర్కొంటారు
- జాతకుని యొక్క వైవాహిక జీవితంలో వీరి బంధువులు జోక్యం చేసుకుంటారు. ముఖ్యంగా తల్లి తరపున బంధువుల వలన జాతకులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు.
- ఈ కాలసర్పదోషం ఉన్న జాతకులకు విచిత్రమైన, మర్మమైన కలలు వస్తాయి.కలలో జంతువులు తరచూ వస్తూ ఉంటాయి.
- తల్లితో విబేధాలు ఏర్పడతాయి. తల్లి ఆరోగ్యం కూడా సమస్యలో ఉంటుంది.
- వీరి ఆలోచనలు చంచలంగా ఉంటాయి. మనశ్శాంతి లోపిస్తుంది. మానసికంగా స్థిరంగా ఉండలేరు. కార్య నిర్వహణలో సమస్యలు ఎదుర్కొంటారు.
- భూమి, ఆస్తుల విషయంలో తగాదాలు నెలకొంటాయి.
- కుటుంబంలో నిరంతరంగా ఘర్షణ వాతావరవరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలు సంభవిస్తాయి. మాతృ సంబంధిత ఆస్తులు వీరికి దక్కకపోవడం గాని లేదా దక్కించుకునేందుకు తీవ్ర సమస్యలు ఎదుర్కోవడం గాని జరుగుతుంది.
- వీరి ఆలోచనల్లో తీవ్ర సంఘర్షణ ఉంటుంది. విద్యా విషయాల్లో తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొంటారు.
- వ్యాపార విషయాల్లో నష్టాలు ఎదుర్కొంటారు.
- కుటుంబ సభ్యులతో వాదనలు, గొడవలు వీరు భరించలేనివిగా ఉంటాయి.
- ఉద్యోగం చేసే చోట పై అధికారులతో విబేధాలు వస్తాయి. ప్రమోషన్లు రాక ఇబ్బందుల పాలవుతారు.
- స్పెక్యులేషన్ పెట్టుబడుల వలన ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.
- వాహన ప్రమాదాలు కలుగడం లేదా కొన్న వాహనానికి పదే పదే మరమ్మత్తులు చేయాల్సిన పరిస్థితులు రావడం జరుగుతుంది.
- వీరికి దేనిమీద సరైన ధ్యాస ఉండదనే చెప్పాలి. ఉదాహరణకి తదేక ధ్యాస పెట్టాల్సిన డ్రైవింగ్ లాంటి వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది.
- ఈ శంఖ చూడ కలసర్ప దోషం ఉన్న జాతకులకు ఆలస్య వివాహం కావడం జరుగుతుంది. వివాహం అయిన తరువాత తమ జీవిత భాగస్వామితో తీవ్రమైన వాదనలు, మనస్పర్థలు రావడం వలన, జాతకులకు తట్టుకోలేని ఒత్తిడిని, బాధలను తెచ్చిపెడుతుంది.
- వీరి జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- ఉన్నత పదవిని పొందడానికి ఆటంకాలు, జాప్యం, పై అధికారులతో పేచీలు కలుగును.
ముఖ్య గమనిక:
శంఖ పాల కాలసర్పదోషం ఉన్న జాతకులు కుటుంబ రీత్యా, కుటుంబ ఆస్తుల రీత్యా, వాహన, విద్యా, మాతృ సంబంధిత విషయాల రీత్యా, ఉపాధి, ఉద్యోగ, పదవీ రీత్యా సమస్యలు తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికి, ఈ జాతకులకు కొన్ని అనుకూల ఫలితాలు కూడా ఉండును. విదేశీ నివాసం వలన విజయం కలుగుతుంది (కొన్ని గ్రహస్థితులకు మాత్రమే). స్వతంత్రంగా ఉపాధి కలిపించుకోవడంలో వీరికి బాగా కలసి వస్తుంది. రాజకీయ ప్రవేశం చేసేవారికి ఈ దోషం ఉన్నప్పటికి విజయం చేకూరుతుంది. పెద్ద స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ జాతకులకు సులభంగా లభించే అవకాశాలు ఉంటాయి. తండ్రి నుండి సహకారం అందుతుంది.
ఒకవేళ జన్మకుండలిలో ఇతర శుభ యోగాలు కూడా ఉన్నట్లైతే, ఈ దోషం ఎన్ని సమస్యలు కలిగించినప్పటికి, జీవితంలో ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఈ శంఖపాల కాలసర్ప దోష ప్రభావం తీవ్రత ఎంత ఉంటుంది అనేది, ఈ దోషం ఏర్పడిన రాశులను ఆధారం చేసుకొని వ్యక్తిగత జన్మకుండలి ద్వారా నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే తెలియజేస్తారు.పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430
శంఖపాల కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- శంఖపాల కాలసర్పదోషం ఉన్న జాతకులు తమ తల్లి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద ఉంచాలి.
- కుటుంబ స్థానంలో రాహువు ఉన్నందున కుటుంబంలోని వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. కావున ఈ జాతకులు తమ కుటుంబ సక్యత పై దృష్టి సారించాలి.
- వీరి నివాసం జనం సందడిగా ఉన్న ప్రదేశాలలోనే తీసుకోవాలి.
- స్పెక్యులేషన్ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. వీటి వలన దీర్ఘ కాలంలో భవిష్యత్తులో లాభాలు వస్తాయేమో గాని, ప్రస్తుత జీవితం ఈ పెట్టుబడుల వలన ఈ జాతకులకు ఆర్థికంగా అల్లకల్లోలంగా మారుతుంది.
- ఇతరుల సమస్యలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ జాతకుల యొక్క ఉద్దేశం సరైనది అయినప్పటికి, ఈ దోష ప్రభావం వలన వీరికి అది చెడుగా మారి, సమాజంలో అపనిందల పాలయ్యే అవకాశం ఉన్నది.
- రాహు స్థితి వలన డబ్బు వృధాగా ఖర్చు అయ్యే ప్రమాదం ఉన్నది. కావున డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించాలి.
- పై అధికారులతో, సీనియర్లతో వీలైనంత వరకు సామరస్యంగానే సమస్యని పరిష్కరించుకోవాలి.
పరిహారాలు:
- నిష్ణాతులైన జ్యోతిష్యుల సలహా మేరకు, రాహు, కేతు మహా యంత్రములను ప్రతిష్టించుకొని, పూజించాలి.
- రుద్రాభిషేకం, మహామృత్యుంజయ మంత్ర జపం వలన ఈ దోష ప్రభావం తగ్గును.
- విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
- శంఖపాల కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- గ్రహణ యోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి? ఎలా గుర్తించాలి?
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu
#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses