వాసుకి కాలసర్ప దోషం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో మూడవది అయిన వాసుకి కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.
- దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ
జన్మకుండలిలో మూడవ స్థానములో (సోదర/సోదరీ భావం, ధైర్య సాహసాలు తెలియజేసే భావం, ప్రయాణాలు గూర్చి తెలిపే భావం) రాహువు మరియు తొమ్మిదవ స్థానములో (పితృ స్థానం, అదృష్ట భావం, ఆధ్యాత్మికత తెలిపే భావం) కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రెండు గ్రహాల మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి వాసుకి కాలసర్పదోషం ఉందని గుర్తించాలి. ఈ వాసుకి కాలసర్పదోషం ఉన్న జాతకులు ముఖ్యంగా సోదర/సోదరీలు, అదృష్టం, పితృ సంబంధిత విషయాలు, పై చదువులు, వాగ్ధాటి, జాతకునిలో ఉన్న ఆధ్యాత్మికత, ధైర్య సాహసాల మీద ఈ కాలసర్పదోషం ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ వాసుకి కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430
వాసుకి కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:
- జాతకుని యొక్క సోదర/సోదరీలతో విభేధాలు, గొడవలు సంభవిస్తాయి.
- కుటుంబంతో, సోదర/సోదరీలతో సత్సబంధాలు ఉండవు.
- శత్రువులు అధిక సంఖ్యలో ఉంటారు.
- ఎంతో కాలంపాటు ఉన్న స్నేహం కూడా ఈ యోగం వలన చెడిపోవచ్చును.
- తోటి ఉద్యోగులతో ఏ విధమైన సహకారం అందకపోగా, వారితో విబేధాలు తలెత్తుతాయి.
- ఈ యోగం ఉన్న కొన్ని లగ్నాల వారికి వైద్య శాస్త్రానికి కూడా అంతుపట్టని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
- జాతకులు విజయం సాధించుట కోసం తీవ్రంగా శ్రమించినప్పటికి, ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఎదురవుతాయి.
- ఐహిక జీవితం పై ఆశను కోల్పోవడం జరుగుతుంది.
- పై స్థాయి చదువులు చదువుకోవాలని జాతకులు అనుకున్నప్పటికి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు.
- తమ కాళ్లపై తాము నిబడేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
- బంధువులు మరియు స్నేహితులు చేతిలో మోసపోవడం జరుగుతుంది.
- ఈ వాసుకి కాలసర్ప యోగం ఉన్న జాతకుల యొక్క జీవితంలో ఆర్థిక నష్టాలు, ఆర్థిక అస్థిరత్వం అనేది సహజంగా మారిపోతుంది. ఆర్థిక విషయాలను నిర్వహించుట వీరికి కష్టతరం అవుతుంది.
- జాతకులు తమ జీవితంలో నిరంతర అసంతృప్తి, స్తబ్ధత చవిచూస్తారు.
- ఈ జాతకులలో అభద్రతా భావం, ఆందోళన, భయం ఎక్కువగా కలిగి ఉంటారు. దీనివలన వీరిలో ఆత్మ విశ్వాసం లోపిస్తుంది. సమస్యల వలన సతమతం అయ్యి ఆ ఆందోళనలో వీరు చేసే పనుల వలన ఇంకా సమస్యలలో చిక్కుకుంటారు.
- ఈ జాతకులకు తమ కుటుంబంతో ముఖ్యంగా తమ సోదర/సోదరీలతో తీవ్ర విబేధాలు ఏర్పడి, అవి జీవితాంతము వేధిస్తాయి.
- నివసించే గృహంలో మనశ్శాంతి లోపిస్తుంది. అనుకోకుండా ధన నష్టాలు లేదా దురదృష్టం వెంటాడుతుంది.
- విదేశీ ప్రయాణం లేదా విదేశీ నివాసం చేయాలని తలంచిన వారికి అడుగడుగున అవాంతరాలు తప్పవు.
- స్నేహితులకు లేదా బంధువులకు ఇచ్చిన డబ్బు మరలా తిరిగి పొందలేరు.
- తండ్రితో విబేధాలు తలెత్తుతాయి.
- జాతకులు తాము ఎంత శ్రమించినా, తమ శ్రమకు తగ్గ ఫలితములు మాత్రం చూడలేరు. వృత్తి రీత్యా సంతృప్తికరమైన ప్రశంశలు, వాతావరణం ఉండవు.
- వ్యాపారములో, వ్యాపార భాగస్వాములతో నష్టాలు ఎదురయ్యి సమస్యలు ఎదుర్కొంటారు.
- ఇతరులు వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందరూ వీరిని మోసగించాలనే చూస్తారు.
ముఖ్య గమనిక:
వాసుకి కాలసర్ప యోగం వలన కొన్ని విషయాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కున్నప్పటికి, వీటి వలన కొన్ని మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. వీరికి మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. వీరి వ్రాతల వలన గాని లేదా వీరి స్వరం వలన గాని సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వాసుకి కాలసర్ప దోషం గల జాతకులకు పట్టుదలతో శ్రమించి పనిచేసే తత్వం సహజంగానే ఉంటుంది, ఇదే తత్వాన్ని సహనంగా కొనసాగిస్తే, వీరికి అనుకోకుండానే విజయం చేకూరుతుంది. జన్మకుండలిలో రాహు మరియు కేతువు స్థితి చెందిన రాశులు శుభ రాశులు అయితే, ఈ జాతకులకు విదేశీయానం వలన లాభాలు చేకూరుతాయి. అనుకోని అదృష్టం వరిస్తుంది. మంచి వాగ్ధాటి ఉంటుంది. రాహు కేతు స్థానాలు శుభంగా ఉన్నట్లైతే, విదేశీయాన ప్రయత్నం విజయవంతం అవుతుంది.
ఒకవేళ జన్మకుండలిలో ఇతర శుభ యోగాలు కూడా ఉన్నట్లైతే, జాతకులకు 36 సంవత్సరాల తరువాత తమ జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ వాసుకి కాలసర్ప దోష ప్రభావం తీవ్రత ఎంత ఉంటుంది అనేది, ఈ దోషం ఏర్పడిన రాశులను ఆధారం చేసుకొని వ్యక్తిగత జన్మకుండలి ద్వారా నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే తెలియజేస్తారు.పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430
వాసుకి కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- రాహు లేదా కేతు మహా దశలో వీరు దూర ప్రయాణములు చేయుట మంచిది కాదు.
- సోదర/సోదరీలతో విబేధాలు తొలగించుకునేందుకు ప్రయత్నించాలి.
- జీవిత భాగస్వామితో వాదనలకు, గొడవలకు వెళ్లకుండా, తనతో ఏ విధంగా సక్యత పెంచుకోవాలో ఆలోచించాలి.
- వృత్తి, ఉద్యోగాలలో తోటి ఉద్యోగులతో స్నేహంగా మెలిగేలా ప్రయత్నించాలి.
- తరచూ దేవాలయ సందర్శన చేసుకుంటూ ఉండాలి.
- తండ్రితో సత్సంబంధాలు పెంచుకోవాలి.
పరిహారాలు:
- మానసా దేవి ఆరాధన లేదా వ్రతమును ఆచరించాలి.
- నిష్ణాతులైన జ్యోతిష్యుల సలహా మేరకు, రాహు, కేతు మహా యంత్రములను ప్రతిష్టించుకొని, పూజించాలి.
- జంతువులకు, అనాధలకు తమకు తోచిన దాన కార్యక్రమాలు చేయాలి.
- వాసుకి కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 40 రోజుల పాటు హనుమాన్ చాలిసాను 5 సార్లు పఠించాలి.
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- గ్రహణ యోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి? ఎలా గుర్తించాలి?
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu