అనంత కాలసర్ప యోగం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో మొదటిది అయిన అనంత కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.
-దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ
లగ్నంలో అనగా ఒకటవ భావంలో రాహువు మరియు సప్తమ భావంలో కేతువు ఉండి, మిగిలిన గ్రహాలు అన్నీ కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఇమిడి ఉన్నపుడు ఆ జాతకులకు అనంత కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. దీనినే విపరీత కాలసర్పయోగం, విష్ణు కాలసర్ప దోషం అని కూడా అంటారు. జాతక చక్రంలో లగ్నాన్ని తనుభావంగా (వ్యక్తిత్వం, శరీర తత్వం, ఆలోచన విధానం), సప్తమ భావాన్ని వైవాహిక స్థానంగా, వ్యాపార స్థానంగా పరిగణిస్తారు. అనగా ఈ అనంత కాలసర్ప యోగ ప్రభావం ముఖ్యంగా ఈ రెండు భావాలపై ఎక్కువగా ఉంటుంది. అనంత కాలసర్ప దోషం ఉన్న జాతకులకు ఏ విధమైన ప్రభావాలు కలుగుతాయో ఇక్కడ వివరిస్తున్నాను. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ అనంత కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430
అనంత కాలసర్ప దోషం వలన కలిగే ప్రభావాలు:
- ఈ కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ జీవితంలో విజయం సాధించేందుకు, జీవితంలో ఒడిదుడుకులను, అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించడానికి ఈ దోషం ఉన్న జాతకులు ఎంతో కాలం పాటు శ్రమించాల్సి ఉంటుంది.
- ఈ అనంత కాలసర్ప యోగం ఉన్న జాతకులకు జీవితంలో అడుగడగున ఏవో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.
- ఈ దోషం ఉన్న జాతకులకు ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు, పరిచయస్తులు ఉన్నప్పటికి, తాము మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తారు.
- తరచూ తమకు వచ్చే మానసిక సంఘర్షణల వలన కుటుంబం నుండి వేరుగా ఉండిపోతారు. అందువలన వీరికి ఇంట్లో వారితో కంటే కూడా బయట వారితోనే సన్నిహితంగా ఉంటారు.
- జన్మకుండలిలో ఈ దోషం ఉన్న జాతకులు తప్పకుండా శ్రమ జీవులై ఉంటారు. ఎంతో శ్రమించి పని చేస్తారు. ఆ శ్రమ అనేది వీరి జీవితంలో ఒక భాగం అయిపోయేట్టుగా పని చేస్తారు. కానీ చాలా కాలం తరువాత మాత్రమే వీరి శ్రమకు తగ్గ గుర్తింపు, ఫలితం లభిస్తుంది.
- మానసిక ఒత్తిడి, గందరగోళం, తీవ్ర కోపం, ముక్కోపం, వ్యాపార భాగస్వామితో గొడవలు, జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి.
- ఈ దోషం వలన తీవ్ర చెడు ప్రభావాలు ఏ విధంగా అయితే ఉంటాయో, మంచి ఫలితాలు కూడా ఈ యోగం వలన కలుగుతాయి. అనుకోని విధంగా ఒక్కసారిగా జాతకునికి ఎనలేని లాభాలు, విజయాలు లభిస్తాయి. కనుక, ఈ దోషం ఉన్న జాతకులు తమ పనులను తాము సక్రమంగా, సహనంగా నిర్వహిస్తూ ఉన్నట్లైతే, ఏదో ఒక రోజు అంధకారంగా ఉన్న తమ జీవితంలోకి వెలుగు తప్పక వస్తుంది. ఈ దోషం ఉన్న వారి జీవితం పూలపాన్పు లాగా మాత్రం అస్సలు ఉండదు, జీవితంలో శ్రమ, ఒత్తిడి అధికంగానే ఉంటాయి. కానీ ఆత్మ విశ్వాసం, శ్రమ, పట్టుదల కలిగి ఉండటం వలన జీవితంలో తప్పక విజయాన్ని సాధిస్తారు.
- నా 25 సంవత్సరాల అనుభవములో ఈ దోష పూరిత జాతకులలో కొందరికి లాటరీలు, షేర్లు వంటి వాటిపై చాలా ఆసక్తి కలిగి ఉండటం గమనించాను. ఈ దోషం గల జాతకులకు లాటరీలలో, షేర్లలో, జూదంలో తప్పక నష్టాలు వస్తాయి. వీటి వలన ఆర్థికంగా క్రుంగిపోతారు. దీని వలన మానసికంగా అలజడి, వైవాహిక జీవితంలో మనస్పర్థలు ఎక్కువగా తలెత్తుతాయి.
- ఈ అనంత కాలసర్పదోషం ఉన్నవారిని తమ శత్రువులు వివిధ రకాలైన కుట్రలలో ఇరికెంచేందుకు ప్రయత్నిస్తారు. దీని వలన జాతకులకు సమాజంలో పేరు ప్రతిష్టలను కోల్పోవడం, అవమానాలను ఎదుర్కోవడం జరుగుతుంది.
- అనంత కాలసర్పదోషం ఉన్న జాతకుల భాగస్వామి యొక్క వ్యక్తిత్వం ప్రశ్నార్థకంగా ఉంటుంది, చిరాకు కలిగించే లక్షణాలను కలిగి ఉంటారు. ఈ జాతకుల యొక్క జీవిత భాగస్వామి ఏదో ఒక అనారోగ్యం కలిగి ఉంటారు. సంతాన సాఫల్యత విషయంలో వివిధ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ దోషం వలన జాతకుల శృంగార జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భార్య భర్తలలో ఎవరో ఒకరికి గాని లేదా ఇద్దరికీ ఉన్న ఆరోగ్య సమస్యల వలన శృంగార జీవితానికి దూరమయ్యి, వారి మధ్య ఉన్న అనురాగానికి, బంధానికి కూడా అడ్డంకులు కలుగుతాయి.
- వివాహ విషయంలో ఆలస్యం కలుగుతుంది లేదా ఎన్నో అవాంతరాలు కలుగుతాయి. భార్యా భర్తల మధ్య నిరంతర మనస్పర్థలు, అపార్థాలు, కారణం లేని వాదనలు నిత్యం సంభవిస్తాయి.
- అనంత కాలసర్ప దోషం యొక్క ప్రభావం వలన వైవాహిక జీవితంలో ఆర్థిక అస్థిరత్వం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల వలన గాని లేదా ఇతర వ్యక్తుల జోక్యం, ఒత్తిడి వలన ఈ దోష జాతకులకు సమస్యలు వస్తాయి.
- ఈ దోష జాతకులకు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవటంలో, ప్రమోషన్ సంపాదించుకోవడంలో, వ్యాపార అభివృద్ధి విషయంలో తరచూ సమస్యలు తలెత్తుతాయి.
- ఈ దోషం వలన అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థిక అస్థిరత్వం ఏర్పడి, దాని వలన ఒత్తిడి అధికం అవుతుంది.
ముఖ్య గమనిక:
ఈ అనంత కాలసర్పదోషం ఉన్న జాతకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికి, అనుకోకుండా ఒక సంధర్భంలో తమ కష్టాలు అన్నీ కూడా తప్పక మాయమవుతాయి. వీరి జీవితంలో కేవలం సమస్యలు ఉన్నప్పటికి, వారికి అవసరమైన వాటికి ఏ మాత్రం లోటు ఉండదు. వ్యక్తిగత జన్మకుండలిలో అనంత కాలసర్ప దోషముతో పాటుగా శుభ యోగాలు కూడా ఉన్నట్లైతే, జాతకులకు 27 సంవత్సరాలు వయస్సు గడచిన తరువాత వారి జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ కాలసర్ప దోష ప్రభావం ఏ తీవ్రతతో ఉంటుంది అనేది, ఈ దోషం ఏర్పడిన రాశులను ఆధారం చేసుకొని వ్యక్తిగత జన్మకుండలి ద్వారా నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే తెలియజేస్తారు.పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430
అనంత కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఈ దోషం ఉన్న జాతకులు సాధ్యమైనంత వరకు వ్యాపార భాగస్వామ్యాన్ని నిషేధించాలి. వ్యాపారం చేయదలచిన వారు తప్పక వ్యక్తిగతంగా, ఒంటరిగా మొదలు పెట్టాలి. వ్యాపార భాగస్వామ్యం అస్సలు కలసిరాదు.
- ఈ దోషం ఉన్న జాతకులు సిగరెట్లు, మద్యపానం, డ్రగ్స్, పొగాకు వంటి మత్తు పధార్థాలను అస్సలు తీసుకోరాదు.
- అనంతకాలసర్ప దోష జాతకులు గోధుమరంగు, నలుపు, నీలం రంగులను పూర్తిగా నిషేధించాలి. ప్రకాశవంతమైన రంగులను వీరు ధరించడం మంచిది.
- ఇతరులు ఉపయోగించిన బట్టలు గాని, వస్తువులు గాని వీరు అస్సలు ఉపయోగించరాదు. ఒకవేళ ఎవరైనా ఆ విధమైన వస్తువులు ఇస్తే స్వీకరించకూడదు.
పరిహారములు:
- రాహు, కేతు జపములు వలన జాతకునికి ఈ అనంత కాలసర్ప దోషము నుండి కాస్త ఉపశమనము లభించును.
- పేదలకు, అనాధలకు, సహాయము కోరు వారికి వీరు తగిన సహాయములు, దానములు చేయడం వలన దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావములు తగ్గుముఖం పడతాయి.
- నిష్ణాతులైన జ్యోతిష్యుల సలహా మేరకు, రాహు, కేతు మహా యంత్రములను ప్రతిష్టించుకొని, పూజించాలి.
- అనంత కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమము బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- గ్రహణ యోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి? ఎలా గుర్తించాలి?
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.