loading

పద్మ కాలసర్ప దోషం

  • Home
  • Blog
  • పద్మ కాలసర్ప దోషం

పద్మ కాలసర్ప దోషం

పద్మ కాలసర్ప దోషం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ,  ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే  జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో అయిదవది అయిన పద్మ కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.

  • దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ

జన్మకుండలిలో పంచమ భావములో (సంతాన స్థానం, వృత్తి, ప్రేమ వ్యవహార స్థానం, విద్య) రాహువు మరియు ఏకాదశ భావములో (లాభ స్థానం, పూర్వ జన్మ) కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు పద్మ కాలసర్ప దోషము ఉన్నట్టుగా గుర్తించాలి. పద్మ కాలసర్పదోషం వలన జాతకుల యొక్క సంతానం పై, వృత్తి పై, ప్రేమ వ్యవహార, వ్యాపార లాభాల పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ పద్మ కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430

పద్మ కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:

  • ఈ దోషం ఉన్న విద్యార్థులు తమ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ద ఉంచాలి. ఎందుకనగా ఈ దోష ప్రభావం వలన జాతకులకు విద్య మీద శ్రద్ద తగ్గిపోయి, దుష్ఫలితాలు కలిగించే కార్యకలాపాల పై ఆసక్తి చూపుతారు. కావున రాహు మహాదశ లేదా అంతర్దశ జరిగేటపుడు ఈ జాతకుల యొక్క తల్లిదండ్రులు వీరి పై జాగ్రత్త వహించాలి.
  • సంతాన సాఫల్యత ఆలస్యం అవుతుంది లేదా సంతానం పొందుటకు కష్టతరంగా మారుతుంది.
  • గుప్త శత్రువులు వీరికి మిత్రువులుగా ఉంటూనే దెబ్బ తీస్తారు. ఎంతో ప్రాణంగా అనుకున్న మిత్రులే వీరికి వెన్నుపోటు పొడుస్తారు.
  • పూర్వ జన్మ పుణ్యం తక్కువగా ఉండుట వలన వైవాహిక జీవితం ఎన్నో అవాంతరాలతో నిండి ఉంటుంది.
  • కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొరకు అధిక ఖర్చులు చేయాల్సి వస్తుంది.
  • జాతకుని కుటుంబ సభ్యుల మధ్య అనైక్యత ఏర్పడుతుంది.
  • ప్రేమ వ్యవహారాలలో విఫలం కావడం వలన ఈ జాతకులు మానసికంగా క్రుంగిపోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల వలన జాతకులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • సంతానం ఆలస్యం కావడం వలన వైవాహిక జీవితం ఒత్తిడితో సాగుతూ ఉంటుంది. సంతానం లేకపోవడం లేదా ఆలస్యం కావడం వలన కుటుంబ సభ్యుల నుండి తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.
  • ఈ జాతకులలో పరిశీలనా నైపుణ్యం లోపించడం వలన దేని మీద కూడా తదేక దృష్టి సారించలేరు.
  • ఈ జాతకులకు ఏదైనా అనారోగ్యం సంభావిస్తే, దాని నుండి కోలుకొనుటకు చాలా సమయం పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల బారీన పడే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది.
  • మనశ్శాంతి లోపించడం వలన జీవన శైలి గందరగోళంగా ఉంటుంది.
  • ఈ దోషం ఉన్న జాతకులు విద్యపరంగా తాము కోర్సును ఎంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. తాము కోర్సును పొరపాటుగా ఎంచుకునే అవకాశం ఉన్నది, దాని వలన విద్య కొరకు వెచ్చించిన డబ్బు మరియు సమయం వృధా కాగలదు.
  • ఈ జాతకులు చదివిన విద్య వీరికి అక్కరకు రాదు. అనగా ఈ జాతకులు చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి లేదా వృత్తికి సంబంధం ఉండదు.
  • కుటుంబ సభ్యుక మధ్య అపనమ్మకం ఏర్పడటం వలన కుటుంబంలో గొడవలు, మనస్పర్థలు ఏర్పడతాయి. దీని వలన ఈ జాతకులకు మానసిక ఒత్తిడి అధికం అవుతుంది.
  • ప్రేమ వ్యవహారాలలో, వ్యాపారాలలో, స్టాక్ మార్కెట్ల విషయాలలో వీరికి అదృష్ట యోగముల ప్రమేయము ఉండదు.
  • చెవులలో సమస్యలు వచ్చే అవకాశం ఉండును.
  • అనుకోని ఖర్చులు, పెట్టుబడులలో నష్టాలు వలన ఆర్థికంగా అస్థిరత ఏర్పడుతుంది.

ముఖ్య గమనిక:

               పద్మ కాలసర్ప దోషం వలన సంతాన పరంగా, స్నేహితుల పరంగా, విద్యా పరంగా, వైవాహిక జీవిత పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికి, ఈ దోషం వలన కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయి. వీరికి ఆర్థికంగా సంపాదించుకునే అవకాశాలు కనుమరుగు అవుతున్నాయి అని అనుకునే లోపు, ఆదాయ మార్గాలు అన్నీ వైపుల నుండి వీరికి అందుబాటులోకి వస్తాయి. జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 46 సంవత్సరాల తరువాత ఆర్థిక లాభాలు కనబరుస్తాయి. వీరి పట్టుదల, శ్రమకు తగ్గ గుర్తింపు ఆలస్యమైనా సరే వీరికి దక్కి తీరుతుంది. ఈ పద్మ కాలసర్ప దోష ప్రభావం తీవ్రత ఎంత ఉంటుంది అనేది, ఈ దోషం ఏర్పడిన రాశులను ఆధారం చేసుకొని వ్యక్తిగత జన్మకుండలి ద్వారా నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే తెలియజేస్తారు.పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430

 

పద్మ కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • జాతకులు తమ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీగా వ్యవహరించాలి. వివాహేతర సంబంధాల వలన వైవాహిక జీవితంలో ఎనలేని సమస్యలు తెచ్చి పెడతాయని గుర్తుంచుకోవాలి.
  • విద్య పరంగా కోర్సును ఎంచుకునే క్రమంలో జాగ్రత్త వహించాలి. ఈ దోష ప్రభావం వలన కోర్సు ఎంపికలో జాతకునికి గందరగోళం ఏర్పడుతుంది. దీని వలన ఎంచుకున్న విద్య వలన ఉపయోగం లేకుండా పోయే ఆస్కారం కూడా ఉన్నది.
  • తండ్రితో లేదా తండ్రి లాంటి పెద్దలతో గొడవలు, తగాదాలు పెట్టుకోరాదు. ఈ దోష ప్రభావం వలన జాతకులకు తరచూ ఏర్పడే దురుసు స్వభావం వలన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉన్నది.
  • అక్రమ విధానాలలో డబ్బు సంపాదించడం మానేయాలి. దీని వలన తీవ్ర సమస్యలు వాటిల్లే అవకాశం ఉన్నది.

పరిహారాలు:

  • నిష్ణాతులైన జ్యోతిష్యుల సలహా మేరకు, రాహు, కేతు మహా యంత్రములను ప్రతిష్టించుకొని, పూజించాలి.
  • జాతకులు తమకు వీలైనపుడంతా మహాశివునికి రుద్రాభిషేకం జరిపించుకోవాలి. నిత్యం మహా మృత్యుంజయ మంత్ర పఠనం చేయాలి.
  • జాతకుల యొక్క శక్తి మేరకు అవసరమైనవారికి ఆహారం, వస్త్రాలు దానం చేయాలి.
  • పద్మ కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book

astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.