loading

Category: Uncategorized

  • Home
  • Category: Uncategorized

ధన్వంతరీ హోమం

ధన్వంతరి హోమం

ధన్వంతరీ హోమనికి ధన్వంతరి భగవానుడు అధిపతిగా ఉంటాడు. పాల సముద్రమును చిలికేటపుడు ధన్వంతరీ భగవానుడు ఉద్భవించాడు. ఈ ధన్వంతరీ హోమము వల్ల మంచి ఆరోగ్యం, ధీర్ఘయువు జాతకులు పొందుతారు.

ఈ ధన్వంతరీ హోమం వల్ల అనుకూల ప్రకంపనలు ఉత్పన్నమయ్యి, జాతకుల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ మహాశక్తివంతమైన ధన్వంతరీ హోమం, అన్నీ రకాల అనారోగ్యాలకు చక్కటి పరిహారం. ఈ ధన్వంతరీ హోమం ఆచరించడం వల్ల, ధన్వంతరీ భగవానుడి అనుగ్రహం లభించి, అన్నీ రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈ ధన్వంతరీ హోమం జరిపించే సమయంలో 108 ఔషధ మూలికలను హోమాగ్నికి ఆర్పిస్తారు. ఆ హోమాగ్ని నుండి ఔషధ గుణములు వాయువు ద్వారా వ్యాపించడం వల్ల, శారీరక అనారోగ్యాలు నశించిపోతాయి.

         ఈ శక్తివంతమైన హోమం ఆచరించేందుకు ఏకాదశి తిథి ఎంతో మంచిది. గురు హోర, బుధ హోరలు  కూడా ఈ హోమం జరిపించేందుకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ ధన్వంతరీ హోమం, అన్ని రకాల వ్యాధులకు సరైన పరిహారం. ఈ హోమమును సంవత్సరానికి ఒకసారి జరిపిస్తే, అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.

Related Articles:

సంపూర్ణ జాతక పరిశీలన

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. 

జాతక పరిశీలన- Horoscope Reading

  Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?

డిసెంబర్ 26,2019 నాడు షష్ట గ్రహ కూటమిలో సంభవించిన సూర్య గ్రహణం జరిగిన తరుణంలో మానవాళికి జరుగబోవు దుష్పరిణామాలు శ్రీ C.V.S.చక్రపాణి గారు ముందుగానే వివరించడం జరిగింది.  వారి వద్ద ఉన్న ప్రాచీన కేరళ తాళపత్రముల నుండి సేకరించిన విషయంలో అతి భయంకరమైన వ్యాధులు మానవాళిని నాశనం చేయబోతోందని మరియు తీవ్రమైన భూకంపాలు, జల ప్రళయాలు సంభవించబోతున్నాయని ముందుగానే తెలియజేయటం జరిగింది. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం అనగా 1959లో వికారి నామ సంవత్సరంలో ‘హంటా వైరస్’ అనే సూక్ష్మ క్రిమి మానవులకు సోకింది. ఈ వైరస్ కారణంగా ఎంత మంది మరణించారో లెక్కపెట్టలేకపోయారు. అప్పటివరకూ ‘హింది-చిన్ని భాయ్ భాయ్’ అని నినాదంతో మెలిగిన చైనీయులు, భవిష్యత్తులో భారతదేశంతో ఎలాంటి యుద్ధాలు ఉండవని ప్రకటించిన చైనీయులు, 1959 వికారి నామ సంవత్సరములో భారతదేశానికి మరియు చైనా దేశానికి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఆ తరువాత 1962 సంవత్సరంలో అష్టగ్రహ కూటమిలో జరిగిన సూర్య గ్రహణం తరువాత భారత దేశానికి మరియు చైనా దేశానికి మధ్య జరిగిన యుద్ధంలో భారత దేశం పరాజయం పాలైంది. ఆ తరువాత సరిగ్గా 2019లో జరిగిన షష్ట గ్రహ కూటమిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవించింది. ఈ గ్రహణం సంభవించిన తరువాత నాలుగు రోజులకి కరోనా వైరస్ అనే మహమ్మారి మొదట చైనా దేశంలో సంభవించింది. ఎందుకనగా సూర్య గ్రహణం ధనూరాశిలో ఏర్పడింది. ధనూరాశి తూర్పు దిక్కును సూచిస్తుంది. అందుకే తూర్పు దేశం అయిన చైనాలో ఈ తెలియని వైరస్ తయారయ్యింది. మార్చి నెల 21 వరకు కుజుడు ధనూరాశిలోనే ఉన్నాడు. అందుకే ధనూరాశిలో సూర్య గ్రహణం జరిగిన తరువాత కుజుడు ఫిబ్రవరి నెలలో ధనూరాశిలోకి ప్రవేశించాడు. ఆ సమయం నుండి ఈ కరోనా అను అంటువ్యాధి ప్రపంచమంతా నెమ్మదిగా పాకటం మొదలయ్యింది. అయితే ఔషధ కారక గ్రహం మరియు భూమిని పరిపాలించే రవి ఏప్రిల్ 14,2020 ఉచ్చస్థానమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయం నుండి భూమి పై ఉన్న ప్రజలకు రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఈ వ్యాధి పూర్తిగా అంతరించిపోవడానికి జూన్ నెలలో వచ్చే సూర్య గ్రహణం పూర్తి కావాలి. మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం వ్యాధులు ప్రబలడానికి కారణాలు ఏమనగా గ్రహ కూటములు, గ్రహణాలు, వ్యాధుల వల్ల ఎలాంటి గ్రహ జాతకులు మృత్యువు పాలవుతున్నారు, ఎవరిది సాధారణ మరణం, ఎవరిది బలవన్మరణం, అసాధారణ మరణం ప్రాప్తిస్తుందో తెలిపేదే మెడికల్ ఆస్ట్రాలజి.

Solar Eclipse-2019                             

ఈ మెడికల్ ఆస్ట్రాలజి ద్వారా వ్యక్తుల జీవితంలో ఎదుర్కొనే దీర్ఘకాలిక వ్యాధులు తెలుసుకొని, ధన్వంతరీ శాస్త్రం ద్వారా పరిష్కారములు, నివారణలు, నిర్మూలనలు జరపవచ్చు.

  • 2020 మార్చి, మే, జూన్, సెప్టెంబర్ నెలలో అతి తీవ్రమైన భూకంపాలు సంభవించును.
  • ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో తీవ్రమైన పెను తుఫాను సంభవించును.

ఈ శార్వరి నామ సంవత్సరంలో జగన్మాత ప్రాతినిద్యం వహిస్తుంది. అందువల్ల ఆ జగన్మాతను కింది మంత్రముతో జపించడం వల్ల నవనాయకులు అనగా నవగ్రహాలు కొంత అనుకూలంగా ఉండటం జరుగుతుంది. కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల వ్యక్తులు దారుణమైన మానసిక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ కలి ప్రభావాన్ని మానవులు తట్టుకోలేక సతమతమవుతారు. కలి ప్రభావాన్ని తగ్గించి కలిపురుషుని దృష్టిని మరల్చగల శక్తి, కాలాన్ని సైతం తన ఆధీనంలో ఉంచుకోగలిగిన శక్తి కాలభైరవునికి ఉంది. కలియుగంలో కలిపురుషుడు కలిగించే చెడు సంఘటనలను మానవులు ఎదుర్కొనే శక్తిని అష్ట భైరవులు ప్రసాదిస్తారు. సాత్విక పూజలు ఫలించే తరుణం ఇది కాదు. వామాచార విధానంలో ప్రతీ వ్యక్తి అష్ట భైరవ పూజలు జరుపుకొని శీఘ్రంగా ఇష్టకార్యసిద్ధి, గ్రహదోష దృష్టి, అవయోగాలు పరిష్కారమవుతాయి. ఈ తాంత్రిక పద్ధతులు శ్రీ C.V.S.చక్రపాణి గారి వేద నారాయణ అధర్వణ పీఠము నందు (పాలక్కాడ్-కేరళ, పాలమంగళం-ఆంధ్ర ప్రదేశ్) వారి తంత్ర పీఠము నందు గ్రహదోష పరిహారములు జరుగును. ఈ పీఠము నందు అత్యంత నిష్టగా, శ్రద్ధగా, శాస్త్రోక్తంగా, వామాచార విధానంలో నాగ దోష పరిహారములు జన్మకుండలిలో ఉన్న గ్రహదోషాల వల్ల వ్యక్తులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు ఈ తంత్ర పీఠములో పరిహారములు ఖచ్చితముగా జరుగును.

ఖచ్చితమైన మరియు సంపూర్ణమైన జ్యోతిష్య పరిశీలన పరిజ్ఞానం ఉన్నప్పుడే కదా దానికి పరిహారం చెప్పగలిగేది.

దైవజ్ఞ శ్రీ C.V.S.చక్రపాణి గారి పరిపూర్ణమైన జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానంతో, సంపూర్ణమైన విశ్వాసంతో జన్మకుండలి పరిశీలన చేసి మీకు గల యోగాలు, అవయోగాలు, పరిష్కారములు తెలిపి, పరిహారములు వీరి తంత్ర పీఠం నందు జరిపించి మాకు సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రాప్తింపజేయుటకు సంకల్పించారు.

ఈ శార్వరి నామ సంవత్సరంలో నాగ యక్షిణి అమ్మవారు సంవత్సరానికి సంవత్సర ఫలదాయకులకు ప్రాతినిద్యం వహించి ఉంటారు.

ఈ శార్వరి నామ సంవత్సరంలోనైనా సరే అందరూ గ్రహ దోషములు నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నాను. హైందవ ప్రజలందరూ శ్రీ శార్వరి అమ్మవారి అనుగ్రహం కటాక్షం పొందాలని సుఖసంతోషాలతో తలతూగాలని కోరుకుంటున్నాను.

     ఇట్లు

     వేద నారాయణ అధర్వణ తంత్ర పీఠం

     పాలమంగళం (ఆంధ్రప్రదేశ్)

     పాలక్కాడ్ (కేరళ)    

Email: chakrapani.vishnumaya@gmail.com                       Ph: 9846466430

Related Articles:

నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope

నష్టజాతక ప్రశ్నముThe Lost Horoscope

నష్టజాతక ప్రశ్న అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం తెలియని వారికి, వారి యొక్క జన్మించిన తేదీ, సమయం లగ్నం తెలుసుకుని జాతకచక్రమును రూపొందించే జ్యోతిష్య శాస్త్ర విధానం. ప్రజలకు తాము జన్మించిన సమయం, పుట్టిన తేదీ వివరాలు గుర్తుంచుకోకపోవడం వల్ల తరువాతి కాలంలో ఆ వ్యక్తి గ్రహదోషాల రీత్యా అవయోగాలు సమస్యలు ఎదురయినపుడు గ్రహదోషాలకు పరిహారములు ఏమిటో ఏ గ్రహదోషాలు ఉన్నయో తెలియక తికమక పడతారు. పుట్టిన పేరును బట్టి, మొదటి అక్షరాన్ని బట్టి, రాశిని నిర్ణయించుకొని మనకు మన రాశి తెలిసింది అని సంతృప్తి పడదామని ప్రయత్నిస్తారు. కాని అది సరైన విధానం కాదు. ఎందుకంటే మీ పేరును, మీరు జన్మించిన నక్షత్రానికి సంబంధించి పెట్టి ఉండకపోవచ్చు. అప్పుడు మీకు మీ రాశి ఖచ్చితంగా తెలియకపోవచ్చు. రాశి మాత్రమే తెలుసుకోవడం వల్ల జాతకచక్రం రూపొందించలేము. రాశి వల్ల ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ప్రశ్న, గుణగణాలు తెలుసుకోవడం కాదు గదా. జన్మకుండలిలో గ్రహాల దోషాల అవయోగాల వల్ల జాతకులు ఎదుర్కొంటున్న దుష్పరిణామాలు సమస్యలకు గ్రహదోష పరిహారాలు తెలియాలి.

Nashta Jathaka Prashna

నష్ట జాతక ప్రశ్నము అనే జ్యోతిష్య విధానం ద్వారా మీ చేత ప్రశ్న వేయించి, మీ యొక్క పుట్టినతేది, పుట్టిన సమయం, లగ్నం తెలుసుకొని మీ జాతకచక్రమును రూపొందించటం జరుగుతుంది.

మన పూర్వీకులైన మహర్షులు ఎంతో తపశ్శక్తితో దైవానుగ్రహం పొంది, ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని సిద్ధి పొంది జ్యోతిష్య శాస్త్రంలో నష్టజాతకాధ్యాయమును తాళపత్రముల ద్వారా మనకు అందజేయటం జరిగింది. ఈ తాళపత్రములలో  నష్టజాతకధ్యాయమును నేను గ్రహించడం జరిగింది C.V.S.చక్రపాణి గారి ద్వారా మీ జాతక చక్రమును రూపొందించుకోవచ్చు. మీలో ఎవరికైనా జన్మతేదీ, సమయం తెలియని వారు జాతకచక్రమును పొందదలచిన వారు, తంత్ర గురువు కేరళ వావిల్యాపుర వాస్తవ్యులు తంత్ర పీఠాధిపతులు అయిన C.V.S.చక్రపాణి గారిని సంప్రదించి గలరని అందరూ దైవనుగ్రహం, గురుదేవుల అనుగ్రహం పొందాలని సదా కోరుకుంటున్నాము.

మీ యొక్క జాతకచక్రమును పొందగోరు వారు గురూజిని ప్రశ్న అడగాలి.

ప్రశ్న- గురూజీ! మా పుట్టిన తేదీ వివరాలు మాకు తెలియవు. నా యొక్క జాతకచక్రమును తెలియజేయండి అని అడగాలి.

ప్రశ్న అడిగే ముందు తలస్నానం ఆచరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించి, సంపూర్ణ విశ్వాసంతో అడగాలి.

మీ జాతకచక్రమును నిర్మించి మీకు కలిగే యోగాలు, అవయోగాలు వాటికి గ్రహదోష పరిహారాలతో సహా గురూజీ మీకు తెలియజేయడం వ్రాసి పంపడం జరుగుతుంది. తద్వారా మీ పూర్వజన్మ విశేషాలను కూడా తెలుసుకోవచ్చు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి అభిచార కర్మలకు, శత్రువుల చెడు ప్రయోగాల నిర్మూలనకు తాంత్రిక హోమములు కేరళలోని మా బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకోవచ్చు.

వివరాలకు సంప్రదించండి. Ph 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Related Articles:

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Bhairavi homam -భైరవి హోమం

భైరవి హోమం (Bhairavi Homam)

దశమహావిద్యలలో 6వ మహావిద్యే ఈ భైరవి మాత. ఈ భైరవినే త్రిపుర భైరవి, బాల భైరవి, కాల భైరవి అని కూడా పిలుస్తారు. నీతి, నిజాయితీ, జ్ఞానం, వరాలను ప్రసాదించే దేవత. ఈ భైరవి మాతను శుభంకరి అని కూడా పిలుస్తారు. భైరవ సమేత భైరవి మాత ప్రపంచంలో జరిగే సృష్టికి, ప్రపంచ వినాశనానికి కారణ భూతురాలు అవుతుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా భైరవి మాత అదుపు ఆజ్ఞలలో ఉంటుంది. ఈ త్రిపుర భైరవి తాంత్రిక సాధన చేసిన వారు ఐహిక కోరికలను అదుపులో ఉంచుకునేందుకు, సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు భైరవి  మాత అనుగ్రహిస్తుంది.

తంత్రశాస్త్రంలో భైరవి మాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శీఘ్ర ఫలితాల కోసం, సంతానం కోసం, బాధల నుండి విముక్తి పొందటం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం దశమహావిద్యలలో ఒకరైన భైరవి మాత సాధన సాధకులు చేస్తారు. ఈ భైరవి మాత యొక్క తంత్ర సాధన వల్ల, హోమం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, దీర్ఘాయువు లాంటి ఇంకా ఎన్నో వరాలను ఆ భైరవి మాత మనకు అనుగ్రహిస్తుంది. సాధకుడు ఈ తంత్ర సాధన ద్వారా సిద్ధి పొందిన వెంటనే షీఘ్రంగా ఫలితాలు కనబడతాయి. భైరవి సాధనను నియమానుసారంగా, క్రమబద్ధంగా చేసిన సాధకుడికి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. దీనివల్ల ఆ సాధకునిలో ఆధ్యాత్మికత పెరగటమే కాకుండా మానవాతీత దుష్టశక్తులను, ప్రయోగాలను ఎదిరించే కిటుకులు, శక్తి సాధకుడు పొందుతాడు. అంతేకాకుండా భైరవి సాధన చేసిన సాధకుడికి అందరిని ఆకర్షిస్తూ  మాట్లాడే శక్తి, వాక్చాతుర్యం కలుగుతాయి.

త్రిపుర భైరవి మహాయంత్రమును ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజించిన వారికి కూడా తన మాటలతో ఇతరులను ఒప్పించే శక్తి గల మాటతీరును, తనని తాను వ్యక్తపరచుకునే గుణాన్ని, మానసిక ఆనందమును ఆ భైరవి మాత కలుగజేస్తూ భక్తులను ఎల్లపుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ త్రిపుర భైరవి మహా యంత్రం వల్ల అన్నీ రకముల దుష్ట శక్తులు, భయాలు, అవాంఛిత సంఘటనలు, నరాల బలహీనత, దుష్ట ప్రేతముల యొక్క బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఎందుకనగా ఈ భయాలు, ఆందోళనలు, దిగుళ్లు, ప్రమాదాలు, వివాదాలు లాంటి సంఘటనలు అన్నీ కూడ త్రిపుర భైరవి మాత ఆధీనంలో ఉంటాయి. కావున తన భక్తులకు వీటి నుండి విముక్తిని కలుగజేస్తుంది. త్రిపుర భైరవిని ఏ విధంగా ఆరాధించాలో పురాణాలలో చెప్పబడింది. ఐహిక సుఖాలను జయించేందుకు, అన్ని విధాల అభివృద్ధికి తన భక్తులను అనుగ్రహిస్తుంది.

తంత్ర గురువు ఆధ్వర్యంలో మాత్రమే భైరవి మాత సాధన చేయాలి. మంత్ర పఠనం, యంత్ర పూజ, నైవేద్యం, హోమం మొదలైన క్రియల ద్వారా భైరవి మాత సంతుష్టరాలు అవుతుంది. ఆ తరువాత సాధకుని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రమాదాలను ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొనే శక్తితో పాటు, సాధకునికి మానవాతీత శక్తులను కూడా ఆ తల్లి ప్రసాదిస్తుంది. భయాలు, ఆందోళనలు, దిగుళ్లు, ప్రమాదాలు, అపకీర్తి, దుష్ట శక్తులు, సంశయాలు, ప్రేతాత్మలు, అకాల మరణాలు లాంటి వాటి నుండి భైరవి మాత సాధకుడిని రక్షిస్తుంది.

జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసినట్లైతే జన్మకుండలిలోని లగ్నానికి భైరవి ఆధిపత్యం వహిస్తుంది. శరీరాన్ని, మనస్సును, అంతరాత్మను, లగ్న సంబంధిత అనగా తనూభావ సంబంధిత అంశాలను శుద్ధి చేసి, నిరంతరం కాపాడుతూ ఉంటుంది. ఎవరికైతే తమ జన్మకుండలిలో లగ్నదోషం ఉన్నదో, ఆ జాతకులు భైరవి మాత తంత్ర పూజను ఆచరించాలి. లజ్ఞాధిపతి గాని, లగ్నములో ఉన్న గ్రహాలు యొక్క మహర్దశ, అంతర్దశల సమయాల్లో లేదా లగ్నంపై గాని, లగ్నంలో ఉన్న గ్రహంపై గాని పాప గ్రహాల దృష్టి ఉన్నప్పుడు, ఆ జాతకులు వామతంత్ర దశమహావిద్య తాంత్రిక భైరవి పూజను ఆచరించాలి. దీని వల్ల జన్మకుండలిలో ఉన్న లగ్న దోషం తొలగిపోతుంది.

Related Articles: 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

సంపూర్ణ జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

 

బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు Bagalamukhi Yantra sadhana

Bagalamukhi Yantra sadhana

బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు:

      బగలాముఖి అమ్మవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన దేవత. ఈ బగలాముఖి మాత అన్నీ రకముల చెడు దుష్ట శక్తులు, భయములు అన్నింటి నుండి దూరం చేస్తుంది. బగలాముఖి మాత యంత్రము ఎంతో శక్తివంతమైనది, శుభకరమైనది. పురాణాల ప్రకారం తక్షణ ఫలితములు ఇచ్చే సాధనలలో ఈ బగలాముఖి యంత్ర సాధన ఎంతో శుభకరమైనది. దుష్ట శక్తులు, వాటి ప్రభావాల వలన కలిగే అడ్డంకులు, చేతబడి క్రియలు నుండి ఎంతో తొందరగా ఈ బగలాముఖి యంత్ర సాధన వలన బయట పడతారు.

ఈ యంత్ర సాధన వలన సాధకుడు కోరికలు అన్నీ కూడా నెరవేరేందుకు, దుష్ట శక్తుల నుండి రక్షణ పొందేందుకు తోడ్పడుతుంది. జీవితములో ఎదుర్కొనే అన్నీ రకముల సమస్యలకు ఈ యంత్ర సాధన సాధకుడికి ఎంతో శుభ ఉపయోగమును ఇస్తుంది అని చెప్పవచ్చు.

బగలాముఖి యంత్ర పూజా విధానం :

ఈ యంత్రమును ప్రతిష్టించే ముందు సాధకుడు బగలాముఖి మహా యంత్రమును పంచామృతములతో అభిషేఖము చేయాలి. ఆ తరువాత గురువు గారు ఇచ్చిన పూజా విధానమును అనుసరించి ఈ యంత్రమును పూజా మందిరములో ప్రతిష్టించాలి. యంత్రమును ప్రతిష్టించిన తరువాత మంచి శీఘ్ర ఫలితముల కోసం పూలు, కొబ్బరికాయ,పసుపు కుంకుమలతో పూజించాలి. ఈ యంత్ర  ప్రత్యేక బగలాముఖి బీజ మంత్రములతో పూజించాలి. బీజ మంత్రమును ఉచ్చరించడం వలన ఆ మంత్రము నుండి యంత్రముకు శక్తి చేకూరుతుంది. ఆ తరువాత ఆ యంత్రము నుండి ఆ యంత్రము ఉండే చుట్టుప్రక్కల వాతావరణముకు ఆ పాజిటివ్ ఎనర్జీ తరలించబడుతుంది. ఈ బగలాముఖి యంత్రమును రాత్రి సమయములో ప్రతిష్ట చేస్తే ఆ యంత్రము ఎంతో శక్తివంతముగా, శీఘ్ర ఫలితములు ఇచ్చేదిగా మారుతుంది. మహా శివరాత్రి, హోలీ, దీపావళి, దసరా వంటి పర్వదినములలో కూడా ఈ యంత్ర ప్రతిష్ట గావించవచ్చు. ఈ విశ్వములో ఏ ప్రాణి కూడా బగలాముఖి మాతను ఓడించలేదు. జీవితములో జరిగే ప్రతి సంఘటనకు తన భక్తులకు బగలాముఖి అమ్మవారు విజయమును చేకూరుస్తుంది.

Bagalamukhi Yantra

యంత్ర ప్రతిష్ట చేసే విధానము:

యంత్రమును ప్రతిష్ట చేసే ముందు యంత్రమును గంగాజలముతో శుభ్రము  చేసి, పంచామృతాలతో అభిషేకము చేయాలి. యంత్ర సాధన చేసే సాధకుడు స్వచ్చమైన మనస్సుతో, పూర్తి భక్తి శర్ద్ధ, నమ్మకముతో శ్రీ భగలాముఖి మాతను ప్రార్థించాలి. భగలాముఖి మాత యొక్క రక్షాకవచము బంగారు లేదా వెండిలో చేయించుకొని ధరించవచ్చు. యంత్ర సాధన చేసే సమయములో సాధకులు పసుపు పచ్చటి వస్త్రాలు ధరించాలి.

భగలాముఖి మహా యంత్రమును ప్రతి రోజు ధూపము, దీపముతో ప్రార్థించాలి. పసుపు పచ్చ వస్త్రములు ధరించి, సాధకులు కూర్చున్న పీటము పై కూడా పసుపు రంగు వస్త్రము ఉంచి కూర్చోవాలి. సాధకులు భగలాముఖి  మాత యొక్క మంత్ర జపము చేయాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. పసుపు రంగు చీర, వస్త్రము ఏదైనా శక్తి ఆలయములో భగలాముఖి దేవికి సమర్పిస్తున్నట్టు సంకల్పించి దానము చేయాలి. ఇలా చేయటం వలన జీవితములో అనుభవిస్తున్న కష్టాలకు, ఒడిదుడుకుల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఈ యంత్ర సాధన చేయటం వలన శత్రువులపై విజయము సాధించవచ్చు, శతృనాశనం చేయవచ్చు, దుష్ట శక్తులు, చేతబడిలాంటి ప్రయోగముల నుండి రక్షణ పొందవచ్చు. ఈ భగలాముఖి యంత్ర సాధన చేసే వారికి కోర్టు వ్యవహారములలో కూడా విజయము లభిస్తుంది. కానీ ఈ యంత్ర సాధన చేసేటపుడు చేయాల్సిన నియమములు ఖచ్చితంగా పాటించి భక్తి శ్రద్దతో పూజిస్తే ఆ భగలాముఖి మాత సాధకుని కోరికను కచ్చితంగా తీరుస్తుంది. ఈ యంత్రమును పూజా మందిరములో ప్రతిష్టించి మన కళ్ళకు ఎదురుగా యంత్రము ఉండేతట్టు చూసుకోవాలి. మంత్ర జపము ఆరంభించే ముందు చుట్టూ ప్రక్కల ఎలాంటి శబ్దములు లేకుండా చూసుకొని, శ్రద్ధతో  ఆ యంత్రము యొక్క మధ్య భాగము పై  దృష్టి కేంద్రీకరించి ఓంకారము జపించాలి. మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ధ్యానించాలి. ఆ తరువాత భగలాముఖి మంత్ర జపము చేయాలి. ఇలా చేయటం వలన మొదటి రోజు నుండే సాధకునిలో, సాధకుని జీవితములో మార్పు కనిపిస్తుంది. ఈ యంత్ర పూజను మంగళవారము రోజున మొదలు పెట్టాలి. చతుర్దశినాడు వచ్చే మంగళవారము నాడు, సూర్యుడు మకర రాశిలో ఉన్న ముహూర్తము ఎంతో గొప్ప ఫలితములు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ పురాణాల ప్రకారం సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే మంగళవారం చతుర్దశి నాడు శ్రీ భగలాముఖి మాత ముల్లోకాలలో ఉన్న రాక్షసులను సంహరిస్తుంది అని చెప్పబడింది.

మంత్రము:

“ఓం హ్లీం భగలాముఖి సర్వదుష్టానం వచం ముఖాన్ పాదం స్తంభయ ఝివ్యం కిలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా||”

శాస్త్రాల ప్రకారం భగలాముఖి దేవత దశమహావిద్యలలో  ఎనిమిదవది. అపూర్వమైన శక్తి గల ఈ భగలాముఖి మాతను పూజించిన వారికి, యంత్ర సాధన చేసిన వారికి వివాదాలలో, శత్రువులపై విజయం సాధిస్తారు. అన్నీ రకముల సమస్యలను తీర్చగల దయా మూర్తి. అంతేకాకుండా శాస్త్రాల ప్రకారం ఈ భగలాముఖి మాత తన యంత్రములో ఆధీష్టించి భక్తుల కోరికలు తీర్చటానికి మక్కువ  చూపుతుందని చెప్పబడింది. 

 

||మంగళంమహత్||

||ఇష్ట కార్య ఫలసిద్ధిరస్తు||

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ

Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ

మనము నివసించే ఈ భారత భూమి ఎంతో పవిత్రమైన కర్మ భూమి, పుణ్య భూమి. ఎత్తైన హిమాలయములు, వింధ్యా పర్వతములు, నైమిశారణ్యం, దండకారణ్యం  లాంటి దట్టమైన అడవులు; గంగా, యమునా,కావేరి,కృష్ణ, గోదావరి, నర్మద లాంటి పవిత్ర నదులతో ఈ పవిత్ర భారతదేశము నిండి ఉంది. ఎన్నో పురాణములు వ్రాసి వాటిలోని విలువలను, జ్ఞానమును లోకమునకు తెలియజేసిన బ్రహ్మర్షులు, మహర్షులు జన్మించిన భూమి. ఈ భరత  భూమిపైనే వేదములు కూడా వెలికితీయబడ్డాయి. మొదట శ్రీ వేద వ్యాస మహర్షి వేదములు అన్నింటిని అభ్యసించి , వాటిని తన శిష్యులకు భోదించాడు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానమైన వేదములలో ఆరు అంగములు ఉన్నాయి. ఆ అంగములలో ఒకటి “జ్యోతిష్య శాస్త్రము”. మనకు అష్టాదశ 18 పురాణములు ఉన్నాయి. వేదములను అభ్యసించే శక్తి లేని వారికి, ఈ పురాణములు, ఇతిహాసములు ఒక వరము. నారదమహర్షి ఆధ్వర్యములో వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యం “శ్రీమద్రామాయణము”. 

Astrology in Ramayana

        ఈ “శ్రీమద్రామాయణములో” జ్యోతిష్య శాస్త్రము గురించి  సంబంధములు , సంఘటనలు ఎన్నో చెప్పబడ్డాయి. రామాయణములో ఏడు కాండలు ఉన్నాయి. ప్రతి కాండములో గ్రహములు, ముహూర్తము, వాస్తు శాస్త్రము, పంచాంగము లాంటి విషయములను శ్రీ మద్రామాయణములో ఆచరణలో ఉంచారు. నేను నా అనుభవము రీత్యా రామాయణములోని కాండములలో ఏ కాండములో , ఏ రకంగా జ్యోతిష్య శాస్త్రమును ఉపయోగించారో మీకు వివరిస్తాను.

1.  బాల కాండ :

(a) మొదటి కాండము లేదా మొదటి అధ్యాయము అయిన బాల కాండలో శ్రీ రాముడు మరియు అతని ముగ్గురి సోదరుల జనన కాలము గురించి వాల్మీకి మహర్షి ఈ విధంగా వివరించాడు.

||శ్లో||      తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికె తిథౌ|

           నక్షత్రే దితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసూ||

           గృహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ|

           ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక సమస్కృతమ్||
   కౌసల్యా జనయద్రామం సవ్య లక్షణ సంయుతం|

           పుష్యే జాతస్తు భరతొ మీనలగ్నే ప్రసన్నధిః||

           సార్పే జాతౌ తూ సౌమిత్రి కులీరే భ్యూదితే రవౌ||     (1:18:8 to 10; 14)

“ 12 నెలల తరువాత , చైత్ర మాసములో శుక్ల నవమి నాడు  కౌసల్యా దేవికి శ్రీ రాముడు జన్మించాడు. కర్కాటక లగ్నములో, చంద్రుడు గురువుతో కలసి, సూర్యుడు, కుజుడు, శుక్రుడు, శని ఉచ్చస్థానములో ఉంటూ , పునర్వసు నక్షత్రములో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామునికి కౌసల్యా దేవి జన్మనిచ్చింది. మీన లగ్నములో, పుష్యమి నక్షత్రములో భరతుడు జన్మించాడు. మరుసటి రోజు కర్కాటక లగ్నములో, ఆశ్లేష నక్షత్రములో కవలలు అయిన లక్ష్మణ, శత్రుజ్ఞులు జన్మించారు”

*ఈ వాల్మీకి రామాయణములో చెప్పిన గ్రహ స్థానముల ప్రకారం శ్రీ రాముల వారి జన్మకుండలి తయారుచేసి,  పూర్తి విశ్లేషణ చేసి నాకు తెలిసిన శాస్త్ర రీత్యా త్వరలోనే మీకు అందజేసే ప్రయత్నము చేస్తాను.

(b) ఇదే బాలకాండములో శ్రీ రాముడు మరియు తన సోదరుల వివాహము ఉత్తర ఫల్గుణి నక్షత్రములో జరిగింది. ఈ కార్యమును ఉద్ధేశించి జనకమహారాజు , వశిష్ట మరియు విశ్వామిత్ర మహర్షులతో ఈ విధంగా చెప్పాడు.

||శ్లో||      ఉత్తరే దివసే బ్రాహ్మణ ఫల్గుణీభ్యాం మనీషీనాః |

           వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః||              (1:72:14)

దీని భావము ఏమిటంటే “నేటికీ రెండు రోజుల తరువాత సంతానపరుడైన భగుడు అనేవాడు అధిష్టాన దేవతగా ఉన్నప్పుడు, ప్రజాపతి కనుక వంశమును పెంచగల నక్షత్రం అయిన ఉత్తర ఫల్గుణి నక్షత్రములో వివాహము జరిపిస్తాను” అని జనకమహారాజు వివరించాడు.

*ఒకే తల్లి, తండ్రికి జన్మించిన పిల్లలకు ఒకే లగ్నములో, ఒక మండపములో వివాహము జరిపించడం నిషిద్ధం. అయితే ఒకే లగ్నములో రెండు శుభకార్యములు చేయవచ్చా? ఒక ఏడాది దాటితే కాని రెండవ శుభకార్యము చేయకూడదు. కానీ తల్లులు వేరు అయితే చేయవచ్చు అన్నారు. కాబట్టి రాముడికి, భరతుడికి ఒకే ముహూర్తములో వివాహము చేయవచ్చు. మరి లక్ష్మణ , శతృఘ్నులకు ఎలా? దీనికి సమాధానం దైవజ్ఞ విలాసములో చెప్పారు. లగ్నమును 30 డిగ్రీలుగా విభజిస్తే 29 డిగ్రీలలో ఒకరికి, 30వ డిగ్రీలలో మరొకరికి వివాహము జరిపించవచ్చు. అందువలన రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల వివాహములు సర్వశాస్త్ర సమ్మతమైన ప్రాజాపత్య వివాహములు అని చెబుతారు.

2.  అయోధ్య కాండ:

రెండవ కాండ లేదా అధ్యాయము అయిన అయోధ్య కాండలో ఉత్పాత గ్రహముల కలయికలు, స్వప్న శాస్త్రము, వాస్తు శాస్త్రము- ఈ శాస్త్రముల ప్రాముఖ్యత సంబంధిత సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాము.

(a)     శ్రీరాముని పట్టాభిషేకము గురించి , దశరథ మహారాజు వశిష్ట మహర్షితో ఈ విధంగా తెలియజేశాడు.

||శ్లో||          చైత్రః శ్రీమానయం మాసః పుణ్యహ్ పుష్పితకాననః|

               యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతామ్||

               స్వ ఏవ పుణ్యా భవిత స్వో భీశెచ్చస్తూ మే సుతః|

               రామో రాజీవతమ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః||              (2:4:2)

              

దీని భావం ఏమిటంటే “ఇది చైత్ర మాసము.  పరమపవిత్రమైన మాసం. అరణ్యములు అన్నింటిలో చెట్లు పుష్పించి , శోభించి ఉంటాయి. పుష్యమి నక్షత్రములో చంద్రుడు కలసి ఉన్న రోజును రాముని పట్టాభిషేకానికి ముహూర్తముగా నిర్ణయించారు.”

సుమంత్రుని పిలిచి రాముడిని తీసుకురమ్మనారు. వశిష్టుల వారిని పిలచి పట్టాభిషేకమునకు కావలసిన ఏర్పాట్లు చేయమని కోరాడు.

(b)     శ్రీ రాముడిని దశరథుడు పిలిపించాడు. దశరథుడు శ్రీరామునితో ఇలా అన్నాడు:

||శ్లో||          అపి చాద్యాసుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ |

               సనిర్ఘాతాది వొల్కా చ పతతీహా మహాశ్వనా||

               అవశ్టబ్ధంచ మే రామ నక్షత్రం దారునెగ్రహైః|

               ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాఙరకరాహుభీః||

               ప్రాయెనహి నిమిత్తానామిట్టశానాం సముద్భవే|

               రాజా హి మృత్యుమాత్నోతి ధోరాంవాపదమృచ్ఛతి||   (2:4:17,18&19)

               అద్య చంద్రోభ్యూపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు|

               స్వః పుష్యయోగం నియతం వశ్యంతే దైవచింతకాః||  (2:4:21)

“రామా! నాకు పీడ కలలు వస్తున్నాయి. ఉల్కలు విపరీతమైన శబ్దముతో కింద పడుతున్నాయి. తోకచుక్కలు కనబడుతున్నాయి. అన్నింటిని మించి ఈ వేళ నా జన్మ నక్షత్రమును రవి, కుజుడు, రాహువు అను మూడు పాప గ్రహములు ఆవహించి ఉన్నాయి. అందుకని ప్రమాదము ముంచుకొస్తోంది. ఇలాంటి స్వప్నములు, గ్రహ కలయికలు ( జన్మనక్షత్రముకు పాప గ్రహములు ఆవహిస్తే) జరిగితే సహజంగా , మహారాజు మరణము పొందుతారు లేదా భయంకర సంఘటనను ఎదుర్కొంటారు అని మన దైవజ్ఞులు (జ్యోతిష్యులు) తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు చంద్రుడు పునర్వసు నక్షత్రములో ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రములో ఉంటాడు. ఈ నక్షత్రము నీ పట్టాభిషేకముకు ఎంతో శుభప్రదం అని మన దైవజ్ఞులు తెలియజేశారు. కాబట్టి పట్టాభిషేకముకు తయారు అయ్యి, పూజాది కార్యక్రమములు నిర్వహించు” అని దశరథుడు శ్రీరామునితో చెప్పాడు.

*ఇక్కడ పీడకలల గురించి , పాపగ్రహముల కలయిక గురించి , శుభప్రదమైన రోజుల గురించి రామాయణములోని చర్చను గురించి మనము గ్రహించగలిగాము. జ్యోతిష్య పండితులను ఇక్కడ (రామాయణములో) “దైవజ్ఞులు”గా సంభోదించారు. ఎవరైతే గ్రహ కదలికలను నిరంతరంగా గమనిస్తూ, తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి సరైన పరిరము తెలియజేస్తారో వారు ‘జ్యోతిష్య పండితులు’.

(c)     ఇదే అయోధ్య కాండలో శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళమని ఆజ్ఞాపించినపుడు , లక్ష్మణుడు కోపోద్రిక్తుడు అవుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడిని ఈ విధంగా శాంతింపజేస్తాడు.

||శ్లో||          సుఖదుఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ|

               యచ్చ కించిత్తథ భూతం నను దైవస్య కర్మ తత||            (2:22:22)

“సుఖము, దుఃఖము , కోపము,శాంతి, లాభం, నష్టం, శుభం, అశుభం, తప్పు, ఒప్పు ఇవన్నీ కూడా మన ప్రారబ్దం ప్రకారం జరుగుతాయి. వీటన్నింటిని దైవం శాసిస్తూ ఉంటాడు. ఆ దైవమును తిరస్కరించి మనము ఏమి చేయలేము. ఈ రోజు కైకేయ వెనకాల దైవము ఉండి నన్ను అరణ్యముకు పంపిస్తున్నాడు. అలా కాకపోతే నన్ను ఎప్పుడూ వేరుగా చూడని కైకమ్మ నన్ను అరణ్యవాసము చేయమని ఎందుకు అడుగుతుంది?” అని రాముడు లక్ష్మణుడిని సముదాయించాడు.

(d)     అరణ్యముకు చేరిన తరువాత లక్ష్మణుడు వారి ముగ్గురి (రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు) కొరకు ఒక ఆశ్రమము నిర్మిస్తాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఈ విధముగా తెలియజేస్తాడు.

||శ్లో||          కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చీరజీవిభీః|| (2:56:22)

 

“ఓ లక్ష్మణా! వాస్తు దేవతలను సంతృప్తిపరచిన తరువాత మాత్రమే నూతన గృహములోకి ప్రవేశించాలి. అప్పుడే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.”

*అరణ్యముకు వెళ్ళిన తరువాత అక్కడ లక్ష్మణుడు చక్కటి పర్ణశాలను నిర్మించాడు. నూతన నిర్మాణ గృహములోకి వెళ్ళేవారు దీర్ఘ కాలము జీవించాలంటే వాస్తు హోమము చేయాలి. వాస్తుహోమము చేయకుండా గృహప్రవేశము చేస్తే యజమాని అల్పాయూష్కులు అవుతారు. ప్రమాదములు సంభవిస్తాయి.

*మనము ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు, భవనములు నిర్మించుకుంటాము. ఆ నిర్మాణములలో సుఖంగా ఉండాలంటే చేయవలసిన హోమ కార్యక్రమములు చేసి తీరాలి.

3.  అరణ్య కాండ :

ఈ అరణ్యకాండలో రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్లే సంధర్భమును “బుధః ఖే రోహిణిమీవ” అని వాల్మీకి మహర్షి వివరించాడు. ఈ వాక్యముకు ఎంతో అంతర్గత అర్థం ఉంది. అది ఏమిటంటే  సీతాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్ళేటపుడు బుధుడు, చంద్రుడు అధిపతిగా ఉండే రోహిణి నక్షత్రములో ఉన్నాడు, దీనివలన లంకా ప్రజలకు శుభము కాదు అని వాల్మీకి మహర్షి వివరించాడు.

ఈ అరణ్య కాండలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, సంఘటనలు ఇప్పుడు మనము తెలుసుకుందాము. “జటాయువు” అను పక్షి శ్రీరామునికి “ముహూర్తము” గురించి వివరిస్తుంది. అంతేకాకుండా “కబంధ” అను రాక్షసుడిని శ్రీ రామ లక్ష్మణులు సంహరిస్తే , పాపవిమోచనము కలిగి పాపగ్రహ దశ (చెడు గ్రహ దశ) జరుగుతున్నప్పుడు విజయం కోసం ఏమి చేయాలో శ్రీరాముడికి ఆ కబంధుడు సలహా ఇస్తాడు.

(a)

||శ్లో||          యేనయాతి ముహూర్తెన సీతామాదాయ రావణాః|

               విప్రనష్టం ధనం క్షిప్రం తత్ స్వామి ప్రతిపధ్యతే||

విందో నామ ముహూర్తయమ్ సచ కాకుస్థా నాబుధత|

               త్వప్రియాం జానకీం హుత్వా రావణో రాక్షసేఖరః||   (3:68:12&13)

పక్షి జటాయువు శ్రీ రామునితో “రామా! రావణుడు సీతాదేవిని ‘విందా’  ముహూర్తములో అపహరించుకుపోయాడు. కాబట్టి నీ సీతాదేవి నీకు దొరుకుతుంది. ‘విందా’ ముహూర్తములో ఇతరుల వద్ద నుండి ఏదైతే దొంగలిస్తారో, ఆ వస్తువు తిరిగి యజమాని వద్దకే చేరుతుంది.  నీవు సీతమ్మను పొందుతావు. పరమ సంతోషంగా సీతా రాములు ఇద్దరూ ఉంటారు. మీ ఇద్దరికీ పట్టాభిషేకము అవుతుంది. చాలాకాలము నీవు రాజ్య పాలన చేస్తావు. “ 

‘కబంధుడు’ అను రాక్షసుడి చేతులు శ్రీ రామ లక్ష్మణులు నరికి వేసి , ఆ తరువాత చితిపై పెట్టి నిప్పుపెడతారు. కబంధునికి శాపవిమోచనము కలిగి , తన అసలైన అందమైన గంధర్వ రూపమును దాల్చాడు. శ్రీరాముడిని సీతాదేవి గురించి చింతించవద్దని సుగ్రీవుని గూర్చి ఈ విధంగా సలహా ఇస్తాడు.

||శ్లో||          రామ షడుక్తయో లోకే యాభిస్సర్వమ్ విర్మశ్యతే|

               పశీర్మష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే||    (3:72:8)

కబంధుడు రాముడితో “రామా! నీకు కావలిసినది ఏమిటో తెలుసా? నీకు చాలక్లేశముతో గడపాల్సిన దుష్ట సమయము నీకు నడుస్తోంది. అందుకే నీవు నీ భార్యను పోగొట్టుకున్నావు. నీలాగే భార్యను పోగొట్టుకుని కష్టాన్ని పొందుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే సుగ్రీవుడు.” 

“ఎవరైతే చెడుగ్రహ దశ నుండి కష్టాలు పొందుతున్నారో, వారు అదే రకమైన కష్టం, సమయం అనుభవిస్తున్న వారి సహాయము పొందాలి. రాముడి భార్యను రావణుడు అపహరించాడు, సుగ్రీవుని భార్యను వాలి అపహరించాడు.  కావున ఇద్దరూ ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాముడు తన చెడు దశా సమయం అంతము కావస్తుంది. అలాగే సుగ్రీవుని చెడు సమయము కూడా. కావున రాముడు, సుగ్రీవుల మైత్రి ఇద్దరికీ ఎంతో శుభ ఫలితాలు ఇస్తాయి”.

4.కిష్కింధ కాండ :

వాలి సుగ్రీవుల యుద్ధమును వాల్మీకి మహర్షి “బుధుడు, కుజుడు మధ్య యుద్ధము”తో పొలుస్తూ “బుధాంగరకాయోరీవా” అని సంభోదించారు.

వానరసేనకు అంగదుడు నాయకత్వము వహిస్తున్నాడు. జాంబవంతుడు, నీల, హనుమంతుడు మిగిలిన వానరము అంతా కలసి సముద్రపు వద్దకు వెళతారు. అక్కడ “సంపాతిఅను పక్షికి అంగదుడు రాముడి కథను గురించి, సంపాతి సోదరుడు అయిన జటాయువు యొక్క మరణము గురించి సంపాతి పక్షికి వివరించాడు. అదంతా విన్న సంపాతి పక్షి సీతమ్మ జాడలను ఈ విధంగా తెలియజేస్తుంది.

||శ్లో||          తస్తయాం వసతీ వైదేహీ దీనా కౌశేయవాసిని|

               రవాణాన్తః పూరే రుద్ధా రక్షసిభిస్సురక్షిత||

               జనకస్యాత్మజాం రాజ్ఞః తస్యాం ద్రక్ష్యథ మైథిలీమ||    (4:58:22&23)

               ఇహస్థో హామ్ ప్రపశ్యామి రావణం జానకీం తథా|

               అస్మాకమపీ సౌవర్ణాం దివ్యం చక్షుర్బలం తథా||             (4:58:31)

“నేను, జటాయువు పెట్టుకున్న పోటీలో సూర్యుని వేడిమికి, జటాయువును కాపాడబోయి నా రెక్కలు కాలిపోయి ఈ వింధ్యా పర్వతములపై పడ్డాను. ఇక్కడే ఉంటూ, నాకున్న దివ్యదృష్టితో జానకి మరియు రావణులను చూస్తాను. శోకసంద్రములో మునిగిన సీతాదేవి లంకలో, ఆడరాక్షస భటుల మధ్యలో ఉంది.  కావున నీవు లంకలో వెతికితే సీతమ్మ దొరుకుతుంది. మాకు కొన్ని మైళ్ళ దూరము చూసే దివ్య దృష్టి ఉంది. వంద యోజనముల ఉన్న దాన్ని కూడా మేము చూడగలము. “ అని సంపాతి పక్షి అంగదునికి వివరిస్తుంది.

*ఇక్కడ మనము గమనించాల్సిన విషయము ఏమిటంటే పక్షులకు సైతం దివ్య దృష్టి ఉంటుంది. అదే విధంగా దైవజ్ఞులు (జ్యోతిష్యులు) కూడా తమకు తపశ్శక్తి, జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానము ఉన్నందున వారు అధ్భుతమైన జరగబోయే సంఘటనలను చెప్పగలరు.

5.   సుందరా కాండ :

(a)ఈ సుందరా కాండలో వాస్తు శాస్త్ర సంబంధిత సంఘటనలను తెలియజేస్తున్నాను. హనుమంతుడు లంకా నగరం యొక్క విన్యాసమును, రావణుని ఘనమైన రాజభవనములను చూస్తాడు. ఆ సంఘటనను వాల్మీకి మహర్షి ఈ విధముగా తెలియజేస్తాడు.

||శ్లో||          గృహాణి నానావాసురాజీతాని|

               దేవాసురై శ్చాపి సుపూజితాని|

                సర్వైశ్చ దొషై పరివర్జితాని|

                కపిర్దదర్శ స్వబలార్జితాని||     (5: 5: 3&4)

హనుమంతుడు “రత్న వైఢూర్యములతో  దివ్యంగా వెలిగిపోతున్న ఘనమైన రాజభవనములు చూశాను. గృహములు అన్నీ కూడా వాస్తు శాస్త్రమునకు అనుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ నిర్మాణములో దోషము పట్టటానికి వీలులేకుండా ఉన్నాయి. దేవతలు కూడా అక్కడ ఇళ్లకు వస్తే అక్కడే పూజ చేసుకోవాలి అనిపించెట్టు ఉన్నాయి. వాస్తు శాస్త్ర నిపుణుడు అయిన మయుడు స్వయంగా ఈ భవనాలను నిర్మించినట్టుగా ఉన్నాయి. “ అని వివరించాడు.

*ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే మయుడుని గూర్చి పొలుస్తున్నారంటే, రామాయణ సమయములో వాస్తు శాస్త్రము ఆచరణలో ఉండేదని చెప్పవచ్చు.

(b)హనుమంతుడు లంకలో సీతాదేవిని మొదటి సారి చూడగానే శోకముతో ఈ విధముగా:

||శ్లో|| మాన్యా గురు వినీతస్యలక్ష్మణస్య గురుప్రియా|

        యదీ సీతాపీ దుఖార్త కాలొ హి దురతిక్రమః||        (5:16: 3)

“లక్ష్మణ మూర్తి చేత ఆరాధింపబడిన పాదములు కలిగిన సీతమ్మ, లక్ష్మణుని గురువు అయిన రామచంద్రమూర్తి ఇల్లాలు అయిన సీతమ్మ, అయోనిజగా  జన్మించిన సీతమ్మ, ఈ రోజు భూమి మీద రాక్షస స్త్రీల మధ్య పది నెలలుగా ఒకే వస్త్రమును కట్టుకొని ఉన్నదంటే “కాలోహి దురతి క్రమః” కాలము ఏదైనా చేస్తుంది. ఈ కాలమునకు అటువంటి శక్తి ఉంది. “ అని హనుమంతుడు బాధపడతాడు. 

*”కాలోహి దురతి క్రమః” ఈ వాక్యము దాదాపు 50 సార్లు ఈ వాల్మీకి రామాయణములో కనబడుతుంది. అంటే కాలమునకు అసాధ్యమైనది ఏది లేదు అన్న నిస్సందేహమైన నిజమును మనకు వాల్మీకి మహర్షి తెలియజేస్తాడు.

*”కాల పురుషుని”కి అందరూ తలవంచాలి. ఎవరైతే తమకు వచ్చే మంచి మరియు చెడు సమయములను గూర్చి తమ గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకొని అనుగుణంగా పరిహార క్రియలు జరుపుకుంటాడో, అతను వివేకి అని చెప్పవచ్చు.

(6)యుద్ధ కాండ :

(a)ఈ అధ్యాయములో యుద్ధము కొరకు కిష్కింధ నుండి లంకకు వెళ్ళేందుకు శ్రీరాముడు ముహూర్తము నిర్ణయిస్తాడు.

||శ్లో||  ఆసిమన ముహూర్తే సుగ్రీవ ప్రయాణమభిరోచయ|

        యుక్తొ ముహూర్తో విజయః ప్రాప్తో మధ్యం దివాకరః||

        ఉత్తరాఫల్గుణి హ్యాద్య క్షస్తు హస్తేన యోక్ష్యతే|

        అభిప్రాయం సుగ్రీవ సర్వాణికసమావృతాః||   (6:4:3 & 5)

 

రాముడు సుగ్రీవునితో ”ఈ  సమయములో సూర్యుడు ఆకాశానికి మధ్యలో ఉన్నాడు. మధ్య దినమున మార్తాండ బింబమై ప్రకాశిస్తున్నాడు. ఈ రోజున విశాఖ నక్షత్రము ఉన్నది. ఇక్ష్వాకు వంశీయులు అందరిదీ నక్షత్రం విశాఖ.మూలా నక్షత్రము రాక్షసుల నక్షత్రము. విశాఖ నక్షత్రం నా నక్షత్రముకు ఉద్ధేశించి సాధన తార అవుతుంది. మళ్ళీ రేపు రోజున వచ్చే హస్త నక్షత్రము నిషిద్ధం. అందువలన ప్రయాణము చేయకూడదు. ఇవ్వాళ మిట్ట మధ్యానము వేళ ముహూర్తము చాలా బాగుంది. కనుక ఈ ముహూర్తమును “విజయము” అని పిలుస్తారు. కాబట్టి ఉత్తరక్షణం మనం సైన్యాన్ని తీసుకొని బయలుదేరి వెళదాము” అని చెబుతాడు. 

(b) ఇంద్రజిత్తుని మరణము తరువాత తీవ్ర విచార ధోరణిలో ఉన్న రావణుడు, కోపోద్రిక్తుడై సీతాదేవిని చంపేందుకు వెళతాడు. ఆ సమయములో రావణుడి మంత్రి అయిన సుపర్శ్వ, సీతాదేవిని చంపవద్దని, రాముడితో యుద్ధము చేసి విజయము సాధించమని సలహా ఇస్తాడు.

||శ్లో||  అభ్యుత్యానం తమధ్యైవ కృష్ణ పక్ష చతుర్దశీం |

        కృత్వా నిర్యాహ్యమావాశ్యం విజయాయ బలౌవృతం ||  (6:92: 66)

 

“నీవు కృష్ణ పక్ష చతుర్దశి అయిన ఈరోజు సైన్యమును సిద్ధము చేయి. రేపు అమావాస్య రోజున నీవు రామునితో యుద్ధానికి తలపడి విజయము చేకూర్చుకో” అని సెలవిచ్చాడు. 

అమావాస్య రాక్షసులకు మంచి రోజు, మిగిలిన వారందరికి చెడు దినము. కావున రాముడికి రావణుడిని చంపటం ఎంతో కష్టతరము అయ్యింది.

రాముడు యుద్ధం చేసి అలసిపోయాడు. ఆ సమయములో అగస్త్య మహర్షి వచ్చి శ్రీ రాముడికి ఆదిత్య హృదయమును  ఉపదేశించి  భక్తితో ఈ ఆదిత్య హృదయమును మూడు సార్లు జపించమని సలహా ఇస్తాడు. రాముడు అదే విధంగా ఆదిత్య హృదయమును జపించి, రావణుడిని సంహరిస్తాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి చెప్పిన మాటను శ్రద్ధగా పాటించాడు. రావణుడు సంహరింపబడ్డాడు. అధర్మమును ధర్మము జయించింది.

 పురాణపురుషోత్తముడైన , దివ్య పురుషోత్తముడైన శ్రీ రాముడు “కాల మహిమ” వలన ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇందులో ఎవ్వరికీ ఆక్షేపము లేదు. కాలమునకు అందరూ సమానమే. కాలము ఎంతో శక్తివంతమైనది. కాలముకు మిత్రులు, శత్రువులు ఉండరు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. సద్గురువుల యొక్క ఆదేశాలను ఆచరిస్తే ఈ కాలము వలన మనము ఎదుర్కొంటున్న  కష్టాలకు కొంతవరకు చెక్ పెట్టవచ్చు. నిత్య దైవ నామస్మరణ వలన దైవానుగ్రహము కలుగుతుంది.

 *జ్యోతిష్య శాస్త్రము కూడా వేదముల లాగానే ఎంతో పురాతనమైనది. ఇది ఒక  Divine Science. ఈ జ్యోతిష్య శాస్త్రము మనకు చీకటిలో టార్చి లైటుగా ఉపయోగపడుతుంది. ఈ జ్యోతిష్య శాస్త్రమును దుర్వినియోగము చేయకూడదు. ఒక మనిషి యొక్క పూర్వ జన్మ కర్మలను పోగేసుకున్న సమూహం తన జాతక చక్రము తెలియజేస్తుంది. ఈ శాస్త్రము కర్మ సిద్ధాంతముతో ముడిపడి ఉంటుంది. పుణ్యకర్మల ఫలితం మనకు మనశ్శాంతి, ఆనందము కలుగచేస్తాయి. పాపకర్మల ఫలితం మనకు బాధలు, కష్టాలను తెచ్చిపెడతాయి. కావున మనము చేసే ప్రతి పని, మనము మాట్లాడే ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా చేయాలి.  

 

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Incompatible rashis for relationship

ప్రేమ మరియు పెళ్లి బంధాలకు పొంతన కుదరని, ఇమడని రాశులు :

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మకుండలిలో చంద్రుడు ఉన్న రాశిని జన్మరాశిగా పరిగణిస్తారు. ఈ జన్మ రాశులు అనేవి మన మనస్సును గురించి తెలియజేస్తుంది. 12 రాశులలో, కొన్ని రాశుల వారు ఇంకో కొన్ని రాశుల వారితో కలసినపుడు పొంతన కుదరక, వారిద్దరి మధ్య ఇమడక బాధలు అనుభవించి, చివరకు విడిపోతారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. 12 రాశులను 4 మూలకములైన భూమి, గాలి, నిప్పు, నీరు క్రింద 4 బృందాలుగా విభజించారు. అంటే ఒక్కొక్క మూలకముకు 3 రాశులు ఉంటాయి.

భూమి (భూ తత్వం)    : మకరరాశి; కన్యారాశి; వృషభ రాశి

గాలి (వాయు తత్వం)  : మిధునరాశి; తులారాశి; కుంభరాశి

నిప్పు (అగ్ని తత్వం)    : మేషరాశి; సింహరాశి; ధనస్సురాశి

నీరు (జల తత్వం)      : కర్కాటకరాశి; వృశ్చికరాశి; మీనరాశి

1.మీనరాశి-మిధునరాశి: మీనరాశి వారు భ్రాంతిలో జీవిస్తారు కానీ తొందరగా వివాహం లేదా ప్రేమ వ్యవహారం ద్వారా జీవితములో స్థిరపడాలని  ఆత్రుత చెందుతారు. కానీ మిధున రాశి వారు సాధించేందుకు ఇంకా ఎంతో ఉందని , ఈ బంధాలను పెద్దగా పట్టించుకోరు. మీనరాశి వారు అతి సున్నితంగా ఉంటారు, అదే మిధునరాశి వారు కేవలం వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి, ఈ రెండు రాశులు అనగా మీనరాశి, మిధునరాశి వారికి బంధం ఏర్పడితే, అది ఎంతో కాలం నిలువదు. అతిస్వల్ప కాలములోనే ఈ ఇద్దరు విడిపోవటం జరుగుతుంది.

2.మేషరాశి-వృశ్చిక రాశి: ఈ మేష, వృశ్చికములకు అధిపతి కుజుడు. ఈ రెండు రాశుల వారికి కుజ లక్షణాలు ఉంటాయి. ఈ రెండు రాశుల వారు స్వతంత్రంగా జీవించేందుకు ఇష్టపడతారు. వ్యాపారం విషయానికి వస్తే మేష, వృశ్చిక వారి మధ్య వ్యాపార భాగస్వామ్యం ఎంతో మెరుగ్గా, చురుగ్గా సాగుతుంది. కానీ ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే మాత్రం, వీరి బంధం సర్వనాశనం అవుతుంది. మేషరాశి వారు ఆధిపత్యం వహించాలని చూస్తారు, అదే వృశ్చిక రాశివారు మేషరాశి వారు చేసే ఆధిపత్యం తట్టుకోలేరు. ఈ రెండు రాశుల వారికి ఎంతో అసూయ ఉంటుంది. కావున మేషరాశి, వృశ్చిక రాశి వారి మధ్య బంధము ఎక్కువ కాలం నిలువదు.

3.వృషభరాశి-కుంభరాశి: ప్రథమంగా కుంభరాశి వారు వృషభరాశి వారిపై ఎంతో వ్యామోహం పెంచుకుంటారు. కానీ వీరి బంధం ఎంతోకాలం నిలువదు. కుంభరాశివారు అందరికీ భిన్నంగా ఉండటానికి ఇష్టపడతారు, ఎక్కువకాలం ఒకే రకమైన జీవితం వీరికి ఇష్టం ఉండదు. అదే వృషభరాశి వారు ఒక చోట స్థిరపడిపోవుటకు ఇష్టపడతారు, జీవితములో తరచూ మార్పులు రావటం ఈ వృషభరాశి వారు తట్టుకోలేరు. ఈ కారణం వలన వీరి బంధం ఈరోజో, రేపో అన్నట్టుగా బేధాలు వచ్చి విడిపోతారు. వృషభరాశి వారు కుంభరాశివారితో సులభంగా ఇమడలేక, వారితో ఉన్న బంధాలను తెంచుకుంటారు.

4.మిధునరాశి-కర్కాటకరాశి: కర్కాటకరాశి వారు మిధునరాశి వారితో ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు. కానీ మిధునరాశివారు మాత్రం వారి జీవితానికి ఎంతో ముఖ్యం అనుకుంటే తప్ప కర్కాటకరాశి వారిని లెక్క చేయరు. కర్కాటకరాశి వారి సున్నితత్వాన్ని ఈ మిధునరాశి వారు అసలు భరించలేరు. కావున వీరిద్దరు ఎంతో త్వరగా విడిపోతారు. కర్కాటకరాశి వారు ఈ మిధునరాశివారితో Commit  కాకుండా ఉండటం ఎంతో మంచిది.

5.సింహరాశి-మీనరాశి:  మీనరాశివారు నీటికి సంబంధించినవారు; సింహరాశివారు నిప్పుకు సంబంధించినవారు. మీనరాశివారు భ్రాంతిలో జీవిస్తారు, ఆ ఊహాలోకములో ఈ మీనరాశి వారు ఆనందంగా ఉంటారు. కానీ సింహరాశి వారు అలా కాదు, వారు ఏదైతే అనుకుంటారో దాని గురించి కలలు కనకుండా వెంటనే ఆచరణలో పెడతారు. మీనరాశివారు అతీసున్నితంగా ఉంటూ, తరచూ వీరి మనస్తత్వం కూడా మారుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ మీనరాశి వారి మనస్సుకు ఉన్న అనిశ్చిత అసలు నచ్చదు. సింహరాశివారు మీనరాశివారిపై ఆధిపత్యం వహించుటకు, గొడవలు చేయుటకు ఎక్కువ ప్రయత్నిస్తారు. ఇవి మీనరాశి వారికి తట్టుకోవడం సాధ్యం కాదు. కావున వీరి బంధం కూడా ఎంతో కాలం నిలువదు.

6.తులారాశి-మకరరాశి: తులారాశివారు ఎంతో సమతుల్యంగా ఉంటూ, ప్రతి పని పరిపూర్ణం అవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ మకరరాశి వారు ఇది ఎంత మాత్రం లెక్క చేయరు. వీరి మధ్య ఏదైనా సమస్య వస్తే తులారాశి వారు సమరస్యంగా విషయాలను చర్చించేందుకు , పరిష్కరించేందుకు సిద్ధపడతారు. కానీ మకరరాశి వారు పాత విషయాలను గూర్చి చర్చలకు ఇష్టపడరు. కావున ఈ తులా మరియు మకర రాశి వారి పెళ్లి లేదా బంధం ఎంతో కాలం నిలువదు. మకరరాశి వారిని తట్టుకోలేక  తులారాశివారు విడిపోయి సరైన వ్యక్తిని చూసుకుంటారు.

7.కన్యారాశి-సింహరాశి: కన్యారాశి భూమికి సంబంధించినది, సింహరాశి నిప్పుకు సంబంధించినది. కావున ఈ రెండు రాశుల మధ్య విరోధం విపరీతంగా ఉంటుంది. సింహరాశి వారు కన్యారాశివారిపై నిత్యం నిఘా పెడతారు, కానీ కన్యారాశి వారు ఏకాంతమును ఇష్టపడతారు. సింహరాశి వారికి సమాజములో గొప్పగా స్థాయిలో కనపడుటకు ఎంతో శ్రమిస్తారు. కన్యారాశివారు దీనికి ఇష్టపడరు. సింహరాశి వారి ప్రవర్తన కన్యారాశి వారికి నచ్చదు. కావున వీరి బంధము ఎక్కువ కాలం నిలువదు.

  1. కుంభరాశి-వృశ్చికరాశి: కుంభరాశి మరియు వృశ్చికరాశి వారికి దాదాపుగా ఒకే రకమైన అలవాట్లు, లక్ష్యాలు, ఇష్టాలు ఉంటాయి. కాకపోతే కుంభరాశి వారు వీరి మధ్య ఉన్న బంధానికి పూర్తి ప్రాముఖ్యత ఇవ్వరు. ఈ లక్షణం వృశ్చికరాశి వారికి ఇష్టం ఉండదు. కుంభరాశివారు వైవాహిక లేదా ప్రేమ బంధముకు పూర్తి బాధ్యత వహించరు. వృశ్చికరాశి అతి అసూయతో ఉంటారు. వృశ్చికరాశి వారు ప్లాన్ ప్రకారం చేయాలనుకుంటారు. కానీ కుంభరాశివారు సమయమునకు అనుగుణంగా కార్యములు చేస్తారు. కారణంగా ఈ రెండు రాశుల వారికి ప్రేమ బంధం ఉంటే ఆ బంధం ఎంతో కాలం ఉండదు

[table id=1 /]

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

www.brahmatantra.com

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Related Articles:

 

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

What is Kalatra dosha?Effects of Kalatra dosha?

కళత్రదోషము అంటే ఏమిటి? ఆ కళత్ర దోషము వలన కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి?

కళత్రము అంటే భార్య అని అర్థం. పురుషుల జన్మకుండలిలో భార్యను గూర్చి తెలియజేసే, ప్రభావితం చేసే గ్రహము శుక్రుడు. శుక్రుడు కళత్ర కారకుడు. పురుషుని జన్మకుండలిలో 7వ స్థానమును కళత్రస్థానం అని పిలుస్తారు. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము ఉన్నట్లైతే ఆ కళత్ర స్థానం దెబ్బ తింటుంది. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము మరియు శుక్రుడు ఉన్న స్థానము చెడు స్థానము ఉన్నట్లైతే ఆ జాతకులకు కళత్ర దోషము ఏర్పడుతుంది. కళత్రదోషము ఏర్పడటం వలన జాతకునికి వివాహము ఆలస్యము అవుతుంది. అంతేకాకుండా సరైన భార్య దొరకటం దాదాపు అసాధ్యం అవుతుంది. ఒకవేళ విధివశాత్తు ఆ జాతకునికి వివాహము జరిగినా వివాహము జరిగిన కొద్ది రోజులలోనే భార్యతో విభేదాలు తలెత్తి విడిపోయే పరిస్తితి ఏర్పడుతుంది. కళత్ర దోషము ఉన్నవారికి సరైన సంసార సుఖము లభించదనే చెప్పాలి. కొంతమంది జన్మకుండలిలో కళత్ర దోషము ఉన్నవారి భార్యకు తరచూ అనారోగ్యములు కలుగటం లేదా అకాల మరణం పొందటం లాంటివి జరుగుతాయి.

kalatra dosham

కళత్రదోషం ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. వివాహం ఆలస్యము కావటం; విచారపూరితమైన దాంపత్య జీవితం ఏర్పడటం; భార్యతో తరచుగా అపార్థాలు రావటం; దాంపత్య సుఖము లేకపోవటం; భార్యకు దూరంగా ఉండటం; భార్యతో విడాకులు ఏర్పడటం; భార్య అకాల మరణం పొందటం లాంటి పరిస్థితులు కళత్ర దోషము ఉన్నవారికి ఏర్పడతాయి.

  1. పైశాచిక శుక్ర పీడా నివారణా గంధర్వ తంత్ర హోమము

పురుషుని జన్మకుండలిలో కుజుడు  సప్తమ భావములో ఉంటే ఆ జాతకులకు కళత్ర దోషం ఏర్పడుతుంది. ఈ జాతకులు తమ భార్యతో తగాదాలు పెట్టుకొని విడిపోయే సంధర్భాలు ఎదురవుతాయి. భార్యకు తీవ్ర అనారోగ్యములు కలుగుతాయి.

  1. కళత్ర స్థాన కుజ గ్రహ సంతుష్ట హోమం

పురుషుని జన్మకుండలిలో సప్తమ భావములో శని ఉంటే  వారికి కళత్ర దోషం ఏర్పడుతుంది. దీనినే శని దోషం అని కూడా పిలుస్తారు. ఈ శని దోషం వలన జాతకులకు ఆలస్య వివాహం జరగటమే కాకుండా కనీసం 30 సంవత్సరాలు దాటిన తరువాతే వివాహము జరిగే అవకాశము ఉంటుంది. శని దోషమునకు తోడుగా శని మీద ఇతర పాప గ్రహముల దృష్టి పడినట్లైతే ఆ జాతకుడు తనకన్నా వయస్సులో పెద్దది అయిన స్త్రీతో వివాహము జరుగుతుంది. శనిదోషము ఉన్న పురుషులకు ఆలస్య వివాహమే కాకుండా భార్య నలుపు రంగులో ఉండటం గాని;  సంపదలో గాని , సాంఘిక స్థాయిలో జాతకుల కంటే తక్కువ స్థాయిలో ఉండటం జరుగుతుంది. ఈడుజోడు కుదరని జంట అయిన కారణంగా ఆ దంపతుల మధ్య నిజమైన ప్రేమాభిమానములు ఉండవు.

  1. వైవాహిక స్థాన శని గ్రహ వక్ర పీడా నివారణా హోమం

రాహువు లేదా కేతువు పురుషుని జాతకములో సప్తమ భావములో ఉన్నట్లైతే కళత్ర దోషము ఏర్పడుతుంది. ఫలితంగా వివాహము జరుగటం కష్టం. వివాహము అయిన తరువాత వైవాహిక జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. రాహువు లేదా కేతువు వలన ఏర్పడే కళత్ర దోషమును నాగదోషం అని కూడా పిలుస్తారు.

  1. సప్తమ స్థాన మాంగల్య కళత్ర రాహు పైశాచిక పీడా నివారణ హోమం
  2. ధూమ్ర కేతు హోమం
  3. ఆశ్లేష బలి, నవనాగమండలం (నాగదోషం)

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: 

Astrology reasons for Heart diseases

గుండెపోటు మరియు గుండె సంబంధిత జబ్బులు- జ్యోతిష్య కారణాలు :

మన జన్మకుండలిలో 4వ భావం మరియు 5వ భావము, కర్కాటక రాశిలో ఉన్న గ్రహములు, రవి, గురు లేదా రవి శని కలయికలను పరిశీలిస్తే జాతకుడికి గుండె సంబంధిత జబ్బుల గురించి, గుండె పరిస్థితి గురించి తెలుస్తుంది.

  • పాప గ్రహములు 4వ భావములో ఉండడం లేదా 4వ భావములో గ్రహములు నీచపడటం లేదా పాప గ్రహములు కర్కాటక రాశిలో ఉండడం వలన జాతకునికి తరచుగా గుండె నొప్పి ఎదుర్కొంటారు.
  • జన్మకుండలిలో 4వ అధిపతి 8వ భావములో ఉంటూ మరియు 4వ భావాధిపతి రవితో కలసి అస్తంగత్వం అవటం వలన జాతకునికి గుండె ఎంతో బలహీనంగా ఉంటుంది.
  • జన్మకుండలిలోని 4వ భావం మరియు 5వ భావములో పాప గ్రహములు ఉండటం (లేదా) పాప గ్రహములు కర్కాటక మరియు సింహా రాశులలో ఉండటం వలన జాతకుడు గుండెజబ్బును ఎదుర్కోవలసి ఉంటుంది.
  • నవాంశ చక్రములో, భావ చక్రములో 4వ పతి శత్రు భావములో ఉండటం లేదా శత్రు గ్రహాలతో కలవటం వలన జాతకుడు తరచూ మానసిక ఆందోళనలు, గుండె నొప్పి ఎదుర్కొంటాడు.Astrology reasons for Heart diseases
  • జన్మకుండలిలో 4వ భావములో లేదా కర్కాటక రాశిలో రాహు లేదా కేతు ఉండటం వలన జాతకుడికి విపరీతమైన Gas Trouble వచ్చి, గుండెను బలహీనపరుస్తుంది. వీరితో శని కూడా కలిస్తే , ఇక ఆ జబ్బును అదుపులో పెట్టటం ఎవరి వలన సాధ్యం కాదు.
  • జన్మకుండలిలోని రాశిచక్రం మరియు నవాంశ చక్రములో చంద్రుడు నీచపడటం (లేదా) శని అధిపతిగా ఉన్న భావాలలో చంద్రుడు ఉండటం వలన జాతకుని గుండె ఎంతో బలహీనంగా ఉంటుంది. ఈ జాతకుడు చెడు వార్తలు వినటం వలన లేదా Shocking వార్తలు వినటం వలన మరణిస్తాడు.
  • శని మరియు రవి కలసి 4వ భావం (లేదా) 5వ భావములో ఉండటం వలన Low BP వస్తుంది, అంతేకాకుండా గుండె బలహీనంగా ఉంటుంది. ఇలాంటి జాతకులు అన్ని విషయములకు విపరీతంగా భయపడుతూ క్లిష్ఠ పరిస్థితులలో పడతారు. ఇంకొందరికి ఎంతో తరచుగా కళ్ల తిరిగి పడిపోవటం లాంటివి జరుగుతాయి.
  • జన్మకుండలిలో 6వ భావాధిపతి 4వ లేదా 5వ భావంలో ఉండటం కర్కాటక లేదా సింహా రాశులలో ఉంటే జాతకుడికి తరచుగా ఛాతి నొప్పి వస్తుంది.
  • జన్మకుండలిలో కుజుడు మరియు శని కలసి 4వ భావములో ఉండటం లేదా కర్కాటక రాశిలో ఉండటం వలన మరియు గురు దృష్టి పడటం వలన జాతకునికి Nervous system బలహీనంగా ఉంటూ, గుండె కూడా ఎంతో బలహీనపడుతుంది.
  • జన్మకుండలిలో బుధుడు లగ్నంలో మరియు రవి, శని కలవటం వలన ఆ వ్యక్తి విపరీతమైన గుండె జబ్బులు ఎదుర్కొంటున్నారు.
  • జన్మకుండలిలో 7వ భావములో లేదా లగ్నములో చంద్ర రాహువులు కలసి ఉండటం మరియు శని 1,4,7,10 భావాలలో ఉండటం వలన జాతకుని గుండె ఎంతో బలహీనంగా ఉంటుంది.
  • జన్మకుండలిలో గురు మరియు రవి కలసి 4వ లేదా 5వ భావములో ఉండటం వలన జాతకుడికి High BP మరియు గుండె జబ్బులు వస్తాయి. వీరిలో కొందరికి డ్రైవింగ్ చేసేటపుడు Attack వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలిపోవటం జరుగుతుంది.
  • వృశ్చిక రాశిలో రవి మరియు కుజుడు కలవటం లేదా గురు దృష్టి పడటం వలన, జాతకుడు గుండె జబ్బులు నయం చేసుకొనుటకు చాలా కాలం పాటు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది.
  • పంచమాధిపతి రవితో కలవటం వలన, జాతకుని గుండె బలహీనపడుతుంది.
  • కుంభరాశిలోని రవి వలన జాతకుడు గుండె బలహీనపడుతుంది.
  • జన్మకుండలిలో మీన లగ్న జాతకులకు, రవి 4వ భావములో ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • లగ్నాధిపతి బలహీనపడి రాహువుతో కలసి 4వ భావంలో ఉండటం వలన లేదా కర్కాటక రాశిలో ఉండటం వలన ఆ జాతకుడికి గుండెపోటు వలన కలిగే మరణ భయం అధికంగా ఉంటుంది.
  • శని సింహరాశిలో ఉండటం ఛాతి నొప్పికి దారి తీస్తుంది.
  • జన్మకుండలిలో 4వ భావాధిపతి గ్రహం 5వ భావములో ఉంటే, జాతకుడు తరచూ గుండె పగిలే వార్తలు వింటారు. 5వ స్థానములో ఉన్న గ్రహ దశలో (లేదా) 5వ గ్రహముపై దృష్టి పడిన గ్రహ దశలలో గాని ఈ సంఘటనలు ఎక్కువగా వింటారు. ఇలాంటి వ్యక్తులు తమకు పూర్వం ఉన్న ప్రేమ వ్యవహారాలను తవ్వి మళ్ళీ కొనసాగిస్తారు. దీని వలన వయస్సు పెరిగే కొద్ది వీరి గుండె బలహీనపడుతుంది. వీరి సంతానం కూడా వారి వృద్ధాప్యములో గుండె పగిలే వార్తలు వింటారు.

చంద్రో మనః కారకాః చంద్రుడు యొక్క శుభ దృష్టి వలన, కుజుని యొక్క శుభ దృష్టి వలన, రాహు శుభదృష్టిలో మాత్రమే మానవులకు వచ్చే గుండె జబ్బులు నుండి నివారణ కలుగుతుంది. వీటికి తంత్ర శాస్త్రములో కొన్ని పరిహార మార్గాలు చెప్పబడ్డాయి. గ్రహ సన్నివేశమును బట్టి క్రింద ఇవ్వబడిన హోమములలో ఒకటి జరిపించాలి.

  1. యమగండ దోష నివారణ బలి
  2. అపమృత్యుదోష నివారణ హోమం
  3. మహా శరభ శాలువ బలి
  4. కాలభైరవ సంతుష్ట హోమం

హృద్రోగములతో గుండెజబ్బులతో బాధింపబడుతున్నవారు ఈ ప్రక్రియలు చేయించినట్లైతే గుండె జబ్బుల నుండి ఆకస్మిక గండముల నుండి తప్పించుకోగలుగుతారు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles

“సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)” – పితృదోషము

“సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)” – పితృదోషము:

బ్రహ్మపురాణం ఆధారంగా భాద్రపద మాసములో వచ్చే కృష్ణ పక్షమున మహాలయ పక్షము ప్రారంభం అవుతుంది. ఈ మహాలయ పక్షము 15 రోజుల పాటు ఉంటుంది. పక్షము అంటే 15 రోజులు. మహాలయ పక్షములో వచ్చే అమావాస్యని అనగా భాద్రపద మాస అమావాస్యని మహాలయ అమావాస్య అని, సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు. సర్వపితృ అమావాస్య నాడు పితృ దోషము ఉన్నవారు తమ పితృదేవతలకు శార్థ కర్మలు మరియు నారాయణ నాగబలి కార్యక్రమం తప్పక ఆచరించాలి, జరిపించాలి. ఈ బ్రహ్మ పురాణం ప్రకారం ఈ మహాలయ పక్షము రోజులలో యమధర్మరాజు యమలోకములో ఉన్న ఆత్మలందరికి ఆహారం తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తాడట. కావున మరణించిన వారి పిల్లలు లేదా వారసులు ఈ మహాలయ పక్షములో తమ పితృదేవతలకు పిండ ప్రధానం తప్పకుండా చేయాలి. ఎవరైతే తమ పితృదేవతలకు పిండప్రధానం చేయకుండా ఉంటారో, వారి పితృదేవతలు ఆకలి తీరక, తమ పిల్లలు లేదా వారసులపై ఆగ్రహముతో పక్షము రోజుల తరువాత తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారు.  కారణంగా పితృ దోషం ఏర్పడి తరువాత వచ్చే తరముకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టిన వారు అవుతారు. దీనినే పితృదోషముగా చెబుతారు. ఎవరైతే తమ పితృదేవతలకు ప్రతి సంవత్సరం పిండ ప్రధానం శ్రద్దగా నిర్వహిస్తారో, వారి పితృదేవతలు ఆకలి తీర్చుకుని వారి వారసులను ఆశీర్వదించి, ఆనందంగా తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారు.

         ఈ భూమిపై మానవునికి మరణం రెండు విధాలుగా సంభవిస్తుంది. 1.సహజ మరణం;  2. ఆకస్మిక మరణం. భగవంతుడు నిర్ణయించిన ఆయుర్దాయం ప్రకారం మరణం సంభవిస్తే అది సహజ మరణం అవుతుంది. ఆకస్మిక మరణములు ముఖ్యంగా పితృదోషం వలన కూడా సంభవిస్తాయి. ఈ ఆకస్మిక మరణములకు ఉదాహరణగా రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, హర్షద్ మెహతా, సుబాష్ చంద్ర బోస్, ప్రిన్స్ డయానా వీరందరూ కూడా పితృదోషం బారీనా పడిన వారే అని గుర్తించాలి.

పితృదోషము కలుగుటకు మరొక కారణము:

పితృదేవతలకు శ్రద్ధగా పిండ ప్రధానం చేయకపోతే వారికి మరియు వారి తరువాత తరాల వారికి పితృదోషం సంభవిస్తుంది అని ఇంతవరకు మనము చర్చించుకున్నాము. పితృదోషం కలుగటానికి మరొక కారణం గురించి కూడా మీకు వివరిస్తాను.

         పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన నేరములు, సరిదిద్దలేని తప్పులు, ఇతరుల మరణానికి కారణం అవటం, ఇతరుల బాధలకు కారణం అవటం, …. ఇలాంటి కార్యాలకు కారకులు అయి ఉంటే మరణించిన తరువాత మోక్షము లభించక, తమ తరువాత తరం వారికి (కొడుకు, మనుమడు,….) కూడా పితృదోషము కలిగించిన వారవుతారు.

         పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన తప్పిదములు, ఇప్పుడు తమ వారసులు అనుభవించాల్సి ఉంటుంది. దీనినే పితృదోషం, పితృ ఋణం అంటారు. జన్మకుండలిలోని గ్రహ సన్నివేశాల ద్వారా కూడా పితృదోష నిర్ధారన చేసుకోవచ్చు. ఈ అంశము గురించి ఇంతకు ముందే మీకు అందించాను. ఆ గ్రహముల సన్నివేశములు ఏమిటో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

mahalaya amavasya,pitrudosham
మహాలయ అమావాస్య

పితృదోషానికి గల కారణములు:

  • తెలిసిగాని, తెలియక గాని పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన చెడు కర్మలు, తప్పిదములు.
  • ప్రస్తుతం వారసులు చేసే తప్పిదములకు తమ పితృదేవతల ఆత్మ ప్రశాంతంగా ఉండకపోవటం
  • పితృదేవతల కోరికలు నెరవేరకపోవటం
  • ఆయుధముల వలన లేదా యాక్సిడెంట్ల వలన ఆకస్మిక అసహజ మరణం పొందిన వారసులకు పితృదోషం కలుగుతుంది.
  • వారసులు తమ పితృదేవతలకు శ్రార్ధ కర్మలు ఆచరించకపోవటం.
  • కొందరికి పితృదోషము ఉన్నట్టుగా జన్మకుండలిలో కనిపించదు. ఆకస్మిక ప్రమాదాల వలన చనిపోయిన వారి తండ్రి తరపున 7 తరముల వరకు, తల్లి తరపున 4 తరముల వరకు ఈ పితృదోషం వెంటాడుతుంది.
  • జన్మకుండలిలో రాహు కేతువులు పాప దృష్టి పొంది ఉన్నా, పితృ స్థానం శత్రుస్థానం అయినా, పితృ దోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. హైందవ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు కేతువుల వలన కలిగే పితృశాపమునకు రాహు ఎత్తువ్లా శాంతి, ప్రీతి హోమముల ద్వారా కూడా పితృదోష నివారణ జరుగుతుంది అని చెప్పవచ్చు.
  • భారతీయ సంఖ్యాశాస్త్రములో కూడా ఈ పితృదోషమునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక కుటుంబము తరచూ ఊహించని సమస్యలు ఎదుర్కోవడం లేదా భార్యా భర్తలకు పిల్లలు కలుగకపోవటం లేదా ఒకవేళ కలిగినా ఆరోగ్యంగా ఉండటకపోవటం లేదా మానసిక, శారీరక లోపాలతో జన్మించటం ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవి కూడా “పితృదోషం” వలననే అని గుర్తించాలి. ఇక్కడ చెప్పిన సమస్యలకు సంతనదోషం, సర్పశాపం…… ఇలా ఎన్నో దోషాల వలన కూడా ఈ సమస్యలు వస్తాయి. కాకపోతే పితృదోషం ఉన్నపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పటం జరుగుతోంది. ఏ దోష కారణంగా ఈ సంఘ్తనాలు జరుగుతున్నాయి అనేది కేవలం వారి వారి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలనలో మాత్రమే నిర్దరాన జరుగుతుంది.

పితృదోషము వలన కలిగే సమస్యలు ఏమిటి?

  • పితృదోషము ఉన్నవారి ఇంటిలో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి.
  • పితృదోషముతో బాధపడేవారికి వివాహ విషయములో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా, సరైన వయస్సుకు వివాహం జరుగదు.
  • పితృదోషం నుండి బాధపడేవారు అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు తీర్చలేరు.
  • పితృదోషము ఉన్నవారి కుటుంబములో ఒకరికి తరచూ ఒక పాము కలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమునకు చెందిన పితృదేవతలలో ఒకరు కలలో కనబడి ఆహారం లేదా బట్టలు కొరకు అడుగుతూ ఉంటారు.

పితృదోషముతో బాధపడేవారికి క్రింద ఇస్తున్న సంఘటనలలో కనీసం 4 నుండి 5 వరకు వారి జీవితములో తరచూ జరుగుతూ ఉండాలి. గమనించండి :

  • పితృదోషం ఉన్న వారు నివసించే ఇంటిలో కొత్త గోడలు అయినప్పటికి తొందరగా చీలికలు పడతాయి.
  • తరచూ వారి ఇంటిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోతూ ఉంటాయి.
  • చేతిలో నుండి ఆహారము తరచూ నేల పాలు అవుతూ ఉంటుంది.
  • ఎన్ని సార్లు సరి చేయించినా గోడలలో నీరు లీక్ అవుతూ ఉంటుంది. చీలికలు ఉన్న గోడలలో చనిపోయిన వారి ఆత్మలు ఉంటాయని కూడా చెప్పబడింది.
  • ఇతిలో తరచూ నీటి సమస్య, నీటి పంపు , కుళాయిల సమస్యలు వస్తూ ఉంటాయి. Plumber వచ్చి ఎన్ని సార్లు సరి చేసినా ప్రయోజనం ఉండదు.
  • చీమల మందులు, దోమల మందులు ఎన్ని వాడుతున్నప్పటికి ఇంటిలో చీమలు, దోమలు, బొద్దింకలు, చెదలు బెదడు తగ్గదు.
  • పితృదోషము ఉన్నవారికి, వ్యాపారములు చేస్తూ ఉంటే వారు తీవ్రమైన అప్పులలో కూరుకుపోతారు. అగ్నికి మరియు దొంగతనాల బరీనా పడుతూ ఉంటారు లేదా వారి వ్యాపారములు అకస్మాత్తుగా మూతపడిపోతాయి.
  • పితృదోషం ఉన్నవారి ఇంటిలోని పిల్లలు పెద్దలకు మరియు కుటుంబ సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. పిల్లలు మానసిక లేదా శారీరక లోపముతో జన్మిస్తారు.

 పితృదోష నివారణకు చేయవలసిన పరిహారములు:

  • పితృదోషము నివారణకు సరైన పరిహారము “నారాయణ నాగబలి” ఈ కార్యక్రమముతో పాటుగా కొన్ని పరిహారములు కూడా పాటించాలి.
  • త్రిపిండి శార్థమును ఆచరించాలి.
  • పితృదేవతలు చనిపోయిన మాస తిథులలో లేదా మహాలయ పక్షములో పిండప్రధానము చేయాలి.
  • ప్రతి అమావాస్యకి బ్రహ్మనుడికి అన్నదానం లేదా స్వయంపాకం ఇవ్వాలి.
  • ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున పుణ్యక్షేత్రములలో లేదా దేవాలయముల వద్ద ఆహార పధార్థములను అక్కడ భిక్షాటన చేసే వారికి పంచి పెట్టాలి.
  • సంపాదించే సంపదలో 5 శాతం అనాధలకు, పేదలకు దానము చేయాలి. 

ఈ పరిహారములు అన్నీ కాకుండా ముఖ్యంగా ఆచరించవలసిన పరిహారం “నారాయణ నాగబలిచేయటం వలన పితృదోష నివారణ కలుగుతుంది. పితృదోష పరిణామాలు తగ్గుముఖము పడతాయి.

         మహాలయ పక్షములో  పితృదోషము ఉన్నవారు “నారాయణ నాగబలి” జరిపించి పితృలకు శార్థము నిర్వహించినట్లైతే పితృదోష నివారణ కలుగుతుంది.

         ఈ మహాలయ పక్షములో అంటే ఈ 15 రోజులలో పితృదేవతలు తమ పిల్లలు లేదా వారసుల ఇంటికి ఏదో ఒక రూపములో వస్తారు. కావున ఈ మహాలయ పక్షములో ఇంటికి వచ్చిన ఎవరిని, దేనిని (జంతువులు, పక్షులు) నిర్లక్ష్యము చేయకుండా అప్పటి మీ శక్తిని బట్టి ఆహారము అందజేయాలి. 

         కావున పితృదేవతల ఆత్మ శాంతి కొరకు, వారికి విముక్తి లేదా మోక్షము కలుగుటకు వారసులు శార్ధ కర్మలు శ్రద్ధగా ఆచరించాలి. పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య తిథులలో మరణించిన వారి వారసులు మహాలయ పక్షములో వచ్చే “సర్వపితృ అమావాస్య” నాడు నారాయణ నాగబలి జరిపించి శార్ధము నిర్వహిస్తే ఆత్మశాంతి కలుగుతుంది. ఈ “సర్వపితృ అమావాస్య” నాడు జరిపించే “నారాయణ నాగబలి”, “మోక్ష నారాయణ బలి” మరియు “శార్ధ కర్మలు” చనిపోయినవారికి అంటే పితృదేవతలకు ఆకలి తీరి, శాంతి చేకూరి, తమ వారసులకు దీవెనలు అందించి వారి లోకాలకు తిరిగి వెళ్లిపోతారు.  

 

గమనిక:

అనేకానేక కారణాల వల్ల హైందవులు మరణించిన తమ సంబంధీకులకు శ్రార్ధ కర్మలను నిర్వహించని వారికి, నిర్వహించడం కుదరని వారికి, గతంలో వారి ఆత్మకు తృప్తినిచ్చే చేసిన శ్రార్థ కర్మలో ఏమైనా అపచారాలు ఉన్నాయని శంకిస్తున్న వారికి మరల్ ఆ శ్రార్థ కర్మను నిర్వహించడానికి ఉపకరించే తిథే సర్వపితృ అమావాస్య. ఈ తిథినందు కూడా, గతించిన తమ యొక్క పూర్వీకుల, గోత్రీకుల, రక్త సంబంధీకులకు శ్రార్థ కర్మలను చేయడం కుదరని వారికి బ్రహ్మతంత్ర పీఠం ద్వారా మోక్ష నారాయణ బలి పరిహారమును రుత్విక్కులచే జరిపించబడును.

జన్మకుండలిలో పితృదోషం ఉన్నవారికి మోక్ష నారాయణ బలి జరిపించుట వల్ల పితృదోషములు సంపూర్ణముగా తొలగి, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగును.

ఈ మహాలయ పక్షాల్లో ప్రతి ఒక్కరూ జరిపించవలసిన మంత్రం

‘ఊర్ద్వలోక పితృదేవతాభ్యో నమః

 

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

 

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.