loading

Month: September 2019

  • Home
  • September, 2019

What is Kalatra dosha?Effects of Kalatra dosha?

కళత్రదోషము అంటే ఏమిటి? ఆ కళత్ర దోషము వలన కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి?

కళత్రము అంటే భార్య అని అర్థం. పురుషుల జన్మకుండలిలో భార్యను గూర్చి తెలియజేసే, ప్రభావితం చేసే గ్రహము శుక్రుడు. శుక్రుడు కళత్ర కారకుడు. పురుషుని జన్మకుండలిలో 7వ స్థానమును కళత్రస్థానం అని పిలుస్తారు. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము ఉన్నట్లైతే ఆ కళత్ర స్థానం దెబ్బ తింటుంది. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము మరియు శుక్రుడు ఉన్న స్థానము చెడు స్థానము ఉన్నట్లైతే ఆ జాతకులకు కళత్ర దోషము ఏర్పడుతుంది. కళత్రదోషము ఏర్పడటం వలన జాతకునికి వివాహము ఆలస్యము అవుతుంది. అంతేకాకుండా సరైన భార్య దొరకటం దాదాపు అసాధ్యం అవుతుంది. ఒకవేళ విధివశాత్తు ఆ జాతకునికి వివాహము జరిగినా వివాహము జరిగిన కొద్ది రోజులలోనే భార్యతో విభేదాలు తలెత్తి విడిపోయే పరిస్తితి ఏర్పడుతుంది. కళత్ర దోషము ఉన్నవారికి సరైన సంసార సుఖము లభించదనే చెప్పాలి. కొంతమంది జన్మకుండలిలో కళత్ర దోషము ఉన్నవారి భార్యకు తరచూ అనారోగ్యములు కలుగటం లేదా అకాల మరణం పొందటం లాంటివి జరుగుతాయి.

kalatra dosham

కళత్రదోషం ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. వివాహం ఆలస్యము కావటం; విచారపూరితమైన దాంపత్య జీవితం ఏర్పడటం; భార్యతో తరచుగా అపార్థాలు రావటం; దాంపత్య సుఖము లేకపోవటం; భార్యకు దూరంగా ఉండటం; భార్యతో విడాకులు ఏర్పడటం; భార్య అకాల మరణం పొందటం లాంటి పరిస్థితులు కళత్ర దోషము ఉన్నవారికి ఏర్పడతాయి.

  1. పైశాచిక శుక్ర పీడా నివారణా గంధర్వ తంత్ర హోమము

పురుషుని జన్మకుండలిలో కుజుడు  సప్తమ భావములో ఉంటే ఆ జాతకులకు కళత్ర దోషం ఏర్పడుతుంది. ఈ జాతకులు తమ భార్యతో తగాదాలు పెట్టుకొని విడిపోయే సంధర్భాలు ఎదురవుతాయి. భార్యకు తీవ్ర అనారోగ్యములు కలుగుతాయి.

  1. కళత్ర స్థాన కుజ గ్రహ సంతుష్ట హోమం

పురుషుని జన్మకుండలిలో సప్తమ భావములో శని ఉంటే  వారికి కళత్ర దోషం ఏర్పడుతుంది. దీనినే శని దోషం అని కూడా పిలుస్తారు. ఈ శని దోషం వలన జాతకులకు ఆలస్య వివాహం జరగటమే కాకుండా కనీసం 30 సంవత్సరాలు దాటిన తరువాతే వివాహము జరిగే అవకాశము ఉంటుంది. శని దోషమునకు తోడుగా శని మీద ఇతర పాప గ్రహముల దృష్టి పడినట్లైతే ఆ జాతకుడు తనకన్నా వయస్సులో పెద్దది అయిన స్త్రీతో వివాహము జరుగుతుంది. శనిదోషము ఉన్న పురుషులకు ఆలస్య వివాహమే కాకుండా భార్య నలుపు రంగులో ఉండటం గాని;  సంపదలో గాని , సాంఘిక స్థాయిలో జాతకుల కంటే తక్కువ స్థాయిలో ఉండటం జరుగుతుంది. ఈడుజోడు కుదరని జంట అయిన కారణంగా ఆ దంపతుల మధ్య నిజమైన ప్రేమాభిమానములు ఉండవు.

  1. వైవాహిక స్థాన శని గ్రహ వక్ర పీడా నివారణా హోమం

రాహువు లేదా కేతువు పురుషుని జాతకములో సప్తమ భావములో ఉన్నట్లైతే కళత్ర దోషము ఏర్పడుతుంది. ఫలితంగా వివాహము జరుగటం కష్టం. వివాహము అయిన తరువాత వైవాహిక జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. రాహువు లేదా కేతువు వలన ఏర్పడే కళత్ర దోషమును నాగదోషం అని కూడా పిలుస్తారు.

  1. సప్తమ స్థాన మాంగల్య కళత్ర రాహు పైశాచిక పీడా నివారణ హోమం
  2. ధూమ్ర కేతు హోమం
  3. ఆశ్లేష బలి, నవనాగమండలం (నాగదోషం)

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: 

Astrology reasons for extra martial affair-వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు

Astrology reasons for extra martial affair

జన్మకుండలి  ద్వారా వివాహేతర సంబంధములు (అన్య స్త్రీ/ పురుష):

జ్యోతిష్య సలహాలు, పరిహారాల కొరకు నా వద్దకు వచ్చేవారిలో 60 శాతం కేవలం ఈ వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు కొరకు వచ్చినవారే. “గురువు గారు! నా జాతకములో వివాహేతర సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగిన వారు కూడా ఉన్నారు. అయితే మనకు ఈ జన్మలో కలిగే ప్రతి సంఘటన, మనకు కలిగే దురాలోచన, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన జన్మకుండలి లోని గ్రహస్థితుల వలనే జరుగుతాయి. పూర్వజన్మలో మనము ఏదైతే చేసి ఉంటామో, వాటి ఫలితాలు అది మంచి అయినా, చెడు అయినా భూమి పై ఉన్న ప్రతి జీవి అనుభవించాల్సిందే. అయితే ఇప్పుడు వివాహేతర సంబంధములు కలిగే గ్రహస్థితులు ఏమిటో తెలుసుకుందాము.

మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సందర్భం. ఎందుకంటే మన జీవితాంతం వరకు మనం ఎన్నుకునే జీవిత భాగస్వామితోనే గడపాల్సి ఉంటుంది. కష్టాలలో, సుఖాలలో ఇద్దరు సమానంగా పాలు పంచుకోవలసి ఉంటుంది. కానీ వారి అభిప్రాయాలకు తగ్గ జీవిత భాగస్వామి దొరకకపోతే వైవాహిక జీవితం సాఫీగా సాగదు. ప్రతి ఒక్కరికీ మనస్సును అర్థం చేసుకునే జీవితభాగస్వామి రావాలని కోరుకుంటారు. అది జరగని పక్షంలో కొందరు వేరే దారి చూసుకుంటారు. అది వివాహేతర సంబంధం అవుతుంది. హిందూ చట్ట ప్రకారంగా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒకసారి వివాహం జరిగిన తరువాత విడాకులు తీసుకోకుండా ఏర్పడే సంబంధాలను నేరము క్రింద పరిగణిస్తారు. మరి అయితే నేరం అని తెలిసినప్పటికి ఎందుకు ఈ వివాహేతర సంబంధములు ఏర్పడుతున్నాయి? ఈ మధ్య కాలములో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కూడా కొందరు రహస్యంగా ఈ సంబంధాలను కొనసాగిస్తారు. ఇంకొందరు సహజంగా జీవిస్తారు. అయితే ఈ వివాహేతర సంబంధముల వలన సామాజిక, కుటుంబీక సమస్యలు కలిగించే గ్రహస్థితులు ఏమిటి? కేవలం కుటుంబీక సమస్యలు కలిగించే గ్రహ స్థితి ఏమిటి? అన్న విషయము ఇప్పుడు మీకు తెలియజేస్తాను.

 

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివాహేతర సంబంధ సమస్యకు ముఖ్య కారణం కుజుడు గాని లేదా రాహువు గాని లేదా కేతువు గాని 4వ భావములో లేదా 6వ భావములో లేదా 12వ భావములో ఉన్నప్పుడూ ఈ వివాహేతర సంబంధములు కలుగుతాయి.

  • సప్తమ భావము నుండి 5వ భావముపై గాని (లేదా) పంచమ భావము నుండి సప్తమ భావముపై గాని పాప గ్రహముల దృష్టి పడినా; లేదా సప్తమ భావము నుండి 5వ భావములో గురు, శుక్ర గ్రహముల సంగమము జరిగినా జాతకుడు వివాహేతర సంబంధము యొక్క పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
  • సప్తమాధిపతి గాని లేదా ద్వితీయాధిపతి గాని శుక్ర దృష్టికి గురి అయినా లేదా శుక్రుడు ఈ స్థానాలలో ఉన్నా లేదా దశమాధిపతి సప్తమములో శుక్రునితో కలసి ఉన్నా జాతకుడు తీవ్ర కామ వాంఛ కారణంగా వివాహేతర సంబంధము ఏర్పరచుకొని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాడు.
  • సప్తమాధిపతి రాహువుతో గాని లేదా కేతువుతో గాని కలసి ఉంటీ ఆ జాతకులు వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. కానీ ఈ జాతకులు బాగా మోసపోయి వలలో పడిపోతారు. (Trap)
  • జన్మకుండలిలో మనః కారకుడు అయిన “చంద్రుడు”; ప్రేమకు కారణమైన “శుక్రుడు”; ధైర్య సాహసాలకు కారణమైన రాహువు, కుజుడు (చంద్ర,శుక్ర,కుజ,రాహు) ఈ నాలుగు గ్రహములు 3వ భావం, 5వ భావం, 7వ భావం,11వ భావం 12వ భావములకు మరియు వాటి అధిపతులకు సంబంధం ఏర్పడితే జాతకుడి జీవితభాగస్వామి (భార్య/భర్త) జాతకులను మోసం చేస్తారు. అంతేకాకుండా వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటారు.
  • జన్మకుండలిలో సప్తమ భావము బలహీనముగా ఉన్న లేదా సప్తమాధిపతి నీచ స్థానములో ఉంటూ మరియు 11వ భావములో గురువు లేదా శుక్రుడు ఉండినట్లైతే, జాతకుని జీవితభాగస్వామికి వివాహేతర సంబంధం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు.
  • జన్మకుండలిలో నీచ స్థాన క్షీణ చంద్రుడు మరియు రవి కలసి 4వ భావములో ఉంటే జాతకుడికి రహస్యములు ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. అంతే కాకుండా జాతకుడు వయసులో వీరి కంటే పెద్దవారితో గాని లేదా ముసలివారితో గాని అక్రమ సంబంధము ఏర్పరచుకుంటారు.
  • శుక్రుడు ప్రేమ మరియు శ్రుంగరానికి కారకుడు అవుతాడు. ఈ శుక్రుడు రాహువుతో గాని లేదా కుజునితో గాని కలసి ఒకేరాశిలో ఉంటే జాతకుడికి కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఐతే ఈ శుక్ర రాహు లేదా శుక్ర కుజులు కలసి వృశ్చికరాశి, మేషరాశి, తులారాశి, మిధునరాశిలో గాని ఉన్నట్లైతే జాతకునికి వివాహేతర సంబంధములు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి.
  • చంద్రుడు మరియు బుధుడు కలసి మిధునరాశిలో ఉంటూ, ఆ మిధునరాశిపై శని దృష్టి పడితే జాతకుడు వివాహేతర సంబంధం ఏర్పడి, సమస్యలు ఎదుర్కొంటాడు.

(గ్రహ స్థితులు ఇంకా ఉన్నాయి. తరువాతి రోజులలో క్లుప్త వివరణ ఇస్తాను)

ఈ విధంగా కొన్ని విధముల గ్రహ స్థితుల వలన కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా గాని లేదా అనుకోకుండా గాని ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని గ్రహ స్థితుల వలన జాతకులు మోసపోయి, వివాహేతర సంబంధం ఏర్పరచుకొని విచిత్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. సహజంగా వారి బుద్ధి అలాంటిది కాకపోయినా,ఆ సమయములో గ్రహ ప్రభావము  వలన వారి మనస్సు వారి ఆధీనములో లేకుండా చేస్తాయి. ఈ వివాహేతర సంబంధములు ఎన్నో అగుచ్చాట్లు తెచ్చిపెడతాయి.

 

అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి ? అన్న విషయానికి వస్తే, వ్యక్తిగత జన్మకుండలి పరిశీలించి ఏ గ్రహము వలన జాతకుడికి ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయో, ఆ గ్రహమునకు సంబంధించిన పరిహారములు జరిపిస్తే సమస్యకు పరిష్కారం అవుతుంది.

మరి పరిహారాలు జరిపిస్తే సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయా ? అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనము పూర్వజన్మలో చేసిన పాపములకు,పుణ్యములకు కర్మఫలం, కర్మ భారం అనుభవిస్తున్నాము. ఈ జన్మలో మనకు ఏమి జరగాలి అన్నది బ్రహ్మదేవుడు మన నుదిటి వ్రాతను వ్రాసిపెట్టాడు. బ్రహ్మ దేవుడు వ్రాసిన నుదిటి వ్రాతను తిరిగి రాయగలిగే శక్తి ఎవరికి సాధ్యం కాదు. అయితే దోషములు ఉన్నవాటికి పరిహారములు జరిపించుకుంటే “పాము కాటువేయాల్సిన చోట, చీమ కాటు వేస్తుంది” అన్నట్టుగా పెను తుఫాను రావాల్సిన చోట, చినుకులు పడతాయి అన్నమాట.

ఉదాహరణకి మనకు ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళతాము. Operation చేయాలి అని వైద్యుడు చెబుతాడు. ఆపరేషన్ వలన కలిగే నొప్పిని భరించి, మందులు వాడితే జబ్బు నయం అవుతుంది. ఆపరేషన్ కొరకు భయపడి వెనుకడుగు వేస్తే మున్ముందు ఆ జబ్బు కలిగించే నొప్పిని నరకయాతనతో అనుభవించాల్సి ఉంటుంది. ధైర్యము చేసి ముందుకు వెళితే  కేవలం ఆపరేషన్ వలన కలిగే నొప్పి మాత్రమే భరించాల్సి ఉంటుంది. తరువాత ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకవచ్చు.

ఇదే విధంగా మన జాతకములో ఉన్న దోషములకు పరిహారములు చేసుకుంటే సంపూర్ణంగా సమస్యలు పోవు. ఆ పెద్ద సమస్యలు దైవనుగ్రహం వలన చిన్న సమస్యగా మారతాయి. అర్థం చేసుకుంటారని మనవి.

||సర్వేజనా సుఖినోభవంతు||

ఇవి కూడా చదవండి:

  1. గురు చండాల యోగం ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను జాతకుడు ఎదుర్కొంటాడు?
  2. కాలసర్ప దోషం ఉన్నవారు నివృత్తి హోమం ఎలా జరిపించుకోవాలి?
  3. దుష్ట శక్తుల నుండి కాపాడుకునేందుకు, శత్రు నాశనం జరిగేందుకు జాతకుడిని అనుగ్రహించే ప్రత్యాంగిరా హోమం యొక్క వివరాలు. 
  4. జాతకంలో దోషాల వలన దంపతుల మధ్య విభేధాలు కలిగి విడాకుల వరకు తీసుకెల్లే గ్రహస్థితులు ఏవి?
  5. దంపతులలో ఒకరు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులకు జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు కారణం అవుతాయి?
  6. బంధన యోగం అంటే ఏమిటి? నాగ బంధన యోగం అంటే ఏమిటి?
  7. సర్పశాపం
  8. మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు
  9. విడాకులు-జ్యోతిష్య కారణాలు

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Astrology reasons for Heart diseases

గుండెపోటు మరియు గుండె సంబంధిత జబ్బులు- జ్యోతిష్య కారణాలు :

మన జన్మకుండలిలో 4వ భావం మరియు 5వ భావము, కర్కాటక రాశిలో ఉన్న గ్రహములు, రవి, గురు లేదా రవి శని కలయికలను పరిశీలిస్తే జాతకుడికి గుండె సంబంధిత జబ్బుల గురించి, గుండె పరిస్థితి గురించి తెలుస్తుంది.

  • పాప గ్రహములు 4వ భావములో ఉండడం లేదా 4వ భావములో గ్రహములు నీచపడటం లేదా పాప గ్రహములు కర్కాటక రాశిలో ఉండడం వలన జాతకునికి తరచుగా గుండె నొప్పి ఎదుర్కొంటారు.
  • జన్మకుండలిలో 4వ అధిపతి 8వ భావములో ఉంటూ మరియు 4వ భావాధిపతి రవితో కలసి అస్తంగత్వం అవటం వలన జాతకునికి గుండె ఎంతో బలహీనంగా ఉంటుంది.
  • జన్మకుండలిలోని 4వ భావం మరియు 5వ భావములో పాప గ్రహములు ఉండటం (లేదా) పాప గ్రహములు కర్కాటక మరియు సింహా రాశులలో ఉండటం వలన జాతకుడు గుండెజబ్బును ఎదుర్కోవలసి ఉంటుంది.
  • నవాంశ చక్రములో, భావ చక్రములో 4వ పతి శత్రు భావములో ఉండటం లేదా శత్రు గ్రహాలతో కలవటం వలన జాతకుడు తరచూ మానసిక ఆందోళనలు, గుండె నొప్పి ఎదుర్కొంటాడు.Astrology reasons for Heart diseases
  • జన్మకుండలిలో 4వ భావములో లేదా కర్కాటక రాశిలో రాహు లేదా కేతు ఉండటం వలన జాతకుడికి విపరీతమైన Gas Trouble వచ్చి, గుండెను బలహీనపరుస్తుంది. వీరితో శని కూడా కలిస్తే , ఇక ఆ జబ్బును అదుపులో పెట్టటం ఎవరి వలన సాధ్యం కాదు.
  • జన్మకుండలిలోని రాశిచక్రం మరియు నవాంశ చక్రములో చంద్రుడు నీచపడటం (లేదా) శని అధిపతిగా ఉన్న భావాలలో చంద్రుడు ఉండటం వలన జాతకుని గుండె ఎంతో బలహీనంగా ఉంటుంది. ఈ జాతకుడు చెడు వార్తలు వినటం వలన లేదా Shocking వార్తలు వినటం వలన మరణిస్తాడు.
  • శని మరియు రవి కలసి 4వ భావం (లేదా) 5వ భావములో ఉండటం వలన Low BP వస్తుంది, అంతేకాకుండా గుండె బలహీనంగా ఉంటుంది. ఇలాంటి జాతకులు అన్ని విషయములకు విపరీతంగా భయపడుతూ క్లిష్ఠ పరిస్థితులలో పడతారు. ఇంకొందరికి ఎంతో తరచుగా కళ్ల తిరిగి పడిపోవటం లాంటివి జరుగుతాయి.
  • జన్మకుండలిలో 6వ భావాధిపతి 4వ లేదా 5వ భావంలో ఉండటం కర్కాటక లేదా సింహా రాశులలో ఉంటే జాతకుడికి తరచుగా ఛాతి నొప్పి వస్తుంది.
  • జన్మకుండలిలో కుజుడు మరియు శని కలసి 4వ భావములో ఉండటం లేదా కర్కాటక రాశిలో ఉండటం వలన మరియు గురు దృష్టి పడటం వలన జాతకునికి Nervous system బలహీనంగా ఉంటూ, గుండె కూడా ఎంతో బలహీనపడుతుంది.
  • జన్మకుండలిలో బుధుడు లగ్నంలో మరియు రవి, శని కలవటం వలన ఆ వ్యక్తి విపరీతమైన గుండె జబ్బులు ఎదుర్కొంటున్నారు.
  • జన్మకుండలిలో 7వ భావములో లేదా లగ్నములో చంద్ర రాహువులు కలసి ఉండటం మరియు శని 1,4,7,10 భావాలలో ఉండటం వలన జాతకుని గుండె ఎంతో బలహీనంగా ఉంటుంది.
  • జన్మకుండలిలో గురు మరియు రవి కలసి 4వ లేదా 5వ భావములో ఉండటం వలన జాతకుడికి High BP మరియు గుండె జబ్బులు వస్తాయి. వీరిలో కొందరికి డ్రైవింగ్ చేసేటపుడు Attack వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలిపోవటం జరుగుతుంది.
  • వృశ్చిక రాశిలో రవి మరియు కుజుడు కలవటం లేదా గురు దృష్టి పడటం వలన, జాతకుడు గుండె జబ్బులు నయం చేసుకొనుటకు చాలా కాలం పాటు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది.
  • పంచమాధిపతి రవితో కలవటం వలన, జాతకుని గుండె బలహీనపడుతుంది.
  • కుంభరాశిలోని రవి వలన జాతకుడు గుండె బలహీనపడుతుంది.
  • జన్మకుండలిలో మీన లగ్న జాతకులకు, రవి 4వ భావములో ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • లగ్నాధిపతి బలహీనపడి రాహువుతో కలసి 4వ భావంలో ఉండటం వలన లేదా కర్కాటక రాశిలో ఉండటం వలన ఆ జాతకుడికి గుండెపోటు వలన కలిగే మరణ భయం అధికంగా ఉంటుంది.
  • శని సింహరాశిలో ఉండటం ఛాతి నొప్పికి దారి తీస్తుంది.
  • జన్మకుండలిలో 4వ భావాధిపతి గ్రహం 5వ భావములో ఉంటే, జాతకుడు తరచూ గుండె పగిలే వార్తలు వింటారు. 5వ స్థానములో ఉన్న గ్రహ దశలో (లేదా) 5వ గ్రహముపై దృష్టి పడిన గ్రహ దశలలో గాని ఈ సంఘటనలు ఎక్కువగా వింటారు. ఇలాంటి వ్యక్తులు తమకు పూర్వం ఉన్న ప్రేమ వ్యవహారాలను తవ్వి మళ్ళీ కొనసాగిస్తారు. దీని వలన వయస్సు పెరిగే కొద్ది వీరి గుండె బలహీనపడుతుంది. వీరి సంతానం కూడా వారి వృద్ధాప్యములో గుండె పగిలే వార్తలు వింటారు.

చంద్రో మనః కారకాః చంద్రుడు యొక్క శుభ దృష్టి వలన, కుజుని యొక్క శుభ దృష్టి వలన, రాహు శుభదృష్టిలో మాత్రమే మానవులకు వచ్చే గుండె జబ్బులు నుండి నివారణ కలుగుతుంది. వీటికి తంత్ర శాస్త్రములో కొన్ని పరిహార మార్గాలు చెప్పబడ్డాయి. గ్రహ సన్నివేశమును బట్టి క్రింద ఇవ్వబడిన హోమములలో ఒకటి జరిపించాలి.

  1. యమగండ దోష నివారణ బలి
  2. అపమృత్యుదోష నివారణ హోమం
  3. మహా శరభ శాలువ బలి
  4. కాలభైరవ సంతుష్ట హోమం

హృద్రోగములతో గుండెజబ్బులతో బాధింపబడుతున్నవారు ఈ ప్రక్రియలు చేయించినట్లైతే గుండె జబ్బుల నుండి ఆకస్మిక గండముల నుండి తప్పించుకోగలుగుతారు.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles

ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు

Astrology reasons for second marriage

మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు అయిపోతుంది. అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది. ఇంకొందరికి విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం జరిగి కోర్టు కేసులు, కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతుంటారు. ఇది వారి వారి జన్మకుండలిలోని కొన్ని గ్రహ స్థితుల వలన కలుగుతుంది. ఇంకొందరు వివాహము అయినప్పటికి, ద్వితీయ వివాహం జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకుంటారు.   ఇది ఇప్పటి కాలములో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఇది అందరి దంపతులకు జరుగదు. కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రమే జరుగుతాయి. అయితే ఈ వివాహేతర సంబంధములు గూర్చి తరువాత వివరిస్తాను. ఇప్పుడు ద్వితీయ వివాహముకు ఎలాంటి గ్రహ సన్నివేశములు ఉంటాయో మీకు తెలుపుతాను.

         జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి, ద్వితీయ వివాహానికి, విడాకులకు ముఖ్యంగా సప్తమ భావం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్న భావము-ఇది మన వ్యక్తిత్వము తెలియజేస్తుంది; ద్వితీయభావము మరియు ద్వితీయాధిపతి- ఇది మన కుటుంబ జీవనము, భార్య/భర్త ఆయుర్దాయము, ద్వితీయ వివాహ సందర్భములు ఏ విధంగా ఉన్నాయో సూచిస్తుంది; సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి- వివాహము, భర్త, భార్య గురించి తెలియజేస్తుంది; నవమ భావము మరియు నవమ భావాధిపతి- ద్వితీయ వివాహ సందర్భం గూర్చి తెలియజేస్తుంది; ఏకాదశ భావం మరియు ఏకాదశాధిపతి- అనుకున్న కోరికలు నెరవేరు సూచనల గూర్చి తెలియజేస్తుంది; గురువు- స్త్రీ జన్మకుండలిలో భర్త గురించి తెలియజేసే గ్రహం; శుక్రుడు- పురుష జన్మకుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం.

ఈ భావములు, గ్రహ స్థానములు,రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భము ఉందా లేదా అన్న విషయము గ్రహించవచ్చు.

  • జన్మకుండలిలో సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి (బుధుడు, గురువు) ఉన్న రాశి ఈ రెండు ద్విస్వభావ రాశులు (కన్యారాశి, మిధునరాశి, ధను రాశి,మీనరాశి) అయితే , ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగే అవకాశము ఉంటుంది.
  • సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి, నవాంస చక్రములో మరియు భావచక్రములో  సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే జాతకునికి రెండు వివాహములు జరుగు సూచనలు వస్తాయి.
  • వైవాహిక స్థానం అయిన 7వ స్థానముపై గాని లేదా సప్తమాధిపతి పై గాని 2 లేక 3 పాప గ్రహముల (శని, రవి, కుజ,రాహు, కేతు) దృష్టి ఉండినట్లైతే జాతకునికి ద్వితీయ వివాహం జరుగవచ్చు.
  • సప్తమాధిపతి మరియు లజ్ఞాధిపతి ఇద్దరు కలసి 11వ భావములో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహ అవకాశములు ఉంటాయి.
  • సప్తమములో 2 గాని లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు గాని శుక్రునితో కలసి 7వ భావములో ఉంటూ, ఆ సప్తమ భావముపై పాప గ్రహముల యొక్క దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు.
  • అష్టమాధిపతి లగ్నములో గాని లేదా సప్తమ భావములో గాని మరియు సప్తమధిపతి ద్విస్వభావ రాశిలో గాని లేదా శని,కుజ,రాహు,కేతు యొక్క పాప గ్రహముల దృష్టి సప్తమాధిపతి పై ఉన్నా జాతకునికి రెండవ వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి.
  • వైవాహిక స్థానాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావములో గాని, అష్టమ భావములో గాని లేదా 12వ భావములో గాని ఉండి మరియు కుజ, రాహు, కేతు, శని లాంటి పాప గ్రహములో సప్తమములో ఉండి, శుక్రుడు బల్హీనంగా నీచ లేదా శత్రు స్థానములో ఉన్నట్లైతే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది.

కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక, విడిపోవడం గాని, ద్వితీయ వివాహము జరగడం గాని జరుగుతుంది. అయితే జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయము స్పష్టము చేయకూడదు.

 

సంపూర్ణ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, పుట్టిన సమయం వివరాలు ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేసి సంపూర్ణ గ్రహదోషాలు, యోగాలు, అవయోగాలు, పరుహారాలతో సహా రాసి 7 రోజుల లోపు మీకు పంపబడుతుంది. వివరాల కొరకు 9846466430 నెంబరును సంప్రదించండి. ఆన్లైన్ ద్వారా మీ జన్మకుండలి పరిశీలనను బుక్ చేసుకోవడానికి ఈ లింకును క్లిక్ చేయండి.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com                               

ఓం నమో నాగరాజాయ నమః  

“సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)” – పితృదోషము

“సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)” – పితృదోషము:

బ్రహ్మపురాణం ఆధారంగా భాద్రపద మాసములో వచ్చే కృష్ణ పక్షమున మహాలయ పక్షము ప్రారంభం అవుతుంది. ఈ మహాలయ పక్షము 15 రోజుల పాటు ఉంటుంది. పక్షము అంటే 15 రోజులు. మహాలయ పక్షములో వచ్చే అమావాస్యని అనగా భాద్రపద మాస అమావాస్యని మహాలయ అమావాస్య అని, సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు. సర్వపితృ అమావాస్య నాడు పితృ దోషము ఉన్నవారు తమ పితృదేవతలకు శార్థ కర్మలు మరియు నారాయణ నాగబలి కార్యక్రమం తప్పక ఆచరించాలి, జరిపించాలి. ఈ బ్రహ్మ పురాణం ప్రకారం ఈ మహాలయ పక్షము రోజులలో యమధర్మరాజు యమలోకములో ఉన్న ఆత్మలందరికి ఆహారం తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తాడట. కావున మరణించిన వారి పిల్లలు లేదా వారసులు ఈ మహాలయ పక్షములో తమ పితృదేవతలకు పిండ ప్రధానం తప్పకుండా చేయాలి. ఎవరైతే తమ పితృదేవతలకు పిండప్రధానం చేయకుండా ఉంటారో, వారి పితృదేవతలు ఆకలి తీరక, తమ పిల్లలు లేదా వారసులపై ఆగ్రహముతో పక్షము రోజుల తరువాత తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారు.  కారణంగా పితృ దోషం ఏర్పడి తరువాత వచ్చే తరముకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టిన వారు అవుతారు. దీనినే పితృదోషముగా చెబుతారు. ఎవరైతే తమ పితృదేవతలకు ప్రతి సంవత్సరం పిండ ప్రధానం శ్రద్దగా నిర్వహిస్తారో, వారి పితృదేవతలు ఆకలి తీర్చుకుని వారి వారసులను ఆశీర్వదించి, ఆనందంగా తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారు.

         ఈ భూమిపై మానవునికి మరణం రెండు విధాలుగా సంభవిస్తుంది. 1.సహజ మరణం;  2. ఆకస్మిక మరణం. భగవంతుడు నిర్ణయించిన ఆయుర్దాయం ప్రకారం మరణం సంభవిస్తే అది సహజ మరణం అవుతుంది. ఆకస్మిక మరణములు ముఖ్యంగా పితృదోషం వలన కూడా సంభవిస్తాయి. ఈ ఆకస్మిక మరణములకు ఉదాహరణగా రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, హర్షద్ మెహతా, సుబాష్ చంద్ర బోస్, ప్రిన్స్ డయానా వీరందరూ కూడా పితృదోషం బారీనా పడిన వారే అని గుర్తించాలి.

పితృదోషము కలుగుటకు మరొక కారణము:

పితృదేవతలకు శ్రద్ధగా పిండ ప్రధానం చేయకపోతే వారికి మరియు వారి తరువాత తరాల వారికి పితృదోషం సంభవిస్తుంది అని ఇంతవరకు మనము చర్చించుకున్నాము. పితృదోషం కలుగటానికి మరొక కారణం గురించి కూడా మీకు వివరిస్తాను.

         పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన నేరములు, సరిదిద్దలేని తప్పులు, ఇతరుల మరణానికి కారణం అవటం, ఇతరుల బాధలకు కారణం అవటం, …. ఇలాంటి కార్యాలకు కారకులు అయి ఉంటే మరణించిన తరువాత మోక్షము లభించక, తమ తరువాత తరం వారికి (కొడుకు, మనుమడు,….) కూడా పితృదోషము కలిగించిన వారవుతారు.

         పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన తప్పిదములు, ఇప్పుడు తమ వారసులు అనుభవించాల్సి ఉంటుంది. దీనినే పితృదోషం, పితృ ఋణం అంటారు. జన్మకుండలిలోని గ్రహ సన్నివేశాల ద్వారా కూడా పితృదోష నిర్ధారన చేసుకోవచ్చు. ఈ అంశము గురించి ఇంతకు ముందే మీకు అందించాను. ఆ గ్రహముల సన్నివేశములు ఏమిటో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

mahalaya amavasya,pitrudosham
మహాలయ అమావాస్య

పితృదోషానికి గల కారణములు:

  • తెలిసిగాని, తెలియక గాని పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన చెడు కర్మలు, తప్పిదములు.
  • ప్రస్తుతం వారసులు చేసే తప్పిదములకు తమ పితృదేవతల ఆత్మ ప్రశాంతంగా ఉండకపోవటం
  • పితృదేవతల కోరికలు నెరవేరకపోవటం
  • ఆయుధముల వలన లేదా యాక్సిడెంట్ల వలన ఆకస్మిక అసహజ మరణం పొందిన వారసులకు పితృదోషం కలుగుతుంది.
  • వారసులు తమ పితృదేవతలకు శ్రార్ధ కర్మలు ఆచరించకపోవటం.
  • కొందరికి పితృదోషము ఉన్నట్టుగా జన్మకుండలిలో కనిపించదు. ఆకస్మిక ప్రమాదాల వలన చనిపోయిన వారి తండ్రి తరపున 7 తరముల వరకు, తల్లి తరపున 4 తరముల వరకు ఈ పితృదోషం వెంటాడుతుంది.
  • జన్మకుండలిలో రాహు కేతువులు పాప దృష్టి పొంది ఉన్నా, పితృ స్థానం శత్రుస్థానం అయినా, పితృ దోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. హైందవ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు కేతువుల వలన కలిగే పితృశాపమునకు రాహు ఎత్తువ్లా శాంతి, ప్రీతి హోమముల ద్వారా కూడా పితృదోష నివారణ జరుగుతుంది అని చెప్పవచ్చు.
  • భారతీయ సంఖ్యాశాస్త్రములో కూడా ఈ పితృదోషమునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక కుటుంబము తరచూ ఊహించని సమస్యలు ఎదుర్కోవడం లేదా భార్యా భర్తలకు పిల్లలు కలుగకపోవటం లేదా ఒకవేళ కలిగినా ఆరోగ్యంగా ఉండటకపోవటం లేదా మానసిక, శారీరక లోపాలతో జన్మించటం ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవి కూడా “పితృదోషం” వలననే అని గుర్తించాలి. ఇక్కడ చెప్పిన సమస్యలకు సంతనదోషం, సర్పశాపం…… ఇలా ఎన్నో దోషాల వలన కూడా ఈ సమస్యలు వస్తాయి. కాకపోతే పితృదోషం ఉన్నపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పటం జరుగుతోంది. ఏ దోష కారణంగా ఈ సంఘ్తనాలు జరుగుతున్నాయి అనేది కేవలం వారి వారి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలనలో మాత్రమే నిర్దరాన జరుగుతుంది.

పితృదోషము వలన కలిగే సమస్యలు ఏమిటి?

  • పితృదోషము ఉన్నవారి ఇంటిలో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి.
  • పితృదోషముతో బాధపడేవారికి వివాహ విషయములో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా, సరైన వయస్సుకు వివాహం జరుగదు.
  • పితృదోషం నుండి బాధపడేవారు అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు తీర్చలేరు.
  • పితృదోషము ఉన్నవారి కుటుంబములో ఒకరికి తరచూ ఒక పాము కలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమునకు చెందిన పితృదేవతలలో ఒకరు కలలో కనబడి ఆహారం లేదా బట్టలు కొరకు అడుగుతూ ఉంటారు.

పితృదోషముతో బాధపడేవారికి క్రింద ఇస్తున్న సంఘటనలలో కనీసం 4 నుండి 5 వరకు వారి జీవితములో తరచూ జరుగుతూ ఉండాలి. గమనించండి :

  • పితృదోషం ఉన్న వారు నివసించే ఇంటిలో కొత్త గోడలు అయినప్పటికి తొందరగా చీలికలు పడతాయి.
  • తరచూ వారి ఇంటిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోతూ ఉంటాయి.
  • చేతిలో నుండి ఆహారము తరచూ నేల పాలు అవుతూ ఉంటుంది.
  • ఎన్ని సార్లు సరి చేయించినా గోడలలో నీరు లీక్ అవుతూ ఉంటుంది. చీలికలు ఉన్న గోడలలో చనిపోయిన వారి ఆత్మలు ఉంటాయని కూడా చెప్పబడింది.
  • ఇతిలో తరచూ నీటి సమస్య, నీటి పంపు , కుళాయిల సమస్యలు వస్తూ ఉంటాయి. Plumber వచ్చి ఎన్ని సార్లు సరి చేసినా ప్రయోజనం ఉండదు.
  • చీమల మందులు, దోమల మందులు ఎన్ని వాడుతున్నప్పటికి ఇంటిలో చీమలు, దోమలు, బొద్దింకలు, చెదలు బెదడు తగ్గదు.
  • పితృదోషము ఉన్నవారికి, వ్యాపారములు చేస్తూ ఉంటే వారు తీవ్రమైన అప్పులలో కూరుకుపోతారు. అగ్నికి మరియు దొంగతనాల బరీనా పడుతూ ఉంటారు లేదా వారి వ్యాపారములు అకస్మాత్తుగా మూతపడిపోతాయి.
  • పితృదోషం ఉన్నవారి ఇంటిలోని పిల్లలు పెద్దలకు మరియు కుటుంబ సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. పిల్లలు మానసిక లేదా శారీరక లోపముతో జన్మిస్తారు.

 పితృదోష నివారణకు చేయవలసిన పరిహారములు:

  • పితృదోషము నివారణకు సరైన పరిహారము “నారాయణ నాగబలి” ఈ కార్యక్రమముతో పాటుగా కొన్ని పరిహారములు కూడా పాటించాలి.
  • త్రిపిండి శార్థమును ఆచరించాలి.
  • పితృదేవతలు చనిపోయిన మాస తిథులలో లేదా మహాలయ పక్షములో పిండప్రధానము చేయాలి.
  • ప్రతి అమావాస్యకి బ్రహ్మనుడికి అన్నదానం లేదా స్వయంపాకం ఇవ్వాలి.
  • ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున పుణ్యక్షేత్రములలో లేదా దేవాలయముల వద్ద ఆహార పధార్థములను అక్కడ భిక్షాటన చేసే వారికి పంచి పెట్టాలి.
  • సంపాదించే సంపదలో 5 శాతం అనాధలకు, పేదలకు దానము చేయాలి. 

ఈ పరిహారములు అన్నీ కాకుండా ముఖ్యంగా ఆచరించవలసిన పరిహారం “నారాయణ నాగబలిచేయటం వలన పితృదోష నివారణ కలుగుతుంది. పితృదోష పరిణామాలు తగ్గుముఖము పడతాయి.

         మహాలయ పక్షములో  పితృదోషము ఉన్నవారు “నారాయణ నాగబలి” జరిపించి పితృలకు శార్థము నిర్వహించినట్లైతే పితృదోష నివారణ కలుగుతుంది.

         ఈ మహాలయ పక్షములో అంటే ఈ 15 రోజులలో పితృదేవతలు తమ పిల్లలు లేదా వారసుల ఇంటికి ఏదో ఒక రూపములో వస్తారు. కావున ఈ మహాలయ పక్షములో ఇంటికి వచ్చిన ఎవరిని, దేనిని (జంతువులు, పక్షులు) నిర్లక్ష్యము చేయకుండా అప్పటి మీ శక్తిని బట్టి ఆహారము అందజేయాలి. 

         కావున పితృదేవతల ఆత్మ శాంతి కొరకు, వారికి విముక్తి లేదా మోక్షము కలుగుటకు వారసులు శార్ధ కర్మలు శ్రద్ధగా ఆచరించాలి. పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య తిథులలో మరణించిన వారి వారసులు మహాలయ పక్షములో వచ్చే “సర్వపితృ అమావాస్య” నాడు నారాయణ నాగబలి జరిపించి శార్ధము నిర్వహిస్తే ఆత్మశాంతి కలుగుతుంది. ఈ “సర్వపితృ అమావాస్య” నాడు జరిపించే “నారాయణ నాగబలి”, “మోక్ష నారాయణ బలి” మరియు “శార్ధ కర్మలు” చనిపోయినవారికి అంటే పితృదేవతలకు ఆకలి తీరి, శాంతి చేకూరి, తమ వారసులకు దీవెనలు అందించి వారి లోకాలకు తిరిగి వెళ్లిపోతారు.  

 

గమనిక:

అనేకానేక కారణాల వల్ల హైందవులు మరణించిన తమ సంబంధీకులకు శ్రార్ధ కర్మలను నిర్వహించని వారికి, నిర్వహించడం కుదరని వారికి, గతంలో వారి ఆత్మకు తృప్తినిచ్చే చేసిన శ్రార్థ కర్మలో ఏమైనా అపచారాలు ఉన్నాయని శంకిస్తున్న వారికి మరల్ ఆ శ్రార్థ కర్మను నిర్వహించడానికి ఉపకరించే తిథే సర్వపితృ అమావాస్య. ఈ తిథినందు కూడా, గతించిన తమ యొక్క పూర్వీకుల, గోత్రీకుల, రక్త సంబంధీకులకు శ్రార్థ కర్మలను చేయడం కుదరని వారికి బ్రహ్మతంత్ర పీఠం ద్వారా మోక్ష నారాయణ బలి పరిహారమును రుత్విక్కులచే జరిపించబడును.

జన్మకుండలిలో పితృదోషం ఉన్నవారికి మోక్ష నారాయణ బలి జరిపించుట వల్ల పితృదోషములు సంపూర్ణముగా తొలగి, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగును.

ఈ మహాలయ పక్షాల్లో ప్రతి ఒక్కరూ జరిపించవలసిన మంత్రం

‘ఊర్ద్వలోక పితృదేవతాభ్యో నమః

 

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

 

కాన్సర్ వ్యాధికి గల జ్యోతిష్య కారణాలు

Astrology reasons for Cancer disease

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహముల సన్నివేశముల వలన జాతకునికి “వ్రణయోగం” ఏర్పడుతుంది అని తెలుపబడింది. కాన్సర్ ని వ్రణం అని అంటారు. సాధరణంగా 6వ స్థానాధిపతి పాపగ్రహం అయినపుడు (7వ భావాధిపతి లేదా 8వ భావాధిపతి యొక్క నక్షత్రములలో 6వ భావాధిపతి ఉన్నప్పుడు) మరియు ఆ గ్రహం లగ్నంలో గాని లేదా అష్టమ భావములో గాని లేదా దశమ భావంలో గాని ఉన్నట్లైతే, ఆ జాతకులకు ఆ గ్రహం యొక్క వింశొత్తరి మహా దశ జరుగుతున్న సమయములో కాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

cancer disease-Astrology reasons
క్యాన్సర్ వ్యాధి-జ్యోతిష్య కారణాలు

కన్యా లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, మిధున లగ్నం, వృశ్చిక లగ్నం మరియు మీన లగ్నం వారికి ఎక్కువగా ఈ కాన్సర్ వచ్చిన సూచనలు ఉన్నాయి.

ఏ గ్రహము వలన శరీరములోని ఏ భాగమునకు కాన్సర్ వస్తుందో జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఇక్కడ ఇవ్వటం జరిగింది.

  • సాధారణంగా అన్ని రకముల దీర్ఘకాలవ్యాధులకు శని కారణము అయి ఉంటాడు. ఒకవేళ కాన్సర్ కారక గ్రహం, శనితో కలసినా (లేదా) శని దృష్టి పడినా (లేదా) శని అధిపతిగా ఉండు నక్షత్రాలలో ఉండినా (లేదా) శని అధిపతిగా ఉన్న రాశులలో ఉన్నా ఈ కాన్సర్ వ్యాధిని నివారించుటకు చాలా కాలం పడుతుంది. అంతేకాకుండా శని గాని లేదా కాన్సర్ కు కారకమైన గ్రహం గాని జాతకములో వక్రించి ఉంటే , ఆ జాతకులకు వచ్చిన జబ్బు నయం కావటానికి చాలా కాలం పడుతుంది.
  • శని మరియు రాహువు కలసి జన్మకుండలిలో రెండవ స్థానములో ఉంటే ఆ జాతకులు ఖచ్చితంగా పొగాకు నమలటం మరియు ధూమపానం చేయటం వంటి అలవాట్లు ఉంటాయి. ఎవరికైతే ఇక్కడ వివరించిన గ్రహ స్థితులు ఉన్నాయో వారు చాలా జాగ్రత్త వహించాలి. పొగాకు వదిలేసేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రహ కలయిక వలన నోటి కాన్సర్, Throat కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

సూర్యగ్రహణ సమయములో మండకాళి మహా యంత్ర పూజ

సూర్యగ్రహణ సమయములో మండకాళి మహా యంత్ర పూజ:

చాలా మంది దృష్టిలో గ్రహణం అంటే ఒక అశుభ సమయముగా భావిస్తారు. కానీ తాంత్రికవాదులకు, యోగసాధకులకు మాత్రం ఈ గ్రహణ సమయం ఎంతో అనుగ్రహము పొందే సమయముగా భావిస్తారు. సూర్యగ్రహణము వచ్చే సమయములో మండకాళి యంత్ర సాధన చేసిన వారికి కోరిన కోరికలు ఇట్టే తీరిపోతాయి. రోగాలు, ఋణములు, కష్టాలు, మానసిక వ్యాధులు, శారీరక  వ్యాధులు, తీవ్రమైన సమస్యలు తొలగిపోవాలంటే సూర్యగ్రహణ సమయములో మండకాళి యంత్ర పూజను చేయవలసి ఉంటుంది. రాజకీయాలలో ఉన్నత స్థానము పొందాలి అనుకున్నవారు, జనాకర్షణ సాధించుకోవాలి అనుకునేవారు, ఈ మండకాళి యంత్ర పూజకు మించిన అద్భుతమైన మార్గము మరొకటి ఉండదు. 

మండకాళి యంత్ర పూజకు కావల్సిన పూజా సామగ్రి:

  1. మండకాళి మహా యంత్రము
  2. తులసి జపమాల
  3. మండఫలము

గ్రహణము రోజు తెల్లవారుఝామున నిద్రలేచి తలస్నానము చేసి పూజకు సిద్ధము కావాలి. సూర్యోదయ సమయములో ఒక ఇత్తడి కప్పులో కుంకుమ, నెయ్యి, బియ్యము కలిపిన అక్షింతలు తయారు చేసి ఉంచుకోవాలి. మండకాళి యంత్రముకు  ఎర్రటి దారము చుట్టి ఒక ప్లేటులో పసుపుపచ్చ గుడ్డ వేసి దానిమీద ఆ  యంత్రమును ఉంచాలి. ఆ తరువాత యంత్రముకు పూలు, దీపా, ధూప,నైవేద్యాలు సమర్పించాలి. ఆ తరువాత ప్లేటులో ఉంచిన యంత్రముకు కుడిప్రక్కగా ఒక రాగి కప్పులో బియ్యము పోసి అందులో మండఫలము ఉంచాలి. ఆ తరువాత కుంకుమ అక్షితలు చేతిలో తీసుకొని గోత్ర నామములతో సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత సూర్యగ్రహణం ప్రారంభం అయిన రెండు గంటలలోగా తులసి మాలతో “ఓం ఐం మండరాయ సర్వ కార్యం సాధయే ఐం నమః”  అను మంత్ర జపము 5 మాలల జపము చేయాలి.(ఒక మాల =108 సార్లు మంత్ర జపము) . ఈ మంత్రము సిద్ధి పొందాలంటే మామూలు సమయములో 2,00,000 సార్లు చేయాలి. అదే గ్రహణ సమయములో చేసే ఈ మంత్ర, యంత్ర పూజ వలన కేవలము 540 సార్లు జపిస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది. పూజా జరుగుతున్నంతసేపు దీపము, ధూపము వెలుగుతూ ఉండాలి. గ్రహణము రోజు ఈ యంత్ర సాధన పూర్తి అయిన తరువాత ఆ మరుసటి రోజు ఆ మండకాళి మహా యంత్రమును, ఆ పూజా సామగ్రిని అన్నిటిని ఒక పసుపు పచ్చ వస్త్రములో మూట కట్టి ఆ మూటను నదిలో గాని, చేరువ్లో గాని వదలివేయాలి.

గ్రహణ సమయములో చేసే ఈ సాధన ఎంతో అత్యున్నత ఫలితములు పొందవచ్చు. కాకపోతే పూర్తి ఏకాగ్రతతో , భక్తి, శ్రద్ధలతో, స్వచ్చమైన మనస్సుతో పూజ చేయాలి.

మండకాళి యంత్ర సాధన విధి, మండకాళి మహా యంత్రము, ప్రాణ ప్రతిష్ట విధి,తులసి జపమాల  ఇవన్నీ శ్రీ C.V.S.చక్రపాణి గారి వద్ద నుండి పొందుటకు క్రింద ఇవ్వబడిన నంబర్లకు సంప్రదించండి.    

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

కులదైవము ఎవరు?

మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన ఏదో ఒక సమయములో కలుగుతుంది. మనం ఎదుర్కొనే సమస్యలకు కష్టాలకు ఏదో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని భగవంతుడు అనే దైవశక్తి రక్షిస్తాడని మన విశ్వాసం. అయితే మనిషి ఏ దైవాన్ని పూజించాలి, ఏ దైవాన్ని పూజిస్తే అనుకున్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి పూర్వజన్మ కర్మానుగుణంగా కులదైవ పూజలు చేయాలి. అలా చేస్తే ఆ కుల దైవం వీరిని కష్టాల నుండి విముక్తుడిని చేస్తుంది.

         కులం అనేది మన హైందవ మతములోనే కాదు , ప్రపంచములో అనేకమైన పేర్లతో పిలువబడుతూ పూజించడం జరుగుతుంది. భారతదేశములో త్రిమూర్తులనే కాకుండా పరాశక్తిని కూడా ఆరాధించడం జరుగుతుంది. ప్రతికులముకు ఒక కులదైవము ఉంటుందని అందరూ గ్రహించాలి. ఒక వ్యక్తి ఒక జన్మలో ఒక కులములో జన్మించి తన ఆయుర్దాయము అయిపోయాక చనిపోయి ఇంకొక కులములో జన్మిస్తాడు. అలా మళ్ళీ పునర్జన్మించిన ఆ వ్యక్తి తన పూర్వజన్మలో తన కులమునకు సంబంధించిన కులదైవము లేదా ఇంటిదైవము గురించి తెలుసుకోవడం కష్టం. పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో కర్మలు అనుభవించడానికి కారణం అవుతున్నాయి. ఈ జన్మలో మానవులు అదృష్టాన్ని పొందటం కోసం కృత జన్మలో ఏ దైవాన్ని ఏ కులదైవాన్ని ఏ ఇంటి దైవాన్ని పూజించాడో తెలుసుకొని ఈ జన్మలో అదే దైవాన్ని పూజించాలి.

పూర్వజన్మలో  ఏ కులంలో జన్మించాడో ఎలా తెలుసుకోవాలి? ఏ కుల దైవాన్ని పూజించాడో ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పగలరు?

         భారతీయ జ్యోతిష్య శాస్త్ర విధానములో కొన్ని రహస్యాలు వీటి గురించి చెప్పబడ్డాయి. మీ జాతక చక్ర పరిశీలన ద్వారా  దైవజ్ఞ శ్రీ  C.V.S.చక్రపాణి గారు మీ ఇంటి దైవం లేదా కులదైవాన్ని తెలియజేస్తారు. కులదైవాన్ని ఖచ్చితంగా పూజించాలని అనుభవజ్ఞులైన పండితులు చెబుతున్నారు. ఇతర దైవాన్ని ఎంతమందికి మొక్కుకున్న ఫలితం శూన్యం అవుతున్నాయా? ఇలవేల్పుగా మన పూర్వీకులకు అన్నింటా ఆరోగ్యమును, ఐశ్వర్యమును , ఆనందమును ఇచ్చిన మన ఇంటి దైవమును కులదైవాన్ని పూజిస్తే వెంటనే మీపై అనుగ్రహము కలిగి సమస్యలు తొలగిపోతాయి. ఇంటి దైవాన్ని పూజించకపోవడం వలన ఇంట్లో ఆర్థికపరమైన నష్టాలు, అనారోగ్యాలు రావటం, ఇంట్లో పిల్లలకు వివాహాలు కాకపోవటం, సంతానం ప్రక్క దోవలు తొక్కడం, ఇతరులకు వశం కావడం జరుగుతాయి. శ్రీ C.V.S.చక్రపాణి గారిని కలసి మీ యొక్క ఇంటి దైవాన్ని తెలుసుకొని , ఇంటి దైవ పూజా విధానమును తెలుసుకొని పూజించడం వలన మీకు మీ కులదైవం అనుగ్రహము కలిగి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోతాయి. శ్రీ C.V.S.చక్రపాణి గారు కొన్ని వేల మందికి వారి ఇంటి దైవాన్ని తెలియజేశారు. మీ జాతకచక్ర పరిశీలన ద్వారా మీకులదైవమును తెలియజేస్తారు. జ్యోతిష్య శాస్త్ర పరిశీలనలో  అనుభవము గడించిన శ్రీ C.V.S.చక్రపాణి గారిని వెంటనే సంప్రదించి మీ సందేహాలకు సమస్యలకు పరిష్కారము తెలుసుకోండి. ఇందు నిమిత్తం 1000/- సంభావన స్వీకరిస్తారు. మీ కులదేవతకు సంబంధించిన పంచలోహ యంత్రమును మీ గృహములో ఉంచిన అన్నింటా క్షేమం, శుభం, లాభం చేకూరుతాయి. మీకు సంబంధము లేని గ్రహాలకు, దైవాలకు పూజలు చేయటం వలన గ్రహాపీడలు తొలగకపోగా కొత్త దోషాలు ఏర్పడతాయి. అనారోగ్యము వచ్చినపుడు వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందాలి. అంతేగానీ మిడిమిడి జ్ఞానము ఉన్న వ్యక్తులు ఇచ్చే మందులు వాడితే కొత్త సమస్యలు (Side Effects) వస్తాయి. అదే విధంగా మీ కులదైవమును మాత్రమే పూజించాలి. నేటి భావితరాల వారు యువతీ యువకులు తమ జాతక చక్ర పరిశీలన ద్వారా కులదైవమును తెలుసుకొని , ఆ దైవమును పూజించి, ఆదైవ సహాయముతో మీ రంగాలలో అత్యున్నత స్థాయికి చేరుకొండి. ఇతర దైవాన్ని పూజించడం (కులదైవం కాకుండా) ఆధ్యాత్మిక ఆనందం , మోక్షము ప్రాప్తిస్తాయి కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు దోషాలు తీరవు.     

వశీకరణ మహా యంత్రం

వశీకరణ మహా యంత్రం

వశీకరణం అనగా ఒక వ్యక్తిని మనల్ని ఇష్టపడే విధంగా, మన మాట వినే విధంగా చేసుకునే పద్ధతి. ఈ వశీకరణము ఒక విధంగా చెప్పాలంటే తాంత్రిక పద్ధతిగా చెప్పవచ్చు. ఈ వశీకరణ మహా యంత్ర సాధన చేసి ( మంత్ర జపముతో యంత్రమును పూజించడం) మనకు కావలసిన వ్యక్తిని మన ఆధీనములో ఉంచుకోవచ్చు. ఈ వశీకరణ మహా యంత్రము ఒకరిని ఆకర్షించుకొని , తమ జీవితములోనికి ప్రవేశము చేయగలిగే శక్తి ఉన్నది.

వశీకరణ మహా యంత్రం

పురాతన భారతీయ శాస్త్రములో ఒక ఆశ్చర్యకరమైన శక్తివంతమైన చర్య అని చెప్పవచ్చు. మీరు ప్రేమ్ఞ్చే వారిని, మీ జీవిత భాగస్వామిని ఆకర్షించి తమ జీవితములోనికి తెచ్చుకోవచ్చు. మీ ప్రేమ స్వచ్ఛమైనది, నిజమైనది అయితే మీరు సాధన మొదలు పెట్టిన మొదటి రోజు నుండే మీకు వాటి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మీకు ప్రియమైన వ్యక్తిని మంచి పనుల కోసం లేదా మంచి ఉద్దేశముతో వశ్యము చేసుకొనుటకు ఈ వశీకరణ యంత్ర సాధన ఉపయోగపడుతుంది. ఉదా: భార్యా భర్తలు గొడవపడుతూ ఉన్నప్పుడూ ఆ ఇద్దరినీ ఒకటి చేయగలిగే శక్తి ఈ యంత్ర సాధన వలన అవుతుంది. 

ఈ వశీకరణ మహా యంత్రము ఎంతో శక్తివంతమైన తాంత్రికయంత్రము. ఈ సాధన చేయదలచే  వారి జన్మకుండలిలో శని చెడు స్థానములో ఉన్నప్పుడు ఈ వశీకరణ యంత్ర ఫలితము పెంచుకొనుటకు నవగ్రహ మహా యంత్రముతో పాటు పూజించాలి. అంతేకాకుండా జీవితములో విజయము సాధించడానికి, శ్రేయస్సు పొందడానికి కూడా ఈ వశీకరణ యంత్ర సాధన ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే ప్రతి ఒక్క కారణముకు ఒక్కొక్క వశీకరణ మంత్రము విడివిడిగా ఉంటుంది. భార్యాభర్తలు కలువుటకు ఒక వశీకరణ మంత్రము, అన్య వ్యక్తుల వశీకరణ కోసం ఒక మంత్రము ఇలా ప్రతి కారణముకు ఒక్కో మంత్రము నిర్దేశించబడింది. ఈ యంత్రము తీసుకొనే ముందు మీ కోరికను తెలిపినచో శ్రీ C.V.S.చక్రపాణి గారు మీ కొరికకు తగిన మంత్రమును, యంత్ర స్థాపన విధిని, యంత్ర సాధనా విధిని అందజేస్తారు. ఈ యంత్రము నిర్ధిష్టమైన మంత్రముతో పూజించడం వలన ఆ మంత్రమును ఉచ్చరించేతాపుడు వచ్చే శబ్ధ తరంగాలు మీ మనస్సుకు చేరి ఆ శక్తి మీరు కోరుకున్న వ్యక్తులపై ఆకర్షణ కలుగుటకు తోడ్పడుతుంది. మనస్సులో ఎలాంటి చెడు ఉద్ధేశములు లేకుండా నిర్మలమైన మనస్సుతో కోరుకొని యంత్ర సాధన చేసినట్లైతే 40 నుండి 90 రోజుల లోపు ఆ వ్యక్తి మీకు వశ్యము కాగలరు. మీ కోరిక ఎంత తీవ్రంగా ఉంటే, మీ సాధన అంత పద్ధతిగా ఉంటుంది. మీ సాధన ఎంత పద్ధతిగా ఉంటే,అంత వేగవంతమైన ఫలితాలు అందుకుంటారు.మీరు ఎంత నిజాయితీగా భక్తి శ్రద్ధలతో ఒకే ప్రయోజనముతో పూజిస్తారో, ఫలితాలు అంతా ఆనందదాయకంగా మారుతాయి.     

ఈ వశీకరణ యంత్రమును చెడు పనుల కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఈ యంత్రము మీ స్నేహితులకు, మీ పై అధికారికి, మీ గురువులకు, మీ సహోద్యోగులకు,మీ అధికారులకు మీపై మంచి అభిప్రాయము ఏర్పడుటకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వారందరి హృదయాలలో మీరు చేరేట్టుగా చేసుకొనవచ్చు. ఇది మంత్ర, యంత్ర యొక్క శక్తి.

ముందుగా నిర్మలమైన మనస్సు, శరీరముతో తూర్పు దిక్కున అభిముఖంగా కూర్చుని శ్రీ C.V.S.చక్రపాణి గారు మీకు ఇచ్చిన యంత్రమును , గురువు గారు ఇచ్చిన యంత్ర స్థాపన విధిని అనుసరించి ప్రతిష్ట చేసుకోవాలి. ఆ యంత్రము మధ్య భాగము మీ కంటికి సులువుగా కనపడే విధముగా ఏర్పాటు చేసుకోవాలి. యంత్ర ప్రతిష్ట పూర్తి అయిన తరువాత మంత్ర సాధన మొదలు పెట్టాలి. మంత్రజపము మొదలు పెట్టేముందు ఆ యంత్రము యొక్క మధ్య భాగము (యంత్ర శక్తి నిర్ధిష్టం అయ్యే చోటు) పై శ్రద్దగా దృష్టి కేంద్రీకరించి ఆ తరువాత గురువు గారు ఇచ్చిన మంత్రమును మీ కళ్ళు మూసుకొని ఎంతో శ్రద్ధతో స్పష్టముగా మంత్ర ఉచ్ఛాటన చేయాలి. అలా నిర్ధిష్టమైన సార్లు జపించవలసి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం, యంత్రముల కోసం శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

యంత్ర ప్రపంచం

యంత్ర ప్రపంచం

యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనము నిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. కొందరు తాంత్రికము అనగానే అది ఏదో చెడు కలిగించే ప్రక్రియ అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు. ఇతరులకు చెడు కలిగించే ప్రక్రియను ‘కుతంత్రము’ అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.  యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము  ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శక్తివంతమైన యంత్రములు వాటికి సంబంధించిన బీజమంత్రములతో ధ్యానము గావించి , నిర్ధిష్టమైన రోజుల పాటు, నిర్ధిష్టమైన సంఖ్య సార్లు జపించి సిద్ధి పొంది ఆ యంత్రము నుండి పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు.

యంత్ర ప్రపంచం

                    భగవంతుడు మనకు వరముగా ఇవ్వబడిన జ్యోతిష్య శాస్త్రములో ఎన్నో రకాలు అయిన యంత్రములు ఇవ్వటం జరిగింది. శ్రీ C.V.S.చక్రపాణి,జ్యోతిష్య భూషణ గారి వద్ద దొరికే మహా పంచలోహ శక్తివంతమైన యంత్రములు ఏవో తెలుసుకుందాము.

1.పంచాగుళి యంత్రము

2. గృహ శీతల మహా యంత్రము

3.శ్రీ మానసా దేవి యంత్రము

4.తాండవ గణపతి యంత్రము

5.ఉచిష్ఠ గణపతి యంత్రము

6.యక్షిణి యంత్రములు

7.లక్ష్మి గణపతి యంత్రము

8.భగళాముఖి యంత్రము

9.గండభేరుండ నృసింహ యంత్రము

10.గరుడ యంత్రము

11.శత్రు నిర్మూలన యంత్రము

12.రుణ విమోచక కుజ యంత్రము

13.జనాకర్షణ యంత్రము

14.వ్యాపార అభివృద్ధి కుబేర యంత్రము

15.రతి ప్రియ యంత్రము

16.మహా మృత్యుంజయ యంత్రము

17.పిశాచ శబ్ద భేది యంత్రము

18.నాగ యంత్రము

19.నర దృష్టి నివారణ యంత్రము

20.హయగ్రీవ యంత్రము

21.సంపూర్ణ వాస్తు యంత్రము

22.కనకవటి యంత్రము

23.శరభ యంత్రము

24.తాంత్రిక గణపతి యంత్రము

25. శ్రీ చక్ర గాయత్రి యంత్రము

26. కార్తికేయ యంత్రము

27.వారాహి యంత్రము

28.సూర్యుని యంత్రము

29.సుదర్శన యంత్రము

30.స్వర్నాకర్షణ భైరవ యంత్రము

31.నవ నాగ మండల యంత్రము

32.నవగ్రహ యంత్రము

33.గోమతి చక్రాలు

34.సరస్వతి యంత్రము

35.సంతాన గోపాల యంత్రము

36.రాహు యంత్రము

37.కేతు యంత్రము

38.ఆంజనేయ యంత్రము

39.రాశి స్పటిక పిరమిడ్స్ (అన్ని రాశుల వారికి)

40.కర్ణ పిశాచ యంత్రము

41.మహా మృత్యుంజయ యంత్రము

42.వట యక్షిణి మహా యంత్రము

43. అనఘా దేవి మహా యంత్రము

44.శ్రీ సంతోషి మాత మహా యంత్రము

45. వనదుర్గా మహా యంత్రము

46. మానసాదేవి యంత్రము

47. అష్ట దిగ్భంధన మహా యంత్రము

48. సర్వ కష్ట నివారణ యంత్రం

49. శ్రీ సకల విద్యా గణపతి మహా యంత్రము

50. వశీకరణ మహా యంత్రము

51. నవగ్రహ దిగ్పాలక మహా యంత్రము

52. సర్ప వాస్తు శని యంత్రము

53. పాశుపతాస్త్ర మహా యంత్రము

54. శ్రీ నాగేశ్వరి మహా యంత్రము

55. తాంత్రిక వశీకరణ మహా యంత్రము

56. షణ్ముఖ మహా యంత్రము

57. కర్ణ యక్షిణి మహా యంత్రము

58. అనురాగిణి యక్షి మహా యంత్రము

59. చంద్రికా మహా యక్షి మహా యంత్రము

60. చిత్రిని యక్షి మహా యంత్రము

61. హంస యక్షిణి మహా యంత్రము

62. జ్వాలమాలిని యక్షి మహా యంత్రము

63. కామేశ్వరి యక్షి మహా యంత్రము

64. కనకవల్లి యక్షి మహా యంత్రము

65. మనోహర యక్షి మహా యంత్రము

66. పద్మిని యక్షి మహా తంత్రము

67. రతి ప్రియా యక్షిణి మహా యంత్రము

68. శంఖిని యక్షి మహా యంత్రము

69. శోభన యక్షి మహా యంత్రము

70. సింహనా యక్షి మహా యంత్రము

71. విభ్రమ యక్షిణి మహా యంత్రము

72. విశాల యక్షిణి మహా యంత్రము

73. దుఃఖ నివారణ రూపశ్రీ శంకర మహా యంత్రము

74. చౌడేశ్వరి మహా యంత్రము

75.చాముండి  మహా యంత్రము

Note: ఇంకా ఎటువంటి యంత్రములు అయినా  7*7 సైజులో పంచలోహములపై చెక్కించి ఇవ్వబడును.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X