loading

Author: chakrapani

సర్పశాపం

సర్పశాపం

ఒక మనిషి ప్రస్తుత జన్మలో గాని, గత జన్మలో గాని జతకట్టి ఆడుతున్న త్రాచుపాములపై రాళ్ళు విసరడం, త్రాచుపాములను హతమార్చడం, ఇలాంటివి చేయటం వలన తీవ్ర సర్పశాపం ఏర్పడుతుంది. మన పూర్వీకులు గాని, మనము గాని త్రాచుపాముని చంపినట్లైతే ఆ త్రాచుపాము చనిపోయిన తరువాత కొద్ది వారాలలో అస్థిపంజరముగా మారిపోయినప్పటికి ఆ అస్థిపంజరం చుట్టూ ఆ త్రాచుపాము యొక్క ప్రేతాత్మ శాపం 7 తరాల వరకు వారి పూర్వీకులను వేటాడి, వేధిస్తూ అన్నీ రకాల గ్రహాపీడలను, సంతానం కలుగకపోవటం, చర్మ సంబంధిత సమస్యలు, విపరీతమైన త్రాగుడికి బానిసలు కావటం, పరాయిస్త్రీ పురుషులతో సంభోగ వాంఛను కలిగించడం, వ్యాపారాలలో విపరీతమైన నష్టాలు రావటం , ఆకస్మిక మరణములు కలుగటం, ఎంత కష్టపడినా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం లాంటి సమస్యలను ఈ సర్పశాపం కలుగచేస్తుంది. సర్పశాప, నాగదోష విమోచన కాకుండా జీవితములో ఎలాంటి సంతృప్తి, అభివృద్ధి ఉండవు. సర్పశాపం వలన భార్యా భర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తాయి. వివాహం అయిన కొద్ది కాలానికే విడిపోవడం జరుగుతుంది. సంతానము కలుగదు. స్త్రీలకు గర్భసంచి సంబంధిత సమస్యలు వస్తాయి. చాలా మంది భావించినట్లుగా కాలసర్పదోషము మరియు సర్పశాపము రెండు ఒకటి కాదు. ఎవరి జన్మకుండలిలో అయితే పంచమములో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే వారికి నాగదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. పంచమములో రాహు లేదా కేతు ఉన్నవారికి పిల్లలు పుట్టరు. పుట్టినా బ్రతకరు. ఈ నాగదోషము ఉన్నవారు చెప్పటానికి వీలు కానీ అనేక రకాల సమస్యలతో బాధపడతారు. అంతేకాకుండా సంతానము వలన బాధలు కలుగటం లాంటివి జరుగుతాయి. ఈ నాగశాపమునకు మరియు కాలసర్పదోషమునకు పరిహారముగా ఆశ్లేషబలి, నవనాగమండలం, నారాయణ నాగబలి, మహాసర్పబలి . ఈ నాలుగు హోమాది కార్యక్రమములు వలన  మాత్రమే ఈ దోషముల విముక్తి కలుగుతుంది. సర్పశాపముకు, కాలసర్పదోషముకు కాళహస్తిలో రాహుకేతు పూజలు చేయటం, పుట్టలో పాలు పోయటముతో సరిపోదు. ఈ కార్యకరములు కచ్చితంగా జరిపించుకోవాలి.

         ఎవరి జన్మకుండలిలో అయితే మేషరాశిలో లేదా వృశ్చిక రాశిలో, లగ్నములో గాని, చతుర్థ భావములో గాని, ద్వాదశ భావములో గాని రాహు, కేతు, శని ఉన్నట్లైతే అది పరిపూర్ణ సర్పశాపం అని తెలుసుకోవాలి.

సర్ప నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

         స్త్రీలకు జన్మకుండలిలో లగ్నములో కేతువు ఉంటే వారికి నాగదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ లగ్న కేతువు వలన నాగదోషముతో పాటు మాంగల్య దోషము కూడా ఉంటుంది. ఇలాంటి మాంగల్య దోషం ఉన్న వారికి వివాహము జరుగటం కష్టం అవుతుంది. అంతేకాకుండా కేతువు 2వ భావములో ఉన్నవారికి ‘ఆయుర్భావ నాగదోషం’ ఉన్నట్టు గుర్తించాలి. వీరికి అకాలమరణం ప్రాప్తించే అవకాశం ఉంటుంది.

గమనిక:

ప్రముఖ కేరళ  జ్యోతిష శాస్త్ర,వాస్తు శాస్త్ర పండితులు  దైవజ్ఞ రత్న C.V.S.చక్రపాణి గారు మీరు ఎదుర్కొంటున్న వివిధ రకముల సమస్యలకు పరిహారాలు తెలిపి జరిపిస్తారు. 

అనేక రకాల యంత్ర మరియు తంత్ర సాధనాలు చేసుకోవాలి అనుకునేవారు యంత్ర సంబంధిత బీజమంత్రములు పొందడానికి  C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.

మీరు ఎదుర్కొంటున్న గ్రహదోషములకు, సర్పదోషములకు, పైశాచిక గ్రహ పీడలకు, క్షుద్రప్రయోగముల వలన కలిగే సమస్యలకు తగిన  పరిహారముల కొరకు శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు. 

శ్రీ C.V.S.చక్రపాణి గారు సర్పశాస్త్రములో అనువనువు తెలిసినవారు, నిత్యనుష్టాన పరులు. సుదర్శన హోమము, గణపతి హోమము, పుత్రకామేష్టి యాగం, నవగ్రహ హోమము, మహామృత్యుంజయ హోమము,లక్ష్మి కుబేర హోమము, స్వర్ణాకర్షణ బహిరవ హోమం, నాగభైరవ హోమం, ఆశ్లేషబలి,నారాయణ నాగబలి, మహా సర్పబలి, నవనాగమండలం, ప్రత్యాంగిర శ్రీ చక్రేశ్వరి హోమం, సుబ్రహ్మణ్య వింశతి హోమం, గరుడ హోమం, గండభేరుండ జ్వాలా నృసింహ హోమం, శూలిని హోమం, వారాహి హోమం, కనకవటి హోమం, గంధర్వ రాజా హోమం, 21 రకముల యక్షి హోమములు కేరళ తాంత్రిక విధానములో జరిపిస్తారు. సంప్రదించవలసిన  నెంబర్లు 9846466430

 

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

Related Articles:

జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

జాతకులు తాము ఎదుర్కొంటున్న నివృత్తి కానీ సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానము, వాటికి పరిష్కార పరిహార మార్గాలు తెలుసుకునే విధానం.

జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ కర్మలు; స్వగృహ యోగం; సుఖవాహన యోగం; సంతాన యోగం; విద్యా యోగం; వివాహ యోగం; విదేశీయన విద్యా యోగం; విదేశీ ఉద్యోగ యోగం; విదేశీ నివాస యోగం; ప్రణయ సఫలీకృత యోగం (ప్రేమ వ్యవహారములు) ; శృంగార యోగం; పదవీ యోగం; వ్యాపార యోగం; వైవాహిక ఆనంద యోగం; దుర్మరణ అవయోగం; బలవన్మరణ అవయోగం; స్త్రీ మూలక విచార అవయోగం; స్త్రీ మూలక ధన ప్రాప్తి యోగం; నష్టద్రవ్య ప్రాప్తి యోగం; అదృష్ట యోగం; ఆయుః క్షీణ యోగం; పూర్ణాయుర్దాయ యోగం; దైవకృప సిద్ధి యోగం; దైవశాపం; స్త్రీ శాపం; మాతృ శాపం; పితృ శాపం; గురు శాపం; నాగ శాపం; పక్షి శాపం; బ్రాహ్మణ శాపం; మాతృ శాప అరిష్ట యోగములు, భూ, చరాస్తి యోగం; అనుకూల దాంపత్య యోగం; వాహన ప్రయాణ క్షేమ యోగం; వాహన దుర్ఘటన అవయోగం ఇలా మొదలైన యోగముల , అవయోగముల వలన జాతకులు పొందే ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందాలు పొందుటకు ఉపయోగించే గ్రహాల స్థితుల లక్షణములను ఆ యోగాలను పొందుటకు అడ్డుపడే గ్రహాల చెడు లక్షణాల స్థితిగతులను జన్మకుండలి జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చును. ఇందులో ప్రతి సమస్యకు పరిష్కారం పరిహారము ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించాలి.  

ఈ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, సమయము, స్థలము ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేయుటకు 2 రోజుల నుండి 7 రోజుల లోపు కొరియర్ ద్వారా పంపుతారు. సంభావన 1500/-  వివరాల కొరకు 9846466430 కాల్ చేసి కనుక్కోవచ్చు.

జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో ఒకటి లేదా ఎక్కువ గ్రహములు నీచపడటం లేదా అస్తంగత్వం చెందటం (లేదా) రాహు, కేతువులతో కలవటం (లేదా) పీడింపబడటం (లేదా) 6,8,12 వ భావములను ఆక్రమించటం జరిగినపుడు, ఆ జాతకుడు వ్యతిరేక ఫలితములను ఎదుర్కొంటాడు. ఈ వ్యతిరేక ప్రభావం తగ్గాలంటే, కొన్ని పరిహారాలు పాటించాలి.

  1. రవి : జన్మకుండలిలో రవి పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి నోటిలో ఎక్కువగా చొంగ కారుతూ ఉంటుంది. తరచుగా శరీర భాగములు తిమ్మిరి పట్టడం లేదా కొంత శారీరక దుర్బలం కావటం జరుగుతుంది. జాతకుడు తాను ఎల్లపుడూ తన స్థాయి గురించి భయపడుతూ ఉంటాడు. ఆ కారణంగా ఇతరుల వద్ద తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు. కొందరికి Color Blindness  వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి కంటి చూపు తగ్గుతుంది. ఆత్మాన్యూన్యత భావం వలన సమాజములో ఎక్కువగా కలవలేరు.
  2. చంద్రుడు:  జన్మకుండలిలో చంద్రుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి మానసిక వ్యాధులు కలుగుతాయి. ఏ పని చేయుటకు ఆసక్తి కలుగకపోవటం, నిరాశావాదం, అపనమ్మకం, పెంపుడు జంతువులు అకస్మాత్తుగా మరణించటం (చంద్రుడు అతి నీచ స్తితిలో ఉంటే) , భార్య లేదా ప్రేమికురాలిపై అనుమానాలు రావటం, తల్లితో విబేధాలు రావటం, ప్రేమికుల మధ్య తరచూ గొడవలు రావటం, క్రుంగిపోయిన ప్రతీసారి మద్యం సేవించడం లాంటివి జరుగుతాయి. కొందరు ఎడారి ప్రాంతములలో లేదా కరువు కాటకాలు వెలసిన ప్రాంతాలలో నివసిస్తారు. చంద్రుడు పాపగ్రహములతో కలిస్తే అధిక శృంగార వాంఛలు కలిగి హస్తప్రయోగం చేసుకోవటం, మనస్సుపై ఆధీనం లేకపోవటం, అశ్లీల చిత్రాలను చూడటం ఇలా మొదలైన అలవాట్లకు లోనవుతారు. ఈ గ్రహ స్థితి ఉన్నవారు నిజ జీవితములో కంటే, ఊహల్లోనే ఎక్కువగా జీవిస్తారు. దీని కారణంగా మంచి మంచి అవకాశాలను చేతులారా పోగొట్టుకుంటారు.
  3. కుజుడు :  జన్మకుండలిలో కుజుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. రక్త హీనత (anemia) , కళ్ల కింద గుంటలు పడటం, కాంతి చూపు లోపించడం, తలనెప్పులు రావటం జరుగుతాయి. పునరోత్పత్తి శక్తి లేక సంతానం ఆలస్యం అవడం జరుగుతుంది. స్త్రీ జాతకులకు ఋతుక్రమం సరిగా జరగకపోవటం, తరచూ గర్భవిచ్ఛితిలు (Abortions) జరగటం లాంటివి కలుగుతాయి. అప్పులు చేసి ఎంతో కాలం వరకు తిరిగి చెల్లించలేకపోవటం. రహస్యంగా జీవించటం. ధనం ఇతరులకు ఇస్తే అది తిరిగి రాకపోవటం. పోలీసుల నుండి భయం ఏర్పడటం. కలలో వచ్చే సంఘటనలు నిజ జీవితములో జరిగి ఆందోళనలకు గురి కావటం జరుగుతుంది.
  4. బుధుడు:  జన్మకుండలిలో బుధుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి వాసన పసిగట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. తరచూ దంత సంబంధిత సమస్యలు వస్తాయి. నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. చర్మ వ్యాధులు తలెత్తుతాయి. శృంగారం విషయములో కొందరికి లింగమార్పిడి లాంటి విచిత్ర ఆలోచనలు కలుగుతాయి. కొందరు తమ పేరును రహస్యంగా ఉంచుకొని వేరే పేరుతో అశ్లీల కథలను వ్రాస్తూ ఉంటారు.          
  5. గురువు:  జన్మకుండలిలో గురువు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి గురువు బలహీనంగా ఉండటం వలన విద్యలో ఆటంకములు కలుగుతాయి. బంగారము, ధనము నష్టపోతారు. చౌక నగలు వేసుకోవలసి వస్తుంది. చేయని తప్పుకు నిందలు మోయవలసి వస్తుంది. తలపై ఉన్న వెంట్రుకలు తరచూ రాలుతూ ఉంటాయి. వివాహం ఆల్స్యమ్ అవుతుంది (లేదా) వివాహం జరిగి సంవత్సరములు గడచినా సంతానం కలుగకపోవటం జరుగుతుంది. కొందరికి షుగరు వ్యాధి, స్థూలకాయం కూడా వస్తుంది.
  6. శుక్రుడు:  జన్మకుండలిలో శుక్రుడు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి బొటన వేలు బలహీనంగా ఉంటుంది లేదా బొటన వేలికి దెబ్బలు తగలటం జరుగుతూ ఉంటుంది. చర్మవ్యాధులు వస్తాయి. మగవారికి శుక్రకణముల సంఖ్య తగ్గిపోతుంది. ఆడవారిలో పునరోత్పత్తి తగ్గిపోతుంది. ప్రేమ వ్యవహారములు విఫలం అవుతాయి. స్త్రీ సంతానముతో విబేధాలు వస్తాయి. బలం, శక్తి రాను రాను తగ్గిపోతుంది. పగలుపూత అధిక నిద్ర కలుగుతుంది. కొందరికి షుగరు వ్యాధి వస్తుంది.
  7. శని:  జన్మకుండలిలో శని పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి   అగ్నిప్రమాదములు   జరగటం లేదా Short Circuit కలుగటం లాంటివి జరుగుతాయి. పాలవ్యాపారం చేసేవారికి పశువులు మరణిస్తాయి. కనురెప్పలు నుండి తరచూ వెంట్రుకలు రాలతాయి. నివసించే ఇల్లు ఎంతో పురాతనమైనదిగా కనబడుతుంది. చెదలు, పురుగులు, చీమలు, సాలీడు ఇవన్నీ ఎక్కువగా ఉంటూ, ఇంటిని నాశనం చేస్తూ ఉంటాయి. తలపై వెంట్రుకలు త్వరగా రాలిపోతాయి. అకస్మాత్తుగా అనారోగ్యం మరియు బరువు తగ్గడం జరుగుతుంది. బలం తగ్గిపోత్న్దీ. అపనమ్మకం ఎక్కువగా ఉంటుంది.
  8. రాహువు:  జన్మకుండలిలో రాహువు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి  ఉన్న పెంపుడు జంతువులు తొందరగా మరణిస్తాయి. చేతి గోళ్ళు బలహీనంగా ఉంటాయి. సహోద్యోగులతో, ఇంటి ప్రక్కన వారితో, ప్రేమికులతో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి కోల్పోతారు. నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది. విష సర్పాల భయం ఏర్పడుతుంది. కలలో కూడా ఈ సర్పాలు కనిపించే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో విఫలం అవుతారు. ప్రేమ లేని జీవితం జాతకులను మద్యం వైపు తీసుకెళ్తుంది లేదా ఉద్యోగం వదిలేసేలా చేస్తుంది.
  9. కేతువు:  జన్మకుండలిలో కేతువు పాప గ్రహాల చేత పీడింపబడినా (లేదా) నీచపడినా, ఆ జాతకునికి తన సంతానం సమస్యలు తెచ్చిపెడతారు. కాలికి ఉన్న గోళ్ళు విరిగిపోతాయి లేదా బలహీనంగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో infection, మూత్ర సంబంధిత వ్యాధులు వస్తాయి. దైవానుగ్రహం సులభంగా లభించదు.

జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

 గమనిక:

ప్రముఖ కేరళ సర్పశాస్త్ర, జలార్గళశాస్త్ర, జ్యోతిష శాస్త్ర,వాస్తు శాస్త్ర పండితులు C.V.S.చక్రపాణి గారు మీరు ఎదుర్కొంటున్న వివిధ రకముల సమస్యలకు పరిహారాలు తెలిపి జరిపిస్తారు.

అనేక రకాల యంత్ర మరియు తంత్ర సాధనాలు చేసుకోవాలి అనుకునేవారు యంత్ర సంబంధిత బీజమంత్రములు పొందడానికి శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.

మీరు ఎదుర్కొంటున్న గ్రహదోషములకు, సర్పదోషములకు, పైశాచిక గ్రహ పీడలకు, క్షుద్రప్రయోగముల వలన కలిగే సమస్యలకు తగిన  పరిహారముల కొరకు శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.

శ్రీ C.V.S.చక్రపాణి గారు సర్పశాస్త్రములో అనువనువు తెలిసినవారు, నిత్యనుష్టాన పరులు. సుదర్శన హోమము, గణపతి హోమము, పుత్రకామేష్టి యాగం, నవగ్రహ హోమము, మహామృత్యుంజయ హోమము,లక్ష్మి కుబేర హోమము, స్వర్ణాకర్షణ బహిరవ హోమం, నాగభైరవ హోమం, ఆశ్లేషబలి,నారాయణ నాగబలి, మహా సర్పబలి, నవనాగమండలం, ప్రత్యాంగిర శ్రీ చక్రేశ్వరి హోమం, సుబ్రహ్మణ్య వింశతి హోమం, గరుడ హోమం, గండభేరుండ జ్వాలా నృసింహ హోమం, శూలిని హోమం, వారాహి హోమం, కనకవటి హోమం, గంధర్వ రాజా హోమం, 21 రకముల యక్షి హోమములు కేరళ తాంత్రిక విధానములో జరిపిస్తారు. సంప్రదించవలసిన  నెంబర్లు 9846466430

Email : chakrapani.vishnumaya@gmail.com

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

 

 

విడాకులు-జ్యోతిష్య కారణాలు

జ్యోతిష్య శాస్త్ర రీత్యా దంపతులు విడిపోవడం లేదా విడాకులు తీసుకోవడం:

వైవాహిక దంపతుల మధ్య విడిపోవడం లేదా విడాకులు అను సంధర్భాలు రావడం ఇప్పటి కాలములో చాలా సహజంగా మారిపోయింది. వివాహం చేసుకోడానికి పట్టే సమయం విడాకులు తీసుకోవడానికి పట్టడం లేదు. సామాజిక పరంగా విడాకులకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ కేవలం జ్యోతిష్య శాస్త్ర రీత్యా మాత్రమే చర్చించాలి. జ్యోతిష్యునిగా నాకు ఉన్న అనుభవములో వివాహం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఆలస్య వివాహం చేసుకొని కనీసం ఒక సంవత్సరం నిండక ముందే దంపతులు ఇద్దరు విడిపోవడం గాని లేదా విడాకుల నిర్ణయానికి గాని వస్తున్నారు.   

జాతకరీత్యా దంపతులు విడిపోవుటకు లేదా విడాకులు తీసుకునేందుకు గల కారణాలు ఏవి?

విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్న దంపతులకు సహజ కారణములు కొన్ని నా అనుభవములో తెలిసినవి మీకు వివరిస్తున్నాను.

  • దంపతుల మధ్య శృంగార సంబంధం సరిగా సాగకపోవడం లేదా దంపతులలో ఒకరికి శృంగార సామర్థ్యం లేకపోవటం.
  • జాతకములో ద్వికళత్రయోగం (రెండు వివాహములు) ఉండటం.
  • పెళ్ళికిముందు వేరొకరితో ఉన్న ప్రేమ వ్యవహారమును ఇంకొకరితో పెళ్లి అయిన తరువాత కూడా కొనసాగించడం.
  • వివాహం అయ్యి చాలా కాలం అయినా పిల్లలు లేకపోవటం.
  • కొత్త బంధం ఏర్పడిన తరువాత, మొదటి బంధమును నిర్లక్ష్యము చేయటం.
  • వివాహము అయిన తరువాత చాలా కాలం పాటు అనారోగ్యంగా ఉండటం.
  • వివాహం తరువాత పేదరికం ఎదురవటం.
  • వివాహేతర సంబంధములు ఏర్పడటం. 

 

జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉన్న కారణాలు తెలుసుకుందాం:

జ్యోతిష్య శాస్త్రములో నాకున్న 20 సంవత్సరాల అనుభవములో విడాకులకు లేదా దంపతులు విడిపోవుటకు గల కారణమైన ముఖ్య గ్రహములు “రవి,కుజుడు,రాహువు,శని,కేతువు”. భావాల విషయానికి వస్తే అష్టమ భావం,అధిపతి మరియు ద్వాదశ భావం,అధిపతి విడాకులకు ముఖ్య కారణం అవుతాయి.  

దంపతులు విడిపోవటానికి ‘రవి’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

రవికి సహజంగా వేడి తత్వము ఉంటుంది. జాతకములో ఏ విధంగా అయినా రవి సప్తమ భావముకు సంబంధం ఏర్పడినా వైవాహిక జీవితములో చాలా సమస్యలు వస్తాయి. రవి నీచపడినా లేదా శత్రుస్థానములో ఉన్నా మరియు సప్తమ భావానికి సంబంధం ఉంటే జాతకులకు వైవాహిక జీవితములో సమస్యలు ఏర్పడతాయి. ఆధిపత్యం చూపించటానికి, అధికారం చెలాయించటానికి రవి కారకుడు అవుతాడు. కావున ఈ దంపతుల మధ్య సమస్య ముందు అహముతో మొదలవుతుంది. రవి లగ్నములో గాని సప్తమములోగానీ ఉంటే జాతకునికి విడాకులకు దారి తీస్తుంది.

         రవి ఒకవేళ నీచ, శత్రు స్థానములలో లేకుండా కేవలం లగ్న లేదా సప్తమ భావములో ఉంటే దంపతులు  ఇద్దరు ఒకరికొకరు దూషించుకుంటూ, చెడు మాటలతో తిట్టుకోవడం, పోట్లాడుకోవటం లాంటివి జరుగుతాయి కానీ విడాకులు తీసుకోరు.  అదే ఒకవేళ రవి శుక్రుడితో కలసి 2వ భావములో గాని లేదా 4వ భావములో గాని లేదా సప్తమ భావములో గాని లేదా నవమ భావములో గాని ఉన్నట్లైతే విడాకులు కచ్చితంగా జాతకుని జీవితములో జరుగుతుంది.

దంపతులు విడిపోవటానికి ’కుజుడు’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు 2వ భావములో, 4వ భావములో, 7వ భావములో, 8వ భావములో, 12వ భావములో ఉంటే “కుజదోషము”  అని చెబుతారు. కుజుడు తీవ్రమైన గొడవలకు, వివాదాలకు, శారీరక  హింసకు కారకుడు అవుతాడు. కాబట్టి కుజుడు వైవాహిక సంబంధిత భావాలలో అంటే ముఖ్యంగా లగ్నలో లేదా 7వ భావములో కుజుడు ఉంటే , జాతకుడి కుటుంబములో తీవ్రమైన గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు అధికంగా ఉంటాయి.

         ఒకవేళ కుజుడు 7వ భావముకు మాత్రమే సంబంధము ఉంటే అప్పుడు గొడవలు, కొట్లాటలు కుటుంబము మొత్తములో కాకుండా కేవలం భార్య, భర్తల మధ్య మాత్రమే ఉంటాయి.

         స్త్రీ జన్మకుండలిలో పైన వివరించిన భావాలతో పాటుగా 3వ భావం మరియు 11వ భావం లేదా ఆయా అధిపతులు నీచపడితే “ఆ స్త్రీకి అత్తామామల నుండి శారీరక మరియు మానసిక హింస, ఒత్తిడి” ఏర్పడతాయి.

        విడాకులు కలుగడానికి ముఖ్య కారకుడు కుజుడు , అంతేకాకుండా జీవితములో సగ భాగం కోర్టు కేసులకే అంకితం అయిపోతుంది.

         జాతకుడికి కుజుడు వలన రాజయోగము కలిగి, ఎలాంటి పాప గ్రహ దృష్టి లేనపుడు జాతకుడి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడచిపోతుంది.

దంపతులు విడిపోవటానికి ‘శని’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

దంపతులకు విడాకులు కలుగుటకు ఈ శని గ్రహం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శని వైవాహిక స్థానాలకు ముఖ్యమైన లగ్నం లేదా సప్తమ భావాలలో ఉండినట్లైతే జాతకుడు ఎంతో గోప్యమైన లక్షణమును కలిగి ఉంటాడు. అంతేకాకుండా భాగస్వామిని నిత్యం అనుమానిస్తూ ఉంటాడు.

         ఒక వ్యక్తి యొక్క వైవాహిక స్థానానికి మరియు శనికి సంబంధము ఉంటే, ఆ వ్యక్తికి వైవాహిక జీవితములో ఎప్పటికీ సంతృప్తి కలుగదు. శని మందగమనుడు. కాబట్టి శని కలిగించే ప్రభావాలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి జాతకులు విషయాలను ఎంతోకాలం పాటు గోప్యంగా తమలో తాము ఉంచుకుంటారు. ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినపుడు అకస్మాత్తుగా ఆ విషయములు బయట పెడతారు. కారణంగా జీవితములో కోలుకోలేని దెబ్బతింటారు.  ఒక్కోసారి శని దంపతులను శాశ్వతంగా దూరము చేస్తాడు. చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా ,విడిగా ఉంటారు. దంపతుల మధ్య అపర్థాలు చెలరేగటం, గొడవలు కలగటం, వివాదాలు, చివరగా విడాకులు వీటన్నిటికి శని కారకుడు అవుతాడు. నపుంసకత్వానికి, పుత్రుడు కలుగకపోవడానికి శని కూడా కారకుడు అవుతాడు. ఒక్కోసారి ఈ లక్షణాలు కూడా విడాకులకు దారి తీస్తాయి.

దంపతులు విడిపోవటానికి ‘రాహువు’ ఏ విధంగా కారకుడు అవుతాడు ?

వైవాహిక స్థానాలకు, రాహువుకు సంబంధము ఉంటే విడాకులు కలుగుతాయి. విడదీయటములో రాహువు ముఖ్య కారకుడు అవుతాడు. ముఖ్యంగా 7వ భావ రాహువు వలన జాతకుడు లేదా జాతకురాలు  ఒకే స్త్రీ లేదా పురుషునితో శారీరక ఆనందము లభించక, ఇతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రకమైన జాతకులు ఎంతో కాలం ఒకరితోనే జీవించరు. వీరికి  జీవిత భాగస్వాములు మారుతూనే ఉండాలి. రాహువు జాతకుడిని ఇతరులను గేలి చేసే స్వభామును కలుగచేస్తాడు.

         నా అనుభవములో విడాకులు కలిగిన వారిలో జతకములో రాహువు వలన విడాకులు కలిగినవారిలో ముఖ్య కారణం శారీరక సమస్యగా తెలిసింది. ఇంకొన్నిటిలో వివాహేతర సంబంధాల వలన కూడా విడాకులు జరిగాయి.

దంపతులు విడిపోవటానికి ‘కేతువు’ ఏ విధంగా కారకుడు అవుతాడు?

కేతువు దేనినైనా సరే బూడిదగా మార్చే స్వభావము గలవాడు. ఐహిక సంబంధాలకు మనలను దూరం చేసేందుకు కేతువు తోడ్పడతాడు. కేతువు 7వ భావములో ఉంటే జాతకుడికి వైవాహిక జీవితము పై ఆసక్తి చూపించకుండా ఈ కేతువు చేస్తాడు. కుటుంబ జీవితం అంటే జాతకుడికి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ వివాహేతర సంబంధములు గాని లేదా వివాహానికి ముందే ఉన్న ప్రేమ వ్యవహారమును కొనసాగించడం గాని చేస్తూ ఉంటారు.

అదే ఒకవేళ కేతువు శుక్రుడితో కలసి వైవాహిక స్థానములో ఉంటే దగ్గరి బంధువులతోగాని లేదా స్నేహితులతో గాని రహస్యమైన ప్రేమ వ్యవహారములు నడుపుతారు.

         ఏది ఏమైనా సరే కేతువు వైవాహిక స్థానానికి సంబంధం ఉంటే, జాతకుడు తన భార్య/భర్త నుండి పూర్తిగా విడిగా ఉంటారు. కేవలం భవిష్యత్తు తరము కోసం గాని లేదా వంశానికి వారసుల కోసం గాని వివాహానికి అనుమతిస్తారు. ఈ లాంటి జాతకులు తమకు బిడ్డ పుట్టే సమయానికి తన భార్య/భర్తతో విడిపోయి ఉంటారు. 

కేతువు వలన జాతకులు విడిపోయే సందర్భాలు ఉన్నాయి గాని, విడాకులు తీసుకునే సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు.

  • రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములు శత్రు స్థనాలలో గాని లేదా నీచ స్థానాలలో గాని ఉండినట్లైతే , దంపతులు విడిపోవడం జరుగుతుంది.
  • రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములు మరియు వాటి స్థానాలు చెడు దృష్టికి గురి అయి ఉంటే దంపతులకు విడాకులు కచ్చితంగా కలుగుతాయి.
  • ఒకవేళ రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములలో మంచి శుభగ్రహ దృష్టి పడితే  దంపతులకు విడాకులు కలిగిన తరువాత మళ్ళీ కలసి జీవిస్తారు.
  • సప్తమాధిపతి 6వ భావములో ఎలాంటి శుభ గ్రహ దృష్టి లేకుండా ఉంటే  జాతకులకు విడాకులు కలుగుతాయి.
  • శని,రాహువులు కలసి లేదా ఏదో ఒక్క గ్రహం అయినా లగ్నములో ఉంటూ, తీవ్రమైన చెడు గ్రహ దృష్టి పడితే దంపతులు విడిపోవడం జరుగుతుంది. అయితే ఈ గ్రహస్థితి ఉన్నవారికి మళ్ళీ తన జీవిత భాగస్వామితో కలవడం అనేది జరుగదు. కొన్నిసార్లు విడాకుల కొరకు చట్టపరమైన హింసలను భరించాల్సి ఉంటుంది.
  • సప్తమాధిపతి వక్ర స్థితిలో ఉన్నా లేదా అస్తంగత్వం చెందినా (రవితో కలసినా) లేదా నీచపడినా దంపతులు విడిపోవాల్సి ఉంటుంది.

ఈ విధంగా ఎన్నో గ్రహములు, వాటి స్థానములు, వాటి అధిపతుల స్థానములు ఎన్నో దంపతుల మధ్య విబేధాలకు, విడకులకు, విడిపోవడానికి కారణభూతం అవుతున్నాయి. అయితే జన్మకుండలి పూతి విశ్లేషణ చేయనిదే ఎలాంటి నిర్ణయం చేయకూడదు.

ఇక పరిష్కారం విషయానికి వస్తే జన్మకుండలిలో ఏ గ్రహము వలన జాతకుడు పీడింపబడుతున్నాడో, ఆ గ్రహముకు సంబంధించిన తాంత్రిక హోమములే సరైన పరిష్కారములు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

వివరాలకు సంప్రదించండి. Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

ఇవి కూడా చదవండి:

  1. గురు చండాల యోగం ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను జాతకుడు ఎదుర్కొంటాడు?
  2. కాలసర్ప దోషం ఉన్నవారు నివృత్తి హోమం ఎలా జరిపించుకోవాలి?
  3. దుష్ట శక్తుల నుండి కాపాడుకునేందుకు, శత్రు నాశనం జరిగేందుకు జాతకుడిని అనుగ్రహించే ప్రత్యాంగిరా హోమం యొక్క వివరాలు. 
  4. జాతకంలో దోషాల వలన దంపతుల మధ్య విభేధాలు కలిగి విడాకుల వరకు తీసుకెల్లే గ్రహస్థితులు ఏవి?
  5. దంపతులలో ఒకరు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులకు జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు కారణం అవుతాయి?

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

నరదృష్టి అంటే ఏమిటి?నరదృష్టి ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

నరదృష్టి అంటే ఏమిటి? నరదృష్టి ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

నరదృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అని సామెత నానుడిలో ఉంది. ఇది సత్యం. ఒక మనిషి ఏదైనా ఒక నిర్మాణమును గాని , ఒక మనిషిని గాని , గర్భము దాల్చిన స్త్రీని గాని ఏకాగ్రతతో కొంత సమయము పాటు చూసినట్లైతే ఆ మనిషి మీద , నిర్మాణము మీద , భవనము మీద ఆ మనిషి యొక్క చూపు ప్రభావము పడుతుంది. మనస్సులో మంచి ఆలోచనతో చూసే మనిషి చూపు నుండి వచ్చే వైబ్రేషన్లు ఎలాంటి దోషము జరుగదు. అదే ఎవరైనా మనస్సులో చెడు ఆలోచనలతో ద్వేషముతో చూస్తే ఆ చూపు నుండి వచ్చే వైబ్రేషన్లు మనిషిని లేదా నిర్మాణమును అనేక విధములుగా దెబ్బ తీస్తాయి. దీనినే నరదృష్టి అంటారు.మనిషికి తగిలిన ఈ నరదృష్టిని తొలగించుకోవాలంటే  ఒక చిన్న పరిహారము పాటించాలి. ఆవాలు, వెలుల్లి రెబ్బలు, ఉల్లిపాయ తొక్కలు, ఉప్పు, ఎండుమిర్చి ఈ పదార్థాలు అన్నీ ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి మాడిపోయేదాక వేయించాలి. ఆ తరువాత ఆ మిశ్రమమును దృష్టి తగిలిన వ్యక్తి తలచుట్టూ పద్నాలుగు సార్లు త్రిప్పి ఆ తరువాత ఆ మిశ్రమమును దూరంగా పారేయ్యాలి.

nara drishti
నరదృష్టి

        ఇక దక్షిణ దిక్కు సింహద్వారము గల ఇంటికి నరదృష్టి విపరీతంగా ఉంటుంది. దీని వలన తెలియని అకారణ అనారోగ్యాలు, మానసిక అశాంతి కలుగుతాయి. అలా నరదృష్టితో బాధపడేవారు “జల శల్య దక్షిణ దిక్ వాస్తు దోష నివారణా యంత్రము”ను 40 రోజుల పాటు పూజామందిరములో ఉంచి బీజాక్షరములతో 108సార్లు చొప్పున జపించి, ఆ తరువాత ఆ యంత్రమును సింహద్వారముకు పెట్టిన యెడల ఎలాంటి నరదృష్టి కూడా దరిచేరదు.

        షాపులు, హోటళ్లు, వ్యాపార భవనములు,నూతన నిర్మాణములు వీటిపై ఉన్న నరదృష్టి తొలగిపోయి వ్యాపారము సాఫీగా సాగాలంటే “నరఘోష నివారణా మహా యంత్రము” ను వ్యాపార స్థలములలో, షాపులలో, నూతన నిర్మాణాలలో ఉంచాలి. 

ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email:

chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

 

                              ఓం నమో నాగరాజాయ నమః

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

NAGASHAKTHI Telugu Book

Related Articles :

 

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X