loading

Author: chakrapani

కాన్సర్ వ్యాధికి గల జ్యోతిష్య కారణాలు

Astrology reasons for Cancer disease

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహముల సన్నివేశముల వలన జాతకునికి “వ్రణయోగం” ఏర్పడుతుంది అని తెలుపబడింది. కాన్సర్ ని వ్రణం అని అంటారు. సాధరణంగా 6వ స్థానాధిపతి పాపగ్రహం అయినపుడు (7వ భావాధిపతి లేదా 8వ భావాధిపతి యొక్క నక్షత్రములలో 6వ భావాధిపతి ఉన్నప్పుడు) మరియు ఆ గ్రహం లగ్నంలో గాని లేదా అష్టమ భావములో గాని లేదా దశమ భావంలో గాని ఉన్నట్లైతే, ఆ జాతకులకు ఆ గ్రహం యొక్క వింశొత్తరి మహా దశ జరుగుతున్న సమయములో కాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

cancer disease-Astrology reasons
క్యాన్సర్ వ్యాధి-జ్యోతిష్య కారణాలు

కన్యా లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, మిధున లగ్నం, వృశ్చిక లగ్నం మరియు మీన లగ్నం వారికి ఎక్కువగా ఈ కాన్సర్ వచ్చిన సూచనలు ఉన్నాయి.

ఏ గ్రహము వలన శరీరములోని ఏ భాగమునకు కాన్సర్ వస్తుందో జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఇక్కడ ఇవ్వటం జరిగింది.

  • సాధారణంగా అన్ని రకముల దీర్ఘకాలవ్యాధులకు శని కారణము అయి ఉంటాడు. ఒకవేళ కాన్సర్ కారక గ్రహం, శనితో కలసినా (లేదా) శని దృష్టి పడినా (లేదా) శని అధిపతిగా ఉండు నక్షత్రాలలో ఉండినా (లేదా) శని అధిపతిగా ఉన్న రాశులలో ఉన్నా ఈ కాన్సర్ వ్యాధిని నివారించుటకు చాలా కాలం పడుతుంది. అంతేకాకుండా శని గాని లేదా కాన్సర్ కు కారకమైన గ్రహం గాని జాతకములో వక్రించి ఉంటే , ఆ జాతకులకు వచ్చిన జబ్బు నయం కావటానికి చాలా కాలం పడుతుంది.
  • శని మరియు రాహువు కలసి జన్మకుండలిలో రెండవ స్థానములో ఉంటే ఆ జాతకులు ఖచ్చితంగా పొగాకు నమలటం మరియు ధూమపానం చేయటం వంటి అలవాట్లు ఉంటాయి. ఎవరికైతే ఇక్కడ వివరించిన గ్రహ స్థితులు ఉన్నాయో వారు చాలా జాగ్రత్త వహించాలి. పొగాకు వదిలేసేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రహ కలయిక వలన నోటి కాన్సర్, Throat కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

సూర్యగ్రహణ సమయములో మండకాళి మహా యంత్ర పూజ

సూర్యగ్రహణ సమయములో మండకాళి మహా యంత్ర పూజ:

చాలా మంది దృష్టిలో గ్రహణం అంటే ఒక అశుభ సమయముగా భావిస్తారు. కానీ తాంత్రికవాదులకు, యోగసాధకులకు మాత్రం ఈ గ్రహణ సమయం ఎంతో అనుగ్రహము పొందే సమయముగా భావిస్తారు. సూర్యగ్రహణము వచ్చే సమయములో మండకాళి యంత్ర సాధన చేసిన వారికి కోరిన కోరికలు ఇట్టే తీరిపోతాయి. రోగాలు, ఋణములు, కష్టాలు, మానసిక వ్యాధులు, శారీరక  వ్యాధులు, తీవ్రమైన సమస్యలు తొలగిపోవాలంటే సూర్యగ్రహణ సమయములో మండకాళి యంత్ర పూజను చేయవలసి ఉంటుంది. రాజకీయాలలో ఉన్నత స్థానము పొందాలి అనుకున్నవారు, జనాకర్షణ సాధించుకోవాలి అనుకునేవారు, ఈ మండకాళి యంత్ర పూజకు మించిన అద్భుతమైన మార్గము మరొకటి ఉండదు. 

మండకాళి యంత్ర పూజకు కావల్సిన పూజా సామగ్రి:

  1. మండకాళి మహా యంత్రము
  2. తులసి జపమాల
  3. మండఫలము

గ్రహణము రోజు తెల్లవారుఝామున నిద్రలేచి తలస్నానము చేసి పూజకు సిద్ధము కావాలి. సూర్యోదయ సమయములో ఒక ఇత్తడి కప్పులో కుంకుమ, నెయ్యి, బియ్యము కలిపిన అక్షింతలు తయారు చేసి ఉంచుకోవాలి. మండకాళి యంత్రముకు  ఎర్రటి దారము చుట్టి ఒక ప్లేటులో పసుపుపచ్చ గుడ్డ వేసి దానిమీద ఆ  యంత్రమును ఉంచాలి. ఆ తరువాత యంత్రముకు పూలు, దీపా, ధూప,నైవేద్యాలు సమర్పించాలి. ఆ తరువాత ప్లేటులో ఉంచిన యంత్రముకు కుడిప్రక్కగా ఒక రాగి కప్పులో బియ్యము పోసి అందులో మండఫలము ఉంచాలి. ఆ తరువాత కుంకుమ అక్షితలు చేతిలో తీసుకొని గోత్ర నామములతో సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత సూర్యగ్రహణం ప్రారంభం అయిన రెండు గంటలలోగా తులసి మాలతో “ఓం ఐం మండరాయ సర్వ కార్యం సాధయే ఐం నమః”  అను మంత్ర జపము 5 మాలల జపము చేయాలి.(ఒక మాల =108 సార్లు మంత్ర జపము) . ఈ మంత్రము సిద్ధి పొందాలంటే మామూలు సమయములో 2,00,000 సార్లు చేయాలి. అదే గ్రహణ సమయములో చేసే ఈ మంత్ర, యంత్ర పూజ వలన కేవలము 540 సార్లు జపిస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది. పూజా జరుగుతున్నంతసేపు దీపము, ధూపము వెలుగుతూ ఉండాలి. గ్రహణము రోజు ఈ యంత్ర సాధన పూర్తి అయిన తరువాత ఆ మరుసటి రోజు ఆ మండకాళి మహా యంత్రమును, ఆ పూజా సామగ్రిని అన్నిటిని ఒక పసుపు పచ్చ వస్త్రములో మూట కట్టి ఆ మూటను నదిలో గాని, చేరువ్లో గాని వదలివేయాలి.

గ్రహణ సమయములో చేసే ఈ సాధన ఎంతో అత్యున్నత ఫలితములు పొందవచ్చు. కాకపోతే పూర్తి ఏకాగ్రతతో , భక్తి, శ్రద్ధలతో, స్వచ్చమైన మనస్సుతో పూజ చేయాలి.

మండకాళి యంత్ర సాధన విధి, మండకాళి మహా యంత్రము, ప్రాణ ప్రతిష్ట విధి,తులసి జపమాల  ఇవన్నీ శ్రీ C.V.S.చక్రపాణి గారి వద్ద నుండి పొందుటకు క్రింద ఇవ్వబడిన నంబర్లకు సంప్రదించండి.    

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

కులదైవము ఎవరు?

మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన ఏదో ఒక సమయములో కలుగుతుంది. మనం ఎదుర్కొనే సమస్యలకు కష్టాలకు ఏదో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని భగవంతుడు అనే దైవశక్తి రక్షిస్తాడని మన విశ్వాసం. అయితే మనిషి ఏ దైవాన్ని పూజించాలి, ఏ దైవాన్ని పూజిస్తే అనుకున్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి పూర్వజన్మ కర్మానుగుణంగా కులదైవ పూజలు చేయాలి. అలా చేస్తే ఆ కుల దైవం వీరిని కష్టాల నుండి విముక్తుడిని చేస్తుంది.

         కులం అనేది మన హైందవ మతములోనే కాదు , ప్రపంచములో అనేకమైన పేర్లతో పిలువబడుతూ పూజించడం జరుగుతుంది. భారతదేశములో త్రిమూర్తులనే కాకుండా పరాశక్తిని కూడా ఆరాధించడం జరుగుతుంది. ప్రతికులముకు ఒక కులదైవము ఉంటుందని అందరూ గ్రహించాలి. ఒక వ్యక్తి ఒక జన్మలో ఒక కులములో జన్మించి తన ఆయుర్దాయము అయిపోయాక చనిపోయి ఇంకొక కులములో జన్మిస్తాడు. అలా మళ్ళీ పునర్జన్మించిన ఆ వ్యక్తి తన పూర్వజన్మలో తన కులమునకు సంబంధించిన కులదైవము లేదా ఇంటిదైవము గురించి తెలుసుకోవడం కష్టం. పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో కర్మలు అనుభవించడానికి కారణం అవుతున్నాయి. ఈ జన్మలో మానవులు అదృష్టాన్ని పొందటం కోసం కృత జన్మలో ఏ దైవాన్ని ఏ కులదైవాన్ని ఏ ఇంటి దైవాన్ని పూజించాడో తెలుసుకొని ఈ జన్మలో అదే దైవాన్ని పూజించాలి.

పూర్వజన్మలో  ఏ కులంలో జన్మించాడో ఎలా తెలుసుకోవాలి? ఏ కుల దైవాన్ని పూజించాడో ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పగలరు?

         భారతీయ జ్యోతిష్య శాస్త్ర విధానములో కొన్ని రహస్యాలు వీటి గురించి చెప్పబడ్డాయి. మీ జాతక చక్ర పరిశీలన ద్వారా  దైవజ్ఞ శ్రీ  C.V.S.చక్రపాణి గారు మీ ఇంటి దైవం లేదా కులదైవాన్ని తెలియజేస్తారు. కులదైవాన్ని ఖచ్చితంగా పూజించాలని అనుభవజ్ఞులైన పండితులు చెబుతున్నారు. ఇతర దైవాన్ని ఎంతమందికి మొక్కుకున్న ఫలితం శూన్యం అవుతున్నాయా? ఇలవేల్పుగా మన పూర్వీకులకు అన్నింటా ఆరోగ్యమును, ఐశ్వర్యమును , ఆనందమును ఇచ్చిన మన ఇంటి దైవమును కులదైవాన్ని పూజిస్తే వెంటనే మీపై అనుగ్రహము కలిగి సమస్యలు తొలగిపోతాయి. ఇంటి దైవాన్ని పూజించకపోవడం వలన ఇంట్లో ఆర్థికపరమైన నష్టాలు, అనారోగ్యాలు రావటం, ఇంట్లో పిల్లలకు వివాహాలు కాకపోవటం, సంతానం ప్రక్క దోవలు తొక్కడం, ఇతరులకు వశం కావడం జరుగుతాయి. శ్రీ C.V.S.చక్రపాణి గారిని కలసి మీ యొక్క ఇంటి దైవాన్ని తెలుసుకొని , ఇంటి దైవ పూజా విధానమును తెలుసుకొని పూజించడం వలన మీకు మీ కులదైవం అనుగ్రహము కలిగి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోతాయి. శ్రీ C.V.S.చక్రపాణి గారు కొన్ని వేల మందికి వారి ఇంటి దైవాన్ని తెలియజేశారు. మీ జాతకచక్ర పరిశీలన ద్వారా మీకులదైవమును తెలియజేస్తారు. జ్యోతిష్య శాస్త్ర పరిశీలనలో  అనుభవము గడించిన శ్రీ C.V.S.చక్రపాణి గారిని వెంటనే సంప్రదించి మీ సందేహాలకు సమస్యలకు పరిష్కారము తెలుసుకోండి. ఇందు నిమిత్తం 1000/- సంభావన స్వీకరిస్తారు. మీ కులదేవతకు సంబంధించిన పంచలోహ యంత్రమును మీ గృహములో ఉంచిన అన్నింటా క్షేమం, శుభం, లాభం చేకూరుతాయి. మీకు సంబంధము లేని గ్రహాలకు, దైవాలకు పూజలు చేయటం వలన గ్రహాపీడలు తొలగకపోగా కొత్త దోషాలు ఏర్పడతాయి. అనారోగ్యము వచ్చినపుడు వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందాలి. అంతేగానీ మిడిమిడి జ్ఞానము ఉన్న వ్యక్తులు ఇచ్చే మందులు వాడితే కొత్త సమస్యలు (Side Effects) వస్తాయి. అదే విధంగా మీ కులదైవమును మాత్రమే పూజించాలి. నేటి భావితరాల వారు యువతీ యువకులు తమ జాతక చక్ర పరిశీలన ద్వారా కులదైవమును తెలుసుకొని , ఆ దైవమును పూజించి, ఆదైవ సహాయముతో మీ రంగాలలో అత్యున్నత స్థాయికి చేరుకొండి. ఇతర దైవాన్ని పూజించడం (కులదైవం కాకుండా) ఆధ్యాత్మిక ఆనందం , మోక్షము ప్రాప్తిస్తాయి కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు దోషాలు తీరవు.     

వశీకరణ మహా యంత్రం

వశీకరణ మహా యంత్రం

వశీకరణం అనగా ఒక వ్యక్తిని మనల్ని ఇష్టపడే విధంగా, మన మాట వినే విధంగా చేసుకునే పద్ధతి. ఈ వశీకరణము ఒక విధంగా చెప్పాలంటే తాంత్రిక పద్ధతిగా చెప్పవచ్చు. ఈ వశీకరణ మహా యంత్ర సాధన చేసి ( మంత్ర జపముతో యంత్రమును పూజించడం) మనకు కావలసిన వ్యక్తిని మన ఆధీనములో ఉంచుకోవచ్చు. ఈ వశీకరణ మహా యంత్రము ఒకరిని ఆకర్షించుకొని , తమ జీవితములోనికి ప్రవేశము చేయగలిగే శక్తి ఉన్నది.

వశీకరణ మహా యంత్రం

పురాతన భారతీయ శాస్త్రములో ఒక ఆశ్చర్యకరమైన శక్తివంతమైన చర్య అని చెప్పవచ్చు. మీరు ప్రేమ్ఞ్చే వారిని, మీ జీవిత భాగస్వామిని ఆకర్షించి తమ జీవితములోనికి తెచ్చుకోవచ్చు. మీ ప్రేమ స్వచ్ఛమైనది, నిజమైనది అయితే మీరు సాధన మొదలు పెట్టిన మొదటి రోజు నుండే మీకు వాటి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మీకు ప్రియమైన వ్యక్తిని మంచి పనుల కోసం లేదా మంచి ఉద్దేశముతో వశ్యము చేసుకొనుటకు ఈ వశీకరణ యంత్ర సాధన ఉపయోగపడుతుంది. ఉదా: భార్యా భర్తలు గొడవపడుతూ ఉన్నప్పుడూ ఆ ఇద్దరినీ ఒకటి చేయగలిగే శక్తి ఈ యంత్ర సాధన వలన అవుతుంది. 

ఈ వశీకరణ మహా యంత్రము ఎంతో శక్తివంతమైన తాంత్రికయంత్రము. ఈ సాధన చేయదలచే  వారి జన్మకుండలిలో శని చెడు స్థానములో ఉన్నప్పుడు ఈ వశీకరణ యంత్ర ఫలితము పెంచుకొనుటకు నవగ్రహ మహా యంత్రముతో పాటు పూజించాలి. అంతేకాకుండా జీవితములో విజయము సాధించడానికి, శ్రేయస్సు పొందడానికి కూడా ఈ వశీకరణ యంత్ర సాధన ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే ప్రతి ఒక్క కారణముకు ఒక్కొక్క వశీకరణ మంత్రము విడివిడిగా ఉంటుంది. భార్యాభర్తలు కలువుటకు ఒక వశీకరణ మంత్రము, అన్య వ్యక్తుల వశీకరణ కోసం ఒక మంత్రము ఇలా ప్రతి కారణముకు ఒక్కో మంత్రము నిర్దేశించబడింది. ఈ యంత్రము తీసుకొనే ముందు మీ కోరికను తెలిపినచో శ్రీ C.V.S.చక్రపాణి గారు మీ కొరికకు తగిన మంత్రమును, యంత్ర స్థాపన విధిని, యంత్ర సాధనా విధిని అందజేస్తారు. ఈ యంత్రము నిర్ధిష్టమైన మంత్రముతో పూజించడం వలన ఆ మంత్రమును ఉచ్చరించేతాపుడు వచ్చే శబ్ధ తరంగాలు మీ మనస్సుకు చేరి ఆ శక్తి మీరు కోరుకున్న వ్యక్తులపై ఆకర్షణ కలుగుటకు తోడ్పడుతుంది. మనస్సులో ఎలాంటి చెడు ఉద్ధేశములు లేకుండా నిర్మలమైన మనస్సుతో కోరుకొని యంత్ర సాధన చేసినట్లైతే 40 నుండి 90 రోజుల లోపు ఆ వ్యక్తి మీకు వశ్యము కాగలరు. మీ కోరిక ఎంత తీవ్రంగా ఉంటే, మీ సాధన అంత పద్ధతిగా ఉంటుంది. మీ సాధన ఎంత పద్ధతిగా ఉంటే,అంత వేగవంతమైన ఫలితాలు అందుకుంటారు.మీరు ఎంత నిజాయితీగా భక్తి శ్రద్ధలతో ఒకే ప్రయోజనముతో పూజిస్తారో, ఫలితాలు అంతా ఆనందదాయకంగా మారుతాయి.     

ఈ వశీకరణ యంత్రమును చెడు పనుల కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఈ యంత్రము మీ స్నేహితులకు, మీ పై అధికారికి, మీ గురువులకు, మీ సహోద్యోగులకు,మీ అధికారులకు మీపై మంచి అభిప్రాయము ఏర్పడుటకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వారందరి హృదయాలలో మీరు చేరేట్టుగా చేసుకొనవచ్చు. ఇది మంత్ర, యంత్ర యొక్క శక్తి.

ముందుగా నిర్మలమైన మనస్సు, శరీరముతో తూర్పు దిక్కున అభిముఖంగా కూర్చుని శ్రీ C.V.S.చక్రపాణి గారు మీకు ఇచ్చిన యంత్రమును , గురువు గారు ఇచ్చిన యంత్ర స్థాపన విధిని అనుసరించి ప్రతిష్ట చేసుకోవాలి. ఆ యంత్రము మధ్య భాగము మీ కంటికి సులువుగా కనపడే విధముగా ఏర్పాటు చేసుకోవాలి. యంత్ర ప్రతిష్ట పూర్తి అయిన తరువాత మంత్ర సాధన మొదలు పెట్టాలి. మంత్రజపము మొదలు పెట్టేముందు ఆ యంత్రము యొక్క మధ్య భాగము (యంత్ర శక్తి నిర్ధిష్టం అయ్యే చోటు) పై శ్రద్దగా దృష్టి కేంద్రీకరించి ఆ తరువాత గురువు గారు ఇచ్చిన మంత్రమును మీ కళ్ళు మూసుకొని ఎంతో శ్రద్ధతో స్పష్టముగా మంత్ర ఉచ్ఛాటన చేయాలి. అలా నిర్ధిష్టమైన సార్లు జపించవలసి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం, యంత్రముల కోసం శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

యంత్ర ప్రపంచం

యంత్ర ప్రపంచం

యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనము నిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. కొందరు తాంత్రికము అనగానే అది ఏదో చెడు కలిగించే ప్రక్రియ అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు. ఇతరులకు చెడు కలిగించే ప్రక్రియను ‘కుతంత్రము’ అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.  యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము  ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శక్తివంతమైన యంత్రములు వాటికి సంబంధించిన బీజమంత్రములతో ధ్యానము గావించి , నిర్ధిష్టమైన రోజుల పాటు, నిర్ధిష్టమైన సంఖ్య సార్లు జపించి సిద్ధి పొంది ఆ యంత్రము నుండి పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు.

యంత్ర ప్రపంచం

                    భగవంతుడు మనకు వరముగా ఇవ్వబడిన జ్యోతిష్య శాస్త్రములో ఎన్నో రకాలు అయిన యంత్రములు ఇవ్వటం జరిగింది. శ్రీ C.V.S.చక్రపాణి,జ్యోతిష్య భూషణ గారి వద్ద దొరికే మహా పంచలోహ శక్తివంతమైన యంత్రములు ఏవో తెలుసుకుందాము.

1.పంచాగుళి యంత్రము

2. గృహ శీతల మహా యంత్రము

3.శ్రీ మానసా దేవి యంత్రము

4.తాండవ గణపతి యంత్రము

5.ఉచిష్ఠ గణపతి యంత్రము

6.యక్షిణి యంత్రములు

7.లక్ష్మి గణపతి యంత్రము

8.భగళాముఖి యంత్రము

9.గండభేరుండ నృసింహ యంత్రము

10.గరుడ యంత్రము

11.శత్రు నిర్మూలన యంత్రము

12.రుణ విమోచక కుజ యంత్రము

13.జనాకర్షణ యంత్రము

14.వ్యాపార అభివృద్ధి కుబేర యంత్రము

15.రతి ప్రియ యంత్రము

16.మహా మృత్యుంజయ యంత్రము

17.పిశాచ శబ్ద భేది యంత్రము

18.నాగ యంత్రము

19.నర దృష్టి నివారణ యంత్రము

20.హయగ్రీవ యంత్రము

21.సంపూర్ణ వాస్తు యంత్రము

22.కనకవటి యంత్రము

23.శరభ యంత్రము

24.తాంత్రిక గణపతి యంత్రము

25. శ్రీ చక్ర గాయత్రి యంత్రము

26. కార్తికేయ యంత్రము

27.వారాహి యంత్రము

28.సూర్యుని యంత్రము

29.సుదర్శన యంత్రము

30.స్వర్నాకర్షణ భైరవ యంత్రము

31.నవ నాగ మండల యంత్రము

32.నవగ్రహ యంత్రము

33.గోమతి చక్రాలు

34.సరస్వతి యంత్రము

35.సంతాన గోపాల యంత్రము

36.రాహు యంత్రము

37.కేతు యంత్రము

38.ఆంజనేయ యంత్రము

39.రాశి స్పటిక పిరమిడ్స్ (అన్ని రాశుల వారికి)

40.కర్ణ పిశాచ యంత్రము

41.మహా మృత్యుంజయ యంత్రము

42.వట యక్షిణి మహా యంత్రము

43. అనఘా దేవి మహా యంత్రము

44.శ్రీ సంతోషి మాత మహా యంత్రము

45. వనదుర్గా మహా యంత్రము

46. మానసాదేవి యంత్రము

47. అష్ట దిగ్భంధన మహా యంత్రము

48. సర్వ కష్ట నివారణ యంత్రం

49. శ్రీ సకల విద్యా గణపతి మహా యంత్రము

50. వశీకరణ మహా యంత్రము

51. నవగ్రహ దిగ్పాలక మహా యంత్రము

52. సర్ప వాస్తు శని యంత్రము

53. పాశుపతాస్త్ర మహా యంత్రము

54. శ్రీ నాగేశ్వరి మహా యంత్రము

55. తాంత్రిక వశీకరణ మహా యంత్రము

56. షణ్ముఖ మహా యంత్రము

57. కర్ణ యక్షిణి మహా యంత్రము

58. అనురాగిణి యక్షి మహా యంత్రము

59. చంద్రికా మహా యక్షి మహా యంత్రము

60. చిత్రిని యక్షి మహా యంత్రము

61. హంస యక్షిణి మహా యంత్రము

62. జ్వాలమాలిని యక్షి మహా యంత్రము

63. కామేశ్వరి యక్షి మహా యంత్రము

64. కనకవల్లి యక్షి మహా యంత్రము

65. మనోహర యక్షి మహా యంత్రము

66. పద్మిని యక్షి మహా తంత్రము

67. రతి ప్రియా యక్షిణి మహా యంత్రము

68. శంఖిని యక్షి మహా యంత్రము

69. శోభన యక్షి మహా యంత్రము

70. సింహనా యక్షి మహా యంత్రము

71. విభ్రమ యక్షిణి మహా యంత్రము

72. విశాల యక్షిణి మహా యంత్రము

73. దుఃఖ నివారణ రూపశ్రీ శంకర మహా యంత్రము

74. చౌడేశ్వరి మహా యంత్రము

75.చాముండి  మహా యంత్రము

Note: ఇంకా ఎటువంటి యంత్రములు అయినా  7*7 సైజులో పంచలోహములపై చెక్కించి ఇవ్వబడును.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles:

ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు

ద్వితీయ వివాహం:

మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు అయిపోతుంది. అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది. ఇంకొందరికి విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం జరిగి కోర్టు కేసులు, కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతుంటారు. ఇది వారి వారి జన్మకుండలిలోని కొన్ని గ్రహ స్థితుల వలన కలుగుతుంది. ఇంకొందరు వివాహము అయినప్పటికి, ద్వితీయ వివాహం జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకుంటారు.   ఇది ఇప్పటి కాలములో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఇది అందరి దంపతులకు జరుగదు. కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రమే జరుగుతాయి. అయితే ఈ వివాహేతర సంబంధములు గూర్చి తరువాత వివరిస్తాను. ఇప్పుడు ద్వితీయ వివాహముకు ఎలాంటి గ్రహ సన్నివేశములు ఉంటాయో మీకు తెలుపుతాను.

         జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి, ద్వితీయ వివాహానికి, విడాకులకు ముఖ్యంగా సప్తమ భావం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్న భావము-ఇది మన వ్యక్తిత్వము తెలియజేస్తుంది; ద్వితీయభావము మరియు ద్వితీయాధిపతి- ఇది మన కుటుంబ జీవనము, భార్య/భర్త ఆయుర్దాయము, ద్వితీయ వివాహ సందర్భములు ఏ విధంగా ఉన్నాయో సూచిస్తుంది; సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి- వివాహము, భర్త, భార్య గురించి తెలియజేస్తుంది; నవమ భావము మరియు నవమ భావాధిపతి- ద్వితీయ వివాహ సందర్భం గూర్చి తెలియజేస్తుంది; ఏకాదశ భావం మరియు ఏకాదశాధిపతి- అనుకున్న కోరికలు నెరవేరు సూచనల గూర్చి తెలియజేస్తుంది; గురువు- స్త్రీ జన్మకుండలిలో భర్త గురించి తెలియజేసే గ్రహం; శుక్రుడు- పురుష జన్మకుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం.

ద్వితీయ వివాహం
ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు

ఈ భావములు, గ్రహ స్థానములు,రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భము ఉందా లేదా అన్న విషయము గ్రహించవచ్చు.

  • జన్మకుండలిలో సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి (బుధుడు, గురువు) ఉన్న రాశి ఈ రెండు ద్విస్వభావ రాశులు (కన్యారాశి, మిధునరాశి, ధను రాశి,మీనరాశి) అయితే , ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగే అవకాశము ఉంటుంది.
  • సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి, నవాంస చక్రములో మరియు భావచక్రములో  సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే జాతకునికి రెండు వివాహములు జరుగు సూచనలు వస్తాయి.
  • వైవాహిక స్థానం అయిన 7వ స్థానముపై గాని లేదా సప్తమాధిపతి పై గాని 2 లేక 3 పాప గ్రహముల (శని, రవి, కుజ,రాహు, కేతు) దృష్టి ఉండినట్లైతే జాతకునికి ద్వితీయ వివాహం జరుగవచ్చు.
  • సప్తమాధిపతి మరియు లజ్ఞాధిపతి ఇద్దరు కలసి 11వ భావములో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహ అవకాశములు ఉంటాయి.
  • సప్తమములో 2 గాని లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు గాని శుక్రునితో కలసి 7వ భావములో ఉంటూ, ఆ సప్తమ భావముపై పాప గ్రహముల యొక్క దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు.
  • అష్టమాధిపతి లగ్నములో గాని లేదా సప్తమ భావములో గాని మరియు సప్తమధిపతి ద్విస్వభావ రాశిలో గాని లేదా శని,కుజ,రాహు,కేతు యొక్క పాప గ్రహముల దృష్టి సప్తమాధిపతి పై ఉన్నా జాతకునికి రెండవ వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి.
  • వైవాహిక స్థానాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావములో గాని, అష్టమ భావములో గాని లేదా 12వ భావములో గాని ఉండి మరియు కుజ, రాహు, కేతు, శని లాంటి పాప గ్రహములో సప్తమములో ఉండి, శుక్రుడు బల్హీనంగా నీచ లేదా శత్రు స్థానములో ఉన్నట్లైతే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది.

కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక, విడిపోవడం గాని, ద్వితీయ వివాహము జరగడం గాని జరుగుతుంది. అయితే జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయము స్పష్టము చేయకూడదు.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com                              

  ఓం నమో నాగరాజాయ నమః  

 

బంధన యోగం

“బంధన యోగము” అంటే ఏమిటి? (Imprisonment or Arrest or Jail)

బంధన యోగము, జైలుకి వెళ్ళటం లేదా చెరసాలలో బంధించటం ఇలాంటి సంఘటనలు జరుగుటకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా చూసినట్లైతే జన్మకుండలిలో రాహువు చెడు స్థానములో ఉన్నప్పుడు జాతకునికి జైలుకి లేదా చెరసాలకు వెళ్ళే సూచనలు ఎదురవుతాయి. కుజుడు పోలీసులను మరియు చట్టము కొరకు పని చేసే ఉద్యోగులను ఆధిపత్యం వహిస్తాడు. రాహువు జైళ్లను, పోలీసు రక్షణ స్థలములను, పాతోలజి ల్యాబులను మొదలైన వాటిని రాహువు ఆధిపత్యం వహిస్తాడు. జన్మకుండలిలో లగ్న అధిపతి మరియు 6వ భావాధిపతి కలసి కేంద్ర స్థానములో (1,4,7,10 స్థానాలు) లేదా త్రికోణములో (1,5,9 వ స్థానాలు) శని మరియు రాహు లేదా కేతువు కలసి ఉంటే “బంధన యోగము”ఉన్నట్టు గుర్తించాలి.

         లగ్నము నుండి కాకుండా అదే చంద్రుడు ఉన్న రాశి నుండి జాతకునికి పైన చెప్పిన విధంగా గ్రహ స్థానములు ఏర్పడితే అప్పుడు ఆ జాతకుడు మానసికంగా బంధీకానాలో ఉంటాడు. ఇలాంటి జాతకులు తమకు తాము ఒంటరిగా చేసుకుని సమాజముకు తెలియకుండా , నాలుగు గోడల మధ్య ఉండిపోతారు.

ఇలాంటి వారిలో కొంతమంది మానసికంగా అనారోగ్యము వచ్చి, ఈ ప్రపంచము నుండి వెలివేయబడతారు. ఇదే సంఘటనను సన్యాసులకు, గురువులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వీరు ఐహిక ప్రపంచము నుండి విడుదల అయ్యి ఆధ్యాత్మిక చింతనను ఏకాంతవాసము చేసి అనుభవిస్తారు.

అంతేకాకుండా జన్మకుండలిలో లగ్నము నుండి 6వ స్థానములో, 8వ స్థానములో, 12వ స్థానములో నీచ గ్రహములు ఉన్నట్లైతే ఆ జాతకులు జైలుకు తరలించబడతారు.

6వ స్థానము ముఖ్యముగా కోర్టు వలన ఏర్పడు చిక్కులు, జాతకునికి వచ్చే వ్యాధులు, రోగములు తెలియచేస్తుంది. 8వ స్థానము గండములు, అపాయముల గురించి చెబుతుంది. 12వ స్థానము జాతకుడు చెరసాలలో బంధీగా ఉంటారా లేదా అన్న విషయము తెలియజేస్తుంది.

శని, రాహువు, కేతువు, కుజుడు ఈ నాలుగు గ్రహములు బంధన యోగము ఏర్పడుటకు  కారణం అయ్యే గ్రహములు. ఏ ఇతర గ్రహము అయినా ఈ నాలుగు గ్రహములతో కలసి 2,5,6,8,9,12 భావములలో ఉంటే బంధన యోగము ఏర్పడి, ఆ గ్రహముల లక్షణముల ప్రకారము సంఘటనలు ఎదురవుతాయి. ఈ నాలుగు నీచ గ్రహముల (శని, కుజ, రాహు, కేతు) వలన నాలుగు రకముల బంధన యోగములు ఉంటాయి.

నాలుగు రకముల బంధన యోగములు :

అరి బంధన యోగము

ఈ అరి బంధన యోగము శని గ్రహము వలన కలుగుతుంది. అంతేకాకుండా జాతకులు పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలితములు అనుభవించాల్సి ఉంటుంది. దీనినే ప్రారబ్ధ కర్మ అని అంటారు. ప్రారబ్ద కర్మను అనుభవించడానికి తోడ్పడే గ్రహము శని గ్రహము. గత జన్మలో శాప పూరితం అయినప్పుడు, ఇహ జన్మలో తీవ్రమైన బాధలు, కష్టములు, క్రుంగిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా శత్రువుల చేతిలో అపజయము పాలవటం, అంతేకాకుండా ఏదైనా వ్యాధి రీత్యా లేదా శారీరక దెబ్బలు గాని తగిలి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అరి బంధన యోగము అనేది జాతకులు ఏ తప్పు చేయకపోయినా, వారు చేసే చెడు స్నేహము వలన జైలుకు వెళతారు. డృగ్ మాఫియా, దొంగతనములు, స్నేహితులతో కలసి  శృంగారంలో పాల్గొనటం, లాంటి పనులు చేసి , పట్టుబడి జైలుకి వెళతారు.

విర్ బంధన యోగము :

ఈ విరి బంధన యోగము కుజ గ్రహము వలన కలుగుతుంది. ఫలితంగా యుద్ధములలో, గొడవలలో పోరాడటం, శత్రువుల వలలో పడటం లాంటివి జరుగుతాయి. ఈ విరి బంధన యోగముకు చెందిన వారు అంతర్యుద్ధములలో, వీధి గొడవలలో, ఉగ్రవాద చర్యలలో ,తీవ్రవాద చర్యలలో, పోలీసులపై గుంపు గుంపుగా గొడవలలో పాల్గొని, అరెస్టు అయ్యి, జైలుకి తరలించడం జరుగుతుంది.

హత్య చేయటం, మానభంగము చేయటము, ఋణములు, పన్నులు కట్టక పోవటం, సైబర్ క్రైమ్ , రియల్ ఎస్టేట్ మోసములు, వ్యాపారమును అడ్డం పెట్టుకొని మోసములు చేయటం ఈ నేరములు అన్నీ కూడా కుజ గ్రహము వలన చేస్తారు. ఈ విరి బంధన యోగము ఉన్న జాతకులు చట్టమునకు విరుద్ధముగా ఎంతో ధైర్యముగా పనులు చేస్తారు కానీ చివరకు పట్టు బడతారు. జైలు జీవితం అనుభవిస్తారు.

నాగ బంధన యోగము :

ఈ నాగ బంధన యోగము రాహువు వలన ఏర్పడుతుంది. ఈ నాగ బంధన యోగము ఉన్న వారు ఇతరులకు ప్రజల మధ్య అపరాధములు చేయటం, మత పరమైన వైరములు, జాతి ద్వేష వైరములు, మాఫియా, డ్రగ్స్, బాంబులు వేయటం, అక్రమ గనుల తవ్వకం, ఖాతాలలో లేకుండా మోసము చేసి అధిక మొత్తము డబ్బు సంపాదించడం ఇలాంటి చర్యలకు పాల్పడతారు. మామూలుగా ఈ నాగ బంధన యోగము ఉన్నవారు మొదట ఎంతో పేదరికమైన జీవితము గడిపి , ఆ తరువాత చట్టమును వ్యతిరేకిస్తూ ఎంతో పెద్ద స్థాయికి ఎదుగుతారు. కాకపోతే ఈ నాగ బంధన యోగము ఉన్నవారు జైలుకి వెళతారు లేదా ఎవరికి తెలియకుండా జీవితం మొత్తం అజ్ఞాతవాసము చేస్తూ అలానే మరణిస్తారు.

దీనికి సరైన ఉదాహరణ “దావూద్ ఇబ్రాహీం”. ఇతను తన జీవితములో సామాజిక జీవితం ఎన్నడూ అనుభవించలేదు. అతని జీవితం అంతా కూడా అజ్ఞాతవాసమే.

పూర్వజన్మలో ఇతరులపై చేతబడి, క్షుద్ర ప్రయోగము చేసిన వారు, ఇహ జన్మలో నాగ బంధన యోగముతో జన్మిస్తారు. గత జన్మలోని ఈ జాతకులు చేసిన ప్రయోగము , ఇహ జన్మలో వీరికే బెడిసి కొడుతుంది. 

అహి బంధన యోగము:

ఈ అహి బంధన యోగము కేతువు వలన ఏర్పడుతుంది. ఈ అహి బంధన యోగము ఉన్న జాతకులు ఊహించని విధముగా, కొత్త కొత్త విధానాలలో నేరములు చేస్తారు. స్వయంకృత అపరాధలకు వీరు నేరస్తులుగా మిగిలిపోతారు. కేతువుకు తల ఉండదు. అంటే ఈ అహి బంధన యోగము ఉన్నవారు బుర్రలేని పనులు అన్నీ చేసి చివరగా పట్టుబడతారు. కారణములు పిచ్చిగా ఉన్నప్పటికి, వీరు చేసే నేరములు మాత్రం క్రూరముగా ఉంటాయి.

ఈ విధంగా బంధన యోగము వలన ప్రారబ్ధ కరమల వలన వివిధ రకములుగా నేరములు చేసి జైలుకు వెళ్ళి శిక్షలు అనుభవిస్తారు. వీటికి పరిహారములు ఎన్నో విధములు ఉంటాయి. అవి తమ జన్మకుండలి ఆధారంగా తెలియజేయాలి. కావున ఇక్కడ పరిహారములు ఇవ్వటము లేదు.

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ,9846466430

Related Articles:

తంత్ర ప్రపంచం

యుగములు మారిపోతున్నాయి. కలియుగములో ధర్మము నశించి పోతుంది. ప్రపంచము మొత్తము అధర్మము, మోసము, కుతంత్రము  వ్యాప్తి చెందే కొద్దీ ప్రజలలో రాను రాను తేజస్సు, ఆయుర్దాయము, వీర్యములు, ఆరోగ్యములు అన్నీ కూడా క్షీణిస్తున్నాయి. సరైన జ్ఞానము లేక మనము అందరమూ ఐహిక సుఖలకు ప్రాకులాడుతున్నాము. అర్థ, కామ కోరికలపై ఆసక్తి పెరిగిపోతుంది. సులభముగా జరిగిపోయే తంత్ర విధానాల కోసం ప్రజలు ప్రాకులాడుతున్నారు. తంత్రముకు యంత్రము, మంత్రము కూడా కలిస్తేనే విజయవంతం అవుతుంది.

         తంత్రము , తాంత్రికము ఈ పదముకు అర్థము ఏదో చెడు చేయటం అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతమాత్రం నిజము కాదు. తాంత్రిక వాదము అనగానే ఇది ఏదో చెడు పని అంటూ ఉంటారు. ఎవరికైనా చెడు చేయుటకు చేసే తంత్రమును ‘కుతంత్రము’ అంటారు. భగవంతుడు మనకు అనీ ఇస్తాడు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మన మనస్సు, బుద్ధి,జ్ఞానమును బట్టి ఉంటుంది. ఉదాహరణకి కత్తిని తీసుకుందాము. కత్తిని ఒకరు వంటింటిలో ఉపయోగిస్తారు, ఇంకొకరు మనిషి ప్రాణాలను తీయుటకు ఉపయోగిస్తారు. దీనిని ఎలా ఉపయోగిస్తున్నాము అనేది మన అంతరాత్మకు వదిలేయాలి. అదే విధంగా తంత్ర వాదము కూడా మంచికి ఉపయోగిస్తే యోగము, చెడుకు ఉపయోగిస్తే కుతంత్రము.

         మానవ భౌతిక దేహము పంచభూతమయం. మానవులకు సంబంధించిన శాంతి, పుష్టి, తుష్టి, అర్థము, కామము, వశ్యము, మోహము, ఆకర్షణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన,మారణ, కోపము, హింస, ప్రేమ, వాత్సల్యము, దుఃఖము, పరితాపము, భయము, నిద్ర, రోగము, ఆరోగ్యము, మనస్సు, వాంఛ, కోరిక, ఉన్మాదము, వినోదము, ప్రతిభ, జయము, అపజయము ఇలా మానవ సంబంధమైన ఏవైనా కూడా తాంత్రికము చేయగలదు.     

తంత్రము అనగా సైన్స్ అని కూడా చెప్పవచ్చు. ఈ తాంత్రికములో ఆరు విధాలు అయిన ‘షట్కర్మలు’ ఎంతో ప్రాధాన్యమైనవి. అవి ఏమిటంటే 1. శాంతి తంత్రము 2. వశ్యము (లేదా) వశీకరణము తంత్రము 3. స్తంభన తంత్ర 4. ఉచ్చాటన తంత్ర 5. మారణ తంత్ర  6. విద్వేషణ తంత్ర. ఇందులో మోహన తంత్రము మరియు ఆకర్షణ తంత్రము ఈ రెండూ కూడా వశీకరణ తంత్రములోని భాగములు. ఈ తాంత్రిక విధానములు ఆచరించటానికి ఆ మంత్రములకు సిద్ధి పొంది ఉండాలి. ఆ తంత్ర విధానములో వాడే వస్తువులు అన్నీకూడా సేకరించుకోవాలి. ఈ తంత్ర విధానములు పాటించే వారు తంత్ర శాస్త్రాలలో ఎంతో అనుభవం గడించి ఉండాలి.  

         ప్రస్తుత కాలములో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలు పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్రం అనరు. “కుతంత్రం”  అంటారు. ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలను, వస్తువులను, ఉపయోగించి చేసే కార్యక్రమమే “తంత్రము”. తంత్రం అనేది ఒకశక్తి గల మంత్రముతో గూడిన సాధనం లాంటిది. ఆ సాధనమును శత్రు సంహారనకి ఉపయోగించవచ్చు. చెడు సంకల్పముతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు. కత్తితో ఫలములను, దర్బలను కోయవచ్చు,  జీవహింస చేయవచ్చు. అది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి నిర్దేశించబడుతుంది. మంచికి చేస్తే మంచి ఫలితమును, చెడుకు చేస్తే చెడు ఫలితమును పొందటం జరుగుతుంది. భారతములో శకుని తంత్రమును ఉపయోగించి తన ఇష్టకార్య సిద్ధి జరపుకోవటానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు. అందుకారణంగా అది చెడు అవటం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది కానీ కౌరవులు పాచికల రూపములో ప్రేతత్మలను ఉపయోగించి  ఈ చెడు బుద్ధితో చేసిన పాప తాంత్రిక కర్మ వలన  చివరకు సర్వ నాశనం అయిపోయారు. చేసే సంకల్పమును బట్టి ఈ తంత్ర విద్యల ద్వారా ఫలితం పొందటం జరుగుతుంది. ఆ శ్రీ కృష్ణుడు తాను సృష్టించిన మంచికి , ధర్మానికి చెడు ఎదురవుతున్న  సంధర్భములో ఆ చెడును నిర్మూలించగల శక్తి ఆ పరమాత్మకి ఉన్నప్పటికి, తంత్ర విద్యల ద్వారా మానవ రూపములో ఉన్న పాండవుల ద్వారా ప్రయోగింపజేసి  నిర్మూలించాడు. ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలనా మార్గాలను తంత్ర విద్యల రూపములో ఆ శ్రీమహా విష్ణువే వరంగా ప్రసాదించాడు.  మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే/చేయించే అభిచార కర్మలను, మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించాడు. ఎంతో శక్తివంతులు మరియు శూరులు, ధీరులు, ధర్మ పరాయణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది.

తంత్ర ప్రపంచం

         చరిత్ర లోకి వెళితే అను ఆయుధాలు తంత్ర విద్యలే కదా? మహాభారతములో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైయన నాగాస్త్రం,దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు.ఆగ్నేయాస్త్రం, కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది, పాశుపతాస్త్రం ఇది మహా శివుడికి సంబంధించినది. వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవునికి సంబంధించినది. వారుణాస్త్రం ఇది వరుణ దేవుడికి సంబంధించినది. ఇలా ఎన్నెన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదములోని భాగాలే. అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలే.  రాక్షస పీడను, శత్రు పీడను, నిర్మూలించడం కోసం రూపొందించబడినవే ద్వాపర యుగములో ,త్రేతా యుగములో కూడా రాక్షస పీడను నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు. ఇందులో మర్మం ఏమంటే పైశాచికతను నిర్మూలించడమే. కొంచెం శ్రద్ధగా గమనిస్తే ఇందులోని మర్మం మీకు అర్ధమౌతుంది.రాముడు చేసింది లోక కళ్యాణర్థం. రావణుడు చేసింది స్వధర్మం కోసం. స్వధర్మం అనగా పాప కర్మ అనుభవించడం.ఉదాహరణకు మీరు ఒక వస్త్ర దుకాణం నడుపుతున్నారు ,మీ వ్యాపారం బాగా సాగాలి అని మీరు కోరుకుంటారు. మీ వ్యాపార పరంగా  బాగా ధనార్జన చేయాలి ఆశిస్తారు. ఈ సంధర్భములో మీ వ్యాపార పోటీదారులు శత్రువులుగా మారి మీపై, మీ కుటుంబముపై, మీ వ్యాపారములపై కుతంత్రములు జరిపించి మీ సర్వ వినాశనానికి పూనుకుంటారు . అందుకోసం ఎన్నో మీ శత్రువులు ఎన్నో ఘాతుకాలకు పాల్పడతారు. ఆ స్వార్థపూరితమైన, పాప గ్రస్తమైన ఆలోచనలతో మిమ్ములను దెబ్బతీయుట కోసం, మీ పై కుతంత్రములు ప్రయోగించి నాశనం చేయుట కోసం కుతంత్ర విద్యలు చేసేవారిని సంప్రదించడం జరుగుతుంది. వారి ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి బాగుండాలని ఇతరుల వ్యాపారాలు సన్నగిల్లలని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో ఘాతుకాలకు పాల్పడుతూ ఉంటారు.ఈ సంధర్భములో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరికైతే పైశాచిక గ్రహ పీడ ఉంటుందో, వారు తప్పనిసరిగా ఈ కుతంత్ర విద్యల వలన ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది జాతకములోని అవయోగాలకు మూలం. ఎవరికైతే జాతకములో అవయోగాలు ఉంటాయో, వారు ఈ కుతంత్ర విద్యలకు గురి కావడం జరుగుతుంది.  అంటే ఒక విధంగా ఇది కూడా పూర్వజన్మ పాప కర్మ ఫలమే. ఆ పాపమును ప్రక్షాళన చేయడానికి విరుగుడుగా తాంత్రిక పరిహారములను  చేసుకోక తప్పదు.  మరి అలాంటి సందర్భాలలో తంత్ర విద్యలను ఉపయోగించి ఆ పైశాచిక ప్రభావాన్ని నిర్మూలించక తప్పదు. ఎదుటివారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు, శాపాలు అధికంగా ఉంటేనే అవి వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే చేసే ప్రతి క్రియ కూడా కర్మ ఫలమే. అది మంచి గాని,చెడు గాని. పైశాచిక గ్రహాల చెడు ప్రభావము నిర్మూలించడానికి  మాత్రమే  తంత్ర విద్యలు ఉపయోగపడతాయి.

                          మన నుదిటి వ్రాత ఆ బ్రహ్మ ఆజ్ఞనుసారంగా జరుగుతుంది. మనిషి ఎదుర్కొంటున్న బాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా మనకు ప్రసాదించాడు.  ఇందులో ఆంతర్యం ఏమిటంటే, వర్షం వచ్చినపుడు గొడుగును ఉపయోగించడం వలన ఆ వర్షం నుండి తడవకుండా ఉండగలుగుతాము. వర్షం పడటం బ్రహ్మ మనపై చూపించే నుదిటి వ్రాత . మండుటెండ కాచినపుడు పాదరక్షలు ధరించడం ఆ వేడి తాపము నుండి కాళ్ళు కాలకుండా రక్షించుకోవటం. వేడి తాపం అనేది సూర్య గ్రహ రూపములో బ్రహ్మ మనపై చూపించే నుదుటి వ్రాత. వర్షం నుండి , సూర్య తాపము నుండి కాపాడే గొడుగు, పాదరక్షలు గ్రహ దోష నివారణా మార్గాలు లాంటివి. విధిని తప్పించుకోవటం కష్టం కానీ తామస, రజో లక్షణాలు కలిగిన శత్రు పీడ నివారణా, అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు. ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంతవరకు ధర్మాచారణ లోక కళ్యాణర్థం ఉపయోగించవలెను. అలా కాకుండా కామ క్రోధ మధ మత్సర్యాలతో, అసూయతో, ఈర్ష్యా ద్వేషాలతో ఇతరులపై ధనం కోసం, కామం కోసం, అధికారం కోసం ఉపయోగిస్తే అప్పటికప్పుడు కౌరవులు పొందినట్టుగా తాత్కాలిక సౌఖ్యమును, కార్యసిద్ధిని పొంది చివరకు మనో భ్రాంతికి గురి అయ్యి మరణించడం జరుగుతుంది. అందువలన శక్తివంతమైన తాంత్రిక విద్యలను అభ్యసించడం వలన మనుషులు తాము ఎదుర్కొంటున్న శత్రువులు చేసే అభిచార కర్మలను నిర్మూలించుకోగలరు.  నష్ట స్త్రీ అనుబంధ ప్రాప్తి, నష్ట స్త్రీ సాంగత్య ప్రాప్తి, నష్ట ద్రవ్య ప్రాప్తి కార్యసిద్ధిని పొందగలరు. ఈ తాంత్రిక విద్యలను ఉపయోగించే విధానాలను, మంత్రాలను నాకు లభించిన ప్రాచీన తాళపత్రముల ద్వారా అందజేస్తాను. వీటిని అభ్యసించి మీ సమస్యలకి మీరే పరిష్కార మార్గములను చేసుకోవచ్చని ఆశిస్తున్నాను.  ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయిలో ఉన్నవ్యక్తికి ఆ స్థాయిలో శత్రుపీడ ఉంటుంది. అందరికీ ఆర్థిక వెసులుబాటు ఉండదు.  మీ యొక్క శత్రు సంహారం చేయగలిగే తంత్ర వేత్తలను ధనరూపములో తృప్తిపరచే ఆర్థిక శక్తి ఉండదు కనుక మీ యొక్క సంకల్పమే మీ ఆయుధం. ఈ తంత్ర మార్గాలను ఆర్థిక బలము, అంగ బలం లేనివారు కూడా అభ్యసించి ఉపయోగించి మేలును పొందగలరు.

                 జీవుడు తాను పుట్టిన దగ్గర్నుండి మరణించే వరకు తన యొక్క పూర్వజన్మ లోని చేసుకున్న పాపపుణ్యాల కర్మఫలాన్ని అనుభవించడానికి విధి రూపములో ఎన్నో ఎన్నెన్నో అనుభంధాలను, ఆనందాలను, ఐశ్వర్యాలను, ప్రేమానుబంధాలను, భాద్యతలను, సుఖాలను  అనుభవించడం జరుగుతుంది. పూర్వజన్మలో ఎవరితోనైతే శత్రుత్వము కలిగి ఉంటారో, ఈ జన్మలో వారికి బాంధవ్యాల రూపములో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. పూర్వజన్మలో తాము ఎదుర్కొన్న అనారోగ్య, ఆర్థిక,సామాజిక, కుటుంబ, బంధుత్వాల ఋణ శేషం ఇహ జన్మలో మానవుడు అనుభవిస్తున్నాడు. ఆ పూర్వజన్మ తాలూకు ఋణశేషం, శత్రు శేషం, ఆయుర్భావ శేషం, ఇహ జన్మలో గ్రహాల ద్వారా యోగా, అవయోగాల ద్వారా వాటిని అనుభవించి కర్మఫలాన్ని సంపూర్ణం చేయటం జరుగుతుంది. ఇది శాస్త్ర సమ్మతం. అయితే ఈ జన్మలో ఎదుర్కొంటున్న, ఎదుర్కొబోయే సమస్యలు, దోషాలు వేద జ్యోతిష్య శాస్త్రము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. కర్మఫలాన్ని అనుభవించడానికి మనం పుట్టినపుడు ఈ కర్మఫలములో ఉండే అతి భయంకరమైన మానసిక, శారీరక క్షోభకు గురి చేసే విధి వ్రాతను తప్పించుకోవటం ఎంతవరకు సాధ్యం? అని ప్రతి ఒక్కరకి సందేహం కలుగక మానదు. విధి అనేది తప్పక అనుభవించాల్సిందని దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పురాణాల ప్రకారంగా చూసినట్లైతే గంధర్వులు, యక్షులు, శాపాలకు గురి కావడం జరిగింది. శాపాలకు గురి కావడం అనేది విధి. శాపాలకు విమోచన, విరుగుడు చేసుకోవడం అనేది ఆత్మ సంకల్ప విధి. పూర్వజన్మ కర్మఫలం శరీర రూపములో ఆత్మ అనుభవించడం జరుగుతుంది. శరీరము రూపములో ఉన్న ఆత్మ పాపపుణ్యాలను అనుభవించడం వలన స్థూలశరీరమునకు మాత్రమే ఆ నొప్పి, ఆనందం తెలుస్తాయి. అంతేగానీ శాశ్వతమైన ఆత్మకు కాదు. ఆత్మ అనేది శరీరములో ఉండే సూక్ష్మ రూపములో ఉండే  ఆలోచనల రూపం. కర్మ ఫలం వలన గాని, మానసిక దౌర్బల్యం వలన గాని, సమస్యలను ఎదుర్కొంటున్న శరీరమునకు ఉపశమనం ఇచ్చే మార్గాలే అంతరాత్మ ద్వారా మనకు భగవంతుడు తెలియజేస్తాడు. ఆ భగవంతుడు ఇచ్చిన తాంత్రిక మార్గములే ఈ తంత్ర విద్యలు. కర్మఫలాన్ని అనుభవించడానికి మనపై భగవంతుడు ఏర్పరిచిన ఈ మాయా బంధాల సమస్యలను ఎదుర్కోవటానికి ఆ పరమాత్మే మార్గాలను చూపించాడు. మానవ రూపములో ఉన్న పాండవులను, వారి కర్మ ఫలమును అనుభవించేట్టుగా చేస్తూ మరొకపక్క అతి ఘోర కృత్యాలకు పాల్పడే వారి నుండి బయట పడేందుకు శత్రు నాశనం చేసేందుకు శ్రీ కృష్ణ పరమాత్మ సైతం తంత్ర విద్యాలలోని శస్త్ర. అస్త్రములను ఆ మానవ రూపములో ఉన్న పాండవుల చేతనే ప్రయోగింపజేసి శత్రు సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించాడు. మహాభారతములో శత్రువులను సంహరించడం కోసం శ్రీ కృష్ణుడు అర్జునుని చేత ప్రయోగింపబడ్డ శస్త్ర అస్త్రాలు తంత్రములే కదా!!! గ్రహాల రూపములో, గ్రహాల ద్వారా ప్రయోగింపబడ్డ అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం, దీనినే వశీకరణాస్త్రం అంటారు. ఈ వశీకరణ అస్త్రం శుక్రుడు, రాహు గ్రహముల సహాయముతో ప్రయోగిస్తారు. గ్రహముల ద్వారా మంత్రములను ప్రయోగించేవాటిని ఆస్త్రాలు అంటారు. తంత్రవిద్యలను అభ్యసించి ఉపయోగించి ప్రయోగించడాన్ని తంత్రం అంటారు.

   బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Related Articles:

మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు

మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు:

ముందుగా మాంగల్య దోషము ఎందుకు ఏర్పడుతుందో, మాంగల్య దోషం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

  • ఒక స్త్రీ జాతకములో అష్టమ భావమును అంటే 8వ స్థానమును మాంగల్య స్థానము అని పిలుస్తారు. ఈ అష్టమ భావములో చెడు గ్రహములు ఉంటే వారికి మాంగల్య దోషము ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారం గురువు స్త్రీలకు మాంగల్య భాగ్యమును ప్రసాదిస్తాడు. అందువలన ఒక స్త్రీ జాతకములో 8వ స్థానము, 8వ స్థానాధిపతి మరియు గురువు అశుభ స్థానములో ఉన్నట్లైతే ఆ స్త్రీకి మాంగల్య దోషము ఏర్పడుతుంది. మాంగల్య దోషము ఉన్న స్త్రీ యొక్క భర్త, భార్యతో తగాదాలు పది ఇల్లు వదలి పారిపోవటం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మాంగల్య దోషం ఉన్న స్త్రీలు భర్తతో విడిపోవటం గాని, లేదా భర్త అకస్మాత్తుగా చనిపోవటం గాని జరుగుతుంది.

  • ఒక స్త్రీ జాతకములోని 8వ స్థానములో కుజుడు ఉన్నట్లైతే మాంగల్య దోషం ఏర్పడుతుంది. దీనినే కుజ దోషం అని, అంగారక దోషం అని, చెవ్వై  దోషము అని పిలుస్తారు. మాంగల్య దోషం కేవలం గురువు, కుజుడు అను ఈ రెండు గ్రహముల వలనే గాక శని వలన కూడా ఏర్పడుతుంది. ఒక స్త్రీ జాతకములో 8వ స్థానములో శని ఉన్నట్లైతే మాంగల్య దోషం ఏర్పడుతుంది. జాతకములో 7వ స్థానానికి అధిపతి అయిన పాపగ్రహము (కుజుడు లేదా రవి లేదా శని లేదా రాహు లేదా కేతు) జాతక చక్రములోని 8వ స్థానములో అనగా మాంగల్య స్థానములో ఉన్నట్లైతే ఆ స్త్రీకి వైధవ్యము లభిస్తుంది. వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని చెప్పలేము కానీ దంపతుల మధ్య విబేధాలు వచ్చి విడిపోవటం జరుగుతుంది.

  • స్త్రీ జాతకములో అష్టమ భావములో అంటే 8వ స్థానములో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే , మాంగల్య దోషము ఉన్నట్టుగా గుర్తించాలి. దీనినే నాగ దోషం అని కూడా పిలుస్తారు. నాగదోషము ఉన్న స్త్రీలకు వివాహ సంబంధములు కుదరటములో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ ఏదైనా సంబంధము కుదిరినా కూడా సరైన వరుడు లభించటం దాదాపు అసాధ్యము అవుతుంది. అందువలన రాహువు లేదా కేథ్వు కారణంగా ఏర్పడే మాంగల్య దోషము స్త్రీలకు దాంపత్య జీవనమును దూరము చేస్తుంది. అంతేకాకుండా అత్తామామలతో విరోధాలు రావటం, భర్తకు తరచుగా రోగాలు రావటం జరుగుతుంది.

సంపూర్ణ జన్మ కుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

పరిహారములు:

ఈ మాంగల్య దోష నివారణ జరుగుటకు పరిహారములు జరిపించుకోవాలి. క్రింద ఇవ్వబడిన హోమములలో ఏదైనా ఒక ప్రాయశ్చిత్త హోమము జరిపించుకోవాలి. ఈ హోమములు జరిపించుకోవడం వలన పూర్వజన్మలో చేసిన పాపముల ప్రాయశ్చిత్తము కలిగి , మాంగల్య దోషము నివారణ కలుగుతుంది. ఆ హోమములు ఏమిటంటే

  1. అష్టమంగళ బలి
  2. వైవాహిక పీడా దోష నివారణా హోమము
  3. సువాసిని హోమము

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

Related Articles:

 

పితృదోషం- ప్రభావములు

పితృదోషం- ప్రభావములు:

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జన్మకుండలిలో కొన్ని గ్రహాల సన్నివేశాల వలన పితృదోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. ఆ గ్రహముల సన్నివేశములు ఏమిటో అన్న సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పితృదోషమునకు ముఖ్య కారణం జన్మకుండలిలో రవి గ్రహం మరియు శని గ్రహములకు మధ్య ఉన్న సంబంధముగా చెప్పవచ్చు. రవి , శని గ్రహములు పరివర్తన చెందితే (రవి రాశిలో శని మరియు శని రాశిలో రవి) ఉంటే దానిని పితృదోషముగా గుర్తించాలి. రవి, శని ఒకరిపై మరొకరి దృష్టి పడినప్పుడు లేదా రవి, శని కలసి ఒకే భావములో ఉన్నపుడు జాతకునికి పితృదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఇక్కడ రవి, శని సంబంధం లాగానే జాతకములో గురు, బుధ గ్రహముల వలన కలిగే సంబంధము కూడా పితృదోషమును సూచిస్తుంది. కాకపోతే గురు, బుధ వలన కలిగే పితృదోషం ఎక్కువ ప్రభావం చూపించదు.

         హైందవ పురాణాల ప్రకారం మన పితృదేవతలు (గతించిన తండ్రి, తాత, ముత్తాత……) జీవించి ఉన్నపుడు చేసిన దోషములు , పాపములు (దైవాపచారాలు) శాపంగా మారి తరువాతి తరం వారిని కూడా ప్రభావితం చేస్తాయి. దీనినే పితృదోషముగా చెప్పబడింది. కానీ, నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసిన పాప, పుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ లోకములో కొన్ని కోట్ల ఆత్మలకు శాంతి కలుగలేదు. ఆ ఆత్మలు అందరూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వారికి ఎవరో ఒకరికి పూర్వీకులు అయి ఉంటారు. పూర్వీకులు (తాత, తండ్రి, ముత్తాత…) గతించిన తరువాత అటు మోక్షము పొందక, ఇటు ఇంకొక జన్మనెత్తి పాప ప్రక్షాళన చేసుకోలేక (పునర్జన్మ లేక) ఊర్ద్వలోకములో ఉన్నవారిని “పితృదేవతలు” అంటారు. ఈ పితృదేవతలు మన DNA రూపములో గోత్రమును కొనసాగిస్తూ, కుటుంబములోని మగవారిలోని ‘Y’ Chromosomes రూపములో ఉంటారు.

         ఎప్పుడైతే ఒక వ్యక్తి పితృదోషము వలన బాధపడతాడో, ఆ వ్యక్తి తరువాతి తరమును (కొడుకు, మనుమడు, ….) చూచుటకు కష్ట తరం అవుతుంది. ఆ వ్యక్తికి సంతానం కలుగకపోవటం (లేదా) తన సంతానం తన నుండి విడిపోవటం (లేదా) వంశాభివృద్ధి కలిగే పుత్ర సంతానం కలుగకపోవటం లాంటివి పితృదోషం ఉన్నవారు అనుభవించవలసి ఉంటుంది.

పితృదోషం వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావములు :

  • పితృదోషం ఉన్న వ్యక్తి తన గోత్రమును కొనసాగించుటకు పుత్ర సంతానం కలుగకపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి అసలు సంతానం కలుగకపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి తరచూ Abortions (గర్భవిచ్ఛితులు) జరగటం.

  • సోదర సోదరీమనుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండా విద్యను లేదా ఉద్యోగమును మధ్యలోనే అర్థాంతరంగా ఆపివేయటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం వివాహము చేసుకునేందుకు అంగీకరించకపోవటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి వివాహం చేసుకునేందుకు సరైన వారు దొరక్కపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి శారీరక పరంగా గాని (లేదా) సామాజిక పరంగా గాని పెళ్లి ఆగిపోవటం లేదా సంతానం కలుగకపోవటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం అతి చిన్న వయస్సులోనే మద్యానికి లేదా Drugsకి అలవాటు పడటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానముకు వివాహము జరుగక మునుపే లేదా వివాహము జరిగి వారసులకు జన్మనివ్వక ముందే గతించడం జరుగుతుంది.

  • శారీరక లేదా మానసిక దౌర్బల్యం కలిగిన సంతానముకు జన్మనివ్వటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఇంటిలో తరచూ పాలు పొంగిపోవటం, కొత్త గోడలకు తొందరగా చీలికలు రావటం, నీటి పంపులు లీకేజి రావటం, కుళాయిలోని నీరు కారుతూనే ఉండటం తరచూ జరుగుతాయి.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క వ్యాపారములో అప్పులు, నష్టములు కలుగటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి ఉద్యోగములు మారుతూనే ఉండటం లేదా ఉద్యోగమే లేకపోవటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానము పెద్దవారిని గౌరవించక , అతి దురుసుతనముగా మాటలాడటం జరుగుతుంది.

ఈ విధంగా పితృదోషం ఉన్నవారికి సంఘటనలు జరుగుతాయి.

ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారముగా ఏ గ్రహాల సన్నివేశములను పితృదోషమును సూచిస్తాయో వివరిస్తున్నాను :

  1. శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా జన్మకుండలిలో పంచమ భావములో ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావములు జాతకునిపై చూపించబడతాయి.
  2. జన్మకుండలిలో 4వ భావములో కేతువు ఉంటే, ఆ జాతకుడు చంద్ర గ్రహం యొక్క పైశాచిక ప్రభావములు ఎదుర్కొంటాడు.
  3. బుధుడు (లేదా) కేతువు (లేదా) బుధ, కేతు కలసి లగ్నములో గాని, 8వ భావములో గాని ఉంటే, జాతకుడు కుజుడు యొక్క పైశాచిక ప్రభావముల ఫలితములు అనుభవిస్తాడు.
  4. జన్మకుండలిలో చంద్రుడు 3వ భావములో లేదా 6వ భావములో ఉంటే, జాతకుడు బుధుని యొక్క పైశాచిక ప్రభావములు ఎదుర్కొంటాడు.
  5. శుక్రుడు, బుధుడు లేదా రాహువు ఈ 3 గ్రహములలో ఏ రెండు గ్రహాలు గాని, లేదా మూడు  గ్రహాలు 2వ భావములో లేదా 5వ భావములో లేదా 9వ భావములో లేదా 12వ భావములో ఉంటే ఆ జాతకుడు గురువు వలన తీవ్రమైన వ్యతిరేక ఫలితములు అనుభవిస్తాడు.
  6. జాతకములో రవి లేదా చంద్రుడు లేదా రాహువు లేదా ఏ రెండు గ్రహాలు లేదా ఈ మూడు గ్రహములు కలసి 7వ భావములో ఉన్నట్లైతే జాతకుడు శుక్రుడు కలిగించే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తాడు.
  7. రవి, చంద్ర లేదా కుజుడు  లేదా వీటిలో ఏ రెడ్ను గ్రహములు లేదా ఈ మూడు గ్రహములు కలసి 10వ భావములో లేదా 11వ భావములో ఉంటే, ఆ జాతకుడు శని వలన విపరీతమైన చెడు ఫలితములు అనుభవిస్తాడు.
  8. రవి లేదా శుక్రుడు లేదా ఇద్దరు 12వ భావములో ఉంటే, జాతకుడు రాహువు యొక్క వ్యతిరేక ఫలితములను అనుభవిస్తాడు.
  9. చంద్రుడు లేదా కుజుడు 6వ భావములో ఉంటే, జాతకుడు కేతువు వలన చెడు ఫలితాలను అనుభవిస్తాడు.

ఈ విధంగా జన్మకుండలిలో 9వ స్థానానికి ఉన్న ప్రభావాలను బట్టి పితృదోష నిర్దారణ జరుపవచ్చు. ఎందుకంటే గత జన్మలో నుండి మిగిలిన కర్మఫల భారమును తెలియజేసేది ఈ 9వ భావమే. ఈ నవమ భావముకు శని లేదా రవి ప్రభావితం చేయటం వలన సమస్యలు వస్తాయి. ఎవరైతే చేతబడి, చిల్లంగి మొదలగు లాంటి కుతంత్ర శక్తులను (కుతంత్రముకు, తంత్రముకు చాలా తేడా ఉంది. గమనించగలరు) ఆచరించి, కేవలం స్వలాభం కోసం లేదా కక్ష్య సాధింపు కోసం లేదా ఇతరుల నుండి ధనం పొందటం కోసం ఈ కుతంత్ర శక్తులు ఇతరులపై ప్రయోగించే వారు, వారు చేసిన దుష్కృత్యాలు, పాపములు, వారు గతించిన తరువాత వీరి తరువాత తరం వారు (కొడుకు, మనుమడు, …..) కూడా అనుభవించవలసి వస్తుంది. వీరి వారసులు కూడా ఈ పితృదోష పరిణామాలు చవిచూస్తారు. తరువాత అదే గోత్రములో జన్మించి ముందు జన్మలో చేసిన పాపములకు ఫలితములు ఇహ జన్మలో అనుభవిస్తారు.

పితృదోషం ఉన్నవారు పాటించవలసిన నియమాలు:

  1. పని మీద బయటకు వెళ్ళినపుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి.
  2. గతించిన పితృలకు సాంప్రదాయ బద్దముగా షార్థ కర్మలు జరిపించాలి.
  3. గతములో చేసిన పాపకార్యములకు మనస్సులోనే ప్రాయశ్చిత్తము తెలుసుకోవాలి.
  4. శారీరక (లేదా) మానసిక దుర్బలం ఉన్నవారికి అనాధాలకు సంపాదనలో 5-10 శాతం దానము చేయాలి.
  5. కుటుంబముతో మరియు సోదర, సోదరీలతో మంచి అన్యోన్యత పాటించాలి.
  6. దైవానుగ్రహము మరియు పూర్వీకుల ఆశీర్వచనం కొరకు ఒక పేదింటి అమ్మాయి యొక్క వివాహ బాధ్యత తీసుకోవాలి.
  7. రావి చెట్టుకు నీరు పోస్తూ, అమావాస్య పౌర్ణమి రాత్రులలో ఉపవాసము పాటించాలి.

జాతకచక్ర పరిశీలనలో చూడవలసిన అత్యంత ప్రధాన అంశములు దోషములు, శాపములు, వాటిలో ప్రధానమైనది మరియు జాతకులకు అవయోగాలను, అరిష్టాలను కలుగచేసేదే పితృదోషం (పితృశాపం). ఈ శాపం దోషం ఏర్పడటానికి కారణం చనిపోయినవారి కర్మకాండలలో చేసే లోపములు, తప్పులు మరియు గతించిన వారు చేసిన దోషాలు, పాపాలు. అందుచేత కారణం ఏది ఏమైనప్పటికి పితృశాపం ఉన్నవారు “గోకర్ణ బలి, నారాయణ నాగబలి, బ్రాహ్మణ భోజనం” వంటి పరిహారములు ద్వారా ఈ దోషముల నుండి, శాపముల నుండి విముక్తి పొందవచ్చు. ఈ పితృదోషములు, పక్షి దోషములు (పక్షి శాపం) జాతకచక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా కేరళ కర్మ జ్యోతిష్య తాళపాత్ర గ్రంధముల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ పరిహారములు పూర్తి తాంత్రిక విధానములో వామాచారంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది ఒక్క కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని అర్చకులు రుత్విక్కులు మాత్రమే చేయగలరని ప్రతి ఒక్కరూ గమనించాలి.    

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com  

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

Related Articles:

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X