loading

Author: chakrapani

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

 

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

జన్మకుండలిలో శుక్రుడు వైవాహిక జీవితం, శృంగార జీవితం, జీవిత భాగస్వామితో ఉండే అనుబంధం, తమ సౌందర్యం, ప్రవర్తన, ఆడవారితో, కూతురితో, తల్లితో ఉన్న అనుబంధం, ఆహారపు అలవాట్లు, సుఖాలు, భోగాలు, జీవన శైలి, అందం, ఆకర్షణ మొదలైనవి అన్నిటిని శుక్ర గ్రహ స్థితి తెలియజేస్తుంది.

శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించుటకు దాదాపు ఒక నెల పడుతుంది. సంవత్సరానికి రెండు సార్లు శుక్రుడు వక్రగతిలో సంచరిస్తాడు. జన్మకుండలిలో శుక్రుడు వక్రగతిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో, పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఏమిటో ఈ లింకుని క్లిక్ చేసి తెలుసుకోగలరు.

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటి?

  • జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు సాధరణంగా సంపన్నులుగా ఉంటారు. సుఖవంతమైన, భోగవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. సినిమా యాక్టర్లు, కళాకారులు, మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్లు, తమ ప్రసంగాలతో లేదా తమ వ్రాతలతో సమాజాన్ని ప్రభావితం చేసే మేధావులు, విజయాన్ని వరించే రాజకీయనాయకులు అందరికీ శుక్రుడు అనుకూలంగా ఉంటాడు.
  • శుక్రుడు అనుకూలంగా ఉంటే, వారికి పదునైన మెదడు కలిగి ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ వేగంగా ఆలోచిస్తారు. సమయ స్పూర్తి, పరిపక్వత కలిగిన నిర్ణయాలు వీరికి ఎన్నో లాభాలను తెచ్చిపెడతాయి.
  • శుక్రుడు అనుకూలంగా ఉంటే జీవితంలో ఎంతో చిన్న స్థాయి నుండి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్నవారు, తమ హోదాని, తమ అభిరుచిని ఇతరులకు తెలియపరిచేందుకు ఎంతో ప్రాచీనమైన ఆభరణాల నుండి లేటెస్ట్ గా వచ్చే ఎలెక్ట్రానిక్స్ అన్నిటిని కూడా సేకరించే అలవాటు కలిగి ఉంటారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు పెళ్ళిళ్ళకు హాజరు కావడం, స్నేహితులు, బంధువులు పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పడం, ఏటా వచ్చే పండుగలు, వివాహ తేదీలు గుర్తు పెట్టుకోవడం వంటివి వీరికి ముఖ్యమైనవిగా అనిపించదు, గుర్తు కూడా పెట్టుకోరు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులను వీరి జీవిత భాగస్వామి గాని, పిల్లలు గాని అర్థం చేసుకోలేరు , అలా అని వీరిని కట్టుదిట్టం కూడా చేయలేరు. వీరికి ఎక్కువగా కొడుకులపై కంటే కూడా కూతుళ్ళ మీద ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు చేసే పనులు కూడా స్వార్థపూరితంగా తోస్తాయి. అదే విధంగా, కాలానికి తగ్గట్టు జీవించడం వీరు చాలా ఇష్టపడతారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులకు క్రమశిక్షణగా ఉండటం, సమయం వృధా చేయకుండా ప్రణాళికలు వేయడం అలవాటుగా మారుతుంది. ఇవే లక్షణాలను తమ తోటి ఉద్యోగుల నుండి, తమ కింద పనిచేసే వారి నుండి కూడా ఆశిస్తారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులు కేవలం మాట, భరోసా అయితే ఇస్తారు గాని దానిని ఆచరణలోకి తీసుకురారు.
  • ఆర్థిక నేరాలు, వైట్ కాలర్ నేరాలు, అంతర్జాతీయ మాఫీయా, స్టాక్ ఎక్క్ష్చెంజు పెట్టుబడులు వంటివి ఎంతో సులభంగా వ్యవహరిస్తారు.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న జాతకులలో కొందరు దొంగ బాబాలుగా, దొంగ గురువుగా చెలామణి అవుతారు. వారికి ఏ విధమైన ఆధ్యాత్మిక శక్తి లేనప్పటికి, వారి ప్రసంగాలతో లక్షల మందిని ఇట్టే ఆకట్టుకుంటారు. శుక్రుడు అనుకూలంగా ఉన్నవారు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటారు.
  • జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉంటే, వారికి వివాహేతర సంబంధాలు కలుగుటకు చాలా అవకాశాలు ఉంటాయి. ఈ వ్యవహారాలలోకి వెళ్ళకుండా, మెళుకువతో ఉండినట్లైతే మాత్రం, వీరి జీవితంలో, వృత్తి లేదా వ్యాపారాలలో అపారమైన విజయాన్ని చేజిక్కించుకుంటారు. ఎంతోమందిని మనం చూసి ఉంటాము, గొప్ప గొప్ప మేధావులు, ఉన్నత వ్యక్తులు, సంపన్నులు అందరూ కూడా ఎంతో విజయాన్ని సాధించినప్పటికి, కేవలం ఒక అక్రమ సంబంధం కారణంగానే వారి జీవితం తలక్రిందులు అవుతుంది. ఛేదించిన విజయాలు అన్నీ గంగలో పోసినట్టు అవుతుంది.
  • శుక్రుడు అనుకూలంగా ఉన్న వారికి నైతిక విలువలు, నిజాయితీ తక్కువగా ఉంటుంది. అయినప్పటికి, సంధర్భం వచ్చినపుడు మాత్రం మహిళలకు సహాయం చేసేందుకు ముందు ఉంటారు.

జన్మకుండలిలో శుక్రుడు ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?

  • జన్మకుండలిలో శుక్రుడు ప్రతికూలంగా ఉంటే, చిన్నతనంలో అనుభవించిన సుఖమైన, భోగవంతమైన జీవితం అంతా కూడా జాతకులకి ఒక వయస్సు రాగానే, తాతలు సంపాదించిన ఆస్థితో సహా మొత్తం కోల్పోతారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఏదైనా సృజనాత్మక రంగంలో గాని, క్రీడా రంగంలో గాని గొప్ప నైపుణ్యం ఉంటుంది. కానీ ఆ నైపుణ్యం వీరికి ఉపయోగపడదు.
  • వీరికి ఉన్న బద్ధకం, క్రమశిక్షణా లోపం, మత్తు పధార్థాలకు బానిసలవ్వడం వంటి లక్షణాల వలన జీవితంలో పైకి ఎదగలేరు.
  • వీరికి ఎంత అవసరమో, అంతకు మించి సంపాదించుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. అందువలన మధ్య వయస్సు వరకు లేదా వృద్ధాప్యం వరకు వీరికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంటారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ వీరు చేసే స్వకృత అపరాధాల వలన వీరికి తగిన గుర్తింపు లభించదు.
  • వీరికి ఉన్న నైపుణ్యాలను ఇతరులు ఉపయోగించుకొని, ఎన్నో లాభాలు దండుకుంటారు. ఉదాహరణకు, కొందరు రచయితలు రాసిన కథలు ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నా కూడా, వారి పేరు మాత్రం బయటకు రాదు.
  • వీరిలో కొందరు వీరికి ఉన్న నైపుణ్యాన్ని సమాజానికి విరుద్ధంగా వాడతారు. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేయడం, నకిలీ నోట్లు, నకిలీ బంగారం, నకిలీ రత్నాలు ఎవ్వరికీ దొరకాకుండా తయారుచేయడం వీరిలో కొందరికి ఉన్న ప్రత్యేకత.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న కొందరు జాతకులు అసభ్యకర మాటలు మాట్లాడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, సామాజిక గొడవల్లో ప్రతీదానిలో జోక్యం చేసుకొని దానికి పరిష్కారం కనుగొనే దైర్యం చేయకపోవడం, మందు, డ్రగ్స్ వంటి వాటికి బానిసలవడం వలన వీరు అవమానాలు ఎదుర్కొంటారు.
  • చేయాల్సిన పనిని తప్పించుకోవడానికి లేని పోనీ కారణాలు చెప్తారు. ఒకవేళ బలవంతం చేస్తే, ఇతరులను నిందించి అయినా సరే పనిని అయితే తప్పించుకుంటారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకుల యొక్క పిల్లలకు వీరికన్నా అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వీరి సహాయం లేకుండానే వీరి సంతానం ఉన్నత స్థాయికి వెళ్తారు.
  • శుక్రుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు స్పెక్యులేషన్లు, జూదం వంటి వాటిలో డబ్బు పెట్టి నష్టపోతారు.

ముఖ్య గమనిక:

జన్మకుండలిలో శుక్రుడు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, శుక్రుడు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) శుక్రుడు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.

జన్మకుండలిలో శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడా లేదా అనుకూలంగా ఉన్నాడా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి?

ఈ విషయాన్ని కేవలం జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించగలరు. ఈ ఫలితాలు అన్నీ అందరికీ వర్తించవు. జాతకుని యొక్క లగ్న భావమును, శుక్ర గ్రహ స్థితిని అనగా రాశిని, సంగమించిన గ్రహాలను ఆధారం చేసుకొని మాత్రమే ఫలితాలను నిర్ణయించాలి.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. https://brahmatantra.com/complete-horoscope-reading-telugu/

 

Related Articles: 

జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉంటే, ప్రతికూలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటే కలిగే ఫలితాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు జాతకుని యొక్క ధైర్యాన్ని, తోబుట్టువులను, స్థిరాస్థి అయిన భూమి, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారమును, గనులు, యుద్ధాలు, చట్ట పరమైన సమస్యలు, పోలీసు, మిలిటరీ, రక్తము, వెన్నుముక, క్రీడలు, బాడీ బిల్డింగ్ వంటివి అన్నిటిని జన్మకుండలిలో కుజుడు సూచిస్తాడు. కుజుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచరించుటకు 45 రోజుల సమయం పడుతుంది. జన్మకుండలిలో కుజుడు వక్రగతిలో ఉండినట్లైతే, జాతకుడు ఏ విధమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకునేందుకు ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉన్నాడా లేక ప్రతికూలంగా ఉన్నాడా అన్న అంశం ఇక్కడ తెలుసుకుందాము. జన్మకుండలిలో కుజ దోషం, అంగారక యోగం ఉన్నదా లేదా? ఉంటే, ఏ విధమైన ఫలితములను జాతకుడు ఎదుర్కొంటాడు అన్న అంశములను నేను ఇదివరకే వివరించి ఉన్నాను. వాటికి సంబంధించిన లింకులను ఇక్కడే పొందుపరిచాను.

జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలను జాతకుడు పొందుతాడు?

  • జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉండినట్లైతే, ఆ జాతకుడు తన బంధువులను, స్నేహితులను, ఆత్మీతులను అందరినీ కూడా తన స్వార్థం కొరకు వాడుకుంటారు. తిరిగి వారికి సహాయం కావాలన్నపుడు వీరు నిర్లక్ష్యం చేస్తారు.
  • కుజుడు అనుకూలంగా ఉన్న జాతకులకు క్రీడలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సాహసోపేతమైన క్రీడలపైన ఆసక్తి చూపుతారు.
  • జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉంటే జాతకుడు ఒక క్రీడాకారుడిగా లేదా కోచ్ గా లేదా ఇష్టమైన క్రీడల మీద బెట్టింగ్ వల్ల గాని సంపాదించుకొనుటకు అవకాశం ఉన్నది.
  • కుజుడు అనుకూలంగా ఉంటే, ఆ జాతకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలసి వస్తుంది. జాతకునికి కుజ మహాదశ లేదా అంతర్దశలలో లాటరీ లాంటి అద్భుతం వీరి జీవితంలో జరుగుతుంది.
  • కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికి, వీరికి ఉన్న దుడుకుతనం వలన, తరచూ కిందపడటం, గొడవలు పడటం, పోలీసు కేసులు అవ్వడం, ఆసుపత్రులకు వెళ్ళడం ఇవన్నీ వీరికి సాధారణ విషయంగా తోస్తుంది.
  • జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉంటే, ఆ జాతకులకు కుజ మాహాదశ లేదా అంతర్దశలలో రాజకీయ పదవి దక్కవచ్చు, నకిలీ షెల్ కంపెనీల ద్వారా అక్రమ సంపాదన కలుగవచ్చు, బ్యాంకులు, ఫైనాన్స్ కంపనీలు వంటివి అకస్మాత్తుగా మూసేసి ఎంతో మందిని మోసం కూడా చేయవచ్చు.
  • కుజుడు అనుకూలంగా ఉన్న జాతకులు నల్ల డబ్బును చాలా సులభంగా వ్యవహరిస్తారు.
  • కుజుడు అనుకూలంగా ఉన్న జాతకులను ఎవరైనా గేలి చేసినా, వెక్కిరించినా, వీరికి ఉన్న శక్తిని అంతా కూడబట్టుకొని కక్ష సాధించుటకు బలంగా పూనుకుంటారు.
  • చట్టపరమైన విషయాలలో ఈ జాతకులు మధ్యవర్తులుగా బాగా రాణిస్తారు. దీని వలన రెండు పార్టీల నుండి లక్షలు సంపాదించుకుంటారు.
  • వీరిలో కొంత మంది బ్లడ్ బ్యాంకులు నడపడం, రక్త దానం చేయడం చేస్తారు.

జన్మకుండలిలో కుజుడు ప్రతికూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు:

  • జన్మకుండలిలో కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులకు జీవిత భాగస్వామికి తెలియకుండా వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటారు.
  • కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ చిన్నతనంలో ఎన్నో సమస్యలకు గురి అవుతారు. స్నేహితులకు దూరమవ్వడం జరుగుతుంది. యవ్వన వయస్సులో కుటుంబానికి కూడా దూరం అవుతారు. కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్ని మొదలుపెడతారు.
  • కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ స్నేహితులకు, కుటుంబమునకు ఎంతో సహాయం చేస్తారు. ఈ జాతకులకు సహాయం కావాల్సినపుడు ఆ సహాయం పొందిన వారందరూ కూడా కృతజ్ఞతతో వీరికి తిరిగి సహాయం చేస్తారు.
  • జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు వీరి ఇంటి సమస్యలను చూసుకుంటారు. దాని వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు.
  • కొన్ని సంధర్భాలలో వీరిని ఇతరులు కేవలం డబ్బు కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు.
  • వ్యవసాయ రంగములలో బాగా రాణిస్తారు. లాయర్లుగా కూడా రాణిస్తారు.
  • కుజుడు ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకుల చుట్టూ పెద్ద కుటుంబమే ఉన్నా కూడా, వీరిలో ఒంటరితనం అలానే ఉంటుంది.
  • కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు అవతలి వ్యక్తుల యొక్క సత్తాను తక్కువ అంచనా వేసి, పూర్తిగా నమ్మి, తమ భాద్యతలను అన్నీ అప్పజెప్పి, చివరికి మోసపోతారు.
  • కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు సాధరణంగా స్త్రీల యొక్క ఆలోచన విధానమును ద్వేషించే వారు చాలా వరకు ఉంటారు. కానీ బయటకు తెలియజెప్పరు. స్త్రీల పై ఒక విధమైన చులకన భావం వీరిలో ఉంటుంది.
  • ఫోన్లలో లేదా మెసేజుల ద్వారా తీవ్రంగా గొడవపడతారు. కానీ ముఖా ముఖి వచ్చేసరికి, అక్కడ నుండి జారుకుంటారు.
  • అసభ్యకర క్లబ్బులు, బీచులు వంటి వాటిలో చాలావరకు కుజుడు ప్రతికూలంగా ఉన్నవారే ఉంటారు.

ముఖ్య గమనిక:

జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, కుజుడు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) కుజుడు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.

 

మీ జన్మకుండలిలో కుజుడు ప్రతికూలంగా ఉన్నాడా లేదా అనుకూలంగా ఉన్నాడా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి?

ఈ విషయాన్ని కేవలం జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించగలరు. ఈ ఫలితాలు అన్నీ అందరికీ వర్తించవు. జాతకుని యొక్క లగ్న భావమును, కుజ గ్రహ స్థితిని అనగా రాశిని, సంగమించిన గ్రహాలను ఆధారం చేసుకొని మాత్రమే ఫలితాలను నిర్ణయించాలి.

 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. https://brahmatantra.com/complete-horoscope-reading-telugu/

 

Related Articles: 

జన్మకుండలిలో శని అనుకూలంగా ఉన్నాడా? ప్రతికూలంగా ఉన్నాడా?

మీకు జన్మకుండలిలో శని అనుకూలంగా ఉన్నాడా? ప్రతికూలంగా ఉన్నాడా?

జన్మకుండలిలో శని అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. మానవులు గత జన్మ కర్మ ఫలితములను ఇహ జన్మలో అనుభవించుటకు శని అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. చెడు కర్మలు అయినా, మంచి కర్మలు అయినా, వాటి ఫలితములను జాతకుడు అనుభవించేలా చేయుటకు శని సహకరిస్తాడు. మానవులు చేసుకున్న కర్మల యొక్క ఫలితాల పై, ఉద్యోగులతో ఉన్న సత్సంబంధాల పై, పనిమనుషులపై, పెంపుడు జంతువులపై, ధీర్ఘకాలిక వ్యాధుల పై, పేరు ప్రతిష్టల పై, పనులలో జరిగే జాప్యాల పై, శని ఆధిపత్యం వహిస్తాడు. ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి శనికి రెండున్నర సంవత్సరముల సమయం పడుతుంది. ప్రతీ సంవత్సరం దాదాపు అయిదు నెలల పాటు వక్రగతిలో సంచరిస్తాడు. జన్మకుండలిలో శని వక్రగతిలో ఉండినట్లైతే, ఏ విధమైన ఫలితములు జాతకుడు ఎదుర్కొంటాడో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

              జన్మకుండలిలో శని అనుకూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి? జన్మకుండలిలో శని ప్రతికూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు జాతకుడు ఎదుర్కొంటాడు? ఈ అంశాలు ఇక్కడ మీకు వివరిస్తాను. సాధరణంగా, వృషభ, కన్య, తుల, మకర, కుంభ లగ్నములో జన్మించిన జాతకులకు శని అనుకూలంగా ఉంటాడని కూడా చెప్పబడింది. కానీ జన్మకుండలిలో శని యొక్క స్థానమును బట్టి కూడా వ్యక్తిగతంగా ఫలితములు మారవచ్చు. నిష్ణాతులైన జ్యోతిష్యుల ద్వారా ఈ ఫలితాల నిర్ణయం చేసుకోవాలి. జ్యోతిష్య భూషణ Dr. C.V.S.చక్రపాణి, Ph.D (Medical astrology) గారి చేత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 

జన్మకుండలిలో శని అనుకూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు:

  • జన్మకుండలిలో శని అనుకూలంగా ఉన్న జాతకులు జీవితంలో కేవలం కొన్ని అంశాల మీద మాత్రమే శ్రద్ద పెడతారు. ఆ అంశాలే వీరికి విజయాలు తెచ్చిపెట్టి, సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి.
  • శని అనుకూలంగా ఉన్న జాతకులలో చాలా వరకు మంచి పరిశోధకులుగానూ, నాయకులుగా, విప్లవకారులుగా ఉంటారు. సమాజం కోసం కుటుంబం గురించి, డబ్బు గురించి, తమ గురించి కూడా శ్రద్ద వహించరు.
  • జన్మకుండలిలో శని అనుకూలంగా ఉంటే, ఆ జాతకుల చుట్టూ ఉన్న వారందరూ కూడా జాతకుల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
  • ఈ జాతకులకు లంచం తీసుకోవడం ఇష్టం ఉండదు. అన్యాయాన్ని సహించలేరు. అవకాశ వాదులకు దూరంగా ఉంటారు. ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పని చేస్తేనే విజయం వరిస్తుంది అని నమ్ముతారు. దీని వలన ఈ జాతకులకు పొగరు ఎక్కువ అన్నట్టుగా ఇతరులు భావిస్తారు.
  • జీవిత భాగస్వామితో వీరికి ఉన్న అనుబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. కానీ తండ్రితో వీరికి సత్సంబంధాలు ఉండవు. లేదా కొందరికి తండ్రి చిన్న వయస్సులోనే గతించడం జరుగుతుంది.
  • శని అనుకూలంగా ఉన్న జాతకులు కులం, మతం అన్న భేదం లేకుండా ఇతరులను గౌరవిస్తారు. జంతువుల పట్ల, పక్షుల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటారు.
  • జన్మకుండలిలో శని అనుకూలంగా ఉండే జాతకులు ఏ రంగంలో అడుగు పెట్టినా సరే ఎంతో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. వీరి క్రమశిక్షణతో కూడిన జీవశైలిని, దయా హృదయమును గుర్తుంచి, ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలబడతారు.
  • శని అనుకూలంగా ఉన్న జాతకులు తమ స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఏ విధమైన కష్టాలలో ఉన్న సరే, వారిని ఆదుకోవడానికి వీరు ముందుంటారు.
  • జన్మకుండలిలో శని అనుకూలంగా ఉన్న జాతకులకు జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది. ఏ సంఘటన గురించి అడిగినా సరే, సమయం, స్థలంతో సహా ఇట్టే చెప్పేయగల జ్ఞాపక శక్తి వీరికి శనిభగవానుడు ప్రసాదిస్తాడు.

జన్మకుండలిలో శని ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు:

  • జన్మకుండలిలో శని ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకులకు ఆరోగ్యం తరచూ సమస్యలు రావడం, జీవిత కాలం పాటు మోకాళ్ళ నొప్పులు ఉండటం జరుగుతుంది.
  • ఎన్నో సంవత్సరాల పాటు వీరిలో ఉన్న నైపుణ్యాలు తొక్కి పెట్టి ఉంటాయి. మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో వీరి నైపుణ్యాలు బయట పడి ప్రసిద్ధికెక్కుతారు.
  • శని ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ కూడా చాలా వారకు వీరిని వాడుకోవడానికే చూస్తారు గాని వీరికి మాత్రం తిరిగి సహాయం చేయరు.
  • రియల్ ఎస్టేటు వ్యాపారాలలో తీవ్ర నష్టాలు చూస్తారు. ఈ జాతకులు ఒక్కసారి భూమి అమ్మివేశారంటే, ఆ భూమి యొక్క విలువ అధిక రేట్లు పెరుగుతుంది.
  • జన్మకుండలిలో శని ప్రతికూలంగా ఉన్న జాతకులలో కొందరికి ఎక్కువ మంది ప్రజలను తమ వైపుకు ఆకర్షించుకునే ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరికి అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. ఏ విధమైన పరిస్థితులకు అయినా సరే, దానికి తగ్గ సలహాలు ఇచ్చు సామర్థ్యం వీరికి ఉంటుంది. ముఖ్యంగా, చాలా కష్టమైన సమయాల్లో ఎంతో ఆత్మవిశ్వాసమును వ్యవహరిస్తూ, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు.
  • జన్మకుండలిలో శని ప్రతికూలంగా ఉన్న జాతకులు అందరితో కలసి ఏదైనా పనిలో విజయాన్ని సాధించినప్పటికి, వీరికి రావాల్సిన వాటా గాని, గుర్తింపు గాని వీరికి లభించదు.
  • శని ప్రతికూలంగా ఉన్న జాతకుల చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కూడా వీరి పై ద్వేషంతోనూ, పగతోనూ ఉన్న వారై ఉంటారు.
  • శని ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకులను క్రిందకు నెట్టివేయుటకు ఎవరో ఒకరు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
  • జన్మకుండలిలో శని ప్రతికూలంగా ఉంటే, తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉండవు. కానీ వీరికి అందరినీ క్షమించి, కలుపుకొని పోయే మంచి హృదయము, గుణము ఉంటుంది. అందరినీ క్షమించినప్పటికి, కొంతమంది శతృవులను మాత్రం ఇట్టే గుర్తుంచుకొని, వారిని దెబ్బగొట్టడానికి ఎన్నో సంవత్సరాల పాటు, సరైన సమయం కోసం ఎదురు చూస్తారు.
  • ఈ జాతకులు తాము పగలు కంటే రాత్రి పూట ఎక్కువ కష్టపడి పని చేస్తారు. ఎంత కష్టపడి పని చేసినా సరే, జీవిత భాగస్వామి గాని, పిల్లలు గాని తమ ప్రేమను అర్థం చేసుకోలేరు.
  • శని ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ జీవితంలో చాలా సమయం అనవసరమైన సమస్యల పైన, ఇతరుల అసూయ క్రానంగా, వృత్తి లేదా ఆఫీసులో ఒత్తిడి వలన, సంబంధంలేని సమస్యల వలన చాలా సమయం, శక్తి వృధా అవుతుంది.
  • ఈ జాతకులు ఎన్ని కష్టాలు ఎదుర్కున్నప్పటికి, జీవితంలో రెండవ భాగంలో గొప్ప విజయాన్ని, ఆర్థిక అభివృద్ధిని, నైపుణ్యానికి తగ్గ గుర్తింపుని సాధిస్తారు.

జన్మకుండలిలో 12వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, జాతకుడు అనవసర ఖర్చులు, నష్టాలు, కోర్టు విబేధాలు ఎదుర్కొంటాడు. వివాహానికి సంబంధించిన అన్నీ విషయాలలో సమస్యలు ఎదుర్కొంటాడు.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. 

Related articles: 

 

 

శని చంద్ర విష యోగం- ప్రభావాలు

శని చంద్ర విష యోగం

శని చంద్ర విష యోగం అంటే ఏమిటి?

శని చంద్ర విష యోగమును పలు విధాలుగా జ్యోతిష్యులు వివరిస్తారు. దీనినే విష యోగముగా, చంద్ర శని విష యోగముగా చెప్పబడుతుంది. జన్మకుండలిలో శని మరియు చంద్రుడు కలసి ఒకే రాశిలో సంగమించినపుడు ఈ యోగము ఏర్పడుతుంది.

               జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రుడు మనస్సును, భావోద్వేగాలను, మానసిక ప్రశాంతతను, మానసిక ధైర్యాన్ని సూచిస్తాడు. శని భాద్యతలను, జాప్యాలను, ఇబ్బందులు, అనుభవాల ద్వారా నేర్పే గుణ పాఠాలను, ఆంక్షలను, క్రమ శిక్షణను సూచిస్తాడు.  ఈ శని మరియు చంద్ర గ్రహాలు ఒకే రాశిలో సంగమించినపుడు, జాతకుడు ఆలోచించే విధానం,  తన భావాలను వ్యక్తపరచే విధానము, అలాగే జీవితంలోని కొన్ని విషయాలను ఎదుర్కొనే విధానాలు ప్రభావితం అవుతాయి. ఎందుకనగా శని మరియు చంద్ర గ్రహాలు రెండు విభిన్నమైన స్వభావాలు గల గ్రహాలు. శని, చంద్రుడు, ఈ రెండు గ్రహాలకు పరస్పర విరుద్ధమైన లక్షణాలు కలిగి ఉన్న గ్రహాలుగా చెప్పవచ్చు.

               సంస్కృతంలో విష అనగా విషం అని, యోగం అనగా గ్రహ స్థితి అని అర్థం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని సూచించే ఆంక్షలు, కఠినత్వం, ఇబ్బందులు వలన చంద్రుడు సూచించే మనస్సు, భావోద్వేగాల పై ప్రభావం చూపుతుంది. ఇక్కడ విష యోగం అనగా విరుద్ధమైన యోగంగా చెప్పబడుతుంది గాని దీని అర్థం నిజమైన విషం అని కాదు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఈ గ్రహస్థితి ఉన్న జాతకులకు తీవ్రమైన ఆందోళనలు, అసంతృప్తి, మనశ్శాంతిని కాపాడుకునేందుకు కష్టాలు, భావోద్వేగాల పై నియత్రణ తప్పిపోవడం వంటివి జాతకుడు ఎదుర్కొంటాడు. జన్మకుండలిలో ఇతర గ్రహాల అనుకూలతను బట్టి, ఈ యోగం ఉన్న జాతకులకు సహనం, పరిపక్వత, పట్టుదల, బాధ్యత కలిగి ఉంటారు.

శని చంద్ర విష యోగం

ముఖ్య గమనిక:

జన్మకుండలిలో శని చంద్రులు సంగమించి విష యోగం ఏర్పడినంత మాత్రానా, ఆ జాతకుడు పూర్తిగా దురదృష్టవంతుడిగా భావించకూడదు. జన్మకుండలిలో ఇతర గ్రహ బలములను బట్టి, ఆ గ్రహముల మధ్య ఉన్న డిగ్రీల దూరమును బట్టి, ఇతర గ్రహముల దృష్టులను బట్టి, ఫలితములను నిష్ణాతుడైన జ్యోతిష్యులు పరిశీలించి, వాటి ఫలితాలను వివరిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని చంద్ర విష యోగము ఒక సవాలుగా ఎందుకు చెప్పబడింది?

ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనికి మరియు చంద్రుడికి పరస్పరంగా విరుద్ధమైన లక్షణాలు కలిగి ఉంటాయి.  చంద్రుడు మనః కారకుడు. సంతోషం గాని, బాధ గాని, కుటుంబ సౌఖ్యం గాని, భావోద్వేగాలను గాని, మనశ్శాంతిని గాని ఈ చంద్రుడు కారణం అవుతున్నాడు. ఇక శని క్రమశిక్షణకు, ఆంక్షలకు, జాప్యములకు, బాధ్యతలకు, కష్టపడి పని చేసే తత్వముకు కారణం అవుతాడు. ఈ ఇద్దరు ఒకే రాశిలో సంగమించినపుడు, ఆ జాతకునికి ఒకవైపు తన మనసుకు నచ్చినట్టుగా ఉండాలని కోరిక ఉంటుంది, మరోవైపు భాద్యతలను నేరవేర్చాల్సిన పరిస్థితికి మధ్య ఒక విధమైన మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది.  

మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను.

ఒక వ్యక్తి తన ఆర్థిక మరియు వృత్తిపరమైన స్థిరత్వము కొరకు తీవ్రంగా కష్టపడి సాధిస్తాడు అనుకుందాం. కానీ ఆ సాధించిన విజయలపై ఆ వ్యక్తికి మానసిక సంతృప్తి అనేది రాదు. మరొక వ్యక్తి తన కుటుంబం పట్ల భాద్యతను ఎంతో శ్రద్ధగా నిర్వహించినప్పటికి, తన మనసులో ఉన్న ప్రేమను గాని, వ్యక్తిగత భావాలను గాని సులభంగా బయటకి చెప్పుకోలేడు. ఈ గ్రహస్థితి వలన జాతకుని యొక్క ఇంటిలో లేదా వృత్తి లేదా ఆఫీసులో పదే పదే సమస్యలు రావడం, అసంతృప్తి ఏర్పడటం, పురోగతిలో జాప్యం రావడం, ఛేదించిన విజయం కంటే ఇంకా ఏదో ఉందన్న అసంతృప్తి భావన కలిగి ఉంటారు.        

విష యోగం వలన కలిగే ప్రభావాలు ఏమిటి?

  1. మానసిక మరియు భావోద్వేగాల పై విష యోగం యొక్క ప్రభావాలు

ఈ యోగం ఉన్న జాతకులకు సమస్యల మీద అవసరం కంటే మరీ లోతుగా ఆలోచించే గుణం కలిగి ఉంటారు. భాద్యతలు, భవిష్యత్తు, సమాజం గురించి అనవసరంగా కంగారు పడుతూ ఉంటారు. తమ భావోద్వేగాలను బయటకు చెప్పుకునేందుకు తీవ్రమైన కష్టంగా మారుతుంది. ఇతరులను నమ్మాలంటే చాలా సమయం తీసుకుంటారు. నలుగురి మధ్యలో ఉండటం కంటే కూడా ఒంటరిగా గడిపేందుకు, నిశ్శబ్ధమైన ప్రదేశాలలో గడపడం ఎంతగానో ఇష్టపడతారు. అనుభవం ద్వారా మాత్రమే ఈ జాతకులకు సహనం మరియు మానసిక పరిపక్వత అనేది ఏర్పడుతుంది. ఈ లక్షణాలు అన్నీ అందరిలో ఒకేలా కనిపించవు. ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఈ యోగం ప్రభావం చూపుతుంది.

  1. బంధాల పై విష యోగం యొక్క ప్రభావాలు

ఈ విష యోగం ఉన్న జాతకులకు ఇతరులను నమ్మాలి అంటే ఎంతో సమయం తీఉస్కుంతారు. ఈ జాతకుల యొక్క మనస్సులో ఉన్న తీవ్రమైన అపనమ్మకం కారణంగా వీరి మనసులో ప్రేమను బయటకు వ్యక్తపరచలేరు. ఈ జాతకులు మాటలతో కంటే కూడా తమ చేతలతో, తమ భాద్యతలను నిర్వహించే విధానం ద్వారా ప్రేమను చూపిస్తారు. అయినప్పటికి, ఈ జాతకులు తమ భావాలను వ్యక్తపరచలేకపోవడం వలన తమ ప్రియతమలకు మరియు ఈ జాతకులకు మధ్య అపార్థాలు తలెత్తుతాయి. అంతమాత్రానా, ఈ విషయోగం ఉన్న జాతకులు అందరికీ ప్రేమానుబంధంలో సంతోషం అనేది ఉండదు అని కాదు అర్థం. జాతకులు తమ జీవిత భాగస్వామితో ఏర్పడే కలహాలకు, విరహ వెధనకు ఈ యోగం ఒక కారణం అయితే మాత్రం అవుతుంది. ఇది జన్మకుండలిలోని ఇతర గ్రహాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. నిష్ణాతుడైన జ్యోతిష్యుడు మాత్రమే ఈ విశ్లేషణ చేయగలరు.

  1. తల్లితో ఉన్న బంధం పై విష యోగ ప్రభావం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు తల్లిని, కుటుంబాన్ని, భావోద్వేగాలను సూచిస్తాడు.  అందువలన శని చంద్ర విష యోగం కారణంగా తల్లితో ఉన్న సత్సంబంధాల పై కూడా ప్రభావం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మరియు జన్మకుండలిలోని ఇతర గ్రహాల ప్రభావాల వలన జాతకునికి తల్లి పట్ల తీవ్రమైన బాధ్యతలు ఏర్పడతాయి. కుటుంబంలో ఈ జాతకులు తీవ్రమైన సహనాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అనుకోని కారణాల వలన తల్లితో మానసికంగా దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.

  1. చంద్ర శని విష యోగం వలన వృత్తి పై ఏర్పడే ప్రభావాలు

క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చేసే తత్వం, దీర్ఘకాలిక బాధ్యతలు ఇవన్నీటికి శని కారణం అవుతాడు. శని చంద్రునితో సంగమించినపుడు, వృత్తిపరమైన జీవితం పై తీవ్రమైన ప్రభావాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో నెరవేరే లక్ష్యాల పై సహనం చూపించడం వీరికి ఇబ్బందిగా మారుతుంది. కష్టమైన భాద్యతలు అన్నీ కూడా ఈ జాతకులపై పడతాయి. ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. జన్మకుండలిలో దశమ స్థానం యొక్క బలం ఆధారంగా కూడా ఈ ఫలితాలు పెరుగవచ్చు లేదా తగ్గవచ్చు. అది వ్యక్తిగత జన్మకుండలి ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది.

  1. నిద్ర మరియు మనశ్శాంతి పై చంద్ర శని విష యోగం యొక్క ప్రభావాలు

చంద్ర శని సంగమ ఉన్న జాతకులకు విశ్రాంతి తీసుకునే సమయం దొరికినా కూడా, విశ్రాంతి తీసుకునేందుకు వీరి మనస్సు సహకరించదు. అలసట, తీవ్రమైన ఆలోచన, విశ్రాంతి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. జాతకులు తమ పని మరియు బాధ్యతలు పూర్తి కాకుండా విశ్రాంతి తీసుకోవడం కష్టం అవుతుంది. మనసులో ఉన్న కంగారు, ఆందోళన కూడా దీనికి కారణం అవుతుంది.

ద్వాదశ భావాలలో శని చంద్ర విష యోగం ఏర్పడినపుడు కలిగే ప్రభావాలు ఏమిటి?

  1. లగ్నంలో చంద్ర శని యోగం :

మనస్సును, శరీరమును సూచించే లగ్నములో విష యోగం ఏర్పడినపుడు, జాతకులకు తన జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తం మరియు నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడును. ఏ విషయంలోనైనా ఖచ్చితమిన నిర్ణయాలు తీసుకునేందుకు వీరిలో ఆత్మ విశ్వాసం లోపిస్తుంది.

  1. ద్వితీయంలో చంద్ర శని విష యోగం:

జన్మకుండలిలో 2వ భావంలో విష యోగం ఏర్పడితే, ఆ జాతకులు తీవ్రమైన ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికాభివృద్ధి ఉండదు. అంతేకాకుండా, కుటుంబ సభ్యులతో విభేధాలు మరియు అపార్థాలు ఏర్పడతాయి. మత్తు పధార్థాలకు బానిసలు అవుతారు.

  1. తృతీయ భావంలో చంద్ర శని విష యోగం:

జన్మకుండలిలో 3వ భావంలో శని చంద్ర సంగమం జరిగితే, ఆ జాతకులకు ధైర్యం తక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో గొడవలు, సమస్యలు ఏర్పడతాయి.

  1. చతుర్థ భావంలో చంద్ర శని విష యోగం:

జన్మకుండలిలో 4వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, ఇంట్లో సుఖాలు, మనశ్శాంతి, సంతోషం కరువవుతాయి. తల్లితో అభిప్రాయ భేధాలు ఏర్పడతాయి.

  1. పంచమ భావంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో 5వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, సంతానం, విద్యా, ప్రేమ వ్యవహారాల విషయంలో సమస్యలు ఏర్పడును.

  1. షష్ట్య భావంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో 6వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, ఆ జాతకుడు తీర్చడం కష్టమయ్యే అప్పులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగానికి, వృత్తికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. గుప్త శత్రువుల వలన ఇబ్బందులకు గురి అవుతారు.

  1. సప్తమ భావంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో 7వ భావంలో శని చంద్ర విష యోగం ఏర్పడినపుడు జాతకులకు వివాహం ఆలస్యం అవ్వవచ్చు. మంచి స్నేహితులు వీరికి దక్కడం కష్టం అవుతుంది. వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి వలన సమస్యలు, నష్టాలు ఏర్పడును.

  1. అష్టమ భావంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో అష్టమ స్థానంలో విష యోగం ఏర్పడటం వలన తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. యాక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్లు వలన వీరి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.

  1. నవమ భావంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో 9వ స్థానంలో విష యోగం ఏర్పడటం వలన జాతకుడు ఊహించినంత అదృష్టం వరించదు. దైవానుగ్రహం తక్కువగా ఉంటుంది.

  1. దశమ భావంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో విష యోగం 10వ స్థానంలో ఏర్పడినపుడు, జాతకుడు తన వ్యాపారం, వృత్తి విషయంలో సమస్యలు ఏర్పడతాయి. జాతకుని యొక్క కష్టానికి, సామర్థ్యానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం పొందలేరు. తండ్రితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి.

  1. ఏకాదశ స్థానంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో 11వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, జాతకుడు తన సీనియర్లు నుండి గాని, స్నేహితుల నుండి గాని, పెద్దల నుండి గాని సహాయ సహకారాలు అందుకోలేరు. కష్టానికి తగ్గ లాభాలు, సంపాదన వీరికి దక్కదు.

  1. ద్వాదశ స్థానంలో శని చంద్ర విష యోగం:

జన్మకుండలిలో 12వ భావంలో విష యోగం ఏర్పడినపుడు, జాతకుడు అనవసర ఖర్చులు, నష్టాలు, కోర్టు విబేధాలు ఎదుర్కొంటాడు. వివాహానికి సంబంధించిన అన్నీ విషయాలలో సమస్యలు ఎదుర్కొంటాడు.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. 

Related Articles: 

అరిష్ట పిశాచ గ్రస్త యోగము

అరిష్ట పిశాచగ్రస్త యోగం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఒక వ్యక్తి యొక్క మనస్సు, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక తత్త్వం వంటి లక్షణాలు అన్నీ కూడా జాతకుని యొక్క లగ్నం, చంద్రుని స్థానం, రాహువు యొక్క స్థానం, శని యొక్క స్థానం, పంచమ మరియు నవమ భావాలు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. అరిష్ట పిశాచ గ్రస్త యోగము జాతకంలో ఏర్పడటం వలన జాతకుడు మానసికంగా ఎ విధమైన కష్టాలను ఎదుర్కొంటాడో, ఆత్మలు లేదా అతీంద్రియ, అవాంచనీయ శక్తుల బారీన ఏ విధంగా పడతాడో ఇక్కడ వివరించబోతున్నాము.

  • జన్మకుండలిలోని లగ్నం జాతకుని యొక్క శరీరమును, మనస్సును, ఆలోచనలను సూచిస్తుంది.
  • జన్మకుండలిలోని చంద్రుని స్థానం జాతకుని యొక్క మానసిక స్థిరత్వమును, భావోద్వేగములను, వాస్తవికతను జాతకుడు అర్థం చేసుకునే విధానమును సూచిస్తాడు.
  • జన్మకుండలిలోని రాహువు భ్రమలను, మోసములను, ప్రతికూల శక్తులను, మానవాతీత శక్తుల గందరగోలములను సూచిస్తాడు.
  • జన్మకుండలిలోని శని జతకునిలో ఉన్న భయమును, వైరాగ్యమును, కర్మ బంధములను సూచిస్తాడు.
  • లగ్న, పంచమ, నవమ భావములు అయిన త్రికోణ స్థానాలు, జాతకునిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, మేధస్సు, గత జన్మ కర్మలను తెలియజేస్తాయి.

జన్మకుండలిలో లగ్న, పంచమ, నవమ భావములలో పాప గ్రహముల దృష్టి లేదా స్థితి ఉన్నా, శని, రాహు, చంద్ర గ్రహములకు పాప స్థాన ప్రభావములు లేదా పాప గ్రహ సంగమములు జరిగినపుడు జాతకుడు మానసికంగా గందరగోళములు ఎదుర్కోవడం, అభిచార కర్మలకు, చేతబడులకు గురి కావడం, దుష్ట శక్తుల బారీన పడటం లాంటి సంఘటనలు జరుగును.

అరిష్ట పిశాచ గ్రస్త యోగం ఏ విధంగా ఏర్పడుతుంది?

  • లగ్నంలో అనగా తనుభావంలో చంద్ర రాహువులు కలసి ఉండటం వలన గ్రహణ యోగం మరియు అరిష్ట పిశాచ గ్రస్త యోగం ఏర్పడుతుంది. దీని వలన ఈ మానసిక స్పష్టతలో గందరగోళం ఏర్పడుతుంది. అందుకారణంగా భ్రమలు, భ్రాంతులు, భయాలు ఏర్పడతాయి.
  1. చంద్రుడు మనః కారకుడు. అనగా మనస్సు, భావోద్వేగాలు, మానసిక స్థిరత్వం అన్నిటిని కూడా చంద్రుడు పాలిస్తాడు.
  2. రాహువు వాస్తవికతను మర్చిపోయేలా చేసి, భ్రమలను కలిగింపజేస్తాడు. దీని వలన మానసిక అస్తిరత్వం, భయం, భ్రమలు కలుగుతాయి.
  3. జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదా నీచ స్థానంలో ఉన్నా, ఈ యోగం యొక్క ఫలితాలు తీవ్రంగా ఉంటాయి.
  • కుజ, శని, కేతు గ్రహాలు లగ్న, పంచమ నవమ భావంలో స్థితి చెందడం వలన ప్రతికూల శక్తులు, ప్రతికూల కర్మ ప్రభావాలు వీరి పై అధికంగా ఉంటాయి.
  1. జన్మకుండలిలోని లగ్నం అనగా, జాతకుని యొక్క వ్యక్తిత్వాన్ని, జాతకుని యొక్క చైతన్యాన్ని సూచిస్తుంది. లగ్నములో పాప గ్రహములు చోటు చేసుకుంటే, జాతకునికి మానసిక గందరగోళం, సంధిగ్ధం, దుష్టశక్తుల వలన కలిగే ఇబ్బందులు ఏర్పడతాయి.
  2. జన్మకుండలిలోని పంచమ భావం గత జన్మ కర్మలను, మేధస్సును సూచిస్తుంది. పంచమ భావంలో పాప గ్రహములు చోటు చేసుకుంటే, ఆ జాతకునికి గత జన్మ ఋణములు అధికంగా ఉంటాయి. ఈ పాప గ్రహముల వలన దుష్ట శక్తుల చేత పీడింపబడే అనుభవాలు ఎదురవుతాయి.
  3. జన్మకుండలిలోని నవమ భావం ఆధ్యాత్మిక రక్షణ, దైవానుగ్రహమును సూచిస్తుంది. నవమభావము బలహీనముగా ఉన్నా, పాప గ్రహములు ఉండినా, ప్రతికూల శక్తులను ఎదుర్కొనే, ప్రతికూల శక్తుల నుండి కాపాడే కవచం బలహీనపడుతుంది.
  • లగ్నంలో శని ఉండినా లేదా లగ్నము పై శని దృష్టి పడినా, ఈ అరిష్ట పిశాచ గ్రస్త యోగము మరింత బలంగా మారుతుంది. దీని వలన దీర్ఘకాలిక ఒత్తిడి, భయం, బాధలు కలుగుతాయి.
  1. జన్మకుండలిలో శని జాతకుని యొక్క గత జన్మ కర్మను, జాతకునిలో ఉన్న భయాలను, జాతకుడు ఎదుర్కొనే బాధలు అన్నిటిని సూచిస్తాడు.
  2. జన్మకుండలిలో శని లగ్నములో ఉన్నా లేదా లగ్నము పై శని యొక్క దృష్టి ఉండినా,అరిష్ట పిశాచ గ్రస్త యోగము బలంగా మారుతుంది. దీని వలన జాతకునిలో భయాలు, కుంగుబాటు, తీవ్రమైన మనోవేదన, నిరాశ, దుష్ట శక్తుల వలన కలిగే ఇబ్బందులు పెరుగుతాయి.

అరిష్ట పిశాచ గ్రస్త యోగము యొక్క ప్రభావము తీవ్రతకు కారణమయ్యే గ్రహస్థితులు ఏమిటి?

  1. జన్మకుండలిలో కేతువు 8 లేదా 12వ స్థానములో ఉన్నట్లయితే, జాతకునికి అంతుపట్టని దుష్టశక్తుల అనుభవాలు చోటు చేసుకుంటాయి. దైవానుగ్రహము పొందుటకు తీవ్రమైన ఆటంకములు కలుగుతాయి.
  2. జన్మకుండలిలో కుజుడు పంచమ భావంలో ఉండినట్లైతే, జాతకుడు తీవ్ర కోపంగా, హింసాత్మకంగా మారతాడు. తనకు తాను హాని చేసుకునే లక్షణాలు ఏర్పడతాయి.
  3. జన్మకుండలిలో బుధుడు నీచాపడినా, శత్రు గ్రహ సంగమంతో కూడి ఉన్నా, జాతకునికి వాస్తవానికి మరియు భ్రమకు మధ్య ఉన్న తేడాను కనిపెట్టేందుకు కష్టతరం అవుతుంది. సరైన మార్గంలో ఆలోచించడం కూడా వీరికి కష్టంగా మారుతుంది.

అరిష్ట పిశాచ గ్రస్త యోగము యొక్క ప్రభావము తీవ్రతను తగ్గించే గ్రహస్థితులు ఏమిటి?

  • జన్మకుండలిలో గురు గ్రహం బలంగా ఉంటే, ఈ అరిష్ట పిశాచ గ్రస్త యోగం యొక్క ప్రతికూల ప్రభావాలను గురు గ్రహము జాతకునికి రక్షణ కల్పిస్తుంది.
  • శుక్రుడు మరియు బుధ గ్రహములు జన్మకుండలిలో శుభ స్థానాలలో ఉన్నట్లయితే, ఈ యోగం యొక్క ప్రభావం తగ్గుతుంది.

అరిష్ట పిశాచ గ్రస్త యోగము వలన జాతకుడు ఎదుర్కునే ప్రభావాలు, వాటి ఫలితాలు ఏమిటి?

  • అరిష్ట పిశాచ గ్రస్త యోగము ఉన్న జాతకుడు భయటకు చెప్పలేని, అర్థం గాని భయము, ఆందోళన, ఆలోచనలు వారి మనస్సులో వెంటాడుతూ ఉంటుంది.
  • నిద్రపోవు సమయంలో తరచూ ఆటంకములు రావడం, పీడకలలు వచ్చి మనస్సును ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.
  • పాడుబడ్డ భవనాలు, ఆధ్యాత్మిక శక్తులు, దుష్ట శక్తుల పై నమ్మకాల యొక్క ప్రభావం వీరి పై అధికంగా ఉంటాయి.
  • అనుకోనుండా జాతకుని యొక్క మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి. మనోవేదన, భయాలు, వైద్య విద్యకు అంతుపట్టని మానసిక దౌర్బల్యాలు కలుగుతాయి.
  • జాతకునికి అరిష్ట పిశాచ గ్రస్త యోగం వలన కలిగే విచిత్రమైన వైఖరి, భయంతో కూడిన స్పందన వంటి చేష్టలతో తమ ప్రియతమలకు, తమ జీవిత భాగస్వాములకు దూరం అవుతారు.
  • జన్మకుండలిలో ఈ యోగం ఉన్న జాతకులు దైవానుగ్రహము దక్కకపోతే, తీవ్రమైన దుష్ట శక్తుల ప్రభావాలకు లోనవుతారు.
  • ఈ యోగం ఉన్న జాతకులకు ఉన్న ప్రవర్తన కారణంగా సమాజానికి, వాస్తవానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు.
  • ఈ యోగం ఉన్న జాతకులు ఏ కారణం లేకుండా కలిగే భయం, ఆందోళన వలన, వీరికి ఏదో అయ్యింది అని, ప్రతికూల శక్తులు వీరిని అదుపు చేస్తున్నాయని భయపడతారు.

అరిష్ట పిశాచ గ్రస్త యోగం యొక్క ప్రభావములు తగ్గించుకునేందుకు చేసుకోదలచిన పరిహారాలు:

  • మానసిక స్థిరత్వం కొరకు చంద్ర బలం పెంచుకోవాలి. జ్యోతిష్యుని సలహాతో ముత్యం ధరించాలి. ఓం చంద్రాయా నమః అన్న మంత్రమును ప్రతీ రోజు జపించాలి.
  • దుష్ట శక్తుల నుండి రక్షణ కొరకు ప్రతీ రోజు హనుమాన్ చాలీసా మరియు మహా మృత్యుంజయ మంత్రమును జపించాలి.
  • జన్మకుండలిలో ఏ గ్రహముల వలన అరిష్ట పిశాచ గ్రస్త యోగము ఏర్పదినదో, నిష్ణాతులైన జ్యోతిష్యుల ద్వారా జన్మకుండలి పరిశీలన చేయించుకొని, ఆ గ్రహముల ప్రీతి కొరకు పరిహారములు చేయించుకోవాలి.

 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. 

Related Articles: 

గృహ నాశ యోగం అంటే ఏమిటి? కారణాలు మరియు పరిహారాలు | Brahma Tantra

గృహ నాశ యోగం అంటే ఏమిటి? కారణాలు మరియు పరిహారాలు

               మానవ జీవితంలో జరిగే ప్రతీ ఘట్టం కూడా మన తలవ్రాత ప్రకారమే జరుగుతుంది. ఈ ఘట్టాలనే, మన జన్మకుండలి ద్వారా నిష్ణాతులైన జ్యోతిష్యులు ముందుగానే గ్రహించి, మనకు సూచనలు చేస్తారు. మానవులకు అతి ముఖ్యమైన వాటిలో స్థిరమైన నివాసం అనేది ఒకటి. చాలా మందికి స్వగృహం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. స్వగృహం అనేది కొందరికి జీవితాశయంగా కూడా ఉంటుంది. జన్మకుండలిలో స్వగృహ యోగం ఉందా లేక గృహ నాశ యోగం ఉందా అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో వివరంగా ఇవ్వబడింది. స్వగృహం లేదా స్థిరాస్తుల విషయంలో ప్రతికూల సమస్యలు ఎందుకు ఎదుర్కొంటారు అన్న విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను.

               గృహ నాశ యోగం అనగా గృహము, భూమి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో నష్టపోయే గ్రహస్థితి ఏర్పడటమే ఈ అవయోగానికి కారణం. జన్మకుండలిలో ఈ గృహ నాశ యోగం ఉన్నవారు స్థిరాస్తులను సంపాదించుకునేనుకు తీవ్రంగా కష్టపడవలసి ఉంటుంది. వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులను, సంపదను కోల్పోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన చిక్కులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా భూ సంబంధిత మోసాలు కారణంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వలన అనుకోని నష్టాలను చవిచూడాల్సి వచ్చును.

జన్మకుండలిలో చతుర్థ స్థానం అనగా గృహం, భూమి, స్థిరాస్తి, తల్లి వంటి వాటిని సూచిస్తుంది. 12వ స్థానాన్ని దగ్ధ స్థానంగా జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. దీనినే వ్యయ స్థానం అని కూడా అంటారు. జన్మకుండలిలో చతుర్థ స్థానాధిపతికి మరియు ద్వాదశ స్థానాధిపతికి మధ్య వ్యతిరేక సంబంధం ఏర్పడితే, ఆ జాతకుడు గృహం విషయంలో, గృహ మార్పుల విషయంలో, రియల్ ఎస్టేట్ సంబంధిత ఆర్థిక అస్థిరత్వం ఏర్పడును. దీనినే గృహ నాశ యోగంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

గృహనాశ యోగం యొక్క గ్రహ స్థితులు ఏమనగా:

జన్మకుండలిలో చతుర్థాధిపతి ద్వాదశ స్థానంలో అనగా దగ్ధ, వ్యయ స్థానంలో ఉంటూ, శని, కుజ, రాహు లేదా కేతు వంటి నైసర్గిక పాప గ్రహముల దృష్టి ద్వాదశ స్థానం పై పడినపుడు, ఆ జాతకులకు గృహ నాశ యోగం ఉన్నట్టు గుర్తించాలి.

               చతుర్థ స్థానం స్థిరాస్తులను సూచిస్తే, ద్వాదశ స్థానం నష్టాలను, ఖర్చులను, విభేదాలను సూచిస్తుంది. ఈ చతుర్ఠాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నపుడు, ఆ జాతకులు స్థిరాస్తులను కోల్పోతారు, స్వగృహం కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇంటి పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అయితే, ఈ చతుర్థస్థానాధిపతి మీద శని, కుజ, రాహు లేదా కేతు యొక్క దృష్టి కూడా జోడైతే, ఇక ఈ గృహ నాశ యోగమునకు తీవ్ర బలము పుంజుకొని, సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి.

గృహ నాశ యోగం వలన కలిగే ప్రభావాలు:

  • జాతకునికి వంశపారపర్యంగా వచ్చిన ఆస్తి అయినా లేదా జాతకుడు సొంతంగా కొనుక్కొని ఉన్నా, గృహనాశ యోగం అనేది జాతకుని జన్మకుండలిలో ఉండినట్లైతే, ఆర్థిక ఇబ్బందుల వల్ల గాని, స్థల విబేధాల వలన గాని లేదా అనుకోని సంఘటనల వలన గాని ఆ ఆస్తులను నష్టపోతారు.
  • ఈ సంగమంలో రాహు లేదా కేతు గ్రహం కూడా తోడైతే, మోసపూరిత చర్య వలన గాని, దుర్మార్గపు చర్య వలన గాని ఆస్తి నష్టం వాటిల్లుతుంది.
  • గృహనాశ యోగం ఉన్న జాతకులు రియల్ ఎస్టేటులో పెట్టుబడులు పెట్టి, తీవ్ర నష్టాలకు గురి అవుతారు.
  • ఆస్తిని కొనుగోలు చేసేందుకు అప్పులు చేసి, ఆ అప్పును తిరిగి చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని వలన ఆర్థిక అస్థిరత్వం ఏర్పడుతుంది.
  • గృహ నాశ యోగం ఉన్న జాతకులు అద్దె ఇంట్లో ఉన్నప్పటికి, తరచూ ఇల్లు మారుతూ ఉండాల్సి వస్తుంది. స్వంత ఇంటి కల అనేది ఈ దోషం గల జాతకులకు కలగానే మిగిలిపోతుంది.
  • ఈ దోష గ్రహ స్థితులకు శని జోక్యం ఉన్నట్లైతే, ఆస్తి కొనుగోలు అనేది ఆలస్యం అవ్వడం జరుగుతుంది. జీవితంలో చాలా ఆలస్యంగా సొంత ఇంటి కల నెరవేరవచ్చు.
  •  గృహ నాశ యోగం యొక్క గ్రహస్థితికి కుజ, శని, రాహు గ్రహాల దృష్టి కూడా తోడైనపుడు, ఆ జాతకుడు వంశపారపర్యంగా వస్తున్న ఆస్తి విషయంలో తగాదాలు ఎదుర్కొంటారు, ఆస్తి పరమైన కోర్టు కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, భూమి లేదా స్వగృహం గురించి కుటుంబ సభ్యులతో విభేదాలు ఎదుర్కొంటారు.
  • గృహ నాశ యోగమునకు ఇతర గ్రహములు అనుకూలించినట్లైతే, జాతకుడు ఉపాధి కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు విదేశాలకు వెళ్ళు అవకాశాలు కలుగును. కానీ అక్కడ స్థిరమైన నివాసం ఏర్పడటం అనేది సవాలుగా మారుతుంది.

గృహ నాశ యోగం వలన ఎదుర్కొనే సవాళ్ళు:

  • గృహ నాశ యోగం జాతకంలో తీవ్రంగా ఉన్నపుడు, గృహముల విషయంలో తీవ్ర అస్థిరత్వం ఏర్పడుతుంది, ఒక్కో సంధర్భంలో ఉండటానికి ఇల్లు కూడా కరువవుతుంది.
  • వంశపారపర్యంగా వస్తున్న ఆస్తి తగాదాలు ధీర్ఘ కాలం కోర్టు చుట్టూ తిరిగేలా చేస్తుంది.
  • రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో అంచనాలు తప్పిపోయి, దాని వలన తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు.

పరిహారములు:

  • గృహ నాశ యోగం అనేది ఏ గ్రహం వలన కలిగినదో, జ్యోతిష పరిశీలన ద్వారా తెలుసుకొని, దానికి తగిన విధంగా పరిహారములు చేసుకోవాలి.
  • గృహ నాశ యోగం యొక్క ప్రభావం తగ్గుటకు, తరచూ అద్దె ఇల్లులు మారు స్థితి మారేందుకు, జాతకులు తమ గృహంలో శ్రీ మహా యంత్రమును ప్రతిష్టాపన చేసుకొని, పూజించాలి.
  • జన్మకుండలిలో చతుర్థ స్థానాధిపతికి సంబంధించిన పరిహారములు జరిపించుకోవాలి. (ఈ పరిహారాలు వ్యక్తిగత జాతకం ఆధారంగా మారుతూ ఉంటాయి)
  • చంద్ర, శని గ్రహముల ధ్యానం చేయాలి.

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Related Articles: 

 

సంపూర్ణ జాతక పరిశీలన – Complete Personal Horoscope Reading

సంపూర్ణ జాతక పరిశీలన – Complete Personal Horoscope Reading

ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదా? జీవితంలో ఏదో ఒక తెలియని వెలితి, రేపటి గురించిన అభద్రతాభావం మిమ్మల్ని నిరంతరం వెంటాడుతున్నాయా?

వృత్తి లేదా వ్యాపారంలో ఎదుగుదల లేక నిరాశ చెందుతున్నారా, వ్యాపారంలో ఊహించని నష్టాలు కుంగదీస్తున్నాయా? వివాహ ప్రయత్నాలలో పదే పదే ఎదురవుతున్న ఆటంకాలు, కుటుంబంలో మనశ్శాంతిని దూరం చేస్తున్న విభేదాలు, లేక ఎంత సంపాదించినా చేతిలో నిలవని ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా?

జీవితంలో సమస్యలు ఎవరికైనా ఎదురుకావచ్చు, కానీ సరైన మార్గదర్శకత్వం లేనప్పుడే మనిషి దిక్కుతోచని స్థితికి చేరుకుంటాడు. జన్మకుండలి అనేది కేవలం ఒక కాగితం కాదు. మనిషి భూమిపై అడుగుపెట్టిన క్షణంలో గ్రహాల స్థితిగతులు రాసిన మీ జీవిత రోడ్‌మ్యాప్. అందులోని గ్రహ దోషాలు, శాపాలు, లేదా అనుకూలించని దశ,అంతర్దశలు మనల్ని ముందుకు సాగనీయకుండా అడ్డుపడతాయి.

మన మనసులోని ఆందోళనలను, భయాలను దూరం చేసి, మన అంతర్గత శక్తులను మరియు భవిష్యత్ అవకాశాలను స్పష్టంగా తెలుసుకోవడానికి నిపుణులైన గురువర్యుల మార్గదర్శకత్వం ఎంతో అవసరం. కేవలం ఫలితాలు చెప్పడమే కాకుండా, మీ గ్రహస్థితులకు అనుగుణంగా సరైన పరిహారాలు, ఆచరణాత్మక సూచనలతో జన్మకుండలిని క్షుణ్ణంగా విశ్లేషించుకోవాలి. మన సమస్యలకు అసలైన మూలకారణాన్ని తెలుసుకుంటే, జీవితంలో ఆత్మవిశ్వాసంతో కూడిన నూతన అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు.

మీ జీవితంలోని భవిష్యత్ ఘట్టాలు, కెరీర్, వివాహం, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు మరియు గ్రహ దోషాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుభవజ్ఞులైన గురువర్యులు C.V.S. చక్రపాణి, జ్యోతిష్య భూషణ గారి చేత మీ జన్మకుండలిని క్షుణ్ణంగా విశ్లేషించుకోండి.

🌟 జాతక పరిశీలనలో తెలియజేయబోయే విషయాలు:

  • యోగాలు & అవయోగాలు: మీ జాతకంలో ఉన్న శుభ యోగాలు మరియు అవయోగాల గురించి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది.
  • ముఖ్యమైన ఘట్టాలు: భవిష్యత్తులో జరగబోయే కీలక సంఘటనలు మరియు జీవిత కాల విశేషాలు, శుభాశుభాలు రెండు విధాలుగా వివరించడం జరుగుతుంది.
  • గ్రహ దోష పరిహారాలు: దోషముల నివారణ కొరకు, కేరళ తంత్ర విధానంలో సరైన మరియు శక్తివంతమైన పరిహారాలను తెలియజేయడం జరుగుతుంది.
  • ప్రత్యేక సందేహాల విశ్లేషణ: జాతకులు అడిగిన ప్రత్యేక ప్రశ్నలు లేదా సందేహాలను లోతుగా పరిశీలించి సమాధానాలు చెప్పడం జరుగుతుంది.

📌జన్మకుండలి పరిశీలనకు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి?

క్రింద ఇవ్వబడిన ఫారమ్‌ను పూరించాలి లేదా PhonePe / GPay / Paytm ద్వారా ₹2000/- నెంబరు 9951779444 (Malayala Bhagavathi Astro Services) కు జమ చేసి ఇదే నెంబరు వాట్సప్ కు మీ వివరాలను పంపగలరు.

* మాకు అందజేయాల్సిన వివరాలు:

మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు పుట్టిన స్థలం వివరాలను, ప్రత్యేకంగా అడగాలనుకున్న సందేహాలను, ఈ వివరాలను మా వాట్సాప్ నెంబరుకు పంపవలెను.

పరిశీలన సమయం: బుక్ చేసుకున్న తేదీ నుండి 4 నుండి 7 రోజుల వ్యవధిలో గురువర్యులు మీ జాతకచక్రాన్ని పరిశీలించి నివేదికను జాతకులకు అందజేస్తారు.

సందేహాల నివృత్తి: జాతక పరిశీలన వివరాలు పొందిన తర్వాత మాత్రమే, ఫోన్ ద్వారా జాతకులు తమ సందేహాలను నేరుగా గురువు గారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చును.

🔍 గమనిక: జాతక విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో ముందస్తు అవగాహన కోసం జాతక విశ్లేషణ – Sample Horoscope reading పరిశీలించవచ్చు. ప్రత్యేకంగా ఏదైనా నిర్దిష్ట అంశంపై వివరణ కావాలంటే, కింద ఇవ్వబడిన ఫారమ్ చివరి బాక్సులో లేదా 9951779444 వాట్సాప్ నెంబరు ద్వారా తెలియజేయగలరు.

    Name

    Your email

    Mobile number:


    Date of Birth:

    Time of birth:

    Place of birth (పుట్టిన స్థలం):

    Special Requests:

     

    కావడి ప్రశ్న | కేరళ ప్రశ్న జ్యోతిష్యం | Kavadi Prashna

    కావడి ప్రశ్న – కేరళ ప్రశ్న జ్యోతిష్య విధానం

     

    కావడి ప్రశ్న – కేరళ ప్రశ్న జ్యోతిష్య విధానం ద్వారా మీ సందేహాలకు సమాధానాలు

     

    కేరళ కావడి ప్రశ్న (Kavadi Prashna) అనేది ప్రాచీన ప్రశ్న జ్యోతిష్య శాస్త్రంలోని ఒక ప్రత్యేకమైన విధానం. కేరళలో ఈ విధానాన్ని అనాదిగా ఆచరిస్తున్నారు. సాధారణ జాతక పరిశీలనకు భిన్నంగా, ఇందులో వ్యక్తి జన్మ తేదీ, పుట్టిన సమయం, జన్మస్థలం తెలియకపోయినా, వ్యక్తి యొక్క మనసులో ఉన్న ఒక నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చును.

    కావడి ప్రశ్న అంటే ఏమిటి? ఏ సంధర్భాలలో ఈ కావడి ప్రశ్న మార్గదర్శకంగా మారుతుంది?

    కావడి అంటే గవ్వలు. సముద్రం నుండి లభించే ప్రత్యేకమైన గవ్వలను ఉపయోగించి ప్రశ్న శాస్త్రంలో ఆరూఢాన్ని నిర్ణయించి, ప్రశ్నకు సంబంధించిన ఫలితాలను పరిశీలిస్తారు.

    ప్రశ్న అడిగే వ్యక్తి మనసులో ఉన్న సందేహాన్ని ఆధారంగా చేసుకుని, కావడి ప్రశ్న విధానంలో సంబంధిత సూచనలు మరియు గ్రహ ప్రభావాలను పరిశీలించి ఫలితాలను వివరించడం జరుగుతుంది.ఈ విధానం ముఖ్యంగా కేరళ ప్రశ్న జ్యోతిష్య సంప్రదాయంతో ముడిపడి ఉంటుంది.

    జీవితంలో కొన్ని సంధర్భాలలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనే సంధిగ్ధములో పడతాము. మరికొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం సరైనదా, కాదా అనే సంకోచంలో పడతాము. మరి కొన్నిసార్లు రెండు దారులు ఉన్నపుడు, ఏ దారి ఎంచుకుంటే మన భవిష్యత్తు మెరుగు అవుతుంది అనే గందరగోళము కూడా ఏర్పడుతుంది. ఈ విధమైన సంధర్భాలలో భగవంతుని పై భక్తి, విశ్వాసం ఉంచి, ఈ కావడి ప్రశ్న ద్వారా ప్రశ్నను వేసినపుడు, సాక్షాత్తు ఆ భగవంతుడే నంబూద్రీల ద్వారా మీకు సరైన సందేశం ఇచ్చి, మార్గదర్శిగా ఉంటారు.

    జన్మ వివరాలు లేకపోయినా కావడి ప్రశ్న అడగవచ్చా?

    అవును. కావడి ప్రశ్న యొక్క ప్రత్యేకతల్లో ఇది ఒకటి.  పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం తెలియకపోయినా,వ్యక్తి యొక్క మనసులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నను అడిగి ప్రశ్న జ్యోతిష్య విధానంలో సమాధానం తెలుసుకోవచ్చు. అయితే ప్రశ్న స్పష్టంగా మరియు నిజమైన ఆసక్తితో, నమ్మకంతో అడగడం చాలా ముఖ్యం.

    కేరళ కావడిప్రశ్నలో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు?

    మీ జీవితంలో ప్రస్తుతం ఎదురవుతున్న అనేక ముఖ్యమైన విషయాల గురించి కావడి ప్రశ్న ద్వారా లో అడిగిన ప్రశ్నలకు నూటికి నూరు శాతం ఖచ్చితమైన సమాధానాలు లభిస్తాయని నా అనుభవంలో ఋజువైంది.

    వివాహానికి సంబంధించిన ప్రశ్నలు

    • వివాహం ఎప్పుడు జరుగుతుంది?
    • వివాహంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది?
    • వివాహ జీవితం ఎలా ఉంటుంది?
    • దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలకు కారణం ఏమిటి?

    సంతానానికి సంబంధించిన ప్రశ్నలు

    • సంతాన యోగం ఉందా?
    • మాకు సంతానానికి ఆటంకాలు ఎందుకు కలుగుతున్నాయి?
    • సంతాన విషయంలో మాకు ఎందుకు సమస్యలు కలుగుతున్నాయి?

    ఆరోగ్యం మరియు అనారోగ్య ప్రశ్నలు

    • ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రశ్నలు అడుగవచ్చు.
    • దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యల గురించి అడుగవచ్చు.
    • అనారోగ్యానికి సంబంధించిన జ్యోతిష్య సూచనలు కోరవచ్చు.

    ఉద్యోగం మరియు వృత్తి ప్రశ్నలు

    • ఉద్యోగం లభిస్తుందా?
    • ఉద్యోగ మార్పు అనుకూలమా?
    • వృత్తిలో ఎదురవుతున్న ఆటంకాలు ఎందుకు జరుగుతున్నాయి?
    • వ్యాపారం లేదా వృత్తి అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు అడుగవచ్చు.

    ఋణం మరియు ఆర్థిక ప్రశ్నలు

    • అప్పుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి?
    • ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి?
    • ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనబడతాయా?

    విదేశీ ప్రయాణం

    • విదేశాలకు వెళ్లే అవకాశం ఉందా?
    • విదేశంలో ఉద్యోగం చేస్తూ, స్థిరపడగలమా?
    • విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలు అడుగవచ్చు.

    కుటుంబం మరియు దాంపత్య సంబంధిత ప్రశ్నలు

    భార్య, భర్త, కుటుంబ సభ్యులు లేదా బాగా కావల్సిన వారి యొక్క ముఖ్యమైన విషయాల గురించి ప్రశ్నలు వేయవచ్చు.

    కేరళ కావడి ప్రశ్న ఎలా జరుగుతుంది?

    కావడి ప్రశ్నలో ముందుగా ప్రశ్న అడిగే వ్యక్తి తనకు తెలుసుకోవాలనుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఆ ప్రశ్నను ఆధారంగా చేసుకుని సంప్రదాయ ప్రశ్న జ్యోతిష్య విధానంలో కావడి ప్రశ్నమును ఉపయోగించి ఆరూఢాన్ని నిర్ణయించి, సంబంధిత ఫలితాలను పరిశీలిస్తారు.

    అనుభవం కలిగిన ప్రశ్న జ్యోతిష్య నిపుణులు అయిన కేరళ నంబూద్రీలు ప్రశ్నకు సంప్రదాయ విధానాలను అనుసరించి ప్రశ్నకు సంబంధించిన విషయాలను వివరిస్తారు.

    కావడి ప్రశ్న అడిగే ముందు పాటించాల్సిన నియమాలు ఏమిటి?

    సంప్రదాయ పద్ధతిని అనుసరించేవారు ప్రశ్న అడగడానికి ముందు తలస్నానం చేసి, శుచిగా ఉండటం మంచిదిగా భావిస్తారు. ప్రశ్నను భక్తి మరియు ఏకాగ్రతతో అడగడం కూడా ఈ సంప్రదాయంలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

    జాతకులు నేరుగా హాజరు కాలేకపోయినా, ఫోన్ ద్వారా కూడా కావడి ప్రశ్న సేవను పొందే అవకాశం ఉంది.

    కావడి ప్రశ్నను ఎందుకు ఎంచుకోవాలి?

    మీ జన్మ తేదీ, సమయం వివరాలు తెలియకపోయినా ప్రశ్న అడగగలగడం కేరళ కావడి ప్రశ్న యొక్క ముఖ్యమైన ప్రత్యేకత.

    ప్రస్తుతం మీ జీవితంలో ఎదురవుతున్న ఒక నిర్దిష్ట సమస్య లేదా సందేహంపై దృష్టి పెట్టి ప్రశ్న అడగవచ్చు. వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం, ఋణం, విదేశీ ప్రయాణం వంటి అనేక అంశాలపై ప్రశ్నను వేయవచ్చు. సంభావన: 2,500/-

      Kerala Kavadi Prashna







       

      జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

      Ph: 9846466430

      Related Articles: 

      మహాలయ పక్షం 2026 | సర్వపితృ అమావాస్య | నారాయణ బలి & పితృ తర్పణం

      మహాలయ పక్షం – సర్వపితృ అమావాస్య

      పితృదేవతల ఆరాధనకు అత్యంత విశేషమైన కాలం: 

      భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్షాన్ని (పౌర్ణమి తరువాత వచ్చే 15 రోజులను) మహాలయ పక్షం లేదా పితృ పక్షం అని అంటారు.భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మాహాలయ అమావాస్య అని, సర్వ పితృ అమావాస్య అని పిలుస్తారు.

               ఈ 15 రోజులలో పితృదేవతల ఆరాధన వలన, వారిని స్మరించుకోవడం వలన, వారికి శార్థ కర్మలను నిర్వహించడం వలన, బలవన్మరణం లేదా ఆకస్మిక మరణం పొందిన వారికి నారాయణ బలి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం వలన, పూర్వీకులు తమ సంతానం లేదా వారసులు ఇచ్చే తర్పణాలు, శ్రాద్ధ కర్మలను స్వీకరిస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. పితృదేవతలకు శాస్త్రోక్తంగా పూజలు, తర్పణాలు నిర్వహించేందుకు మహాలయ పక్ష సమయం ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది.

      తిలా హోమము, నారాయణ బలి పూజాది కార్యక్రమములను ఎవరు జరిపించుకోవాలి?

      క్రింది పరిస్థితులు ఉన్నవారు తిలా హోమము, నారాయణ బలి, సపిండి శార్థమును ఆచరించమని గరుడ పురాణములో చెప్పబడింది:

      • బలవన్మరణం పొందిన వారికి
      • హఠాన్మరణం పొందిన వారికి
      • ఆత్మహత్య చేసుకున్న వారికి
      • విషకీటకాదుల వలన మరణించిన వారికి
      • పిడుగు పాటు వలన మరణించిన వారికి
      • నీటిలో మునిగి మరణించిన వారికి
      • వివాహం అవ్వకముందే మరణించిన స్త్రీ, పురుషులకు
      • పురిటిలో మరణించిన వారికి
      • చేతబడికి గురి అయ్యి అనారోగ్యం పాలయ్యి మరణించిన వారికి
      • వాహన దుర్ఘటనల వలన మరణించిన వారికి
      • జాతక భావంలో పితృ దోషం ఉన్నవారు
      • స్త్రీ శాపములు ఉన్నవారు
      • భ్రూణ హత్య దోషములు (అబార్షన్) చేసిన వారందరూ కూడా ఈ కార్యక్రమాలను జరిపించుకోవాలి. 

      మహాలయ పక్షం – సర్వపితృ అమావాస్య

      సపిండికరణములు, ఆబ్దికము నిర్వహించని వారికి కలిగే ప్రభావాలు:

      అనేక కారణముల వలన గతించిన వారికి సపిండికరణములు, ప్రతీ సంవత్సరం వచ్చే ఆబ్దికమును నిర్వహించని వారికి, గతించిన వారు ఆత్మలుగా సంచరిస్తూ, మోక్షమును పొందలేక, మరల జన్మను ఎత్తలేక ఘోషిస్తూ ఉంటారు.పితృ ఘోష వలన వారి వారసులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.తమ వారసులు తమకి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారని గతించిన వారి యొక్క ఆత్మలు ఈ మాహాలయ పక్షములో ఆకలి దప్పికలతో ఎదురుచూస్తూ ఉంటారు.వారి యొక్క తృష్ణను తీర్చి, వారికి శ్రీ మహావిష్ణువు ద్వారా మోక్షమును అనుగ్రహించాలని కోరుకుంటూ ఉండాలి.

      పితృ దోషం వలన ఏర్పడే సమస్యలు: 

      పూర్వీకుల యొక్క ఆత్మఘోష, రోదన వలన వారి సంతానానికి, వారి వారసులకు ఏర్పడే అవరోధాలు ఏర్పడతాయి. అసహజ మరణం పొందిన వారు లేదా శ్రార్థ కర్మలను నిర్వహించని వారి కుటుంబానికి పితృ దోషం ఏర్పడుతుంది. కొందరికి జాతక భావంలోనే పితృదోషము ఉంటుంది. దీని వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. 

      • పితృదోషము ఉన్నవారి ఇంటిలో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి.
      • పితృదోషముతో బాధపడేవారికి వివాహ విషయములో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా, సరైన వయస్సుకు వివాహం జరుగదు.
      • పితృదోషం నుండి బాధపడేవారు అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు తీర్చలేరు.
      • పితృదోషము ఉన్నవారి కుటుంబములో ఒకరికి తరచూ ఒక పాము కలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమునకు చెందిన పితృదేవతలలో ఒకరు కలలో కనబడి ఆహారం లేదా బట్టలు కొరకు అడుగుతూ ఉంటారు.
      • ఈ దోషము ఉన్నవారికి మంచి ఉద్యోగము లభించింది అని సంతోషించే లోపే, ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోవడం, పై అధికారులతో ఇబ్బందులు ఏర్పడటం జరుగుతుంది. 
      • పితృదోషం వలన కుటుంబ సభ్యులలో ఒకరికి దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడటం, వాటి కోసం ఎంతో ఖర్చు పెట్టాల్సి రావడం జరుగుతుంది. 
      • పితృ దోషంతో పాటుగా, జాతక భావంలో సంతాన దోషం కూడా ఉన్నట్లైతే, ఆ జాతకులకు సంతాన నష్టం కూడా జరుగుతుంది. 
      • పితృ దోషం వలన, పితృదేవతల అనుగ్రహం లేనందున, జాతకుల యొక్క సంతానం, ముఖ్యంగా పుత్ర సంతానం దుర్వ్యసనల పాలయ్యి దుర్మరణం చెందడం కొన్ని సంధర్భాలలో జరుగుతుంది. 
      • పితృ దోషం కారణంగా కుటుంబంలో స్త్రీలు పక్కదోవ పట్టడం లేదా కుటుంబం నుండి విడిపోవడం జరుగుతుంది. 

      పితృదోషం కారణగా ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. పితృ దోషం గురించి సంపూర్ణంగా తెలుసుకునేందుకు ఈ లింకుని క్లిక్ చేసి తెలుసుకోగలరు.

      పితృదేవతల అనుగ్రహం పొందడానికి నారాయణ బలి పరిహారం:

      పితృదేవతల అనుగ్రహం పొందడానికి మన విద్యుక్త ధర్మాన్ని ఆచరించడానికి నారాయణ బలి పరిహారం ఆచరించాలి. మన పూర్వీకుల మీద మనకున్న బాధ్యతను నిర్వహించాలి. పూర్వీకులు ఏ తిథినాడు గతించారో తెలియని వారు, తమ పితరులు గతించిన తరువాత ఆబ్దికములను శ్రద్ధగా నిర్వహించని వారు, జాతక భావంలో పితృ దోషం ఉన్నవారికి ఈ మహాలయ పక్షంలో జరిపించే ఈ ప్రాయశ్చిత్త పరిహారములు ఆచరించుకోవడం వలన, అటు పితృ దేవతలకు మోక్షం లభించుట, అలాగే ఇటు తమ వారసులు వంశాభివృద్ధికి ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మహాలయ పక్షములో ఈ పరిహారములు చేయడం ద్వారా గతించిన వారికి మోక్షము లభించి, తమ వారసులకు ఆశీర్వచనములు ప్రాప్తిస్తాయి.

      మహాలయ పక్షంలో నిర్వహించబడే కార్యక్రమాలు: 

      • పితృ తర్పణ
      • నారాయణ బలి
      • తిలా హవనం
      • సాయుజ్య హవనం
      • బ్రాహ్మణ సంతుష్ట బలి
      • యమరాజ దీపం

      హోమాది కార్యక్రమములు మాహాలయ పక్షములో శ్రీ మలయాళ భగవతి నాగరాజ స్వామి నాగయక్షి పీఠము నందు, కేరళ నంబూద్రీలచేత నిర్వహించబడుతుంది.

      📅 కార్యక్రమ తేదీలు

      సెప్టెంబర్ 27, 2026 నుండి అక్టోబర్ 10, 2026 వరకు

      📍 కార్యక్రమ స్థలం

      శ్రీ మలయాళ భగవతి నాగరాజ స్వామి నాగయక్షి పీఠము, అరణ్యమలై

      నిర్వహించబడే కార్యక్రమాలు: 

      🪔 పితృ తర్పణ

      🕉️ త్రిపిండి శ్రాద్ధం

      🙏 బ్రాహ్మణ సంతుష్ట బలి

      🔥 సాయుజ్య హవనం

      🔥 తిలా హవనం

      🕉️ నారాయణ బలి

      🪔 యమరాజ దీపం

      నమోదు చేసుకోవడానికి చివరి తేదీ

      ఈ కార్యక్రములలో పాల్గొన దలచిన వారు సెప్టెంబర్ 25 వ తారీఖులోపు నమోదు చేసుకోగలరు.

      📌 ముఖ్యమైన తేదీలు

      📅మహాలయ పక్షము- సెప్టెంబర్ 27 – అక్టోబర్ 10, 2026
      💰 రుత్విక్ సంభావన: ₹25,000/-
      📝 నమోదు చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2026

      Related articles: 

      జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

      Ph: 9846466430

      జీవితంలో ఎదురయ్యే కల్లోలాలకు పూర్వజన్మ కర్మలే కారణమా?

      జీవితంలో ఎదురయ్యే కల్లోలాలకు పూర్వజన్మ కర్మలే కారణమా?

                     ఒక వ్యక్తి పాపాలు చేశాడు అనుకుందాము. అతను చనిపోయిన తరువాత, అతనుచేసిన పాప కర్మలకు తగిన శిక్షలను నరకంలో అనుభవించాడు. నరకంలో పొందిన శిక్షల వలన, ఆ పాప కర్మకు కారణమైన అతనిలో ఉన్న దుర్గుణం యొక్క తీవ్రత తగ్గుతుంది. కాని అది పూర్తిగా అయితే మాత్రం తొలగిపోదు. ఆ దుర్గుణానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఆత్మలో నిక్షిప్తం అయ్యి ఉంటాయి. ఒక చెడుకర్మ లేదా పాపకర్మ చేసినందుకు అనుభవించిన శిక్ష వలన తనలో ఉన్న దుర్గుణం తొలగిపోదు. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అదే విధంగా, దుర్గుణమును, దుర్భుద్ధిని సద్బుధ్ధితో మాత్రమె పూర్తిగా తొలగించగలము.

                     ఉదాహరణకు, ఒక దొంగను ఎంత శిక్షించినా సరే, అతనిలో ఉన్న దొంగ స్వభావం పూర్తిగా పోదు. మళ్ళీ దొంగతనం చేస్తే, మళ్ళీ శిక్షిస్తారేమో అన్న భయంతో దొంగతనం చేయడానికి జంకుతాడేమో గాని, అతనికి దొంగ బుద్ధి పూర్తిగా మాత్రం తొలగిపోదు. అందుకే, జైలు నుండి బయటకు రాగానే, అతను మళ్ళీ కొన్ని రోజులకు దొంగతనం చేయడం మొదలు పెడతాడు. దొంగతనం చేయడం తప్పు అని ఆ దొంగకి అర్థం అయినపుడు, అనగా ఆ సద్భుద్ది కలిగినపుడు మాత్రమె ఆ దొంగ దొంగతనాలు చేయడం మానేస్తాడు. అతనికి ఒక సద్గురువు లభించి, ఆ గురువు ద్వారా నిజమైన జ్ఞానం లభిస్తే, ఆ పాప కర్మ యొక్క గుణం పూర్తిగా తొలగిపోతుంది. ఒకప్పుడు దొంగతనాలు చేస్తూ దొంగగా ఉండే వాల్మికి , నారదమహర్షి భోధించిన సత్య జ్ఞానం వలన వాల్మికి మహర్షిగా మారాడు గాని, జైలుకి వెళ్లి పోలిసుల చేతిలో శిక్షలు అనుభవించినందుకు కాదు.

                     గుణం అనేది ఒక జ్ఞానం. ఇదివరకు చెప్పినట్టుగా, తప్పుడు జ్ఞానాన్ని కేవలం సరైన జ్ఞానం ద్వారానే తొలగించవచ్చు. పూజలు చేయడం ద్వారానో. జపాలు చేయడం ద్వారానో, భజనలు చేయడం వల్లనో పుణ్యం పొందవచ్చు, మనస్సును శాంతిమ్పచేసుకోవచ్చు గాని, వారిలో ఉన్న చెడు బుద్ధిని మాత్రం తొలగించుకోలేరు. కాని, ఆ పాపాలకు కారణమైన అజ్ఞానాన్ని నిర్మూలించేది మాత్రం సత్యజ్ఞానమే.

      పూర్వజన్మ కర్మలు - Brahma Tantra

                     మీకు ఇప్పుడు మనస్సులో ఒక సందేహం రావచ్చు. ఈ చెడు జ్ఞానం, దుర్బుద్ధి ఇవి కూడా కర్మే కదా? అని.

                     అవును, ఇది కూడా కర్మే. సృష్టిలోని ప్రతీ అంశం కూడా ఒక విధమైన కర్మే. గుణం అనేది మనకు అవగాహన కలిగించే ఆలోచన కావచ్చు లేదా అవగాహన కలిగించే భావన కూడా కావచ్చు. అది కూడా కర్మే. ఒక కర్మ యొక్క అవగాహనను మరొక కర్మ యొక్క అవగాహన మాత్రమే తొలగించగలదు గాని భౌతిక శక్తి తొలగించలేదు. శిక్షించడం, కొట్టడం, కాల్చడం ఇవన్నీ కూడా భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే శరీరం మనస్సుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి పాప కర్మ లేక వికర్మ యొక్క జ్ఞానం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో మనస్సులో భయాన్ని కలుగజేస్తుంది గాని ఆ గుణం మూలాల నుండి తొలగిపోదు. సరైన జ్ఞానం, సత్య జ్ఞానం ద్వారా మాత్రమే దుర్గుణం అనేది మూలాల నుండి తొలగిపోతుంది.

                     ఆ గుణమే తొలగిపోయినపుడు, దానికి సంబంధించిన కర్మ కూడా కనుమరుగు అవుతుంది. అందుకని, దుర్గుణాన్నిసరైన జ్ఞానంతో తొలగించుకుంటే, ఆ దుర్గుణంతో పాటు, దానికి సంబంధించిన కర్మ కూడా మూలాల నుండి కాలిపోతుంది.

      “యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।
      జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।।”

      భావం: ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటిని భస్మము చేయును.

                     ఒక వ్యక్తి పాపములు చేసి నరకంలో శిక్షలు అనుభవించి, మళ్ళీ జన్మించాడు అనుకుందాము. అతను చేసిన పాపాలకు కారణమైన గుణం యొక్క అవశేషాలతోనే జన్మిస్తాడు. ఈ గుణం కలిగి ఉండటం కూడా కర్మే, కావున ఈ కర్మావశేశాలను “కర్మ శేషం” అని పిలుస్తారు. ఆ వ్యక్తి ఈ జన్మలో తనతో పాటు తెచ్చుకున్న గుణం యొక్క అవశేషాలు, అతనితో పాటు ఆ గుణం కూడా పెరిగి పెద్ద వృక్షంలా మారుతుంది. దీని వలన, ఆ వ్యక్తి గత జన్మలో ఎ విధమైన కర్మలు చేసి నరకంలో శిక్షలు అనుభవించాడో, ఈ జన్మలో కూడా మళ్ళీ అవే కర్మలను చేస్తాడు. ఈ జన్మలో చేసిన ఈ పాప కర్మలకి శిక్ష ఈ జన్మలోనే కలుగవచ్చు లేదా చనిపోయాక నరకంలో కూడా కలుగవచ్చు. ఉదాహరణకు, ఒక దొంగ దొంగతనం చేస్తున్నప్పుడే అక్కడికక్కడే యజమానికి దొరికిపోయి బాగా దెబ్బలు తినచ్చు లేదా అదే దొంగని పోలీసులు స్టేషనుకు తీసుకోపోయి కొట్టవచ్చు లేదా దొంగ ఈ రెండు చోట్ల దెబ్బలు తినడం తప్పించుకుంటే, చివరాకరికి నరకంలో అయినా దెబ్బలు తినక తప్పదు.  

      మనందరికీ కూడా అనంత జన్మల నుండి చేసిన పుణ్య,పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకొనిపోయి ఉంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు, అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధము తెలుసుకోవటం మనలను శరణాగతి దిశగా తీస్కువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు.గత జన్మలో చేసిన కర్మకు నరకంలో శిక్షను అనుభవించి, ఆ కర్మ శేషమును ఆత్మ మళ్ళీ భూమిపైకి మోసుకొస్తుంది. ప్రస్తుత జన్మలో మన జీవితంలో జరిగే కల్లోలాలకు కారణం మనం గత జన్మలో చేసుకున్న కర్మలే కారణంగా చెప్పవచ్చు.

      జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

      Ph: 9846466430

      Related Articles: