loading

Author: chakrapani

9 రోజులు-9 హోమములు

9 రోజులు-9 హోమములు

కేరళలోని పాలక్కాడ్ జిల్లా, ఆలత్తూర్ మండలం, వావిల్యాపురంలోని వేదనారాయణ అధర్వణ తంత్ర పీఠము నందు జాతకులకు పరోక్షముగా మరియు సామూహికంగా శాంతి హోమములు జరిపించబడును.

21–01–2024 నుండి 29-01–2024 వరకు 9 రోజుల పాటు జాతకులకు జరుగున్న ప్రతికూల గ్రహ మహా అంతర్దశలకు శాంతి హోమములు జరిపించబడును. ఇందు నిమిత్తము ఋత్విక్ సంభావన 1,116/- ఆయుః క్షీణ గ్రహ దశలు జరుగుతున్న వారికి, గండాంతర గ్రహ దశలు జరుగుతున్న వారికి మరియు కాలసర్ప దోష నివారణకు, సంపూర్ణ ఆయుర్దాయము పొందుటకు ఆయుషు కారక ప్రతికూల గ్రహ దోష నివారణకు, వైవాహిక దోష నివారణకు, కార్యసిద్ధికి, సంతాన ప్రాప్తికి, బాలారిష్ట గ్రహ దోష నివారణకు, పితృ దోష నివారణకు ఈ శాంతి హోమములు జరిపించబడును. జాతకులు తమ యొక్క జన్మకుండలిని పరిశీలించుకొని, మీకు జరుగుతున్న గ్రహదశలను, దోషములను మాకు తెలియపరచిన యెడల, ఈ శాంతి హోమములను సామూహికముగా మరియు పరోక్షముగా జరిపించబడును. హోమాదులు సంపూర్ణముగా జరిపించిన తరువాత, యజ్ఞ ప్రసాదములు మీకు కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపబడును.

గమనిక: 12 సంవత్సరములలోపు చిరంజీవులకు ఏర్పడినటువంటి బాలారిష్ట గ్రహ దోష నివృత్తి హోమములు, శాంతి హోమములు వంటి పరిహారాదుల కొరకు రావి ఆకు పై సంతానము యొక్క నామ ధ్యేయము, జన్మ నక్షత్రము, జన్మ లగ్నము వంటి వివరములు వారి తల్లిదండ్రులు స్వయంగా వ్రాసి పంపవలెను. అలాగే కాగితము పై కూడా వ్రాసి, ఆ రెండింటిని జత చేసి పంపవలెను. శిశువులు మరియు చిన్న పిల్లలు (12 ఏళ్ల లోపు) యొక్క ఫోటోలను పంపరాదు. 

జనవరి 20వ తారీఖు లోపు జాతకులు తమ యొక్క గోత్ర నామములు, జన్మ నక్షత్రములు,జన్మ లగ్నము, జన్మ రాశి, జరుగుతున్న గ్రహదశ యొక్క వివరములను మాకు 9951779444 నెంబరు Whatsapp నెంబరుపై పంపగలరు. అత్యంత శాస్త్రోక్త యుక్తంగా ఈ హోమ పూజాదులు నిర్వహించబడతాయి. 9 రోజుల పాటు జరిగే హోమాదుల వివరములు:

  1. కాలసర్ప దోష నివారణా శాంతి హోమం & రవిగ్రహ శాంతి హోమం (రేవంత బలి) (21-01-2024)
  2. ఆయుష్ హోమం & చంద్ర గ్రహ శాంతి హోమం (22-01-2024)
  3. నవగ్రహ శాంతి హోమం & అంగారక గ్రహ దోష నివారణ శాంతి హోమం (23-01-2024)
  4. ఆయుః కారక గ్రహ ప్రతికూల దోష నివారణ హోమం & బుధ గ్రహ శాంతి హోమం (24-01-2024)
  5. వైవాహిక దోష నివారణ హోమం & గురు గ్రహ దోష నివారణ శాంతి హోమం (ఇంద్రాదిత్య హోమం) (25-01-2024)
  6. కార్యసిద్ధి హోమం & శుక్ర గ్రహ శాంతి హోమం (సర్పంతుల్లాల్) (26-01-2024)
  7. సంతాన ప్రాప్తి హోమం & శని దోష నివృత్తి హోమం (తిలకాష్ట బలి) (27-01-2024)
  8. బాలారిష్ట శాంతి హోమం & కేతు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (28-01-2024)
  9. పితృదోష పరిహార హోమం & రాహు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (29-01-2024)

ఈ 9 రోజుల శాంతి హోమములకు నమోదు చేసుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ను నింపవలెను. 

[bitform id=’4′]

 

 

 

Related Articles: 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

9 రోజులు-9 హోమములు

9 రోజులు-9 హోమములు

కేరళలోని పాలక్కాడ్ జిల్లా, ఆలత్తూర్ మండలం, వావిల్యాపురంలోని వేదనారాయణ అధర్వణ తంత్ర పీఠము నందు జాతకులకు పరోక్షముగా మరియు సామూహికంగా శాంతి హోమములు జరిపించబడును.

21-01-2024 నుండి 29-01-2024 వరకు 9 రోజుల పాటు జాతకులకు జరుగున్న ప్రతికూల గ్రహ మహా అంతర్దశలకు శాంతి హోమములు జరిపించబడును. ఇందు నిమిత్తము ఋత్విక్ సంభావన 1,116/- ఆయుః క్షీణ గ్రహ దశలు జరుగుతున్నా వారికి, గండాంతర గ్రహ దశలు జరుగుతున్న వారికి మరియు కాలసర్ప దోష నివారణకు, సంపూర్ణ ఆయుర్దాయము పొందుటకు ఆయుషు కారక ప్రతికూల గ్రహ దోష నివారణకు, వైవాహిక దోష నివారణకు, కార్యసిద్ధికి, సంతాన ప్రాప్తికి, బాలారిష్ట గ్రహ దోష నివారణకు, పితృ దోష నివారణకు ఈ శాంతి హోమములు జరిపించబడును. జాతకులు తమ యొక్క జన్మకుండలిని పరిశీలించుకొని, మీకు జరుగుతున్న గ్రహదశలను, దోషములను మాకు తెలియపరచిన యెడల, ఈ శాంతి హోమములను సామూహికముగా మరియు పరోక్షముగా జరిపించబడును. హోమాదులు సంపూర్ణముగా జరిపించిన తరువాత, యజ్ఞ ప్రసాదములు మీకు కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపబడును.

జనవరి 20వ తారీఖు లోపు జాతకులు తమ యొక్క గోత్ర నామములు, జన్మ నక్షత్రములు,జన్మ లగ్నము, జన్మ రాశి, జరుగుతున్న గ్రహదశ యొక్క వివరములను మాకు 9951779444 నెంబరు Whatsapp నెంబరుపై పంపగలరు. అత్యంత శాస్త్రోక్త యుక్తంగా ఈ హోమ పూజాదులు నిర్వహించబడతాయి. 9 రోజుల పాటు జరిగే హోమాదుల వివరములు:

  1. కాలసర్ప దోష నివారణా శాంతి హోమం & రవిగ్రహ శాంతి హోమం (రేవంత బలి) (21-01-2024)
  2. ఆయుష్ హోమం & చంద్ర గ్రహ శాంతి హోమం (22-01-2024)
  3. నవగ్రహ శాంతి హోమం & అంగారక గ్రహ దోష నివారణ శాంతి హోమం (23-01-2024)
  4. ఆయుః కారక గ్రహ ప్రతికూల దోష నివారణ హోమం & బుధ గ్రహ శాంతి హోమం (24-01-2024)
  5. వైవాహిక దోష నివారణ హోమం & గురు గ్రహ దోష నివారణ శాంతి హోమం (ఇంద్రాదిత్య హోమం) (25-01-2024)
  6. కార్యసిద్ధి హోమం & శుక్ర గ్రహ శాంతి హోమం (సర్పంతుల్లాల్) (26-01-2024)
  7. సంతాన ప్రాప్తి హోమం & శని దోష నివృత్తి హోమం (తిలకాష్ట బలి) (27-01-2024)
  8. బాలారిష్ట శాంతి హోమం & కేతు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (28-01-2024)
  9. పితృదోష పరిహార హోమం & రాహు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (29-01-2024)

ఈ హోమములకు ఏ విధంగా నమోదు చేసుకోవాలి?

  • హోమములో పాల్గొనాలనుకునే జాతకులు తమ యొక్క గోత్రము, నామము, జన్మ నక్షత్రము, జన్మ లగ్నము, జన్మ రాశి, ప్రస్తుతం జరుగుతున్న గ్రహదశ- అంతర్దశ యొక్క వివరములను, మీ ఫోటో, మీ పూర్తి చిరునామా (Pincodeతో సహా) మాకు 9951779444 నెంబరు Whatsapp నెంబరుపై పంపగలరు. ఇందు కొరకు 1,116/- సంభావనను మాకు 9951779444 (Brahma Tantra Astro Services) నెంబరు పై Phonepe, Gpay, Paytm ద్వారా గాని లేదా 9951779444@ybl UPI IDకి గాని చెల్లించి, మాకు Screenshot పంపవలెను.
  • ఈ విధంగా మీ వివరములతో నమోదు చేసుకొని ఈ 9 రోజుల పాటు జరిగే శాంతి హోమములలో పాల్గొనగలరు. ఈ హోమములు దిగ్విజయంగా సంపూర్ణం అయిన తరువాత మీరు మాకు అందజేసిన చిరునామాకు యజ్ఞ ప్రసాదములు, కంకణములు కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపబడును. దానికి సంబంధించిన రసీదుని మీకు whatsapp ద్వారా పంపబడును.

మాకు whatsapp ద్వారా పంపవలసిన వివరాలు: 

జన్మ నామము:

గోత్రము: 

జన్మ లగ్నము:

జన్మ రాశి: 

జన్మ నక్షత్రము: 

ప్రస్తుత గ్రహదశ-అంతర్దశ: 

చిరునామా: 

ఫోన్ నెంబరు: 

ఫోటో:

ఋత్విక్ సంభావన 1,116/- చెల్లించిన Screenshot: 

Whatsapp: 9951779444

Email: chakrapani.vishnumaya@gmail.com

Phonepe/Gpay/Paytm: Brahma Tantra Astro Services –  9951779444

UPI ID: 9951779444@ybl

గమనిక: 12 సంవత్సరములలోపు చిరంజీవులకు ఏర్పడినటువంటి బాలారిష్ట గ్రహ దోష నివృత్తి హోమములు, శాంతి హోమములు వంటి పరిహారాదుల కొరకు రావి ఆకు పై సంతానము యొక్క నామ ధ్యేయము, జన్మ నక్షత్రము, జన్మ లగ్నము వంటి వివరములు వారి తల్లిదండ్రులు స్వయంగా వ్రాసి పంపవలెను. అలాగే కాగితము పై కూడా వ్రాసి, ఆ రెండింటిని జత చేసి పంపవలెను. శిశువులు మరియు చిన్న పిల్లలు (12 ఏళ్ల లోపు) యొక్క ఫోటోలను పంపరాదు. 

పంపవలసిన చిరునామా: C.V.S.Chakrapani, C/O Srinivas garu-DTDC courier, Renigunta, Tirupati- 517520 Ph: 9846466430

Related Articles: 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

పాపకర్మలు-అవయోగాలు (పార్ట్-1)

పాపకర్మలు-అవయోగాలు(పార్ట్-1)

వ్యక్తుల జన్మకుండలిలో వారు చేయబోయే వృత్తులు, వ్యాపారాలు ఏ విధమైనటువంటి వృత్తులు  చేస్తారో, వాటికి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అన్న విషయాలు తెలుస్తాయి. మనిషి వారి పూర్వజన్మ కర్మానుసారము లాభ నష్టాలను, శాపాలను, దృష్టిని కలుగజేసే విధంగా గ్రహాలు తమ కిరణాలను ప్రసరింపజేసి ప్రభావాలను చూపిస్తాయి. పూర్వజన్మలోని కర్మఫలాలను అనుసరించి ఇహ జన్మలో మనిషి ప్రవర్తన ధనార్జన నిర్ణయమవుతాయి. కొన్ని కొన్ని పూర్వజన్మ పాపకర్మలు ఈ జన్మలో మానవుడు అనుభవించి తన కర్మఫలాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి కొన్ని తప్పిదములు చేయడం జరుగుతుంది. వాటిలో కొన్ని మహాపాపములు ఇక్కడ వివరిస్తున్నాను. గోహత్య, పశుహత్య, శిశు హత్య, గర్భస్థ శిశుహత్య, సర్పవధ, పక్షి బంధనము, స్త్రీ హత్య, భూ కబ్జాలు, పిల్లలను అపహరించడం, వ్యసనాల ద్వారా ఇతరులను నాశనం చేయడం.

               వ్యక్తులు పాపకృత్యాలు చేయడానికి, దాని ఫలితాలను అనుభవించడానికి అవినాభావ సంబంధం ఉంటుంది. వ్యక్తులు ఎంతటి ధర్మపరులు అయినప్పటికి అహింసావాదులు అయినప్పటికి వారి పూర్వ జన్మ కర్మఫలము వారిని ఈ విధంగా చేసే విధంగా గ్రహస్థితులు ప్రేరేపించి వాటి చెడు ప్రభావాలను చూపిస్తాయి. ఒక వ్యక్తి పూర్వజన్మలో ఒక వైద్యుడై ఉండి, గర్భవిచ్ఛిత్తికి కారకుడు అయినట్లైతే ఈ జన్మలో కూడా అదే విధంగా ప్రవర్తించి మరల గర్భస్రావాలకు గర్భవిచ్ఛిత్తిలకు కారకుడై, ఆ పాపపు కర్మల తాలూకు ఫలితాలను అనుభవిస్తూ, ఆ వైద్యుడి యొక్క సంతానము వలన ఆ వైద్యుడికి సంతాన చింత, సంతాన విచారం అనేక విధములుగా కలుగుతుంది. అదే విధంగా కొన్ని వృత్తులు అనగా మైనింగ్, భూ కబ్జాలు, వీటి వలన లాభాలు వచ్చే మాట నిజమే, కానీ ఆ కార్యముల వలన ఆ కార్యనిర్వహణలో జరిగే అపశృతులు, జీవహింస, జీవ వధ (సర్పవధ) వలన తీవ్రమైన శాపాలకు ఆ వధింపబడ్డ జీవాల ఆత్మఘోషకు గురి కావడం తద్వారా ఈ కార్యములు నిర్వహించి ధనార్జన గావించిన వ్యక్తుల జీవితాలలో వారి కుటుంబ వ్యక్తుల జీవితాలలో, వారి సంతాన విషయాలలో, వారి వైవాహిక, దాంపత్య, శ్రుంగార విషయాదులలో తీవ్రమైన సమస్యలు ప్రాప్తిస్తాయి. అనేక కారణముల చేత భూమిలో త్రవ్వకాలు జరిపించినపుడు అక్కడ కొన్ని సర్పాలు వధించబడతాయి. ఆ సర్పాల ఆత్మఘోశాలే సర్పదృష్టికి, నరదృష్టికి దారి తీయబడి అనారోగ్యములకు గురి కావడం, కొన్ని సంధర్భాలలో ఆ భూములు, దోష పూరితంగా మారి, అటు అమ్మడానికి కుదరక, ఆ భూమిని ఉపయోగించే పరిస్థితులు లేకపోవడం కారణంగా ఆదాయం లేక మొదట్లో వాటివలన ఆదాయం పొంది ఆ భూములలో తప్పిదములు జరిగిన కారణంగా ఆ సర్ప, పశు వధల కారణంగా దోషాలు ఏర్పడి పొందిన ఆదాయం అంతా హరించి, అప్పులపాలయ్యి, అనారోగ్య బాధలతో తీవ్రమైన మనోవేధనతో సతమతమవడం జరుగుతుంది. ఈ విషయాలు దాదాపు అందరికీ అనుభవమే కదా! నా అనుభవంలో ఈ విధమైనటువంటి శాపాలు, దోషాలు కలిగిన వ్యక్తుల జీవితాలను మీ ముందు ఉంచుతున్నాను.

               ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ శాపములు, దోషాలు 7 తరాల పాటు వదలకుండా పీడిస్తాయి. దైవాపచార దోషాలు ఇందులో మొదటి స్థానాన్ని పొందుతుంది. పూర్వజన్మలో దైవాపచార దోషాలు అనగా దేవలయములో విగ్రహాలు ధ్వంసం చేయడం, దొంగలించడం, దేవాలయములను అపవిత్రం చేయడం, సద్బ్రాహ్మణులను బాధించడం, దేవాలయ నిర్వహణలో దొంగ లెక్కలు చూపించడం, అర్చకులను అవమానించడం, ధర్మసత్రాల మీద పడి వాటి ఆస్తులను, దోచుకోవడం వంటి దైవాపచార దోషాలు చేసిన వ్యక్తులు వారి గురించి యధార్థంగా జరిగిన సంఘటనలను మీకు వివరిస్తాను. వారికి కలిగిన శాపాలు, వాటి వలన కలిగిన దుష్ప్రభావాలు, వారి జన్మకుండలి గ్రహాల ప్రభావాలు మీకు సకేతుకంగా వివరిస్తాను.

నా అనుభవంలో నా జ్యోతిష్య పరిజ్ఞానంతో ఈ దోషాలు శాపాలు పరిశీలించి వివరిస్తాను.

                                                                                                                        సశేషం…. (To be continued…)

జాతక పరిశీలన

  • జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. 

జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Whatsapp: wa.me/919846466430

Related Articles:

#past life

#past life astrology

#telugu past life astrology

#horoscope

#telugu astrology

చట్ట సంబంధ వివాదాలు-కోర్టుకేసులు-జన్మకుండలి

కోర్టు కేసులు-జన్మకుండలి

ప్రస్తుత కాలంలో జాతకులు ఎదుర్కొంటున్న సమస్యలలో అతి ముఖ్యమైనది, తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసేవి చట్టపరమైన సమస్యలు. ఈ సమస్యలు దీర్ఘకాలం పాటు సాగుతూ ఉంటాయి. ఈ పరిస్థితులలో జాతకులు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా తీవ్రమైన మనోవేదనను భరిస్తారు. అంతేకాకుండా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ దైవమైనా కరుణిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకాలం గడచినా కోర్టు వ్యవహారాలు, వాటి అనుకూలమైన తీర్పుల కోసం న్యాయవాదుల చుట్టూ, కోర్టు భవనాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహితులు అయితే గనుక అటు తమ సంతానానికి దూరమయ్యి, శ్రీకృష్ణుడిని దూరం చేసుకున్న వసుదేవుడి వలె కడుపుకోతను అనుభవించడం జరుగుతుంది. వారు పడే బాధ వర్ణనాతీతం. మనుషులను తీవ్రంగా ఇబ్బంది పెట్టి కలవరపెట్టె సమస్యలలో దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఎవరినైతే నీవు పూర్వజన్మలో పీడించి ఉంటావో, ఆ పాప కర్మ ఫలమే ఈ జన్మలో నీవు అనుభవించడానికి జాతకచక్రంలో అవయోగాల రూపంలో ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఈ అవయోగాలను, గ్రహదోషాలను పరిశీలించి దానికి ప్రాయశ్చిత్తములు జరిపిస్తే, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నిర్మూలించబడతాయి. ప్రస్తుత కాలంలో పరిపూర్ణ జ్యోతిష్య పరిజ్ఞానం గల జ్యోతిష్యులు దొరకాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. హస్తవాసి గల డాక్టర్లు, ధనాపేక్షలేని దైవజ్ఞులు ఈ కాలంలో ఎదురయ్యారంటే అది మన సుకృతం అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎం‌బి‌బి‌ఎస్ చదివిన వారందరికి రోగాన్ని నయం చేసే హస్త వాసి ఉండదు. అదే విధంగా జ్యోతిష్యం తెలిసిన ప్రతివారు దానిలో నిష్ణాతులు అయి ఉండరు. వాక్ శుద్ధి, చిత్త శుద్ధి లేనివారి జ్యోతిష్య ఫలితములు ఫలించవు. జాతకుడు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధమైన గ్రహస్థితులు కారణమవుతున్నాయో, ఆ చెడు గ్రహ స్థితుల వల్ల ఏర్పడే అవయోగాలు ఏమిటో, ఆ అవయోగాలకు పరిహార ప్రాయశ్చిత్తములు క్షుణ్ణంగా తెలిసుకున్న తరువాత జాతకుడు ఎదుర్కొంటున్న సమస్యకు దారి కనబడుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, గ్రహాల వల్ల ఏర్పడే అవయోగాలకు ప్రాయశ్చిత్తములు తంత్ర విధానంలో మాత్రమే ఉంటాయి. ఆ తంత్ర విధానాన్ని అనుసరించిన వారికి మాత్రమే, ఆ అవయోగాలు నిర్మూలించబడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు దొరుకుతుంది.

court cases telugu astrology

ఈ అవయోగాలు పూర్వజన్మలోని పాపకర్మలను అనుసరించి జాతకులకు అనుభవంలోకి వస్తాయి. ఇవి అందరికి ఒకే విధంగా ఉండవు. ఈ అవయోగం ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు మీ జాతక చక్రమును మీ ముందు ఉంచుకొని, కోర్టు కేసులు, శిక్షలకు దారి తీసే గ్రహస్థితులు ఏమిటో తెలుసుకుందాం. నేను చెప్పబోయే గ్రహస్థితులు మీ జాతకంలో ఉన్నాయో లేదో పరిశీలించుకోండి.

  • జన్మ లగ్నం నుండి 2వ స్థానం పై పాప గ్రహాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
  • జన్మకుండలిలో గ్రహణ యోగం ఏర్పడినపుడు, అనగా చంద్ర+రాహు లేదా చంద్ర+కేతు లేదా రవి+రాహు లేదా రవి+కేతు కలసి ఉన్నప్పుడు ఈ విధంగా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • కుజుడు+కేతు,కుజుడు+రాహు, రవి+రాహు ఈ విధమైనటువంటి గ్రహాల కలయిక వల్ల జీవితంలో తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతాయి.
  • అష్టమ స్థానంలో శని ఉన్నట్లైతే, ఆ స్థానం శని చెడు స్థానాలలో ఉన్నట్లైతే చట్టపరమైన వ్యతిరేక తీర్పును పొందవలసి వస్తుంది. మకరలగ్నం వారికి సింహరాశి అష్టమ స్థానం అవడం వల్ల, ఇది శనికి శత్రు స్థానం కావడం వల్ల, ఈ మకర లగ్నం వారికి సింహరాశిలో శని ఉండినట్లైతే కోర్టు తీర్పుల విషయంలో ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యాలగ్నం వారికి శని మేషరాశిలో గనుక ఉన్నట్లైతే కోర్టు వ్యవహారములందు ప్రతికూలతను ఇవ్వడం జరుగుతుంది. ఏ లగ్నం వారికైనా గాని లగ్నం నుండి శని 8వ స్థానంలో ఉండినట్లైతే, వారు జీవితంలో దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవటం, చట్టపరమైన చిక్కుల్లో పడటం, జరిమానాలు చెల్లించడం జరుగుతుంది. దినదినగండం నూరేళ్ళు ఆయుషు లాగా ఉంటుంది.
  •  అదే శని అష్టమ స్థానంలో మిత్ర క్షేత్రంలో ఉంటూ, ఎలాంటి పాప గ్రహ కలియిక లేకుండా ఉన్నట్లైతే, జాతకుడు కోర్టు కేసులు ఎదుర్కొన్నప్పటికి, చాలా కాలం పాటు కోర్టు కేసులు జరుగుతున్నప్పటికి, చివరగా తీర్పు మాత్రం జాతకుడికి అనుకూలంగా వస్తుంది.
  • అష్టమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కోర్టు సంబంధ వ్యవహారాల విషయంలో భరణం రూపంలో గాని, జరిమానాల రూపంలో గాని తీవ్రంగా ధన నష్టం వాటిల్లుతుంది. ఈ అష్టమ కేతువు వల్ల కోర్టు వ్యవహారాలు 99% వ్యతిరేక తీర్పులను పొందటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వాహన ప్రమాదాలు జరిగి అంగ వైకల్యాన్ని పొందటం జరుగుతుంది. ఈ అష్టమ కేతువు వల్ల సాధరణంగా విడాకుల కేసులు అయ్యి ఉంటాయి. విడాకుల కోసం కోర్టు చుట్టూ పడిగాపులు గాయటం జరుగుతుంది. ఈ అష్టమ కేతువు ఉన్నవారికి కోర్టు సంబంధ విషయంలో క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి వస్తే ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
  • అష్టమ స్థానంలో రాహువు ఉన్నట్లైతే వ్యాపార నిమిత్తం గాని, భార్యా భర్తల విషయంలో గాని, చెక్ బౌన్స్ కేసులలో గాని తొందరగా చట్ట పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ అష్టమ రాహువు వల్ల కోర్టు కేసు యొక్క తీర్పు శీఘ్రంగా వస్తుంది. ఆ తీర్పు జాతకుడికి అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అనేది జాతకుడి పూర్వజన్మ స్థానాన్ని మరియు రాహు ఉన్న రాశిని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అష్టమ రాహువు శీఘ్రంగా చట్ట సంబంధమైన సమస్యలలోకి తీసుకురావడం జరుగును.
  • అష్టమ స్థానంలో కుజుడు ఉన్నట్లైతే, ఇది ఎంతమాత్రం సరైనది కాదు అని చెప్పవచ్చు. ఈ అష్టమ కుజుడు వల్ల కోర్టు కేసుల విషయాలలో జాతకుడు అమాయకుడు అయినా కూడా, జాతకునికి 100% న్యాయం జరుగకపోవచ్చు. జరిమానాల రూపంలో ధన నష్టం జరుగుతుంది.
  • అష్టమ స్థానంలో రవి ఉన్నట్లైతే, జాతకుడికి రవి ఎలాంటి కోర్టు కేసులు ఉందనీయడు. ఒకవేళ ఇతర గ్రహ ప్రభావం వల్ల కోర్టు కేసులు ఉన్నా అవి తీరిపోయేలా చేస్తాడు. ఒకవేళ, ఈ అష్టమ రవితో కలసి ఉంటే మాత్రం ఈ కోర్టు కేసుల వల్ల పూర్వార్జితం, పూర్వీకుల నుండి పొందిన ఆస్తులను నష్టపోవడం జరుగుతుంది.
  • చట్టపరమైన సమస్యలకు కారణమైన పైశాచిక గ్రహాలకు తంత్ర విధానములోనే జాతకులు పరిహార ప్రాయశ్చిత్త హోమాదులు చేయించుకోవాలని ఇంతకు ముందు మీకు తెలియజేశాను. ఈ తాంత్రిక విధానంలో జాతకులు ఎదుర్కొంటున్న గ్రహ దోషాలు సంపూర్ణంగా నిర్మూలించబడతాయి.ముందుగా జాతకులు ఏ గ్రహం వల్ల చెడు ఫలితాలు ఎదుర్కొంటున్నారో, మీ జన్మకుండలిలో ఆ చెడు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మీరు ఇంతకు ముందు తెలుసుకున్నారు.చట్టపరమైన వివాదాలకు, కోర్టు వ్యవహారాలకు కారణమయ్యే ఆ గ్రహదోషాలకు పరిహారములు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.రవి గ్రహ దోషముకు: మండకాళి హోమముకేతు గ్రహ దోషముకు: పలాస పుష్ప సహిత కేతు గ్రస్త శ్రీ చిన్నమస్తా దేవి హోమం, శ్రీ తారా దేవి హోమంకుజగ్రహ దోషముకు: దండాయుధపాణి హోమం, వేల్ మురుగన్ బలి, మంగళన్ ప్రీతి బలి, నవనాగమండలంరాహు గ్రహం వల్ల ఏర్పడిన దోషముకు:తాంత్రిక రాహు ప్రీతి బలి, సింహికా ప్రీతి బలి

    ఒక్కొగ్రహానికి ఒక్కో విధంగా వామాచార విధానంలో గ్రహ ప్రీతి, పూజలు నిర్వహించాలి. సామూహికంగా తాంత్రిక దేవతా పూజలు, గ్రహ దోష పూజలు చేయరాదు. అందుచేత రాహు కేతు, శుక్ర, కుజ, శని గ్రహాల దోషాలకు పరిహారములు నిర్వహించే యాజ్ఞీకులు ఆ దోషం గల వ్యక్తులు తప్ప మరొకరు ఉండకుండా చూసుకోవడం మంచిది.

    తాంత్రిక పీఠాలలో జరిగే పైశాచిక గ్రహదోష నిర్మూలనకు హాజరు కావడం మంచిది. స్వయంగా హాజరు కాలేని వారు, వారి యొక్క ఫోటోను, జాతక చక్రమును, తాము విడిచిన వస్త్రమును పీఠములోని తంత్ర గురువులకు అందజేసి పూజాది హోమములు జరిపించుకోవచ్చు. ఈ తాంత్రిక పూజలు 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. కేవలం మీ పేరిట మాత్రమే గ్రహ దోష పరిహారములు నిర్వహించాలి. జాతకుని జన్మ లగ్నం నుండి 12 వ లగ్నం సమయంలో, జన్మ నక్షత్రం నుండి 4,6 నక్షత్రములలో ఈ పూజలు చేసుకోవడం వల్ల గ్రహ దోష నిర్మూలన, కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాలు, ఇష్ట కార్య సిద్ధి శీఘ్రంగా జరుగుతాయి. మీ పేరిట జరిగే పూజాకాలంలో జాతకులు పాటించవలసిన నియమాలు తప్పక పాటించాలి.

    ఈ గ్రహదోష పరిహారములు జరిగే తాంత్రిక పీఠాలు.

    కొట్టాయం – తంత్ర భగవతి పీఠం

    ఇడుక్కి     – చక్రపాణి తంత్ర పీఠం

    హరిపాద్  – మన్నారుశాల

    మంగళూరు – కాల భైరవన్ తాంత్రిక పీఠం

    ఎర్ణాకులం  – పరశురామన్ తాంత్రిక పీఠం

    త్రిశూర్     – కుట్టిచేతన్ తంత్ర విద్యా అభ్యాస పీఠం

     

    జాతకులు ఎదుర్కొంటున్న గ్రహదోషాల నిర్మూలనకు పైన వివరించిన తాంత్రిక పీఠములందు పూజలు జరిపించుకొదలచిన వారు శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించగలరు.

    జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

     

    Ph: 9846466430

    Whatsapp: wa.me/919846466430

    సర్వేజనా సుఖినోభవంతు

    ఓం శాంతి శాంతి శాంతిః

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

Related Articles:

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

అష్టమభావ దుష్పరిణామాలు

                                                         అష్టమ భావం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అష్టమ స్థానం అనేది ఒక మర్మమైన భావంగా చెప్పబడింది. ఒక వ్యక్తి యొక్క ఆయుషు ఎంత ఉంటుంది, అతని మరణం ఎలా సంభావిస్తుంది అనే విషయాలు ఈ అష్టమ భావం మనకు తెలియజేస్తుంది కాబట్టి, ఈ భావం చాలా ముఖ్యమైన భావంగా పరిగణిస్తారు. ఈ అష్టమ భావం వల్ల అనేక బాధలు కలుగుతాయని, జాతకుని జీవితం పై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది అన్న అభిప్రాయంతో అందరూ ఈ అష్టమ భావం అంటే భయపడుతూ ఉంటారు. జన్మకుండలిలో ఉన్న ఈ అష్టమ భావ ప్రభావం పూర్తి చెడు ఫలితాలనే ఇస్తుందా లేదంటే మంచి ఫలితాలను కూడా ఇస్తుందా అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము.

Ashtama Sthana Telugu

అష్టమ భావం వలన కలిగే చెడు ఫలితాలు:

జన్మకుండలిలో అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు నీచపడి ఉన్నా, లేక పాపులు అయినా, ఆ ప్రభావం జాతకుని ఆయుర్దాయంపై పడుతుంది. దీని కారణంగానే దీర్ఘకాలిక వ్యాధులు, అంతుచిక్కని బాధలు, మానసిక అశాంతి కలుగుతాయి. ఆస్తి తగాదాలు, నేరాలకు పాల్గొనడం, ప్రభుత్వం నుండి శిక్షలు అనుభవించడం, జరిమానాలు కట్టడం, వ్యసనాలకు అలవాటు పడటం, ఆత్మీయులను కోల్పోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుటవుతాయి.

అష్టమ భావంలో పాప గ్రహం లేదా శతృ గ్రహం ఉన్నట్లైతే వచ్చే ఫలితాలు:

1) ఆయుర్దాయం తగ్గుతుంది. జాతకునికి ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి.

2) మానసిక స్థిరత్వం కోల్పోతారు.

3) ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి.

4) కోర్టు కేసులు తలమీద భారంగా కూర్చుంటాయి.

5) చట్ట వ్యతిరేక కార్యకలాపాల వలన శిక్షలు అనుభవిస్తారు.

6) మత్తు పధార్థాలకు బానిసలు అవుతారు.

7) ప్రేమ వ్యవహారాలలో చేదు అనుభవాలు ఎదురవుతాయి.

8) ఆత్మహత్య ధోరణి కలిగి ఉంటారు.

9) గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితం, అష్టమభావ రూపంలో జాతకునికి ఇహ జన్మలో ప్రాప్తిస్తుంది.

అష్టమ భావం వల్ల కలిగే శుభ ఫలితాలు

               అష్టమభావాన్ని ఎప్పుడు భయానకంగా చూడటమే మనకి ఇప్పటి వరకు తెలుసు. కానీ ఈ అష్టమ భావం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే, ఈ అష్టమ భావం వల్ల జాతకునికి పూర్ణాయుర్దాయం కలుగుతుంది. ఎన్నో అవాంతరాలను, శత్రువులను అధిగమించి విజయం సాధిస్తారు. సైకాలజీ, సైన్సు, గణితం, మానవాతీత శక్తులు వంటి విద్యలలో జ్ఞానం కలిగి ఉంటారు. వారసత్వపు ఆస్తుల గురించి కూడా ఈ అష్టమ భావం తెలియజేస్తుంది. జాతకుల తండ్రి, తాత వీరిలో ఎవరైనా హఠాత్తుగా మరణించిన పిమ్మట, ఆ వారసత్వపు ఆస్తులు అన్నీ జాతకునికి రావడం వంటివి కూడా ఈ అష్టమ స్థానమే తెలియజేస్తుంది. పరిశోధనలు, గుప్త నిధులు, రహస్య శాస్త్రాలు, గనులు, బొగ్గు, సాహసాలు చేయడం, స్టాక్ మార్కెట్లు, లాటరీలు, మంత్రాలు, తంత్రాలు, ఆధ్యాత్మిక విషయాలు, కూల్చివేతలు ఇవన్నీ కూడా ఈ అష్టమ భావం సూచిస్తుంది.

సంపూర్ణ జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

అష్టమ స్థానంలో శుభ గ్రహం ఉన్నా లేదంటే శుభ గ్రహ దృష్టి అష్టమ భావం పై ఉన్నా, ఆ జాతకునికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకోని విధంగా శుభవార్తలు వింటారు.

1) పూర్ణాయుర్దాయం, మంచి ఆరోగ్యం ఉంటుంది. ధీర్ఘకాలిక వ్యాధులు కలిగినప్పటికి నయం అవుతాయి.

2) శత్రువులపై ప్రతీసారి వీరిదే విజయం.

3) కోర్టు కేసుల్లో విజయం.

4) పోయిన డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

5) ) సైకాలజీ, సైన్సు, గణితం వంటి శాస్త్రాల పై పరిపూర్ణతను సాధిస్తారు.  

6) అతీత శక్తులు, మర్మవిద్యల పై పరిశోధనలు చేస్తారు.

7) వ్యాపార భాగస్వామ్యం ద్వారా గాని, జీవిత భాగస్వామి ద్వారా గాని కలిగే ధనప్రాప్తి అంశాలను ఈ అష్టమ భావం తెలియజేస్తుంది.

8) ఆధ్యాత్మిక చింతన, యోగా, ధ్యానం వంటి వాటికి ఆకర్షితులు అవుతారు.

9) జాతకునిలో ఉన్న శృంగార విషయాలు, కోరికలు, కుండలినీశక్తి వంటి అంశాలను అష్టమ భావం సూచిస్తుంది.

10) అష్టమ భావం శుభంగా ఉంటే, సర్జరీ, హెల్త్ ఆఫీసర్, నర్సింగ్, జ్యోతిష్యం, సైకాలజీ, హీలింగ్ వంటి వృత్తులలో విజయం లభిస్తుంది.

ధీర్ఘ కాలంగా ధ్యానం చేసిన వారికి, శరీరంలో ఉన్న మూలాధార చక్రం చైతన్యం కలుగుతుంది. శరీరంలో ఉన్న శక్తిని పునరుద్ధరించి, మానసిక శారీరక ప్రశాంతతను, విశ్రాంతిని అందించి, మనసును ఉత్తేజంగా ఉంచుతుంది. పరిశోధనలు, వ్యసనాలు, కుండలినీ శక్తి, మర్మ జ్ఞానం, జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం, సంపూర్ణ ఆయుర్దాయం ఇవన్నీ కూడా అష్టమ భావం సూచిస్తుంది. వీటి మీద పూర్తి దృష్టి సారించి, పట్టు సాధిస్తే, ఆ జ్ఞానాన్ని మోక్షాన్ని ఛేదించేందుకు ఉపయోగించుకోవచ్చు.

పురుషుని జాతకంలో అష్టమ భావం తన యొక్క ఆరోగ్య పరిస్థితులు, సంభవించే ప్రమాదాలు, ఆయుర్దాయ నిర్ణయం వంటి విషయాలు తెలుస్తాయి. స్త్రీ జాతకంలో అష్టమ భావం వారి ఆయుర్దాయము, వారికి కలిగే అనారోగ్య విషయాలు మాత్రమే కాకుండా వారి జీవితంలో ప్రవేశించే భర్త, వారి ఆయుర్దాయ విషయాలు, మాంగల్య యోగం, దాంపత్య యోగం, వైదవ్య యోగం కూడా తెలుస్తాయి.

సంపూర్ణ జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

జీవితంలో కలిగే అదృష్ట విషయాలలో, సంతోష విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. సంపద, అదృష్టం వంటి విషయాలలో చాలా వేగవంతమైన మార్పులు కలుగుతాయి. బహుమతులు, వారసత్వపు ఆస్తులు, ట్యాక్సులు, వాటి రీఫండ్లు, బోనసులు, కమిషన్లు, భరణం, అప్పులు, పెట్టుబడులు వీటన్నిటికి కూడా ఈ అష్టమ భావం ఆధిపత్యం వహిస్తుంది.

అష్టమ భావం జాతకుని సంపదని కూడా సూచిస్తుంది. అష్టమ భావం ప్రభావం వల్ల కూడా ఆకస్మిక ధన లాభాలు, ధన నష్టాలు కలుగుతాయి. షేర్లు, వారసత్వ ఆస్తులు, ఇన్సూరెన్సులలో ఆకస్మిక ధన లాభాలు, ధన నష్టాలు అన్నీ కూడా ఈ అష్టమ భావం వలన కూడా కలుగుతాయి. జాతకంలో అష్టమ భావం శుభంగా ఉండకపోతే, వారికి మానసిక ఆందోళనలు, అసంతృప్తి, పనులలో జాప్యం, అపజయాలు లాంటివి కలుగుతాయి.

ఇలాంటి ఘూడమైన విషయాలను జన్మకుండలి ద్వారా పరిశీలించుకొని, అష్టమ భావం వలన కలిగే యోగాలు, అవయోగాలను తెలుసుకొని జాతకులకు కలిగే అవయోగాల నిర్మూలన గావించవచ్చు.

ఇవి కూడా చదవండి:

  1. గురు చండాల యోగం ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను జాతకుడు ఎదుర్కొంటాడు?
  2. కాలసర్ప దోషం ఉన్నవారు నివృత్తి హోమం ఎలా జరిపించుకోవాలి?
  3. దుష్ట శక్తుల నుండి కాపాడుకునేందుకు, శత్రు నాశనం జరిగేందుకు జాతకుడిని అనుగ్రహించే ప్రత్యాంగిరా హోమం యొక్క వివరాలు. 
  4. జాతకంలో దోషాల వలన దంపతుల మధ్య విభేధాలు కలిగి విడాకుల వరకు తీసుకెల్లే గ్రహస్థితులు ఏవి?
  5. దంపతులలో ఒకరు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులకు జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు కారణం అవుతాయి?

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Ph: 9846466430

Whatsapp: wa.me/919846466430

అంగారక యోగం

అంగారక యోగం

జన్మకుండలిలో రాహువు, కుజుడు కలసి ఒకే భావంలో ఉండినట్లైతే అంగారక దోషం ఏర్పడుతుంది. ఈ కుజ రాహువు కలసి సంగమించిన స్థానం పాప లేదా శత్రు స్థానం అయితే, ఈ దోషం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జాతకులు ఎంతో ఆవేశం, కోపం కలిగి ఉంటారు. కుజుడు నిప్పు, రాహువు తైలం. ఈ ఇద్దరు కలసి ఒకే భావంలో సంగమిస్తే నిప్పుకి ఆఝ్యం పోసినట్టే అవుతుంది. కుజుడు జాతకునికి అధిక ఆవేశాన్ని ఇస్తే, కుజుడు ఇచ్చే లక్షణాన్ని రాహువు మరింత ఉధృతం చేసి, జాతకుడిని క్రూరుడిగా మారుస్తాడు.  కుజుడు జాతకునికి దేనినైనా సాధించే గుణాన్ని ఇస్తాడు, రాహువు జాతకునికి ఊహల్లో బ్రతికేలా చేస్తాడు. దీని వల్ల జాతకుడు నిర్ణయాలను తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.

angaraka yogam

మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి.

  1. ఈ దోషం ఏర్పడిన స్త్రీ జాతకులు చాలా నిజాయితీగా ఉంటారు, కానీ వారికి ఉన్న ముక్కుసూటితనం వల్ల అందరికీ కఠినాత్ములుగా అనిపిస్తారు. అదే, ఈ దోషం పురుష జాతకులకు ఏర్పడితే, వారు చాలా ఆవేశపరులుగా, అన్నింటా అనుమానాలు కలిగి ఉంటారు, వీరి భార్యని కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా ఉండటానికే ఇష్టపడతారు. వీరి ప్రవర్తన అహంకారం, ప్రమాదకరంగా ఉంటుంది.
  2. ఈ అంగారక యోగం ఉన్న జాతకులకంటే చిన్నవారైన సోదరసోదరీమనులు, స్నేహితులతో వీరికి బంధం ఆగమ్యగోచరంగా ఉంటుంది. అయితే జాతకుల పట్ల పూర్తి అసూయతో అయినా ఉంటారు లేదంటే జాతకులను అసలు లెక్క చేయకుండా అయినా ఉంటారు.
  3. ఈ దోషం ఉన్న జాతకులకు మగవారితోనే స్నేహబంధాలు ఎక్కువగా ఉంటాయి.
  4. ఈ యోగ జాతకులకు ధైర్యం, దూకుడు అధికంగా ఉంటుంది. ఈ కారణంగా జాతకులకు వయస్సు పెరిగే కొద్ది రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి.
  5. ఈ దోషం జాతకులకు వివాహం తరువాత, తమ జీవిత భాగస్వామి యొక్క వృత్తి/వ్యాపార జీవనం అయోమయంలో పడుతుంది.
  6. ఈ దోష జాతకులు తమ అత్తామామలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి నానాపాట్లు పడాల్సి ఉంటుంది.
  7. అంగారక యోగ జాతకులు జన్మించిన తరువాత తమ తల్లి యొక్క ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
  8. మేనత్తలతో, పొరుగు వారితో, తోటి ఉద్యోగులతో ఈ జాతకులకు సత్సంబంధాలు ఉండవు.
  9. ఈ అంగారక దోషం ఉన్న జాతకులు ఏదైనా సంస్థ మీద గాని, స్థలం మీద గాని ఇష్టం పెంచుకుంటే, దానిని వీరు ఎంతో సులువుగా అదుపులోకి తెచ్చుకోగలుగుతారు.
  10. ఈ దోషం ఉన్న జాతకులకు గొప్ప ప్రణాలికలు వేసే సామర్థ్యం బాగుంటుంది. కానీ వీరికి ముక్కుసూటితనం, ఆవేశం లాంటి లక్షణాలు ఉండటం వల్ల వీరు వేసిన ప్రణాళిక ఎంత గొప్పది అయినప్పటికి, వాటి ప్రకారం పనులు పూర్తిచేయాలంటే ఈ జాతకులకు దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.
  11. ఈ అంగారక యోగం అనుకూల రాశిలో ఏర్పడినట్లైతే, అలాంటి జాతకులు పోలీసు శాఖ, మిలిటరీ శాఖలో వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అంగారక దోషం ఉన్న వారికి ఉండే సహజ లక్షణాలను ఇక్కడ మీకు తెలియజేశాను. ఈ అంగారక దోషం ఏ భావంలో ఏర్పడితే ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది మీకు క్షుణ్ణంగా ఇక్కడ వివరించబోతున్నాను.

లగ్నభావంలో అంగారక యోగం:

అంగారక యోగం మొదటి భావంలో ఏర్పడితే, ఆ జాతకులకు ముక్కు మీద కోపం, ఎవ్వరి మాట లెక్కచేయని జగమొండి లాంటి లక్షణాలు ఉంటాయి. పరిస్తితి ఏమిటి అన్న ఆలోచన, వివేకం లేకుండా, అర్థం చేసుకోకుండా, ఆవేశంగా ముందుకు దూకే స్వభావం ఉంటుంది. అవతలి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, తగాదాలు పెట్టుకుంటారు. కొన్ని సార్లు తమ వివేకం ఏ మాత్రం పనిచేయక, కేవలం ఆవేశంతో పనులు చేసి, చాలా ఇబ్బందుల పాలవుతారు.

ద్వితీయ భావంలో అంగారక యోగం:

జన్మకుండలిలో ద్వితీయ భావంలో అంగారక యోగం ఏర్పడిన జాతకులు చాలా దురుసుగా మాట్లాడే గుణాన్ని, కపటమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఏది మాట్లాడినా చాలా బిగ్గరగా మాట్లాడటం, అబద్ధాలు ఎక్కువగా చెప్పడం చేస్తారు. తమ చుట్టూ ఉన్నవారితో, తమ కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే పోట్లాడుతూ ఉంటారు. ఈ జాతకులకు డబ్బు సంపాదించాలి అనే ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది, దాని కోసం చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు.

తృతీయ భావంలో అంగారక యోగం:

అంగారక యోగం తృతీయ భావంలో ఏర్పడటం కాస్త అనుకూలం అనే చేపచ్చు. ఈ గ్రహస్తితి ఉన్న జాతకులు సర్జన్ గా గాని, వక్తగా, ఇతరులను తీవ్ర ప్రభావితం చేసే రచయితగా గాని అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాతకుల మాటలో ముక్కుసూటితనం, మోసం ఉంటుంది. ఈ సంగమం శుభ, మిత్ర రాశిలో జరిగితే జాతకుల యొక్క ప్రతిభకు ప్రశంసలు, సన్మానాలు, రివార్డులు లభిస్తాయి. ఈ సంగమం తృతీయంలో శతృరాశిలో జరిగితే, జాతకులకు ప్రతికూల విషయాల మీద ఇష్టం పెరుగుతుంది.

చతుర్థ భావంలో అంగారక యోగం:

మాతృ స్థానం అయిన చతుర్థ భావంలో అంగారక యోగం ఏర్పడితే, జాతకులకు తమ తల్లితో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడి ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడతాయి. ఈ సంగమం చతుర్థ భావంలో జరిగిన జాతకులకు తమ తల్లితోనే కాకుండా,  తమ కుటుంబ సభ్యులతో, తమ బంధువులతో ఉన్న భాంధవ్యం కూడా చెరిగిపోతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో జాతకులు తీవ్రంగా వాదిస్తూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతతని నెలకొల్పాలని ఈ జాతకులు తీవ్రంగా శ్రమిస్తారు. సంతానం వల్ల కూడా ఈ జాతకులకు తీవ్ర సమస్యలు వస్తాయి. నిర్మాణ రంగంలో లేదా రియల్ ఎస్టేట్ వంటి వృతి వ్యాపారాల మీద మక్కువ చూపిస్తారు.

పంచమ భావంలో అంగారక యోగం:

అంగారక యోగం పంచమ భావంలో ఏర్పడటం వల్ల జాతకులు కళల్లో, క్రీడల్లో, సాహసాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. వీటి వల్ల జాతకుల్లో తెలియని శక్తి ఏర్పడుతుంది. బెట్టింగులు, షేర్ మార్కెట్లు వంటి వాటిని తీరిక వేళల్లో చేస్తూ ఉంటారు. పేరు, ప్రతిష్ట, హోదా కోసం ఈ జాతకులు ప్రాకులాడుతూ ఉంటారు. ప్రేమ విషయాల్లో చాలా సార్లు భేధాలు రావచ్చు.

మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి. 

షష్ట్య భావంలో అంగారక యోగం:

షష్ట్య భావంలో అంగారక యోగం జరగడం వల్ల జాతకులకు వ్యాధులు, వృత్తి/ఉద్యోగం చేసే చోట విభేధాలు తలెత్తడం, పై అధికారులతో గొడవలు రావడం జరుగుతుంది. ప్రయాణం అనేది వీరు చేసే వృత్తిలో భాగం కావచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా ఈ జాతకులు గొడవలు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. కోర్టు కేసుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ భావంలో ఈ సంగమం జరగడం వలన జాతకునికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. పోటీల్లో విజయం సాధిస్తాడు. ఎలాంటి శతృవులనైనా ఓడించే సామర్థ్యం వీరికి ఉంటుంది.

సప్తమ భావంలో అంగారక యోగం:

వైవాహిక స్థానమైన సప్తమ స్థానంలో అంగారక యోగం ఏర్పడటం వలన భార్యా భర్తలు విడిపోవడం గాని, లేదంటే విడాకులు అవ్వడం గాని జరుగుతుంది. భూమి వంటి స్థిరాస్తుల నుండి ఈ జాతకులు లాభాలు ఘడిస్తారు. వివాహేతర సంబంధాలు ఉంటాయి.

అష్టమ భావంలో అంగారక యోగం:

ఈ అంగారక యోగం అష్టమ భావంలో ఏర్పడితే, జాతకులకు తమ అత్తామామలతో తీవ్రమైన గొడవలు జరుగుతాయి. దీని వల్ల మానసికమైన వ్యధ అనుభవించాల్సి ఉంటుంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు జరుగుతాయి. కొంతకాలానికి ఈ జాతకులకు ఆధ్యాత్మిక ధోరణి ఏర్పడుతుంది.

నవమ భావంలో అంగారక యోగం:

నవమ భావంలో అంగారక యోగం ఏర్పడినపుడు జాతకులు తమ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కల్పిస్తుంది. ఈ నవమ భావంలో ఈ సంగమం జరగడం వల్ల గురువులతో, మేధావులతో, ఉపాధ్యాయులతో వీరికి వాగ్వాదాలు తలపడచ్చు. నవమ భావంలో జరిగిన ఈ సంగమం శుభ రాశి అయితే, జాతకుడిని భక్తి పారవశ్యంలో మునిగేలా చేస్తుంది, అదే చెడు రాశిలో జరిగితే ఈ సంగమం జాతకుడిని పూర్తి నాస్తికుడిగా మారుస్తుంది.

దశమ భావంలో అంగారక యోగం:

దశమ భావంలో అంగారక యోగం ఏర్పడితే, ఆ జాతకులకు తమ పై అధికారులతో, తమ కన్నా వయస్సులో పెద్దవారితో భేదాభిప్రాయాలు ఏర్పడి గొడవలు జరుగుతాయి. చేసే వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పనిచేసే చోట చాలా ఇబ్బంది వాతావరణం ఉంటుంది. మెడిసిన్, ఫార్మసీ, నిర్మాణ రంగ వ్యాపారం వంటివి వీరికి అబ్బుతాయి. చమురు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ ఏజెన్సీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. జాతకులకు దూకుడు లక్షణం ఉన్న కారణంగా, వీరి పై అధికారులతో వీరి బంధం ప్రశ్నంతకంగా మారుతుంది.

ఏకాదశ భావంలో అంగారక యోగం:

ఏకాదశ భావంలో అంగారక యోగం ఏర్పడితే, అలాంటి జాతకులు తమ స్నేహితులతో, తమకన్నా పెద్దవారైన తోబుట్టువులతో గొడవలు వస్తాయి. ఈ జాతకులు అందరిలో సులభంగా కలసిపోగలరు. కానీ వీరికి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కకపోతే డీలా పడిపోతారు. వడ్డీ వ్యాపారం, మీడియా, సినిమా రంగం, షేర్ మార్కెట్లు వీరికి వృత్తిగా అబ్బుతాయి.

ద్వాదశ భావంలో అంగారక యోగం:

అంగారక యోగం ద్వాదశ భావంలో ఏర్పడిన జాతకులకు విదేశీయానం కలుగుతుంది. విలాసవంతమైన వస్తువుల మీద అధిక ఖర్చు చేస్తారు. అనుకోని విధంగా అధిక నష్టాలు వస్తాయి. ఈ జాతకులకు ఎవరి మీద అయినా పీకల లోతు కోపం ఉంటే, వారి మీద ఒక్కసారిగా విరుచుకుపడతారు. ఈ జాతకులకు కోపావేశాలు వస్తే మాత్రం, ఎలాంటి పనులకు తలపడతారో ఊహించడం కష్టం. గతంలో జరిగిన విషయాలను మనసులో ఉంచుకొని అవతలి వారితో గొడవ పడతారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారాలు, పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లాంటి వృత్తి, వ్యాపారాలు అబ్బుతాయి. 

మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Articles:

  1. వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు
  2. పూర్వ జన్మ కర్మ ఫలితాలు-వాటి అవయోగాల ఫలితాలు
  3.  కళత్ర దోషం అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
  4. NAGASHAKTHI Telugu Book
  5. జాతక పరిశీలన- Horoscope Reading
  6. ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
  7. విడాకులు-జ్యోతిష్య కారణాలు
  8. సర్పశాపం
  9. కాలసర్పయోగ నివృత్తి హోమం

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు తెలుసుకొనుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

గురు చండాల యోగం

 

గురుచండాల యోగం

జన్మకుండలిలో గురు గ్రహం కేతు లేదా రాహువు కలసి ఒకే భావంలో ఉండినట్లైతే గురు చండాల యోగం సంభావిస్తుంది. అనగా గురువు ఇచ్చే యోగాలను అన్నిటిని కూడా ఈ రాహు లేదా కేతు గ్రహాలు అడ్డుకుంటాయి. కొన్ని సంధర్భాలలో కేతువు శుభుడిగా ఉంటూ గురు గ్రహంతో కలసి ఒకే భావంలో ఉన్నట్లైతే అది ఒక శుభ యోగంగా చెప్పబడుతుంది. అదే గణేశ యోగం. జన్మకుండలిలో ఎవరికైతే గురు గ్రహం బలంగా ఉంటుందో, వారు సంపన్నులు అవుతారు, ఆధ్యాత్మిక భావనలో ఉంటారు, ఎంతో దయా హృదయం కలిగి ఉంటారు. ఈ గురు గ్రహమే జాతకుడిని పాలకుడిగా చేస్తుంది.

Telugu astrology
Guru Chandala Yogam

స్త్రీ జన్మకుండలిలో గురువు బలంగా ఉన్నట్లైతే తాను మంచి ఇల్లాలుగా మెదులుతుంది.

               పురుషుని జాతకంలో రాహువు అశుభుడుగా ఉండియనట్లైతే ఆ జాతకుడు స్వార్థపరుడిగా, కఠినాత్ముడిగా, కామ వాంఛ అధికంగా ఉంటాయి. అదే రాహువు స్త్రీ జన్మకుండలిలో అశుభుడిగా ఉంటే, ఆ స్త్రీ చాలా ధైర్యవంతురాలిగా, ఉత్సాహవంతురాలిగా ఉంటుంది. ఎన్నో భోగాలతో కూడిన జీవన శైలి ఏర్పడుతుంది.  వివాహం అయ్యాక కూడా ఇతరులతో అన్య పురుష సంబంధాలను కలిగి ఉంటారు.

               స్త్రీ జన్మకుండలిలో కేతువు అశుభుడిగా ఉంటే, ఆ స్త్రీ ఎంతో శక్తివంతురాలిగా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎంతో స్వార్థపరురాలిగా ఉంటుంది. తమ భర్తల నుండి దూరం కూడా కావచ్చు (ఇతర గ్రహస్థితులను బట్టి పరిపూర్ణంగా నిర్ణయించాలి). అదే ఒక పురుషుని జన్మకుండలిలో కేతువు అశుభుడిగా ఉంటే, వారు ఆధ్యాత్మిక ధోరణి, విరక్తి ధోరణి కలిగి ఉంటారు. పెళ్ళైన ఆడవారి పట్ల, భర్త చనిపోయిన ఆడవారి పట్ల వీరు ఆకర్షితులు అవుతారు.

 సాధరణంగా గురువు మరియు రాహువు యొక్క సంగమం మంచిది కాదు.  కాకపోతే గురుచండాల యోగం వల్ల కొన్ని మంచి, కొన్ని చెడు విషయాలు జరుగుతాయి. అవి ఎలా అనేది జన్మకుండలిలో గురు గ్రహం యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. ఈ గురు చడాల దోషం యొక్క తీవ్రత ఎంత దారుణంగా ఉంటుంది అనేది, జన్మకుండలిలోని గురు, రాహు యొక్క స్థానాలను బట్టి నిర్ణయించాలి. గురు చండాల యోగం వల్ల ఎలాంటి ప్రభావాలు ఏర్పడతాయో ఇక్కడ వివరిస్తున్నాను.

జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

    • దేనినైనా గుర్తించుకోవడానికి, ఆలోచనలు క్రమంగా ఉంచుకోవడానికి జాతకునికి కష్టంగా ఉంటుంది.
    • స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం జాతకునికి చాలా కష్టంగా ఉంటుంది.
    • మతపరమైన విషయంలో జాతకులు ఎప్పుడూ సంధిగ్ధంలోనే ఉంటారు. ఈ యోగానికి శని లేదా కుజ దృష్టి కూడా తోడైతే, జాతకులు మతమార్పిడికి పాల్పడతారు.
    • ఆర్థిక పరిస్తితి ఎప్పుడూ ఆగమ్యగోచరంగానే ఉంటుంది.
    • కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. తండ్రి, కొడుకుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. పిత్రార్జితం నష్టపోతారు.
    • జన్మకుండలిలో గురువు నీచంగా ఉన్నట్లైతే ఆస్తమా, పచ్చ కామెర్లు, హైపర్ టెన్షన్, ట్యూమర్లు, లివర్ సమస్యలు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
    • కొన్నిసార్లు జాతకుడు తీసుకునే నిర్ణయాలు అత్యంత ప్రమాదకరంగా కూడా మారతాయి.
    • బావ/ బావమరిది జాతకుడిని మోసం చేస్తారు. జాతకుల జీవితంలో తమ బావ/బావ మరిది తీవ్ర సమస్యలు తెస్తారు.
    • జీవిత భాగస్వామికి శారీరక బలహీనత్వం, బద్ధక లక్షణాలు ఉంటాయి.
    • వివాహం గురించి, కాబోయే జీవిత భాగస్వామి గురించి జాతకులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈ జాతకుల దంపతుల మధ్య నమ్మకం లోపించి, వీరి వైవాహిక జీవితం మొత్తం సమస్యల పుట్ట అవుతుంది.
    • గురువుల నుండి ఈ అవయోగం ఉన్నవారికి ఎంతో నమ్మకమైన వారి నుండి జాతకుడికి వచ్చే సూచనలు ఏవీ కూడా జాతకులకు అనుకూలంగా ఉండవు. నమ్మకద్రోహం జరుగును.
    • జాతకులు ఎన్నో పెద్ద చదువులు చదివినా కూడా వీరు చదివిన చదువుకు, చేసే వృత్తికి ఎలాంటి సంబంధం ఉండదు.
    • జాతకులు తమ ప్రాణ స్నేహితులతో తప్పించి వేరే ఎవరితోనూ సన్నిహితంగా వ్యవహరించలేరు.
    • జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండును.
    • వీరి జాతకంలో విదేశీ నివాస యోగం ఉండి ఉంటే, విదేశాలలో ధనవంతులు అవుతారు.
    • జీవిత భాగస్వామి ధనిక కుటుంబం నుండి వస్తే, వివాహం తరువాత ఈ గురుచండాల యోగం ఉన్న జాతకులకు ఎంతో సంపద వచ్చి పడుతుంది. అత్తగారి నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. జాతకుల వైవాహిక జీవితంలో వీరి ఆతగారి జోక్యం ఎక్కువగా ఉంటుంది.జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

గురు చండాల యోగం అనేది ఏఏ భావాలలో ఏర్పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నాను. గమనించండి.

లగ్న భావం: లగ్నంలో గురు చండాల యోగం ఏర్పడితే, జాతకుడు యొక్క స్వభావం అనుమానాస్పదంగా ఉంటుంది. జాతకులు డబ్బు, సంపద, భోగాలు అన్నీ ఉన్న అదృష్టవంతుడు అయినా సరే, స్వార్థం, అత్యాశ వీరిలో అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా తక్కువ. అదే ఒకవేళ, లగ్నంలో ఉన్న గురువు శుభుడిగా బలంగా ఉన్నట్లైతే, జాతకుడు ఎంతో మర్యాదస్తుడిగా, వివేకవంతుడిగా ఉంటాడు.

ద్వితీయ భావం: రెండవ భావంలో గురు చండాల యోగం ఏర్పడితే, గురువు బలంగా ఉన్నట్లైతే, జాతకుడు ఎంతో సంపన్నుడు, ధనవంతుడు అవుతాడు. అదే గురువు బలహీనంగా ఉన్నట్లైతే, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన తగాదాలు, ధన నష్టం, జీవితం అంతా భారంగా మారిపోతుంది.

తృతీయ భావం: మూడవ భావంలో గురు చండాల యోగం ఏర్పడితే, జాతకుడు ధైర్యవంతుడు, నాయకుడు అవుతాడు. ఒకవేళ జన్మకుండలిలో మూడవ భావంలో ఉన్న గురువు మీద కుజుడు యొక్క చెడు దృష్టి పడితే, జాతకుడు ముక్కుసూటిగా ఉంటాడు, ఎన్నో కుట్రపూరిత ఆలోచనలు చేస్తాడు.

చతుర్థ భావం: నాలుగవ భావంలో గురు చండాల యోగం ఏర్పడినా కూడా, ఈ భావం గురువుకి శుభ స్థానం అయితే, జాతకుడికి స్వగృహం, ఆస్తులు చేకూరుతాయి. అదే ఒకవేళ గురువు ఉన్న నాలుగవ స్థానం చెడు స్థానం అయితే జాతకుడికి సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు తలెత్తుతాయి.

పంచమ భావం: గురు చండాల యోగం అనేది అయిదవ భావంలో ఏర్పడితే, ఈ అయిదవ భావంలో ఉన్న గురువు శుభుడు అయితే, జాతకుడు మంచి విద్యావేత్త అవుతాడ్, గొప్ప వివేకం కలిగి ఉంటుంది. జాతకునికి ప్రతిభావంతులైన సంతానం కలుగుతుంది. ఈ అయిదవ భావంలో గురువు నీచపడ్డ, అశుభుడు అయితే, సంతానానికి సంబంధించి చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

షష్ట్య భావం: ఆరవ భావంలో గురు చండాల యోగం ఏర్పడి, కుజుడు చెడు దృష్టి గురువు మీద పడితే, జాతకుని కుటుంబ జీవితం మొత్తం కూడా సమస్యలతో నిండిపోయి ఉంటుంది. తన సొంత మతాన్ని తానే అగౌరవపరుస్తారు. అదే ఒకవేళ ఆరవ భావంలో ఉండే గురువు బలంగా ఉన్నట్లైతే, జాతకుడు ధనవంతుడు, సంపన్నుడు కాగలడు.

సప్తమ భావం: సప్తమ స్థానంలో గురు చండాల యోగం ఏర్పడినపుడు, జాతకుని వివాహిక జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ భావం మీద శుభ గ్రహాల దృష్టి మరేది లేకపోతే వైవాహిక జీవితంలో చాలా సమస్యలు వస్తాయి.

అష్టమ భావం: జన్మకుండలిలో అష్టమ భావంలో గురు చండాల యోగంతో గురువు చెడు స్థానంలో ఉన్నట్లైతే, గురు మహాదశలో యాక్సిడెంట్లు, తీవ్ర గాయాలు, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. చెడు స్థానంలో ఉన్న రాహు మహాదశలో జాతకుడి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది.

నవమ భావం: నవమ భావంలో గురు చండాల యోగం ఏర్పడి, ఈ నవమ భావ గురువు బలంగా ఉన్నట్లైతే జాతకుడికి అన్ని వైపుల నుండి సంపద వచ్చి పడుతుంది. అదే ఒకవేళ, గురువు నీచపడితే, జాతకునికి తండ్రితో సత్సంబంధాలు ఉండవు. జాతకునికి విజయం చాలా ఆలస్యంగా చేకూరుతుంది.

దశమ భావం: దశమ భావంలో గురు చండాల యోగం జరిగినపుడు జాతకునికి డబ్బు, హోదా, వృత్తి వ్యాపారాలలో విజయం అన్నీ ఉంటాయి, కానీ జాతకునికి నైతిక విలువలు తక్కువగా ఉంటాయి. సొంత వారిని కూడా నమ్మలేడు.

ఏకాదశ భావం: ఏకాదశ భావంలో ఏర్పడే గురు చండాల యోగం శుభంగా చెప్తారు. వివిధ రూపాలలో జాతకునికి డబ్బు రావడమే కాకుండా, సొంత కష్టంతో డబ్బు సంపాదించుకుంటారు, అలాగే వారసత్వ సంపద కూడా లభిస్తుంది.

ద్వాదశ భావం: గురువుకి ద్వాదశాధిపత్యం అస్సలు మంచిది కాదు. అది కూడా గురు చండాల యోగం ఈ ద్వాదశ భావంలో కలిగితే జాతకుడు ఎక్కడ ఏమి మాట్లాడినను దారునాలు జరుగును. జాతకుని మాట ఎక్కడా కూడా నెగ్గదు. అందరికీ తల వంచాల్సి ఉంటుంది.

 -C.V.S.చక్రపాణి,జ్యోతిష్య భూషణ Ph:9846466430

జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

 

Related articles:

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

జన్మకుండలిలో గ్రహ యోగాలు, అవయోగాల పరిశీలన

ముఖ్య గమనిక:

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. 

    Horoscope Reading Service









     

    జాతక విశ్లేషణ- Sample Horoscope reading

    పూర్వ జన్మ కర్మ ఫలితాలు-వాటి అవయోగాల ఫలితాలు

    పూర్వ జన్మ కర్మ ఫలితాలు-వాటి అవయోగాల ఫలితాలు

              మనలో ఎంతోమంది మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆ భగవంతుడు మన భవిష్యత్తుని ఏ విధంగా నిర్ణయించాడు, మన భవిష్యత్తుకి ఏఏ గ్రహాలు మనకు ఆటంకం కలిగిస్తున్నాయి అని తెలుసుకోవడానికి జ్యోతిష్య పండితుని వద్దకు వెళతారు. మీ పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలు జ్యోతిష్యునికి ఇచ్చిన తరువాత, ఆయన మీ జన్మకుండలిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రహాల స్థానాలు, బలాలు, గుణాలను బట్టి మీకున్న ప్రతికూల యోగాలను (దోషాలు), అనుకూల శుభ యోగాలను తెలియజేస్తారు. ఉదాహరణకు,మనిషి పుట్టినపుడు గ్రహాల యొక్క లక్షణాలు, బలాలను బట్టి అతని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి పుట్టిన సమయంలో అతని జన్మకుండలిలో శని, గురు గ్రహాలు ప్రతికూలంగా ఉంటే, ఆ శని,గురు గ్రహాల యొక్క ప్రతికూల శక్తి వల్ల జాతకునికి చెడు యోగాలు సంభవిస్తాయి. అదే విధంగా, జన్మకుండలిలో గురువు, శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే, జాతకునికి ఆ గ్రహాల యొక్క అనుకూల శక్తుల వల్ల అనుకూల శుభ యోగాలు సంభవిస్తాయి. కాని అసలు సందేహం ఇక్కడే వస్తుంది. ఒక్కో వ్యక్తికి గ్రహస్థితులు ఒక్కో విధంగా ఉంటాయి. ఫలానా వ్యక్తికి ఆ గ్రహ స్థితులే ఎందుకు ఏర్పడ్డాయి? అంటే ఇప్పుడు మనకు లభించిన జన్మకి, గత జన్మలకి ఏమైనా సంబంధం ఉందా? అని ఇలా సందేహాలు వస్తాయి.

          ఇప్పుడు మనకు భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మకి, మన గత జన్మలకి సంబంధం ఉంది. గత జన్మలో మనం చేసిన పుణ్యాలు, పాపాలు అన్నీ కూడా మన ఆత్మ ఒక పెన్ డ్రైవ్ లాగా స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాలి. ఆ పాప, పుణ్యాల ఫలితాలను, పాపాలకు ప్రతికూల యోగాలుగా, పుణ్యాలకు అనుకూల యోగాలుగా ఫలితాన్ని మనం ఈ జన్మలో అందుకుంటాము. ఫలానా సమయంలో పుట్టినందుకు మనకు ఈ గ్రహ స్థితులు ఏర్పడ్డాయని, అందుకే ఈ దోషాలు వచ్చాయని మనం అనుకుంటాము. కాని, మన గత జన్మ పాప, పుణ్య కర్మలకు అనుగుణంగా మనం అనుభవించాల్సిన చెడు, మంచి యోగాలు సంభవించే గ్రహస్థితులు ఏర్పడిన సమయంలోనే మనం జన్మిస్తాము. అంటే మనం మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ పుట్టాలి అనేది, గత జన్మలో మనం చనిపోయేటపుడే నిర్ణయించబడి ఉంటుంది. ఇక గత జన్మ మరణం తరువాత, అతని గత మంచి కర్మలకు వరాలను అందుకునే విధంగా, గత జన్మలో అతను చేసిన పాపాలకు శిక్ష అనుభవించే విధంగా ఉన్న గ్రహస్థితుల సమయంలో మళ్ళీ భూమి మీదకు వస్తాడు అన్నమాట. ప్రత్యేకంగా అదే గ్రహం ఎందుకని జాతకునికి ప్రతికూలంగా ఉంది, కొన్ని గ్రహాలు ఎందుకు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము.

    Karmic astrology telugu

    రవి: తండ్రి, ప్రభుత్వం, దేశ అధిపతులు, రాష్ట్ర అధిపతులు, పరిపాలకులు, నిర్వాహకులు వీరు అందరిని కూడా రవి గ్రహం సూచిస్తుంది. మగ బిడ్డ జననానికి కూడా రవి దోహదపడతాడు. రవికి సంబంధించిన వారికి గత జన్మలో చెడు కర్మలు చేసి ఉన్నట్లయితే, ఈ జన్మలో జాతకునికి రవి ప్రతికూలంగా ఉంటాడు. ఈ రవి యొక్క ప్రతికూల శక్తి ఎంత ఉంటుంది అనేది, జన్మకుండలిలో రవి యొక్క బలాన్ని బట్టి తెలుస్తుంది. గతంలో జాతకుడు ప్రత్యేకంగా ఎవరికి అయితే అన్యాయం లేదా కీడు చేసి ఉంటాడో, వారే ఈ జన్మలో ప్రతికూలంగా ఉంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే, ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావడం లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరమవ్వడం లేదంటే గతంలో తన తండ్రితో జాతకుడు ఏ విధంగా నడుచుకున్నాడో, అదే విధంగా ఈ జన్మలో జాతకుని కొడుకు జాతకునితో అలానే ప్రవర్తిస్తాడు.

                                  ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాము.  రవి గ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవడం లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావడం లాంటివి అన్నీ కూడా జరుగుతాయి. గత జన్మలో జాతకుడు ఏ బీజం అయితే వేశాడో, వాటి ఫలాలే ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అదే విధంగా, గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో, మరే ఇతర విధాలుగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే, ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షని అనుభవిస్తారు. ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవి గ్రహ వ్యతిరేకత వలన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.

    చంద్రుడు: చంద్రుడు తల్లిని, మనస్సుని, భావోద్వేగాలను సూచిస్తాడు. నదులు, సముద్రాలు, మానసిక నిపుణులు, మానసిక వైద్యులను చంద్రుడు సూచిస్తాడు. గత జన్మలో తల్లికి గాని లేదా తల్లి లాంటి ఆడవారికి చేసిన మంచి లేదా చెడు కర్మల ఆధారంగా ఈ జన్మలో చంద్రుని బలం అనేది నిర్ణయించబడుతుంది. అలాగే నదులు, సముద్రాలు వంటి పెద్ద వనరులకు చేసిన కర్మల ఆధారంగా కూడా జన్మకుండలిలో చంద్రుడు యొక్క బలం నిరూపణ అవుతుంది.

    గురువు: సాధువులు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, గురువులు, ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు ఇలా గురు స్థానంలో ఉన్న అందరిని, అన్నిటిని గురు గ్రహం సూచిస్తాడు. గురు గ్రహం ఆధిపత్యం వహించే వ్యక్తులకు, వస్తువులకు లేదా ప్రదేశాలకు గత జన్మలో మనం చేసిన మంచి లేదా చెడు కర్మల యొక్క ఆధారంగానే ప్రస్తుత జన్మలో గురు గ్రహానికి సంబంధించిన రంగాలలో మంచి లేదా చెడు ఫలితం అనేది ఉంటుంది. గత జన్మలో జాతకుడు గురు గ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే, ఈ జన్మలో గురు గ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది. లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే.

    శుక్రుడు: శుక్రుడు సూచించేవి ఎన్నో ఉన్నాయి. కాని జాతకుడు ముఖ్యంగా తన గత జన్మలో తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల గాని, భార్య లేదా భర్త పట్ల గాని, మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకొని ఉంటాడో, దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్ర బలం నిర్ణయించబడుతుంది. ఎవరైతే తన గత జన్మలో తమ భాగస్వాములను మోసం చేశారో, స్త్రీల పట్ల అగౌరవంగా ఉన్నారో, వారికి ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు, బాధలు జాతకునికి కలిగేలా చూస్తాడు. శుక్రుడు ప్రతికూలంగా ఉండటం వల్ల, ప్రేమించిన వారి చేతిలో మోసపోవడం, పెళ్లి చేసుకున్న వారి చేతిలో మోసపోవడం, అసలు నిజమైన, స్వచ్చమైన ప్రేమ అనేదే దక్కకపోవడం లాంటివి జరుగుతాయి. అదే విధంగా గత జన్మలో ఎవరైతే ఆడవారి పట్ల, తాము ప్రేమించిన వారి పట్ల, పెళ్ళి చేసుకున్న వారి పట్ల పూర్తి గౌరవంగా చూస్తూ, వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించిన వారికి, ఈ జన్మలో వారికి మంచి మనస్సుతో, తమని ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి లభిస్తారు. స్త్రీల నుండి గౌరవం లభిస్తుంది.

    జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

    కుజుడు: సోదరులు, స్నేహితులు, ఆయుధాలు, బలగం ఇవన్నీ కుజుడు సూచిస్తాడు. గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని, బలగాన్ని ఉపయోగించుకొని ఇతరులను అణగదొక్కి ఉంటారో, వారి బలాన్ని, బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో, తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో, తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను, స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో, వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ, అవే బాధలు, ఇబ్బందులు జాతకుడు పడేలా చేస్తాడు. అలాగే, కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద గాని, ఆయా రంగాలలో గాని సక్రమంగా నడుచుకొని ఉంటే, ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ, జాతకునికి మంచి స్నేహితులను, సోదరులను అందించి, కుజుడు ఆధిపత్యం వహించే రంగాలలో విజయాన్ని ప్రసాదిస్తాడు.  ఉదాహరణకు, గత జన్మలో ఒక వ్యక్తి తమ స్నేహితులతో మంచిగా నడుచుకొని, వారికి కావలసిన సమయాల్లో సహాయాన్ని అందించి ఉంటే, ఈ జన్మలో వారికి ఉన్న స్నేహితులు తమ కోసం ప్రాణాలు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేలా ఉంటారు.

    బుధుడు: కూతురు, సోదరీమణులు, కడుపులో బిడ్డ, 12 ఏళ్ల కంటే చిన్న వయసు పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు, ట్రేడింగ్, వ్యాపారం, వాక్కు, జ్ఞానం, జ్ఞాపకశక్తి, ఇవన్నీ కూడా బుధుడు సూచిస్తాడు. గత జన్మలో కూతురు, అక్కా, చెల్లి పట్ల చెడు కర్మలు చేయడం, వ్యాపారంలో మోసం చేయడం, మాటలతో అమాయకపు జనాలను మోసం చేయడం, వంటి వాటి వల్లే ఈ జన్మలో జన్మకుండలిలో బుధుడు చెడు స్థానంలో ఉంటాడు. బుధుడు సూచించే స్థలాలను, వ్యక్తులను, రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాలలో విజయాలను ప్రసాదిస్తాడు.

    శని: తక్కువ స్థాయిలో ఉండేవారు, తక్కువ కులం వారు, లేబర్ పనులు చేసేవారు, పనిమనుషులు, రోజువారి పనులు చేసే కూలీలు, గుడ్డివారు, భిక్షగాళ్ళు, పాములు, మద్యం వీటన్నిటిని శని సూచిస్తాడు. ఇక్కడ చెప్పిన వ్యక్తులకు ఎవరికైనా గాని గత జన్మలో ద్రోహం లేదా చెడు కర్మలు తలపెట్టి ఉంటే, ఈ జన్మలో శని ప్రతికూల స్థానంలో ఉంటూ తన ప్రతికూల శక్తిని జాతకుని మీద ప్రదర్శిస్తాడు. అదే ఒకవేళ, ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో శని వారికి అనుకూల శక్తిని ప్రసాదించి, అన్నింటా విజయం కలిగేలా చేస్తాడు.

    రాహువు: మామ, బావ మరిది, పక్షులు అందులోనూ ముఖ్యంగా కాకులు, చెత్తను సేకరించేవారు, ప్లంబర్లు, బాత్రూములను శుభ్రం చేసేవారు, రోడ్లు ఊడ్చేవారు,మానసిక రుగ్మతలు ఉన్నవారు వీరిని రాహువు సూచిస్తాడు. డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు, లాటరీలు, స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు, గుర్రపు పందెం లాంటి వాటి మీద బెట్టింగులు ఇవన్నిటిని కూడా రాహువు సూచిస్తాడు. రాహువు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో, వారికి ఈ జన్మలో రాహువు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తాడు. గత జన్మలో రాహువు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తామామలు దొరకడం, హటాత్తుగా లాటరీలు ద్వారా గాని లేదంటే స్టాక్ మార్కెట్ స్పెక్యూలేషన్ల ద్వారా గాని పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది.  

    కేతువు:  పుత్రులను, శిష్యులను, అనాధలను, కుక్కలను  ఈ కేతువు సూచిస్తాడు. మర్మ శాస్త్రాన్ని, క్షుద్ర విద్యలను కూడా కేతువు సూచిస్తాడు. కేతువు ఆధిపత్యం వహించే రంగాలలో లేదంటే వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ, తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తారు. జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులకు మంచి కర్మలు చేసి ఉంటె, ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు. అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి అయితే, ఈ జన్మలో తీవ్ర అపజయాలు, పేరు ప్రతిష్టల భంగం, కోర్టు కేసుల సమస్యలు, వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. కేతు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళనలు, మానసిక రుగ్మతలు, నిర్ణయాలు తీసుకోవడంలో లోపం, కనిపెట్టలేని వ్యాధులు లాంటివి వస్తాయి.

     

                   ఇలా ఇక్కడ చెప్పబడిన విధంగా, మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతకచక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు (మంచివైనా లేదా చెడు అయినా) మన మీద ఏ సమయంలో పడతాయి అనేది కూడా  జాతకచక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఏవేవి అని కనుక్కున్న తరువాత, వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తీవ్రత తగ్గుతుంది. ఉదాహరణకు, ఒకరికి జాతకములో శని తీవ్ర ప్రతికూలంగా ఉన్నారు అనుకుందాం. అందుకు ఆ వ్యక్తి శనీశ్వరునికి సంబంధించిన ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవాలి. అలాగే, తన వద్ద పనిచేసే పనివారి పట్ల, లేబర్ పట్ల మంచిగా నడుచుకోవాలి. ఇతరులకు సమస్యగా మారే మద్యాన్ని సేవించడం మానేయాలి. ఈ పనులన్నీ కూడా ఈ జాతకుడు తన పూర్వ జన్మలోనే చేసి ఉండాల్సిన పనులు. కాని చేయలేదు. అందుకనే వాటి ప్రభావం శని వ్యతిరేక స్థాన రూపంలో అనుభవిస్తున్నాడు. ఈ పరిహారాలు అన్నీ కూడా చక్కగా పాటించిన తరువాతే శని ఋణం తీరినట్టు అవుతుంది. గత జన్మలో చేసిన పాప భారాన్ని ఈ జన్మ వరకు మనిషి మోసుకొని వస్తాడు. వాటిని కనిపెట్టి, ప్రతికూల గ్రహాల ప్రభావాలను తగ్గించే పరిహారాలను తెలియజేసి జాతకుడిని సరైన మార్గంలో నడిచేలా చేయడమే జ్యోతిష్యుని ధర్మం. రోగికి వ్యాధి నివారణ కావాలంటే నిష్ణాతుడైన వైద్యుడు అవసరం ఉంటుంది. అదే విధంగా పూర్వజన్మ కర్మ ఫలితాలను మరియు గ్రహాల అవయోగాలను, యోగాలను తెలుసుకోవాలంటే పరిపూర్ణమైన జ్యోతిష్య పరిజ్ఞానం కలిగిన జ్యోతిష్యుడు అవసరం. గ్రహదోషాలను తొలగించుకోవాలని కోరుకున్న వారికి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలన్నా కూడా వారికి నుదుటన రాసి పెట్టి ఉండాలి. ప్రాప్తం అనుభోజ్యం అన్నమాటకి ఇదే ఉదాహరణ. పూర్వ జన్మల కర్మ ఫలాలు వ్యక్తులకు, వారికి మేలు జరిగే ప్రాయశ్చిత్తములను తెలియనీయవు. అదే పూర్వజన్మల గ్రహమాయ.

    జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

     

    Related Articles:

     

    బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు తెలుసుకొనుటకు సంప్రదించండి. 

     Ph: 9846466430

    Email: chakrapani.vishnumaya@gmail.com

     

    నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

    #astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

    ద్వికళత్ర యోగం/పునర్వివాహం

                                   ద్వికళత్ర యోగం/పునర్వివాహం

    మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు అయిపోతుంది. అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది. ఇంకొందరికి విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం జరిగి కోర్టు కేసులు, కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతుంటారు. ఇది వారి వారి జన్మకుండలిలోని కొన్ని గ్రహ స్థితుల వలన కలుగుతుంది. ఇంకొందరు వివాహము అయినప్పటికి, ద్వితీయ వివాహం జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకుంటారు.   ఇది ఇప్పటి కాలములో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఇది అందరి దంపతులకు జరుగదు. కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రమే జరుగుతాయి. అయితే ఈ వివాహేతర సంబంధములు గూర్చి తరువాత వివరిస్తాను. ఇప్పుడు ద్వితీయ వివాహముకు ఎలాంటి గ్రహ సన్నివేశములు ఉంటాయో మీకు తెలుపుతాను.

            జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి, ద్వితీయ వివాహానికి, విడాకులకు ముఖ్యంగా సప్తమ భావం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్న భావము-ఇది మన వ్యక్తిత్వము తెలియజేస్తుంది; ద్వితీయభావము మరియు ద్వితీయాధిపతి- ఇది మన కుటుంబ జీవనము, భార్య/భర్త ఆయుర్దాయము, ద్వితీయ వివాహ సందర్భములు ఏ విధంగా ఉన్నాయో సూచిస్తుంది; సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి- వివాహము, భర్త, భార్య గురించి తెలియజేస్తుంది; నవమ భావము మరియు నవమ భావాధిపతి- ద్వితీయ వివాహ సందర్భం గూర్చి తెలియజేస్తుంది; ఏకాదశ భావం మరియు ఏకాదశాధిపతి- అనుకున్న కోరికలు నెరవేరు సూచనల గూర్చి తెలియజేస్తుంది; గురువు- స్త్రీ జన్మకుండలిలో భర్త గురించి తెలియజేసే గ్రహం; శుక్రుడు- పురుష జన్మకుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం.

    ఈ భావములు, గ్రహ స్థానములు,రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భము ఉందా లేదా అన్న విషయము గ్రహించవచ్చు.

    ద్వికళత్ర యోగం/ పునర్వివాహం

    • స్త్రీ జన్మకుండలిలో 6వ స్థానములో శని, చంద్రులు కలసి ఉన్నట్లైతే ఆ జాతకులకు రెండు వివాహములు జరుగుతాయి. ఇదే గ్రహస్థితి పురుషుడికి ఉన్నట్లైతే భార్య మరణించును లేదా భార్య వీరిని వదిలి వెళ్లిపోవును.
    • 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండిన యెడల 2 వివాహములు జరుగును. కుజుడు 4,7,8,12 స్థానముల యందు ఉన్నట్లైతే జాతకునికి 2 వివాహములు జరుగును.
    • శని 2వ భావములో గాని, 7వ భావములో గాని రాహువుతో కలసి ఉండినా ద్వికళత్ర యోగం సంభవిస్తుంది.
    • శుక్రుడు పాపగ్రహములతో కలసి, 7వ స్థానాధిపతి నీచ పొందినా, 7వ స్థానమున పాపులు ఉన్ననూ పునర్వివాహ అవకాశములు ఉంటాయి.
    • పురుషునికి 7వ స్థానములో రవి, రాహువులు ఉన్నా, పరస్త్రీ సంగమం వల్ల తీవ్ర ధన నష్టం జరుగుతుంది.
    • శుక్ర, చంద్రులకు 7వ స్థానములో శని కుజులు ఉండినా భార్య పరాయి వ్యక్తితో వెళ్లిపోవును. సంతానాన్ని పొందలేరు.
    • శని, చంద్రుడు కలసి ఏడవ భావంలో ఉండినా ఆ స్త్రీకి రెండు వివాహములు జరుగును.
    • 2,7,6 స్థానాధిపతులు; 3,6,8,12 స్థానములందు ఉన్నా పునర్వివాహ సూచనలు వస్తాయి.
    • జన్మకుండలిలో సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి (బుధుడు, గురువు) ఉన్న రాశి ఈ రెండు ద్విస్వభావ రాశులు (కన్యారాశి, మిధునరాశి, ధను రాశి,మీనరాశి) అయితే, ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగే అవకాశము ఉంటుంది.
    • సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి, నవాంస చక్రములో మరియు భావచక్రములో సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే జాతకునికి రెండు వివాహములు జరుగు సూచనలు వస్తాయి.
    • వైవాహిక స్థానం అయిన 7వ స్థానముపై గాని లేదా సప్తమాధిపతి పై గాని 2 లేక 3 పాప గ్రహముల (శని, రవి, కుజ,రాహు, కేతు) దృష్టి ఉండినట్లైతే జాతకునికి ద్వితీయ వివాహం జరుగవచ్చు.
    • సప్తమాధిపతి మరియు లజ్ఞాధిపతి ఇద్దరు కలసి 11వ భావములో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహ అవకాశములు ఉంటాయి.
    • సప్తమములో 2 గాని లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు గాని శుక్రునితో కలసి 7వ భావములో ఉంటూ, ఆ సప్తమ భావముపై పాప గ్రహముల యొక్క దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు.
    • అష్టమాధిపతి లగ్నములో గాని లేదా సప్తమ భావములో గాని మరియు సప్తమధిపతి ద్విస్వభావ రాశిలో గాని లేదా శని,కుజ,రాహు,కేతు యొక్క పాప గ్రహముల దృష్టి సప్తమాధిపతి పై ఉన్నా జాతకునికి రెండవ వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి.
    • వైవాహిక స్థానాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావములో గాని, అష్టమ భావములో గాని లేదా 12వ భావములో గాని ఉండి మరియు కుజ, రాహు, కేతు, శని లాంటి పాప గ్రహములో సప్తమములో ఉండి, శుక్రుడు బలాహీనంగా నీచ లేదా శత్రు స్థానములో ఉన్నట్లైతే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది.

    కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక, విడిపోవడం గాని, ద్వితీయ వివాహము జరగడం గాని జరుగుతుంది. అయితే జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయము స్పష్టము చేయకూడదు.

    Related Articles:

    సర్ప నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

    బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.

     Ph: 9846466430

    Email: chakrapani.vishnumaya@gmail.com

    Follow us on Facebook

    Latest Topics

    Subscribe to our newsletter

    Please wait...
    Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
    X