loading

Category: Homam

  • Home
  • Category: Homam

బగలాముఖి హోమం Bagalamukhi homam

Bagalamukhi homam

బగలాముఖి హోమం

మన శత్రువులు మనకు ఎలాంటి కీడు జరుపకుండా ఉండేందుకు, బగలముఖి దేవి యొక్క పూజ, హోమాదులు, యంత్ర మంత్ర, తంత్ర సాధనలు  మనకు ఒక ఆయుధంగా నిలుస్తాయి. చట్టపరమైన సమస్యల నుండి, ఆపదల నుండి, అసహజ మరణం నుండి బగలాముఖి తల్లి తన భక్తులను రక్షిస్తుంది. శత్రువుల పై విజయం సాధించడానికి, శత్రు సంహారణ జరగడానికి బగలాముఖి తల్లి మనకు ఆయుధంగా నిలుస్తుంది. శత్రువుల యొక్క చెడు సంకల్పాన్ని, మనకు కీడు కలిగించే పనుల గురించి మన శత్రువులకు కలిగే ఆలోచనలను, శత్రువుల మాటను బగలాముఖి దేవి నాశనం చేస్తుంది. బగలాముఖి దేవి యొక్క పూజ, యంత్రసాధన లేదా హోమం వల్ల మన శత్రువులకు మనపై కీడు జరిపించాలనే ఆలోచన తొలగిపోవటమే కాకుండా, స్నేహంగా మెలుగుతారు. చేతబడి, నరదృష్టి లాంటి క్షుద్ర శక్తుల నుండి బగలాముఖి కాపాడుతుంది.

Bagalamukhi homam telugu astrology

చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే వారు, శ్రీ బగలాముఖి దేవి యొక్క యంత్ర సాధన గాని, హోమమును గాని ఆచరించిన వారికి మంచి ఫలితం దక్కుతుంది.

శతృనాశనం కొరకు, జీవితంలో విజయం, సౌభాగ్యం సాధించడం కొరకు, చేతబడి ప్రభావాలను పారద్రోలడానికి ఈ హోమమును జరిపించిన యెడల సకల శుభాలు కలుగజేసేలా ఆ దేవి మనలను అనుగ్రహిస్తుంది.

చట్టపరమైన వివాదాల నుండి శీఘ్రంగా బయట పడాలని కోరుకునే వారు శ్రీ C.V.S.చక్రపాణి గారు కేరళ వావిళ్యాపురంలో గల వారి తంత్ర పీఠంనందు నిర్వహించే తాంత్రిక బగలాముఖి హోమాన్ని జరిపించవచ్చు. ఈ హోమంలో స్వయంగా పాల్గొనలేనివారు జాతకుని ఫోటోను, వారు విడిచిన వస్త్రాన్ని ఉంచి హోమాన్ని జరిపించుకోవచ్చు. వివాదాల నుండి విముక్తులు కాగలరు.

గమనిక: చట్టపరమైన వివాదాలు నుండి అతి శీఘ్రంగా విముక్తి పొందాలంటే శ్రీ తంత్ర బగలాముఖి హోమమును మించి శాస్త్రంలో మరొకటి లేదు.

బగలాముఖి యంత్ర సాధన- ఫలితముల గురించి తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 

 

Related Articles:

సంపూర్ణ జాతక పరిశీలన

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

ఆయుష్ హోమం-Ayush Homam

                                   ఆయుష్ హోమం 

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో ఉన్న చెడు గ్రహ స్థానాల వల్ల కలిగే మానసిక, శారీరక అనారోగ్యాలను పారద్రోలడానికి, అకాలమృత్యు భయాన్ని తొలగించడానికి హైందవ సంస్కృతి, ఆచారం, వేదాలను అనుసరించి ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆయుష్ హోమం వల్ల ఆయుః దేవత సంతుష్టులై ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన దీర్ఘాయుషును ప్రసాదిస్తారు. మనకు ఆయుషును ప్రసాదించే దేవతే ఆయుః దేవత.

వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు అయిన భోధ్యాన మహర్షి రచించిన భోధ్యాన సూత్రాలలో ఈ ఆయుష్ హోమం యొక్క విశిష్టతను వివరించారు. జీవితం ఆనందంగా. ఆరోగ్యంగా, ధీర్ఘకాలం పాటు జీవించాలంటే ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహించాలి.

హైందవ పురాణాల్లో తెలియజేయబడ్డ ఏడుగురు చిరంజీవులు అయిన పరశురాముడు, హనుమంతుడు, అశ్వద్ధామ, బలి చక్రవర్తి, విభీషణుడు, కృపాచార్యులు- వీరందరిని ఈ ఆయుష్ హోమములో ఆవహింప చేసి వారి దీవెనలు, అనుగ్రహం జాతకులపై ప్రసరింప జేయటం జరుగుతుంది.

ఆయుష్ హోమం

పూర్వం వేద మహర్షులు పూర్ణాయుర్దాయం వల్ల కలిగే ప్రాముఖ్యతను ఎరిగిన వారు కాబట్టి, ఈ ఆయుష్ హోమాన్ని ఆచరించి, ఆయుష్ దేవతను సంతుష్టపరచి తమ జీవితకాలాన్ని పెంచుకునేవారు. దీనివల్ల ప్రపంచ శ్రేయస్సు కొరకు నెరవేర్చాల్సిన బాధ్యతలను పూర్తిచేసేవారు. ఈ ఆయుష్ హోమాన్ని సంవత్సరమునకు ఒకసారి జరిపించిన యెడల శుభం చేకూరును.

జన్మనక్షత్రం ప్రకారం వచ్చే తమ పిల్లల మొదటి పుట్టినరోజు నాడు ఈ ఆయుష్ హోమాన్ని జరిపిస్తే, పూర్వజన్మ కర్మ భారం తొలగిపోయి, ఇహ జన్మలో  ఆ భారం లేకుండా జీవితాన్ని అనుభవించగలడు. తన జీవితాన్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం పాటు జీవించగలరు. ఆ తరువాత 4,8, 17, 26, 35, 44, 53, 62, 71, 80 ఏటా ఈ ఆయుష్ హోమం ఆచరించడం వల్ల, ఈ హోమ ప్రభావం ఆరోగ్యంపై, మనస్సుపై అధికంగా పడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మానసిక లోపాలు ఈ హోమ ప్రభావం వల్ల తగ్గుముఖం పడతాయి. మానసికంగా లోపాలు, రుగ్మతలు కలిగిన వారికి ఈ హోమమ వల్ల తమ శరీరంలో ఉన్న చక్రాలను ఉత్తేజపరచి, మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. అనారోగ్యంతో బాధపడే చిన్నారులను ఆరోగ్యవంతంగా మార్చడానికి ఈ ఆయుష్ హోమం భగవంతుడు మనకు ప్రసాదించిన వరం. ఈ మధ్య కాలంలో జరిగే ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఆత్మాహుతి ధోరణి వల్ల, వాహన ప్రమాదాల వల్ల, ఇంకా ఎన్నో విధాలుగా అకాలమరణం పొందుతున్నారు. ఈ అసహజ, అకాల మరణాలకు వారి జన్మకుండలిలో ఉండే గ్రహస్థితులు కారణం అవుతాయి. అలాంటి దుర్భర సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ ఆయుష్ హోమం ద్వారా భగవంతుడిని ప్రార్థించాలి.

గమనిక:ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కాకుండా జన్మ నక్షత్రం నాడు ఈ ఆయుష్ హోమాన్ని జరిపించాలి.

జన్మకుండలిలో ఆయుః కారక గ్రహాలు చెడు స్థానాలలో ఉన్నట్లైతే ఆయుష్ హోమం జరిపించడం చాలా మంచిది. అష్టమంలో అనగా జన్మకుండలిలో లగ్నం నుండి 8వ స్థానంలో కుజుడు, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు వీరిలో ఏ ఒక్క గ్రహమైన ఉన్నట్లైతే ఆ జాతకునికి అపమృత్యుదోషం ఉన్నట్లే. ఇలాంటి గ్రహస్థితులు ఉన్నవారు ఆయుష్ హోమాన్ని జరిపించుకోవాలి.

సంపూర్ణ జాతక పరిశీలన

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.