చిన్నమస్తికా హోమం
దశమహావిద్యలలో అయిదవ మహావిద్యే ఈ చిన్నమస్తికా మాత. తంత్ర దేవతలైన దశమహావిద్యలలో ఒకరైన చిన్నమస్తికా దేవిని చిన్నమస్తా, ప్రచండ చండికా అని కూడా పిలుస్తారు. తన శిరస్సును తానే ఖడ్గముతో ఖండించుకొని, ఒక చేతిలో తను ఖండించుకున్న శిరస్సును, మరొక చేతిలో ఖడ్గమును పట్టుకొని, ఖండించుకున్న మెడ నుండి వచ్చే రక్త ప్రవాహం డాకిని, వర్ణని అను పరచారకులు మరియు తన శిరస్సు కలసి ఆ రక్తమును తాగుతూ ఉన్నట్టు, రతిక్రీడలో పాల్గొన్న జంటపై ఈ చిన్నమస్తికా దేవి నిలబడినట్టు, ఒక విధంగా ప్రాణదాతగా, మరొక విధంగా ప్రాణ సంహారిణిగా చిన్నమస్తికా దేవి మనకు దర్శనమిస్తుంది.
తంత్ర శాస్త్రంలో తంత్ర దేవత అయిన ఈ చిన్నమస్తికా దేవికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దశమహావిద్యల తంత్ర సాధనలో శీఘ్ర ఫలితాలు రావడానికి, సంతానం కలగడానికి, బాధల నుండి విముక్తి కలిగేందుకు, ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవడానికి, ఈ చిన్నమస్తికా దేవి తంత్ర సాధన ఎంతో అమోఘమైనది. ఈ చిన్నమస్తికా దేవి తంత్ర సాధన వల్ల లెక్కలేనన్ని అద్భుతాలను, ఫలితాలను చూడవచ్చు. ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, దీర్ఘాయువును చిన్నమస్తికా దేవి తన సాధకుడికి ప్రసాదిస్తుంది.
చిన్నమస్తికా దేవి సాధన వల్ల కలిగే ప్రయోజనాలు:
తంత్ర గురువు ఆధ్వర్యంలో, నియమనిష్టలతో ఈ చిన్నమస్తికా దేవి సాధనను ఆచరించాలి. కేవలం తంత్ర సాధన ద్వారా మాత్రమే కాకుండా, చిన్నమస్తికా దేవి యంత్ర పూజ, హోమము, నైవేద్యాలతో కూడా ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు. చిన్నమస్తికాదేవిని సంతుష్టపరిస్తే తన భక్తుని కోరికలను ఎంతో శీఘ్రంగా నెరవేర్చడమే కాకుండా ఆ తల్లి యొక్క సిద్ధి పొందిన సాధకులకు మానవాతీత శక్తులను అనుగ్రహిస్తుంది. మరొక అద్భుతమైన అంశం ఏమిటంటే చిన్నమస్తికా సాధనలో సిద్ధి పొందిన సాధకుడు అష్ట సిద్ధులు పొందుతాడు. దీని వల్ల సాధకునిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. శారీరక శక్తి, మానవాతీత శక్తులు లభిస్తాయి. జ్ఞానం, విజయం, మానసిక సంతృప్తి, ఆరోగ్యం, సంపద అన్నీ కూడా ఈ చిన్నమస్తికా దేవి సాధకుడికి అనుగ్రహిస్తుంది.
చిన్నమస్తికా దేవి పూజ వల్ల సామాజిక, ఆర్థిక, శారీరక దారిద్ర్యము తొలగిపోతుంది, కష్టాలు నుండి విముక్తి లభిస్తుంది, సంతాన లేమి తొలగిపోయి సంతానం ప్రాప్తిస్తుంది, రుణబాధలు తొలగిపోతాయి, పేదరికం నిర్మూలన జరుగుతుంది, మనోవికాసం, జ్ఞానం సంప్రాప్తిస్తాయి. అకాల మరణం నుండి సాధకుడు తప్పించుకుంటాడు. రాహువు యొక్క చెడు దృష్టిని తొలగిస్తుంది.
జ్యోతిష్య శాస్త్ర రీత్యా జన్మకుండలిలో రాహువు నీచ, శత్రు స్థానాలలో ఉండి దుష్పరిణామాలాను ఎదుర్కొంటున్న వ్యక్తులు, చిన్నమస్తా దేవి యంత్రమును పూజించి (21 రోజులు) చిన్నమస్తాదేవి తాంత్రిక హోమమును జరిపించుకోవడం వల్ల రాహుగ్రహ శాంతి కలిగి, రాహువు యొక్క చెడు దృష్టి జాతకునిపై తొలగి, రాహు అనుగ్రహమును పొందుతారు.
ఈ పూజను స్వయంగా చేసుకోలేని వారు శ్రీ C.V.S.చక్రపాణి గారు వావ్విల్యాపుర తంత్ర పీఠం నందు నిర్వహించే తాంత్రిక చిన్నమస్తికా దేవి హోమము నందు ప్రత్యక్షముగా గాని, పరోక్షంగా గాని పాల్గొనవచ్చు. రాహువు చెడు దృష్టి వల్ల జాతకులు నయవంచనకు గురి కావాల్సి వస్తుంది. అపహరణకు గురి కావలసి వస్తుంది. చట్ట సంబంధమైన వ్యవహారాలలో చిక్కుకొని బంధన యోగమును పొందాల్సి వస్తుంది. చేతబడులకు గురికావలసి వస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులకు మరియు తీవ్రమైన మనోవ్యధకు మానసిక ఒత్తిడికి గురి కావలసి వస్తుంది.
జన్మకుండలిలో రాహువు- వృశ్చికంలో లేదా మేషరాశి, కర్కాటకరాశి, సింహరాశి, కుంభరాశులలో ఉండినట్లైతే రాహువు దుష్పరిణామాలను కలుగజేస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ద్రవిడ తంత్ర శాస్త్రంలో రాహువు మేష, వృశ్చిక రాశులలో ఉండినట్లైతే సర్పశాపం లేదా నాగదోషం కలుగుతుందని క్షుణ్ణంగా వివరించబడింది. రాహువు యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ దుష్పరిణామాలను రాహువు చూపించగల శక్తి గలవాడు.
కావున, జాతకులు తమ జన్మకుండలిలో రాహువు చెడు స్థానాలలో ఉన్నప్పుడూ, రాహు మహాదశ- అంతర్దశ జరుగు సమయంలో, జన్మకుండలిలో మతిభ్రమణ యోగం ఉన్నప్పుడు ఈ “వామతంత్ర దశమహావిద్య తాంత్రిక చిన్నమస్తా దేవి హోమము“ను తప్పక జరిపించుకోవాలి. ఈ హోమమును జరిపించుకోవడం వల్ల రాహువు వల్ల కలిగే దుష్ట ప్రభావాలు అన్నీ కూడా దూరమవుతాయి.
చిన్నమస్తా దేవి మంత్రం:
“శ్రీం హ్రీం క్లీం ఐం వజ్రవైరోచనియే హుం హుం ఫట్ స్వాహా”
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles: