జీవితంలో ఆలస్యంగా విజయం అందించే రాజయోగాలు
జీవితంలో ఎంత కష్టపడినా ఆశించిన విజయం ఎందుకు లభించడం లేదనే విషయాన్ని గత ఆర్టికల్లో వివరించాను. మొదటి భాగాన్ని ఇక్కడ చదవండి .
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మకుండలిలోని లగ్నం, లాభ, కర్మ స్థానాలు, శని, రాహు, కేతు గ్రహాల విషయాలలో ఏ దోషములు కనబడినా కూడా, కొన్ని యోగాలు జాతకంలో ఉండటం వలన ఆ జాతకులకు విజయం ఆలస్యంగా అయినా సరే, తప్పక వరిస్తుంది. కొందరి జీవితంలో చిన్నతనం నుండి అనేక కష్టాలు ఎదుర్కొని, తరువాతి కాలంలో ఆర్థికాభివృద్ధి కలిగి, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ పరిస్థితికి జాతకంలో ఉన్న అవయోగాలు, యోగాలు రెండూ కారణం అవుతాయి. ఎన్నో కష్టాల తరువాత జాతకుడిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఆ యోగాల గురించి ఈరోజు తెలుసుకుందాము.

నీచభంగ రాజయోగం:
జ్యోతిష్య శాస్త్రంలో నీచభంగ రాజయోగం అంటే ఒక గ్రహానికి ఉన్న బలహీనత (నీచ స్థితి) తొలగిపోయి అనగా భంగపడి, ఆ బలహీనతే ఒక శక్తివంతమైన రాజయోగంగా మారుతుంది. ఈ యోగం ఉన్న జాతకులు తమ జీవితంలో మొదట్లో చాలా కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటారు. వాటన్నింటినీ దాటుకుని చివరకు అద్భుతమైన విజయాన్ని, ఉన్నత స్థానాన్ని అందుకోవడమే ఈ యోగం ప్రత్యేకత.
నీచభంగ రాజయోగం జాతకంలో ఉన్నట్టు ఎలా గుర్తించాలి?
- జన్మకుండలిలో ఏదైనా గ్రహం నీచ స్థానంలో ఉంటే, ఆ గ్రహం జాతకుడికి శుభ ఫలితాలను ఇవ్వలేదు. ఆ నీచ గ్రహానికి తోడుగా మరొక బలమైన లేదా ఉచ్చమైన గ్రహం తోడైతే, అప్పుడు నీచగ్రహం యొక్క బలహీనత తగ్గి, యోగం కలుగుతుంది. దీనినే నీచభంగరాజయోగంగా గుర్తించాలి.
- జన్మకుండలిలో నీచపడిన గ్రహం ఏ రాశిలో అయితే ఉందో, ఆ రాశి యొక్క అధిపతి ఉచ్చ స్థానంలో గాని లేదా కేంద్ర స్థానాల్లో ఉన్నా కూడా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది.
ఈ యోగం కారణంగా జాతకులు తమ జీవితం మొదటిలో ఎన్నో ఇబ్బందులు, తట్టుకోలేని సమస్యలు ఎదుర్కొంటారు. ఏ పని తలపెట్టినా విఫలం అవుతుంది. కానీ ఈ యోగం ఉన్న జాతకులకు వయసు పెరిగేకొద్ది, ఆ గ్రహాల యొక్క దశాంతర్దశలు జరుగుతున్న సమయంలో వీరిలో ఆత్మ విశ్వాసం పెరిగి, వీరు కూడా ఊహించనంత రీతిలో వీరికి విజయం లభిస్తుంది.
విపరీత రాజయోగం:
జ్యోతిష్య శాస్త్రంలో విపరీత రాజయోగం అనేది చాలా శక్తివంతమైన యోగంగా చెప్పవచ్చు. దీని పేరులో ఉన్నట్టుగానే, ‘విపరీతం’ అంటే ఊహించని పరిస్థితుల్లో ఏర్పడే రాజయోగం అన్నమాట. అనగా, వేరొకరి నష్టం వల్ల గాని లేదా హఠాత్తుగా వచ్చే సంక్షోభం వల్ల గాని జాతకునికి ఏర్పడే అద్భుతమైన రాజయోగం పట్టడమే ఈ విపరీత రాజయోగం.
మీకు అర్థమయ్యేలా ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఒకరి నష్టం, మరొకరికి లాభం’ అని గాని లేదంటే, ‘ఆపదల నుండి అదృష్టం రావడం’ అని గాని ఈ యోగానికి అర్థం చెప్పవచ్చు.
విపరీత రాజయోగం ఏ విధంగా ఏర్పడుతుంది?
జన్మకుండలిలో 6,8, 12 స్థానాలను దుస్థానాలుగా చెప్పబడ్డాయి. 6వ స్థానం, అప్పులు, రోగాలు, శత్రువులు, కోర్టు గొడవలను సూచిస్తుంది. 8వ స్థానం, ఆయుష్షు, హఠాత్తుగా వచ్చే ప్రమాదాలు, అవమానాలు, కష్టాలను సూచిస్తుంది. 12వ స్థానం, ఖర్చులు, నష్టాలు, జైలు శిక్షలు, ఒంటరి జీవనాన్ని సూచిస్తుంది. ఈ 3 స్థానాధిపతులు జాతకంలో ఎక్కడ ఉన్నా సరే సమస్యలను కలుగజేస్తారు. అయితే, ఈ మూడు స్థానాధిపతులు వేరే ఏ స్థానంలో కాకుండా వారిలో వారే అనగా, 6వ పతి 8 లేదా 12లో ఉండటం, 8వఅధిపతి 6 లేదా 12వ భావంలో ఉండటం, 12వ అధిపతి 6 లేదా 8వ స్థానంలో ఉంటే, ఆ జాతకులకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది.
ఈ జ్యోతిష్య పరిభాష మీకు అర్థంకాకపోవచ్చు. మీకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాను. శతృవులు ఒకరి ఇంట్లో మరొకరు వెళ్ళి ఉండటం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే, శత్రువులు తమలో తామే కొట్టుకుని చనిపోయి, జాతకుడికి లాభం చేకూర్చడం అన్నమాట.ఇలా జరిగినప్పుడు “మైనస్ x మైనస్ = ప్లస్” అయినట్టు, ఆ చెడు ప్రభావాలన్నీ కలిసి జాతకుడికి ఒక సానుకూల శక్తిగా మారుతుంది.
ఈ యోగం వలన జాతకునికి ఏ విధమైన ప్రభావాలు ఎదురవుతాయి?
- జన్మకుండలిలో విపరీత రాజయోగం ఉన్న జాతకులకు ఎంతో సాధరణంగా సాగుతున్న తమ జీవితంలో అనుకోని మార్పులు వచ్చేసి, కోటీశ్వరులు అవుతారు. అనుకోకుండా లాటరీ తగలడం గాని, ఊహించని రీతిలో పెద్ద విదేశీ ప్రాజెక్టు దక్కడం గాని, ఇన్సూరెన్సు డబ్బులు రావడం గాని, మొదలైన విధాలుగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
- ఉద్యోగం చేసే జాతకులకు అయితే, తాము పనిచేసే ఆఫీసులో తమ పై అధికారి ఉన్నట్టుండి ఉద్యోగం మానేయడం వల్లనో, లేదా చనిపోవడం వల్లనో, లేదా ఏదైనా పెద్ద స్కామ్ జరిగి అందరూ పక్కకి తప్పుకోవడం వల్లనో, ఆ ఖాళీ అయిన పదవీ లేదా భాద్యత జాతకునికి అనుకోకుండా వస్తుంది.
- పోటీ రంగంలో ఉన్న జాతకులకు అయితే, వీరితో పోటీ పడే వారు, స్వయంకృత అపరాధం వలన పోటీ నుండి తప్పుకోవడం గాని లేదా పోటీలో దెబ్బ తినడం గాని జరిగి, వీరికి విజయాన్ని అందిస్తారు.
ఈ యోగం ఉన్న జాతకులు కూడా మొదట్లో ఎన్నో ఒత్తిళ్ళు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొంటారు. కానీ ఈ విపరీతరాజయోగం ఫలితాలు ఇచ్చే సమయం వచ్చినపుడు, వీరికి వచ్చే విజయం మాటల్లో వర్ణించలేము.
ధర్మకర్మాధిపతి యోగం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 9వ స్థానాన్ని ధర్మ స్థానం లేదా భాగ్య స్థానం అని అంటారు. 10వ స్థానాన్ని రాజ్య స్థానం లేదా కర్మ స్థానం అంటారు. ఈ నవమ మరియు దశమ స్థానాధిపతులు ఇద్దరి మధ్య సానుకూల సంబంధం ఉండి, 6,8,12 వంటి దుస్థానాలలో ఉండకపోతే, ఆ జాతకులకు ధర్మకర్మాధిపతి యోగం ఉన్నట్టు గుర్తించాలి.
మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, జాతకంలో అత్యున్నతమైన అదృష్టం (భాగ్యం) మరియు అత్యున్నతమైన అధికారం (ఉద్యోగం/కీర్తి) రెండు చేతులు కలిపితే ఏర్పడే అద్భుతమైన యోగం ఇది. ఈ యోగం ఉన్న జాతకుడు సమాజంలో అపారమైన గౌరవాన్ని, ఉన్నత పదవులను, సంపదను పొందుతాడు.
ఈ యోగం వలన జాతకుడికి ఏ విధమైన ప్రభావాలు ఏర్పడతాయి?
జన్మకుండలిలో ధర్మకర్మాధిపతి యోగం ఉన్న జాతకులు తాము చేసే ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపార వేత్తల జన్మకుండలిలో ఈ యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యోగం వలన ఈ జాతకులు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కూడా, గర్వం, పొగరు లేకుండా ఒదిగి ఉంటారు. అడ్డదారుల్లో కాకుండా, ధర్మబద్ధంగా సంపాదిస్తారు. సమాజానికి మంచి చేయాలనే తపన ఉంటుంది. ఈ యోగం ఉన్న జాతకులు ఏ పని చేసినా సరే, 9వ స్థానం వలన అదృష్టం తోడై, దశమ స్థానం వలన వారి యొక్క వృత్తి లేదా వ్యాపారం రాకెట్లాగా దూసుకుపోతుంది.
నవమ స్థానం అనగా పితృ స్థానముగా కూడా చెప్పబడుతుంది. తండ్రి తరపున ఆస్తులు జాతకులకు కలసిరావడం గాని లేదా తండ్రి యొక్క ప్రోద్బలం, సహకారంతో అంచలంచెలు ఎదగడం గాని జరుగుతుంది.
ఈ జాతకులకు కూడా మొదట్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతో ధైర్యంతో తట్టుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు, 9, 10 వ స్థానాధిపతుల యొక్క మహాదశ, అంతర్దశల సమయంలో ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి.
గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నా విజయం ఎందుకు ఆలస్యమవుతుంది?
జాతకంలో ఇప్పుడు వివరించిన మంచి యోగాలు ఉన్నప్పటికీ, జాతకులు ఆశించిన ఫలితాలు వెంటనే లభించకపోవచ్చు. దీనికి ముఖ్యమైన కారణాల్లో మాహాదశ, అంతర్దశల ప్రభావం కూడా ఒకటి. సమయం వస్తే అన్నీ వాటంతటే అవే జరుగుతాయి అని పెద్దలు మనకు చెప్తుంటారు కదా. దాని అర్థం కూడా ఇదే. ఒక గ్రహం జాతకంలో మంచి ఫలితాలను ఇచ్చే స్థితిలో ఉన్నప్పటికీ, ఆ గ్రహానికి సంబంధించిన దశ లేదా అంతర్దశ సమయం రాకపోతే, ఆ జాతకునికి విజయం ఆలస్యం అవుతుంది.
- ఇప్పుడు జాతకంలో విజయం వరించే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏమి పరిశీలించాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయం, అభివృద్ధి, స్థిరత్వం వంటి అంశాలను పరిశీలించడానికి ఈ క్రింది విషయాలను సమగ్రంగా విశ్లేషించాలి.
- లగ్నం మరియు లగ్నాధిపతి బలం.
- ఆరవ భావం, దాని అధిపతి స్థితి.
- నవమ భావం మరియు భాగ్యాధిపతి.
- దశమ భావం, దశమాధిపతి స్థితి.
- ఏకాదశ భావం మరియు లాభాధిపతి.
- రవి, గురుడు, శని వంటి గ్రహాల యొక్క స్థితి, బలం.
- రాజయోగాలు, ధనయోగాలు, ఇతర శుభయోగాలు.
- ప్రస్తుత మహాదశ, అంతర్దశల ప్రభావం.
ఈ అంశాలన్నింటినీ కలిపి విశ్లేషించినప్పుడే ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, అభివృద్ధి అవకాశాలు, విజయం లభించే అనుకూల కాలాల గురించి సమగ్రంగా అర్థం చేసుకోవచ్చు.
- చివరగా నేను చెప్పాలనుకున్నది:
జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయని, అనుకున్న విజయం రావడం లేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదుగుదల ఒకే సమయంలో, ఒకే విధంగా ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మకుండలిలోని గ్రహస్థితులు, యోగాలు, దశలు, అంతర్దశలు, వ్యక్తి జీవితంలోని అనుకూల, ప్రతికూల కాలాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
మీ జన్మకుండలిలో ఏ గ్రహస్థితులు ఉన్నాయి? అవి మీ వృత్తి, ఆర్థిక స్థితి, అదృష్టం, జీవిత అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అనే విషయాలను అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని ద్వారా సమగ్రంగా పరిశీలించుకోవడం మంచిది.
ముఖ్య గమనిక: ఆలస్యంగా వచ్చే విజయం కూడా విజయమే. మీ జాతకంలోని గ్రహస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలోని అనుకూల సమయాలను గుర్తించవచ్చు. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి.
Related Articles:
- శని చూపించు విషతుల్య యోగం యొక్క ప్రభావములు
జన్మకుండలిలో గురువు అనుకూలంగా ఉంటే, ప్రతికూలంగా ఉంటే ఫలితాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
