loading

Month: November 2026

జాతకంలో ఆరవ స్థానం: రుణాలు, రోగాలు, శత్రువుల వెనుక అసలు రహస్యం!

జాతకంలో 6వ స్థానం అంటే కేవలం రుణాలు, రోగాలు, శత్రువులేనా? దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి?

జన్మకుండలిలో 6,8, 12 వ స్థానాలను దుస్థానాలుగా ప్రస్తావిస్తారు. అయితే ఈ దుస్థానాల వల్ల ఎన్నో సమస్యలను జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ స్థానాలలో ఉన్న గ్రహాలను బట్టి, వాటి బలములను బట్టి, జాతకుడి యొక్క ఫలితములు ఆధారపడి ఉంటాయి. అష్టమ స్థానం గురించి నేను ఇదివరకే వివరించాను. దాని గురించి ఇక్కడ చదవండి. ఇప్పుడు 6వ స్థానం గురించి వివరిస్తాను.

  1. జాతకంలో ఆరవ స్థానం దేనిని సూచిస్తుంది?

               జన్మకుండలిలో 6వ స్థానమును శతృ, రోగ, ఋణ స్థానముగా చెప్పబడుతుంది. జాతకుడికి వచ్చే అనారోగ్య సమస్యలను, ఋణాలను, శతృవులను, కోర్టు సమస్యలను, జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఈ 6వ భావం తెలియజేస్తుంది. వీటితో పాటుగానే జాతకుడికి ఉన్న క్రమశిక్షణ, రోజు వారి బాధ్యతలు, జాతకుడు చేసే సేవలు, జాతకుడు ఎదుర్కొనే క్లిష్టమైన పరిస్థితులు, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలను కూడా ఈ 6వ స్థానం తెలియజేస్తుంది.

               సులభంగా చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఉదాహరణకు, ఒక వ్యక్తి అప్పులు చేసి ఉంటాడు అనుకుందాము. కానీ దానిని తిరిగి చెల్లించడానికి ఆదాయం లేక, మళ్ళీ అప్పు చేయడం, అలా అప్పులు పెరుగుతూనే ఉంటాయి అనుకుందాం. మరి ఆ అప్పులను తిరిగి చెల్లించడానికి జాతకుడు ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు? ఆర్థిక బాధ్యతలను ఏ విధంగా నిర్వహించగలుగుతాడు?తోటి ఉద్యోగులతో లేదా పై అధికారులతో వీరికి ఏ విధమైన బంధం ఉంటుంది? ఏ విధమైన వివాదాలలో చిక్కుకుంటారు? ఇలాంటివి అన్నీ కూడా జాతకుడి యొక్క 6వ స్థానం ద్వారా తెలుస్తుంది.

               జీవితంలో ఎక్కువగా దెబ్బ తీసే అంశాలలో అప్పులు, అనారోగ్య సమస్యలు, కోర్టు వివాదాలు, పోటీలు, శతృత్వాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ 6వ స్థానంలో పాప లేదా నీచ గ్రహం ఉన్నట్లైతే, జాతకుడికి ఈ సమస్యల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆ గ్రహ సంబంధిత మహాదశ, అంతర్దశ సమయాలలో ఎక్కువగా ఉంటుంది.

  1. ఆరవ స్థానం ఉపచయ స్థానం కూడా!

ఆరవ స్థానం కేవలం శతృ, రోగ, ఋణ స్థానమే కాకుండా, ఉపచయ స్థానంగా కూడా చెప్పబడుతుంది. జీవితంలో ఎంత కష్టపడినా కూడా ఎందుకు విజయం రావడం లేదు? అన్న అంశాన్ని ఇదివరకే వివరించాను. ఇక్కడ చదవవవ్చు. ఉపచయం అంటే కాలక్రమేణా అభివృద్ధి చెందడం లేదా వృద్ధి చెందడం అని అర్థం. ఈ స్థానానికి సంబంధించిన ఫలితాలు జాతకుడి యొక్క వయస్సు, అనుభవం, ప్రయత్నం, పరిస్థితులను ఎదుర్కొనే విధానం ఆధారంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ అంశం తెలుసుకొనుటలో ఈ ఆరవ స్థానం కీలక పాత్రను పోషిస్తుంది.

  1. ఆరవ స్థానం శత్రువులను మాత్రమే కాదు, వారిని ఎదుర్కొనే శక్తిని కూడా సూచిస్తుంది

ఆరవ స్థానం శతృవులను కూడా సూచిస్తుంది అని చెప్పుకున్నాము కదా. అయితే, మనకు శత్రువులు ఉన్నారు అంటే, వారు తప్పక మనకు హాని కలుగజేస్తారు అని అర్థం కాదు. జాతకుడు తన శతృవులను జయించగలడా? శత్రువుల చేతిలో మోసపోతాడా? ఈ అంశాలు అన్నీ కూడా ఈ ఆరవ స్థానం ద్వారా తెలుసుకోవచ్చును. కానీ నేటి ఆధునిక జీవితంలో శత్రుత్వం, పోటీ అనేవి అనేక రూపాల్లో కనిపిస్తాయి.

ఉద్యోగంలో సహోద్యోగులతో ఎదురయ్యే పోటీ, వ్యాపారంలో పోటీదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లు, కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు, పోటీ పరీక్షల్లో ఇతర అభ్యర్థులతో పోటీ, మన ఎదుగుదలకు అడ్డంకిగా మారే వ్యక్తులు లేదా పరిస్థితులు, మనల్ని దెబ్బ తీయాలని మనపై చేసే కుట్రలు, మనపై చేసే అభిచార కర్మలు అనగా చేతబడులు, మనపై చేసే పన్నాగాలు వంటివి అన్నీ కూడా ఈ ఆరవ స్థానం తెలియజేస్తుంది. శతృవుల చేతిలో జాతకుడు దెబ్బ తింటాడా? లేక శతృవులను జయిస్తాడా? అన్న అంశములు కూడా జన్మకుండలిలోని ఈ ఆరవ స్థానమే తెలియజేస్తుంది.

శతృవులను జయించడానికి ఏ విధమైన గ్రహస్థితి ఉండాలి?

జన్మకుండలిలో ఆరవ స్థానం అనుకూలంగా ఉండి, ఆరవ స్థానాధిపతి కూడా బలంగా ఉన్నప్పుడు జాతకులకు ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం, పోటీలో నిలబడే శక్తి ఉంటుంది. ప్రత్యర్థులు ఉన్నప్పటికీ వారిని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఈ విధమైన గ్రహస్థితి ఉన్న జాతకులు తమ శతృవుల పై విజయం సాధిస్తారు.

మరి మీ జన్మకుండలిలో ఆరవ స్థానం మీ ఋణ, శత్రు, రోగముల గురించి ఏమి చెబుతోంది? ఇది తెలియాలంటే నిష్ణాతులైన జ్యోతిష్యుల చేత మీ జన్మకుండలి పరిశీలన చేయించుకోవాలి.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి. 

Related Articles: 

జీవితంలో ఆలస్యంగా విజయం అందించే రాజయోగాలు

జీవితంలో ఆలస్యంగా విజయం అందించే రాజయోగాలు

               జీవితంలో ఎంత కష్టపడినా ఆశించిన విజయం ఎందుకు లభించడం లేదనే విషయాన్ని గత ఆర్టికల్‌లో వివరించాను. మొదటి భాగాన్ని ఇక్కడ చదవండి .

               జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మకుండలిలోని లగ్నం, లాభ, కర్మ స్థానాలు, శని, రాహు, కేతు గ్రహాల విషయాలలో ఏ దోషములు కనబడినా కూడా, కొన్ని యోగాలు జాతకంలో ఉండటం వలన ఆ జాతకులకు విజయం ఆలస్యంగా అయినా సరే, తప్పక వరిస్తుంది. కొందరి జీవితంలో చిన్నతనం నుండి  అనేక కష్టాలు ఎదుర్కొని, తరువాతి కాలంలో ఆర్థికాభివృద్ధి కలిగి, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ పరిస్థితికి జాతకంలో ఉన్న అవయోగాలు, యోగాలు రెండూ కారణం అవుతాయి. ఎన్నో కష్టాల తరువాత జాతకుడిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఆ యోగాల గురించి ఈరోజు తెలుసుకుందాము.

  1. నీచభంగ రాజయోగం:

జ్యోతిష్య శాస్త్రంలో నీచభంగ రాజయోగం అంటే ఒక గ్రహానికి ఉన్న బలహీనత (నీచ స్థితి) తొలగిపోయి అనగా భంగపడి, ఆ బలహీనతే ఒక శక్తివంతమైన రాజయోగంగా మారుతుంది. ఈ యోగం ఉన్న జాతకులు తమ జీవితంలో మొదట్లో చాలా కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటారు. వాటన్నింటినీ దాటుకుని చివరకు అద్భుతమైన విజయాన్ని, ఉన్నత స్థానాన్ని అందుకోవడమే ఈ యోగం ప్రత్యేకత.

నీచభంగ రాజయోగం జాతకంలో ఉన్నట్టు ఎలా గుర్తించాలి?

  • జన్మకుండలిలో ఏదైనా గ్రహం నీచ స్థానంలో ఉంటే, ఆ గ్రహం జాతకుడికి శుభ ఫలితాలను ఇవ్వలేదు. ఆ నీచ గ్రహానికి తోడుగా మరొక బలమైన లేదా ఉచ్చమైన గ్రహం తోడైతే, అప్పుడు నీచగ్రహం యొక్క బలహీనత తగ్గి, యోగం కలుగుతుంది. దీనినే నీచభంగరాజయోగంగా గుర్తించాలి.
  • జన్మకుండలిలో నీచపడిన గ్రహం ఏ రాశిలో అయితే ఉందో, ఆ రాశి యొక్క అధిపతి ఉచ్చ స్థానంలో గాని లేదా కేంద్ర స్థానాల్లో ఉన్నా కూడా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది.

ఈ యోగం కారణంగా జాతకులు తమ జీవితం మొదటిలో ఎన్నో ఇబ్బందులు, తట్టుకోలేని సమస్యలు ఎదుర్కొంటారు. ఏ పని తలపెట్టినా విఫలం అవుతుంది. కానీ ఈ యోగం ఉన్న జాతకులకు వయసు పెరిగేకొద్ది, ఆ గ్రహాల యొక్క దశాంతర్దశలు జరుగుతున్న సమయంలో వీరిలో ఆత్మ విశ్వాసం పెరిగి, వీరు కూడా ఊహించనంత రీతిలో వీరికి విజయం లభిస్తుంది.   

  1. విపరీత రాజయోగం:

జ్యోతిష్య శాస్త్రంలో విపరీత రాజయోగం అనేది చాలా శక్తివంతమైన యోగంగా చెప్పవచ్చు. దీని పేరులో ఉన్నట్టుగానే, ‘విపరీతం’ అంటే ఊహించని పరిస్థితుల్లో ఏర్పడే రాజయోగం అన్నమాట. అనగా, వేరొకరి నష్టం వల్ల గాని లేదా హఠాత్తుగా వచ్చే సంక్షోభం వల్ల గాని జాతకునికి ఏర్పడే అద్భుతమైన రాజయోగం పట్టడమే ఈ విపరీత రాజయోగం.

మీకు అర్థమయ్యేలా ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఒకరి నష్టం, మరొకరికి లాభం’ అని గాని లేదంటే, ‘ఆపదల నుండి అదృష్టం రావడం’ అని గాని ఈ యోగానికి అర్థం చెప్పవచ్చు.

విపరీత రాజయోగం ఏ విధంగా ఏర్పడుతుంది?

జన్మకుండలిలో 6,8, 12 స్థానాలను దుస్థానాలుగా చెప్పబడ్డాయి. 6వ స్థానం, అప్పులు, రోగాలు, శత్రువులు, కోర్టు గొడవలను సూచిస్తుంది. 8వ స్థానం, ఆయుష్షు, హఠాత్తుగా వచ్చే ప్రమాదాలు, అవమానాలు, కష్టాలను సూచిస్తుంది. 12వ స్థానం, ఖర్చులు, నష్టాలు, జైలు శిక్షలు, ఒంటరి జీవనాన్ని సూచిస్తుంది. ఈ 3 స్థానాధిపతులు జాతకంలో ఎక్కడ ఉన్నా సరే సమస్యలను కలుగజేస్తారు. అయితే, ఈ మూడు స్థానాధిపతులు వేరే ఏ స్థానంలో కాకుండా వారిలో వారే అనగా, 6వ పతి 8 లేదా 12లో ఉండటం, 8వఅధిపతి 6 లేదా 12వ భావంలో ఉండటం, 12వ అధిపతి 6 లేదా 8వ స్థానంలో ఉంటే, ఆ జాతకులకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది.

               ఈ జ్యోతిష్య పరిభాష మీకు అర్థంకాకపోవచ్చు. మీకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాను. శతృవులు ఒకరి ఇంట్లో మరొకరు వెళ్ళి ఉండటం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే, శత్రువులు తమలో తామే కొట్టుకుని చనిపోయి, జాతకుడికి లాభం చేకూర్చడం అన్నమాట.ఇలా జరిగినప్పుడు “మైనస్ x మైనస్ = ప్లస్” అయినట్టు, ఆ చెడు ప్రభావాలన్నీ కలిసి జాతకుడికి ఒక సానుకూల శక్తిగా మారుతుంది.

ఈ యోగం వలన జాతకునికి ఏ విధమైన ప్రభావాలు ఎదురవుతాయి?

  • జన్మకుండలిలో విపరీత రాజయోగం ఉన్న జాతకులకు ఎంతో సాధరణంగా సాగుతున్న తమ జీవితంలో అనుకోని మార్పులు వచ్చేసి, కోటీశ్వరులు అవుతారు. అనుకోకుండా లాటరీ తగలడం గాని, ఊహించని రీతిలో పెద్ద విదేశీ ప్రాజెక్టు దక్కడం గాని, ఇన్సూరెన్సు డబ్బులు రావడం గాని, మొదలైన విధాలుగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
  • ఉద్యోగం చేసే జాతకులకు అయితే, తాము పనిచేసే ఆఫీసులో తమ పై అధికారి ఉన్నట్టుండి ఉద్యోగం మానేయడం వల్లనో, లేదా చనిపోవడం వల్లనో, లేదా ఏదైనా పెద్ద స్కామ్ జరిగి అందరూ పక్కకి తప్పుకోవడం వల్లనో, ఆ ఖాళీ అయిన పదవీ లేదా భాద్యత జాతకునికి అనుకోకుండా వస్తుంది.
  • పోటీ రంగంలో ఉన్న జాతకులకు అయితే, వీరితో పోటీ పడే వారు, స్వయంకృత అపరాధం వలన పోటీ నుండి తప్పుకోవడం గాని లేదా పోటీలో దెబ్బ తినడం గాని జరిగి, వీరికి విజయాన్ని అందిస్తారు.

ఈ యోగం ఉన్న జాతకులు కూడా మొదట్లో ఎన్నో ఒత్తిళ్ళు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొంటారు. కానీ ఈ విపరీతరాజయోగం ఫలితాలు ఇచ్చే సమయం వచ్చినపుడు, వీరికి వచ్చే విజయం మాటల్లో వర్ణించలేము.

  1. ధర్మకర్మాధిపతి యోగం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 9వ స్థానాన్ని ధర్మ స్థానం లేదా భాగ్య స్థానం అని అంటారు. 10వ స్థానాన్ని రాజ్య స్థానం లేదా కర్మ స్థానం అంటారు. ఈ నవమ మరియు దశమ స్థానాధిపతులు ఇద్దరి మధ్య సానుకూల సంబంధం ఉండి, 6,8,12 వంటి దుస్థానాలలో ఉండకపోతే, ఆ జాతకులకు ధర్మకర్మాధిపతి యోగం ఉన్నట్టు గుర్తించాలి.

మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, జాతకంలో అత్యున్నతమైన అదృష్టం (భాగ్యం) మరియు అత్యున్నతమైన అధికారం (ఉద్యోగం/కీర్తి) రెండు చేతులు కలిపితే ఏర్పడే అద్భుతమైన యోగం ఇది. ఈ యోగం ఉన్న జాతకుడు సమాజంలో అపారమైన గౌరవాన్ని, ఉన్నత పదవులను, సంపదను పొందుతాడు.

ఈ యోగం వలన జాతకుడికి ఏ విధమైన ప్రభావాలు ఏర్పడతాయి?

జన్మకుండలిలో ధర్మకర్మాధిపతి యోగం ఉన్న జాతకులు తాము చేసే ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపార వేత్తల జన్మకుండలిలో ఈ యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యోగం వలన ఈ జాతకులు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కూడా, గర్వం, పొగరు లేకుండా ఒదిగి ఉంటారు. అడ్డదారుల్లో కాకుండా, ధర్మబద్ధంగా సంపాదిస్తారు. సమాజానికి మంచి చేయాలనే తపన ఉంటుంది. ఈ యోగం ఉన్న జాతకులు ఏ పని చేసినా సరే, 9వ స్థానం వలన అదృష్టం తోడై, దశమ స్థానం వలన వారి యొక్క వృత్తి లేదా వ్యాపారం రాకెట్లాగా దూసుకుపోతుంది.

               నవమ స్థానం అనగా పితృ స్థానముగా కూడా చెప్పబడుతుంది. తండ్రి తరపున ఆస్తులు జాతకులకు కలసిరావడం గాని లేదా తండ్రి యొక్క ప్రోద్బలం, సహకారంతో అంచలంచెలు ఎదగడం గాని జరుగుతుంది.

ఈ జాతకులకు కూడా మొదట్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతో ధైర్యంతో తట్టుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు, 9, 10 వ స్థానాధిపతుల యొక్క మహాదశ, అంతర్దశల సమయంలో ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి.

  1. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నా విజయం ఎందుకు ఆలస్యమవుతుంది?

జాతకంలో ఇప్పుడు వివరించిన మంచి యోగాలు ఉన్నప్పటికీ, జాతకులు ఆశించిన ఫలితాలు వెంటనే లభించకపోవచ్చు. దీనికి ముఖ్యమైన కారణాల్లో  మాహాదశ, అంతర్దశల ప్రభావం కూడా ఒకటి.  సమయం వస్తే అన్నీ వాటంతటే అవే జరుగుతాయి అని పెద్దలు మనకు చెప్తుంటారు కదా. దాని అర్థం కూడా ఇదే. ఒక గ్రహం జాతకంలో మంచి ఫలితాలను ఇచ్చే స్థితిలో ఉన్నప్పటికీ, ఆ గ్రహానికి సంబంధించిన దశ లేదా అంతర్దశ సమయం రాకపోతే, ఆ జాతకునికి విజయం ఆలస్యం అవుతుంది.

  1. ఇప్పుడు జాతకంలో విజయం వరించే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏమి పరిశీలించాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయం, అభివృద్ధి, స్థిరత్వం వంటి అంశాలను పరిశీలించడానికి ఈ క్రింది విషయాలను సమగ్రంగా విశ్లేషించాలి.

  • లగ్నం మరియు లగ్నాధిపతి బలం.
  • ఆరవ భావం, దాని అధిపతి స్థితి.
  • నవమ భావం మరియు భాగ్యాధిపతి.
  • దశమ భావం, దశమాధిపతి స్థితి.
  • ఏకాదశ భావం మరియు లాభాధిపతి.
  • రవి, గురుడు, శని వంటి గ్రహాల యొక్క స్థితి, బలం.
  • రాజయోగాలు, ధనయోగాలు, ఇతర శుభయోగాలు.
  • ప్రస్తుత మహాదశ, అంతర్దశల ప్రభావం.

ఈ అంశాలన్నింటినీ కలిపి విశ్లేషించినప్పుడే ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, అభివృద్ధి అవకాశాలు, విజయం లభించే అనుకూల కాలాల గురించి సమగ్రంగా అర్థం చేసుకోవచ్చు.

  1. చివరగా నేను చెప్పాలనుకున్నది:

               జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయని, అనుకున్న విజయం రావడం లేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదుగుదల ఒకే సమయంలో, ఒకే విధంగా ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మకుండలిలోని గ్రహస్థితులు, యోగాలు, దశలు, అంతర్దశలు, వ్యక్తి జీవితంలోని అనుకూల, ప్రతికూల కాలాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.

మీ జన్మకుండలిలో ఏ గ్రహస్థితులు ఉన్నాయి? అవి మీ వృత్తి, ఆర్థిక స్థితి, అదృష్టం, జీవిత అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అనే విషయాలను అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని ద్వారా సమగ్రంగా పరిశీలించుకోవడం మంచిది.

ముఖ్య గమనిక: ఆలస్యంగా వచ్చే విజయం కూడా విజయమే. మీ జాతకంలోని గ్రహస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలోని అనుకూల సమయాలను గుర్తించవచ్చు. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి. 

 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి. 

Related Articles: 

 

 

 

 

ఎంత కష్టపడినా విజయం ఎందుకు రావడం లేదు? (పార్ట్-1)

ఎంత కష్టపడినా జీవితంలో విజయం ఎందుకు రావడం లేదు? మీ జాతకంలో ఈ గ్రహస్థితులు ఉన్నాయా?

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. మంచి ఉద్యోగం సంపాదించాలి, వ్యాపారంలో అభివృద్ధి సాధించాలి, ఆర్థికంగా స్థిరపడాలి, సమాజంలో గౌరవం పొందాలి అని ఎన్నో కలలు కంటుంటారు. వాటిని నిజం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతుంటారు. అయితే,  కొంతమందికి మాత్రం, ఎంత ప్రయత్నించినా అనుకున్న ఫలితం దక్కదు. వారి కష్టానికి తగ్గ గుర్తింపు కూడా దక్కదు. కావాలనుకున్న అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. ఉద్యోగంలో ఎదుగుదల వస్తుందనుకొని ఎంతో ఆశగా ఉన్నప్పటికి, అర్హత ఉన్నప్పటికి ఉన్నతస్థాయికి చేరుకోలేరు. లాభాలను ఆశించి, ఎన్నో ప్రణాళికలు వేసి, ఎంతో తెలివిగా వ్యాపారం మొదలు పెడితే, అందులో లాభాల కంటే ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తాయి.  ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. ఎంత కష్టపడినా నాకు విజయం ఎందుకు రావడం లేదు? నా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా?

               జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, వృత్తి, ఆర్థిక స్థితి, అదృష్టం వంటి అంశాలను పరిశీలించడానికి జన్మకుండలిలోని కొన్ని ముఖ్యమైన భావాలను, వాటి అధిపతులను, గ్రహస్థితులను పరిశీలించాలి. ముఖ్యంగా లగ్నం, షష్ఠ భావం, భాగ్యస్థానం, కర్మస్థానం, లాభస్థానాలు, శని, రాహు, కేతు గ్రహాలు, వాటి గ్రహ దశలు, అంతర్దశలు అన్నీ కూడా కీలకపాత్రను పోషిస్తాయి. అలా అని, కేవలం ఒక్క గ్రహం లేదా ఒక్క గ్రహస్థితి మాత్రమే ఒక వ్యక్తి విజయాన్ని నిర్ణయించదు. మొత్తం జాతకాన్ని పరిశీలించినప్పుడే సంపూర్ణ కారణం, ఫలితం తెలుస్తుంది. అందువలన వీటి గురించి ఇక్కడ మీకు క్లుప్తంగా వివరిస్తాను.

జీవితంలో విజయం ఆలస్యం కావడానికి కారణమయ్యే జాతకంలోని గ్రహస్థితులు

  1. లగ్నభావం బలహీనంగా ఉంటే జాతకుని యొక్క విజయానికి ఆటంకాలు కలుగుతాయా?

జన్మకుండలిలో లగ్నం అనగా తనుభావం ఆని కూడా అంటారు. అనగా జాతకుని యొక్క శారీరక స్థితి, ఆత్మ విశ్వాసం, జీవితాన్ని ఎదుర్కొనే విధానం, వ్యక్తిత్వం అన్నీ కూడా ఈ లగ్నభావం నిర్ణయిస్తుంది. మనం మన రోజు వారి జీవితంలో, ఎంతో ప్రతిభ ఉన్న వారిని చూస్తూనే ఉంటాము. అందులో కొందరు అంచలంచెలు ఎదుగుతారు. కానీ మరికొందరు మాత్రం, ప్రతిభ ఉన్నప్పటికి, వారికి గుర్తింపు ఉండదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికి, ధైర్యం, ఆత్మ విశ్వాసం కూడా ముఖ్యమైన కారణాలు. లగ్నభావం బలహీనంగా ఉన్నవారికి, ధైర్యం తక్కువగా ఉండటం, ఆత్మ విశ్వాసం లోపించడం వలన, వారిలో ఉన్న ప్రతిభకు కూడా గుర్తింపు లోపిస్తుంది. దీని వలన జాతకుడు తనలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వంద రకాలుగా ఆలోచించి గందరగోళంలో పడతారు. వీరికి ప్రతిభ ఉన్నా కూడా, ప్రయత్నంలో లోపం ఉంటుంది. ఇది జాతకుని యొక్క విజయానికి ఆటంకం కలుగజేస్తుంది. కానీ కేవలం లగ్న భావం మాత్రమే జాతకుని అపజయానికి కారణం కాదు. మిగిలిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలించాలి.

  1. షష్ఠ భావం బలహీనంగా ఉంటే పోటీ జీవితంలో ఇబ్బందులు వస్తాయా?

జన్మకుండలిలో ఆరవ భావమును శతృ, రోగ, ఋణ స్థానముగా చెప్పబడుతుంది. కానీ పోటీ రంగంలో ఉన్న వారి విజయం పరిశీలనకు షష్ట్య భావమును పరిశీలించాలి. శతృవులు, అప్పులు, రోగాలు, పోటీ రంగాలు, సేవలు ఈ అంశాలు అన్నీ కూడా జన్మకుండలిలోని ఆరవ భావం తెలియజేస్తుంది.

               కొందరు పోటీ పరీక్షలు వ్రాసి, అందులో విజయం సాధించి, దాని ద్వారా ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటారు. కానీ అందరికీ ఇది సాధ్యం కూడా కాదు. ఈ అంశాన్ని వ్యక్తిగత జన్మకుండలిలో ఆరవ భావం ద్వారా తెలుస్తుంది. ఆరవ భావం లేదా ఆ స్థానాధిపతి అనుకూలంగా లేకపోతే, ఆ జాతకులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, వ్రాసే పోటీ పరీక్షలు అన్నిటిలో కూడా ఆటంకాలు, అపజయాలు ఎదురవుతాయి. కానీ కేవలం ఈ ఆరవ భావం వల్ల మాత్రమే సంపూర్ణంగా అపజయమే కలుగుతుంది అని కూడా నిర్ధారించలేము. కొన్ని సార్లు ఆలస్యం అయినా కూడా విజయం సాధించవచ్చు. అది కేవలం జాతక పరిశీలన ద్వారా మాత్రమే జ్యోతిష్యులు చెప్పగలరు.  

  1. భాగ్యస్థానం బలహీనంగా ఉంటే అదృష్టం ఆలస్యంగా కలుగుతుందా?

జన్మకుండలిలో తొమ్మిదవ భావాన్ని భాగ్యస్థానంగా పిలుస్తారు. ఈ భావం జాతకుడి యొక్క అదృష్టం, ధర్మం, గురువులు, పెద్దల ఆశీస్సులు, ఉన్నత విద్య, పుణ్యఫలాలు వంటి విషయాలను తెలియజేస్తుంది. ఇతను చాలా అదృష్టవంతుడు అనే మాటను మనం వింటూనే ఉంటాము. ఈ అదృష్టం అనే మాటను మన జన్మకుండలిలో ఎంతవరకు ఉంది అనేది ఈ నవమ భావం మనకు తెలియజేస్తుంది.

               కొంతమంది ఎంత కష్టపడినా చివరి సమయంలో అవకాశాలు చేజారిపోతుంటాయి. మరికొందరికి ఇతరుల సహకారం లేదా సరైన మార్గదర్శకత్వం లభించక అవకాశాలు చేజారుతూ ఉంటాయి. ఇలాంటి అంశాలను పరిశీలించేటప్పుడు భాగ్యస్థానం, భాగ్యాధిపతి, గురుగ్రహ స్థితి, వాటిపై ఇతర గ్రహాల ప్రభావాలను జ్యోతిష్యులు పరిశీలించి ఫలితాన్ని చెబుతారు. ఈ నవమ స్థానాధిపతి బలహీనంగా ఉన్నా లేదా ప్రతికూల గ్రహాలతో సంగమించినా, జాతకుడికి అదృష్టం వరించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే భాగ్యస్థానం ఒక్కటే అదృష్టాన్ని నిర్ణయించదు. లగ్నం, కర్మస్థానం, లాభస్థానములను కూడా కలిపి చూడాలి.

 

ముఖ్య గమనిక: జన్మకుండలిలోని 1,6,9,10,11 స్థానాలను, శని, రాహు కేతు గ్రహ స్థితి, సంగమములను పరిశీలించిన తరువాతే జాతకుడికి విజయం ప్రాప్తిస్తుందా లేదా అన్న విషయం తెలుస్తుంది. విజయం వరించే అవకాశం ఉన్నప్పటికి, కొన్ని గ్రహాల వలన కలిగే ఆటంకములను ముందే తెలుసుకొని, ఆ గ్రహానికి తగిన పరిహారాలు చేసుకున్న యెడల ఆటంకములు తగ్గి, విజయం త్వరగా చేరువవుతుంది. ఇది కేవలం వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే చెప్పగలము. 

  1. దశమ భావం లేదా కర్మస్థానం బలహీనంగా ఉంటే వృత్తిలో ఎదుగుదల ఆలస్యమవుతుందా?

జ్యోతిష్య శాస్త్రంలో పదవ భావాన్ని దశమ స్థానం లేదా కర్మస్థానం అంటారు. ఈ భావం జాతకుడి యొక్క  వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, సామాజిక గౌరవం, బాధ్యతలు, అధికార స్థానం వంటి అంశాలను తెలియజేస్తుంది.

జాతకుడు వృత్తిపరంగా ఎంతవరకు ఎదగగలడు?  చేసే ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుందా? వ్యాపారంలో లాభాలు గడిస్తాడా? తన ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందా? అనే అంశాలను ఈ దశమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. దశమాధిపతి బలహీనంగా ఉన్నా, అష్టమ లేదా ద్వాదశ స్థానాల్లో ఉన్నా, ప్రతికూల గ్రహాలతో సంగమించినా వృత్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చును.

  1. లాభస్థానం బలహీనంగా ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుందా?

జన్మకుండలిలో పదకొండవ భావాన్ని లాభస్థానంగా చెబుతారు. జాతకుడి యొక్క ఆదాయం, లాభాలు, కోరికల నెరవేర్పు, గొప్ప పరిచయాలు, ఆశించిన ఫలితాలు వంటి అంశాలను అన్నీ ఈ భావం తెలియజేస్తుంది.

               కొంతమంది జాతకులకు మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ, ఎంతకాలం అయినా సరే ఉద్యోగం ప్రమోషన్ రాకపోవడం, ఆదాయం పెరగకపోవడం జరుగుతూ ఉంటుంది. మరికొందరు వ్యాపారంలో ఎంతో శ్రమించినా, ఎంతటి ప్రణాళికలు వేసినా సరే, ఆశించిన లాభాలను పొందలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో లాభస్థానం, లాభాధిపతి, రెండవ భావం, దశమ భావం మధ్య ఉన్న సంబంధాలను పరిశీలించి జ్యోతిష్యులు ఫలితాలను నిర్ణయిస్తారు.

               లాభాధిపతి బలహీనంగా ఉన్నా లేదా ప్రతికూల గ్రహాలతో సంగమించినా, జాతకులకు తమ ఆదాయం, లాభాల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

  1. శని గ్రహం వల్ల విజయం ఆలస్యమవుతుందా?

               జ్యోతిష్య శాస్త్రములో శని గ్రహాన్ని కర్మ కారకుడిగా, క్రమశిక్షణకు, శ్రమకు, బాధ్యతలకు, సహనానికి కారకుడిగా సూచిస్తారు. శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఏ పనిలోనైనా సరే ఫలితాలు ఆలస్యంగా లభించడం, చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేయాల్సి రావడం జరుగుతాయి. ముఖ్యంగా జాతకుడికి శని దశ, అంతర్దశలు జరిగే సమయాల్లో లేదా 2, 9, 10, 11 స్థానాధిపతుల అంతర్దశలలో ఈ ఆలస్యం జరుగుతుంది.

               శని కేవలం అశుభ ఫలితాలనే ఇస్తాడని అనుకోకూడదు. కర్మకారకుడైన శని వలన కలిగే ఆలస్యం ఏదైనా సరే, అది జాతకునికి చివరకి శుభంగానే ముగుస్తుంది. శని బలంగా, అనుకూలంగా ఉన్న జాతకులకు క్రమశిక్షణతో కూడిన కృషి, స్థిరమైన ఎదుగుదల, బాధ్యతాయుతమైన పదవి లేదా ఉద్యోగం జాతకునికి ప్రసాదిస్తాడు.

               కొంతమంది జాతకులు తమ చిన్న వయస్సులో ఎన్ని కష్టాలు ఎదురైనా, తరువాతి కాలంలో ఉన్నత స్థాయి, మంచి ఆర్థిక అభివృద్ధి సాధించే అవకాశాలను శని సంబంధిత దశలు, యోగాల ద్వారా జాతకుడు పొందుతాడు.

  1. రాహు, కేతువుల ప్రభావం వల్ల జీవితంలో స్థిరత్వం లేదా విజయం లోపిస్తుందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా చెప్పబడతారు. రాహు కేతు గ్రహాలు తమకు తాముగా ఏ ఫలితాలను ఇవ్వలేవు. వాటితో సంగమించిన గ్రహాల ద్వారా గాని లేదా ఆ స్థానాధిపతుల ద్వారా గాని ఫలితాలను జాతకుడికి ఇస్తాయి. అందుకని జన్మకుండలిలో ఏ భావంలో రాహు-కేతువులు ఉన్నారు? ఏ గ్రహాలతో సంగమించి ఉన్నారు? ఏ గ్రహాల దృష్టిని పొందుతున్నాయి? అనే అంశాలు, వాటి ఫలితాలను జ్యోతిష్యులు పరిశీలిస్తారు.

రాహువు జాతకుడిలో ఆశయాన్ని, ఆకాంక్షలను, అసాధారణ మార్గాలను, ఆకస్మిక మార్పులను సూచిస్తాడు.  కేతువు జాతకుడిలో వైరాగ్యం, విరక్తి, అంతర్ముఖత, ఆధ్యాత్మికత వంటి అంశాలను సూచిస్తాడు.

జన్మకుండలిలో 1, 9, 11 స్థానాధిపతులతో, రాహు కేతువులకు ఏ విధమైన దృష్టి లేదా సంబంధం ఉంది అనే పరిశీలనలో జాతకుని యొక్క వృత్తి, ఆశయాలు, నిర్ణయాలు, జీవిత దిశపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుస్తుంది.

జాతకుని జీవితంలో ఆలస్యంగా అయినా సరే, విజయం అందించే రాజయోగాలు గురించి ఇక్కడ క్లిక్ చేసి పార్ట్-2లో తెలుసుకోవచ్చును

 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి. 

Related Articles: 

కేతువు అనుకూలంగా ఉంటే జాతకుడికి ఇన్ని అద్భుత యోగాలను కలుగజేస్తాడా?

కేతువు అనుకూలంగా ఉంటే జాతకుడికి ఇన్ని అద్భుత యోగాలను కలుగజేస్తాడా?

జన్మకుండలిలో కేతువు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు: 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువును మోక్ష కారకుడుగా చెప్పబడింది. కేతువు ఒక ఛాయా గ్రహము అయినప్పటికి, కేతువు జాతకుడి పై చూపించే ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటుంది అని చెప్పాలి.  జాతకుడి యొక్క కర్మ భారమును, జాతకుడిలో ఉన్న ఆధ్యాత్మికతను, భక్తిని, వైరాగ్యమును, చావు వరకు వెళ్ళే అనుభవాలను వీటన్నిటికి కేతువు కారకుడు అవుతాడు. కేతువు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి ఒకటిన్నర సంవత్సరాల సమయం పడుతుంది. కేతువు ఎప్పుడూ వక్రగతిలోనే సంచరిస్తాడు. జాతకుడిలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానమును, మోక్షమును, వైరాగ్య లక్షణములను, అంతర్లీన జ్ఞానమును, పూర్వ జన్మ కర్మలను, ఏకాంత జీవితమును, జాతకుడిలో దాగి ఉన్న ప్రత్యేక నైపుణ్యములను, పరిశోధన జ్ఞానమును, జాతకుడి యొక్క వెన్నుముక, నాడీవ్యవస్థ, పొత్తికడుపు, పాదాలు, పీనియల్ గ్రంధి ఇవన్నీ కూడా కేతువు యొక్క ఆధీనంలో ఉంటాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉంటే కలిగే అద్భుత యోగాలు

జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటి?

  • జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉంటే, ఆ జాతకులకు ఊహాశక్తి అధికంగా ఉంటుంది. ఎన్ని వ్యాపారాలలో అదృష్టం వరిస్తుంది. ఎటు నుండి అయినా సరే డబ్బు సంపాదించుకునే సత్తా వీరిలో ఉంటుంది.
  • వీరి జీవనశైలి చాలా సరళంగా ఉంటుంది. ఎంతో జాలి గుణం కలిగి ఉంటారు. చరిత్రల మీద, వైజ్ఞానిక శాస్త్రాల మీద మంచి పట్టు సాధించగలరు.
  • ఎటు వైపు నుండి ఏ విధమైన అవకాశం వచ్చినా సరే, అన్నిటిని సద్వినియోగం చేసుకునే జ్ఞానం వీరికి ఉంటుంది.
  • కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు ఎంతో నిజాయితీగా ఉంటారు. అందరికీ ఒకే విధమైన న్యాయం అన్న సిద్ధాంతం వీరిది. కానీ వీరికి జరిగిన అన్యాయాన్ని మాత్రం పట్టించుకోరు.
  • కేతువు అనుకూలంగా ఉన్న జాతకులకు సహాయం చేసే గుణం, సామర్థ్యం, సహనం ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటుంది.
  • వీరి చుట్టూ ఎన్ని ఐహిక సుఖాలు ఉన్నప్పటికి, వీరి మనస్సులో ఉన్న ఆధ్యాతికత వలన ఎంతో సరళమైన జీవితాన్ని జీవిస్తారు.
  • జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు మంచి రచయితలు కాగలరు. వీరి వ్రాతలతో ఎంతో మందిలో అధ్యాత్మికతను, మార్పులను తీసుకురాగలరు.
  • వీరి యుక్త వయస్సులోనే మంత్ర సిద్ధి, యోగ సిద్ధి లభిస్తుంది. వీటిని కూడా ఈ జాతకులు ఇతరుల కొరకే ఉపయోగిస్తారు.
  • కేతువు అనుకూలంగా ఉన్న జాతకులకు తమ ముఖంలో కళ ఉట్టిపడుతుంది. అందరినీ ఇట్టే ఆకృశించే శక్తి వీరికి ఉంటుంది.
  • భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా చెప్పగలిగే సామర్థ్యం వీరిలో ఉంటుంది.
  • కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు మంచి ఉపాధ్యాయులుగా, మంచి రచయితలుగా, నిష్ణాతులైన జ్యోతిష్యులుగా రాణిస్తారు.
  • బ్లడ్ బ్యాంకులు, మ్యూజియంలు, పురావస్తుశాఖ కేంద్రాలు, అనాధ ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, యోగా కేంద్రాలు, దేవాలయాలు వంటివి కేతువు అనుకూలంగా ఉన్న జాతకులు ఎంతో సులభంగా స్థాపించి, నిర్వహించగలరు.
  • కేతువు అనుకూలంగా ఉన్న జాతకులకు కేతువే స్వయంగా జాతకులకు రాజా యోగమును కలుగజేస్తాడు.
  • వీరికి స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. కానీ వారు మంచివారై ఉంటారు. ఈ జాతకులు జీవిత పరమార్థం కోసం ప్రాకులాడి, చివరకు మోక్షం కోసమే తపిస్తారు.

జన్మకుండలిలో కేతువు ప్రతికూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటి?

  • జన్మకుండలిలో కేతువు ప్రతికూలంగా ఉంటే ఆ జాతకులు గంజాయి, ఇతర మత్తు పధార్థాలను అలవాటు చేసుకుంటారు.
  • కేతువు ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకులు ఇతరుల గురించి భ్రమించడం, అపర్థాలు చేసుకోవడం, భయపడటం వంటి పనికిరాని వాటి మీదే వీరి జీవితంలో చాలా భాగం గడచిపోతుంది.
  • వీరు ఎంతో నిజాయితీ పరులు అని తమకు తాము సొంత డబ్బాలు చెప్పుకుంటారు.
  • కేతువు ప్రతికూలంగా ఉన్నప్పటికి ఈ జాతకులకు ఎన్నో అంశాల మీద జ్ఞానం ఉంటుంది. కానీ వీరిలో పాతుకుపోయిన అనుమానాలు, భయాలు, వీరిలో ఉన్న సామర్థ్యాన్ని తోక్కేస్తాయి. వీరికి ఉన్న సామర్థ్యాలను కేవలం ఉద్యోగం కొరకే ఉపయోగించుకుంటారు.
  • కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులు చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కదు.
  • కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం వస్తే, దానికి ఈ జాతకులు ఇంటికి దూరమని, ఖర్చులు ఎక్కువ అవుతాయని, తిండికి కష్టం అవుతుందని ఇలాంటి చిన్న కారణాలు చెప్పి మానుకుంటారు.
  • వీరిలో వ్యక్తిగత శుభ్రత తక్కువగా ఉంటుంది. వీరు చెప్పేది నిజమే అయినా వీరి రూపం చూసి, ఎవరూ వీరి మాటను లెక్క చేయకుండా పోతారు.
  • కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులలో కొందరు దొంగ బాబాలుగా మారతారు.
  • కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ ఆలోచన విధానాన్ని తప్పు పడితే, ఎవరితోనైనా సరే గొడవలకు దిగుతారు.
  • చనిపోయిన వారు వీరిని వెంటాడుతున్నారని, కొన్ని రోజుల పాటు ప్రేతాత్మ కథలను చెప్పుకుంటూ వస్తారు.
  • కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులకు డబ్బు సంపాదించాలన్న కోరిక గాని, సామర్థ్యం గాని ఉండదు. అలా అని ఇతరులను మోసం కూడా చేయలేరు.
  • జాతకంలో కేతువు ప్రతికూలంగా ఉన్న జాతకులను భరించడానికి వీరి జీవిత భాగస్వామికి, పిల్లలకు సహనం చాలా ఉండాలి.

ముఖ్య గమనిక: 

జన్మకుండలిలో కేతువు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, కేతువు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) కేతువు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి. 

Related Articles: 

 

 

శాప యోగం అంటే ఏమిటి? శని రాహు సంగమం వల్ల కలిగే ఫలితాలు

శాపయోగం అంటే ఏమిటి? శని రాహు సంగమం వలన కలిగే ఫలితాలు ఏమిటి?

జన్మకుండలిలో శని, రాహు కలసి ఒకే రాశిలో సంగమిస్తే, ఆ జాతకులకు శాప యోగం ఉన్నట్టు గుర్తించాలి. జన్మకుండలిలో మిగిలిన గ్రహాల వలన ఎంతటి మంచి యోగాలు ఉన్నప్పటికి, శాప యోగం ఉంటే మాత్రం, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎందుకనగా గత జన్మ పాప కర్మల వలన ఈ శాప యోగం ఏర్పడుతుంది.

               శని, రాహు సంగమం వలన కలిగే శాప యోగం కారణంగా, జాతకుడు మానసిక స్థిమితం కోల్పోతాడు. కొంతమంది ఇంట్లో నుండి పారిపోవడం లేదా కారణం తెలియకుండా ఆత్మహత్య ధోరణి ఏర్పడి ఆతమహుతి చేసుకోవడం వంటి ఉపద్రవాలకు ఈ సంగమం కారణం అయ్యి ఉండవచ్చు. శనికి స్వస్థానాలైన మకర, కుంభ రాశులలో ఈ శని, రాహు సంగమం జరిగితే, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గత జన్మలో చేసుకున్న పాప కర్మల వల్ల మాత్రమే ఈ శాప యోగం జాతకులకు ప్రాప్తిస్తుంది. శని రాహు గ్రహాలు సంగమించిన జాతకులకు తమ వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో, ఒత్తిడి, టెన్షన్లు, ఆందోళనలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యల ప్రభావం అనేది జన్మకుండలిలో ఉన్న శని, రాహువుల బలాలను బట్టి ఆధారపడి ఉంటుంది.  

            గత జన్మలో స్త్రీలను మానభంగం చేసిన వారికి, కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టు విడగొట్టిన వారికి, అధికారం లేదా ఆస్తి కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను హతమార్చినవారికి, ఇతరులను వివాహం చేసుకునేందుకు జీవిత భాగస్వామిని హతమార్చిన వారికి, బలవంతంగా గర్భవిచ్ఛితులు జరిపించినవారికి, కడుపుతో ఉన్న స్త్రీని మానభంగం చేయడం లేదా హతమార్చడం చేసినవారికి, చంటి పిల్లలను హింసించినవారికి, పిల్లలను అపహరించి, హతమార్చినవారికి, తల్లిదండ్రులను హతమార్చి పిల్లలను అనాధాలుగా మార్చిన వారికి, ఈ జన్మలో జన్మకుండలిలో శాప యోగముతో జన్మిస్తారు.

శాప యోగం అనేది వంశ పారపర్యంగా వస్తుందా?

ఏ దుష్కృతానికైనా అయినా, ఏ శాపానికి అయినా ప్రాయశ్చిత్తం తప్పనిసరి. జన్మకుండలిలో శని రాహువులు సంగమించి శాప యోగం ప్రాప్తించిన జాతకులు ప్రాయశ్చిత్తములు చేసుకోకపోతే, వీరు గతించి మళ్ళీ వీరి వంశములో ఉన్న వారికే జన్మించి, ఈ శాపము యొక్క ఫలితములను అనుభవించడం కొనసాగిస్తారు. అదే కర్మ యోగం.

శాప యోగం వలన ఏర్పడే ప్రభావములు ఏమిటి?

జన్మకుండలిలో శాప యోగం ఉన్న జాతకులకు సంతాన విషయంలో, సంతానంతో ఉన్న సంబంధాల విషయంలో, సంతానం యొక్క వివాహం విషయంలో ఎన్నో అడ్డంకులు, సమస్యలు ఏర్పడతాయి. ఈ శాప యోగం వలన కొందరు తమ వృద్ధాప్య సమయంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. వీటి ప్రభావములలో కొన్నిటిని ఇక్కడ వివరిస్తాను.

  • శాప యోగం వలన వివాహం యోగం లేకపోవడం గాని లేదంటే ఇష్టం లేని ఆలస్య వివాహం జరగడం గాని జరుగుతుంది.
  • చిన్న వయస్సులోనే ఏమి తెలియక ప్రేమ వివాహం చేసుకొని ఇబ్బందుల పాలవ్వడం.
  • డబ్బు లేదా శృంగారం కోసం భర్త/భార్య చేతిలో మోసపోయి, విడాకులకు దారి తీయడం.
  • అతి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడం లేదా తల్లిదండ్రులు విడిపోవడం.
  • జీవితంలో చాలా కాలం భర్తను లేదా భార్యను కోల్పోయి బ్రతకడం.
  • ఒంటరి జీవితాన్ని భరించలేక తరచూ ఆవేదనకు లోనయ్యి, ఆత్మాహుతి ధోరణి ఏర్పడుతుంది. కానీ చనిపోయెందుకు ధైర్యం ఉండదు.
  • ఎవరో వీరితో మాట్లాడుతున్నట్టు భ్రమించడం, ఎవరో వీరిని చంపేస్తారు అని భయపడటం లాంటి భ్రమలు కలుగుతాయి.

శని రాహు సంగమం ఏ భావంలో కలిగితే ఏ విధమైన ఫలితాన్ని జాతకుడు ఎదుర్కొంటాడు?

  • లగ్నంలో శాప యోగం: జన్మకుండలిలో లగ్నంలో శని రాహు సంగమం జరిగితే, ఆ జాతకునికి ఎల్లప్పుడూ ప్రతికూల ఆలోచనలు కలుగుతూ, నిరంతరం ఆవేదనకు గురి అవుతూ ఉంటాడు. దీని వలన ఆరోగ్యం పై ప్రభావం పడి, రోగనిరోధక శక్తి లోపిస్తుంది. వైద్య సహాయం కావాల్సి వస్తుంది/
  • ద్వితీయంలో శాప యోగం: జన్మకుండలిలో 2వ భావంలో శని రాహు సంగమం జరిగితే, అది జాతకుని యొక్క మాట తీరు పై, కుటుంబ గొడవల పై, డబ్బు రాబడి పై, తోటి ఉద్యోగులతో ఉన్న సంబంధాల పై ప్రభావం పడుతుంది.
  • తృతీయంలో శాప యోగం: జన్మకుండలిలో 3వ భావంలో శని రాహు సంగమం జరిగితే, ఆ జాతకునికి జీవితంలో అభివృద్ధి తగ్గుతుంది. తోబుట్టువులతో ఆనందం ఉండదు.
  • చతుర్థంలో శాప యోగం: జన్మకుండలిలో 4వ భావంలో శని రాహు సంగమం జరిగితే, ఈ జాతకుడు ఏ ఇంట్లో ఉన్నా కూడా సంతోషం, స్థిరత్వం అనేది ఉండదు. దీని వలన స్థిరాస్తులు, వ్యక్తిగత అనుబంధాలు, వ్యక్తిగత సంపద మీద తీవ్ర ప్రభావం పడుతుంది. శని రాహువులు ఈ విషయాలలో జాతకునికి గందరగోళాన్ని సృష్టిస్తారు.
  • పంచమంలో శాప యోగం: జన్మకుండలిలో 5వ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకుడు తన విద్యను పూర్తి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి కన్నా వయస్సులో పెద్దవరైనా అన్నలు లేదా అక్కలతో విపరీతమైన గొడవలు జరుగుతాయి. సంతానం కలుగకపోవచ్చు లేదా కలిగిన సంతానానికి అనారోగ్యం కలుగవచ్చు.
  • షష్ట్య భావంలో శాప యోగం: జన్మకుండలిలో 6వ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకులు గుండె పోటు, రక్త సంబంధిత సమస్యలు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, విపరీత అప్పులు చేయడం, జూదం ఆడటం వంటి తీవ్ర అలవాట్లు ఏర్పడటం జరుగుతుంది.
  • సప్తమ భావంలో శాప యోగం: జన్మకుండలిలో 7వ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, ఆ జాతకులకు వృత్తిపరమైన భాగస్వాములతో, తోటి ఉద్యోగులతో శతృత్వాలు, విబేధాలు ఏర్పడతాయి. ఈ సంగమం వలన ఇంట్లో తమ జీవిత భాస్వామితో ఉన్న సంబంధం ఎలా ఉంటుంది అంటే, తాను నివశిస్తున్న ఇల్లే ఒక యుద్ధ రంగంలా తోస్తుంది. జీవిత భాగస్వామి యాక్సిడెంట్లో చనిపోవడం లేదా తనతో విడిపోయి వేరే వివాహం చేసుకోవడం జరుగుతుంది.
  • అష్టమంలో శాప యోగం: జన్మకుండలిలో అష్టమ స్థానంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకునికి తీవ్ర అనారోగ్యము, ఆత్మీయులతో విడిపోవడం, రహస్య సంబంధాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది.
  • నవమంలో శాప యోగం: జన్మకుండలిలో నవమ భావంలో శని రాహు సంగమం జరిగినపుడు, జాతకునికి అదృష్ట యోగం అనేది చాలా తక్కువే అని చెప్పాలి. తండ్రితో విబేధాలు రావడం లేదా తండ్రిని చిన్నతనంలోనే కోల్పోవడం జరుగుతుంది. కానీ తీవ్రమైన కష్టం చేసిన తరువాత వృత్తి పరంగా విజయం లభిస్తుంది.
  • దశమంలో శాప యోగం: జన్మకుండలిలో దశమ భావంలో శని రాహు సంగమం ఏర్పడటం వలన వృత్తి పరంగా, వ్యక్తిగత పరంగా చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ప్రభుత్వ పరమైన శిక్షలు, జరిమానాలు కలిగే అవకాశం ఉన్నది.
  • ఏకాదశ భావంలో శాప యోగం: జన్మకుండలిలో ఏకాదశ భావంలో శని రాహు సంగమం ఏర్పడటం వలన జూదం లేదా బెట్టింగుల ద్వారా లాభాలు గడిస్తారు. కానీ సంతానము మరియు అక్కా లేదా అన్నల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుంది.
  • ద్వాదశ భావంలో శాప యోగం: జన్మకుండలిలో ద్వాదశ భావంలో శని రాహు సంగమం ఏర్పడటం వలన అనైతిక లేదా వావి వరుసలు లేని సంబంధాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో చాలా సమస్యలు వస్తాయి. వ్యక్తిగత సంబంధాలలో ఆనందం అనేది లభించదు.

గమనిక: శని రాహు గ్రహాలు జన్మకుండలిలో వారు ఉన్న స్థానాలు అనుసరించి, శుభాశుభా ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అందువలన వ్యక్తిగత జనంకుండలి పరిశీలన ద్వారా మాత్రమే ఎవరికి ఏ విధమైన ఫలితములు వస్తాయి అనేది కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలన చేసి చెప్పగలరు.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి. 

Related Articles: 

సోమవతి అమావాస్య ప్రత్యంగిరా హోమం 2026

సోమవతి అమావాస్య ప్రత్యేకం: శ్రీ మహా ప్రత్యంగిరా దేవి హోమం – శతృబాధలు, నరదృష్టి, చేతబడి, గ్రహదోషాల నివారణకు విశేష ఆరాధన!

శ్రీ మాత్రే నమః | ఓం ప్రత్యంగిరాయై నమః

జీవితంలో కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు ముందుకు సాగకపోవడం, వ్యాపారంలో వరుస నష్టాలు, అనవసరమైన శతృత్వాలు, కోర్టు వివాదాలు, కుటుంబంలో అశాంతి, మానసిక భయాలు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొనే ఎవ్వరైనా సరే, దైవారాధన, మంత్రజపం, హోమాది క్రతువులను ఆశ్రయించడం ద్వారా మానసిక ధైర్యం, ఆధ్యాత్మిక బలం, దైవానుగ్రహం పొందవచ్చు.

అటువంటి విశేషమైన హోమములలో శాక్తేయ సాంప్రదాయంలో శ్రీ మహా ప్రత్యంగిరా దేవి హోమం ఒకటి.

ఈ పవిత్రమైన హోమాన్ని రాబోయే నవంబర్ 9, 2026 సోమవారం – సోమవతి అమావాస్య సందర్భంగా కేరళలోని పాలక్కాడ్ బ్రహ్మ తంత్ర పీఠంలో నిష్ణాతులైన కేరళ తాంత్రిక పండితుల పర్యవేక్షణలో నిర్వహించనున్నాము. ఈ హోమంలో మీ పేరు, గోత్రనామాలతో సంకల్పం చేయించుకుని అమ్మవారి విశేష అనుగ్రహాన్ని కోరుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నాము.

శ్రీ ప్రత్యంగిరా దేవి ఎవరు?

శ్రీ ప్రత్యంగిరా దేవి ఆదిపరాశక్తి యొక్క అత్యంత ఉగ్రశక్తి స్వరూపంగా ఆరాధించబడతారు. సింహముఖంతో దర్శనమిచ్చే అమ్మవారిని నరసింహికా స్వరూపిణిగా కూడా పూజిస్తారు. దుష్టశక్తులను అణచివేసే శక్తిగా, ధర్మాన్ని రక్షించే దేవతగా, శతృపీడలను తొలగించే దేవిగా భక్తులకు అభయాన్ని ప్రసాదించే అమ్మవారిగా ప్రత్యంగిరా దేవికి విశిష్ట స్థానం ఉంది. తాంత్రిక ఆరాధనా సంప్రదాయాల్లో ప్రత్యంగిరా దేవి ఉపాసనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శత్రుబాధలు, నరదృష్టి, చేతబడి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కోరుతూ భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు.

సోమవతి అమావాస్య రోజున ప్రత్యంగిరా హోమం ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు?

అమావాస్య తిథి ఆధ్యాత్మిక సాధనలు, పితృకార్యాలు, శత్రుపీడను నివారించు ప్రత్యేక దేవతారాధనలకు ప్రాధాన్యత కలిగిన రోజుగా పరిగణించబడుతుంది. అమావాస్య సోమవారం నాడు రావడాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజున శివారాధన, జపం, దానం, పితృకార్యాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన సందర్భంలో ప్రత్యంగిరా దేవిని ఆరాధిస్తూ నిర్వహించే మహా హోమం ద్వారా భక్తులు తమ కుటుంబానికి శతృవుల నుండి రక్షణ, శ్రేయస్సు, మనశ్శాంతి, కార్యసిద్ధి కలగాలని సంకల్పించుకోవచ్చు.

శ్రీ మహా ప్రత్యంగిరా దేవి హోమం ప్రత్యేకతలు

ఈ హోమం సాధారణ పూజా విధానానికి భిన్నంగా, కేరళ తాంత్రిక సంప్రదాయానికి అనుగుణంగా ప్రత్యేక పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఈ హోమములో ఎండు మిరపకాయలు, నల్ల మిరియాలు వంటి ప్రత్యేక హోమ ద్రవ్యాలను సమర్పించడం జరుగుతుంది. ప్రత్యంగిరా దేవి యొక్క మూలమంత్రమును 1008 జపాలు చేస్తారు. నవంబర్ 9వ తేదీన జరిగే ఈ హోమము నిష్ణాతులైన కేరళ తాంత్రిక పండితుల ద్వారా జరుగుతుంది.  అందువలన ఈ మహా ప్రత్యాంగిరా హోమములో భక్తులు తమ గోత్ర నామములు, కుటుంబ సభ్యుల పేర్లతో ప్రత్యేక సంకల్పం చేయడం జరుగుతుంది.  ఈ హోమంలో పాల్గొనే భక్తులు తమకు, తమ కుటుంబానికి శ్రీ మహా ప్రత్యాంగిరా దేవి యొక్క రక్షణ, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి కలగాలని సంకల్పించవచ్చు. ఏదైనా ప్రత్యేక సంకల్పం ఉన్నా కూడా తెలియజేయవచ్చును.

శ్రీ మహా ప్రత్యాంగిరా దేవి హోమములో ఎవరెవరు సంకల్పం చేసుకోవచ్చు?

  • శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు.
  • వ్యాపారంలో వరుస నష్టాలు, ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు.
  • కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలతో సతమతమవుతున్నవారు.
  • నరదృష్టి, చేతబడి వంటి ప్రతికూల ప్రభావాలపై ఆందోళన కలిగినవారు.
  • కుటుంబంలో తరచూ అశాంతి, కలహాలు ఎదుర్కొంటున్నవారు.
  • రాహు-కేతు, కాలసర్ప, శని సంబంధిత జ్యోతిష్య దోషాలకు పరిహార ఆరాధన కోరుకునేవారు.
  • దీర్ఘకాలిక భయాలు, మానసిక ఆందోళనల నుంచి ధైర్యం, ప్రశాంతత కోరుకునేవారు.
  • జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలగాలని కోరుకునేవారు.

ప్రసాద వివరాలు:

కేరళ రాష్ట్రంలోని, పాలక్కాడ్ పట్టణం, వావిల్యాపురం గ్రామమునందు గల బ్రహ్మ తంత్ర పీఠము నందు శ్రీ మహా ప్రత్యాంగిరా దేవి యొక్క విశేష పూజా హోమములు నిర్వహించిన తరువాత, ఈ హోమము కొరకు సంకల్పము చేసుకున్న వారి చిరునామాకి ప్రసాదం కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. హోమ కార్యక్రమములో ఉంచిన రక్షా నిమ్మకాయ, అమ్మవారి కుంకుమ, హోమ భస్మమును ప్రసాదముగా భక్తులకు పంపడం జరుగుతుంది.

హోమములో పాల్గొను విధానం:

క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ద్వారా మీ పేరు, గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు, సంకల్ప కోరిక, చిరునామా వివరాలను అందజేయాలి. ఆ తరువాత హోమ సంకల్పమునకు గానూ 1499/- సంభావన ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

    శ్రీ మహా ప్రత్యాంగిర హోమం- సంకల్ప నమోదు Registration








    దయచేసి హోమంలో పాల్గొనే మొత్తం వ్యక్తుల సంఖ్యను నమోదు చేయండి. కుటుంబ సభ్యులు 6 మందికి మాత్రమే

    Participant 1 – యజమాని వివరాలు



    Participant 2



    Participant 3



    Participant 4



    Participant 5



    Participant 6



    Participant 7



    Participant 8



    Participant 9



    Participant 10




    Related Articles: